Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 2

Wealth secrets: How to make money, save money and get rich? ​💰​


TELUGU

Question

  • Answers 84
  • Created
  • Last Reply

Top Posters For This Question

  • Sanjiv

    47

  • TELUGU

    32

  • Vijay

    5

  • ADMINISTRATOR

    1

Recommended Posts

  • 0

Rs. 5,000 pension per month if you have Ration Card: మీకు రేషన్ కార్డు ఉందా.? ఇలా చేస్తే.. ప్రతీ నెలా రూ. 5 వేలు మీ సొంతం.!

మీకు రేషన్ కార్డు ఉందా.? అయితే మీకు ప్రతీ నెలా రూ. 5 వేలు పొందొచ్చు. ఎలాగో తెలుసా.! ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకం.. దీని వల్ల అందరూ లబ్ది పొందొచ్చు. వీరికి 60 సంవత్సరాల తర్వాత ప్రతీ నెలా రూ. వెయ్యి నుంచి రూ. 5 వేల వరకు పెన్షన్ పొందొచ్చు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. 

ration-card-holders.jpg?w=1280

మీకు రేషన్ కార్డు ఉందా.? అయితే మీకు ప్రతీ నెలా రూ. 5 వేలు పొందొచ్చు. ఎలాగో తెలుసా.! అటల్ పెన్షన్ యోజన.. 2015-16 ఆర్ధిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన ఈ పధకానికి అందరూ అర్హులే. ఆ సమయంలో అసంఘటిత కార్మికులను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ ఈ పధకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పధకంలో పెట్టుబడి పెట్టినవారికి 60 సంవత్సరాల దాటిన తర్వాత వెయ్యి నుంచి రూ. 5 వేల వరకు పెన్షన్ లభిస్తుంది. ఏ భారతీయ పౌరుడైనా ఈ పధకం ప్రయోజనాలు పొందొచ్చు.

దీనికి మీరు నామమాత్రపు ప్రీమియం చెల్లిస్తే చాలు. ఇందులో దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు కాగా.. గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. ఇక ఈ అటల్ పెన్షన్ యోజనలో చేరాలంటే.. మీకు జన్‌ధన్ యోజన కింద బ్యాంకులో లేదా పోస్టాఫీస్‌లో ఖాతా ఉండాలి. 60 ఏళ్ల తర్వాత పెన్షన్ లభించాలంటే.. ఈ పధకం లబ్దిదారులకు ప్రతి నెలా కచ్చితంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు ఓ వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో అటల్ పెన్షన్ యోజన పధకంలో చేరితే.. పదవీ విరమణ సమయానికి నెల నెలా రూ. 5 వేలు పొందటానికి.. ప్రతీ నెలా రూ. 210 ప్రీమియం చెల్లించాలి. అలాగే నెలకు రూ. 1000 పెన్షన్ పొందటానికి మీరు నెలకు రూ. 42 పెట్టుబడి పెడితే చాలు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ పధకం ప్రయోజనాలు పొందవచ్చు. భార్యాభర్తలిద్దరూ అటల్ పెన్షన్ యోజన పధకంలో చేరితే.. 60 ఏళ్ల తర్వాత ప్రతీ నెలా రూ. 10 వేలు పించన్ పొందొచ్చు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Easy way to pay off your Credit Card Bill: మీ క్రెడిట్‌ కార్డు బకాయి తీర్చలేకపోతున్నారా? నో టెన్షన్‌.. ఇలా చేయండి

ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డులు వాడేవారు చాలా మందే ఉన్నారు. బ్యాంకులు కూడా సులభంగా క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. ఒకప్పుడు కార్డు జారీ చేయాలంటే ఎంతో ప్రాసెస్‌ ఉండేది. పూర్తిగా ఎంక్వేరీ చేసిన తర్వాతే కార్డు జారీ చేసేవి బ్యాంకులు. అందుకు సమయం కూడా పట్టేది. కానీ ఇప్పుడు డిజిటల్‌ యుగంలో క్రెడిట్‌ కార్డులను సులభంగా జారీ చేస్తున్నాయి. కేవలం ఫోన్‌ల ద్వారానే వివరాలు పూర్తి..

creditcard.gif?w=1280

ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డులు వాడేవారు చాలా మందే ఉన్నారు. బ్యాంకులు కూడా సులభంగా క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. ఒకప్పుడు కార్డు జారీ చేయాలంటే ఎంతో ప్రాసెస్‌ ఉండేది. పూర్తిగా ఎంక్వేరీ చేసిన తర్వాతే కార్డు జారీ చేసేవి బ్యాంకులు. అందుకు సమయం కూడా పట్టేది. కానీ ఇప్పుడు డిజిటల్‌ యుగంలో క్రెడిట్‌ కార్డులను సులభంగా జారీ చేస్తున్నాయి. కేవలం ఫోన్‌ల ద్వారానే వివరాలు పూర్తి చేసి కార్డులను అందిస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డు వాడకంలో అవగాహన ఉండటం తప్పనిసరి లేకుంటే అప్పుడు ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అయితే చాలా మంది క్రెడిట్ కార్డు బిల్లును సమయానికి చెల్లించరు. గడువులోగా చెల్లించకుంటే భారీగా పెనాల్టీ పడుతుంది. మరి బాకీ ఉన్న బిల్లును చెల్లించకుంటే ఏవమతుంది? అలాంటి సమయంలో ఏం చేయాలో తెలుసుకుందాం.

మీ కార్డును ఉన్న బకాయినీ నెలవారీ పద్దతుల్లో అంటే ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు. మీ బిల్లును ఈఎంఐలోకి మార్చుకోవచ్చు. దీని వల్ల మీ క్రెడిట్‌ కార్డు బకాయిని చెల్లించడంలో సులభం అవుతుంది. లేదా ఆ బకాయిని వేరే కార్డుకు బదిలీ చేసుకుని వ్యక్తిగత రుణంగా చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది.

తక్కువ వడ్డీ రేట్లు: వ్యక్తిగత రుణాలతో క్రెడిట్‌ కార్డులను పోల్చినట్లయితే వడ్డీ తక్కువగానే ఉంటుంది. అందుకే కాలక్రమేణా వడ్డీపై డబ్బు ఆదా అవుతుంది. అంతేకాకుండా బాకీని వేగంగా తీర్చేందుకు సులభమవుతుంది. మీ క్రెడిట్‌ కార్డు బిల్లు మొత్తం తీర్చడంలో ఇబ్బంది ఉంటే మీరు బ్యాంకు నుంచి లేదా ఇతర సంస్థల నుంచి వ్యక్తగత రుణం తీసుకుని క్రెడిట్‌ కార్డు బకాయిని తీర్చుకోవచ్చు.

క్రెడిట్‌ స్కోరు: బిల్లును తీర్చకుండా విఫమైలే క్రెడిట్‌ స్కోరు పడిపోతుంది. క్రెడిట్‌ వినియోగ నిష్పత్తీ పెరుగుతుంది. దీనికి బదులుగా రుణంతో ఒకేసారి బాకీ తీరిస్తే, క్రెడిట్‌ స్కోరు మెరుగయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

ఫీజుల బాధ: గడువు సమయంలోగా క్రెడిట్‌ కార్డు బల్లు చెల్లించకుంటే భారీ పెనాల్టీ ఛార్జీలు పడతాయి.రుణం తీసుకొని, చెల్లిస్తే.. వీటి బాధ ఉండదు. రుణం తీసుకునే ముందు కూడా కొన్ని విషయాలను పరిశీలించుకోవాలి. మీ క్రెడిట్‌ కార్డు బిల్లును తీర్చేందుకు వ్యక్తిగత రుణం తీసుకునేందుకు మీకు అర్హత ఉందా అనేది ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ముందుగా మీ బ్యాంకును సంప్రదించాలి. క్రెడిట్‌ స్కోరు, ఆదాయం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని బ్యాంకులు మీరు రుణాన్ని అందిస్తాయి.

కొన్ని బ్యాంకులు 12 నుంచి 84 నెలల వరకూ వ్యవధితో రుణాలను ఇస్తున్నాయి. రుణాన్ని సులభంగా చెల్లించే విధంగా వాయిదాలను నిర్ణయించుకోండి. కానీ బ్యాంకు నుంచి రుణం తీసుకుని క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లిస్తే సరిపోదు.. మీరు తీసుకున్న లోన్‌ ఈఎంఐ సరిగ్గా చెల్లించడం చాలా ముఖ్యం. లేకుంటే తర్వాత మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Bal Jeevan: రోజుకు రూ. 18 ఆదా చేస్తే రూ. 3 లక్షలు పొందొచ్చు.. చిన్నారుల కోసం ప్రత్యేకంగా

ఇండియన్‌ పోస్టాఫీస్‌ అందిస్తోన్న ఈ పథకంలో రోజుకు రూ. 6 లేదా రూ. 18 చొప్పున పొదుపు చేసుకోవచ్చు. రోజుకు రూ. 6 చొప్పున పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మెచ్యూరిటీ సమయానికి రూ. లక్ష రాబడి పొందొచ్చు, అదే మీరు రోజు రూ. 18 చొప్పున పొదుపు చేస్తే రూ. 3 లక్షలను పొందొచ్చు. ఈ పథకం కేవలం చిన్నారుల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చారు...

bal-jeevan-bima-yojana.jpg?w=1280

ప్రస్తుతం సంపాదనతో పాటు పొదుపై కూడా ఆసక్తి పెరిగింది. సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. భవిష్యత్తులో పెరిగే ఖర్చులు, అవసరాల దృష్ట్యా సేవింగ్స్‌ అనివార్యమనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ నమ్ముతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఎన్నో రకాల సేవింగ్స్‌ స్కీమ్స్‌ను ప్రవేశపెడుతుండడంతో చాలా మంది వీటికి ఆకర్షితులవుతున్నారు. అయితే దాదాపు అన్ని రకాల సేవింగ్స్‌ స్కీమ్స్‌ పెద్దలకు సంబంధించినవే ఉంటాయి. కానీ ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ పథకానికి శ్రీకారం చుట్టింది. బాల్‌ జీన్‌ బీమా పథకంతో తీసుకొచ్చిన ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియన్‌ పోస్టాఫీస్‌ అందిస్తోన్న ఈ పథకంలో రోజుకు రూ. 6 లేదా రూ. 18 చొప్పున పొదుపు చేసుకోవచ్చు. రోజుకు రూ. 6 చొప్పున పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మెచ్యూరిటీ సమయానికి రూ. లక్ష రాబడి పొందొచ్చు, అదే మీరు రోజు రూ. 18 చొప్పున పొదుపు చేస్తే రూ. 3 లక్షలను పొందొచ్చు. ఈ పథకం కేవలం చిన్నారుల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఇందులో చేరాలంటే 5 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. వీరి పేరెంట్స్‌ ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఇక తల్లిదండ్రుల వయసు 45 ఏళ్లు మించకూడదు.

ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పథకంలో చేరే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీకు ఇద్దరు పిల్లలు ఉంటే రోజుకు రూ. 36 చొప్పున పొదుపు చేసుకుంటూ పోతే మెచ్యూరిటీ సమయానికి రూ. 6 లక్షల వరకు పొందొచ్చు. ఒకవేళ పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే.. ఆ టైమ్లో ఇకపై పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ గడువు ముగిశాక పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ మొత్తం చెల్లిస్తారు. పాలసీ ప్రీమియాన్ని పేరెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక పాలసీ నుంచి మధ్యలో వైదొగాలనుకుంటే ఐదేళ్ల తర్వాత సరెండర్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ పథకంలో పెట్టిన పెట్టుబడికి రూ. 1000 ప్రతి సంవత్సరం హామీ మొత్తం మీద రూ. 48 బోనస్ ఇస్తారు. ఈ పథకంలో చేరాలనుకునే వారు దగ్గరల్లోని పోస్టాఫీస్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Post Office Scheme: Kisan Vikas Patra (KVP) పెట్టుబడి సురక్షితం.. రాబడి అధికం.. రైతులకు అద్భుతమైన పథకం..

మనకు మార్కెట్లో అలాంటి చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే దానిని వెతికి పట్టుకోడానికి కొంచెం ఓపిక అవసరం. అటువంటి సురక్షిత పథకాలను పోస్టాఫీసు ప్రజలకు అందిస్తోంది. అలాంటి పథకాలలో కిసాన్ వికాస్ పత్ర ఒకటి. పెట్టుబడిదారులు ఈ పథకంలో పెట్టుబడి పెడితే సురక్షితమైన, హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. ఈ పథకం ప్రస్తుతం 7.5% చొప్పున వార్షిక వడ్డీని అందిస్తోంది.

post-office-scheme.jpg?w=1280

ప్రతి పెట్టుబడిదారుడు పెట్టుబడి పెట్టిన వెంటనే తన డబ్బును రెట్టింపు అయిపోవాలని కోరుకుంటాడు. అందుకు అతను సాధ్యమైనంత ఉత్తమమైన పథకాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈ ప్రక్రియలో అతను డబ్బును కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. గ్యారెంటీతో డబ్బును రెట్టింపు చేయడమే కాకుండా, భద్రతకు హామీ ఇచ్చే పథకాలను ఎన్నుకోవడం ముఖ్యం. మనకు మార్కెట్లో అలాంటి చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే దానిని వెతికి పట్టుకోడానికి కొంచెం ఓపిక అవసరం. అటువంటి సురక్షిత పథకాలను పోస్టాఫీసు ప్రజలకు అందిస్తోంది. అలాంటి పథకాలలో కిసాన్ వికాస్ పత్ర ఒకటి. పెట్టుబడిదారులు ఈ పథకంలో పెట్టుబడి పెడితే సురక్షితమైన, హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. ఈ పథకం ప్రస్తుతం 7.5% చొప్పున వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) అంటే ఏమిటి?

భారత ప్రభుత్వం నిర్వహించే పథకాలలో కిసాన్ వికాస్ పత్ర ఒకటి. ఇది రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకం. ఈ పథకంలో, మీరు మీ డబ్బును నిర్ణీత వ్యవధిలో రెట్టింపు చేసుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్ర యోజన దేశంలోని అన్ని పోస్టాఫీసులు, పెద్ద బ్యాంకులలో అందుబాటులో ఉంది. డబ్బును దీర్ఘకాలిక ప్రాతిపదికన ఆదా చేసుకోవచ్చు. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1000కాగా గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు.

ఎంత సమయంలో డబ్బు రెట్టింపు అవుతుందంటే..

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు సంవత్సరానికి 7.5 శాతం రాబడిని పొందుతారు. గత సంవత్సరం ఏప్రిల్ 2023లో, దాని వడ్డీ రేట్లు 7.2 శాతం నుంచి 7.5%కి పెంచారు. జనవరి 2023 నుంచి మార్చి 2023 వరకు, ఈ పథకంలో డబ్బు రెట్టింపు కావడానికి 120 నెలలు పట్టింది. కానీ దీని తర్వాత, మీ డబ్బు దాని కంటే ఐదు నెలల ముందుగా అంటే 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది.

రూ.5 లక్షల పెట్టుబడి.. రూ.10 లక్షలు కావాలంటే..

ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం, మీరు ఈ రోజు ఈ పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, మీరు రాబోయే 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో 10 లక్షల రూపాయలను తిరిగి పొందుతారు. అంటే, మీరు వడ్డీ నుంచి నేరుగా 5 లక్షల రూపాయలు సంపాదిస్తారు. మీరు పథకంలో ఏకమొత్తంలో 4 లక్షలు పెట్టుబడి పెడితే, మీరు 115 నెలల్లో 8 లక్షలు తిరిగి పొందుతారు. మంచి విషయమేమిటంటే, మీరు ఈ పథకంలో చక్రవడ్డీ ప్రయోజనం కూడా పొందుతారు. అంటే, మీరు వడ్డీపై కూడా వడ్డీని పొందుతారు.

ఖాతా ఇలా తెరవాలి..

మీరు కేవలం 1000 రూపాయలతో కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ప్రతి నెలా 100 రూపాయల గుణిజాలలో పెట్టుబడి పెట్టవచ్చు. పథకం కింద ఎన్ని ఖాతాలనైనా తెరవవచ్చు. 3 పెద్దలు కలిసి ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. ఇందులో నామినీ సౌకర్యం కూడా ఉంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు వారి పేరు మీద కేవీపీ ఖాతాను తెరవవచ్చు. గార్డియన్లు మైనర్ లేదా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి తరపున ఖాతాను తెరిసే అవకాశం ఉంది. డిపాజిట్ చేసిన తేదీ నుంచి 2 సంవత్సరాల 6 నెలల తర్వాత మీరు ఖాతాను మూసివేయవచ్చు. ఖాతాదారు మరణించినప్పుడు లేదా జాయింట్ ఖాతాలో ఎవరైనా లేదా అందరు ఖాతాదారులు మరణించినప్పుడు మూసి వేయవచ్చు.ఈ ఖాతాను తాకట్టు పెట్టవచ్చు లేదా సెక్యూరిటీగా కూడా బదిలీ చేయవచ్చు. ఈ పథకంలో వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఐటీఆర్ సమయంలో అదర్ సోర్సెస్ నుంచి వచ్చిన ఆదాయంగా దీనిని పేర్కొనాలి.

More info at https://cleartax.in/s/kisan-vikas-patra

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
  • Administrators

Adani Credit Card: అదిరే బెనిఫిట్లతో అదానీ క్రెడిట్ కార్డు.. కొత్తగా ఏమున్నాయంటే..

అదానీ గ్రూప్ కు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫాంను అదానీ వన్ అంటారు. ఇది ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను పరిచయం చేసింది. దీని ద్వారా ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ లింక్డ్ ప్రయోజనాలు అందజేస్తుంది. ఇందుకోసం వీసాతో కలిసి ఈ రెండు సంస్థలూ పనిచేశాయి. క్రెడిట్ కార్డ్ రెండు రకాలుగా అందుబాటులో ఉంది.

adani-credit-card.jpg?w=1280

ప్రస్తుతం క్రెడిట్ కార్డు అనేది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా వీటిని వినియోగిస్తున్నారు. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఖాతాదారులకు వీటిని అందజేస్తున్నాయి. దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకులు ఈ సేవలను అందజేస్తున్నాయి. ఇప్పుడు అదానీ గ్రూప్ కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రయోజనాలు..

అదానీ గ్రూప్ తీసుకువచ్చిన క్రెడిట్ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కార్డు హోల్డర్ల జీవనశైలిని మెరుగుపర్చడంతో పాటు వారి ప్రయాణ అనుభవాన్ని మరింత పెంచడం దీని ఉద్దేశం. కార్డు ప్రత్యేకతలు, ఖాతాదారులకు కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

కొత్త కార్డుల పరిచయం..

అదానీ గ్రూప్ కు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫాంను అదానీ వన్ అంటారు. ఇది ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను పరిచయం చేసింది. దీని ద్వారా ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ లింక్డ్ ప్రయోజనాలు అందజేస్తుంది. ఇందుకోసం వీసాతో కలిసి ఈ రెండు సంస్థలూ పనిచేశాయి. క్రెడిట్ కార్డ్ రెండు రకాలుగా అందుబాటులో ఉంది. అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు, అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డులుగా వీటిని పిలుస్తారు. ఈ రెండూ అనేక రివార్డులు, ప్రయోజనాలను అందజేస్తాయి.

కొనుగోళ్లపై తగ్గింపులు..

అదానీ వన్ తెలిపిన వివరాల ప్రకారం.. విమానాశ్రయం, ప్రయాణంలో అనేక ప్రయోజనాలను ఈ కార్డులు అందజేస్తాయి. విమానాలు, హోటళ్లు, రైళ్లు, బస్సులు, టాక్సీలను బుక్ చేసుకోవడానికి అనుమతించే అదానీ వన్ యాప్‌తో సహా అదానీ గ్రూప్ లోని కొనుగోళ్లపై ఏడు శాతం వరకు రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. అదానీ సంస్థ నిర్వహణలోని విమానాశ్రయాలు, సీఎన్ జీ పంపులు, విద్యుత్ బిల్లులు, ట్రైన్‌మ్యాన్, ఆన్‌లైన్ రైలు టిక్కెట్లపై బెనిఫిట్లు పొందవచ్చు.

మరిన్ని ప్రోత్సాహకాలు..

ఈ కార్డులతో ఇంకా అనేక ప్రోత్సాహకాలు అందజేస్తారు. ఉచిత విమాన టికెట్లు, వీఐపీ లాంజ్ యాక్సెస్, ప్రణామ్ మీట్ అండ్ గ్రీట్ సర్వీస్, పోర్టర్, వాలెట్, ప్రీమియం కార్ పార్కింగ్ తదితర స్వాగత బోనస్‌ కూడా అందుతాయి. డ్యూటీ ఫ్రీ స్టోర్‌లలో షాపింగ్ చేయడం, విమానాశ్రయాలలో ఆహారం, పానీయాల కొనుగోళ్లపై తగ్గింపులు, ఉచిత సినిమా టిక్కెట్లు, కిరాణా, యుటిలిటీలు, విదేశీ కొనుగోళ్లపై అదానీ రివార్డ్ పాయింట్లను కార్డుదారులు అందుకుంటారు.

ఫీజు వివరాలు..

అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు వార్షిక చార్జి రూ.5 వేలు. జాయినింగ్ బెనిఫిట్లు గా రూ.9 వేలు లభిస్తాయి. అలాగే అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ వార్షిక ధర రూ.750. దీనికి రూ.5 వేల జాయినింగ్ బెనిఫిట్లు అందుతాయి.

ప్రయోజనాలు..

  • అదానీ వన్, విమానాశ్రయాలు, గ్యాస్, విద్యుత్, ట్రైన్‌మ్యాన్‌తో సహా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో కొనుగోళ్లపై ఏడుశాతం వరకూ, ఇతర స్థానిక, విదేశీ ఖర్చులపై రెండు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
  • కార్డు దారులకు ఏడాదికి 16 సార్లు ప్రీమియం లాంజ్‌లతో సహా దేశీయ లాంజ్‌లకు యాక్సెస్ పొందుతారు.
  • ఏడాదికి రెండుసార్లు అంతర్జాతీయ లాంజ్ లను సందర్శించవచ్చు.
  • 8 వరకూ వ్యాలెట్, ప్రీమియం ఆటోమొబైల్ పార్కింగ్ స్థలాలను వినియోగించుకోవచ్చు.
  • విమానాలు, హోటళ్లు, వెకేషన్లకు సంబంధించి రూ.9 వేల వరకూ వెల్కమ్ బోనస్ లభిస్తుంది.
  • సినిమా టిక్కెట్లను ఒకటి కొంటే మరొకటి ఉచితంగా పొందవచ్చు. ఫ్యూయల్ సర్ చార్జిపై ఒకశాతం మినహాయింపు లభిస్తుంది.
  • అదానీవన్ రివార్డులు అల్ట్రా లాయల్టీ స్కీమ్ కు ప్రత్యేక యాక్సెస్ లభిస్తుంది.

...

Complete article

--
Administrator
Telugus.com

Telugus.com

Link to comment
Share on other sites

  • 0

Mutual Funds: ఏడాదిలో 34శాతం రాబడి.. ఈ మ్యూచువల్ ఫండ్‌లో అస్సలు రిస్క్ లేదు..

వీటిల్లో కాస్త రిస్క్ ఉన్నా.. దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. అలాంటి వాటిల్లో మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ ఒకటి. ఈక్విటీ, డెట్, బంగారం, వెండి వంటి వివిధ ఆస్తులలో పెట్టుబడి పెట్టడాన్నే మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్. దీనిలో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి ఓ మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ గతేడాదిలో ఏకంగా 34 శాతం రాబడిని అందించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

mutual-funds.jpg?w=1280

ప్రతి పెట్టుబడిదారుడి లక్ష్యం ఒకటే ఉంటుంది. తాను పెట్టే ప్రతి రూపాయి అధికశాతం ఆదాయం రావాలని కోరుకుంటారు. ఆ రకంగానే మంచి పథకాలలో పెట్టుబడులు పెడతారు. అది మ్యూచువల్ ఫండ్స్ అయినా.. ఫిక్స్ డ్ డిపాజిట్ అయినా లేదా షేర్ మార్కెట్ అయినా.. మార్గం ఏదైనా లక్ష్యం అధిక రాబడి. మీరు అలాంటి మంచి స్కీమ్ కోసం చూస్తున్నట్లు అయితే మ్యూచువల్ ఫండ్స్ లో మీకు మంచి ఆప్షన్లు ఉన్నాయి. వీటిల్లో కాస్త రిస్క్ ఉన్నా.. దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. అలాంటి వాటిల్లో మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ ఒకటి. ఈక్విటీ, డెట్, బంగారం, వెండి వంటి వివిధ ఆస్తులలో పెట్టుబడి పెట్టడాన్నే మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్. దీనిలో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి ఓ మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ గతేడాదిలో ఏకంగా 34 శాతం రాబడిని అందించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ICICI Prudential Multi Asset Mutual Fund: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్..

ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ అనేది పాతదైన, ప్రముఖమైన వాటిల్లో ఒకటి. ఇది ఇటీవలి సంవత్సరాలలో విశేషమైన రాబడిని అందించింది. మార్కెట్ హెచ్చుతగ్గులు, ఫండ్ మేనేజ్‌మెంట్‌లో నావిగేట్ చేయడంలో చాలా సంవత్సరాల అనుభవం ఉన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఐఓ ఎస్. నరేన్ అనే ఫండ్ మేనేజర్ నిర్వహణఓ నడుస్తోంది.

ఈ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ-అసెట్ ఫండ్ రెండు దశాబ్దాలుగా అత్యుత్తమ పనితీరు కనబరిచింది. ఈ ఫండ్ ప్రారంభ సమయంలో (అక్టోబర్ 31, 2002) ఎవరైనా రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అది ఏప్రిల్ 30, 2024 నాటికి రూ. 65.4 లక్షలకు పెరిగి ఉండేది. అంటే పెట్టుబడిదారులకు దాదాపు 21.5 శాతం వార్షిక రాబడి వచ్చేది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ-అసెట్ ఫండ్ దాని పెట్టుబడిదారులందరికీ గణనీయమైన రాబడిని ఇచ్చింది. రిటర్న్ శాతం గురించి మాట్లాడుతూ, ఫండ్ ఒక సంవత్సరంలో 34.20 శాతం రాబడిని అందించింది. మూడేళ్లలో ఫండ్ 23.25 శాతం రాబడిని అందించగా, ఐదేళ్లలో 20.79 శాతం రాబడిని ఇచ్చింది.

ఫండ్ పరిమాణం రూ. 41,159.52 కోట్లు, ఎన్ఏవీ (నికర ఆస్తి విలువ) ధర రూ. 735.63 (జూన్ 13, 2024 నాటికి). ఫండ్ ఈక్విటీలో 53.4 శాతం, డెట్‌లో 14 శాతం, నగదులో 19 శాతం పెట్టుబడిని కలిగి ఉంది. ఈక్విటీ కేటాయింపు విషయానికి వస్తే, ఫండ్ ప్రధానంగా పెద్ద క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెడుతుంది. ఫండ్ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలో పవర్, వ్యవసాయం, సంబంధిత ఇన్‌పుట్‌లు, రిటైల్, రవాణా, ఫార్మా, హెల్త్‌కేర్ వంటి రంగాలు ఉన్నాయి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Post Office: పోస్టాఫీసులో బెస్ట్‌ స్కీమ్స్‌.. అత్యధిక వడ్డీ అందించే పథకాలు

పోస్టాఫీసులో మంచి రాబడిని అందించే పథకాలు ఎన్నో ఉన్నాయి. వివిధ స్కీమ్‌లలో డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు అందుకోవచ్చు. ఒకేసారి పెట్టుబడి పెట్టడం, లేదా వాయిదాల ప్రకారం ఇన్వెస్ట్‌ చేయడం వంటి వాటిలో మంచి వడ్డీ రేట్లను అందుకోవచ్చు. ఇండియా పోస్ట్ ఆఫీస్ ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడిపై 6.9 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. అదే సమయంలో వారు 2 సంవత్సరాల పెట్టుబడికి..

post-office-scheme-2.jpg?w=1280

పోస్టాఫీసులో మంచి రాబడిని అందించే పథకాలు ఎన్నో ఉన్నాయి. వివిధ స్కీమ్‌లలో డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు అందుకోవచ్చు. ఒకేసారి పెట్టుబడి పెట్టడం, లేదా వాయిదాల ప్రకారం ఇన్వెస్ట్‌ చేయడం వంటి వాటిలో మంచి వడ్డీ రేట్లను అందుకోవచ్చు. ఇండియా పోస్ట్ ఆఫీస్ ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడిపై 6.9 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. అదే సమయంలో వారు 2 సంవత్సరాల పెట్టుబడికి 7 శాతం వడ్డీని, 3 సంవత్సరాల పెట్టుబడికి 7.1 శాతం వడ్డీ, 5 సంవత్సరాల పెట్టుబడికి 7.5 శాతం వడ్డీని అందిస్తారు.

మీరు ఈ పథకంలో రూ.1000 నుండి పెట్టుబడి పెట్టవచ్చు. తదుపరి పెట్టుబడి 100 గుణకాలలో ఉండాలి. ఈ పథకాలకు పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంటే, 5 సంవత్సరాల ప్రణాళికలో రూ.1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు.

ఈ విధంగా, మీరు ఈ పథకంలో 5 సంవత్సరాల పాటు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే, మీరు ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం మెచ్యూరిటీ సమయంలో రూ.14,49,948 ఆదాయం పొందుతారు. అంటే మీకు రూ.4,49,948 వడ్డీ లభిస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం 7.5 శాతం వడ్డీని అందిస్తుంది.

పెట్టుబడిపై వడ్డీ ఎంత?

అదేవిధంగా, మీరు ఈ పథకంలో 5 సంవత్సరాల పాటు రూ.1 లక్ష పెట్టుబడి పెడితే, మీకు రూ.1,44,995 రాబడి లభిస్తుంది. అలాగే రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.2,89,990, రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.4,34,984, రూ.4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 5,79,97, రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.7,24,974. అంటే వడ్డీగా రూ.లక్ష పెట్టుబడికి రూ.44,995. రూ.2 లక్షల పెట్టుబడికి రూ.89,990, రూ.3 లక్షల పెట్టుబడికి రూ.1,34,984 వడ్డీ లభిస్తుంది.

పోస్టల్ వడ్డీ రేట్లు

జూన్ 30, 2024 వరకు ఉన్న త్రైమాసికంలో, ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏప్రిల్ 1, 2024 నుండి ప్రారంభమై జూన్ 30, 2024తో ముగిసే వివిధ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చి 8, 2024 నాటి పత్రికా ప్రకటనలో ప్రకటించింది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్

పోస్టల్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై ప్రభుత్వం 8.2% వడ్డీని అందిస్తుంది. ఈ పథకంలో కనీస డిపాజిట్ రూ. 1000. ఇందులో గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ఖాతాల ద్వారా వచ్చే మొత్తం వడ్డీ రూ.50,000 దాటితే, వడ్డీపై పన్ను విధించబడుతుంది. అలాగే, నిర్ణీత రేటులో మొత్తం వడ్డీ నుండి టీడీఎస్‌ తీసివేయబడుతుంది. ఫారమ్ 15 G/15H సమర్పించబడితే, పెరిగిన వడ్డీ సూచించిన పరిమితిని మించకుండా ఉంటే టీడీఎస్‌ తీసివేయరు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Post Office Senior Citizen Saving Scheme earns Rs.20,500 per month: ఇతర పథకాలను తలదన్నే పోస్టాఫీసు స్కీమ్‌.. నెలకు రూ.20,500 ఆదాయం

మీ జీతంలాగా ప్రతి నెలా సేవింగ్స్ మీకు డబ్బు ఇస్తూనే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఇక్కడ మీకు ప్రతి నెలా రూ. 20,500 పొందే పోస్టాఫీసు పథకం గురించి తెలుసుకోండి. మీరు పూర్తి 5 సంవత్సరాలకు రూ. 20,500 నెలవారీ ఆదాయం పొందుతారు. నెలవారీ పొదుపుతో ఖర్చుల గురించి టెన్షన్ ఉండదు. ఈ పోస్టాఫీసు పథకం పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్..

post-office-scheme.jpg?w=1280

మీ జీతంలాగా ప్రతి నెలా సేవింగ్స్ మీకు డబ్బు ఇస్తూనే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఇక్కడ మీకు ప్రతి నెలా రూ. 20,500 పొందే పోస్టాఫీసు పథకం గురించి తెలుసుకోండి. మీరు పూర్తి 5 సంవత్సరాలకు రూ. 20,500 నెలవారీ ఆదాయం పొందుతారు. నెలవారీ పొదుపుతో ఖర్చుల గురించి టెన్షన్ ఉండదు. ఈ పోస్టాఫీసు పథకం పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ పోస్టాఫీసు పథకం సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని అందిస్తుంది. ఇక్కడ పోస్టాఫీసు నెలవారీ పథకం పూర్తి గణనను చెబుతున్నాము.

పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్

పోస్టాఫీసు ఈ పథకం 60 సంవత్సరాల వయస్సు గల ప్రజలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. తద్వారా సీనియర్ సిటిజన్లు పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని పొందవచ్చు. వీఆర్‌ఎస్ తీసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంపై ప్రభుత్వం ప్రస్తుతం 8.2 శాతం వడ్డీని ఇస్తోంది. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు కలిసి రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే, వారు ప్రతి త్రైమాసికంలో రూ.10,250 సంపాదించవచ్చు. 5 సంవత్సరాలలో మీరు వడ్డీ నుండి రూ. 2 లక్షల వరకు సంపాదిస్తారు. మీరు మీ రిటైర్మెంట్ డబ్బును అంటే గరిష్టంగా రూ. 30 లక్షలు ఇందులో పెట్టుబడి పెడితే, మీకు ప్రతి సంవత్సరం రూ. 2,46,000 వడ్డీ లభిస్తుంది. అంటే, మీరు నెలవారీ ప్రాతిపదికన రూ. 20,500, త్రైమాసిక ప్రాతిపదికన రూ. 61,500 పొందుతారు.

పోస్టాఫీసు పథకంపై పన్ను మినహాయింపు

మీరు పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఇందులో పెట్టుబడిదారులు గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ప్రతి నెలా వచ్చే డబ్బు లేదా వడ్డీ మీ పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 80C కింద మినహాయింపు పొందుతారు.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గణన

  • కలిసి డిపాజిట్ చేసిన డబ్బు: రూ. 30 లక్షలు
  • కాలం: 5 సంవత్సరాలు
  • వడ్డీ రేటు: 8.2%
  • మెచ్యూరిటీపై డబ్బు: రూ. 42,30,000
  • వడ్డీ ఆదాయం: రూ. 12,30,000
  • త్రైమాసిక ఆదాయం: రూ. 61,500
  • నెలవారీ ఆదాయం: రూ. 20,500
  • వార్షిక వడ్డీ – 2,46,000

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ప్రయోజనాలు:

ఈ పొదుపు పథకాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంటే, మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. గ్యారెంటీ ఆదాయం ఉంటుంది. ఇందులో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద, పెట్టుబడిదారులు ప్రతి సంవత్సరం రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందుతారు. ప్రతి సంవత్సరం 8.2% చొప్పున వడ్డీ లభిస్తుంది. ఇందులో 3 నెలలకోసారి వడ్డీ డబ్బులు అందుతాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి మొదటి రోజున వడ్డీ ఖాతాలో జమ చేయబడుతుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

9.75% interest rate on Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.75% వడ్డీ.. ఏ బ్యాంకు ఇస్తుందో తెలుసా..?

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (NESFB) తన కస్టమర్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు 546-1111 రోజుల మెచ్యూరిటీ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌కు వర్తిస్తాయి. అలాగే, సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల వరకు అధిక వడ్డీ రేటు లభిస్తుంది. దీనికి సంబంధించి బ్యాంక్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, “నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్..

fixed-deposit-2.jpg?w=1280

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (NESFB) తన కస్టమర్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు 546-1111 రోజుల మెచ్యూరిటీ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌కు వర్తిస్తాయి. అలాగే, సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల వరకు అధిక వడ్డీ రేటు లభిస్తుంది. దీనికి సంబంధించి బ్యాంక్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, “నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సవరించిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అందించబడతాయి. అలాగే, ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ప్రత్యేకించి సీనియర్ సిటిజన్‌లకు బాగా సహాయపడతాయి. ఎందుకంటే వారి పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని సంపాదించడానికి వారికి అవకాశం కల్పిస్తుందని బ్యాంకు పేర్కొంది.

సాధారణ కస్టమర్ వడ్డీ రేటు

  • 7-14 రోజులు 3.25%
  • 15-29 రోజులు 3.75%
  • 30-45 రోజులు 4.25%
  • 46-90 రోజులు 4.75%
  • 91-180 రోజులు 6.25%
  • 181-365 రోజులు 7.00%
  • 366-545 రోజులు 8.75%
  • 546-1111 రోజులు 9.00%
  • 1112-1825 రోజులు 8.00%
  • 1826-3650 రోజులు 6.25%

ఆర్‌టీ వడ్డీ రేట్లు

  • 3 నెలలు 4.00 %
  • 6 నెలలకు 4.50 %
  • 9 నెలలు 5.00 %
  • 1 సంవత్సరం 6.00 %
  • 2 సంవత్సరాలు 7.50 %
  • 3 సంవత్సరాలు 7.50 %
  • 4 సంవత్సరాలు 6.50 %
  • 5 సంవత్సరాలు 6.00 %
  • 5 సంవత్సరాలకు పైబడిన వారు 10 సంవత్సరాలలోపు 6.00 %

ఇతర చిన్న ఆర్థిక బ్యాంకులు

  • AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.00%
  • ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50%
  • ECUDAS స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50%
  • సూర్యాడే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.65%
  • జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25%

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (NESFB) తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ముఖ్యంగా ఈ పెంపు తర్వాత బ్యాంక్ సాధారణ ప్రజలకు 9.25%, సీనియర్ సిటిజన్లకు 9.75% అధిక రేట్లను అందిస్తోంది.

Link to comment
Share on other sites

  • 0

LIC Scheme with Rs.12,000 monthly pension: ఆ ఎల్ఐసీ పథకంలో పెట్టుబడితో నెలనెలా రూ.12 వేలు పెన్షన్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ సంపాదన నుంచి కొంత మొత్తాన్ని ఆదా చేస్తూ ఉంటారు. వారి డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా గొప్ప రాబడిని పొందే పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది భవిష్యత్‌ను ఆలోచించి రిటైర్మెంట్ ప్లాన్‌గా స్కీమ్‌లను ఎంచుకుంటారు. అందులో పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పొందే ప్లాన్స్‌ను ఎంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నెలనెలా నిర్ణీత ఆదాయం వస్తే ఎవరిపైనా ఆధారపడాల్సిన ఉండదని భావిస్తూ ఉంటారు.

lic-scheme.jpg?w=1280

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ సంపాదన నుంచి కొంత మొత్తాన్ని ఆదా చేస్తూ ఉంటారు. వారి డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా గొప్ప రాబడిని పొందే పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది భవిష్యత్‌ను ఆలోచించి రిటైర్మెంట్ ప్లాన్‌గా స్కీమ్‌లను ఎంచుకుంటారు. అందులో పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పొందే ప్లాన్స్‌ను ఎంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నెలనెలా నిర్ణీత ఆదాయం వస్తే ఎవరిపైనా ఆధారపడాల్సిన ఉండదని భావిస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసం దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్  ప్రత్యేక పాలసీను తీసుకొచ్చింది. ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ పేరుతో లాంచ్ చేసిన ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రతి నెలా పెన్షన్‌ ఈ నేపథ్యంలో ఎల్ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్‌లో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కానీ  మీకు జీవితాంతం పెన్షన్ అందిస్తారు. ఎల్ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్ రిటైర్మెంట్ ప్లాన్‌గా బాగా పాపులర్ కావడానికి ఇదే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రతి నెలా ఫిక్స్‌డ్ పెన్షన్ ఇచ్చే ఈ పథకం పదవీ విరమణ తర్వాత పెట్టుబడి ప్రణాళికలో సరిగ్గా సరిపోతుంది. ఎవరైనా ఇటీవల పదవీ విరమణ చేశారనుకుంటే పదవీ విరమణ సమయంలో పీఎఫ్ ఫండ్, గ్రాట్యుటీ నుంచి పొందిన డబ్బును అందులో పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెలా పెన్షన్ ప్రయోజనం పొందుతూనే ఉంటాడు.

రూ.12 వేలు పెన్షన్ ఇలా

ఎల్‌ఐసి సరళ పెన్షన్ ప్లాన్‌లో మీరు సంవత్సరానికి కనీసం రూ. 12,000 యాన్యుటీని పొందవచ్చు. ఎందుకంటే ఈ ప్లాన్‌లో గరిష్ట పెట్టుబడికి ఎటువంటి పరిమితిని నిర్ణయించలేదు. అంటే మీరు మీకు కావలసినంత పెట్టుబడి పెట్టవచ్చు. ఆ పెట్టుబడి ప్రకారం పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో, ఏ వ్యక్తి అయినా ఒకసారి ప్రీమియం చెల్లించిన తర్వాత వార్షిక, అర్ధ-వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు. ఈ మొత్తం పెట్టుబడితో అతను యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. ఎల్ఐసీ కాలిక్యులేటర్ ప్రకారం ఎవరైనా 42 ఏళ్ల వ్యక్తి రూ. 30 లక్షల వార్షికాన్ని కొనుగోలు చేస్తే, అతను ప్రతి నెలా రూ.12,388 పెన్షన్‌గా పొందుతాడు. కాబట్టి ఈ పథకాన్ని భార్యాభర్తలు కలిసి ప్లాన్ చేసుకుంటే మంచి లాభాలువస్తాయి. 

ఎల్ఐసీ సరల్ పెన్షన్ స్కీమ్‌ను 40 నుండి 80 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి కొనుగోలు చేయవచ్చు. మీరు ఒంటరిగా లేదా భార్యాభర్తలు కలిసి ఈ పథకాన్ని తీసుకోవచ్చు. ఇందులో పాలసీ ప్రారంభించిన తేదీ నుండి ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా సరెండర్ చేసుకునే వెసులుబాటు కూడా పాలసీదారునికి ఇచ్చారు. అలాగే మరణ ప్రయోజనం విషయంలో పాలసీదారు మరణిస్తే, పెట్టుబడి మొత్తం అతని నామినీకి తిరిగి ఇస్తారు. వారికి కూడా జీవితకాల పెన్షన్, రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. జీవితాంతం పెన్షన్‌కు హామీ ఇచ్చే ఈ ఎల్‌ఐసీ పథకంలో పాలసీదారుకు రుణ సౌకర్యం కూడా కల్పించారు. సరల్ పెన్షన్ పథకం కింద పాలసీదారులు ఆరు నెలల తర్వాత కూడా రుణం తీసుకోవచ్చు. ఈ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి మీరు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Link to comment
Share on other sites

  • 0

National Pension Scheme (NPS): నెలకు రూ. 50వేలు పెన్షన్‌ రావాలంటే.. ఇలా చేయండి..

మార్కెట్లో అనేక రకాల పదవీవిరమణ పథకాలు అందుబాటులో ఉన్నా.. బెస్ట్‌ పథకాన్ని ఎంపిక చేసుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారు. అయితే ప్రభుత్వం మద్దతుతో ఉండే నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌) మాత్రం ఈ పదవీవిరమణ పథాకాలలో అత్యంత ఆదరణ పొందుతోంది. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎస్‌ఆర్డీఏ) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీనిలో ప్రతి నెలా పెట్టుబడి పెట్టడం వల్ల పదవీవిరమణ తర్వాత పెన్షన్‌ పొందొచ్చు.

pension-scheme.jpg?w=1280

పదవీవిరమణ సమయంలో నిశ్చింతగా ఉండాలంటే ముందు నుంచే ఆర్థిక ప్రణాళిక అవసరం. మార్కెట్లో అనేక రకాల పదవీవిరమణ పథకాలు అందుబాటులో ఉన్నా.. బెస్ట్‌ పథకాన్ని ఎంపిక చేసుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారు. అయితే ప్రభుత్వం మద్దతుతో ఉండే నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌) మాత్రం ఈ పదవీవిరమణ పథాకాలలో అత్యంత ఆదరణ పొందుతోంది. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎస్‌ఆర్డీఏ) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీనిలో ప్రతి నెలా పెట్టుబడి పెట్టడం వల్ల పదవీవిరమణ తర్వాత పెన్షన్‌ పొందొచ్చు. రూ. 500 నుంచి రూ. లక్ష వరకూ దీనిలో పెన్షన్‌ పొందే అవకాశం ఉంది. ఎన్‌పీఎస్‌ పథకం ద్వారా నెలకు రూ. 50,000 పెన్షన్‌ పొందాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి? తెలుసుకుందాం రండి..

ఎన్‌పీఎస్‌ అంటే ఏమిటి?

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌) అనేది 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల పౌరులందరికీ అందుబాటులో ఉన్న మార్కెట్-లింక్డ్, డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ పెట్టుబడి పథకం. దీని సాయంతో వ్యక్తులు వారి పదవీవిరమణ తర్వాత స్థిరమైన పెన్షన్‌ పొందేందుకు ఇది అనుమతిస్తుంది.

నెలవారీ రూ. 50,000 పొందడం ఎలా?

మీరు ఎన్‌పీఎస్‌ ద్వారా నెలకు రూ. 50,000 పెన్షన్ను పొందాలంటే.. ఎంత పెట్టుబడి పెట్టాలి? ఏ వయసులో పెట్టుబడి పెట్టాలి? ఏ వయస్సు నుంచి పెన్షన్‌ వస్తుంది? చూద్దాం రండి.. మీకు నెలకు తక్కువ పెట్టుబడి కావాలంటే, చిన్న వయస్సులోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. మీకు ప్రస్తుతం 25 సంవత్సరాలు అనుకోండి.. పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు అని అనుకుంటే.. లెక్క ఇలా ఉంటుంది.

  • మీకు 25 ఏళ్లు వచ్చినప్పుడు పెట్టుబడి ప్రారంభమవుతుంది.
  • పదవీ విరమణ వయస్సు: 60 సంవత్సరాలు
  • పెట్టుబడి కాలపరిమితి: 35 సంవత్సరాలు
  • ఆశించిన రాబడి: సంవత్సరానికి 10 శాతం
  • నెలవారీ పెట్టుబడి: రూ.6,550
  • మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 2,50,75,245
  • మీరు పదవీ విరమణ సమయంలో విత్‌డ్రా చేయగల మొత్తం: పెట్టుబడిలో 60 శాతం. అంటే మొత్తం పెట్టుబడి  రూ. 2,50,75,245కాగా దానిలో 60 శాతం, అంటే రూ. 1,50,45,147 విత్‌ డ్రా చేసుకోవచ్చు.
  • ఇప్పుడు, యాన్యుటీలో పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 1,00,30,098
  • ఆశించిన నెలవారీ రాబడి: రూ.50,150

నెలవారీ రాబడి..

ఎన్పీఎస్ నుంచి పొందే పెన్షన్ మొత్తం కంట్రీబ్యూషన్‌ పరిమాణం, మెచ్యూరిటీ తర్వాత యాన్యుటీని కొనుగోలు చేయడానికి ఉపయోగించే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఎన్పీఎస్‌ పెట్టుబడులు మార్కెట్ పరిస్థితులకు అనుసంధానించి ఉంటాయి. ఈ పథకం నిర్దిష్ట ప్రయోజనాలకు హామీ ఇవ్వదు.

Link to comment
Share on other sites

  • 0

Mutual Funds - Systematic Investment Plan (SIP): నెలకు రూ. 10వేల పెట్టుబడితో రూ. 1.82కోట్లు రాబడి.. ఇది ట్రై చేయండి..

బెస్ట్ పెట్టుబడి పథకాలలో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. దీనిలో కాస్త రిస్క్ ఉన్నా.. దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. వీటిల్లో మీరు కావాలంటే ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టొచ్చు. లేదంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్ఐపీ) ద్వారా చిన్న మొత్తాలలో పెట్టుబడులు పెడుతూ ఉండొచ్చు. ఇది కాలక్రమేణా గణనీయమైన సంపదను నిర్మిస్తుంది.

Sip Investment Tips

sip-investment-tips.jpg?w=1280

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని.. అది కూడా సులువుగా సంపాదించాలని చాలా మంది కలలు కంటారు. కానీ అది అంత తేలికైన పని కాదు. కానీ కొన్ని పథకాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు రెగ్యూలర్ ఉద్యోగాలు చేసుకుంటూనే కొన్నేళ్లుగా కోటీశ్వరులు కావొచ్చు. అయితే మార్కెట్లో అనేక రకాల పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉంటాయి. మీరు విజయవంతంగా మీ పెట్టుబడులు పెడుతూ ఆశించిన గమ్యాన్ని చేరుకోవాలని భావిస్తే.. రెండు కీలకమైన అంశాలను పాటించాల్సి ఉంటుంది. ముందుగా సరైన పెట్టుబడి పథకాన్ని ఎంచుకోవాలి. రెండోది ఆ పెట్టుబడులను దీర్ఘకాలం కొనసాగిస్తూ.. కాంపౌండింగ్ మాయాజాలాన్ని అందుకోవాలి. అప్పుడు మీరు అనుకున్న సమయానికి, అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అలాంటి బెస్ట్ పెట్టుబడి పథకాలలో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. దీనిలో కాస్త రిస్క్ ఉన్నా.. దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. వీటిల్లో మీరు కావాలంటే ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టొచ్చు. లేదంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్ఐపీ) ద్వారా చిన్న మొత్తాలలో పెట్టుబడులు పెడుతూ ఉండొచ్చు. ఇది కాలక్రమేణా గణనీయమైన సంపదను నిర్మించడానికి క్రమానుగతంగా దోహదపడుతుంది. దీనిలో మీరు రూ. 1.82 కోట్లు ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు చూద్దాం..

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్..

ఇప్పుడు ఆగస్ట్ 2004లో ప్రారంభించిన ఓ మ్యూచుల్ ఫండ్ గురించి తెలుసుకుందాం.. ఇది ఎంత రాబడి ఇస్తుందో చూద్దాం.. ఈ ఫండ్ గత 20 సంవత్సరాలలో సంవత్సరానికి 19.42% చొప్పున ఏకంగా 3280% పెరిగింది. దీని ద్వారా రూ. 1 లక్ష పెట్టుబడిని దాదాపు రూ. 34 లక్షల కార్పస్‌గా మార్చింది. అదే సమయంలో మీరు నెలవారీ రూ. 10,000 పెట్టుబడి పెడితే రూ. 1.82 కోట్లు ఆదాయం వస్తుంది. గత ఏడాది కాలంలో ఫండ్ 54% పెరిగింది. రూ. 10,000 ఎస్ఐపీని రూ.1,54,000గా మార్చింది. దాని 2-సంవత్సరాల వృద్ధి 33% వార్షికంగా ఉంది. దీని వలన రూ. 10,000 ఎస్ఐపీ దాదాపు రూ. 3,50,000గా మారింది. 3 సంవత్సరాలలో రాబడి 22% వార్షికంగా ఉంది. ఇది రూ. 10,000 ఎస్ఐపీని రూ. 5.5 లక్షలుగా మార్చింది. ఆ ఫండే హెచ్ఎస్బీసీ మిడ్‌క్యాప్ ఫండ్.

హెచ్ఎస్బీసీ మిడ్‌క్యాప్ ఫండ్ గ్రోత్ 10,342 కోట్ల ఏయూఎంని కలిగి ఉంది. గత 5 సంవత్సరాలలో 20% పైగా వార్షిక రాబడిని అందించింది. ఫండ్ ఖర్చు నిష్పత్తి 1.73%. హెచ్ఎస్బీసీ మిడ్‌క్యాప్ ఫండ్ గ్రోత్‌లో కనీస పెట్టుబడి రూ. 5,000, కనిష్ట ఎస్ఐపీ రూ. 500. ఈ ఉత్పత్తి దీర్ఘకాలిక మూలధన ప్రశంసలు, ప్రధానంగా మిడ్‌క్యాప్ ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలలో పెట్టుబడిని కోరుకునే పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది.

పెట్టుబడి లక్ష్యం..

దీని పెట్టుబడి లక్ష్యం ప్రధానంగా మిడ్ క్యాప్ కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల క్రియాశీలంగా నిర్వహించబడే పోర్ట్‌ఫోలియో నుంచి దీర్ఘకాలిక మూలధన వృద్ధిని ఉత్పత్తి చేయడం. అయితే, పథకం పెట్టుబడి లక్ష్యం నెరవేరుతుందనే హామీ లేదా హామీ ఉండదు. కమ్మిన్స్ ఇండియా , పవర్ ఫైనాన్స్ కార్ప్, సుజ్లాన్ ఎనర్జీ, గోద్రెజ్ ప్రాపర్టీస్ ఈ ఫండ్ లోని టాప్ హోల్డింగ్స్‌గా ఉన్నాయి . మూలధన వస్తువులు, నిర్మాణ సేవలు, బయోటెక్నాలజీ అండ్ డ్రగ్స్, ప్రాంతీయ బ్యాంకులు ఫండ్ పెట్టుబడి పెట్టే ప్రధాన రంగాలు.

Link to comment
Share on other sites

  • 0

Retirement Planning: Retire with crores: రిటైర్‌మెంట్ సమయానికి కోటీశ్వరులవడం పక్కా.. ఇలా చేస్తే మీ ఖాతాలో రూ. 5కోట్లు..

మీరు పదవీవిరమణ సమయానికి కోటీశ్వరులు కావాలంటే మీరు ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరాల్లోనే ఈ ఎస్ఐపీలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాల్సి ఉంటుంది. కాబట్టి, మీరు రూ. 5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ పెద్ద కార్పస్‌ని నిర్మించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు 25 సంవత్సరాల వయస్సు నుంచి దీనిలో పెట్టుబడులు ప్రారంభించాలి.

Retirement Planning

retirement-planning.jpg?w=1280

పదవీవిరమణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానమైనది. అప్పటి వరకూ తీరిక లేకుండా కష్టపడిన వ్యక్తులు.. ఆ తర్వాత విశ్రాంతికి మొగ్గుచూపుతారు. పిల్లల చదువులు, వారి బాధ్యతలు తీరిపోయాక ప్రశాంతంగా గడపాలని భావిస్తారు. అయితే అలా గడపాలంటే ఆర్థికంగా నిశ్చింతగా ఉంటేనే సాధ్యమవుతుంది. అందుకే ఇటీవల కాలంలో పదవీవిరమణ ప్రణాళికకు డిమాండ్ పెరుగుతోంది. అందరూ ఈ దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేస్తున్నారు. అందుకు చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి గానీ.. దీర్ఘకాలంలో మిమ్మల్ని కోటీశ్వరులను చేసే ఓ పథకం ఒకటి ఉంది. అదే మ్యూచువల్ ఫండ్స్ లోని సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్(ఎస్ఐపీ లేదా సిప్). ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) ప్రతి నెలా విడుదల చేస్తున్న డేటా దానిని మళ్లీ మళ్లీ రుజువు చేస్తోంది. పదవీవిరమణ ప్రణాళిక దీర్ఘకాల ప్రయోజనాలను ఉద్దేశించింది కాబట్టి అటువంటి వారికి ఈ ఎస్ఐపీ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.

కోటీశ్వరులను చేసే పథకం ఇది..

మీరు పదవీవిరమణ సమయానికి కోటీశ్వరులు కావాలంటే మీరు ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరాల్లోనే ఈ ఎస్ఐపీలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాల్సి ఉంటుంది. కాబట్టి, మీరు రూ. 5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ పెద్ద కార్పస్‌ని నిర్మించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు 25 సంవత్సరాల వయస్సు నుంచి దీనిలో పెట్టుబడులు ప్రారంభించాలి. మీరు రూ. 10,000 నెలవారీ ఎస్ఐపీ చేస్తే 20 సంవత్సరాల కాలంలో నిఫ్టీ 50 కంటే తక్కువ రాబడిని 14 శాతం కంటే తక్కువగా పొందినట్లయితే, మీ చిన్న సహకారం దీర్ఘకాలంలో అద్భుతాలు చేయవచ్చు. ఉదాహరణఖు మీరు మీ పదవీ విరమణ ప్రయాణాన్ని 25 సంవత్సరాలలో ప్రారంభిస్తున్నారని భావిస్తే. రూ. 10,000 నెలవారీ ఎస్ఐపీ, 12శాతం వార్షిక రిటర్న్ ను అంచనా వేస్తే రూ. 5 కోట్ల పదవీ విరమణ కార్పస్‌ను ఎన్ని సంవ్సతరాల్లో చేరుకుంటారో ఇప్పుడు చూద్దాం..

రూ. 1 కోటి పదవీ విరమణ కార్పస్.. మీరు 20 సంవత్సరాల పాటు రూ. 10,000 ఎస్ఐపీని చేస్తే.. దానిపై 12 శాతం రాబడిని పొందుతారు. 20 సంవత్సరాలలో మీ విరాళాలు రూ. 24,00,000 (రూ. 24 లక్షలు) అవుతుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 75,91,479. అప్పుడు మొత్తం మొత్తం రూ. 99,91,479. 20 సంవత్సరాలలో, మీ మూలధన లాభాలు మీ ప్రధాన మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ అవుతుంది. ఎస్ఐపీలో కాంపౌండింగ్ వల్ల ఈ పెరుగుదల సాధ్యమైంది. కాంపౌండింగ్ లో 20 సంవత్సరాల తర్వాత మీ డబ్బును వేగంగా వృద్ధి చేయడంలో సహాయపడుతుంది. అలాగే 45 ఏళ్ల వయస్సులో మీకు రూ.1 కోటి ఉంటుంది.

రూ. 2 కోట్ల పదవీ విరమణ కార్పస్.. మీరు 20 ఏళ్లలో రూ. 1 కోటి మైలురాయిని చేరుకున్నారు. కానీ 12 శాతం వార్షిక వృద్ధితో, మీరు కేవలం ఆరేళ్లలో రూ. 2 కోట్ల మైలురాయిని చేరుకోవచ్చు. 26 సంవత్సరాల తర్వాత, మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 31,20,000. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 1,83,91,120. మొత్తం రాబడి రూ. 2,15,11,120. అంటే మీరు 51 సంవత్సరాల వయస్సులో, మీకు రూ. 2.15 కోట్లకు పైగా వస్తుంది.

రూ. 3 కోట్ల పదవీ విరమణ కార్పస్.. కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలకు చేరుకోవడానికి మీకు ఆరు సంవత్సరాలు పట్టింది, అయితే అది 3 కోట్ల రూపాయల మార్కును చేరుకోవడానికి కేవలం మూడు సంవత్సరాలు పడుతుంది. 29 సంవత్సరాల తర్వాత, మీ విరాళాలు రూ. 34,80,000. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 2,77,32,516. మొత్తం రూ. 3,12,12,516 అవుతుంది. అంటే 54 సంవత్సరాల వయస్సులో, మీరు రూ. 3.12 కోట్లకు పైగా కార్పస్‌ని కలిగి ఉంటారు.

రూ.4 కోట్ల పదవీ విరమణ కార్పస్.. కేవలం రాబోయే రెండేళ్లలో, మీరు రూ. 4 కోట్ల రిటైర్మెంట్ కార్పస్ మైలురాయిని సాధిస్తారు. 31 సంవత్సరాల తర్వాత, మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 37,20,000, దీర్ఘకాలిక లాభాలు రూ. 3,61,84,045, దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 3,99,04,045. మీకు 56 ఏళ్లు వచ్చే సరికి మీ పదవీ విరమణ కార్పస్ దాదాపు రూ. 4 కోట్లు అవుతుంది.

రూ. 5 కోట్ల పదవీ విరమణ కార్పస్.. రాబోయే రెండేళ్లలో, మీరు రూ. 5 కోట్ల పదవీ విరమణ కార్పస్ ని దాటుతారు. 33 సంవత్సరాల తర్వాత, మీ ఎస్ఐపీ పెట్టుబడి రూ. 39,60,000, దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 4,69,79,981, మీ మొత్తం రాబడి రూ. 5,09,39,981. అంటే 58 సంవత్సరాల వయస్సులో మీకు రూ. 5.10 కోట్ల పదవీ విరమణ కార్పస్ ఉంటుంది.

  • మీరు పెట్టుబడిని మరో రెండేళ్లు కొనసాగించి, 60కి పదవీ విరమణ చేస్తే.. ఆ సమయానికి మీకు రూ. 6.50 కోట్ల పదవీ విరమణ కార్పస్‌ను పొందవచ్చు. దీనిలో మీ చెల్లింపులు రూ. 42,00,000 కాగా.. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 6,07,52,691, మొత్తం రాబడి రూ. 6,49,52,691గా ఉంటుంది.
Link to comment
Share on other sites

  • 0

LIC Saral Pension Plan with up to Rs. 1 lakh pension : ఈ ఎల్ఐసీ ప్లాన్‌లో చేరితే.. రూ. లక్ష వరకూ పెన్షన్.. వివరాలు ఇవి..

అలాంటి పథకాల్లో ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ ఒకటి. దీనిని ఎల్ఐసీ 2022 ఆగస్టులో ప్రారంభించింది. ఇన్ స్టంట్ యాన్యుటీ ప్లాన్. అంతేకాక నాన్-లింక్డ్ నాన్-పార్టిసిపేటింగ్ అప్‌ఫ్రంట్ సింగిల్ ప్రీమియం పథకం. ఈ ప్లాన్ ప్రారంభం నుంచి దాదాపు 5 శాతం యాన్యుటీ రేటు హామీ అందిస్తుంది. దీనిలో నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షిక చెల్లింపును ఎంచుకునే అవకాశం ఉంది.

Lic Saral Pension Plan

lic-saral-pension-plan.jpg?w=1280

మన దేశంలో అనేక రకాల కంపెనీలు, విభిన్న రకాల పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అంటేనే జనాలకు బాగా నమ్మకం. అన్ని రంగాల ప్రజలకు అవసరమైన ప్లాన్లను ఇందులో అందుబాటులో ఉండటం.. కేంద్ర ప్రభుత్వం భరోసా కూడా లభిస్తుండటంతో అందరూ వీటిల్లో పెట్టుబడులు పెడతారు. జీవిత బీమాతో పాటు అనేక రకాల ప్లాన్లు ఇక్కడ ఉన్నాయి. అలాంటి పథకాల్లో ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ ఒకటి. దీనిని ఎల్ఐసీ 2022 ఆగస్టులో ప్రారంభించింది. ఇన్ స్టంట్ యాన్యుటీ ప్లాన్. అంతేకాక నాన్-లింక్డ్ నాన్-పార్టిసిపేటింగ్ అప్‌ఫ్రంట్ సింగిల్ ప్రీమియం పథకం. ఈ ప్లాన్ ప్రారంభం నుంచి దాదాపు 5 శాతం యాన్యుటీ రేటు హామీ అందిస్తుంది. దీనిలో నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షిక చెల్లింపును ఎంచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ అర్హతలు.. రాబడి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అర్హతలు ఇవి..

40 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ యాన్యుటీ పెన్షన్ స్కీమ్‌ను సబ్‌స్క్రైబ్ చేయడానికి లేదా కొనుగోలు చేయడానికి అర్హులు.

పెన్షన్ కాలిక్యులేటర్..

ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సరళ్ పెన్షన్ ప్లాన్ వివరాల ప్రకారం, పాలసీదారు ఈ పథకం కింద కనీసం రూ.1,000 నెలవారీ పెన్షన్ లేదా రూ. 12,000 వార్షిక పెన్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ కనీస పెన్షన్ కోసం, ఒకరు రూ.2.50 లక్షలను ఒకేసారి సింగిల్ ప్రీమియం చెల్లించాలి . ఒక పెట్టుబడిదారు రూ.10 లక్షల సింగిల్ ప్రీమియం పెట్టుబడిపై రూ. 50,250 వార్షిక పెన్షన్ పొందుతారు . అదేవిధంగా, పెట్టుబడిదారుడు ఈ పథకం కింద రూ.1 లక్ష వార్షిక పెన్షన్ కావాలనుకుంటే, రూ. 20 లక్షల ప్రీమియం చెల్లింపును ముందస్తుగా చెల్లించాలి .

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ ప్రయోజనాలు ఇవి..

  • లోన్ బెనిఫిట్: ఈ ప్లాన్ లో పెట్టుబడి ప్రారంభించి ఆరు నెలలు పూర్తయిన తర్వాత, లోన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
     
  • ఎగ్జిట్ ప్లాన్: ప్రారంభించిన ఆరు నెలల తర్వాత ఎల్‌ఐసి సరళ్ పెన్షన్ ప్లాన్ నుంచి నిష్క్రమించవచ్చు.
     
  • వడ్డీ రేటు: యాన్యుటీ ప్లాన్ దాదాపు 5 శాతం వార్షిక రాబడిని హామీ ఇస్తుంది.
     
  • జీవితకాల పెన్షన్ ప్రయోజనం: ఎల్ఐసీ సరళా పెన్షన్ ప్లాన్ అనేది మొత్తం జీవిత పాలసీ, అంటే పాలసీదారు ప్రారంభించిన తర్వాత జీవితాంతం వార్షిక లేదా నెలవారీ పెన్షన్‌కు అర్హులు.
     
  • నామినీకి డెత్ బెనిఫిట్: ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ సబ్‌స్క్రైబర్ మరణించిన తర్వాత, బేస్ ప్రీమియం నామినీకి తిరిగి చెల్లిస్తారు.
     
  • మెచ్యూరిటీ ప్రయోజనం లేదు: ఎల్‌ఐసి సరళా పెన్షన్ ప్లాన్‌లో, పాలసీదారు జీవించి ఉన్నంత వరకు పెన్షన్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి మెచ్యూరిటీ ప్రయోజనం ఉండదు.

 

Link to comment
Share on other sites

  • 0

Sukanya Samriddhi Yojana with 8.2% interest: ఈ పథకంలో 8.2శాతం వడ్డీ రేటు.. ఆడపిల్లల తల్లిదండ్రలు వదులుకోవద్దు..

బాలికా సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసే స్కీమ్‌ సుకన్య సమృద్ధి యోజన. వారి భవిష్యత్తు అవసరాలకు తల్లిదండ్రులకు ఓ ప్రణాళికనిస్తూ.. ఉన్నత చదువులు, పెళ్లి సమయానికి తగిన ఆర్థిక భరోసాను అందించేడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ప్రభుత్వం అందించే అన్ని పథకాలలోకెల్లా అత్యధిక వడ్డీ వచ్చే పథకం ఇదే. దీనిలో ఏకంగా 8.2శాతం వడ్డీ లభిస్తోంది.

Sukanya Samriddhi Yojana

sukanya-samriddhi-yojana.jpg?w=1280

బాలికా సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసే స్కీమ్‌ సుకన్య సమృద్ధి యోజన. వారి భవిష్యత్తు అవసరాలకు తల్లిదండ్రులకు ఓ ప్రణాళికనిస్తూ.. ఉన్నత చదువులు, పెళ్లి సమయానికి తగిన ఆర్థిక భరోసాను అందించేడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ప్రభుత్వం అందించే అన్ని పథకాలలోకెల్లా అత్యధిక వడ్డీ వచ్చే పథకం ఇదే. దీనిలో ఏకంగా 8.2శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి త్రైమాసికానికి ఈ వడ్డీ రేటు మారుతుంటుంది. 2024 జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి ఈ వడ్డీ రేటు అమలవుతోంది. ఇది దీర్ఘకాలపు పథకం. దీని పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను రహిత మెచ్యూరిటీ, మినహాయింపును కూడా పొందొచ్చు. ఈ ఖాతాను ఏదైనా జాతీయ బ్యాంకు లేదా పోస్టాఫీసు బ్రాంచ్‌లో ఓపెన్‌ చేయొచ్చు.

సుకన్య సమృద్ధి ఖాతా తెరవడానికి అర్హత.. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు మాత్రమే తెరిచే వీలుంది. ఒక కుటుంబానికి గరిష్టంగా రెండు ఖాతాలు అంటే ఇద్దరు ఆడపిల్లల పేరుతో ప్రారంభించాలి., రెండవ సారి జన్మించిన కవలలకు మినహాయింపు ఉంటుంది. వారు మూడో ఖాతా కోసం ప్రారంభించే వీలుంది.

అవసరమైన పత్రాలు.. ఎస్‌ఎస్‌వై ఖాతాను తెరవడానికి అప్లికేషన్‌ ఫారం, లబ్ధిదారుడి (కుమార్తె) జనన ధ్రువీకరణ పత్రం, సంరక్షకుడు లేదా తల్లిదండ్రుల చిరునామా రుజువు, సంరక్షకుడు లేదా తల్లిదండ్రుల ఐడీ రుజువు, ఫొటోగ్రాఫ్‌ కావాలి.

ఫారమ్ సమర్పణ.. సుకన్య సమృద్ధి యోజన ఖాతా ప్రారంభ ఫారమ్‌ను పూరించిన తర్వాత, అవసరమైన పత్రాలు, ఫోటోగ్రాఫ్‌లతో పాటు, రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల వరకు ఉండే ప్రాథమిక కంట్రిబ్యూషన్‌ మొత్తంతో సమర్పించవచ్చు.

డిపాజిట్ పదవీకాలం.. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఏటా కనీసం రూ. 250, గరిష్టంగా రూ. 1.5 లక్షలను డిపాజిట్‌ చేయవచ్చు. మెచ్యూరిటీ వ్యవధి ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాలు లేదా అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేసే సమయం.

గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు.. ఖాతా తెరవడం పూర్తయిన తర్వాత, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఉపయోగించి డిపాజిట్లు చేయవచ్చు. వార్షిక డిపాజిట్లు చేయడంలో వైఫల్యం చెందితే ఖాతా డిఫాల్ట్ కింద వర్గీకరిస్తారు. ప్రతి డిఫాల్ట్‌కి రూ. 50 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఆడపిల్లల తల్లిదండ్రలు తప్పనిసరిగా ఈ పథకాన్ని ప్రారంభించి, ప్రతి నెలా కంట్రిబ్యూషన్ చెల్లించాలని సూచిస్తుంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...