Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 2

Wealth secrets: How to make money, save money and get rich? ​💰​


Question

Posted

Can You Really Retire in Your 30s?

FIRE => Financial Independence Retire Early

 

  • Like 1
  • Answers 92
  • Created
  • Last Reply

Top Posters For This Question

  • Sanjiv

    53

  • TELUGU

    33

  • Vijay

    6

  • ADMINISTRATOR

    1

Recommended Posts

  • 0
Posted

FD Interest Rates at 8%: ఆ నాలుగు బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై వడ్డీ జాతర.. సీనియర్‌ సిటిజన్లకు 8 శాతం వడ్డీ

తక్కువ రిస్క్ పెట్టుబడిగా ప్రాచుర్యం పొందిన ఎఫ్‌డీలు పెట్టుబడిదారులు తమ మిగులు నిధులను ముందుగా నిర్ణయించిన వ్యవధికి సురక్షితంగా కేటాయించవచ్చు. ముఖ్యంగా ఎఫ్‌డీల మెచ్యూరిటీ సమయంలో మంచి వడ్డీను పొందవచ్చు. వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు సాధారణంగా పెట్టుబడి వ్యవధిని బట్టి 3 శాతం నుంచి 7.50 శాతం వరకు ఉంటాయి. అయితే సీనియర్ సిటిజన్లు మాత్రం సాధారణ వడ్డీ రేట్ల కంటే 0.50 శాతం అదనపు వడ్డీ రేటును అందుకుంటున్నారు.

money-111-1.jpg?w=1280

భారతదేశంలో  ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మంచి పెట్టుబడి ఎంపికగా ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తక్కువ రిస్క్ పెట్టుబడిగా ప్రాచుర్యం పొందిన ఎఫ్‌డీలు పెట్టుబడిదారులు తమ మిగులు నిధులను ముందుగా నిర్ణయించిన వ్యవధికి సురక్షితంగా కేటాయించవచ్చు. ముఖ్యంగా ఎఫ్‌డీల మెచ్యూరిటీ సమయంలో మంచి వడ్డీను పొందవచ్చు. వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు సాధారణంగా పెట్టుబడి వ్యవధిని బట్టి 3 శాతం నుంచి 7.50 శాతం వరకు ఉంటాయి. అయితే సీనియర్ సిటిజన్లు మాత్రం సాధారణ వడ్డీ రేట్ల కంటే 0.50 శాతం అదనపు వడ్డీ రేటును అందుకుంటున్నారు. అయితే ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు వివిధ బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను సరిపోల్చడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో టాప్‌ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్సెడ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే కస్టమర్లు 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు అదనంగా 50 బేసిస్ పాయింట్లు పొందుతారు. ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలకు, బ్యాంక్ 6.80 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అయితే రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 7 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 

పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 3.50 శాతం నుంచి 7.50 శాతం వరకు అందిస్తుంది. ప్రత్యేకించి ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం సాధారణ పెట్టుబడిదారులకు వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్‌లు ఒక సంవత్సర ప్రణాళికలో 7.25 శాతం అధిక రేటును అందుకుంటారు.

ఐసీఐసీఐ బ్యాంక్ 

జూన్ 27, 2024 నాటికి ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎఫ్‌డీ పథకాలకు వడ్డీ రేట్లను 3 శాతం నుంచి 7.50 శాతం పరిధిలో అందిస్తుంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్‌లు అదనపు 0.5 శాతం వడ్డీని పొందుతారు. దీని ఫలితంగా 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ పదవీకాలాల్లో రేట్లు 3.50 శాతం నుంచి 7.50 శాతం వరకు ఉంటాయి. ప్రత్యేకించి ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం సాధారణ కస్టమర్‌లకు 6.70 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 

హెచ్‌డీఎఫ్‌సీ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. సాధారణ పెట్టుబడిదారులు 6.60 శాతం అందిస్తుండగా సీనియర్ సిటిజన్‌లు 7.10 శాతం అధిక రేటును అందుకుంటారు. అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మెచ్యూరిటీ వ్యవధిని బట్టి సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.

  • 0
Posted

FD Interest Rates up to 9.5%: వృద్ధులకు బంపర్ ఆఫర్.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటే ఆలస్యం చేయకండి..

దేశంలోని ప్రముఖ బ్యాంకులు,ఆర్థిక సంస్థలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పెట్టుబడుల కోసం అనేక రకాల ఎంపికలు ఉన్నాయి. ఈ సంస్థలు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధితో ఎఫ్డీలపై సంవత్సరానికి 2.50% నుంచి 9.50% వరకు వడ్డీ రేట్లను అందిస్తాయి. సీనియర్ సిటిజన్లు సాధారణంగా పౌరుల ఎఫ్డీ రేట్ల కంటే 50 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) అదనపు వడ్డీ రేటును అందుకుంటారు.

Senior Citizen FD

senior-citizen-fd1.jpg?w=1280

మన దేశంలోని అనేక బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో సాధారణంగా సీనియర్ సిటీజెన్స్ అంటే వృద్ధులకు అధిక వడ్డీతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. సాధారణ పౌరులతో పోల్చితే వృద్ధులకు ఆకర్షణీయంగా ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉంటాయి. అయితే ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ఇటీవల అన్ని బ్యాంకులు సవరించాయి. వాటిల్లో సీనియర్ సిటిజెన్స్ కు అధిక వడ్డీనిచ్చే బ్యాంకుల వివరాలను ఇప్పుడు చూద్దాం..

వడ్డీ రేట్ల మార్జిన్ ఇలా..

భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు,ఆర్థిక సంస్థలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పెట్టుబడుల కోసం అనేక రకాల ఎంపికలు ఉన్నాయి. ఈ సంస్థలు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధితో ఎఫ్డీలపై సంవత్సరానికి 2.50% నుంచి 9.50% వరకు వడ్డీ రేట్లను అందిస్తాయి. సీనియర్ సిటిజన్లు సాధారణంగా పౌరుల ఎఫ్డీ రేట్ల కంటే 50 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) అదనపు వడ్డీ రేటును అందుకుంటారు.

అదనపు ప్రయోజనాలు..

కొన్ని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) ప్రామాణిక ఆఫర్‌లను మించి, నిర్దిష్ట కాలవ్యవధుల కోసం రూపొందించిన ప్రత్యేక పథకాల ద్వారా సీనియర్ సిటిజన్ ఎఫ్డీ రేట్లపై 20-30 బీపీఎస్ ను అదనంగా అందిస్తాయి.

ఈ బ్యాంకుల్లో అత్యధిక వడ్డీ రేట్లు..

ఎస్బీఎం బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి చిన్న ఫైనాన్స్ బ్యాంక్‌లతో పాటు అత్యంత పోటీ రేట్లను అందిస్తాయి. సీనియర్ సిటిజన్ డిపాజిటర్లకు సంవత్సరానికి 7.00% నుంచి మొదలవుతుంది.

పన్ను చిక్కులు: రూ. 50,000 కంటే ఎక్కువ ఎఫ్డీలపై వచ్చే వడ్డీపై వార్షికంగా పన్ను పడుతుంది. ఫారమ్ 15జీ/15హెచ్ సమర్పించకపోతే టీడీఎస్ కూడా వర్తిస్తుంది.

అకాల మూసివేత: మెచ్యూరిటీలోపు మీ ఖాతాను మూసివేయాలంటే అందుకు పెనాల్టీ విధిస్తారు.

పొడిగింపు ఎంపికలు: ఎఫ్డీ ఖాతాలను మెచ్యూరిటీ పొడిగింపు సమయంలో నిర్ణయించిన వడ్డీ రేట్లతో అదనపు కాలాల కోసం పొడిగించవచ్చు.

ఏ బ్యాంకులో ఎంత వడ్డీ..

ఎంపిక చేసిన బ్యాంకులలో వివిధ కాల వ్యవధుల్లో సీనియర్ సిటిజన్‌లకు అందించే వడ్డీ రేట్ల వివరాలు ఇవి..

AXIS యాక్సిస్ బ్యాంక్..

  • అత్యధిక వడ్డీ: 7.85%
  • 1-సంవత్సరం కాల వ్యవధి: 7.20%
  • 3 సంవత్సరాల కాల వ్యవధి: 7.60%
  • 5 సంవత్సరాల కాల వ్యవధి: 7.75%

మీరు రూ. 50,000 పెట్టుబడి పెడితే 5 సంవత్సరాలలో మీ రాబడి రూ. 73,392 అవుతుంది.

BANDHAN బంధన్ బ్యాంక్:

  • అత్యధిక వడ్డీ: ఏడాదికి 8.35%
  • 1-సంవత్సరం కాల వ్యవధి: 8.35%
  • 3 సంవత్సరాల కాల వ్యవధి: 7.75%
  • 5 సంవత్సరాల కాల వ్యవధి:6.60%

మీరు రూ. 50,000 పెట్టుబడి పెడితే 5 సంవత్సరాలలో మీ రాబడి రూ. 69,361 అవుతుంది.

HDFC హెచ్డీఎఫ్సీ బ్యాంక్:

  • అత్యధిక వడ్డీ: ఏడాదికి 7.75%
  • 1-సంవత్సరం కాల వ్యవధి: 7.10%
  • 3 సంవత్సరాల కాల వ్యవధి: 7.65%
  • 5 సంవత్సరాల పదవీకాలం: 7.70%

మీరు రూ. 50,000 పెట్టుబడి పెడితే 5 సంవత్సరాలలో మీ రాబడి రూ. 73,212 అవుతుంది.

ICICI ఐసీఐసీఐ బ్యాంక్:

  • అత్యధిక వడ్డీ: ఏడాదికి 7.75%
  • 1-సంవత్సరం కాల వ్యవధి: 7.20%
  • 3 సంవత్సరాల కాల వ్యవధి: 7.50%
  • 5 సంవత్సరాల కాల వ్యవధి: 7.50%

మీరు రూ. 50,000 పెట్టుబడి పెడితే ఐదేళ్లలో మీ రాబడి రూ. 72,497 అవుతుంది.

IDBI ఐడీబీఐ బ్యాంక్:

  • అత్యధిక వడ్డీ: ఏడాదికి 7.75%
  • 1-సంవత్సరం కాల వ్యవధి: 7.30%
  • 3 సంవత్సరాల కాల వ్యవధి: 7.00% 5 సంవత్సరాల కాల వ్యవధి: 7.00%

మీరు రూ. 50,000 పెట్టుబడి పెడితే 5 సంవత్సరాలలో మీ రాబడి రూ. 70,739 అవుతుంది.

ఈ రేట్లు మార్పునకు లోబడి ఉంటాయి. తాజా అప్‌డేట్‌లు, నిబంధనల కోసం సంబంధిత బ్యాంకులను సంప్రదించడం మంచిది.

  • 0
Posted

ICICI Bank FD interest rate: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎఫ్‌డీలపై భారీగా పెరిగిన వడ్డీ రేట్లు..

ఒక్కో బ్యాంకు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్డీ) వడ్డ రేట్లను సవరిస్తున్నాయి. ఈ క్రమంలో జూన్ 29వ తేదీన ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ తన బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సాధారణ ప్రజలకు (60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న) 7.2 శాతం, సీనియర్ సిటిజన్‌( 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు)లకు 7.75 శాతం అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది.

fd-scheme.jpg?w=1280

పొదుపు పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందినవి ఫిక్స్‌డ్ డిపాజిట్లు. నిర్ణీత కాల వ్యవధిలో కచ్చితమైన రిటర్న్స్ అందించే ఈ పథకంలో అత్యధిక శాతం మంది భారతీయులు పెట్టుడులు పెడతారు. కాగా వీటిల్లో వడ్డీ రేటు ప్రతి త్రైమాసికానికి మారుతూ ఉంటుంది. ఒక్కో బ్యాంకులో ఒక్కో వడ్డ రేటు కూడా ఉంటుంది. ఈ త్రైమాసికానికి కొత్త వడ్డీ రేట్లను బ్యాంకులు ప్రకటిస్తున్నాయి. ఒక్కో బ్యాంకు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్డీ) వడ్డ రేట్లను సవరిస్తున్నాయి. ఈ క్రమంలో జూన్ 29వ తేదీన ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ తన బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సాధారణ ప్రజలకు (60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) 7.2 శాతం, సీనియర్ సిటిజన్‌( 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు)లకు 7.75 శాతం అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది. రిటైల్ డిపాజిట్లు ఇంతకుముందు రూ. 2 కోట్లకు బదులుగా ఇప్పుడు రూ. 3 కోట్లలోపుగా డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్లు ఉంటాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లు..

సాధారణ ప్రజల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ 7 నుంచి 29 రోజుల కాలవ్యవధికి రూ. 3 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై 3 శాతం, 30 నుంచి 45 రోజులకు 3.5 శాతం అందిస్తుంది. అత్యధిక వడ్డీ రేటు 7.2 శాతం 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ కాల వ్యవధికి అందుబాటులో ఉంటుంది. 7 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు ఎక్కువ కాలం పాటు, వడ్డీ రేటు వార్షికంగా 6.9 శాతంగా ఉంది.

సీనియర్ సిటిజన్ల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ 7 నుంచి 29 రోజుల కాలవ్యవధికి రూ. 3 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై 3.5 శాతం, 30 నుంచి 45 రోజులకు 4 శాతం అందిస్తుంది. అత్యధిక వడ్డీ రేటు 7.75 శాతం 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ కాల వ్యవధికి అందుబాటులో ఉంటుంది. 7 సంవత్సరాల 1 రోజు నుంి 10 సంవత్సరాల సుదీర్ఘ పదవీకాలం కోసం, వడ్డీ రేటు వార్షికంగా 7.4 శాతంగా ఉంది.

1 సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ కాల వ్యవధిలో, సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 7.2 శాతం కాగా.. 18 నెలల నుంచి 2 సంవత్సరాల కాలవ్యవధికి, సాధారణ ప్రజలకు 7.2 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. సీనియర్ సిటిజన్లు 7.7 శాతం పొందుతారు.

ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, సవరించిన వడ్డీ రేట్లు కొత్త, పునరుద్ధరించబడిన ఎఫ్డీలకు వర్తిస్తాయి.

ముందస్తు ఉపసంహరణ విషయంలో.. ఎఫ్డీ ప్రారంభించిన 7 రోజులలోపు ఉపసంహరించుకుంటే వడ్డీ చెల్లించరు. ఆ తర్వాత కాలంలో చేస్తే వడ్డీ వస్తుంది కాని అపరాధ రుసుం విదిస్తారు. 1 సంవత్సరం లోపు విత్‌డ్రాలకు 0.5 శాతం, 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల మధ్య విత్‌డ్రాలకు 1 శాతం, 1 శాతం (రూ. 5 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు) లేదా 1.5 శాతం (రూ. 5 కోట్ల డిపాజిట్లకు) జరిమానా రేటు విధిస్తారు.

పీపీఎఫ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్..

  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ప్రస్తుతం 7.1 శాతం అందిస్తోంది. ఇది సాధారణ ప్రజలకు ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 7.2 శాతం కంటే తక్కువ. అయితే పీపీఎఫ్ వడ్డీ రేటు 18 నెలల కంటే తక్కువ కాల వ్యవధిలో ఎక్కువగా ఉంటుంది.
     
  • సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 8.2 శాతం వడ్డీ అందిస్తుంది. ఇది 15 నెలల నుంచి 18 నెలల కాలవ్యవధికి ఐసీఐసీ బ్యాంక్ అత్యధిక రేటు అయిన 7.75 శాతం కంటే ఎక్కువ.
  • 0
Posted

Sukanya Samriddhi Yojana with 8.2% compound interest! ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. భవిష్యత్ అవసరాలకు బోలెడంత భరోసా

భారతదేశంలో పెట్టుబడిదారులకు కొన్ని ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలు రాబడిపై మంచి భరోసానిస్తున్నాయి. రిస్క్ తక్కువ ఉండడంతో ఆయా పథకాల్లో పెట్టుబడికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు. ఇలాంటి పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) అనేది ప్రభుత్వ చిన్న డిపాజిట్ పొదుపు పథకం. ఈ పథకం బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న ఆడ పిల్లలల తల్లిదండ్రులు, సంరక్షకులు గానీ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

sukanya-samriddhi-yojana.jpg?w=1280

భారతదేశంలో పెట్టుబడిదారులకు కొన్ని ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలు రాబడిపై మంచి భరోసానిస్తున్నాయి. రిస్క్ తక్కువ ఉండడంతో ఆయా పథకాల్లో పెట్టుబడికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు. ఇలాంటి పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) అనేది ప్రభుత్వ చిన్న డిపాజిట్ పొదుపు పథకం. ఈ పథకం బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న ఆడ పిల్లలల తల్లిదండ్రులు, సంరక్షకులు గానీ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈ ఖాతా బాలిక పేరు మీద తెరవాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖాతాల కింద నిర్వహణకు ఈ పథకంలో అవకాశం ఉండదు. ఈ పథకం కింద ఒక ఇంటిలో గరిష్టంగా ఇద్దరు ఆడ పిల్లలకు ఖాతా తెరవవచ్చు. ఈ నేపథ్యంలో సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

వడ్డీ రేటు

సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన వడ్డీ రేటు మునుపటి త్రైమాసికం నుంచి స్థిరంగా ఉంది. జూలై-సెప్టెంబర్ 2024 త్రైమాసికానికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. 

గరిష్ట పెట్టుబడి

ఈ పథకంతో కనీస పెట్టుబడి రూ. 250గా ఉంది. ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి.

మెచ్యూరిటీ

పెట్టుబడికి మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలుగా ఉంటుంది. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చినా లేదా 21 ఏళ్లు వచ్చిన ఏది ముందుగా వచ్చినా పాలసీ మెచ్యూర్ అవుతుంది.

పన్ను ప్రయోజనాలు

ఎస్ఎస్‌వై పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్‌లపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపునకు అర్హత ఉంటుంది. 

ఏడాదికి రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెడితే 

మీరు ఎస్ఎస్‌వై ప్లాన్‌లో నెలకు రూ. 5,000 పెట్టుబడి పెడితే, మీ మొత్తం వార్షిక పెట్టుబడి రూ. 60,000 అవుతుంది. ఈ పథకం సంవత్సరానికి 8.2 శాతం చక్రవడ్డీని చెల్లిస్తుంది కాబట్టి మీ 15 ఏళ్ల పెట్టుబడి రూ. 9 లక్షలుగా ఉంటుంది. వడ్డీ రూ. 18.92 లక్షలు, అంటే మెచ్యూరిటీ మొత్తం రూ. 27.92 లక్షలు మీ చేతికి వస్తుంది.  మీరు ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష లేదా నెలకు రూ. 8,333.33 పెట్టుబడి పెడితే మీ పెట్టుబడి 15 సంవత్సరాలలో రూ. 15 లక్షలు అవుతుంది. వడ్డీ రూ. 31.53 లక్షలు మరియు మెచ్యూరిటీలో రూ. 46.53 లక్షలుగా ఉంటుంది. మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ట పరిమితిలో అంటే రూ. 1.50 లక్షలు (లేదా నెలకు రూ. 12333.33) కింద పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో మీ పెట్టుబడి రూ. 22.50 లక్షలు అవుతుంది. వచ్చే వడ్డీ రూ. 47.30 లక్షలు, మెచ్యూరిటీ మొత్తం 69.80 లక్షలుగా ఉంటుంది.

  • 0
Posted

Mutual Funds: కోటి రూపాయలు సంపాదించడం కష్టమేం కాదు! ఇలా చేస్తే మీ కల సాకారం..

మ్యూచువల్ ఫండ్స్ అనే మాట చాలామందికి తెలిసినప్పటికీ వాటిలో డబ్బులు ఎలా పెట్టుబడి పెట్టాలో అవగాహన ఉండదు. మనకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా ఉండే ఫండ్ ను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. ఉదాహరణకు మీకు నెలకు రూ.50 వేల జీతం వస్తుందనుకోండి. దానిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా పదేళ్లలో రూ.కోటి రూపాయలను సంపాదించవచ్చు. దీనికి క్రమబద్ధమైన ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం.

Sip Investment Tips

sip-investment-tips.jpg?w=1280

జీవితంతో భద్రతకు, భవిష్యత్తు అవసరాలకు డబ్బు అనేది చాలా అవసరం. మనకు వచ్చే ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసుకుని కొంత పొదుపు చేసుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం బ్యాంకులు, పోస్టాఫీసులలో అనేక పొదుపు పథకాలు ఉన్నాయి. వాటిలో చాలామంది తమ డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో మన పెట్టుబడికి అధిక రాబడి వచ్చే అవకాశం ఉంది.

అవగాహన అవసరం..

మ్యూచువల్ ఫండ్స్ అనే మాట చాలామందికి తెలిసినప్పటికీ వాటిలో డబ్బులు ఎలా పెట్టుబడి పెట్టాలో అవగాహన ఉండదు. మనకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా ఉండే ఫండ్ ను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. ఉదాహరణకు మీకు నెలకు రూ.50 వేల జీతం వస్తుందనుకోండి. దానిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా పదేళ్లలో రూ.కోటి రూపాయలను సంపాదించవచ్చు. దీనికి క్రమబద్ధమైన ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. రూ.కోటి సంపాదించడానికి ఏ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ (సిప్)ను ఎంచుకోవాలో తెలుసుకుందాం.

రూ.కోటి సంపాదించాలంటే..

పదేళ్లలో కోటి రూపాయాలు సంపాదించడం అనేది కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ ప్రణాళిక ప్రకారం వెళితే అది సాధ్యమే. అందుకోసం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్ల మిశ్రమాన్ని ఎంచుకోవాలి. ఈ వ్యూహం ప్రకారం ఏటా సిప్ లో పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవాలి. పెరుగుతున్న మీ ఆదాయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవాలి. తద్వారా మీ మూలధనం గణనీయంగా పెరుగుతుంది.

సిప్ లో పెట్టుబడి..

మీరు రూ.25,500 లతో సిప్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. ఏటా పదిశాతం పెరుగుదలతో ఇన్వె స్ట్ చేస్తున్నారు. తద్వారా పదేళ్లలో ఒక కోటి రూపాయల రాబడిని పొందవచ్చు. అంతర్లీన పెట్టుబడులు తదుపరి పదేళ్లకు 15 శాతం వార్షిక రాబడిని సమకూర్చుతాయి.

సమన్వయం..

పెట్టుబడి దారులు అధిక రాబడి కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లార్జ్ , మిడ్, స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్ల మిశ్రమాన్ని ఎంచుకోవాలి. వీటిలో లార్జ్ క్యాప్ ఫండ్స్ సురక్షితమైనవే. కానీ రాబడి మితంగా ఉంటుంది. మిగిలిన మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ రిస్క్‌తో కూడుకున్నవి. అయినా అధిక రాబడిని అందించగలవు. కాబట్టి రిస్క్, రిటర్న్ రెండింటిని సమన్వయం చేయడం కోసం పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపర్చడం చాలా అవసరం.

రాబడి ఇలా..

మీ జీతం 50 వేలు అనుకున్నాం కదా. దానిలో నెలవారీ ఎస్ఐపీ రూ. 25,500 సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వేర్వేరు ఎస్ఐపీలతో ప్రారంభించవచ్చు.  ఏటా పదిశాతం పెంచే విధానంలో మీరు రూ.15 వేలు పెట్టుబడి పెడితే 12 శాతం రిటర్న్స్ ఆశిస్తే రూ.50 లక్షలు, 15 శాతం రిటర్న్స్ ఆశిస్తే 59 లక్షల రాబడి ఉంటుంది. రూ.20 వేలు చొప్పున పెట్టుబడి పెడితే 67 లక్షలు (12 శాతం), 79 లక్షలు (15 శాతం) అందుతాయి. అలాగే ఏటా ఐదు శాతం పెంచే విధానంలో రూ.15 వేలు పెట్టుబడి పెడితే 12 శాతం రిటర్న్స్ తో 42 లక్షలు, 15 శాతం రిటర్న్స్ తో 50 లక్షలు అందుతాయి. అలాగే రూ.20 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 56 లక్షలు (12 శాతం), 66 లక్షలు (15 శాతం) పొందే అవకాశం ఉంది.

పదేళ్లలో సాధ్యమే..

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను గమనించడం చాలా అవసరం. ప్రధానంగా ఆర్థిక సలహాదారులను సంప్రదించాలి. స్థిరమైన పెట్టుబడి పెట్టడం ద్వారా, సక్రమమైన అంచనాల ద్వారా పదేళ్లలో రూ.కోటి సంపాదించడం సాధ్యమవుతుంది.

  • 0
Posted

NPS vs PPF: ఆ రెండు పథకాలతో రిటైర్‌మెంట్ లైఫ్ హ్యాపీ.. కోటీశ్వరుడు కావడం గ్యారెంటీ..!

భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరిన నాటి నుంచే పదవీ విరమణ ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అందుకు ఇప్పటి నుంచే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పేరుతో అందుబాటులో ఉన్న పథకంలో పెట్టుబడి పెడతారు. అయితే ఇటీవల ఎన్‌పీఎస్ స్కీమ్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే రాబడి దృష్ట్యా ఏయే పథకం మంచిదో చాలా మంది అంచనా వేయలేరు. ముఖ్యంగా రూ. కోటి కంటే ఎక్కువ కార్పస్‌ను కూడబెట్టడం మీ లక్ష్యమైతే ఎన్‌పీఎస్, పీపీఎఫ్ రెండూ మంచి పెట్టుబడులుగా భావించాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రెండు పథకాల్లో మీకు సరిపోయే పథకాన్ని మీరు దేనిని ఎంచుకోవాలనే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌పీఎస్, పీపీఎఫ్ రెండు పథకాల్లో ప్రధాన తేడాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఎన్‌పీఎస్‌లో కనీస వార్షిక పెట్టుబడి రూ. 6,000గా ఉంటుంది. అయితే పెట్టుబడులపై గరిష్ట పరిమితి లేదు. మరోవైపు పీపీఎఫ్ ఖాతాల కోసం కనీస వార్షిక పెట్టుబడి రూ. 500, మీరు ఒక సంవత్సరంలో పెట్టుబడి పెట్టగలిగే గరిష్టం రూ. 1.5 లక్షలుగా ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి 30 సంవత్సరాల వయస్సులో పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించి 60 సంవత్సరాల వయస్సు వరకు అలానే కొనసాగిస్తే 30 సంవత్సరాల కాలానికి అంటే 15 సంవత్సరాల కనిష్ట లాక్ ఇన్ ప్లస్ 3 బ్లాక్ ఎక్స్‌టెన్షన్స్ 5 సంవత్సరాల లేదా 360 నెలలు పెట్టుబడి పెడితే 7.1 శాతం వడ్డీ రేటుతో రూ. 1.5 లక్షల వార్షిక సహకారంతో రూ. 1.5 కోట్లకు పైగా రిటర్న్స్ వస్తాయి. జాతీయ పెన్షన్ సిస్టమ్ రిటర్న్స్ విషయంలో నాలుగు అసెట్ క్లాసులు ఉన్నాయి అసెట్ క్లాస్ ఈ- ఈక్విటీ, సంబంధిత సాధనాలు, అసెట్ క్లాస్ సి – కార్పొరేట్ డెట్, సంబంధిత సాధనాలు, అసెట్ క్లాస్ జీ- ప్రభుత్వ బాండ్లు, సంబంధిత సాధనాలు మరియు అసెట్ క్లాస్ ఏ – వంటి సాధనాలతో సహా ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు సీఎంబీఎస్, ఎంబీఎస్, ఆర్ఈఐటీఎస్, ఏఐఎఫ్‌లు మొదలైనవి ఉంటాయి. మీరు నెలవారీ రూ. 12,500 పెట్టుబడితో 30 సంవత్సరాల వ్యవధిలో మీరు స్కీమ్ ఏ, స్కీమ్ జీ, స్కీమ్ సీ నుంచి 1.7 కోట్లకు పైగా రాబడిని పొందవచ్చు. 

పీపీఎఫ్‌లో వార్షిక పెట్టుబడి గరిష్ట మొత్తం అంటే రూ. 1.5 లక్షల వరకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. అదనంగా పీపీఎఫ్ అనేది ఈఈఈ ఉత్పత్తి అంటే సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ ఆదాయం పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. ఎన్‌పీఎస్ విషయంలో రూ. 2 లక్షల (1.5 లక్షలు + రూ. 50,000) వరకు పన్ను మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. మెచ్యూరిటీ సమయంలో మొత్తం కార్పస్‌లో 60 శాతం పన్ను మినహాయింపు ఉంటుంది. యాన్యుటీలో పెట్టుబడి పెట్టబడిన మిగిలిన 40 శాతం కూడా మినహాయింపు పొందింది. అయితే యాన్యుటీ ద్వారా వచ్చే ఆదాయం మీ పన్ను స్లాబ్‌పై ఆధారపడి పన్ను విధిస్తారు. 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయ పౌరుడు ఎన్‌పీఎస్ ఖాతాను తెరవవచ్చు. అయితే 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులు ఎవరైనా పీపీఎఫ్ ఖాతాను తెరవగలరు. అయితే ఎన్ఆర్ఐలు ఎన్‌పీఎస్ ఖాతాలను తెరవగలిగినప్పటికీ వారు పీపీఎఫ్‌ని ఎంచుకోలేరు. ఎన్‌పీఎస్‌లో మీరు పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను ఎంచుకోవచ్చు.

  • 0
Posted

Small Saving Schemes: చిన్న మొత్తాల పొదుపుతో పెద్ద మొత్తంలో పన్ను ఆదా.. ట్యాక్స్ సేవ్ చేసే ది బెస్ట్ స్కీమ్స్ ఇవే..!

చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఇండియా పోస్ట్, బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉంటాయి. హామీ ఇచ్చిన రిటర్న్‌లతో పాటు  ఆ పథకాలు పన్ను మినహాయింపులను అందిస్తాయి. అందువల్ల ఈ పథకాలు కనీస పెట్టుబడి అవసరాలు, ఇన్‌స్టంట్ అవైలబిలిటీ కారణంగా చాలా మంది రిటైల్ పెట్టుబడిదారులకు ఎంపిక సాధనాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పథకాల్లో ఇండియా పోస్ట్ ఆఫీస్‌లతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా ఆన్‌లైన్‌లో ఈ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు.

tax.jpg?w=1280

భారతదేశంలోని ప్రజలను పొదుపు చేయడానికి ప్రోత్సహించేలా ప్రభుత్వ హామీతో చిన్న పొదుపు పథకాలను కేంద్ర ప్రవేశపెట్టింది. స్థిరమైన రాబడికి హామీ ఉండడంతో ప్రజలు ఆయా పథకాల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఇండియా పోస్ట్, బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉంటాయి. హామీ ఇచ్చిన రిటర్న్‌లతో పాటు  ఆ పథకాలు పన్ను మినహాయింపులను అందిస్తాయి. అందువల్ల ఈ పథకాలు కనీస పెట్టుబడి అవసరాలు, ఇన్‌స్టంట్ అవైలబిలిటీ కారణంగా చాలా మంది రిటైల్ పెట్టుబడిదారులకు ఎంపిక సాధనాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పథకాల్లో ఇండియా పోస్ట్ ఆఫీస్‌లతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా ఆన్‌లైన్‌లో ఈ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆదాయపు పన్ను ఆదా చేసే టాప్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఐదు సంవత్సరాల నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్

ఈ పథకంలో ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.5 శాతంగా ఉంది. ఈ పథకంలో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు అందుబాటులో ఉంది. అయితే ఈ పథకంలో వచ్చిన  వడ్డీపై మాత్రం పన్ను విధిస్తారు. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.1000గా ఉంది. గరిష్ట పరిమితి లేదు. అలాగే ఆరు నెలలలోపు అకాల మూసివేత అనుమతించరు. అయితే ఒక సంవత్సరం తర్వాత మూసివేస్తే వర్తించే వడ్డీ రేటు పూర్తయిన సంవత్సరాలకు అందించే అసలు వడ్డీ రేటు కంటే 2 శాతం తక్కువగా ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ వ్యవధికి పోస్టాఫీసు పొదుపు వడ్డీ రేట్లు అప్పుడు వర్తిస్తాయి. 

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 

ఈ పథకంలో ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 8.2 శాతంగా ఉంది. ఈ వడ్డీ ప్రతి త్రైమాసికంలో చెల్లిస్తారు. ఆర్థిక సంవత్సరంలో అన్ని ఎస్‌సీఎస్ఎస్ ఖాతాల్లో మొత్తం వడ్డీ రూ. 50,000 దాటితే వడ్డీపై పన్ను విధిస్తారు. వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి ఖాతా తెరవవచ్చు. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు పెట్టుబడి పెట్టడానికి అర్హత ఉంటుంది. ఈ పెట్టుబడులు సెక్షన్ 80సి కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపున అందిస్తారు. కనిష్ట డిపాజిట్ రూ. 1,000గా ఉంటే గరిష్ట పరిమితి రూ. 30 లక్షలుగా ఉంది. అయితే ఒక సంవత్సరం లోపు ఖాతాను మూసివేస్తే వడ్డీ చెల్లించరు. ఒకటి నుంచి రెండు సంవత్సరాల మధ్య ఖాతాను మూసివేసినట్లయితే అసలు మొత్తం 1.5 శాతం తగ్గుతుంది. రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య ఖాతాను మూసివేస్తే ప్రధాన మొత్తం నుండి 1 శాతం తీసేస్తారు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

ఈ పథకంలో ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.1 శాతంగా ఉంది. అయితే పీపీఎఫ్‌పై పొందే వడ్డీ పన్ను రహితంగా ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస పెట్టుబడి మొత్తం రూ. 500 కాగా, గరిష్టంగా రూ. 1.5 లక్షలుగా ఉంది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో కనీస సహకారం అందించకపోతే ఖాతా నిలిపివేస్తారు. ఖాతాదారుడు డిఫాల్ట్ అయిన ప్రతి సంవత్సరానికి రూ. 50 జరిమానా ఛార్జీలతో పాటు సంవత్సరానికి కనీస పెట్టుబడి మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత మెచ్యూరిటీకి ముందు పునరుద్ధరించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద మినహాయింపుకు అర్హత పొందుతుంది. రుణ సౌకర్యాలు, పాక్షిక ఉపసంహరణలు అనుమతించబడినప్పటికీ ఇది 15 సంవత్సరాల మెచ్యూరిటీ కాలవ్యవధితో వస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన

ఈ పథకంలో ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 8.2 శాతంగా ఉంది. పది సంవత్సరాల వయస్సు వరకు ఉన్న బాలికల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మాత్రమే ఈ పథకంలో పెట్టుబడికి అర్హులు. అలాగే ఎస్ఎస్ఏపై పొందే వడ్డీ పన్ను రహితంగా ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస పెట్టుబడి మొత్తం రూ. 250, గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలుగా ఉంది. ఈ పథకంలో కూడా సెక్షన్ 80సీ కింద మొత్తం పరిమితి రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాల తర్వాత లేదా అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం జరిగే సమయంలో మెచ్యూర్ అవుతుంది. అయితే పెళ్లి తేదీకి ఒక నెల ముందు లేదా మూడు నెలల తర్వాత మూసివేయడానికి అనుమతి ఉండదు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత అకాల ఉపసంహరణలు అనుమతి ఉంటుంది. 

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్

ఈ పథకంలో ప్రస్తుత వడ్డీ రేటు వార్షికంగా 7.7 శాతం ఉంటుంది. ఈ వడ్డీ మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. అయితే ఈ పథకంలో – సంపాదించిన వడ్డీపై పన్ను విధిస్తారు. అలాగే ఈ పథకంలో కనిష్ట డిపాజిట్ రూ. 1,000 ఉండగా గరిష్ట పరిమితి లేదు. అలాగే రూ. 1.5 లక్షల వరకు సెక్షన్ 80సీ కింద మినహాయింపు పొందవచ్చు. ఎన్ఎస్‌సీ డిపాజిట్ ఐదు సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. అయితే ఈ ఖాతా అకాల మూసివేత కుదరదు.

  • 0
Posted

Fixed Deposits with up to 9.4% interest: వృద్ధులకు బంపర్ ఆఫర్.. ఈ ఎఫ్‌డీపై ఏకంగా 9.4శాతం రాబడి..

స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని సీనియర్ సిటిజన్ జనాభా 2021 లో 138 మిలియన్ల నుంచి 2031 నాటికి 194 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. సీనియర్ సిటిజన్లు తమ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి నమ్మదగిన, స్థిరమైన పెట్టుబడి ఎంపిక అవసరం. అందుకు శ్రీరామ్ ఫైనాన్స్ మంచి ఆప్షన్ కాగలదని ఆ సంస్థ ప్రకటించుకుంది.

fixed-deposit-2.jpg?w=1280

మీరు సీనియర్ సిటిజెనా? ఏదైనా మంచి పథకంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నారా? వృద్ధాప్యంలో మీ డబ్బు సురక్షితంగా ఉంటూనే మంచి రాబడిని ఆ స్కీమ్ ఇవ్వాలని భావిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీలాంటి వారి కోసం ఓ మంచి పథకం అందుబాటులో ఉంది. అదే ఫిక్స్‌డ్ డిపాజిట్. సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్లు సురక్షితమైనవి. స్థిరమైన వడ్డీతో కచ్చితమైన రాబడిని అందిస్తాయి. అందుకే వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజెన్స్. వీరికి మరిన్ని ప్రయోజనాలు ఈ స్కీమ్ లో లభిస్తాయి. అన్ని సంస్థల్లో వీటి వడ్డీ రేట్లు ఒకలా ఉండవు. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో ప్రముఖ సంస్థ అయిన శ్రీరామ్ ఫైనాన్స్, సీనియర్ సిటిజన్ల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టింది. దీనిలో అధిక వడ్డీతో పాటు పలు ప్రయోజనాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సీనియర్ సిటిజెన్స్ ఎంత మంది అంటే..

స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని సీనియర్ సిటిజన్ జనాభా 2021 లో 138 మిలియన్ల నుంచి 2031 నాటికి 194 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. సీనియర్ సిటిజన్లు తమ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి నమ్మదగిన, స్థిరమైన పెట్టుబడి ఎంపిక అవసరం. అందుకు శ్రీరామ్ ఫైనాన్స్ మంచి ఆప్షన్ కాగలదని, ఆ సంస్థ ప్రకటించుకుంది.

అధిక రాబడులు..

శ్రీరామ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు సంవత్సరానికి 9.40% వరకు వడ్డీ రేట్లను అందిస్తాయి. ఈ రేట్లు అనేక ఇతర ఆర్థిక సంస్థలు అందించే సగటు వడ్డీ రేట్ల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది వారి రాబడిని ఆప్టిమైజ్ చేయాలనుకునే సీనియర్ సిటిజన్‌లకు ఆకర్షణీయమైన ఎంపిక. అధిక వడ్డీ రేట్లు పెద్ద ఆదాయాలకు దారితీస్తాయి. రిటైర్‌మెంట్‌లో ఆధారపడదగిన ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది.

సౌకర్యవంతమైన కాల వ్యవధులు..

ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు 12 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు ఉండే ఫ్లెక్సిబుల్ టెన్యూర్ ఆప్షన్‌లను అందిస్తాయి. ఇది సీనియర్ సిటిజన్‌లు వారి ఆర్థిక ప్రణాళిక అవసరాలకు అత్యంత అనుకూలమైన పదవీకాలాన్ని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. వారికి స్వల్పకాలిక లిక్విడిటీ లేదా దీర్ఘకాలిక పెట్టుబడి వృద్ధి అవసరం అయినా వారి లక్ష్యాలకు అనుగుణంగా ఇది పనిచేయగలుగుతుంది.

అధిక క్రెడిట్ రేటింగ్‌..

శ్రీరామ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌లు ఆకట్టుకునే క్రెడిట్ రేటింగ్‌లు లభించాయి. ఐసీఆర్ఏ “(ICRA)AA+ Stable” రేటింగ్‌ను కేటాయించగా, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ “IND AA+/Stable” రేటింగ్ ఇచ్చింది, ఇది కంపెనీ ఆర్థిక స్థిరత్వం, విశ్వసనీయతను నొక్కి చెబుతుంది. ఈ రేటింగ్‌లు పెట్టుబడిదారులకు అదనపు స్థాయి రక్షణను అందిస్తాయి, వారి నిధుల భద్రతకు భరోసా ఇస్తాయి.

వడ్డీ చెల్లింపు ఆప్షన్లు..

శ్రీరామ్ ఫైనాన్స్ వడ్డీ చెల్లింపుల కోసం వివిధ ఎంపికలను అందిస్తుంది. వృద్ధులు తమ ఆర్థిక అవసరాల ఆధారంగా నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన వారి వడ్డీ ఆదాయాలను స్వీకరించే అవకాశం ఉంది. ఈ అనుకూలత వారి ఖర్చు అలవాట్లకు అనుగుణంగా వారి నగదు ప్రవాహాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి అనుమతిస్తుంది.

  • 0
Posted

Mutual Funds returns in 5 years: ఐదేళ్లలో అద్భుతాలు చేసిన ఫండ్స్ ఇవే.. ఊహించని రాబడి

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడులకు రాబడి అధికంగా ఉంటుంది. వాటిలో కొంత రిస్క్ ఉన్నప్పటికీ ధీర్ఘకాలంలో అధిక ఆదాయాన్ని ఇస్తాయి. ముఖ్యంగా పెట్టుబడి ఎలా పెట్టామనే విషయంపై రాబడి ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉపయోగంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఐదేళ్లలో అధిక రాబడి అందించిన మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వివరాలు తెలుసుకుందాం.

money111111.jpg?w=1280

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడులకు రాబడి అధికంగా ఉంటుంది. వాటిలో కొంత రిస్క్ ఉన్నప్పటికీ ధీర్ఘకాలంలో అధిక ఆదాయాన్ని ఇస్తాయి. ముఖ్యంగా పెట్టుబడి ఎలా పెట్టామనే విషయంపై రాబడి ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉపయోగంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఐదేళ్లలో అధిక రాబడి అందించిన మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వివరాలు తెలుసుకుందాం.

అధిక రాబడి..

సాధారణంగా లార్జ్ క్యాప్ ఫండ్‌లలో పెట్టుబడి స్థిరత్వాన్ని అందిస్తుందని, స్మాల్ క్యాప్స్‌లో పెట్టుబడి అధిక రాబడిని ఇస్తుందని, మిడ్ క్యాప్‌లలో పెట్టుబడి వల్ల రెండింటినీ పొందవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తారు. ఈ మూడింటి కలయికనే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎమ్ఎఫ్ఐ) నివేదిక ప్రకారం మల్టీ-క్యాప్ కేటగిరీ మ్యూచువల్ ఫండ్.. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో కనీసం 75 శాతం పెట్టుబడులను కలిగి ఉండాలి. తన ఆస్తులలో కనీసం 25 శాతాన్ని లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్‌లకు కేటాయించాలి.

క్వాంట్ యాక్టివ్ ఫండ్..

ఈ ఫండ్ ఐదేళ్లలో 33.51 శాతం వార్షిక రాబడులతో అగ్రస్థానంలో ఉంది. దీని నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులు (ఏయూఎం) రూ. 10,758 కోట్లు, నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ) విలువ 778.9542. గా ఉంది. ఈ ఫండ్‌లో కనీస లంప్ సమ్, ఎస్ఐపీ పెట్టుబడులు రూ. 5 వేలు, రూ.1,000గా ఉన్నాయి. దీని పెట్టుబడులో 89.65 శాతం ఈక్విటీలో, 27.56 శాతం లార్జ్ క్యాప్ స్టాక్‌లలో, 22.6 శాతం మిడ్ క్యాప్ స్టాక్‌లలో, 23.66 శాతం స్మాల్ క్యాప్ స్టాక్‌లలో ఉన్నాయి. దీని పోర్ట్‌ఫోలియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ పవర్, అరబిందో ఫార్మా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తదితర 57 స్టాక్‌లు ఉన్నాయి. ఈ ఫండ్‌లోని రూ.20 వేల నెలవారీ ఎస్ఐపీ ఐదేళ్ల కాలంలో రూ.29,21,674గా మారింది.

నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్..

ఈ ఫండ్ ఐదేళ్ల కాలపరిమితిలో 35.56 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. దీని ఏయూఎమ్ 34,943 కోట్లు, ఎన్ఏవీ విలువ రూ. 319.6448గా ఉంది. దేశీయ ఈక్విటీలలో 98.59 శాతం పెట్టుబడులు పెట్టింది. వీటిలో 33.32 శాతం పెద్ద క్యాప్ స్టాక్‌లలో, 22.99 శాతం మిడ్ క్యాప్ స్టాక్‌లలో, 24.03 శాతం స్మాల్ క్యాప్ స్టాక్‌లలో ఉన్నాయి. ఈ ఫండ్ లోని 107 స్టాక్‌ల పోర్ట్‌ఫోలియోలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, లిండే ఇండియా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఈఐహెచ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యాంక్ ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ ఫండ్ లో రూ. 20 వేల నెలవారీ ఎస్ఐపీ ఇప్పటికి రూ. 28,55,112 అయ్యింది.

మహీంద్రా మాన్యులైఫ్ మల్టీ క్యాప్ ఫండ్..

ఈ ఫండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఐదేళ్లలో 32.59 శాతం వార్షిక రాబడిని అందించింది. దీని ఆస్తి రూ. 4,091 కోట్లు, ఎన్ఏవీ ధర రూ.39.9380గా ఉన్నాయి. ఈ ఫండ్ లో కనీస ఎస్ఐపీ పెట్టుబడి 500, లంప్ సమ్ కు రూ.1000గా ఉంది. 2017లో ప్రారంభమైన ఈ ఫండ్ దేశీయ ఈక్విటీలలో 97.65 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. వీటిలో 35.41 శాతం పెద్ద క్యాప్ స్టాక్‌లలో, 19.38 శాతం మిడ్ క్యాప్ స్టాక్‌లలో, 19.56 శాతం స్మాల్ క్యాప్ స్టాక్‌లలో ఉన్నాయి. దీని పోర్ట్ పోలియోలోని 66 స్టాక్ లలో కెనరా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్ పీసీఎల్, టీసీఎస్, ఆర్ఐఎల్ ప్రధానమైనవి. దీనిలో రూ.20వేల నెలవారీ ఎస్ఐపీ ఐదేళ్లలో రూ.26,63,838 ఇచ్చింది.

బరోడా బీఎన్పీ పారిబాస్ మల్టీ క్యాప్ ఫండ్..

నాలుగో స్థానంలో నిలిచిన ఈ ఫండ్ ఐదేళ్లలో 29.5 శాతం వార్షిక రాబడి అందించింది. దీని ఆస్తి రూ.2,459 కోట్లు, ఎన్ఏవీ రూ. 314.6084గా ఉంది. 2013లో ప్రారంభమైన ఈ ఫండ్‌లో కనీస లంప్ సమ్ పెట్టుబడి రూ.5 వేలు, ఎస్ఐపీ పెట్టుబడి రూ. 500. దేశీయ ఈక్విటీలలో 97.13 శాతం పెట్టుబడులను కలిగి ఉంది, వీటిలో 28.22 శాతం పెద్ద క్యాప్ స్టాక్‌లలో, 19.23 శాతం మిడ్ క్యాప్ స్టాక్‌లలో, 22.16 శాతం స్మాల్ క్యాప్ స్టాక్‌లలో ఇన్వెస్ట్ చేశారు. మొత్తం 62 స్టాక్ పోర్ట్ పోలియోలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఆర్ఐఎల్, ఏబీబీ పవర్ ప్రొడక్ట్స్ అండ్ సిస్టమ్స్, జ్యోతి సీఎన్ సీ ఆటోమేషన్ ముఖ్యమైనవి. ఐదేళ్ల క్రితం రూ. 20 వేల నెలవారీ ఎస్ఐపీ ఇప్పుడు రూ. 24,76,833గా ఉంది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్..

ఈ ఫండ్ ఎస్ఐపీ రాబడి ఐదేళ్ల కాలంలో 29.35 శాతం వచ్చింది. దీని ఏయూఎమ్ రూ.13,025 కోట్లు, ఎన్ఏవీ రూ.852.9400గా ఉంది. 2013 జనవరిలో ప్రారంభమైన ఈ ఫండ్ లో కనీస లంప్ సమ్ పెట్టుబడి రూ. 5వేలు, ఎస్ఐపీ పెట్టుబడి రూ.100గా ఉన్నాయి. ఈ ఫండ్ దేశీయ ఈక్విటీలలో 89.7 శాతం పెట్టుబడిని కలిగి ఉంది, వీటిలో 40 శాతం పెద్ద క్యాప్ స్టాక్‌లలో, 21.31 శాతం మిడ్ క్యాప్ స్టాక్‌లలో, 13.88 శాతం స్మాల్ క్యాప్ స్టాక్‌లలో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర ప్రధాన స్టాక్ లతో పాటు 114 దీని పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. ఈ ఫండ్ లో రూ. 20 వేల నెలవారీ ఎస్ఐపీ ఐదేళ్లలో రూ. 24,68,079గా మారింది.

  • 0
Posted

SBI Amrit Kalash for Senior Citizens: సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ శుభవార్త.. 10 లక్షల పెట్టుబడితో రాబడి ఎంతంటే..?

సీనియర్ సిటిజన్లు రిటైరయ్యాక వచ్చిన సొమ్మును నమ్మకమైన సంస్థల్లో పెట్టుబడి పెట్టాలని ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇలాంటి వారు కచ్చితంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లల్లో పెట్టుబడిని ఇష్టపడుతూ ఉంటారు. పదవీ విరమణ తర్వాత వారికి గ్యారెంటీ ఆదాయం అవసరం కాబట్టి వారు తమ మొత్తం మొత్తాన్ని ఎఫ్‌డీల్లోనే పెట్టుబడి పెడతారు. దీంతో చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లను డబ్బు పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించడానికి అదనపు వడ్డీ రేట్లను అందిస్తాయి. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. ఇది సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేట్లను అందిస్తుంది.

sbi-1.jpg?w=1280

ఏదైనా సమయంలో మన దగ్గ ఏకమొత్తంలో డబ్బు ఉండి మార్కెట్ రిస్క్ తీసుకోకుండా డిపాజిట్ చేయాలనుకున్నప్పుడు హామీతో వచ్చే రిటర్న్ ఎంపికల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో సొమ్ము ఉంటే చాలా మంది తెలిసిన వారికి వడ్డీకి ఇస్తూ ఉంటారు. అయితే అలా ఇచ్చినప్పుడు బాగానే ఉన్నా తిరిగి వసూలు చేసుకునే సమయంలో అసలు ఇబ్బంది తెలుస్తుంది. అందువల్ల చాలా మంది మంచి పెట్టుబడి ఎంపికల కోసం చూస్తూ ఉంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు రిటైరయ్యాక వచ్చిన సొమ్మును నమ్మకమైన సంస్థల్లో పెట్టుబడి పెట్టాలని ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇలాంటి వారు కచ్చితంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లల్లో పెట్టుబడిని ఇష్టపడుతూ ఉంటారు. పదవీ విరమణ తర్వాత వారికి గ్యారెంటీ ఆదాయం అవసరం కాబట్టి వారు తమ మొత్తం మొత్తాన్ని ఎఫ్‌డీల్లోనే పెట్టుబడి పెడతారు. దీంతో చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లను డబ్బు పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించడానికి అదనపు వడ్డీ రేట్లను అందిస్తాయి. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. ఇది సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇది అమృత్ కలశ్ పథకంలో 1 సంవత్సరం, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వ్యవధుల్లో ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని అందుబాటులో ఉంచింది. అమృత్ కలశ్ పథకంలో అత్యధిక వడ్డీ రేటును 7.60 శాతంగా అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ అమృత్ కలశ్ పెట్టుబడి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకంలో ఒక సంవత్సరం, మూడు సంవత్సరాలు, ఐదు సంవత్సరాల ఎఫ్‌డీ పథకాలకు వడ్డీ రేట్లు వరుసగా 7.30 శాతం, 7.25 శాతం మరియు 7.50 శాతంగా ఉన్నాయి. ఐదు సంవత్సరాల ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, పెట్టుబడిదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్లపై పన్ను ప్రయోజనాలను పొందుతారు.  ఒక సంవత్సరం ఎఫ్‌డీలో రూ. 2.50 లక్షల డిపాజిట్‌పై మీ వడ్డీ రూ. 18,756 అవుతుంది, మెచ్యూరిటీపై మీరు రూ. 2,68,756 పొందవచ్చు. మీరు ఈ పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే మీ వడ్డీ డబ్బు రూ. 37,511, మెచ్యూరిటీ మొత్తం రూ. 5,37,511 వస్తుంది. ఇందులో రూ.7.50 లక్షల పెట్టుబడి మీకు రూ.56,267 వడ్డీని, రూ.8,06,267 మెచ్యూరిటీని పొందడంలో సహాయపడుతుంది. ఈఎఫ్‌డీలో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత మీ వడ్డీ రూ. 75,023 కాగా మెచ్యూరిటీ మొత్తం రూ. 10,75,023 అవుతుంది.

మూడు సంవత్సరాల సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీలో రూ. 2.50 లక్షల పెట్టుబడి పెడితే రూ. 60,137 వడ్డీ వస్తుంది. అంటే మెచ్యూరిటీ రూ. 3,10,137 పొందవచ్చు. రూ. 5 లక్షల పెట్టుబడిపై వడ్డీ రూ. 1,20,273, మెచ్యూరిటీ రూ. 6,20,273 వస్తుంది. మీరు పథకంలో రూ.7.50 లక్షలు పెట్టుబడి పెట్టినప్పుడు, మీకు రూ.1,80,410 వడ్డీ, రూ.9,30,410 విలువైన మెచ్యూరిటీ లభిస్తుంది. మీరు 3 సంవత్సరాల ఎఫ్‌డీలో రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే మీకు రూ. 4,49,948 వడ్డీతో రూ. 14,49,948 మెచ్యూరిటీ రూపంలో లభిస్తుంది. ఐదు సంవత్సరాల ఎఫ్‌డీలో మీ పెట్టుబడి రూ. 2.50 లక్షలు అయితే మీ వడ్డీ మొత్తం రూ. 9,30,410 వస్తుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 3,62,487 అవుతుంది. రూ. 5 లక్షల పెట్టుబడిపై మీరు రూ. 2,24,974 వడ్డీని పొందుతారు. అయితే మీరు మెచ్యూరిటీ సమయంలో రూ. 7,24,974 పొందవచ్చు. రూ.7.50 లక్షల పెట్టుబడి మీరు రూ.3,37,461 వడ్డీతో కలిపి రూ.10,87,461 మెచ్యూరిటీ సొమ్ము అందుతుంది. రూ.10 లక్షల పెట్టుబడిపై పెట్టుబడిదారుడు రూ.4,49,948 వడ్డీతో మెచ్యూరిటీలో రూ.14,49,948 పొందవచ్చు. 

  • 0
Posted

Earn fixed income by installing BSNL towers on your property: మీరు ఎలాంటి పని చేయకుండానే వేలల్లో సంపాదించుకోండి.. BSNL అద్భుతమైన ఆఫర్‌!

మీరు కూడా ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించే మార్గం కోసం చూస్తున్నట్లయితే, ఈ ట్రిక్ మీకు ఉపయోగపడుతుంది. కానీ దీని కోసం మీ ఇంటి పైకప్పుపై స్థలం ఉండటం అవసరం. దీని తర్వాత, మీ ఇంటిలో మెరుగైన నెట్‌వర్క్ కనెక్టివిటీ, సంపాదన ఉంటుంది. టెలికాం కంపెనీలు Jio, Airtel, Vi తమ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచినప్పటి నుండి చాలా మంది వినియోగదారులు BSNLకి మారాలని ఆలోచిస్తున్నారు. మీరు మీ ఇంటి పైకప్పుపై బిఎస్‌ఎన్‌ఎల్..

bsnl.jpg?w=1280

మీరు కూడా ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించే మార్గం కోసం చూస్తున్నట్లయితే, ఈ ట్రిక్ మీకు ఉపయోగపడుతుంది. కానీ దీని కోసం మీ ఇంటి పైకప్పుపై స్థలం ఉండటం అవసరం. దీని తర్వాత, మీ ఇంటిలో మెరుగైన నెట్‌వర్క్ కనెక్టివిటీ, సంపాదన ఉంటుంది. టెలికాం కంపెనీలు Jio, Airtel, Vi తమ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచినప్పటి నుండి చాలా మంది వినియోగదారులు BSNLకి మారాలని ఆలోచిస్తున్నారు. మీరు మీ ఇంటి పైకప్పుపై బిఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను ఏర్పాటు చేస్తే ఎంతో లాభం పొందవచ్చు. దీని తరువాత, ప్రతి నెలా మెరుగైన నెట్‌వర్క్, ఆదాయ వనరు ఉంటుంది. మీ రూఫ్‌పై బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి కింద ఇచ్చిన దశలను అనుసరించండి.

ఇంటి పైకప్పు మీద బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్:

దీని కోసం ముందుగా గూగుల్ క్రోమ్‌లో ఇండస్ టవర్ అధికారిక వెబ్‌సైట్‌ను సెర్చ్ చేయండి. ఇక్కడ ఎగువన చూపిన వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి. దీని తరువాత, మీరు స్క్రీన్ కుడి మూలలో చూపిన మూడు ఎంపికలను చూస్తారు. ఇందులో LANDOWNERS అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇది దరఖాస్తు చేసిన తర్వాత, ఇండస్ టవర్ వ్యక్తులు సర్వే కోసం మీ ఇంటికి వస్తారు. సర్వే నిర్వహించి నెలనెలా అద్దె ఇస్తారు. ఈ ఛార్జీలు కంపెనీపై ఆధారపడి ఉంటాయి. ఒప్పందం ఎన్ని సంవత్సరాలు, అది ఎంత మొత్తం అనేది నిర్ణయిస్తారు.

ఒక రకంగా చెప్పాలంటే, ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించే సాధనం ఇది. దీని కారణంగా ఇంటి పైకప్పు దీని కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ టవర్‌ని ఇన్‌స్టాల్ చేసినట్లయితే మీరు డబ్బును పొందుతూనే ఉంటారు. ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌ల నుండి కూడా బయటపడవచ్చు. అయితే దీని కోసం కంపెనీ మీతో ఎన్ని సంవత్సరాలైనా ఒప్పందం (డీల్) కుదుర్చుకోవచ్చని గుర్తుంచుకోండి. ఈ టవర్‌ను ఏర్పాటు చేస్తే మీకు కనీసం రూ.20 నుంచి రూ.25 వేల వరకు అందిస్తారు. దీనికి మీ ఆమోదం తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకోండి. ఆ సంవత్సరాలకు మీ పైకప్పును ఇవ్వడానికి మీరు అంగీకరిస్తే. ఇది కాకుండా, టవర్‌ను ఇన్‌స్టాల్ చేయడం వల్ల కలిగే నష్టాలను కూడా గమనించండి.

టవర్ ఇన్‌స్టాల్‌ ప్రతికూలతలు:

టెలికాం టవర్లు రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. ఇది ఎక్కువసేపు బహిర్గతమైతే క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. రేడియేషన్ నిద్రలో అంతరాయాన్ని కలిగిస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను పెంచుతుంది. కొంతమందికి రేడియేషన్ వల్ల తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు రావచ్చు.

  • 0
Posted

FD Rates with interest rates up to 9%: ఎఫ్డీ రేట్లు మారాయి.. ఆ బ్యాంకులో ఏకంగా 9శాతం.. పూర్తి వివరాలు ఇవి..

ముఖ్యంగా స్టాక్‌లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి అస్థిరమైన పెట్టుబడి ఎంపికలతో పోలిస్తే.. ఇవి పెట్టుబడిదారులకు భద్రతను భరోసాను అందిస్తాయి. అయితే అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వడ్డీ రేటు ఒకేలా ఉండదు. ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉంటాయి. ఆగస్టులో పలు బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను సవరించాయి.

Fixed Deposit

fixed-deposit-2.jpg?w=1280

సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు మొదటి స్థానంలో ఉంటాయి. నిర్ణీత వ్యవధిలో హామీతో కూడిన రాబడిని ఇవి అందిస్తాయి. ముఖ్యంగా స్టాక్‌లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి అస్థిరమైన పెట్టుబడి ఎంపికలతో పోలిస్తే.. ఇవి పెట్టుబడిదారులకు భద్రతను భరోసాను అందిస్తాయి. అయితే అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వడ్డీ రేటు ఒకేలా ఉండదు. ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉంటాయి. ఆగస్టులో పలు బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను సవరించాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 333 రోజుల కాలవ్యవధికి 7.4% అందిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రేట్లు 60 ఏళ్లలోపు వారికి 3.5% నుండి 7.25% వరకు ఉంటాయి. ఫెడరల్ బ్యాంక్ రేట్లు 3% నుండి ప్రారంభమై 7.4% వరకు ఉంటాయి. కర్ణాటక బ్యాంక్ 7.25% వరకు ఆఫర్ చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్లు 3% నుండి 7.3% వరకు ఉంటాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 55 నెలల కాలానికి 7.4% రేటును అందిస్తుంది. ఈ నేపథ్యంలో 60 ఏళ్లలోపు వారికి పలు ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లపై ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్ల గురించి తెలుసుకుందాం..

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు..

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 8శాతం వడ్డీ 18 నెలల కాల వ్యవధితో కూడిన ఎఫ్డీపై అందిస్తుంది. కాగా మిగిలిన కాల వ్యవధులపై వడ్డీ రేట్లు ఇలా ఉంటాయి..

  • 1-సంవత్సరం పదవీకాలం: 7.25%
  • 3 సంవత్సరాల పదవీకాలం: 7.5%
  • 5 సంవత్సరాల పదవీకాలం: 7.25%

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 8.5% వడ్డీ 444 రోజుల కాల వ్యవధితో కూడిన ఎఫ్డీపై లభిస్తుంది. మిగిలిన కాల వ్యవధుల్లో వడ్డీ రేట్లు ఇలా ఉంటాయి.

  • 1-సంవత్సరం పదవీకాలం: 8.2%
  • 3 సంవత్సరాల పదవీకాలం: 8%
  • 5 సంవత్సరాల పదవీకాలం: 7.25%

ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 8.25% వడ్డీ రేటు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధి ఉన్న ఎఫ్డీపై అందిస్తోంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

  • 1-సంవత్సరం పదవీకాలం: 6%
  • 3 సంవత్సరాల పదవీకాలం: 6.75%
  • 5 సంవత్సరాల పదవీకాలం: 6.25%

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 8.25% వడ్డీ రేటు 365 రోజుల నుంచి 1095 రోజుల మధ్య కాల వ్యవధితో కూడిన ఎఫ్డీపై ఈ వడ్డీ రేటు ఉంటుంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

  • 1-సంవత్సరం పదవీకాలం: 8.25%
  • 3 సంవత్సరాల పదవీకాలం: 8.25%
  • 5 సంవత్సరాల పదవీకాలం: 7.25%

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 9% వడ్డీ రేటు 546 రోజుల నుంచి 1111 రోజుల మధ్య ఉన్న ఎఫ్డీపై అందిస్తోంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

  • 1-సంవత్సరం పదవీకాలం: 7%
  • 3 సంవత్సరాల పదవీకాలం: 9%
  • 5 సంవత్సరాల పదవీకాలం: 6.25%

ప్రైవేట్ రంగ బ్యాంకులు..

యాక్సిస్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 7.2% వడ్డీ రేటు 17 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ కాల వ్యవధితో కూడిన ఎఫ్డీపై అందిస్తోంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

  • 1-సంవత్సరం పదవీకాలం: 6.7%
  • 3 సంవత్సరాల పదవీకాలం: 7.1%
  • 5 సంవత్సరాల పదవీకాలం: 7%

బంధన్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 8% వడ్డీ రేటు 1 సంవత్సరం 9 నెలల ఎఫ్డీపై అందిస్తోంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

  • 1-సంవత్సరం పదవీకాలం: 7.25%
  • 3 సంవత్సరాల పదవీకాలం: 7.25%
  • 5 సంవత్సరాల పదవీకాలం: 5.85%

సిటీ యూనియన్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 7.25% వడ్డీ రేటు 400 రోజుల కాల వ్యవధితో కూడిన ఎఫ్డీపై లభిస్తోంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

  • 1-సంవత్సరం పదవీకాలం: 7%
  • 3 సంవత్సరాల పదవీకాలం: 6.5%
  • 5 సంవత్సరాల పదవీకాలం: 6.25%

సీఎస్బీ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 7.75% వడ్డీ రేటు 401 రోజుల ఎఫ్డీపై లభిస్తోంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

  • 1-సంవత్సరం పదవీకాలం: 5%
  • 3 సంవత్సరాల పదవీకాలం: 5.75%
  • 5 సంవత్సరాల పదవీకాలం: 5.75%

డీబీఎస్ బ్యాంక్.. ఈ బ్యాంక్ లో అత్యధికంగా 7.5% వడ్డీ రేటు 376 రోజుల నుంచి 540 రోజులు కాల వ్యవధికి అందిస్తోంది. మిగిలిన కాల వ్యవధులకు సంబంధించిన వడ్డీ రేట్లు ఇవి..

  • 1-సంవత్సరం పదవీకాలం: 7%
  • 3 సంవత్సరాల పదవీకాలం: 6.5%
  • 5 సంవత్సరాల పదవీకాలం: 6.5%

...

Complete article

  • 0
Posted

50% - 60% Discount on Electronic Gadgets!📱📷

 

  • 0
Posted

How to Claim Unclaimed Deposits from Banks? #unclaimedmoney #banks #shorts #short #kowshik_maridi

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...