Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 1

AMARAVATHI - People's Capital - An Official Telugu Documentary Film | The Untold AP Capital Story


TELUGU

Question

Recommended Posts

  • 0

What happened to Amaravati? Andhra’s capital city that’s become a ghost town

 

Link to comment
Share on other sites

  • 0

రాజధాని అయ్యే అర్హత దేనికి ఉంది | AP Elections | Amaravathi Vs Vizag | Telugu Facts | VR Raja Facts

 

Link to comment
Share on other sites

  • 0

I investigated India’s failed city of Rs 6,67,000 CRORES | Andhra Pradesh

 

Link to comment
Share on other sites

  • 0

Amaravati to be completed in 3 phases: మూడు ఫేజుల్లో కంప్లీట్.. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో ఎలాంటి మార్పులుండవ్: మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియేట్‌లో మంత్రి నారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసి… మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిగా బాధ్యతల స్వీకరించారు. గత అనుభవాలతో.. ఈసారి మరింత బాధ్యతగా, వేగంగా పని చేస్తానంటూ నారాయణ వెల్లడించారు.

narayana.jpg?w=1280

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియేట్‌లో మంత్రి నారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసి… మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిగా బాధ్యతల స్వీకరించారు. గత అనుభవాలతో.. ఈసారి మరింత బాధ్యతగా, వేగంగా పని చేస్తానంటూ నారాయణ వెల్లడించారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా.. తన పేషీ అధికారులతో పాటు.. టీడీపీ నాయకులు, రాజధాని రైతులు మంత్రి నారాయణకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో ఎటువంటి మార్పులు ఉండవన్నారు. రెండున్నరేళ్లలో అమరావతిలో మేజర్ వర్క్స్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఖచ్చితమైన టైం బౌండ్‌తో రాజధాని పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి.

రాష్ట్ర రాజధానిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు మంత్రి నారాయణ. చిన్న లిటిగేషన్ కూడా లేకుండా.. 34వేల ఎకరాలు సేకరిస్తే.. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. రైతుల కౌలు కూడా సరిగ్గా ఇవ్వలేదంటూ మంత్రి మండిపడ్డారు.

మూడు ఫేజుల్లో రాజధాని పనులు పూర్తి చేస్తామన్నారు. ఫేజ్-1లో సిటీ వర్క్స్ అన్నీ పూర్తవుతాయని చెప్పారు. ఫేజ్-2లో మెట్రో నిర్మాణం, రాజధాని కనెక్టివిటీ పనులు ఉంటాయని చెప్పారు. ఫస్ట్ ఫేజ్ పనులు రెండున్నరేళ్లలో పూర్తవుతాయని అంచనా వేస్తున్నామన్నారు నారాయణ.

అమరావతి మొత్తం 217చదరపు కిలోమీటర్లు అన్నారు మంత్రి నారాయణ. ఇందులో చిన్న పెద్ద కలిపి.. 3వేల 600 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటాయని చెప్పారు. రోడ్లతో పాటు.. అధికారుల నివాసాలు, సెక్రటేరియేట్ కోసం కట్టే 5 భవనాలు, అసెంబ్లీ రాజధాని నిర్మాణంలో మేజర్ పార్ట్స్ అన్నారు మంత్రి.

కాగా.. మంత్రి నారాయణ అమరావతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన ఛార్జ్ తీసుకోగానే రాజధానికి భూములు ఇచ్చిన రైతులంతా వచ్చి ఆయన్ను కలిసారు.

...

Complete article

Minister Narayana Press Meet - TV9

 

Link to comment
Share on other sites

  • 0

Amaravati to be completed in 2.5 years: అర్ధాంతరంగా ఆగిన రాజధాని మళ్లీ పునరుజ్జీవం.. రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామన్న నారాయణ

అర్ధాంతరంగా ఆగిన అమరావతిని..మళ్లీ పునరుజ్జీవం చేసే దిశగా అడుగులు వేస్తోంది..ఏపీ ప్రభుత్వం. పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పొంగూరు నారాయణ చేసిన వ్యాఖ్యలు.. ప్రజా రాజధానికి ఉత్సాహన్నిస్తున్నాయి. జస్ట్‌ రెండున్నరేళ్లలో అమరావతిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామంటూ.. ఆయన చేసిన కామెంట్స్‌ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

p-narayana-minister.jpg?w=1280

అర్ధాంతరంగా ఆగిన అమరావతిని..మళ్లీ పునరుజ్జీవం చేసే దిశగా అడుగులు వేస్తోంది..ఏపీ ప్రభుత్వం. పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పొంగూరు నారాయణ చేసిన వ్యాఖ్యలు.. ప్రజా రాజధానికి ఉత్సాహన్నిస్తున్నాయి. జస్ట్‌ రెండున్నరేళ్లలో అమరావతిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామంటూ.. ఆయన చేసిన కామెంట్స్‌ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అఖండ మెజార్టీతో ఏపీలో అధికారం దక్కించుకున్న ఎన్డీఏ కూటమి… తొలి ప్రాధాన్యతగా రాజధాని అమరావతిపై ఫోకస్‌ పెట్టింది. గతంలోనే మొదలై.. ప్రభుత్వం మారడంతో అర్ధాంతరంగా నిలిచిపోయిన ప్రజా రాజధానికి పనులకు శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే సీఆర్డీఏ అధికారులను అలర్ట్‌ చేసింది.

పురపాలక శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొంగూరు నారాయణ .. తనపని మొదలెట్టేశారు. రాజధాని అమరావతి పనులు వేగవంతం చేయడమే.. మొదటి ప్రాధాన్యతగా తమశాఖ పనిచేస్తుందని స్పష్టం చేశారు. రెండున్నరేళ్లలో అమరావతిలో కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే రాజధాని అభివృద్ధిని ముందుకు సాగుతుందని తెలిపారు.

2014-19 మధ్య పురపాలిక మంత్రిగా పనిచేసిన నారాయణకు.. ఇప్పుడు మరోసారి అదేశాఖ దక్కడం విశేషం. అంతేకాదు, గతంలో ఆయన విధులు నిర్వర్తించిన చాంబర్‌లోనే మరోసారి బాధ్యతలు చేపట్టిన నారాయణ… ప్రపంచ టాప్‌5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. మూడు దశల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందన్న నారాయణ.. తొలి విడత 48 వేలకోట్లు ఖర్చు అవుతుందన్నారు. మూడు దశలకు కలిపి లక్ష కోట్ల వరకు ఖర్చు అంచనా వేశామన్నారు.

ఫలితాలు రావడంతోనే.. రాజధాని ప్రాంతంలో.. అభివృద్ధిపనులకు బీజం పడింది. జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు మొదలెట్టిన సీఆర్డీఏ … తదిదశలో ఉన్న నిర్మాణాలను.. వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తాజాగా, మంత్రి నారాయణ బాధ్యతలు స్వీకరించడంతో.. క్యాపిటల్‌లో డెవలప్‌మెంట్‌ మరింత స్పీడందుకుంటుందనే చర్చ జోరుగా సాగుతోంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు | Amaravathi Capital City - TV9

 

Link to comment
Share on other sites

  • 0

అమరావతి master Plan ఇదే | అమరావతి పూర్తి అయితే World Class సిటీనే | Amaravati Capital Updates

 

Link to comment
Share on other sites

  • 0

Amaravati: అనుకున్న విధంగానే ఏపీ రాజధాని.. అమరావతిపై శ్వేతపత్రాన్ని రిలీజ్‌ చేసిన సీఎం చంద్రబాబు

అనుకున్న విధంగానే ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత ఐదేళ్లుగా అమరావతికి జరిగిన నష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రస్తుతం అమరావతి ఎలాంటి పరిస్థితిలో ఉందో వివరించారు. మళ్లీ అమరావతిని రాజధాని చేస్తామని అనుకోలేదన్నారు.

CM Chandrababu On Amaravati

cm-chandrababu-on-amaravati.jpg?w=1280

అనుకున్న విధంగానే ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత ఐదేళ్లుగా అమరావతికి జరిగిన నష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రస్తుతం అమరావతి ఎలాంటి పరిస్థితిలో ఉందో వివరించారు. మళ్లీ అమరావతిని రాజధాని చేస్తామని అనుకోలేదన్నారు. తమ కష్టాన్ని నాశనం చేశారన్న బాబు ఇది జాతికి జరిగిన ద్రోహంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ధ్వంసమైన ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో అమరావతిపై శ్వేతపత్రాన్ని రిలీజ్‌ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన చంద్రబాబు, వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఇవాళ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత ప్రభుత్వం అమరావతిని పట్టించుకోలేదని, ఫలితంగా ఎంతో నష్టం జరిగిందని చంద్రబాబు వివరించారు. పదేళ్లు అయినా రాష్ట్రానికి రాజధాని లేకపోవడం విచారకరమన్నారు. 2014-19 మధ్య తమ హయాంలో 9వేల కోట్లతో చేపట్టిన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయని వీడియోని ప్రదర్శిస్తూ వివరించారు. తాము పడిన కష్టాన్నంతా వైసీపీ ప్రభుత్వం వృథా చేసిందన్న చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

అమరావతి చరిత్ర సృష్టించే నగరమని సీఎం చంద్రబాబు చెప్పారు. శాతవాహనుల కాలంలోనే అమరావతి కేంద్రంగా పాలన జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా సమ దూరం ఉన్న ఏకైక ప్రాంతం అమరావతి అన్నారు. అందుకే దీన్ని రాజధానిగా నిర్ణయించామన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా రాజధానిగా అమరావతిని వ్యతిరేకించరన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాది కూడా అమరావతిని అంగీకరిస్తారని చెప్పారు. తాను చేపట్టిన ఏ ప్రాజెక్టు అయినా విన్‌-విన్‌ పద్ధతిలోనే ముందుకు వెళ్లామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన వారు కూడా సంతోషంగా ఉండాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. అమరావతిలోనూ అదే విధంగా ల్యాండ్‌ పూలింగ్‌ నిర్వహించామన్నారు. ప్రపంచలోనే అతిపెద్ద ల్యాండ్‌ పూలింగ్‌ అమరావతిదే అన్నారు. వరల్డ్‌ బ్యాంక్‌ దీనిని ఓ కేస్‌ స్టడీగా చూపిందని గుర్తు చేశారు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్‌ విధ్వంసం సృష్టించారని చంద్రబాబు విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని ఆయన ఆవేదన చెందారు. జగన్‌ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్‌ క్లాస్‌ క్యాపిటల్‌గా మారాల్సిన అమరావతి ఇప్పుడు దెబ్బతినిందన్న ఆయన.. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు.

ఇటీవల స్వర్గస్తులైన రామోజీరావు కూడా ఎంతో రీసెర్చ్‌ చేసి తనకు అమరావతి పేరును సూచించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. దీనికి కేబినెట్‌ నుంచి ప్రజల దాకా అందరి ఆమోదం లభించిందన్నారు. శంకుస్థాపన సమయంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నీరు, మట్టిని, దేశంలోని ప్రతి పుణ్యక్షేత్రం నుంచి నీరు, మట్టిని తీసుకొచ్చామన్నారు. ప్రధాని మోదీ సాక్షిగా యుమునా నీటిని, మట్టిని తెచ్చారని చెప్పారు. అమరావతికి ఫౌండేషన్‌ వేసింది ప్రధాని మోదీ అని, రాజధానికి సహకరిస్తామని అప్పుడు ఆయన మాట కూడా ఇచ్చారని చెబుతూ అమరావతికి పార్లమెంట్‌ సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్టు తెలిపారు.

రాజధాని నిర్మాణానికి బ్యాంకులు ముందుకు వచ్చాయని, సింగపూర్‌ దేశం మాస్టర్‌ ప్లాన్‌ ఇచ్చిందని, ఆ దేశంతో ఎంవోయూ కూడా కుదుర్చుకున్న సంగతి బాబు చెప్పారు. సీడ్‌ క్యాపిటల్‌ ఏరియాతో పూర్తి వివరాలతో మాస్టర్‌ ప్లాన్‌ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. మొత్తం 9 నగరాలను అమరావతిలో ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి తాను సీఎంగా ఉన్నప్పుడు సైబరాబాద్‌ను నిర్మించానని, తొమ్మిదేళ్లలో సైబరాబాద్‌కు ఒక ఎకో సిస్టమ్‌ను తయారు చేశానని చెప్పుకొచ్చారు. హైటెక్‌ సిటీని డెవలప్‌ చేయటానికి 14 రోజుల పాటు అమెరికాలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లాగానే అమరావతిని కూడా వరల్డ్‌ క్లాస్‌ సిటీగా మారుస్తానని ధృడంగా చెప్పారు.

వైసీపీ పాలనలో అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ బాగా దెబ్బతిన్నదని, భవిష్యత్‌పై నమ్మకం ఏంటని ప్రశ్నలు ఎదురవుతున్నాయని చెప్పిన చంద్రబాబు అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచడంపై దృష్టి పెడతామన్నారు. రాధాని నిర్మాణంతో ఆదాయం పెరుగుతుందని, కృష్ణా, గోదావరి నదుల వల్ల అమరావతికి నీటి కష్టాలుండవని చెప్పారు.

...

Complete article

LIVE | అమరావతి పై ఏపీ సర్కార్ శ్వేతపత్రం | CM Chandrababu Release White Paper on Amaravati - TV9

 

Link to comment
Share on other sites

  • 0

PPTs again LOL. Inka "I built Hyderabad" ane antunnadu.

How is Amaravati going to help poor people living in other parts of the state? It will only fill  the pockets of politicians. "Amaravati will bring us unimaginable returns" annadu kada CBN?.

APలో ఫోన్ ఆడియో కలకలం | Phone Call Audio Leaked In AP - TV9

Em cheskuntaru aa capital katti? Caste feelings will be in peaks forever. It can never be even 1% of Hyderabad is even after 100 years. Go to Vijayawada or Guntur to rent a place and they will first ask you on your face, "What is your caste??"

Building world class capitals will not change "people", their caste fanaticism or factionalism. This speaks volumes about TG vs AP and how backward/uncivilized AP is

 

Link to comment
Share on other sites

  • 0

Even if TDP cancels ALL the Super Six schemes, they still have to borrow all the money to build Amaravati.. No answers from CBN for when Polavaram will be built or when Amaravati will be finished.

AP, A = Amaravati, P = Polavaram

A = Appulu, P = proclain

A = attacks, Cycle = bulldozer

ఒక అమరావతి - వంద అబద్ధాలు | Big Question Debate On Chandrababu White Paper On Amaravati | @SakshiTV

 

  • Haha 1
Link to comment
Share on other sites

  • 0

అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం అరాచకాలు

‘‘ఏ’’ అంటే.. అమరావతి అని వక్కాణిస్తున్న సీఎం చంద్రబాబు.. రాజధాని ముసుగులో తన అవినీతి, అరాచకాలకు కేంద్రంగా చేసుకున్నారు! బరితెగించి తాను పాల్పడిన అవినీతికి అక్షయపాత్రలా మార్చారు! నాటి తెల్ల దొరలే తెల్లబోయేలా వ్యవహరించారు! బ్రిటిష్పాలకుల సామ్రాజ్యవాద దోపిడీని మరిపిస్తూ టీడీపీ పెద్దలు సాగించిన భూ దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం అమరావతి... బడుగులు, పేదలకు స్థానం లేకుండా చంద్రబాబు సృష్టించుకున్న నయా జమిందారీ వ్యవస్థకు నిదర్శనం అమరావతి! పచ్చ రాబందులు గుప్పిట పట్టిన రూ.లక్షల కోట్ల విలువైన భూ ఖజానా అమరావతి! దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ దోపిడీకి మౌనసాక్షి అమరావతి!! ఈ భూ బాగోతాలు, తన నిర్వాకాలను కప్పిపుచ్చి మభ్యపెట్టేందుకే తాజాగా అమరావతిపై శ్వేతపత్రం అంటూ మరో డ్రామాకు చంద్రబాబు తెర తీశారు.

cbn_3.jpg.webp?itok=CZ_itvrX

మోయలేని భారం మోపుతూ...

రాజధానిగా అమరావతి ఎంపిక చేసిన ప్రాంతం ఇటు విజయవాడ కాదు.. అటు గుంటూరూ కాదు. మూడు పంటలు పండే సారవంతమైన పంట పొలాల్లో నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతుందని చంద్రబాబు అండ్ కో కట్టిన లెక్కలే చెబుతున్నాయి. ఒక్క ఎకరాలో కనీస మౌలిక వసతుల కల్పనకు (బేసిక్ ఇన్ఫ్రా స్ట్రక్చర్) రూ.2 కోట్లు వ్యయం అవుతుందని, మొత్తం రాజధాని ప్రాంతం అభివృద్ధి చేయడానికి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చువుతుందని అప్పట్లోనే అంచనా వేశారు.

ఏటా ఆ వ్యయం పెరగడమే కానీ  తగ్గదు. విభజన అనంతరం రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత భారీగా  నిధులు ఖర్చు చేయడం సాధ్యమయ్యే పని కాదని నిపుణులు చేసిన హెచ్చరికలను చంద్రబాబు పట్టించుకోలేదు. తాజాగా భారీగా నిధులు అవసరమంటూనే.. వివరాలు సేకరిస్తామని చెబుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన మూడు వారాల్లోనే రూ.7 వేల కోట్లు అప్పు చేసిన టీడీపీ ప్రభుత్వం.. సంపదను ఎలా సృష్టించి రాజధాని నిర్మాణం చేస్తుందనే ప్రశ్నకు జవాబు లేదు.

భూములు లాక్కుని గాలి మేడలు..!

అమరావతి వేదికగా చంద్రబాబు సాగించిన భూ దందాను అప్పట్లోనే నిపుణుల నుంచి సామాన్యుల వరకూ అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. ఏడాదికి మూడు పంటలు పండే భూములను నాశనం చేయవద్దని పర్యావరణవేత్తలు అభ్యంతరం చెప్పారు. జీవనాధారమైన తమ భూములను కొల్లగొట్టవద్దని బడుగు, బలహీనవర్గాలు, పేద రైతులు వేడుకున్నారు. వారి విన్నపాలను బేఖాతర్ చేస్తూ చంద్రబాబు భారీ భూదోపిడీకి తెరతీశారు. అసైన్డ్ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకుని పరిహారం ప్రకటించుకున్నారు.

2014–19 మధ్య రాజధాని పేరిట అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం చేయని దురాగతం లేదు. అదిగో రాజధాని.. అల్లదిగో అమరావతి..! అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. అంతకుముందు పక్కా పన్నాగంతో రాజధాని అక్కడ.. ఇక్కడ అంటూ పలు ప్రాంతాల పేర్లను తెరపైకి తెచ్చి సామాన్యులను బురిడీ కొట్టించారు. మరోవైపు ముందస్తుగా తాము భూముల కొనుగోలు చేసిన అమరావతిలో బినామీ మాఫియాను వ్యవస్థీకృతం చేశారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని.. ఆకాశ హరŠామ్యల నగరం అంటూ గాలిలో మేడలు కట్టి రైతుల కాళ్ల కిందున్న భూమిని కాజేశారు.

పచ్చ దండు దురాక్రమణ..

దేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద భూ దోపిడీకి చంద్రబాబు బరి తెగించారు. రాజధాని ప్రచారంతో మాయాజాలం... భూసమీకరణ ముసుగులో దోపిడీ... అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, లంక భూముల స్వాహా... ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి మలుపులు... అస్మదీయులకు యథేచ్ఛగా భూ పందేరాలు... ఇలా ఒకటేమిటి ఎన్ని రకాలుగా భూదోపిడీకి పాల్పడవచ్చో అన్ని విద్యలూ ప్రయోగించారు. అమరావతిపై చంద్రబాబు ‘పచ్చ దండు’ దండయ్రాత చేసి రూ.లక్షల కోట్ల విలువైన భూముల దురాక్రమణకు పాల్పడింది. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై వాలిపోయారు.

చంద్రబాబు, లోకేశ్ తోపాటు నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగుంట మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివప్రసాద్  కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ  రామారావు.. ఇలా పచ్చ దండు అంతా అమరావతిలో భూములను కొల్లగొట్టింది. అన్యాయంగా, ఏకపక్షంగా విభజనకు గురై కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆదిలోనే హంసపాదులా అభివృద్ధికి గండి కొట్టారు. తాత్కాలిక రాజధాని భవనాల పేరుతో కనికట్టు చేశారు.

మభ్యపుచ్చే యత్నాలు..

నాడు ఐదేళ్లలో భూముల దోపిడీకి పాల్పడటం మినహా టీడీపీ పెద్దలు రాజధాని కట్టిందీ లేదు.. అభివృద్ధి చేసిందీ లేదు. చంద్రబాబు బృందం  సాగించిన భూ దోపిడీ ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో పూర్తి ఆధారాలతోసహా బట్టబయలైంది. సీఐడీ న్యాయస్థానాల్లో చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. ఇక న్యాయ విచారణ ప్రక్రియ కొనసాగితే చంద్రబాబుకు యావజ్జీవ ఖైదు ఖాయమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి రాగానే చంద్రబాబు సరికొత్త కుట్రలకు పన్నాగం పన్నుతున్నారు.

అమరావతిలో తన భూ బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు శ్వేతపత్రం పేరుతో డ్రామాకు తెరతీశారు. రాజధాని నిర్మాణానికి తాను ఏం చేస్తానో చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసంతో ఊదరగొట్టారు. రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. కానీ అమరావతి పేరిట చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన దోపిడీ దాచేస్తే దాగేది కాదు. ఇప్పటికే పూర్తి ఆధారాలతో సహా చార్జిషీట్ల రూపంలో నిక్షిప్తమైందన్నది నిఖార్సైన నిజం.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
On 7/3/2024 at 10:46 AM, Vijay said:

Even if TDP cancels ALL the Super Six schemes, they still have to borrow all the money to build Amaravati.. No answers from CBN for when Polavaram will be built or when Amaravati will be finished.

AP, A = Amaravati, P = Polavaram

A = Appulu, P = proclain

A = attacks, Cycle = bulldozer

ఒక అమరావతి - వంద అబద్ధాలు | Big Question Debate On Chandrababu White Paper On Amaravati | @SakshiTV

 

party symbol from cycle to bulldozer change cheskunte saripotundi kada?

 

Link to comment
Share on other sites

  • 0
On 7/3/2024 at 10:41 AM, Vijay said:

Em cheskuntaru aa capital katti? Caste feelings will be in peaks forever. It can never be even 1% of Hyderabad is even after 100 years. Go to Vijayawada or Guntur to rent a place and they will first ask you on your face, "What is your caste??"

Building world class capitals will not change "people", their caste fanaticism or factionalism. This speaks volumes about TG vs AP and how backward/uncivilized AP is

 

agree with casteism and factionalism. recent elections in tg and ap were proof where tg election went peacefully without any incidents while election/post-election violence and revenge incidents in ap are like violence in a boyapati movie X 100 times. if they don't come out of these illiterate/savage cultures, how can they expect to compete with the rest of the world?? amaravati is not going to change anything as long as "people" don't change. it should all be merit/performance based and not based on who has power. it is a narrow-minded civilization whereas competing with the rest of the world needs open/broad-mindedness as a prerequisite in the first place. they should start with stopping to think life is a cheap telugu masala movie. it doesn't hurt to learn from tg people.

Link to comment
Share on other sites

  • 0

AUDIO LEAK

Scent Kampu

Local poor people are not qualified to live near Amaravati

నారా పాలన కాదు Sir నరకాసుడి పాలన...

No money for welfare schemes but 1000s of crores for Amaravati!!

బంగ్లా దేశ్ లాగ తరిమి తరిమి కొడతారు.

బంగ్లాదేశ్ ఎలా గైతే.. ప్రభుత్వం కూలిందో అలా ఇక్కడ కోల్చండి sir అక్కడ పరిస్థితి మనకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం కూల్చడానికి అన్ని అర్హతలు ఉన్నాయి ప్రజలకు... గెలుపే ఒక EVM కుట్ర.. పాలన అరాచకం.. పేదలకు నిద్ర లేదు..Govt పిల్లలకు చదువులేదు.. ఆడ పిల్లలకు రక్షణ లేదు. కేవలం 30 లక్షల అమ్మ కబ్జా రావతి స్కాం భూముల కోసం .. రాష్ట్రాన్నే నాశనం చేస్తున్నారు.. ఇలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం Sir. వీళ్లకు పరిపాలన చేసే అర్హత లేదు ... అని చాలా మంది అనుకుంటున్నారు Sir. మరి నిజం ఆ దేవుడికే తెలియాలి.

Debate over Chandrababu Orders on Amaravati R5 Zone Poor Families | Big Question |‪@SakshiTV‬

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...