Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Recommended Posts

Posted

USA లో Job వదిలేసి, Hyderabad లో 250 Crores Turnover | Telugu Business Podcast | Raw Talks with VK

 

  • 3 weeks later...
Posted

Donkey milk business: గాడిద పాలా మాజాకా.. లీటర్ రూ. 5 వేలు పలుకుతున్న ధర!

నెలకు రూ. 3 లక్షలు సంపాదిస్తున్న గుజరాత్ పాల వ్యాపారి

గాడిద పాలను పొడిగా మార్చి కిలో ఏకంగా రూ. లక్షకు అమ్ముతున్న వైనం

కర్ణాటక, కేరళకు సరఫరా.. కాస్మెటిక్ కంపెనీలకు కూడా విక్రయం

cr-20240422tn6625e61cc9a5f.jpg

‘గంగిపోవు పాలు గరిటెడైనను చాలు.. కడివిడెడైననేమి ఖరము పాలు’ అంటూ యోగి వేమన అప్పట్లో చమత్కరించాడు. అయితే, కాలం మారింది. ఇప్పుడీ సూక్తి వర్తించదు.. అందుకే, ఇప్పుడు 'ఖరము (గాడిద) పాలు గరిటెడైన చాలు..' అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆవు పాలకంటే గాడిద పాలు దాదాపు 70 రెట్లు ఎక్కువ ధర పలుకుతున్నాయి మరి! గుజరాత్ లోని పటాన్ జిల్లాకు చెందిన ధీరేన్ సోలంకి అనే పాల వ్యాపారి గాడిదల డెయిరీ ఫాం నడుపుతూ నెలకు రూ. 3 లక్షలు సంపాదిస్తున్నాడు.  లీటర్ పాలను ఏకంగా రూ. 5 వేలకు అమ్ముతున్నాడు!

ఉద్యోగం మానేసి వ్యాపారం మొదలుపెట్టి..
ధీరేన్ సోలంకి తొలుత చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. కానీ చాలీచాలని జీతం ఇంటి అవసరాలకు చాలకపోవడంతో 8 నెలల కిందట గాడిదల పెంపకం వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. రూ. 22 లక్షల పెట్టుబడితో 20 గాడిదలను కొని డెయిరీ ఫాం ప్రారంభించాడు.

సవాళ్లు ఎదురైనా నిలబడి..
అయితే రోజూ గాడిద పాలు సేకరిస్తున్నా పెద్దగా అమ్ముడుపోయేవి కాదు. గుజరాత్ మొత్తం గాలించినా కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. కానీ దక్షిణాదిలో గాడిద పాలకు డిమాండ్ ఉందన్న విషయాన్ని గుర్తించిన ధీరేన్ సోలంకి.. గాడిద పాలను కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాడు. కొన్ని కాస్మెటిక్ కంపెనీలకు కూడా గాడిద పాలు అమ్ముతున్నాడు. పాలు తాజాగా ఉండేందుకు వాటిని ఫ్రీజర్లలో భద్రపరుస్తున్నాడు. అలాగే గాడిద పాలను పొడిగా మార్చి కేజీ పాలపొడిని ఏకంగా రూ. లక్షకు విక్రయిస్తున్నాడు.

ఈ కామర్స్ సాయంతో  ముందడుగు
గాడిద పాలను దేశవ్యాప్తంగా విక్రయించేందుకు ధీరేన్ సోలంకి ఆన్ లైన్ బాటపట్టాడు. సొంతంగా ఆన్ లైన్ ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకొని గాడిద పాలను అధిక రేట్లకు అమ్ముతున్నాడు. ప్రస్తుతం లీటరు ఆవు పాల కనీస ధర రూ. 65 ఉండగా లీటరు గాడిద పాలు ఏకంగా రూ. 5,000 పలుకుతున్నాయి. నెలకు సుమారు రూ. 3 లక్షలు ఆర్జిస్తున్నాడు. లాభాలు బాగుండటంతో రూ. 38 లక్షలుపెట్టి డెయిరీ ఫాంను విస్తరించాడు. ప్రస్తుతం 42 గాడిదలు డెయిరీ ఫాంలో ఉన్నాయి.

లాభాలెన్నో..
ఆవు, గేదె పాలతో పోలిస్తే గాడిద పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గాడిద పాలలో ఔషధ గుణాలు ఉండటమే అందుకు కారణం. ఇవి తల్లి పాలను పోలి ఉంటాయి. అలాగే ఆవు పాలంటే ఎలర్జీ ఉండే శిశువులకు గాడిద పాలు సరైన ప్రత్యామ్నాయం. పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధికి, ఇమ్యూనిటీ పెరుగుదలకు దోహదపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో డయాబెటీస్ నిరోధక లక్షణాలు కూడా పుష్కలంగా వున్నాయట.

...

Complete article

  • 5 weeks later...
Posted

Home-based business: Pickles ఇంట్లోనే Pickle వ్యాపారం.. భారీగా ఆదాయం. ఈ బిజినెస్‌తో తిరుగే ఉండదు..

పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించేందుకు తక్కువ పెట్టుబడి ఉంటే సరిపోతుంది. అలాగే ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి స్థలం అవసరం ఉండదు. ఒక చిన్న గదిలోనే పచ్చళ్ల తయారీని ప్రారంభించవచ్చు. ముఖ్యంగా సమ్మర్‌లో ఈ వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఇక పచ్చళ్లు అంటే కేవలం అవకాయ మాత్రమే కాకుండా. కూరగాయలతో పాటు నాన్‌ వెజ్‌ పచ్చళ్లు కూడా చేయొచ్చు...

business-idea-1.gif?w=1280

మార్కెట్ అవసరాలకు అనుగుణంగా చేసే వ్యాపారాలు ఎప్పుడూ నష్టం ఉండవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వ్యాపారం చేయాలనుకునే వారు మొదటగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఇదే. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న వ్యాపారాన్ని ఎంచుకొని, కష్టపడి పనిచేస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. అలాంటి ఓ బెస్ట్‌ వ్యాపారాల్లో ఒకటి పచ్చళ్ల తయారీ. ఈ వ్యాపారం ద్వారా నష్టాలు లేకుండా భారీగా లాభాలు పొందొచ్చు. ఇంతకీ పచ్చళ్ల వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఎంత పెట్టుబడి కావాలి.? ఎలాంటి లాభాలు ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించేందుకు తక్కువ పెట్టుబడి ఉంటే సరిపోతుంది. అలాగే ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి స్థలం అవసరం ఉండదు. ఒక చిన్న గదిలోనే పచ్చళ్ల తయారీని ప్రారంభించవచ్చు. ముఖ్యంగా సమ్మర్‌లో ఈ వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఇక పచ్చళ్లు అంటే కేవలం అవకాయ మాత్రమే కాకుండా. కూరగాయలతో పాటు నాన్‌ వెజ్‌ పచ్చళ్లు కూడా చేయొచ్చు. వీటికి ప్రస్తుతం మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. ఎందరో మహిళలు గ్రూప్‌లుగా ఏర్పడి పచ్చళ్ల వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇక పచ్చళ్లను ఆన్‌లైన్‌లోనే కాకుండా ఒక స్టోర్‌ ఓపెన్‌ చేసి ఆఫ్‌లైన్‌ విధానంలో కూడా విక్రయించవచ్చు.

ఇక పెట్టుబడి విషయానికొస్తే పచ్చళ్ల వ్యాపారాన్ని రూ. 15వేల ప్రాథమిక పెట్టుబడితో ప్రారంభించవచ్చు. పచ్చళ్లను చిన్న చిన్న ప్యాకెట్లుగా మీ సొంత బ్రాండింగ్‌తో విక్రయించొచ్చు. దీంతో భారీగా లాభాలు ఆర్జించవచ్చు. పచ్చళ్ల వ్యాపారం ద్వారా తక్కువలో తక్కువ నెలకు రూ. 20 నుంచి రూ. 30 వేల వరకు ఆర్జించవచ్చు. ఇక వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో పచ్చళ్ల ప్యాకెట్లను ఆటోమెటిక్‌గా ప్యాక్‌ చేసే మిషన్స్‌ను కొనుగోలుచేసుకోవచ్చు. వీటి ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రొడక్షన్‌ వస్తుంది. దీంతో భారీగా లాభాలు ఆర్జించవచ్చు.

ఈ మధ్య కాలంలో విదేశాలకు పచ్చళ్లను పంపించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకోసం మీరు కొరియర్‌ సర్వీసులో ఒప్పందం చేసుకొని కూడా భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ముఖ్యంగా తెలుగు వాళ్లు విదేశాలకు ఎక్కువగా వెళ్తున్న తరుణంలో పచ్చళ్ల వ్యాపారరం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు సాగుతోంది.

...

Complete article

  • 1 month later...
Posted

Business Idea: Saree Ironing పట్నం నుంచి పల్లె వరకు.. ఎక్కడైనా ఈ బిజినెస్‌కు తిరుగే ఉండదు. భారీగా ఆదాయం..

వ్యాపారం చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అయితే పెట్టుబడికి భయపడో, లాభాలు వస్తాయో రావో కారణంతో చాలా మంది ఆ ఆలోచనను విరమించుకుంటారు. గిరాకీ ఉంటుందో, ఉండదో అన్న కారణంతో కూడా అటువైపు చూడరు. అయితే కొన్ని రకాల బిజినెస్‌లకు అసలు నష్టం అనేదే ఉండదు. నిత్యం డిమాండ్ ఉంటుంది. అలాంటి ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

business-idea.jpg?w=1280

వ్యాపారం చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అయితే పెట్టుబడికి భయపడో, లాభాలు వస్తాయో రావో కారణంతో చాలా మంది ఆ ఆలోచనను విరమించుకుంటారు. గిరాకీ ఉంటుందో, ఉండదో అన్న కారణంతో కూడా అటువైపు చూడరు. అయితే కొన్ని రకాల బిజినెస్‌లకు అసలు నష్టం అనేదే ఉండదు. నిత్యం డిమాండ్ ఉంటుంది. అలాంటి ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చీరాల ఐరెన్‌ ప్రస్తుతం డ్రెండీ బిజినెస్‌లో ఒకటి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రతీ చోటా శారీ ఐరెన్‌ చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని మీరు బిజినెస్‌ ఐడియాగా మార్చుకుంటే మీకు తిరుగే ఉండదు. సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ డిమాండ్‌ ఉండే బిజినెస్‌ ఇది. సాధారణంగా చొక్కాలు, ప్యాంట్స్‌ను చిన్న ఐరన్‌ మిషన్‌తో చేస్తారు. కానీ చీరలు ఐరెన్ చేయాలంటే పెద్ద మిషిన్స్‌ అవసరపడతాయి.

శారీ ఐరన్‌ బిజినెస్‌ను ప్రారంభించాలంటే ఐరన్ మిషన్‌ ఉండాలి. ఇందులో ఫుల్‌ ఆటోమెటిక్‌, సెమీ ఆటోమెటిక్‌ మిషన్స్‌ ఉంటాయి. ఒక్క రోజులో సుమారుగా ఈ మిషన్‌ ద్వారా 150 నుంచి 200 వరకు ఐరన్‌ చేయొచ్చు. ఒక్కసారి ఐరెన్‌కు తక్కువలో తక్కు రూ. 100 చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఒక్క రోజులో 50 చీరలు ఐరెన్ చేసినా రోజుకు రూ. వెయ్యి సంపాదించుకోవచ్చు. ఈ లెక్కన నెలకు రూ. 30 వేల ఆదాయం పొందొచ్చు.

ఇలాంటి బిజినెస్‌ ఐడియాలకు సంబంధించి యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. ఈ మిషిన్స్‌ ఆపరేటింగ్‌ కూడా చాలా సులభంగా ఉంటుంది. ఈ మిషన్స్‌ ధర రూ. 2 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇక ఈ బిజినెస్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ఒక చిన్న గది ఉంటే సరిపోతుంది. అలాగే కరెంట్ ఛార్జీలు భరించాల్సి ఉంటుంది. ఇక మీ సంస్థకు సంబంధించి బ్రాండింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

  • The title was changed to Business ideas
  • 1 month later...
Posted

SBI ATM: ఎస్‌బీఐ బిజినెస్‌ ఐడియా.. నెలకు రూ.70 వేల ఆదాయం

ప్రతి వ్యక్తికి ఆదాయం ప్రాథమిక అవసరం. ఆదాయం తక్కువగా ఉన్నా లేకున్నా నిధుల కొరత ఏర్పడుతుంది. ఇది తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. అందుకే స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం మంచిది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండాలంటే, స్థిరమైన ఆదాయానికి మంచి కెరీర్ అవసరం. ఇంటి నుంచే సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఎస్‌బీఐ చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. అంటే SBI ATM ఫ్రాంచైజీని అందిస్తుంది. ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజీని ఏర్పాటు చేసుకున్న వ్యక్తికి నెలకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

sbi.jpg?w=1280

ఎస్‌బీఐ ఏటీఎం ఏర్పాటు చేసుకునేందుకు మీకు అరుదైన అవకాశం:

బ్యాంకులు సాధారణంగా ATMలను ఏర్పాటు చేయవు. వారి కోసం ప్రత్యేక సంస్థలు పనిచేస్తున్నాయి. అలాంటి కంపెనీలతో బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏటీఎం ఫ్రాంచైజీలను బ్యాంకులతో ఇటువంటి ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఏర్పాటు చేస్తాయి. ఈ దశలో వ్యక్తులకు SBI ATM ఫ్రాంచైజీని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వబడుతుంది. అందుకే ఎస్‌బీఐ ఏటీఎం ఫ్రాంచైజీని సెటప్ చేయాలనుకునే వ్యక్తులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఏటీఎం ఫ్రాంచైజీని సెటప్ చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏటీఎం ఫ్రాంచైజీని సెటప్ చేయడానికి ముఖ్యమైన నియమాలు:

  • ATM ఫ్రాంచైజీని ఏర్పాటు చేసుకోవడానికి కనీసం 50 నుండి 80 చదరపు అడుగుల స్థలం అవసరం.
  • మీరు ఏర్పాటు చేయబోయే ఏటీఎం ఇప్పటికే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఏటీఎం నుండి 100 మీటర్ల దూరంలో ఉండాలి.
  • మీరు ఏటీఎంను ఏర్పాటు చేయబోయే ప్రదేశం సులభంగా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రదేశంలో ఉండాలి.
  • 24 గంటల విద్యుత్ సౌకర్యం అవసరం.
  • మీరు ATMని సెటప్ చేసిన తర్వాత, అది రోజుకు కనీసం 300 లావాదేవీలు కావడం తప్పనిసరి అని గమనించండి.
  • మీకు పైన పేర్కొన్న అర్హతలు ఉంటే, మీరు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి ఏటీఎం ఫ్రాంచైజీని సెటప్ చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

...

Complete article

  • 1 month later...
Posted

Business Idea: Silkworm business makes Rs.1 lakh per month - ఈ బిజినెస్‌ పెట్టు.. లాభాలు ‘పట్టు’. నెలకు లక్ష పక్కా..

పట్టు వస్త్రాలకు భారత్‌లో ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకీ పట్టు వ్యాపారం విస్తరిస్తోంది. ఈ పట్టు తయారీని వ్యాపారంగా మార్చుకుంటే తక్కువ సమయంలోనే లక్షల్లో ఆదాయం పొందొచ్చు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి పొందే పట్టుపురుగల పెంపకానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Business Idea: ఈ బిజినెస్‌ పెట్టు.. లాభాలు 'పట్టు'. నెలకు లక్ష పక్కా..

తాము సంపాదిస్తూ.. మరో నలుగురికి ఉపాధి కల్పించాలి. ఇప్పుడు చాలా మంది యువతలో ఇలాంటి ఆలోచన పెరుగుతోంది. అందుకే చదువు పూర్తికాగానే వినూత్నంగా ఆలోచిస్తూ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. రకరకాల మార్గాలను అన్వేషిస్తూ వ్యాపారంలో రాణిస్తున్నారు. మీరు కూడా ఇదే ఈ ఆలోచనతో ఉన్నారా.? అయితే మీకోసమే ఈ బిజినెస్ ఐడియా..

పట్టు వస్త్రాలకు భారత్‌లో ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకీ పట్టు వ్యాపారం విస్తరిస్తోంది. ఈ పట్టు తయారీని వ్యాపారంగా మార్చుకుంటే తక్కువ సమయంలోనే లక్షల్లో ఆదాయం పొందొచ్చు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి పొందే పట్టుపురుగల పెంపకానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీకు కచ్చితంగా కొంత వ్యవసాయం స్థలంతో పాటు ఒక షెడ్డు ఉండాలి. పట్టు పురుగులకు ఆహారంగా అందించడానికి మల్బారీ మొక్కలను పెంచాలి. ప్రభుత్వాలు ఈ మల్బారీ మొక్కలను సబ్సిడీ కింద అందజేస్తున్నాయి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ముందుగా వ్యవసాయ భూమిలో మల్బారీ తోటను పెంచాలి. అలాగే షెడ్డు నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏకంగా 75 శాతం సబ్సిడీ అందిస్తాయి. మిగిలిన 25 శాతం మాత్రం మన పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.

ఇక పట్టుపురుగుల పెంపకం కోసం ట్రేలుచ చంద్రికలు, సున్నం ఫౌడర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బెడ్స్‌పై పట్టు పురుగులను ఉంచి మల్బరాఈ ఆకులు వేయాలి. ఇలా పట్టు పురుగులు ఆకులను తింటున్న కర్మంలో పట్టు పరుగులు పట్టు కాయలుగా మారుతాయి. ఇదంతా కేవలం 21 రోజుల్లోనే జరుగుతుంది. పట్టు పురుగులు అల్లుకున్న పట్టుగూళ్లను విక్రయించుకొని లాభాలు పొందొచ్చు.

ఇక ఆదాయం విషయానికొస్తే.. కిలో పట్టుకాయలు ప్రస్తుతం మార్కెట్లో రూ. 730కి విక్రయిస్తున్నారు. ఉదాహరణకు ఒక పంటలో 100 కిలోల పట్టుకాయలు వచ్చాయంటే మీకు రూ. 73,000 వరకు లాభం లభిస్తుంది. ఇది కేవలం 21 రోజుల్లోనే. సరాసరి ఏడాదికి 7 నుంచి 10 పంటలు తీసే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే ఏడాదికి లక్షల్లో ఆదాయం పొందొచ్చు.

...

Complete article

Posted

4 Businesses With AMAZINGLY Low Failure Rates (You Can't Lose!)

 

  • The topic was featured
Posted

Best Business Ideas Telugu - Low Investment Business Ideas For Ladies | Kowshik Maridi | Sandy

 

  • 4 weeks later...
Posted

Business Idea: Diesel Exhaust Fluid (DEF) - ట్రెండింగ్‌ బిజినెస్‌ ఐడియా.. నెలకు రూ. లక్షల్లో ఆదాయం పక్కా..

భారీగా ఆదాయం సంపాదించాలనుకునే వారికి ఈ బిజినెస్ బెటస్‌ ఆప్షన్ గా చెప్పొచ్చు. తక్కువ పెట్టుబడిలోనే మంచి ఆదాయం పొందే ఈ బిజినెస్ ఏంటి.? ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

 
Business Idea: ట్రెండింగ్‌ బిజినెస్‌ ఐడియా.. నెలకు రూ. లక్షల్లో ఆదాయం పక్కా..

పెద్ద మొత్తంలో ఆదాయం ఆర్జించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. తాము ఆదాయం పొందుతూనే మరో నలుగురికి ఉపాధి కల్పించాలని ఆశిస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పోటీ నేపథ్యంలో చాలా మంది వ్యాపారం మొదలు పెట్టాలనే ఆసక్తి ఉన్నా.. వెనుకడుగు వేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఎలాంటి కాంపిటేషన్‌ లేని ఒక క్రేజీ బిజినెష్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం దేశంలో బీఎస్‌6 వాహనాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వాహనాల్లో డీజిల్‌ ఎగ్జాస్ట్‌ ఫ్లూయిడ్‌ (DEF)ను ఉపయోగించాల్సి ఉంటుంది. పొల్యుషన్‌ను తగ్గించేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ఆటో మొబైల్ షాప్స్‌లో ఈ డీఈఎఫ్‌లు 10 లీటర్ల బాటిల్స్‌ చొప్పున అందుబాటులో ఉంటాయి. దీనిద్వారా పొల్యుషన్‌ తగ్గడంతో పాటు ఇంజన్‌ను కాపాడుతాయి. ఈ డీఈఎఫ్‌ను తయారు చేస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చు.

ఈ ఫ్లూయిడ్‌ను తయారు చేయడానికి నీటితో పాటు, టెక్నికల్ గ్రేడ్‌ యూరియా అవసరపడుతుంది. ఇక ఆర్‌ఓ మిషిన్‌ అవసరం ఉంటుంది. ఆర్‌ఓ మిషన్‌ ద్వారా తయారు చేసిన నీటిని.. డీఎమ్‌ ప్లాంట్ అనే మిషిన్‌లో పోయాలి. వెంటనే డీఎమ్‌ వాటర్‌ బయటకు వస్తాయి. ఇక చివరిగా ఈ డీఎమ్‌ నీటిని డీఈఎఫ్‌ మిషిన్‌లో వేసి.. టెక్నికల్‌ గ్రేడ్ యూరియాను వేసి కలపాలి. ఒక గంటపాటు ప్రాసెస్‌ జరిగిన తర్వాత డీఈఎఫ్‌ బయటకు వస్తుంది. వీటిని క్యాన్స్‌లో నింపి ఆటో మొబైల్‌ దుకాణాలకు అందించవచ్చు.

ఒక లీటర్‌ డీఈఎఫ్‌ లిక్విడ్‌ తయారు చేయడానికి దాదాపు రూ. 20 ఖర్చవుతుంది. లీటర్ లిక్విడ్‌ను హోల్‌సేల్‌గా రూ. 40 వరకు విక్రయించవచ్చు. అంటే ఒక్క లీటర్‌ లిక్విడ్‌కు సుమారు రూ. 10 లాభం వస్తుంది. రోజుకు వెయ్యి లీటర్ల లిక్విడ్‌ను తయారు చేసినా తక్కువలో తక్కువ రోజుకు రూ. 10వేలు సంపాదించవచ్చు. దీంతో ఎంత కాదన్న నెలకు లక్షల్లో ఆదాయం ఏటూపోదు. పెట్టుబడి విషయానికొస్తే మొత్తం సెటప్‌కు.. సుమారు రూ. 7 లక్షల పెట్టుబడి అవసరపడుతుంది.

  • 2 weeks later...
Posted

Solar Panels: Subsidies from govt - ఈ వ్యాపారం చేస్తే లాభాల పంటే.. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కూడా..!

లాభదాయకమైన వ్యాపారం కోసం ప్రతి ఒక్కరూ అన్వేషణ చేస్తారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం రావాలని కోరుకొంటారు. దాని కోసం ఏ వ్యాపారం బాగుంటుందో పరిశీలిస్తారు. ఇలాంటి వారికి సోలార్ ప్యానెళ్ల వ్యాపారం చాలా బాగుంటుంది. సోలార్ వినియోగం ఇప్పుడిప్పుడే దేశంలో పెరుగుతోంది. భవిష్యత్తులో విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. సోలార్ తో పనిచేసే వివిధ వస్తువులకు ఆదరణ ఎక్కువైంది.

Solar Panels: ఈ వ్యాపారం చేస్తే లాభాల పంటే.. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కూడా..!

సోలార్ ఎనర్జీ కోసం సోలార్ ఫలకాలు అవసరం. వీటిని ఇళ్లపైనా, ఎండ తగిలే ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు. వీటిని విక్రయించడం ద్వారా లాభాలను ఆర్జింజవచ్చు. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఈ వ్యాపారం ఎలా చేయాలి, రుణం పొందే విధానం, రిజిస్టేషన్ చేసుకోవడం తదితర వివరాలను తెలుసుకుందాం. సోలార్ ప్యానెళ్ల వ్యాపారంలోకి వచ్చే ముందు దానికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవాలి. పెట్టుబడి, ముడి పదార్థాలు, మార్కెటింగ్, విక్రయం, వాటిని ఏర్పాటు చేయడంపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవాలి. అలాగే ఎక్కడ వ్యాపారం నిర్వహించాలో నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం.

సోలార్ ప్యానెళ్లను విక్రయించేవారు ముందుగా కంపెనీలా నమోదు చేసుకోవాలి. అప్పుడే మీరు చట్టబద్ధంగా వ్యాపారం చేయగలుగుతారు. కంపెనీల చట్టం 2013 ప్రకారం.. యాజమాన్యం, ఎల్ఎల్పీ, భాగస్వామ్యం, ఏకైక ప్రైవేటు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పన్ను ప్రయోజనాల కోసం యజమాని గుర్తింపు సంఖ్య (ఈఐఎన్) పొందాలి. ఏదైనా స్థలంలో దుకాణం లేదా కంపెనీ తెరవడానికి ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటితో పాటు వ్యాపార బీమాను కూడా తీసుకోవాలి. సోలార్ ప్యానెళ్ల వ్యాపారం కోసం దాదాపు రూ.40 లక్షల వరకూ రుణం తీసుకోవచ్చు. వివిధ బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థలు వీటిని అందజేస్తాయి. వడ్డీరేటు కూడా 8 నుంచి 14 శాతం మధ్యలో ఉంటుంది. ప్రతినెలా ఈఎంఐల రూపంలో చాలా సులభంగా చెల్లించవచ్చు. దాదాపు 60 నెలల పాటు కాల వ్యవధి కూడా ఉంటుంది.

సోలార్ ప్యానెళ్ల వ్యాపారం చేయాలనుకునేవారికి ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన పథకంతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. దీని కింద సోలార్ ప్యానెళ్ల ఖర్చులో దాదాపు 40 శాతం సబ్సిడీ లభిస్తుంది. సుమారు 1.50 లక్షలకు మూడు కిలోవాట్ల సబ్సిడీని పొందుతారు. దాదాపు రూ.70 వేల వరకూ తగ్గింపు రూపంలో ప్రయోజనం కలుగుతుంది. రుణం తీసుకునేందుకు ఈ పత్రాలు చాలా అవసరం. జీఎస్టీ నమోదు, కంపెనీ లేదా ఎల్ఎల్పీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, కంపెనీ పాన్, బ్యాంకు ఖాతా సంఖ్య, సేల్స్ ట్యాక్స్, టిన్ నంబర్, ప్రారంభ ధ్రువీకరణ పత్రం, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏవోఏ), మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ (ఎంవోఏ), షాప్, ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం లైసెన్సు దగ్గర ఉంచుకోవాలి.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...