-
💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.
- 0
Question
Sanjiv
రోజూ ఎండు కొబ్బరి తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసా?
పచ్చి కొబ్బరి మాదిరిగానే ఎండు కొబ్బరిలోనూ అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కొబ్బరిలో ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్, కాల్షియం, మాంగనీస్, సెలీనియం, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం మొదలైనవి ఉంటాయి. అదనంగా ఎండు కొబ్బరిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజు 50 గ్రాముల చొప్పున తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు మలబద్దక సమస్య తీరుతుంది. మహిళలు డెలివరీ తర్వాత కొబ్బరి స్వీట్ తింటే మంచిది. శారీరక అలసటను తగ్గిస్తుంది.
ఎండు కొబ్బరిలో ప్రోటీన్స్, విటమిన్స్ ఐరన్, కాల్షియం, మాంగనీస్, సెలీనియం రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడమే కాక చర్మ సమస్యల నుండి కాపాడతాయి. కొబ్బరి ఆహారంలో భాగం చేసుకుంటే బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలు దరిచేరవు.
మానసిక ఆరోగ్యానికి ఎండు కొబ్బరి బాగా పనిచేస్తుంది. ఇక కొబ్బరి నూనె అల్జీమర్స్ నివారణకు సాయపడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఇక బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఉపయోగకరం. అయితే జీర్ణం కావడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టినా.. శరీరానికి మాత్రం మేలు చేకూరుస్తుంది.
ఇక ఐరన్ పుష్కలంగా ఉండే ఎండు కొబ్బరిని బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల తలనొప్పి బాధితులకు చాలా మేలు జరుగుతుంది. ఎండు కొబ్బరి తినడం వల్ల మన శరీరానికి శక్తి వస్తుంది. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఎండు కొబ్బరిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
అంతేకాదు తరచూ ఎండు కొబ్బరి తినడం వల్ల సంతాన లేమి సమస్యలు తగ్గుతాయని, క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు మెదడు పని తీరు మెరుగు పడుతుందని, అయితే మితంగా తీసుకున్నప్పుడే ప్రయోజనాలు కలుగుతాయిని వివరిస్తున్నారు.
ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అనేక ఇతర వ్యాధులు కూడా నయమవుతాయి. దీని గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గిస్తాయి. తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ఆహారంలో కొబ్బరిని తీసుకోవాలి. ఎండు కొబ్బరిని తినడం వల్ల మన మెదడు పదును పెట్టడమే కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
కొబ్బరిని పొడి లేదా తడి రూపంలో తినడం మన జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండు కొబ్బరి తినడం వల్ల మన జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. ఇది క్రమంగా కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అలాగే మీ జుట్టు నల్లగా మెరుస్తుంది. ఎండు కొబ్బరి మనకు ఆరోగ్యం మాత్రమే కాదు.. అందాన్ని కూడా అందిస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలోనూ సహాయపడుతుంది. చర్మం మృదువుగా , స్మూత్ గా మారుతుంది.
NOTE: For information only. It is advisable to consult a qualified doctor for any health-related issues.
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.