Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Polavaram Project


Recommended Posts

Posted

CBN Polavaram: పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టుపై ఏరియల్‌ సర్వే.. నిర్మాణ పనులపై సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పోలవరంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు నాయుడు. గతంలో ప్రతీ సోమవారం పోలవరం పేరుతో ఆయన నిర్మాణ పనులపై సమీక్ష జరిపేవారు. ఇప్పుడు కూడా అదే రీతిలో సోమవారం నాడు పోలవరాన్ని సందర్శిస్తున్నారు బాబు. ప్రాజెక్టు పురోగతి విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

chandrababu-naidu-inspects-polavaram-pro

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పోలవరంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు నాయుడు. గతంలో ప్రతీ సోమవారం పోలవరం పేరుతో ఆయన నిర్మాణ పనులపై సమీక్ష జరిపేవారు. ఇప్పుడు కూడా అదే రీతిలో సోమవారం నాడు పోలవరాన్ని సందర్శిస్తున్నారు బాబు. ప్రాజెక్టు పురోగతి విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

పోలవరం స్టేటస్‌ రిపోర్ట్‌ ప్రకారం… మొత్తం ప్రాజెక్ట్‌ పనులు 50శాతం కూడా కంప్లీట్‌ కాలేదు. ఇప్పటివరకు 49.79శాతం ప్రాజెక్ట్‌ మాత్రమే పూర్తి అయ్యింది. హెడ్‌ వర్క్స్‌ పనులు 72.63శాతం, కుడి కాలువ 92.75శాతం పూర్తయ్యాయి. అలాగే, ఎడమ కాలువ పనులు 73.07శాతం పూర్తయ్యాయి. భూసేకరణ-పునరావాసం అయితే 22.55శాతం మాత్రమే జరిగాయి. ఇక, అప్రోచ్‌ ఛానెల్‌ పనులు 79శాతం కంప్లీట్‌ అయ్యాయి. స్పిల్‌వే పనులు 88శాతం పూర్తికాగా… పైలెట్‌ ఛానెల్‌ వర్క్స్‌ 48శాతం, రైట్‌-లెఫ్ట్‌ కనెక్టివిటీ 68శాతం పూర్తి అయ్యాయి

మొత్తం ప్రాజెక్ట్‌లో మూడు గ్యాప్స్‌ ఉంటే, గ్యాప్‌1 అండ్‌ గ్యాప్‌2లో డయాఫ్రమ్‌ వాల్‌ రిపేర్స్‌ జరుగుతున్నాయి. రెండు చోట్ల నేలను గట్టిపరిచే పనులు చేస్తున్నారు. ఇక, గ్యాప్‌3లో కాంక్రీట్‌ డ్యామ్‌ కంప్లీట్‌ అయ్యింది. హెలికాప్టర్‌ ద్వారా మొత్తం ప్రాజెక్ట్‌ను ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు చంద్రబాబు. ఆ తర్వాత ప్రాజెక్ట్‌ సైట్‌కు నేరుగా వెళ్లి చెక్‌ చేశారు. స్పిల్‌వే, గైడ్‌బండ్‌, ఎగువ కాపర్‌ డ్యామ్‌, గ్యాప్‌1, గ్యాప్‌2, గ్యాప్‌3 నిర్మాణాలు, దిగువ కాపర్‌ డ్యామ్‌, పవర్‌ హౌస్‌ను స్వయంగా పరిశీలించారు.

...

Complete article

పోలవరానికి సీఎం చంద్రబాబు..ప్రత్యక్ష ప్రసారం LIVE | CM Chandrababu Over Polavaram Inspection - TV9

 

Posted

Polavaram is CBN's free ATM to pocket/scam money ani Modi stated already and openly LOL

Yeah, expedite all the projects and scam as much money as possible and as soon as possible (just like Revanth is scamming in TG)!! No surprises.

:emoji-lol-giggle:

 

Posted

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైష్ణవి అనే వైద్య విద్యార్థిని విరాళం అందించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి శనివారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుని శనివారం కలిసి విరాళం అందించారు. అమరావతి నిర్మాణానికి రూ.25 లక్షలు, పోలవరం ప్రాజెక్టుకు రూ.1 లక్ష చొప్పున విరాళం ఇస్తూ సీఎం చంద్రబాబుకు చెక్కు అందించారు.

తమకున్న మూడు ఎకరాల భూమిలో ఎకరా అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను రాజధానికి, తన బంగారు గాజులు అమ్మగా వచ్చిన రూ.1 లక్షను పోలవరానికి విరాళంగా అందించినట్లు వైష్ణవి తెలిపారు. రాజధానిని నిర్మిద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తనవంతుగా ఈ విరాళం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం వైష్ణవి పొలం అమ్మి మరీ విరాళం ఇవ్వడం గొప్ప విషయం అని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం విద్యార్థిగానే ఉన్న వైష్ణవి....తండ్రి సహకారంతో రాజధాని కోసం, పోలవరం కోసం విరాళం ఇవ్వడం ఎంతో గొప్ప విషయం అన్నారు.

b0bfa030-44a6-4972-a967-929c5ba2b8de1-17

నేటి యువతకు వైష్ణవి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇలాంటి యువత కలలు తమ ప్రభుత్వం నిజం చేస్తుందని చంద్రబాబు అన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప మనసు చాటిని వైష్ణవిని సీఎం శాలువా కప్పి సత్కరించారు. స్ఫూర్తిదాయకంగా నిలిచిన వైష్ణవిని సీఎం అమరావతి కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజ్ లో ప్రస్తుతం ఎంబిబిఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఈ సందర్భంగా వైష్ణవితో పాటు, ఆమె తండ్రి అంబుల మనోజ్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.

...

Complete article

Posted

CBN on Polavaram: ‘గత ప్రభుత్వం నిర్వాకం వల్లే పోలవరానికి తీవ్ర నష్టం జరిగింది’.. సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత 5ఏళ్ళు రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజల్లో చర్చ జరగాలన్నారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గుర్తించారు కాబట్టే ఇంత అఖండ విజయం అందించామన్నారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.

CM Chandrababu

cm-chandrababu-6.jpg?w=1280

అమరావతి, జూన్ 28: పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత 5ఏళ్ళు రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజల్లో చర్చ జరగాలన్నారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గుర్తించారు కాబట్టే ఇంత అఖండ విజయం అందించామన్నారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత ప్రభుత్వ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. వివిధ అంశాలపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో వివరించాలని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ శాపంలా మారారని విమర్శించారు. వృధాగా సముద్రంలో కలిసే 3వేల టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకుని కరవు రహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు పోలవరం అని వివరించారు. 2014 -19 తమ ప్రభుత్వ హయాంలో 31సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తించి 72శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు.

డయాఫ్రమ్ వాల్‎ను రూ.436కోట్లతో పూర్తి చేస్తే.. ఇప్పుడు మరమ్మతులకు రూ.447కోట్లు ఖర్చయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఇది కేవలం గత పాలకుల నిర్లక్ష్యంగా చెప్పారు. కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే ఇప్పుడు అదనంగా రూ. 990కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. 2019 జూన్ నుంచి ఏజెన్సీ లు తొలగించి పోలవరం పనులు నిలుపుదల చేశారన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం 2ఏళ్ల తర్వాత కానీ గుర్తించలేదని ఆరోపించారు. ప్రాజెక్టును సర్వనాశనం చేసేందుకు వైఎస్ జగన్ అహంతో చేసిన దుస్సాహసమే పోలవరం వినాశనం అని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు 4విధాలుగా నష్టం జరిగిందని తెలిపారు. మొదటిది డయాఫ్రమ్ వాల్ అయితే, అప్పర్, లోయర్ కాపర్ డ్యాం లు దెబ్బతిన్నాయని వివరించారు. గైడ్ బండ్ దెబ్బతినడంతో పాటు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కూడా ఆగిపోయిందని ఈ సందర్భంగా తెలిపారు. ఇక్కడ ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు ఎత్తేయటంతో అంతర్జాతీయ నిపుణుల నివేదిక ఆధారంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందన్నారు. ఏమాత్రం తప్పిదం జరిగిన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు పూర్తిగా నీట మునుగుతాయన్నారు.

...

Complete article

Posted

YCP's reaction on Polavaram: చంద్రబాబు పోలవరం శ్వేతపత్రంపై వైసీపీ రియాక్షన్ ఇదే..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో అనుసరించిన వైఖరిపై ఇవాళ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వ రివర్స్ టెండరింగ్ తో పాటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఇతర అంశాల్లో తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు తప్పుబట్టారు. పోలవరం పూర్తి కాకపోవడానికి వైసీపీ సర్కార్ తప్పిదాలే కారణమని ఆయన తేల్చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ దీనిపై స్పందించింది.

picture59-1719585423.jpg

డయాఫ్రమ్ వాల్ విషయంలో చంద్రబాబు చేసిన విమర్శలపై స్పందించిన మాజీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబు.. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పూర్తి కాకుండా, నదీ ప్రవాహం మళ్లింపు కాకుండా కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. అసలు కేంద్రం పూర్తి చేయాల్సిన జాతీయ ప్రాజెక్టును ఎందుకు తీసుకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని అప్పట్లో మోడీ చేసిన విమర్శల్ని గుర్తుచేశారు.

picture58-1719585432.jpg

ఏపీకి అప్పుడే తెల్లారిందా?: నెలైనా కాలేదు: రూ.7,000 కోట్లకు టెండర్ పోలవరం శ్వేతపత్రం విడుదల, అనంతరం చంద్రబాబు చేసిన విమర్శలు చూస్తుంటే ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశం ఆయనకు ఉన్నట్లు కనిపించడం లేదని అంబటి తెలిపారు. తిరిగి జగన్ అధికారంలోకి వచ్చాక దీన్ని పూర్తి చేస్తారన్నారు. వైసీపీ సర్కార్ హయాంలో పోలవరంలో ఎలాంటి తప్పూ జరగలేదని అంబటి తేల్చేశారు.

చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం నాశనం అయ్యిందనే విషయాన్ని తాము ఆధారాలతో నిరూపిస్తామన్నారు. ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు.

  • 4 months later...
Posted

Polavaram project: Target for constructing new diaphragm wall - పోలవరం ప్రాజెక్టుపై విస్తృతంగా మేథోమథనం.. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి టార్గెట్ ఫిక్స్!

టార్గెట్ ఫిక్స్ అయింది. పోలవరం ప్రొజెక్టుపై జరిగిన మేథోమథనం కొలిక్కొచ్చేసింది. కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఓ క్లారిటీ ఇచ్చేశారు విదేశీ నిపుణులు. పాత డయాఫ్రమ్ వాల్‌కి 6 మీటర్ల ఎగువన కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని, గరిష్టంగా పదిహేను నెలల్లోగా..

 
పోలవరం ప్రాజెక్టుపై విస్తృతంగా మేథోమథనం.. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి టార్గెట్ ఫిక్స్!

ఆంధ్రుల జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్‌.. నిర్మాణ దశను దాటలేక దశాబ్దాల తరబడి అపసోపాలు పడుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా కొత్తకొత్త సమస్యలతో నిర్మాణంలో అంతులేని జాప్యం తప్పడం లేదు. కొత్త సమస్యల్లో అతికొత్త సమస్య ఏంటంటే.. ప్రాజెక్టు దగ్గర గోదావరి లోపల నిర్మించిన డయాఫ్రం వాల్ భారీ వరదలకు దెబ్బతినడం..! 2018లో ఉభయగోదావరి జిల్లాల పరిధిలో గోదావరి నదీ గర్భంలో 93.5 మీటర్ల లోతులో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ఇది. రెండు సీజన్లలో 412 రోజుల కాల వ్యవధిలో పూర్తయినప్పటికీ 2020 తర్వాత వచ్చిన వరదల కారణంగా దెబ్బతినింది. దీంతో దీని మీద నిర్మించాల్సిన మెయిన్ డ్యామ్ పనులు ఆగిపోయాయి. ఇటీవలే మళ్లీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు కొత్త డయాఫ్రమ్‌ వాల్‌పై దృష్టి పెట్టారు. విదేశీ నిపుణుల సలహాలు-సూచనలతో ముందుకెళ్లాలని నిర్ణయించారు.

కేంద్ర జలసంఘం సీఈ విజయ్ శరన్ అధ్యక్షతన ముగ్గురు విదేశీ నిపుణులతో పరిశీలన బృందం ఏర్పాటైంది. ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందం.. పోలవరంపై మేథోమథనం చేసింది. రెండురోజుల పాటు ఎగువ-దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణాలను పరిశీలించింది. దీనికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ చూసి, పోలవరం ఆధారిటీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. గ్యాప్‌-2లో డయాఫ్రం వాల్‌ ప్లాట్‌ఫాం, వాల్‌ నిర్మాణానికి అవసరమైన ఓడోమీటర్లు, కొత్త వాల్‌ నిర్మాణం కోసం ఎర్త్‌ కమ్ రాక్‌ఫిల్‌ డ్యామ్ కుడివైపు జరుగుతున్న మట్టి పనులు, దిగువ కాఫర్‌ డ్యాం వద్ద డీవాటరింగ్‌ పనులు.. అన్నిటినీ నిశితంగా పరిశీలించారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కూడా ఈ సంప్రదింపుల్లో పాల్గొన్నారు. అటు.. ఆఫ్రి సంస్థ సిద్ధం చేసిన కొత్త డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ డిజైన్లపై చర్చించింది. పాత డయాఫ్రం వాల్‌కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాప్రం వాల్ నిర్మించాలని, ఇసుక సాంద్రత పెంచి మరింత గట్టిదనం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు.

కానీ.. డిజైన్‌పై విదేశీ నిపుణులు అనేక సందేహాలు లేవనెత్తారు. కొన్ని వివరణలూ కోరారు. అన్నిటిపై క్లారిటీ ఇస్తామంటోంది ఆఫ్రి సంస్థ. డ్యామ్ ప్రాంతంలో నీళ్లు లేనప్పుడు, తక్కువ నీళ్లు ఉన్నప్పుడు, గరిష్ట స్థాయిలో నీళ్లు ఉన్నప్పుడు… ఇలా వివిధ కోణాల్లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చర్చించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి దాదాపు 15 నెలల టైమ్ పడుతుందని ఒక అంచనాకొచ్చారు. యంత్రసామగ్రిని పెంచుకుంటే నిర్మాణ గడువు తగ్గే ఛాన్స్ కూడా ఉందట. నిపుణుల భేటీ తర్వాత సీఎం చంద్రబాబు క్షేత్ర స్ధాయిలో పోలవరం పర్యటనకు వస్తారు. పనుల పరిశీలన ముగిశాక అధికారులతో సమావేశమై కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఫైనల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

...

Complete article

  • The title was changed to Polavaram Project
  • The topic was featured
  • 2 months later...
Posted

Polavaram Dam: Construction of new diaphragm wall commenced -  పోలవరం నిర్మాణంలో కీలక ముందడుగు.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభం

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌. రాష్ట్ర దశ దిశ మార్చబోయే ఈ ప్రాజెక్ట్‌ విషయంలో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభమైంది. ఇంతకీ పోలవరం ఎప్పటిలోపు పూర్తి కానుంది? ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది?

Polavaram Dam: పోలవరం నిర్మాణంలో కీలక ముందడుగు.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభం
Diaphragm Wall

పోలవరం.. దశాబ్దాల ఆంధ్రుల కల. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయ్. ప్రభుత్వాలు మారుతున్నాయ్. కానీ ప్రాజెక్ట్ నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే విషయంలో కీలక ముందడుగు వేసింది చంద్రబాబు సర్కార్. పోలవరం తమకు అత్యంత ప్రాధాన్యత. జనవరి నుంచి పనులు మొదలు పెడతాం. ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తామని మొదటి నుంచీ చెప్తూ వచ్చిన చంద్రబాబు.. చెప్పినట్టుగానే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. 2020 వరదల్లో కొట్టుకుపోయిన డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి.. ప్రాజెక్ట్‌ను రీ స్టార్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. దీనికి సంబంధించిన భూమిపూజ, హోమాన్ని కూడా నిర్వహించారు.

ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమంతో డయాఫ్రమ్‌ వాల్‌

వాస్తవానికి 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేసింది. అయితే 2020లో వచ్చిన వరదల కారణంగా డయాఫ్రంవాల్ దెబ్బతిన్నది. ఇసుక కోతకు గురై అగాథాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వాటిని పూడ్చి, వైబ్రో కాంపక్షన్ విధానంలో గట్టిపరిచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. దీని కోసం 383 ప్యానెల్స్‌తో లక్ష క్యూబిక్‌ మీటర్లకు పైగా ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమంతో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం జరగనుంది. ఈ డయాఫ్రం వాల్‌ నిర్మాణం కోసం జర్మనీ నుంచి ట్రెంచ్‌ కట్టర్లు, భారీ గ్రేబర్లు, డిశాండింగ్‌ యంత్రాలు కూడా వచ్చాయి.

కొత్త డయాఫ్రం వాల్ కోసం రూ.990 కోట్లు

కొత్త డయాఫ్రం వాల్ కోసం 990 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 1396 మీటర్ల పొడవు.. ఒకటిన్నర మీటర్ల మందంతో కొత్త డయాఫ్రమ్ వాల్‌ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కనిష్టంగా 20 మీటర్లు.. గరిష్టంగా 90 మీటర్ల లోతు నుంచి వాల్ నిర్మాణం చేపడతారు. పాత డయాఫ్రమ్ వాల్‌కు 6 మీటర్ల ఎగువన కొత్త నిర్మాణం చేపట్టింది కూటమి ప్రభుత్వం. డయాఫ్రం వాల్ సగం నిర్మాణం పూర్తి కాగానే సమాంతరంగా దాని పైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ షెడ్యూల్ జారీ చేసింది.

కేంద్రం సాకారంతో పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టాలెక్కిస్తోంది. రెండేళ్లలోనే పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. బనకచర్లకు పోలవరాన్ని అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఇబ్బందే ఉండదని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వెంకటేశ్వరస్వామి పాదాల చెంతకు గోదావరి నీళ్లను తరలించి రాయలసీమ రుణం తీర్చుకోవడమే తన జీవిత ఆశయం అంటున్నారు సీఎం చంద్రబాబు.

నదుల అనుసంధానంలో పోలవరం ప్రాజెక్టే అత్యంత కీలకం. ఈ పోలవరం పూర్తి కావాలంటే డయాఫ్రం వాల్ నిర్మాణం వేగంగా పూర్తి కావాలి. అందుకే అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన జాతికి అంకితం చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది చంద్రబాబు సర్కార్.

...

Complete article

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...