-
💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.
- 0
How long can a person live without water: మనిషి నీరు లేకుండా ఎంతకాలం జీవించవచ్చు?
-
Now Playing
-
Ballerina
-
Brick
-
Bring Her Back
-
Dora and the Search for Sol Dorado
-
ปากกัด ตีนถีบ
-
M3GAN 2.0
-
The Old Guard 2
-
Bad Boa's
-
アニメ『怪獣8号』第1期総集編/同時上映「保科の休日」
-
劇場版「鬼滅の刃」無限城編 第一章 猗窩座再来
-
Jurassic World Rebirth
-
Z-O-M-B-I-E-S 4: Dawn of the Vampires
-
KPop Demon Hunters
-
Ice Road: Vengeance
-
F1
-
Superman
-
Karate Kid: Legends
-
How to Train Your Dragon
-
-
What's New
Question
Vijay
నీరు మానవ శరీరానికి అవసరం. కొంత మొత్తంలో నీరు శరీరం సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అది లేకుండా జీవితాన్ని ముందుకు సాగించలేము. మనిషి ఆహారం లేకుండా చాలా రోజులు జీవించగలడు కానీ నీరు లేకుండా జీవించడం కష్టం. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి నీరు లేకుండా ఎన్ని రోజులు జీవించగలడు? నీటి కొరత కారణంగా ఏమి జరుగుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది...
నీరు మానవ శరీరానికి అవసరం. కొంత మొత్తంలో నీరు శరీరం సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అది లేకుండా జీవితాన్ని ముందుకు సాగించలేము. మనిషి ఆహారం లేకుండా చాలా రోజులు జీవించగలడు కానీ నీరు లేకుండా జీవించడం కష్టం. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి నీరు లేకుండా ఎన్ని రోజులు జీవించగలడు? నీటి కొరత కారణంగా ఏమి జరుగుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది.
నీటి కొరత కారణంగా..
ఒక వ్యక్తి శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు అతను చాలా దాహంగా ఉంటాడు. నీటి కొరత కారణంగా అతను అలసిపోయినట్లు అనిపిస్తుంది. అవయవాలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాదు ఇది మరణానికి దారి తీస్తుంది. నీరు తాగకపోతే వ్యక్తి మొదటి రోజు కొద్దిగా నీరసంగా ఉంటాడు. మూడవ రోజు నాటికి చాలా అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
నీటి కొరత ప్రభావం ప్రతి వ్యక్తిపై భిన్నంగా ఉంటుంది. అయితే, ఇది అతని సహన స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో 70% నీటితో నిర్మితమై ఉండడం వల్ల అనేక ముఖ్యమైన పనులు దాని ద్వారానే జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో నీరు లేకుండా ఎక్కువ కాలం జీవించడం సులభం కాదు.
నీరు లేకుండా మానవుడు ఎన్ని రోజులు జీవించగలడు?
ఇది వేర్వేరు వ్యక్తులకు భిన్నంగా ఉండవచ్చు. ఇది రెండు రోజుల నుండి వారం వరకు ఉండవచ్చు. నీటికి సంబంధించి ‘రూల్ ఆఫ్ 3’ కూడా పరిగణిస్తారు. అంటే మనిషి 3 నిమిషాలు గాలి లేకుండా, 3 రోజులు నీరు లేకుండా, 3 వారాల పాటు ఆహారం లేకుండా జీవించగలడు.
ఆహారం, నీరు లేకుండా మనిషి 8 నుండి 21 రోజుల కంటే ఎక్కువ కాలం జీవించలేడని ‘ఆర్కైవ్ ఫర్ క్రిమినాలజీ’ అధ్యయనం కనుగొంది. నీరు లేకపోవడం వల్ల శరీరంపై అనేక ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. అయితే ఇదంతా జీవనశైలి, వాతావరణంపై ఆధారపడి ఉంటుంది.
శరీరానికి ఎంత నీరు అవసరం:
1. జాతీయ విద్యావేత్తల ప్రకారం.. పురుషులు 3.6 లీటర్ల నీరు, స్త్రీలు 2.6 లీటర్ల నీరు తాగాలి. ఈ పరిమాణాన్ని ద్రవ, ఆహారం నుండి పొందవచ్చు.
2. నీటి అవసరం ప్రతి వ్యక్తి వయస్సు, శారీరక శ్రమ, ఆరోగ్యం, శారీరక సామర్థ్యం, ఎత్తు, బరువు, లింగం మరియు ఆహారం మీద ఆధారపడి ఉంటుంది.
3. నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, రసాలను తీసుకునే వారికి ఎక్కువ నీరు అవసరం లేదు. అయితే తృణధాన్యాలు, బ్రెడ్ లేదా డ్రై ఫుడ్స్ తీసుకునే వారికి ఎక్కువ నీరు అవసరం.
4. ఒక వ్యక్తి శరీరానికి ఎంత నీరు అవసరం అనేది కూడా అతని చుట్టూ ఉన్న వాతావరణంపై ఆధారపడి ఉంటుంది.
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.