Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Bigg Boss: Season 8


Recommended Posts

  • 6 months later...
  • Replies 59
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TELUGU

    24

  • Sanjiv

    17

  • Vijay

    15

  • Sucker

    3

Posted

Bigg Boss season 8: బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్ షో లాంచింగ్ ఎప్పుడంటే

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు చాలా మంది ఆడియెన్స్ టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కు పోతారు. అందుకే అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ టీవీ షోకు మంచి టీఆర్పీలు వస్తున్నాయి. ఇక తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయ్యింది రియాలిటీ షో. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి

Big Boss Telugu 8

big-boss-telugu-8.jpg?w=1280

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు చాలా మంది ఆడియెన్స్ టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కు పోతారు. అందుకే అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ టీవీ షోకు మంచి టీఆర్పీలు వస్తున్నాయి. ఇక తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయ్యింది రియాలిటీ షో. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి. మరీ ముఖ్యంగా గత సీజన్‌కు రికార్డు స్థాయిలో టీఆర్పీలు వచ్చాయి. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సీజన్ 8 కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేశారని. యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఈఏడాది నెట్టింట బాగా వైరలైన వారిని బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ షో స్టార్ట్ అయ్యేవరకు కంటెస్టెంట్స్ ఎవరనే విషయాన్ని బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బిగ్‏బాస్ లీకులు వస్తుంటూనే ఉంటాయి. అలా ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే నంటూ కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.

 అమృతా ప్రణయ్ కూడా..

బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 ఆగస్టు 4న లేదా 11వ తేదీల్లో ప్రారంభం కానుందట. గతంలో లాగే ఈ సారి కూడా వంద రోజుల పాటు బిగ్ బాస్ షో సాగేలా ప్లాన్ చేశారట మేకర్స్. అలాగే సుమారు 20 మంది కంటెస్టెంట్స్ హౌజ్ లోకి అడుగుపెట్టనున్నారట. వీరిలో బర్రెలక్క, హేమ, సురేఖావాణి, హీరో రాజ్ తరుణ్, యాంకర్ రీతూ చౌదరి, కమెడియన్ కిరాక్ ఆర్పీ, కుమారీ ఆంటీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పరువు హత్యతో సంచలనంగా మారిన అమృతా ప్రణయ్ ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరికి తోడు యూట్యూబ్, ఇన్ స్టా వీడియోలతో ఫేమస్ అయిన స్టార్స్ ను హౌజ్ లోకి తీసుకురాబోతున్నారట. కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఫుల్ క్లారిటీ రావాలంటే షో లాంచింగ్ వరకు వేచి ఉండాల్సిందే.

...

Complete article

Posted

Bigg Boss Season 8 Telugu: బిగ్‏బాస్ సీజన్ 8కు సర్వం సిద్ధం.. కంటెస్టెంట్స్ రెడీ.. ఎప్పుడు స్టార్ట్ కానుందంటే..

బిగ్‏బాస్ కంటెస్టెంట్స్‌కు విపరీతమైన అభిమానులు ఉంటారు. గతంలో ఒకరి ఫ్యాన్స్ ఒకరిపై దాడికి పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బిగ్‏బాస్ విజేతపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బిగ్‏బాస్ సీజన్ 8 రాబోతుంది.

Bigg Boss Telugu Season 8

bigg-boss-telugu-season-8.jpg?w=1280

బుల్లితెరపై అత్యంత క్రేజ్ ఉన్న రియాల్టీ షో బిగ్‏బాస్. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ ఈ షో విజయవంతంగా రన్ అవుతుంది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో ఈ షోకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. దాదాపు మూడు నెలలపాటు నడిచే ఈ రియాల్టీ షో గురించి నిత్యం ఏదోక న్యూస్ నెట్టింట వైరలవుతుంటుంది. ఇక ఇందులోకి ఎంటరయ్యే పోటీదారుల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. హిందీలో ప్రస్తుతం బిగ్‏బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తుండగా.. త్వరలోనే తెలుగులో సీజన్ 8 స్టార్ట్ కానుంది.

బిగ్‏బాస్ కంటెస్టెంట్స్‌కు విపరీతమైన అభిమానులు ఉంటారు. గతంలో ఒకరి ఫ్యాన్స్ ఒకరిపై దాడికి పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బిగ్‏బాస్ విజేతపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బిగ్‏బాస్ సీజన్ 8 రాబోతుంది. ఈసారి ఈ షోను కాస్త ముందుగానే ప్రారంభించేందుకు రెడీ అయ్యారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం ఆగస్ట్ 4న బిగ్‏బాస్ సీజన్8 స్టార్ట్ కానుందని తెలుస్తోంది. అలాగే ఈసారి షోలో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ కూడా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

కుమారి ఆంటీతోపాటు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బర్రెలక్క, అమృత ప్రణయ్, అలాగే యూట్యూబర్ నేత్ర, మోటివేషనల్ స్పికర్ వంశీ బిగ్‏బాస్ హౌస్ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన నటీనటులు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మమూడి ఫేమ్ కావ్య కూడా ఈ సారి హౌస్ లోకి రానుంది.

Posted

Venu Swamy in Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లోకి వేణు స్వామి! ఇక హౌజ్‌లో రచ్చ రచ్చే! రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్!

ఈసారి హౌజ్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల లిస్టులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్‌లో వేణు స్వామి కంటెస్టెంట్‌గా రానున్నారనే వార్తలు నెట్టింట వైరలవుతున్నాయి.

Astrologer Venu Swamy

astrologer-venu-swamy.jpg?w=1280

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో 8 వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. బహుశా ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈసారి హౌజ్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల లిస్టులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్‌లో వేణు స్వామి కంటెస్టెంట్‌గా రానున్నారనే వార్తలు నెట్టింట వైరలవుతున్నాయి. ప్రముఖుల జాతకాలు.. అందులోనూ సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తోన్న ఆయన తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా ఈ స్వామి మనసులో ఏదీ దాచుకోడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు. బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా కావాల్సింది ఇదే. ఇలాంటి నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తుల వల్ల బిగ్ బాస్ కు అవసరమైన కంటెంట్ వస్తుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అందుకే వేణు స్వామిని హౌజ్‌లోకి రప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.

కాగా వేణు స్వామి బయట పూజలు చేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. మరి అలాంటప్పుడు సుమారు 100 రోజుల పాటు స్వామి బిగ్ బాస్ హౌజ్ లో ఉండాలనుకుంటే అంతకు మించే దక్కాలి. అందుకే ఆయనకు ఈ సీజన్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. ఒకవేళ ఇదే నిజమై బిగ్ బాస్ హౌజ్ లోకి వేణు స్వామి గనుక ఎంట్రీ అయితే మాత్రం ఎంటర్ టైన్మెంట్ కు కొదవ ఉండదని చెప్పుకోవచ్చు.

  • The title was changed to Bigg Boss Telugu winner Evaru ?
Posted

Bigg Boss Telugu 8: బర్రెలక్క, హేమతో సహా ఈసారి బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్స్ వీరే.. హౌజ్‌లో రచ్చ మాములుగా ఉండదు

ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల వివరాలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఆది రెడ్డి లాంటి బిగ్ బాస్ విశ్లేషకుల నుంచి కూడా తరచూ ఏదో ఒక లీక్స్ వస్తూనే ఉన్నాయి.

Bigg Boss Telugu Season 8

bigg-boss-telugu-season-8-1.jpg?w=1280

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ రియాలిటీ షో మళ్లీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో ఎనిమిదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల వివరాలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఆది రెడ్డి లాంటి బిగ్ బాస్ విశ్లేషకుల నుంచి కూడా తరచూ ఏదో ఒక లీక్స్ వస్తూనే ఉన్నాయి. కాగా ఈసారి పలువురు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు బిగ్ బాస్ హౌజ్ లోకి రానున్నారని సమాచారం. అలాగే గత ఏడాది కాలంగా వివిధ కారణాలతో వార్తల్లో నిలిచిన సెలబ్రిటీలను కూడా హౌజ్ లోకి రప్పించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లేడీ కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయి జైలు కెళ్లిన హేమ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క, రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బాగా ఫేమస్ అయిన కుమారీ ఆంటీ ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో మెయిన్ లేడీ కంటెస్టెంట్స్ గా రావచ్చని సమాచారం.

ఈసారి బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్ల లిస్టులో ప్రముఖంగా వినిపిస్తోన్న మరో పేరు అమృతా ప్రణయ్. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తన తండ్రే స్వయంగా ఆమె భర్తను హత్య చేయించాడు. దీంతో తండ్రిపైనే కేసు పెట్టిందామె. తన పర్సనల్ లైఫ్ తో వార్తల్లో నిలిచిన అమృతా ప్రణయ్ బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్‌గా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు విశ్లేషకులు. వీరితో పాటు సురేఖా వాణి, జబర్దస్త్ యాంకర్ రీతూ చౌదరి, బ్రహ్మముడి కావ్య ల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. అలాగనీ వీటిలో నిజం లేకపోలేదు. అయితే కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఫుల్ క్లారిటీ రావాలంటే షో లాంచింగ్ వరకు వేచి ఉండాల్సిందే.

  • The title was changed to Bigg Boss
  • 3 weeks later...
Posted

Bigg Boss Telugu 8 Season Selection Process Explained By Adi Reddy | Bigg Boss 8 Telugu Updates

 

  • The topic was featured
Posted

Kamal Haasan out from Bigg Boss: ‘బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నా’.. కమల్ హాసన్ సంచలన నిర్ణయం.. కారణమిదే

ప్రముఖ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ గత ఏడేళ్లుగా 'బిగ్ బాస్ తమిళ్' రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తనదైన శైలిలో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాబోయే కొత్త సీజన్‌ని కూడా కమల్ నే హోస్టింగ్ చేయాలన్నది అభిమానుల కోరిక. అయితే అంతకు ముందే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు కమల్

Kamal Haasan

kamal-haasan.jpg?w=1280

ఈసారి తాను బిగ్ బాస్ షోకి హోస్ట్ చేయనని సూటిగా చెప్పారు. కమల్ హాసన్ తన నిర్ణయం వెనుక కారణాన్ని కూడా వివరించారు. సాధారణంగా బిగ్ బాస్ హోస్ట్ మార్పుపై సోషల్ మీడియాలో పలు రూమర్లు, పుకార్లు వస్తుంటాయి. అయితే ఇప్పుడు కమల్ హాసన్ గురించి వినిపిస్తున్నది గాసిప్ కాదు. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన అభిమానులకు ఓ లేఖ రాశారు. ‘7 ఏళ్ల క్రితం ప్రారంభమైన మా బిగ్ బాస్ జర్నీకి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని బరువెక్కిన హృదయంతో తెలియజేస్తున్నాను . గతంలో ఒప్పుకున్న సినిమాల వర్క్ కారణంగా ఈసారి బిగ్ బాస్ షోకు అందుబాటులో ఉండలేపోతున్నాను’ అని కమల్ హాసన్ తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు.

‘బిగ్ బాస్ రియాలిటీ షోతో మీ ఇళ్లకు చేరుకునే అవకాశం నాకు లభించింది. మీరందరూ నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడనై ఉంటాను. మీ సపోర్ట్ వల్ల బిగ్ బాస్ తమిళ రియాల్టీ షో నా బెస్ట్ షో అయింది. నాకు అవకాశమిచ్చిన బిగ్ బాస్ యాజమాన్యానికి రుణ పడి ఉంటాను. మీ అందరికీ, పోటీదారులందరికీ ధన్యవాదాలు’ అని కమల్ హాసన్ లేఖలో రాశారు. కొత్త సీజన్‌ను ఎవరు హోస్ట్ చేస్తారనే దాని గురించి ఛానెల్ ఇంకా సమాచారం ఇవ్వలేదు.

Posted

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్లే.. జబర్దస్త్ మహిధర్ లిస్టులో ఊహించని పేర్లు

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్‌ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునని ఊహగానాలు వినిపిస్తున్నాయి.

Bigg Boss Telugu 8

bigg-boss-telugu-8-1.jpg?w=1280

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్‌ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునని ఊహగానాలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ కోసం అన్నపూర్ణ స్టూడియలో శర వేగంగా పనులు జరుగుతున్నాయి. అలాగే ఎనిమిదో సీజన్ కు సంబంధించి ఇటీవలే ప్రోమోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే టైటిల్ లోగోనూ కూడా సరికొత్తగా డిజైన్ చేశారు. మరోవైపు కంటెస్టెంట్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో పలువురి పేర్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా జబర్దస్త్ మహిధర్ తనకు ఉన్న విశ్వసనీయ సమాచారమంటూ బిగ్ బాస్ ఎనిమిదో కంటెస్టెంట్స్ కొన్ని పేర్లను వెల్లడించాడు. గతంలో జబర్దస్త్ కామెడీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతను ప్రస్తుతం బిగ్ బాస్ రివ్యూలు, సినిమా రివ్యూలు ఇస్తూ ఫేమస్ యూట్యూబర్ గా గుర్తింపు పొందాడు. ఇతని రివ్యూలకు యూబ్యూబ్ లో భారీ వ్యూస్ వస్తుంటాయి. అలా తాజాగా బిగ్ బాస్ ఎనిమిదో సీజన కంటెస్టెంట్స్ లిస్ట్ ను రిలీజ్ చేశాడు మహిధర్. అతని ప్రకారం.. బుల్లితెర నుంచి బర్దస్త్ నరేశ్, యాదమ్మ రాజు, కిరాక్ ఆర్పీ, బంచిక్ బబ్లూ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది.

ఇక సీరియల్ కేటగిరీ నుంచి రీతూ చౌదరి, ప్రేరణ కంభం, ఏక్ నాథ్- హారిక జంట, హీరోయిన్స్ కేటగిరీ నుంచి సోనియా సింగ్, కుషితా కల్లపు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల కేటగిరీ నుంచి మహాసేన రాజేశ్, యువ సామ్రాట్, హీరో ఆదిత్య ఓం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నాడు జబర్దస్త్ మహిధర్. అయితే ఈసారి కంటెస్టెంట్స్ లిస్టు పెరగనుందని త్వరలోనే మరిన్ని విషయాలతో వస్తానన్నాడీ ఫేమస్ యూబ్యూబర్. వీరందరి పేర్లు వోకే కానీ బిగ్ బాస్ షోకు రాజేశ్ మహాసేన వస్తానని మహిధర్ చెప్పడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి మహిధర్ అంచనాలు ఎంత మేర నిజమవుతాయో తెలుసుకోవాలంటే బిగ్ బాస్ షో లాంఛింగ్ డే వరకు ఆగాల్సిందే.

Bigg Boss 8 Telugu Final Contestants List | Bigg Boss Latest Updates | Mahidhar Review

 

Posted

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ కొత్త ప్రోమో చూశారా? అందమైన అమ్మాయిలతో నాగ్ డ్యాన్స్.. లాంఛింగ్ ఎప్పుడంటే?

బుల్లితెర క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ రానుంది. ఇప్పటికే తెలుగులో విజయవంతంగా 7 సీజన్లను పూర్తి చేసుకొని ఇప్పుడు 8వ సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈఈ సెలబ్రిటీ ఎంటర్ టైన్మెంట్ షో కోసం బుల్లితెర ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ యాజమాన్యం కూడా వారానికో సారి ప్రోమోను రిలీజ్ చేస్తూ కొత్త సీజన్ పై హైప్ పెంచుతోంది

Bigg Boss Telugu Season 8

bigg-boss-telugu-season-8.jpg?w=1280

బుల్లితెర క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ రానుంది. ఇప్పటికే తెలుగులో విజయవంతంగా 7 సీజన్లను పూర్తి చేసుకొని ఇప్పుడు 8వ సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈఈ సెలబ్రిటీ ఎంటర్ టైన్మెంట్ షో కోసం బుల్లితెర ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ యాజమాన్యం కూడా వారానికో సారి ప్రోమోను రిలీజ్ చేస్తూ కొత్త సీజన్ పై హైప్ పెంచుతోంది. ఇప్పటికే రెండు ప్రోమోలతో పాటు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కొత్త లోగోనూ ఆడియెన్స్ ముందుకు తెచ్చింది యాజమాన్యం. తాజాగా కొత్త సీజన్ కు సంబంధించి మరో ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో ఎంతో అందంగా కనిపించారు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. అలాగే అందమైన అమ్మాయిలతో ఆయన ఎనర్జిటిక్ గా స్టెప్పులేయడం ప్రోమోకే హైలెట్ గా నిలిచింది. ‘ఇక్కడ ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు..బిగ్‌బాస్‌ సీజన్‌-8లో ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫన్‌, టర్న్‌లు, ట్విస్ట్‌లు బోలెడన్ని ఉంటాయంటూ కొత్త సీజన్ పై క్యూరియాసిటీ పెంచేశారు నాగ్.

అంతకుముందు ఎంటర్టైన్మెంట్ తీసుకువచ్చేందుకు మేము రెడీ.. అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీయా ? అంటూ బిగ్ బాస్ కొత్త లోగోనూ ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ షో ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారనే విషయాన్ని మాత్రం ఇప్పటికీ రివీల్ చేయలేదు మేకర్స్. సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియలో శర వేగంగా సెట్ పనులు జరుగుతున్నాయి. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. బర్రెలక్క, అబ్బాస్, రాజ్ తరుణ్, కుమారి ఆంటీ, యాదమ్మ రాజు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, టాలీవుడ్ సీనియర్ నటి సనా, రోహిత్ తదితరుల పేర్లు ఈసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Hello All! Presenting the much-awaited promo of SEASON 8! This time, we’re taking entertainment to a whole new level with thrills, surprises, and drama like never before. #BiggBossTelugu8 @disneyplushstel @iamnagarjuna

Bigg Boss Telugu 8 - Promo | Coming Soon | Nagarjuna Akkineni | Star Maa

We are bringing entertainment back with a BANG !!!! Presenting the logo for the epic Season 8 of Bigg Boss! Are you ready for an Infinity of fun and entertainment?! #BiggBossTelugu8 @StarMaa @DisneyPlusHSTel

 

Posted

NTR heroine re-entry in Bigg Boss: బిగ్‏బాస్‏లోకి ఎన్టీఆర్ హీరోయిన్.. రీఎంట్రీ ఇస్తోన్న సీనియర్ బ్యూటీ..

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఆ తార.. పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరమైంది. చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆ హీరోయిన్.. ఇప్పుడిప్పుడే నెట్టింట యాక్టివ్ అయ్యింది. రోజూ లేటేస్ట్ ఫోటోస్, ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది. ఇప్పుడు బిగ్‏బాస్ రియాల్టీ షోలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్

Bigg Boss Telugu season 8

bigg-boss-telugu-season-8-4.jpg?w=1280

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షో సందడి స్టార్ట్ కాబోతుంది. ఇప్పటివరకు తెలుగులో సీజన్స్ 7 కంప్లీట్ చేసుకున్న ఈ షో.. త్వరలోనే సీజన్ 8 ప్రారంభం కానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ లీస్ట్ వైరలవుతుంది. సీరియల్ నటీనటులు, యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్ కూడా ఈసారి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ కూడా బిగ్‏బాస్ షోలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఆ తార.. పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరమైంది. చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆ హీరోయిన్.. ఇప్పుడిప్పుడే నెట్టింట యాక్టివ్ అయ్యింది. రోజూ లేటేస్ట్ ఫోటోస్, ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది. ఇప్పుడు బిగ్‏బాస్ రియాల్టీ షోలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ సమీరా రెడ్డి.

బిగ్‏బాస్ సీజన్ 8 త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. కంటెస్టెంట్ ఎంపిక కూడా జరిగిపోయిందని..ఈసారి బిగ్‏బాస్ రియాల్టీ షోలోకి టాలీవుడ్ హీరోహీరోయిన్స్ కూడా అడుగుపెట్టనున్నారట. ఈసారి ఈ రియాల్టీ షోలోకి ఒకప్పటి హీరోయిన్ సమీరారెడ్డి కూడా పాల్గొనబోతుందని టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. సమీరా రెడ్డి తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన అశోక్ సినిమాలో నటించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి జోడిగా జై చిరంజీవి సినిమాలో నటించింది. ఇవే కాకుండా తమిళంలో సూర్య సరసన నటించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైన సమీరా రెడ్డి ఇప్పుడు హిందీ బిగ్‏బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందట.

ఈసారి బిగ్‏బాస్ సీజన్ 8 కోసం ఈ బ్యూటీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సమీరా రెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు సమీరా రెడ్డి హిందీ బిగ్‏బాస్ రియాల్టీ షోలోకి ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది. అలాగే సినిమాల్లో సరైన అవకాశాలు వస్తే మరోసారి నటించేందుకు రెడీగా ఉందని సమాచారం.

https://www.instagram.com/p/C-aHHNiCZ9Y

 

 

Posted

Bigg Boss Telugu 8 Contestants Final List By Adi Reddy | Bigg Boss 8 Telugu

 

  • The title was changed to Bigg Boss: Season 8
Posted

Kavya alias Deepika: బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుందీ సెలబ్రిటీ గేమ్ షో. త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్ల వేట మొదలెట్టిందని సమాచారం. గత ఏడాది కాలంగా నెట్టింట ట్రెండింగ్ లో ఉన్న వారిని హౌజ్‌లోకి తెచ్చేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతోందట.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుందీ సెలబ్రిటీ గేమ్ షో. త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్ల వేట మొదలెట్టిందని సమాచారం. గత ఏడాది కాలంగా నెట్టింట ట్రెండింగ్ లో ఉన్న వారిని హౌజ్‌లోకి తెచ్చేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతోందట. గత సీజన్లలో మాదిరి కాకుండా ఈసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బరిలోకి దింపుతున్నట్లు నెట్టింట టాక్ నడుస్తోంది. అలాగే కొందరి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే బిగ్‌బాస్ సీజ‌న్‌లోకి బ్ర‌హ్మ‌ముడి సీరియల్ న‌టి కావ్య రాబోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకెళుతోన్న టీవీ సీరియల్స్ లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఇందులోని కావ్య- రాజ్‌ జోడి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక న‌టి కావ్య విషయానికి వస్తే.. ఆమె అస‌లు పేరు దీపికా రంగరాజ్. ఈమె కన్నడ నటి. ముందుగా ‘చిత్రం పేసుతాడి’ అనే తమిళ సీరియల్ లో నటించిన ఆమె అది ముగిసే సమయానికి బ్రహ్మముడి సీరియల్ లో అవకాశం దక్కించుకుంది.

ఈ సీరియల్ తో దీపికకు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపించే దీపిక చేసే అల్లరి, కామెడీ టైమింగ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న దీపిక బిగ్ బాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ టీవీ షోలో పాల్గొన్న దీపికాతో శ్రీ‌ముఖి నిన్ను మ‌రో మూడు నెలల పాటు షోకు రానివ్వం’ అని అంది. దీంతో వెంట‌నే దీపికా ‘ఏంటీ నన్ను బిగ్ బాస్‌కు పంపిస్తారా’ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో దీపిక నిజంగానే బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతంద‌నే వార్త నెట్టంట హాల్‌చ‌ల్ చేస్తోంది. ఒకవేళ కావ్య వస్తే మాత్రం బిగ్ బాస్ లో అల్లరి మాములుగా ఉండదే కామెంట్ వస్తోంది.

 

Posted

Bigg Boss: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‏కు శుభం కార్డ్.. బిగ్‏బాస్‏లోకి రిషి, వసుధార.. ?

చాలాకాలం ఈ సీరియల్ కు దూరంగా ఉన్న రిషి.. ఇటీవలే రీఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ అప్పుడే అభిమానులకు షాకిచ్చారు మేకర్స్. సీరియల్ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేస్తూ గుప్పెడంత మనసు సీరియల్ కు శుభం కార్డ్ వేశారు. ఇప్పటికే ఈ సీరియల్ షూటింగ్ కూడా క్లోజ్ అయ్యింది. ఇప్పుడిప్పుడే రిషి రావడంతో ఖుషి అయిన అభిమానులకు సీరియల్ క్లోజ్ అంటూ పెద్ద షాకిచ్చారు.

rishi-vasudhara.jpg?w=1280

బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న సీరియల్ గుప్పెడంత మనసు. కార్తీక దీపం సీరియల్ తర్వాత ఆ స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సీరియల్లో హీరోహీరోయిన్లుగా నటించిన రిషి, వసుధార పాత్రలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో రిషి పాత్రలో ముఖేష్ గౌడ, వసుధార పాత్రలో రక్షిత గౌడ తమ అద్భుతమైన నటనతో తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అయితే కొన్ని నెలలపాటు ఈ సీరియల్లో రిషి కనిపించకపోవడంతో సోషల్ మీడియాల అతడి ఫ్యాన్స్ చేసిన రచ్చ గురించి తెలిసిందే. చాలాకాలం ఈ సీరియల్ కు దూరంగా ఉన్న రిషి.. ఇటీవలే రీఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ అప్పుడే అభిమానులకు షాకిచ్చారు మేకర్స్. సీరియల్ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేస్తూ గుప్పెడంత మనసు సీరియల్ కు శుభం కార్డ్ వేశారు. ఇప్పటికే ఈ సీరియల్ షూటింగ్ కూడా క్లోజ్ అయ్యింది. ఇప్పుడిప్పుడే రిషి రావడంతో ఖుషి అయిన అభిమానులకు సీరియల్ క్లోజ్ అంటూ పెద్ద షాకిచ్చారు.

అయితే ఈ సీరియల్ కు ఉన్నట్లుండి శుభంకార్డ్ వేసారు మేకర్స్. నిజానికి ఈ సీరియల్లో అనేక సందేహాలు ఉండిపోయాయి. రంగా ఎవరు.. ? రిషికి, రంగాకి ఉన్న సంబంధం ఏంటీ..? అసలు రిషి రంగాగా ఎందుకు నటించాడు ? అనే విషయాలకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే సీరియల్ కు ముగింపు పలికారు. అయితే ఇలా ఆకస్మాత్తుగా గుప్పెడంత మనసు సీరియల్ కు గుమ్మడికాయ కొట్టడంతో సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. గుప్పెడంత మనసు సీరియల్ కు ఇలా ఉన్నట్లుండి ముగింపు పలకడానికి మరో కారణం ఉందంటున్నారు ఫ్యాన్స్. అదెంటంటే.. బిగ్ బాస్.

అవును.. గుప్పెడంత మనసు సీరియల్ ను ఆకస్మాత్తుగా క్లోజ్ చేయడానికి కారణం బిగ్ బాస్ రియాల్టీ షో అని తెలుస్తోంది. ఈ సీరియల్లో హీరోహీరోయిన్లుగా నటించిన రిషి, వసుధార ఇద్దరూ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్ నడుస్తుంది. అయితే వీరిద్దరు ఒకే బిగ్ బాస్ షోలోకి కాకుండా.. వేరు వేరుగా వెళ్తున్నారట. అంటే కన్నడ బిగ్ బాస్ రియాల్టీ షోలోకి రిషి అలియాస్ ముఖేష్ గౌడ వెళ్తుండగా.. తెలుగు బిగ్ బాస్ షోలోకి వసుధార అలియాస్ రక్షిత గౌడ కంటెస్టెంట్ గా వెళ్తుందని టాక్ వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఉన్నట్లుండి ఈ షోను క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. మరికొన్ని రోజుల్లో తెలుగు బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్ షోలు ప్రారంభం కానున్నాయి.

Posted

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టనున్న టాలీవుడ్ హీరో.. అసలు ఊహించలేదుగా

గతేడాది 'అంతా ఉల్టా పుల్టా' అంటూ బిగ్ బాస్ చేసి సందడి అంతా ఇంతా కాదు. ఈసారి ఏకంగా ఎంటర్టైన్మెంట్ లిమిట్‌లెస్ అంటూ ఈ సెలబ్రిటీ గేమ్ షోపై అంచనాలు పెంచేస్తున్నారు. కొత్త సీజన్ కు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెట్ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.

Bigg Boss Telugu 8

bigg-boss-telugu-8-2.jpg?w=1280

బిగ్ బాస్ కొత్త సీజన్ లాంఛింగ్ కు ముహూర్తం ముంచుకొస్తోంది. షో లాంచింగ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ సెప్టెంబర్ 1 లేదా 8 వ తేదీల్లో బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది. గతేడాది ‘అంతా ఉల్టా పుల్టా’ అంటూ బిగ్ బాస్ చేసి సందడి అంతా ఇంతా కాదు. ఈసారి ఏకంగా ఎంటర్టైన్మెంట్ లిమిట్‌లెస్ అంటూ ఈ సెలబ్రిటీ గేమ్ షోపై అంచనాలు పెంచేస్తున్నారు. కొత్త సీజన్ కు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెట్ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో లాగే ఈసారి కూడా 100 రోజులకు పైగానే బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనుందని సమాచారం. మరోవైపు ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్స్ గురించి రోజుకో వార్త వినిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లోనూ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ చాలా పేర్లు వైరల్ అవుతున్నాయి. వింధ్య విశాఖ, నయని పావని, జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, రీతూ చౌదరి, అమృతా ప్రణయ్, కుమారీ ఆంటీ, బర్రెలక్క, నటి సోనియా సింగ్, ఫేమస్ యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ.. హీరోయిన్ కుషితా కల్లపు.. సురేఖ వాణి తో పాటు ఆమె కూతురు సుప్రిత ఇలా చాలామంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా స్టార్ కమెడియన్ కమ్ హీరో అభినవ్ గోమఠం కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

అభినవ్ గోమఠం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్‌రా’ అంటూ అతను చెప్పిన డైలాగులు ఓ రేంజ్ లో పేలాయి. కామెడీ తో పాటు సెటైరికల్ డైలాగ్స్ వేయడంలో అభినవ్ దిట్ట.సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో అతను పండించిన కామెడీకి అందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు. అలాగే పలు సినిమాల్లోనూ మెరిశాడు. ఇటీవల తన ట్రేడ మార్క్ డైలాగ్ పేరుతోనే వచ్చిన సినిమా ‘ మస్తు షేడ్స్ ఉన్నాయి రా’ హీరోగా కూడా కనిపించాడు. ఈక్రమంలోనే అభినవ్ కు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్ట్యా బిగ్ బాస్ టీమ్ అతనిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒక వేళ అతను హౌస్‌లోకి వస్తే ఎంటర్ టైన్మెంట్ డబుల్ అవ్వడం ఖాయం.

https://www.instagram.com/reel/C76pcAkPRH7

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pranay Varma (@prrranay)

  • 2 weeks later...
Posted

Bigg Boss Telugu 8 Final Contestants List By Adi Reddy

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...