Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Recommended Posts

Posted

Raj Tarun: అడిగితే సాయం చేస్తా.. ఇక అతకడం మాత్రం ఉండదంటున్న రాజ్ తరుణ్

లొల్లి నిజం. మరి పెళ్లి?! లావణ్య- రాజ్‌ తరుణ్‌ మధ్యలో మాల్వీ మల్హోత్ర... ట్రయాంగిల్‌ సహజీవన వివాద కథా చిత్రమ్‌లో కంప్లేంట్‌ చాప్టర్‌ మరో లెవల్‌. ఆమె ఫిర్యాదు చేస్తుందని ఈవిడకు తెలుసు.. ఈమె కంప్లేంట్‌ ఇస్తారని ఆవిడకు తెలుసు... ఆ ఇద్దరి పరస్పర కంప్లైంట్‌ల సంగతి ఆయనకు ముందే తెలుసు....సూన్‌ అతను కూడా కంప్లేంట్ ఇస్తాడనే ముచ్చట ఈ ఇద్దరికీ తెలుసూ... టోటల్‌గా ఫిర్యాదు చాటు ఇలాఖత్‌ కథ ట్విస్ట్‌ భరిత సినిమాను తలపిస్తోంది.

Raj Tarun, Lavanya, Malvi

raj-tarun-case.jpg?w=1280

11 ఏళ్ల  లివ్‌ ఇన్‌ రిలేషన్‌ బీటలు వారి మ్యాటర్‌ నార్సింగ్‌ ఠానాకు చేరింది. అయితేనేం ఆమె పట్ల అతనికి గ్రాటిట్యూడ్‌ తగ్గలేదు..ఇక ఆమెకు అతనిపై ప్రేమ చెక్కు చెదరలేదు.. మ్యాటర్‌ చిరిగి చాటై పీక్స్‌కు చేరిన తరుణంలోనూ ఆ ఇద్దరి మన్‌ కీ బాత్‌ చూస్తే .. కొత్త కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది.

డ్రగ్స్‌..మస్తాన్‌ స్థాయితో  రిలేషన్‌ షిప్‌.. ఆపై టార్చర్‌..అవన్నీ భరించలేక  లావణ్య నుంచి తను దూరం జరగినాననేది రాజ్‌ తరుణ్‌ వెర్షన్‌. 11 ఏళ్ల  తమ సహజీవనానికి రాజ్‌ తరుణ్‌ కటీఫ్‌ చెప్పడానికి కారణం మాల్వీ మల్హోత్ర అనేది లావణ్య ఆరోపణ. ఇన్నాళ్లు లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌లో ఉండి  ఇప్పుడు మోసం చేశాడని నార్సింగ్‌ పీఎస్‌లో కంప్లేంట్‌ ఇచ్చారామె. మాల్వీ మల్హోత్ర  ఆమె ప్యామిలీ నుంచి థ్రెట్‌ వుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరోపణలు సరే ఆధారాలేవని నోటీసులు ఇవ్వడంతో  నార్సింగ్‌ ఠాణాకు వచ్చారామె. లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌ మాత్రమే కాదు తమకు పెళ్లయిందన్నారు.

జస్ట్‌ రిలేషన్‌ షిప్‌..అది కూడా కట్‌ అయి ఏడేళ్లయిందన్నారు రాజ్‌ తరుణ్‌. కానీ లేటెస్ట్‌గా ఫ్రేమ్‌లోకి వచ్చిన లావణ్య మాత్రం..ఔను మేమిద్దం పెళ్లి చేసుకున్నామన్నారు. సహజీవనం నిజమే కానీ ఆమెతో వేగలేక తన ఇంట్లోకి తానే వెళ్లిపోయాననన్నారు రాజ్‌ తరుణ్‌. మాల్వీ మల్హోత్ర తాను రిలేషన్‌షిప్లో ఉన్నామన్న లావణ్య ఆరోపణలు అవాస్తమన్నారాయన. కానీ తమ మధ్య గొడవలకు మాల్వీనే కారణమన్నారు లావణ్య.  ఐతే తనపై నిరాధార ఆరోపణలు చేసిన లావణ్యపై మాల్వీ మల్లోత్ర పోలీసులకు కంప్లేంట్‌ ఇవ్వడం మరో ట్విస్ట్‌.

రాజ్‌కు తనకు మధ్య గ్యాప్‌ రావడానికి  పెరగడానికి కారణం మాల్వీనే అన్నారు లావణ్య. వాళ్లిద్దరి మధ్య ఎఫైర్‌ ఉందన్నారు.  లావణ్య ఆరోపిస్తున్నట్టుగా  ఆ ఇద్దరి మధ్య కుచ్‌ కుచ్‌  రిలేషన్‌ షిప్‌ కత వుందా?  మాల్వీ సైడ్‌ తీసుకున్న రాజ్‌ తరుణ్‌.. తనకు వార్నింగ్‌ ఇచ్చారని మరో సంచలనాన్ని తెరపైకి తెచ్చారు లావణ్య. మాన్వీతోనే కాదు మరికొందరితోనూ రాజ్‌ కు ఎఫైర్స్‌ ఉన్నాయన్నారు  లావణ్య. తమకు పెళ్లయిందనే విషయం వాళ్లలో కొందరికి తెలియదని.. తాను చెప్పాక వాళ్లు సైడయ్యారన్నారు. కానీ ఎంత చెప్పినా మాన్వీ కన్విన్స్‌ కాకపోగా తనను చంపేస్తానని బెదిరించిందన్నారు.

రాజ్‌ తరుణ్‌ పేరెంట్స్‌ సహా రాజారవీంద్రకు తమ విషయాలన్నీ తెలుసన్నారు లావణ్య.  ఇప్పటికీ తన మనసంతా రాజ్‌ తరుణే అన్నారామె. కథ ఇందాక వచ్చాక ఇక కన్వీన్స్‌ అయ్యే ఛాన్సే లేదని క్లియర్‌ కట్‌గా చెప్పారు రాజ్‌ తరుణ్‌..  లీగల్‌గా ఫైట్‌  చేస్తానన్నారు. అడిగితే సాయం చేస్తేనే తప్ప ఇక అతకడం మాత్రం ఉండదన్నారు.

ఇటు లావణ్య అటు మాల్వీ ఆ ఇద్దరి కంప్లేంట్స్‌ దాఖలు చేయపడినివి. ఇక నెక్ట్స్ రాజ్‌ తరుణ్‌ ఫిర్యాదు ఆన్‌ ది వే.  ట్విస్ట్‌ భరితంగా సాగుతోన్న సహజీవన వివాద కథా చిత్రమ్‌లో ఇంకెన్ని మలుపులో.. మెరుపులో వేచి చూడాల్సిందే.

Posted

Raj Tarun Lavanya marriage at a temple, affairs: మేమిద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నాం.. రాజ్ తరుణ్‏కు చాలా మందితో ఎఫైర్స్.. లావణ్య షాకింగ్ కామెంట్స్..

మరోవైపు హీరోయిన్ మాల్వీ మల్హో్త్రా మీడియా ముందుకొచ్చారు. తనకు రాజ్‌ తరణ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజ్‌తరుణ్‌ తనకు సహనటుడు మాత్రమే అని.. లావణ్య చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు మాల్వీ మల్హాత్రా. రాజ్‌తో నటించిన ప్రతి హీరోయిన్‌ని లావణ్య అనుమానిస్తుందని.. అందరిని ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన లావణ్య రాజ్ తరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

lavanya-raj-tarun.jpg?w=1280

సినిమా రేంజ్‌ ట్విస్టులతో రాజ్‌ తరుణ్ కేసు ఇంట్రెస్టింగ్‌గా మారింది. తనను ప్రేమించి మోసం చేశాడని, ఇప్పుడు మాల్వీ అనే మరో హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నాడంటూ రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్యకే షాకిచ్చారు పోలీసులు. సరైన ఆధారాలు సమర్పించాలంటూ CRPC కింద నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి నుంచి లావణ్య అందుబాటులో లేనట్లు టాక్ నడిచింది. మరోవైపు హీరోయిన్ మాల్వీ మల్హో్త్రా మీడియా ముందుకొచ్చారు. తనకు రాజ్‌ తరణ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజ్‌తరుణ్‌ తనకు సహనటుడు మాత్రమే అని.. లావణ్య చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు మాల్వీ మల్హాత్రా. రాజ్‌తో నటించిన ప్రతి హీరోయిన్‌ని లావణ్య అనుమానిస్తుందని.. అందరిని ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన లావణ్య రాజ్ తరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

“నాకు రాజ్ తరుణ్ కు 14 ఏళ్లుగా పరిచయం ఉంది. దాదాపు 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాం. మాల్వీ మల్హోత్రా వచ్చాక నన్ను దూరం పెడుతున్నాడు. ఆమె నన్ను చంపేస్తానని బెదిరించింది. వాళ్లిద్దరు కలిసి చెన్నైలో హోటల్లో ఉంటున్నారు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. మస్తాన్ సాయికి, నాకు గొడవైంది. అందుకే అతనిపై ఫిర్యాదు చేశాను. నాతో మైండ్ గేమ్ ఆడారు. ఆ ఆటలో మాస్తాన్ సాయి, నేను ఇద్దరం బాధితులమే. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్ లేకుండా నేను బతకలేను ” అని అన్నారు.

“నేను, మస్తాన్ సాయి ఎప్పుడు జంటగా కనిపించలేదు. ఒక పెళ్లికి గుంటూరు వెళ్లాం. అతడు కేవలం మ్యూచువల్ ఫ్రెండ్. నాతో ఎవరు మాట్లాడినా అతడితో రిలేషన్ లో ఉన్నట్లేనా.. ? నాకు అన్యాయం జరిగింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా దగ్గర రాజ్ తరుణ్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. లవర్ సినిమా నుంచి మాకు గొడవలు స్టార్ట్ అయ్యాయి. డబ్బులు కోసం నేను బెదిరించాల్సిన అవసరం లేదు. చాలా భరించాను.. అతడికి చాలా మంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చింది.

Posted

Raj Tharun: రాజ్ తరుణ్-లావణ్య కేసులో సంచలన విషయాలు వెల్లడించిన అడ్వొకేట్ కల్యాణ్ దిలీప్ సుంకర

cr-20240710tn668eabbc19572.jpg

లావణ్య రెండోసారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు

అన్ని ఆధారాలు చూశాకే పోలీసులు కేసు నమోదు చేశారన్న అడ్వొకేట్ 

రాజ్ తరుణ్ మాట్లాడిన ఆడియో క్లిప్స్‌ను మీడియాకు విడుదల చేస్తామని వెల్లడి

బీరు బాటిల్స్‌తో లావణ్యపై దాడి చేయడమో లేక ఆమె కొట్టుకునేలా చేయడమో జరిగిందని వెల్లడి

నిస్సహాయస్థితిలో అమ్మాయిని వేధిస్తుంటే ఎదురు తిరగకుండా ఏంచేస్తుందన్న కల్యాణ్ దిలీప్

నటుడు రాజ్ తరుణ్ - లావణ్య ఎపిసోడ్‌లో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. రాజ్ తరుణ్‌పై మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు ఇవ్వలేదు. రెండోసారి ఆధారాలు ఇవ్వడంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. హీరోయిన్ మాల్వితో రాజ్ తరుణ్ ఉంటూ తనను మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ కుమార్ సోదరుడిపై కూడా ఆమె ఫిర్యాదు చేసింది. సోదరుడు తనను పలుమార్లు బెదిరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు, మాల్వీ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను, తన తమ్ముడిని లావణ్య బెదిరిస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. లావణ్యపై గతంలో సైబరాబాద్ షీ-టీమ్‌కు కూడా ఫిర్యాదు చేశారు.

రాజ్ తరుణ్ పదేళ్లుగా తనతో కాపురం చేస్తున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నారు. తనకు కొన్నాళ్ల క్రితం అబార్షన్ చేయించినట్లు చెప్పారు. తాను అన్విక పేరుతో రాజ్ తరుణ్‌తో కలిసి ఉన్నట్లు చెప్పారు. అన్విక పేరుతో ఇద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్ళామన్నారు. మాల్వి వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనను దూరం పెట్టారని లావణ్య ఆరోపించారు. మాల్వీ కోసం అతను ముంబై వెళ్ళాడని, దీనిని తాను ప్రశ్నించానని.. నాటి నుంచి తనను దూరం పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లావణ్య ఫిర్యాదును ఆధారాలతో స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

షాకింగ్ విషయాలు వెల్లడించిన కల్యాణ్ దిలీప్ సుంకర

రాజ్ తరుణ్‌పై 420, 493, 506 కింద కేసు నమోదైనట్లు అడ్వొకేట్ కల్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు. పోలీసులు వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేశాక... అన్ని ఆధారాలు చూశాకే కేసు నమోదు చేశారన్నారు. వాట్సాప్ చాటింగ్‌‌లో లావణ్యను రాజ్ తరుణ్ బూతులు తిట్టాడన్నారు. లావణ్యకు అక్రమ సంబంధం అంటగట్టే ప్రయత్నంలో తన చేతిని తానే కాల్చుకున్నాడన్నారు. రాజ్ తరుణ్ మాట్లాడిన వాటికి ఆధారాలు లేవన్నారు. అతను మాట్లాడిన ఆడియో క్లిప్స్‌ను కూడా మీడియాకు విడుదల చేస్తామన్నారు.

రాజ్ తరుణ్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. రేపో మాపో పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తారని తెలిపారు. లావణ్య బూతులు మాట్లాడుతోందని చాలా చానల్స్‌లో వైరల్ చేశారని.. కానీ బీరు బాటిల్స్‌తో లావణ్యను రాజ్ తరుణ్ కొట్టడమో... లేక కొట్టుకునేలా చేశాడో తెలియదు... ఆ సమయంలో తిట్టిందన్నారు. అమ్మాయిని చిత్రవధ చేస్తుంటే... నిస్సహాయస్థితిలో తిరగబడకుండా ఏం చేస్తుందన్నారు. రేపు ఉదయం మీడియా ముందుకు పూర్తి వివరాలతో వస్తామన్నారు. మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు.

...

Complete article

Posted

Raj Tharun: రాజ్ తరుణ్‌పై లావణ్య రెండోసారి ఆధారాలతో ఫిర్యాదు చేశారు: డీసీపీ శ్రీనివాస్

cr-20240710tn668e908e19bf8.jpg

ఆధారాలు అందించాలని లావణ్యకు నోటీసులు ఇచ్చామన్న డీసీపీ

దీంతో లావణ్య మరోసారి ఫిర్యాదు చేశారని వెల్లడి

రాజ్ తరుణ్‌పై సెక్షన్ 493 కింద కేసు నమోదు 

సినీ నటుడు రాజ్ తరుణ్‌పై లావణ్య మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు ఇవ్వలేదని అందుకే ఆధారాలు కావాలని ఆమెకు నోటీసులు జారీ చేశామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆమె రెండోసారి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో రాజ్ తరుణ్‌పై సెక్షన్ 493 కింద కేసు నమోదు చేశామన్నారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని లావణ్య నిన్న మరో ఫిర్యాదు చేసిందన్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. పదేళ్లుగా తనతో కాపురం చేసినట్లు ఆమె చెప్పిందన్నారు. రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అబార్షన్ చేయించాడు: లావణ్య

రాజ్ తరుణ్‌తో తనకు పదేళ్ల క్రితం పెళ్లయినట్లు లావణ్య తెలిపారు. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు ఆబార్షన్ చేయించారన్నారు. మెడికల్ డాక్యుమెంట్లను తాను పోలీసులకు అందించినట్లు చెప్పారు. లావణ్య అలియాస్ అన్విక పేరుతో తాము కలిసి ఉన్నట్లు చెప్పారు. అన్విక పేరుతో తాము విదేశాలకు వెళ్లామన్నారు. మాల్వీ వచ్చాక రాజ్ తరుణ్ తనను దూరం పెట్టారని ఆరోపించారు. మాల్వీ కోసం అతను ముంబై వెళ్లాడని, దీనిపై నిలదీయడంతో తనను దూరం పెట్టాడన్నారు.

...

Complete article

Posted

going to police station, filing a complaint, etc. is going to accomplish what in a broken relationship?

what kind of relationship/marriage would that be even if the court orders them to live together??

Posted

420, 406, 493 charges filed. 493 is nonbailable. this could turn ugly

రాజ్‌తరుణ్‌కు పదేళ్ల జైలు శిక్ష!🔴LIVE | Hero raj tarun Case Update | Lavanya vs Malvi Malhotra | RTV

 

Posted

రోజుకో మలుపు.. పూటకో ట్విస్ట్ LIVE | Actor Raj Tarun, Lavanya Case Update - TV9

 

Posted

Raj Tarun: Lavanys's suicide attempt - రాజ్ లేని లైఫ్ నాకొద్దు.. ఆత్మహత్య చేసుకుంటా.. లావణ్య అర్ధరాత్రి మెసేజ్

cr-20240713tn6691ea2fbf2d3.jpg

రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్

ఆత్మహత్య చేసుకుంటానంటూ తన అడ్వకేట్‌కు మెసేజ్ పెట్టిన లావణ్య

తన ఆత్మహత్యకు మాల్వీ ప్రధాన కారణమంటూ మెసేజ్‌లో పేర్కొన్న వైనం

సమాచారం అందుకున్న వెంటనే ఆమె వద్దకు వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు

సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అతడు తనను మోసం చేశాడంటూ ఇటీవల లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె శుక్రవారం అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్‌కు మెసేజ్ పంపించింది. తాను వెళ్లిపోతున్నట్టు అందులో పేర్కొంది. వెంటనే స్పందించిన అడ్వకేట్ డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 

అయితే, తానేంటో తెలిసిన వారే తనను తప్పుబట్టారని లావణ్య తన మెసేజ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేను. బతకలేను. అన్నీ కోల్పోయాను. అందరి వల్ల నేనే మోసపోయాను. రాజ్ తల్లిదండ్రులు కూడా నా చావుకు కారణం. రాజ్ మొత్తం మారిపోయాడు. నా చావును కోరుకున్నాడు. మాల్వీ మల్హోత్రా నా చావుకు ప్రధాన కారణం. నా కుటుంబం, దిలీప్ సుంకర, మీడియాకు నా క్షమాపణలు’’ అంటూ లావణ్య అడ్వకేట్‌కు సందేశం పంపించింది.

...

Complete article

Posted

Murder attempt on Malvi Malhotra: హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై హత్యాయత్నం.. మూడు కత్తి పోట్లు.. అసలు ఏం జరిగిందంటే?

లావణ్య ఫిర్యాదును పరిగణన లోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఆమె తమ్ముడు మయాంక్ మల్హోత్రాను ఏ1, ఏ 2, ఏ 3గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు జరుగుతుండగానే మాల్వి మల్హోత్రా మీద అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌ యోగేష్‌ తల్లి సంచలన ఆరోపణలు చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది.

malvi-malhotra-3.jpg?w=1280

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. రాజ్ తనను ప్రేమంచి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము 11 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని అందులో తెలిపింది. అలాగే రాజ్ తనకు అబార్షన్ కూడా చేయించాడంటూ అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు, ఫొటోలను పోలీసులకు సమర్పించింది. ఇక హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణంగానే రాజ్ తనన దూరం పెట్టాడని ఆరోపించింది. మాల్వీతో పాటు ఆమె సోదరుడు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన నటి మాల్వీ కూడా తిరిగి లావణ్యపై కేసు పెట్టింది. దీంతో లావణ్య ఫిర్యాదును పరిగణన లోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఆమె తమ్ముడు మయాంక్ మల్హోత్రాను ఏ1, ఏ 2, ఏ 3గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు జరుగుతుండగానే మాల్వి మల్హోత్రా మీద అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌ యోగేష్‌ తల్లి సంచలన ఆరోపణలు చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. మాల్వీ తన కుమారుడిని ప్రేమ పేరుతో మోసం చేసిందని, తమ ఆస్తులన్నింటినీ లాక్కుందని సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఒక మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

అదేంటంటే.. గతంలో నటి మాల్వి మల్హోత్రా మీద హత్యాయత్నం జరిగింది. మూడు సార్లు కత్తితో ఆమెను పొడిచారు. ఈ ఘటనలో గాయపడిన మాల్విని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారన్న విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇది సుమారు నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటన. 2020 అక్టోబర్‌లో ముంబైలోని అంధేరి ప్రాంతంలో మాల్వీ మల్హోత్రాపై దాడి జరిగింది. ఆమె మీద దాడి చేసింది మరెవరో కాదు యోగేష్. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా యోగేష్.. మాల్వీపై ఒత్తిడి తెచ్చారట. అయితే అందుకు ఆమె అంగీకరించలేదట. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యోగేశ్.. మాల్వీని కత్తితో పొడిచి పారిపోయాడట. అయితే ఈ దాడిలో మాల్వీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. అక్కడ ఆమెకు శస్త్ర చికిత్స కూడా జరిగిందట. దీనికి సంబంధించి మాల్వీ యోగేశ్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో పోలీసులు హత్యాయత్నం కేసులో యోగేశ్ ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మాల్వి మల్హోత్రా మీద కత్తితో దాడి చేసింది అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అలాగే మాల్వి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

  • 1 month later...
Posted

Raj Tarun: రాజ్ తరుణ్‌కు భారీ షాక్.. లావణ్య చెప్పేవన్నీ నిజాలే అని తేల్చిన పోలీసులు

రాజ్ తరుణ్ కూడా లావణ్య పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆమె మరో వ్యక్తితో ఉంటుందని రాజ్ తరుణ్ ఆరోపించాడు. చాలా రోజులుగా ఈ వ్యవహారం సాగుతోంది. లావణ్య రాజ్ తరుణ్ ను విడిచిపెట్టే సమస్యే లేదు అని అంటుంది. తాజాగా  రాజ్‌తరుణ్‌- లావణ్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

 
Raj Tarun: రాజ్ తరుణ్‌కు భారీ షాక్.. లావణ్య చెప్పేవన్నీ నిజాలే అని తేల్చిన పోలీసులు
Raj Tarun

హీరో రాజ్ తరుణ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన విషయం తెలిసిందే..  తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఇప్పటికే లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ కూడా లావణ్య పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆమె మరో వ్యక్తితో ఉంటుందని రాజ్ తరుణ్ ఆరోపించాడు. చాలా రోజులుగా ఈ వ్యవహారం సాగుతోంది. లావణ్య రాజ్ తరుణ్ ను విడిచిపెట్టే సమస్యే లేదు అని అంటుంది. తాజాగా  రాజ్‌తరుణ్‌- లావణ్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్‌ మోసం చేశారంటూ నటి లావణ్య కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.

తాజాగా కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. చార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్లు చార్జిషీట్‌లో స్పష్టం చేశారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని.. లావణ్య చెప్పేవి వాస్తవాలేనని పోలీసులు తెలిపారు. ఇక.. లావణ్య కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్నారు రాజ్‌తరుణ్.

విచారణలో భాగంగా లావణ్య ఇంట్లో సాక్ష్యాలను సేకరించారు పోలీసులు. అనంతరం ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. లావణ్య ఇంటి దగ్గర సాక్ష్యాలు సేకరించిన తర్వాతే రాజ్ తరుణ్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చాము అని పోలీసులు తెలిపారు. పోలీసులు రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చడంతో అతని పెద్ద షాక్ తగిలింది. మరి దీని పై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Posted

Raj Tarun-Malvi Malhotra ని ఒకే ఫ్లాట్‌లో పట్టుకున్నానంటున్న Lavanya

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...