Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

How to lose weight?


Sanjiv

Question

6 answers to this question

Recommended Posts

  • 0

Weight Loss Tips: హఠాత్తుగా బరువు పెరగడం ముమ్మాటికీ చెడు సంకేతమే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

అధిక శరీర బరువు ఆరోగ్యానికి హానికరం. అందుకే ఎల్లప్పుడూ శరీర బరువును అదుపులో ఉంచుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే అకస్మాత్తుగా బరువు పెరగడం ప్రారంభిస్తే అది చెడు సంకేతంగా భావించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు చిన్నతనం నుంచే ఊబకాయంతో ఉంటారు. వీళ్లు వెయ్యి ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం సాధ్యంకాదు. పైగా తప్పుడు జీవనశైలి కారణంగా బరువు తగ్గడానికి..

weight-loss-2-4.jpg?w=1280&enlarge=true

అధిక శరీర బరువు ఆరోగ్యానికి హానికరం. అందుకే ఎల్లప్పుడూ శరీర బరువును అదుపులో ఉంచుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే అకస్మాత్తుగా బరువు పెరగడం ప్రారంభిస్తే అది చెడు సంకేతంగా భావించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు చిన్నతనం నుంచే ఊబకాయంతో ఉంటారు. వీళ్లు వెయ్యి ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం సాధ్యంకాదు. పైగా తప్పుడు జీవనశైలి కారణంగా బరువు తగ్గడానికి బదులు పెరుగడం ప్రారంభమవుతుంది. అయితే ఇంకొంత మంది ఉన్నట్లుండి అకస్మాత్తుగా లావైపోతారు.

సరైన ఆహారం, వ్యాయామం నియమాలు పాటిస్తే శరీర బరువు అదుపులో ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో డైటింగ్, వ్యాయామం సరిగ్గా ఉన్నప్పటికీ బరువు పెరుగుతూనే ఉంటుంది. దాని వెనుక ఏదైనా కారణం ఉందా? అంటే ఉందనే చెబుతున్నారు నిపుణులు. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేరట. సన్నబడటానికి, ఆరోగ్యంగా ఉండటానికి రాత్రికి 7-8 గంటల నిద్ర అవసరం.

ఆఫీసులో ఒత్తిడి, ఇంట్లో రకరకాల సమస్యలు, పని మీద దృష్టి పెట్టేలకపోవడం.. ఇలాంటి ఒత్తిడితో బరువు తగ్గడం సాధ్యం కాదు. అందుకే ఒత్తిడి కారణంగా బరువు పెరుగుతుంటే, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. పీసీఓడీ, థైరాయిడ్ వంటి సమస్యలు కూడా దాడిచేస్తాయి. ఇలాంటి సమయాల్లో బరువు తగ్గడం కష్టం అవుతుంది. ఆరోగ్య సమస్యలకు మెడిసిన్‌ తీసుకుంటే ఇవి కూడా బరువు పెరగడంపై దుష్ప్రభావం చూపుతాయి. ఇలాంటి వాళ్లు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం బెటర్‌.

సన్నగా, ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నీళ్లా తీసుకోవడం అవసరం. నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శరీరంలో ద్రవం పరిమాణం తగ్గినప్పుడు, వివిధ సమస్యలు తలెత్తుతాయి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

jagapati babu 😂

our healthy lifestyle - intermittent fasting for weight loss

 

Link to comment
Share on other sites

  • 0

"బరువు తగ్గేదే లే? తగ్గి తీరుతారు. II Weight loss demystified II Dr M.S.S. Mukharjee

 

Link to comment
Share on other sites

  • 0

ఈ ఒక్క తప్పు చేస్తే డైట్ చేసినా వెయిట్ తగ్గరు... తస్మాత్ జాగ్రత్త - Dr. Mukharjee

 

Link to comment
Share on other sites

  • 0

డైటింగ్ తో ప్రాణాపాయం???శ్రీదేవి మరణం నేర్పే పాఠం!!! II The truth behind Sridevi’s death

 

Link to comment
Share on other sites

  • 0

 

Weight Loss Diet: వేగంగా బరువుతగ్గాలా? అయితే సాయంత్రం పూట వీటిని తినకండి

రోడ్డుపై వాకింగ్‌కు వెళ్తున్నప్పుడు పక్కనే ఉన్న స్ట్రీట్‌ హోటల్‌ నుంచి వాసన ముక్కు పుటాలను తాకగానే చాలా మంది కంట్రోల్‌ తప్పుతారు. వెంటనే అక్కడికి వెళ్లి ఓ ప్లేట్ ఆర్డర్ చేసి హాయిగా ఆరగిస్తారు. అంతే కష్టపడి కోల్పోయిన కేలరీలు ఒక్క నిమిషంలో తిరిగి వస్తాయి. ఇలా నిరంతరం చేస్తుంటే కొవ్వు తగ్గడం సాధ్యం కాదు.

 
Weight Loss Diet: వేగంగా బరువుతగ్గాలా? అయితే సాయంత్రం పూట వీటిని తినకండి

సాధారణంగా మధ్యాహ్నం పూట చాలా మంది కాస్త ఎక్కువగానే ఆహారం తీసుకుంటారు. ఇలా భారీ భోజనం చేసిన తర్వాత సాయంత్రం పూట కూడా అధిక క్యాలరీలు ఉండే ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి డౌంజర్‌ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా సాయంత్రం తర్వాత ఎలాంటి ఆహారం తినకూడదో నిపుణుల మాటల్లో మీ కోసం..

శీతల పానీయాలు

సూర్యాస్తమయానికి ముందు, తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ శీతల పానీయాలు తీసుకోకూడదు. వీటికి వీలైనంత దూరంగా ఉండాలి. చక్కెర అధికంగా ఉండే సోడా పానీయాలు ఆరోగ్యానికి చాలా హానికరం. అవి బరువు పెరగడమే కాకుండా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. శీతల పానీయాలతోపాటు ఆల్కహాల్‌కు కూడా దూరంగా ఉండాలి.

చీజ్

చాలా ఫాస్ట్ ఫుడ్స్ లో చీజ్ ఉంటుంది. పిజ్జా, బర్గర్, పాస్తా వంటి ఆహారాలలో చీజ్ తప్పనిసరిగా ఉంటుంది. ఇందులో ఉప్పు, సోడియం ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో సంతృప్త కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. ఇటువంటి ఆహారాలు కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతాయి.

ప్రాసెస్ చేయబడిన ఆహారాలు

సాసేజ్‌లు, బేకరీల నుంచి ఇన్‌స్టంట్ నూడుల్స్ వరకు-ఈ రకమైన ఆహారాలలో చక్కెర, ఉప్పు కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అవి బరువును పెంచుతాయి. అలాగే బహుళ వ్యాధుల ప్రమాదాన్ని సృష్టిస్తాయి. అలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

బరువు తగ్గడానికి తినదగిన స్నాక్స్

ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి. ప్రొటీన్ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. పని చేయడానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. మధ్యాహ్నం వేళల్లో చిక్పీ, ముంగ్ కలై చాట్ తినవచ్చు. అలాగే మఖానా, ఉడికించిన శనగలు వంటి ఆహారాలు కూడా తినవచ్చు. ఇవి కడుపుని నింపడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అధిక నూనె, సుగంధ ద్రవ్యాలు, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండాలి.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...