Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

New Traffic Laws in India


TELUGU

Question

Bike Riding and Traffic Rules: ఇవి లేకుండా బైక్ నడిపితే మీరూ నేరస్తులే! వెంటనే బండి సీజ్..

వాస్తవానికి వాహనం నడుపుతున్నప్పుడు వాహనదారుడు తమ వెంట తీసుకెళ్లాల్సిన కొన్ని పత్రాలు ఉన్నాయి. ఇవి చట్టబద్దమైన పత్రాలు. వీటి గురించి తెలియకపోతే జరిమానాలు విధించడం లేదా వాహన రిజి స్ట్రేషన్ లేదా లైసెన్స్ సస్పెండ్ చేయడం వంటి పరిణామాలకు దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో అలాంటి కొన్ని పత్రాల గురించి మీకు తెలియజేస్తున్నాం. ద్విచక్ర వాహనాన్ని నడిపే ప్రతి వ్యక్తి వద్దా తప్పనిసరిగా ఉండాల్సిందే..

Traffic Police Checking

traffic-police-checking.jpg?w=1280

ప్రస్తుతం సమాజంలో ద్విచక్ర వాహనం లేని వారు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. అవసరాలు మనిషికి దానిపై ఆధారపడేలా చేసేసింది. చాలా కుటుంబాల్లో కనీసం ఒక బైక్ లేదా స్కూటర్ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో రెండు అంత కన్నా ఎక్కువ ద్విచక్ర వాహనాలు కూడా ఉంటాయి. అయితే ఈ బైక్ లేదా స్కూటర్ ను డ్రైవ్ చేయాలంటే తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. అది ఒక బాధ్యత. చాలా మందికి ఏది చేయాలో, ఏది చేయకూడదో తెలిసినా పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేసినప్పుడు ఇబ్బందులు పడతారు. మరికొంత మంది వాటిపై అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు. వాస్తవానికి వాహనం నడుపుతున్నప్పుడు వాహనదారుడు తమ వెంట తీసుకెళ్లాల్సిన కొన్ని పత్రాలు ఉన్నాయి. ఇవి చట్టబద్దమైన పత్రాలు. వీటి గురించి తెలియకపోతే జరిమానాలు విధించడం లేదా వాహన రిజి స్ట్రేషన్ లేదా లైసెన్స్ సస్పెండ్ చేయడం వంటి పరిణామాలకు దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో అలాంటి కొన్ని పత్రాల గురించి మీకు తెలియజేస్తున్నాం. ద్విచక్ర వాహనాన్ని నడిపే ప్రతి వ్యక్తి వద్దా తప్పనిసరిగా ఉండాల్సిందే..

పత్రాలు.. మీ మోటార్ సైకిల్ పై ప్రయాణించడానికి బయలుదేరే ముందు, మీరు భారతీయ రహదారులపై నడపడానికి అవసరమైన కొన్ని పత్రాలను తీసుకువెళుతున్నారో లేదో తనిఖీ చేయడం ముఖ్యం. మోటారు వాహనాల చట్టం, 1988 రైడ్ మొత్తం వ్యవధిలో వాహనదారుడి వద్ద ఉండేలా కింది పత్రాలను తప్పనిసరి చేసింది అవేంటంటే.. బైక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), రైడర్ డ్రైవింగ్ లైసెన్స్, ద్విచక్ర వాహన బీమా పాలసీ, నియంత్రణలో ఉన్న కాలుష్యం సర్టిఫికెట్ (పీయూసీ). అదనంగా, 50 ఏళ్లు పైబడిన వారు తమ మోటార్ సైకిల్ ను నడపడానికి వైద్యపరంగా ఫిట్ గా ఉన్నట్లు ప్రకటించే మెడికల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

బీమా ఉండాలి.. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, భారతీయ రహదారుల పై ప్రయాణించడానికి, వాహనదారులు తప్పనిసరిగా ద్విచక్ర వాహన బీమాను పొందాలి. అది వారి వాహనం ప్రమాదానికి గురైన సందర్భంలో కనీసం మూడో పక్షానికి ఆర్థికంగా వర్తిస్తుంది. వాహనదారులు బీమా లేకుండా వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించినట్లయితే, ఆ నేరం జరిమానా లేదా వారి లైసెన్స్ ను స్వాధీనం చేసుకునేందుకు దారి తీయవచ్చు.

ఎక్స్ ప్రెస్ వేలపై రైడింగ్.. మీరు సుదూర యాత్ర చేయాలనుకుంటున్నట్లయితే, ద్విచక్ర వాహనాల ప్రవేశాన్ని అనుమతించని ఎక్స్ ప్రెస్ వేలను నివారించడానికి మీరు మీ మార్గాన్ని విస్తృతంగా ప్లాన్ చేసుకోవాలి. సాధారణంగా, పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే, యమునా ఎక్స్ ప్రెస్ వే, ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వే.. ఈ మూడు మినహా ఇతర ఎక్స్ ప్రెస్ వేపై ద్విచక్ర వాహనాలు నడపడానికి వీలు లేదు. కొత్తగా నిర్మించిన కొన్ని వాటిపై ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ వే, గంగా ఎక్స్ ప్రెస్ వే వంటి వాటి పై ద్విచక్ర వాహనాల ప్రవేశాన్ని స్పష్టంగా నిషేధించే గెజిట్ నోటిఫికేషన్లు ప్రచురించారు. దీనిని మీరితే జరిమానాలు విధిస్తారు. అవి రూ. 1,200 నుంచి రూ. 20,000 వరకు ఉంటుంది.

పొల్యూషన్ సర్టిఫికెట్.. సెంట్రల్ మోటర్ వెహికల్స్ రూల్స్, 1989 ప్రకారం, రిజిస్ట్రేషన్ తర్వాత ఏడాది పూర్తయిన ప్రతి వాహనం ప్రభుత్వ ఏజెన్సీ జారీ చేసిన పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఉద్గారాల పరీక్షలను నిర్వహించే అధీకృత పరీక్ష కేంద్రం నుంచి పీయూసీ సర్టిఫికెట్ చెల్లుబాటు అయి ఉండాలి. ఇది లేకుంటే జరిమానాలు విధించవచ్చు లేదా వాహన రిజిస్ట్రేషన్ని నేరుగా నిలిపివేయవచ్చు.

అల్టరేషన్స్.. మోటారు వాహనాల చట్టం, 1988, అనుమతించని కొన్నింటికి ద్విచక్ర వాహనాలకు జోడించి అల్టరేషన్ చేయడం కూడా నేరమే. ఇంజిన్ శబ్దాన్ని పెంచే ఎగ్జాస్ట్ మోడ్లు, ఆర్టీఓ ఆమోదం లేకుండా నిర్మాణ మార్పులు లేదా రంగులో మార్పులు, ట్రాఫిక్ భద్రతా నిబంధనలకు అనుగుణంగా లేని కొన్ని లైట్లను ఇన్ స్టాల్ చేయడం ఇవన్నీ చట్ట విరుద్ధమే. టాప్ వేరియంట్ స్పెక్స్ కి సరిపోయే వాటికి డీకాల్స్ జోడించడం, టైర్లను అప్ గ్రేడ్ చేయడం కూడా అనుమతించరు.

...

Complete article

Link to comment
Share on other sites

6 answers to this question

Recommended Posts

  • 0

AI: డ్రంక్‌ డ్రైవ్‌ టెస్ట్‌ కూడా అవసరం లేదు.. ముఖాన్ని చూసే గుర్తించే ఏఐ టెక్నాలజీ..

ఇందులో కోసం పోలీసులు చెకింగ్ పాయింట్స్‌ ఏర్పాటు చేసి బ్రీత్‌ అనలైజర్ టెస్ట్‌లు చేస్తుంటారు. ఈ పరికరంలో వచ్చే రీడింగ్ ఆధారంగా సదరు వ్యక్తి మద్యం సేవించాడో లేదో చెప్పేస్తుంటారు. అయితే మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి...

Drunk And Drive

drunk-and-drive-1.jpg?w=1280

మద్యం సేవించి, వాహనం నడపడం చట్ట విరుద్ధమని తెలిసిందే. దీనివల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టినట్లు అవుతుంది. అందుకే ప్రభుత్వాలు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటాయి. ఇందుకోసమే పోలీసులు ఎప్పటికప్పుడు చెకింగ్స్‌ నిర్వహిస్తూ జరిమానాలను విధిస్తుంటారు. మద్యం సేవించి వాహన నడిపే వారిని గుర్తించేందుకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారని మనందరికీ తెలిసిందే.

ఇందులో కోసం పోలీసులు చెకింగ్ పాయింట్స్‌ ఏర్పాటు చేసి బ్రీత్‌ అనలైజర్ టెస్ట్‌లు చేస్తుంటారు. ఈ పరికరంలో వచ్చే రీడింగ్ ఆధారంగా సదరు వ్యక్తి మద్యం సేవించాడో లేదో చెప్పేస్తుంటారు. అయితే మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఏఐ సేవలు విస్తరిస్తున్న తరుణంలో మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిని కూడా ఏఐ టెక్నాలజీతో గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇకపై ఎలాంటి బ్రీత్‌ అనలైజర్స్‌ అవసరం లేకుండానే కేవలం వ్యక్తి ముఖ కదలికల ఆధారంగా మద్యం సేవించారో లేదో తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న కొత్త అల్గారిథమ్‌ ద్వారా 75 శాతం కచ్చితత్వంతో మద్యం సేవించిన వారిని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లతో పాటు కంప్యూటర్ విజన్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్‌ వారు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. వాహనం నడుపుతున్న వ్యక్తి చూస్తున్న దిశతో పాటు, అతని తల ఏ పొజిషినల్‌లో ఉందో ఏఐ కెమెరా ద్వారా విశ్లేషిస్తారు. ఇందుకోసం పరిశోధకులు సరికొత్త ఏఐ ఆల్గరిథమ్‌ను డిజైన్‌ చేస్తున్నారు. ఈ ఆల్గరిథమ్‌ డ్రైవర్‌ స్టీరింగ్‌ను ఎలా తిప్పుతున్నాడు, అతని ముఖ కవళికలు ఎలా ఉన్నాయి లాంటివన్ని రికార్డ్ చేస్తుంది.

ఈ టెక్నాలజీతో ఐ ట్రాకింగ్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్‌ల ఆధారంగా ఈ విషయాలను అంచనా వేస్తారని పరిశోధకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ గణంకాల ప్రకారం.. ఏటా జరిగే మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 20 నుంచి 30 శాతం మద్యం సేవించడం వల్లే జరిగాయని చెబుతున్నారు. ఈ కొత్త ఏఐ ఆల్గరిథమ్‌ ద్వారా రానున్న రోజుల్లో డ్రంక్‌ డ్రైవ్‌ కేసులు తగ్గుతాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

Link to comment
Share on other sites

  • 0

Quotation Stickers On Vehicle: మీ వాహనాలపై కొటేషన్లు స్టిక్కరింగ్ చేయిస్తున్నారా..? అయితే మీకు మూడినట్లే..!

హాయ్ అని ఆశ పెట్టకు.. బాయ్ అని బాధ పెట్టకు.. మనల్ని ఎవడ్రా ఆపేది.. నేను మంత్రి గారి తాలూకా..పామునైనా నమ్మవచ్చు కానీ ఆడదాన్ని నమ్మలేం.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వాహనాలపై ఇలాంటి కోటేషన్లు స్టిక్కరింగ్ చేయించుకునే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత ఈ స్టిక్కరింగ్ గోల మరింత ఎక్కువైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి స్టిక్కరింగ్స్ ఎక్కువయ్యాయి.

Stickers On Vehicles

stickers-on-vehicles.jpg?w=1280

హాయ్ అని ఆశ పెట్టకు.. బాయ్ అని బాధ పెట్టకు..

మనల్ని ఎవడ్రా ఆపేది.. నేను మంత్రి గారి తాలూకా..

పామునైనా నమ్మవచ్చు కానీ ఆడదాన్ని నమ్మలేం..

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వాహనాలపై ఇలాంటి కోటేషన్లు స్టిక్కరింగ్ చేయించుకునే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత ఈ స్టిక్కరింగ్ గోల మరింత ఎక్కువైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి స్టిక్కరింగ్స్ ఎక్కువయ్యాయి. అయితే ఇలాంటి కోటేషన్లు ఉన్న వాహనాలపై కోల్‌కత్తా పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. కోల్‌కత్తా పోలీసులు తమ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. అభ్యంతరకర కోటేషన్లు వాహనాలపై రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే నిజంగా మన వాహనాలపై కోటేషన్లు రాయించకూడదా..? నిబంధనలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.

ఇటీవల కోల్‌కత్తాలోని ఓ వాహనంపై పామునైనా నమ్మవచ్చు..కానీ ఆడదాన్ని నమ్మకూడదు అనే కోటేషన్ ఓ కారుపై ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో వాహన యజమానికిఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 499, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 356 (i) కింద పరువు నష్టం నివారించడానికి స్టిక్కర్ను తొలగించాలని నోటీసు జారీ చేశారు. దీంతో వాహన యజమాని ఆ స్టిక్కర్‌ను తొలగించారు. ఒకరి మనోభావాలను దెబ్బతీసే లేదా కులం, మతానికి సంబంధించిన అసభ్యకరమైన, అవమానకరమైన సందేశాలు, పోస్టర్లు వంటి వాహనాలపై ప్రదర్శించడం మోటారు వాహనాల చట్టం ప్రకారం అనుమతించమని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. 

మోటారు వాహనాల చట్టంలో రిజిస్ట్రేషన్ ప్లేట్‌తో సహా కారు లేదా ద్విచక్ర వాహనంపై ఎక్కడా అతికించిన స్టిక్కర్ లేదా సందేశం లేదా మరేదైనా రాయకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. . మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 179 (1) వాహనాల పై కుల, మతాలకు సంబంధించిన స్టిక్కర్లు, రాతలను ఉపయోగించకూడదని స్పష్టంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిబంధనల మీరితే జరిమానాతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కోల్‌కత్తాలో ఈ తరహా స్టిక్కర్లు ఉన్న కార్లు, బైక్‌ల యజమానులపై రూ.1000 జరిమానా విధిస్తున్నారు. 

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

:emoji-lol:

LIFE CYCLE... he should have just stayed with the bicycle

df7d32a8b93698716dfdaaafef2e73cf.jpg

 

a83f9b93217a42f41d67702258c50d12.jpg

 

93e0f1fb1b96894d730ccfff693b978a.jpg

 

1773fb69828cfb62c7f820c9b1cc9cb7.jpg

 

41f204513cd734f7d2d3204306b55ef3.jpg

 

4e1fe874336e44a946cb06b271e42b2d.jpg

 

ABBO...

images?q=tbn:ANd9GcSs5pmbqa5VOfi01XiO-fd

 

CtHRXztW8AA6kVa.jpg

 

83768931-012c-49e5-868a-0ad638c4aeb9-397

 

images?q=tbn:ANd9GcT-9Ou4vKx3L40Iz-xo9qf

 

images?q=tbn:ANd9GcR2u1xqoKKNBqkYOdAwv_k

 

memes-305202416-2024-05-6334bb62ebc43bed

 

memes-30520248-2024-05-db97dc3af82e86fbf

 

images?q=tbn:ANd9GcSimbx17Y4m9u1ykcoj9Lk

 

FFIe_tWVkAU33Jb?format=jpg&name=large

 

E2mzNxbVEAM4izt?format=jpg&name=large

 

images?q=tbn:ANd9GcTfqDRihZD1WlZf0M8wS3B

 

Bike's_15085809_1614052301395_sc_cmprsd_

 

safe-driving-helmet-telugu-slogans-poste

 

mudhiraj_123c389b_1583107932272_cmprsd_4

 

6deafa09-f1b5-452f-991d-aaf0e8125d5b-bef

 

%E0%B0%B5%E0%B0%A6%E0%B0%B2%E0%B0%A8%E0%

 

5ae7a5be-5a66-4bbe-9780-8d176be1abcb-981

 

images?q=tbn:ANd9GcRR79IiKzx9sF53SfylfaY

 

radium-art-and-stickers-133953600-284167

 

Eo4ZK6mUYAMtKRr.jpg

 

one-of-the-wiser-quotes-i-have-read-v0-9

 

vvm9zfhrofy81.jpg

 

one-of-the-wiser-quotes-i-have-read-v0-2

 

Thus-AUto-1.jpg

 

305256-hyderabad-police-use-auto-driver-

 

share-some-funny-one-you-cam-across-auto

 

FKcaOMUaIAAMeVi.jpg

 

untitled-2023-03-06t104625.378-167807980

 

Auto.jpg

 

9rsfa6n02uac1.jpeg

 

atgqzz6ibttc1.jpeg

 

 

Link to comment
Share on other sites

  • 0

New Driving License Rules: Get a license without visiting RTO office

మీరు ఆర్టీవో ఆఫీసుకి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.. కొత్త రూల్‌!

Driving License New Rules: డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు నిబంధనలు మారాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) అనేక నియమాలను మార్చింది. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని (RTO) సందర్శించాల్సిన అవసరం లేదు. బదులుగా, మీరు డ్రైవింగ్ పరీక్షను ప్రైవేట్ శిక్షణా కేంద్రం లేదా డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లడం ద్వారా లైసెన్స్‌ పొందవచ్చు...

 
Driving License Rules: మీరు ఆర్టీవో ఆఫీసుకి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.. కొత్త రూల్‌!
Driving License

మీరు ఇక్కడ నుండి డ్రైవింగ్ అర్హత సర్టిఫికేట్ కూడా పొందుతారు. ప్రస్తుతం దేశంలోని చాలా నగరాల్లో డ్రైవింగ్ స్కూళ్లలో పరీక్షలు నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ నిబంధన దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది.

కొత్త నిబంధన ప్రకారం, కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి RTO వద్ద పరీక్ష చేయవలసిన అవసరం లేదు. బదులుగా, మీరు ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రానికి వెళ్లి పరీక్ష నిర్వహించుకోవచ్చు. ఈ కేంద్రాలకు డ్రైవింగ్ టెస్టులు, డ్రైవింగ్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అనుమతి ఇస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీఓలో జరుగుతున్న బ్లాక్ మార్కెటింగ్ లేక దళారులకు ఇచ్చే కమీషన్ కూడా తగ్గుతుంది. అలాగే, మీరు ఆర్టీవో ఆఫీస్‌ను మళ్లీ మళ్లీ సందర్శించాల్సిన అవసరం లేదు.

కొత్త లైసెన్స్ పొందడానికి దరఖాస్తు ప్రక్రియ

మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో https://parivahan.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మాన్యువల్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మీరు RTOని సందర్శించవచ్చు. దరఖాస్తు రుసుము లైసెన్స్ రకాన్ని బట్టి ఉంటుంది. పత్రాలను సమర్పించడానికి, లైసెన్స్ కోసం మీ డ్రైవింగ్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీరు ఆర్టీవోని సందర్శించాలి.

లైసెన్స్ ఛార్జీలు

  • లెర్నర్స్ లైసెన్స్ (ఫారం 3): రూ. 150
  • లెర్నర్స్ లైసెన్స్ టెస్ట్ (లేదా రిపీట్ టెస్ట్): రూ. 50
  • డ్రైవింగ్ టెస్ట్ లేదా రీ-టెస్ట్: రూ. 300
  • డ్రైవింగ్ లైసెన్స్ జారీ: రూ. 200
  • ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్: రూ. 1000
  • మరో వాహన వర్గాన్ని జోడించడం లైసెన్స్: రూ. 500
  • డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ: రూ. 200
  • ఆలస్యమైన పునరుద్ధరణ (గ్రేస్ పీరియడ్ తర్వాత): రూ. 1300
  • డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్షన్ స్కూల్ కోసం నకిలీ లైసెన్స్: రూ. 5000
  • లైసెన్సింగ్ అథారిటీ ఆదేశాలపై అప్పీల్: రూ. 500
  • డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా లేదా ఇతర వివరాల మార్పు: రూ. 200

మైనర్‌కు రూ.25,000 జరిమానా విధిస్తారు

  • వేగంగా డ్రైవింగ్ చేస్తే రూ.1,000 నుంచి రూ.2,000 వరకు జరిమానా విధిస్తారు.
  • డ్రైవింగ్‌లో పట్టుబడిన మైనర్‌కు రూ.25,000 జరిమానా విధిస్తారు. ఇది మాత్రమే కాదు, మైనర్ తండ్రికి కూడా రూ. 25,000 వరకు చలాన్‌తో పాటు జైలు శిక్ష విధించబడుతుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, వాహన యజమాని రిజిస్ట్రేషన్ కార్డ్ రద్దు చేయబడుతుంది.
  • అలాగే మైనర్ 25 సంవత్సరాల వయస్సు వరకు లైసెన్స్‌కు అనర్హుడని పేర్కొంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Traffic Challan to arrive directly in your phone: No more escaping! ఇక తప్పించుకోలేరు.. మీ ఫోన్‌కే రానున్న ట్రాఫిక్ చలాన్లు..

మీరు ఎప్పుడైతే ట్రాఫిక్ వయోలేషన్ కు పాల్పడతారో వెంటనే మీ ఫోన్ కి మెసేజ్ రూపంలో లేదా వాట్సాప్ మెసేజ్ రూపంలో ఓ నోటిఫికేషన్ వచ్చే కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ కోసం చెల్లింపులు చేసినంత సులువుగా, సౌకర్యవంతంగా ట్రాఫిక్ చలాన్ చెల్లించే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది.

 
Traffic Challan: ఇక తప్పించుకోలేరు.. మీ ఫోన్‌కే రానున్న ట్రాఫిక్ చలాన్లు..
Traffic Challan

ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఎప్పుటైనా ట్రాఫిక్ పోలీసులు మన బండిని ఆపినప్పుడే కదా అవి మనకు గుర్తొచ్చేవి. చాలా మందికి అసలు ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉన్నట్లు కూడా తెలీదు. ఎప్పుడో ఏదో ఒక సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడమో, సిటీ లిమిట్స్ లో ఓవర్ స్పీడ్లో వెళ్లడమో, పోలీసుల తనిఖీలకు సహకరించకపోవడమో, హెల్మెట్ లేకుండా టూవీలర్ నడపడం వంటి వాటి వల్ల మీకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. అయితే ఆ ఫైన్ చెల్లించకుండానే చాలా మంది ఏళ్లు గడిపేస్తూ ఉంటారు. అయితే ఇకపై ఆ విధంగా కాలం గడిపేయడం కుదరకపోవచ్చు. మీరు ఎప్పుడైతే ట్రాఫిక్ వయోలేషన్ కు పాల్పడతారో వెంటనే మీ ఫోన్ కి మెసేజ్ రూపంలో లేదా వాట్సాప్ మెసేజ్ రూపంలో ఓ నోటిఫికేషన్ వచ్చే కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ కోసం చెల్లింపులు చేసినంత సులువుగా, సౌకర్యవంతంగా ట్రాఫిక్ చలాన్ చెల్లించే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోన్‌లకు వచ్చే టెక్స్ట్ మెసేజ్ లేదా వాట్సాప్ కి ఆటోమేటిక్‌గా ఈ ట్రాఫిక్ చలాన్ వచ్చేస్తుంది. ఇది ఉల్లంఘనతో దాని కోసం విధించిన జరిమానా గురించి కూడా తెలియజేస్తుంది. ఈ వ్యవస్థను ముందుగా కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించాలని రవాణా శాఖ యోచిస్తోంది.

ఆన్ లైన్ పేమెంట్లు..

రవాణా శాఖ చెల్లింపుల ప్రక్రియను సరళీకృతం చేసింది. అందుకోసం నిబంధనలు ఉల్లంఘించిన వారు ఆన్‌లైన్ చెల్లింపుల విధానాన్ని తీసుకొచ్చింది. ట్రాఫిక్ చలాన్ ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ సందేశం ద్వారా పంపిస్తారు. ఇది ఆన్‌లైన్ చెల్లింపు కోసం లింక్‌ను కలిగి ఉంటుంది. లింక్‌ను క్లిక్ చేసిన వెంటనే, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ యాప్, యూపీఐ ఆప్షన్లు మీకు కనిపిస్తాయి. వాటిల్లో ఏదో ఒక గేట్ వే ద్వారా లావాదేవీని పూర్తి చేయొచ్చు.

నోటిఫికేషన్..

యూపీఐ యాప్ ద్వారా చలాన్ చెల్లింపు పూర్తయిన తర్వాత ఒకవేళ కొత్త చలాన్ రూపొందితే ప్రతిసారీ పుష్ నోటిఫికేషన్ మీ ఫోన్‌కి వస్తుంది. ఆ తర్వాత అవి చర్య తీసుకునే ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్తుంది. చాలా మంది ప్రజలు ఆన్‌లైన్‌లో జరిమానాలు చెల్లించడాన్ని విస్మరించడం లేదా తమ వద్ద జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలియకపోవటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఈ కొత్త వ్యవస్థతో ఇది ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది ప్రయోగాత్మక దశలోనే ఉంది. ప్రస్తుతం వాహన యజమానులు జరిమానాలు చెల్లించేందుకు రవాణా శాఖ ఈ-చలాన్ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంలో, చాలా మంది పెండింగ్‌లో ఉన్న జరిమానాలు లేదా చలాన్‌ల కోసం ఎటువంటి ఎస్ఎంఎస్ నోటిఫికేషన్‌ను స్వీకరించరు. అయితే, కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత, ఈ సమస్య పరిష్కారమవుతుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Traffic Challans: వాహనదారులకు హెచ్చరిక.. ఇలా చేస్తే రూ.25 వేల జరిమానా!

ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. లేకుంటే అంతే సంగతి. భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు కొన్ని సమయాల్లో జైలుకు వెళ్లాల్సి కూడా ఉంటుంది. రూల్ బ్రేకర్ల జాబితాలో వాహన సవరణ కూడా చేర్చబడింది. అయితే దీనిపై చాలా మందికి అవగాహన లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారిపై కఠిన చర్యలు కూడా..

 
Traffic Challans: వాహనదారులకు హెచ్చరిక.. ఇలా చేస్తే రూ.25 వేల జరిమానా!

ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. లేకుంటే అంతే సంగతి. భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు కొన్ని సమయాల్లో జైలుకు వెళ్లాల్సి కూడా ఉంటుంది. రూల్ బ్రేకర్ల జాబితాలో వాహన సవరణ కూడా చేర్చబడింది. అయితే దీనిపై చాలా మందికి అవగాహన లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసి శిక్షించే నిబంధన కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ బైక్‌లో ఏదైనా మార్పు చేసినట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిస్థితిలో 25 వేల రూపాయల వరకు చలాన్ జారీ చేస్తారు.

మీరు మీ ద్విచక్ర వాహనం లేదా ఫోర్‌ వీలర్స్‌లో ఏదైనా మార్పు చేయాలనుకున్నప్పుడు, ముందుగా మీరు ప్రాంతీయ రవాణా కార్యాలయం నుండి అనుమతి తీసుకోవాలి. సవరణ సమయంలో మీరు మీ వాహనంలో ఆటోమోటివ్ రీసెర్చ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ARAI) ఆమోదించిన భాగాలను మాత్రమే ఉపయోగించవచ్చు. ఇక్కడ మీకు 3 సవరణ షరతులు ఉంటాయి. దీని కారణంగా మీరు భారీ చలాన్ భరించాల్సి ఉంటుంది.

1. సౌండ్ సైలెన్సర్‌పై చలాన్:

చాలా సార్లు వాహనదారులు తమ మోటార్‌సైకిల్ సైలెన్సర్‌ను కూడా మారుస్తుంటారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌లో ఉపయోగించే సైలెన్సర్ క్రేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. చాలా మంది బైక్‌లో అలాంటి సైలెన్సర్‌ను అమర్చుకుంటారు. దాని శబ్ధం బీభత్సంగా ఉంటుంది. మీరు అలాంటి సైలెన్సర్ ఉపయోగిస్తే పోలీసులు మిమ్మల్ని పట్టుకోవచ్చు. అలాగే, మీపై భారీ చలాన్ విధిస్తారు.

2. ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌పై కూడా చలాన్:

వాహనాల్లో ఎలాంటి ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్‌ను ఉపయోగించడం చట్టవిరుద్ధం. నంబర్‌ ప్లేట్‌లకు ప్రభుత్వం స్టైల్‌షీట్‌ను ఖరారు చేసింది. దీని కింద నంబర్ ప్లేట్‌లోని అన్ని అంకెలు స్పష్టంగా కనిపించాలి. వాటిని ఫ్యాన్సీగా రాసి ఉండకూడదు. ఎల్లప్పుడూ RTO ద్వారా ధృవీకరించబడిన నంబర్ ప్లేట్‌ను ఉపయోగించండి.

3. సవరణకు భారీ జరిమానా

మోటార్‌సైకిల్ లేదా స్కూటర్‌ను సవరించడం కూడా చట్టవిరుద్ధం. ఈ రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు మోడిఫైడ్ మోటార్ సైకిళ్లను పట్టుకుని చలాన్ చేస్తున్నారు. కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, ఏదైనా వాహనంలో మార్పులు చేయడం చట్టవిరుద్ధం. దీని కోసం మీకు జరిమానా విధించవచ్చు. బైక్‌ను కూడా స్వాధీనం చేసుకోవచ్చు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...