Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

Ayushman Bharat: Rs 5 lakh health insurance for all senior citizens aged 70 and over, regardless of income


Vijay

Question

PM Modi: దేశ ప్రజలకు మోడీ సర్కార్‌ శుభవార్త.. ఇక ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికి వర్తింపు

కేంద్రంలోని మోడీ సర్కార్‌ దేశ ప్రజల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజల ఆరోగ్యం విషయంలో పలు పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు..

 
PM Modi: దేశ ప్రజలకు మోడీ సర్కార్‌ శుభవార్త.. ఇక ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికి వర్తింపు

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దేశంలోని 70 ఏళ్లు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన-ఆయుష్మాన్ భారత్ ప్రయోజనం పొందుతారు. ధనిక, పేద అనే తేడా ఉండదు. అయితే అందరినీ దీని పరిధిలోకి తీసుకురానున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేసారు. అలాగే ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఇది కొత్త కేటగిరీ అని అన్నారు. దీని కింద 70 ఏళ్లు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్‌కు ఉచిత చికిత్స సౌకర్యంతో పాటు 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను ప్రభుత్వం అందిస్తుంది.

సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ఎలా పని చేస్తుంది?

ఈ పథకం ప్రయోజనాలను మంత్రి అశ్విని వైష్ణవ్ వివరిస్తూ, 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇది సమగ్ర ఆరోగ్య కవరేజీ అని అన్నారు. ప్రస్తుతం 12.3 కోట్ల కుటుంబాలు ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ యోజనలో భాగమైన కుటుంబాలు, వారి కుటుంబంలో ఒక్కరు కూడా 70 ఏళ్లు పైబడి ఉంటే, వారు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు అదనంగా రీ-అప్ పొందుతారు. ఇది షేర్డ్ హెల్త్ కవర్ అవుతుంది.

ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ యోజన కింద కవర్ చేయని కుటుంబాలు. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు కవర్ చేయబడతారు మరియు సంవత్సరానికి రూ. 5 లక్షల సాధారణ కవర్ పొందుతారు. ఈ ఆయుష్మాన్ భారత్ కేటగిరీలో 70 ఏళ్లు పైబడిన దంపతులు ఉంటే, ఇద్దరికీ రూ.5 లక్షల బీమా కవరేజీ ఒకే విధంగా ఉంటుంది. మధ్యతరగతి, ఉన్నత తరగతి అనే తేడా లేకుండా అందరూ దీని వల్ల ప్రయోజనం పొందుతారు.

ఇది మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆర్మీ హెల్త్ స్కీమ్ ఏదైనా ఆరోగ్య పథకం (CGHS/SGHS) కింద కవర్ చేయబడిన సీనియర్లు. వారందరూ తమ పాత స్కీమ్‌ను కొనసాగించడానికి లేదా ఆయుష్మాన్ భారత్ కవర్‌ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ESCI) లేదా ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న సీనియర్ సిటిజన్‌లు కూడా ఆయుష్మాన్ భారత్‌లో చేరే అవకాశం ఉంటుంది.

ఈ పథకం ద్వారా ప్రజలు ఉచితంగా లబ్ధి పొందనున్నారు. అయితే, దీని కోసం ప్రభుత్వం సీనియర్ సిటిజన్లందరినీ బీమా తీసుకోవాలని కోరుతుంది. దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ కేటగిరీ కోసం ప్రభుత్వం రూ.3,437 కోట్లను ప్రాథమిక కేటాయింపులు చేసింది.

India Approves ₹5 Lakh Health Coverage for All Senior Citizens | Vantage with Palki Sharma

All citizens above 70 years brought under Ayushman Bharat health scheme

 

Link to comment
Share on other sites

2 answers to this question

Recommended Posts

  • 0

How to obtain Ayushman Bharat Card: వృద్ధులు ఆయుష్మాన్ కార్డును ఎలా పొందాలి.. ప్రక్రియ ఏమిటో తెలుసుకోండి..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పరిధిని విస్తరించింది. ఇప్పుడు వృద్ధులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులు ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు.

 
వృద్ధులు ఆయుష్మాన్ కార్డును ఎలా పొందాలి.. ప్రక్రియ ఏమిటో తెలుసుకోండి..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పరిధిని విస్తరించింది. ఇప్పుడు వృద్ధులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులు ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు. ఏ ఆదాయ వర్గానికి చెందిన వారైనా ఈ పథకం వర్తిస్తుంది. ఆయుష్మాన్ కార్డుతో, వృద్ధులకు దేశంలోని ఏ ఆసుపత్రిలోనైనా రూ. 5 లక్షల వరకు ఉచితంగా వ్యాధుల చికిత్స లభిస్తుంది. ఆయుష్మాన్ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఆయుష్మాన్ భారత్ కార్డును ఎలా పొందాలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీని గురించి తెలుసుకుందాం.

మొబైల్ యాప్ ద్వారా ఆయుష్మాన్ కార్డు

కేంద్ర ప్రభుత్వం ప్రకారం, వృద్ధులు ఆయుష్మాన్ కార్డు కోసం ఏ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. కొన్ని ముఖ్యమైన పేపర్లు మాత్రమే అవసరమవుతాయి. మొబైల్ యాప్ ద్వారానే ఆయుష్మాన్ కార్డు పొందవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం వారం రోజుల్లో ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ప్రచారం చేపట్టింది. ఆధార్ కార్డు సహాయంతో, వృద్ధులు మొబైల్ యాప్ ద్వారా తయారు చేసిన ఆయుష్మాన్ కార్డును పొందగలుగుతారు. ఈ కార్డును పొందిన తరువాత, ఏ ఆసుపత్రిలోనైనా అనేక తీవ్రమైన వ్యాధులకు ఉచిత చికిత్స పొందగలుగుతారు. ఇప్పటి వరకు, ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌పై ప్రభుత్వ గణాంకాలు జూన్ 30, 2024 వరకు దేశంలోని 34.7 కోట్ల మంది ప్రజలు ఆయుష్మాన్ కార్డులను పొందారు.

వృద్ధుల కోసం కొత్త కార్డు తయారు

ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో ఎవరైనా వృద్ధులు ఉంటే, ఇప్పుడు వృద్ధుల కోసం ప్రత్యేకంగా కొత్త కార్డును తయారు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం కొత్తగా రిజిస్ట్రేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. కార్డు తయారు చేసిన తర్వాత వృద్ధులు ఏ ఆసుపత్రిలోనైనా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల ప్రయోజనాలను పొందుతున్న 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులు కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆయుష్మాన్ కార్డును ఎంపికను ఎంచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎవరైనా 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ప్రైవేట్ ఆరోగ్య బీమాను కలిగి ఉంటే, వారి కూడా ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు.

టోల్ ఫ్రీ నంబర్‌లో సమాచారం..

ఆయుష్మాన్ కార్డ్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందడానికి, మీరు టోల్ ఫ్రీ నంబర్ 14555కి కాల్ చేయవచ్చు. కార్డును తయారు చేయడానికి ఏ పత్రాలు అవసరం, ఏ ఆసుపత్రులలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది అనే దాని గురించి మీకు మొత్తం సమాచారాన్ని అందిస్తుంది.

ఆయుష్మాన్ స్కీమ్ అమలు లేని రాష్ట్రాలు

ప్రస్తుతం ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో ఆయుష్మాన్ పథకం అమలు లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడంలేదు. ప్రస్తుతం ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని వృద్ధులకు ఆయుష్మాన్ యోజన ప్రయోజనం ఉండదు.

Link to comment
Share on other sites

  • 0

Ayushman Bharat Card amendments: వృద్ధుల ఆరోగ్యానికి భరోసా.. కేంద్ర ఆరోగ్య పథకంలో కీలక మార్పులు..

దీని పేరు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై). ఇప్పటికే చాలా మందికి ఈ పథకం గురించి అవగాహన ఉంది. అందరికీ ఆయుష్మాన్ భారత్ అంటే అర్థం అవుతుంది. ఇది అత్యంత సమగ్రమైన ఆరోగ్య బీమా పథకాలలో ఒకటి. వైద్య చికిత్సకు అయ్యే అధిక ఖర్చుల నుంచి ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు రక్షణ కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.

 
Ayushman Card: వృద్ధుల ఆరోగ్యానికి భరోసా.. కేంద్ర ఆరోగ్య పథకంలో కీలక మార్పులు..

కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో ఇప్పటికే ఆరోగ్య శ్రీ తరహాలో కొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది. దీని పేరు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై). ఇప్పటికే చాలా మందికి ఈ పథకం గురించి అవగాహన ఉంది. అందరికీ ఆయుష్మాన్ భారత్ అంటే అర్థం అవుతుంది. ఇది అత్యంత సమగ్రమైన ఆరోగ్య బీమా పథకాలలో ఒకటి. వైద్య చికిత్సకు అయ్యే అధిక ఖర్చుల నుంచి ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు రక్షణ కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా ప్రత్యేకమైన కార్డులను అందిస్తోంది. దీనిలో ఎప్పటికప్పుడు ఆయుష్మాన్ కార్డును అప్ డేట్ చేస్తోంది. కవరేజ్ పరిధిని పెంచుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 11వ తేదీన ఈ పథకాన్ని మరింత మంది వినియోగించుకునేలా విస్తరించింది. కేంద్ర మంత్రి వర్గం దీనికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం, 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ ఆరోగ్య కవరేజీ లభిస్తుంది. 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్‌లతో సహా దాదాపు 4.5 కోట్ల కుటుంబాలకు.. ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కవరేజీని అందుతుంది. ప్రతి సీనియర్ సిటిజన్ వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా పథకం ప్రయోజనాలను పొందగలుగుతారు.

అప్‌డేట్లు ఇలా..

విభిన్నంగా కార్డు: 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అర్హతగల సీనియర్ సిటిజన్‌లు ఆయుష్మాన్ భారత్ పథకం కింద కొత్త, విభిన్నమైన కార్డ్‌ని అందుకుంటారు.

టాప్-అప్ కవరేజ్: ఇప్పటికే పథకం ద్వారా కవర్ చేయబడిన కుటుంబాలలోని సీనియర్ సిటిజన్‌లు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు అదనపు టాప్-అప్ కవర్‌ని అందుకుంటారు. ఈ టాప్-అప్ ఒక వ్యక్తికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. 70 ఏళ్లలోపు ఇతర కుటుంబ సభ్యులతో దీన్నిషేర్ చేయవలసిన అవసరం లేదు.

కుటుంబ కవరేజీ: ఇప్పటికే ఉన్న ఫ్యామిలీ కవరేజీలో భాగం కాని సీనియర్ సిటిజన్‌లకు కుటుంబ ప్రాతిపదికన సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు కవర్ అందుతుంది.

పథకాల ఎంపిక: సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్), ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్) లేదా ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ల నుంచి ఇప్పటికే లబ్ది పొందుతున్న సీనియర్ సిటిజన్‌లు ఈ రెండింటిలో ఏదో ఒక ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ప్రైవేట్ బీమాతో అర్హత: ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు లేదా ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా కవర్ చేయబడిన సీనియర్ సిటిజన్‌లు కూడా ఈ పథకం నుండి ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంటుంది

ఆయుష్మాన్ కార్డ్ అంటే ఏమిటి?

ఆయుష్మాన్ కార్డ్ అనేది ఆయుష్మాన్ భారత్ పథకం కింద జారీ చేసే గుర్తింపు కార్డు. ఇది అర్హత కలిగిన వ్యక్తులు ఎంప్యానెల్డ్ ఆస్పత్రులలో ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ కార్డుతో ప్రతి కుటుంబం సంవత్సరానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని పొందుతుంది. ఆయుష్మాన్ కార్డ్ భారతదేశంలోని ఆర్థికంగా వెనుకబడిన జనాభాకు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగం.

ఆయుష్మాన్ కార్డ్‌కు ఎవరు అర్హులు?

ఈ పథకం ప్రారంభించినప్పుడు 2011 సామాజిక-ఆర్థిక కుల గణన (ఎస్ఈసీసీ) ద్వారా గుర్తించబడిన లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డ్ అందించేవారు. అప్పుడు నిర్ణయించిన ప్రమాణాల ఆధారంగా కుటుంబాలు ఎంపిక జరిగిదే. దాని ప్రకారం వయోజన పురుషులు లేని గ్రామీణ కుటుంబాలు, కుటుంబాలు వంటి అత్యంత హాని కలిగించే వారిపై దృష్టి సారించారు. వికలాంగ సభ్యులు, తాత్కాలిక నివాసాలలో నివసిస్తున్న లేదా చేతితో పని చేసే కార్మికులుగా పనిచేస్తున్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు, నిర్మాణ కార్మికులు, రిక్షా పుల్లర్లు వంటి తక్కువ-ఆదాయ కార్మికులు దరఖాస్తు చేసుకోవచ్చు. గృహ సభ్యుల వృత్తి ఆధారంగా అర్హతను నిర్ణయిస్తారు. అయితే, కాలక్రమేణా, ఆరోగ్య సంరక్షణ కోసం ఆర్థిక సహాయం అవసరమయ్యే మరిన్ని సమూహాలను చేర్చడానికి ప్రభుత్వం ఈ ప్రమాణాలను అప్ డేట్ చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం వలస కార్మికులు, పట్టణ అనధికారిక కార్మికులు, గ్రామీణ కళాకారులు, భూమిలేని కార్మికులు, ఇతర తక్కువ-ఆదాయ వర్గాలు, వితంతువులు లేదా ఒంటరి తల్లులు, వారి పిల్లలు, వృద్ధులు, వికలాంగులందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...