Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Ganesh Vinayak Chaturthi and Nimajjanam / Visarjan


TELUGU

Recommended Posts

Ganesh Chaturthi 2024: ఆకట్టుకుంటున్న వెరైటీ వినాయకులు..చూసి పరవశించిన భక్తులు

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి యేటా భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిధిని వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ మాసాన్ని గణేషుడికి అంకితం చేసారని పురాణాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఏడాది గణేష్ చతుర్థి సెప్టెంబర్ 7 న వచ్చింది. ఆ రోజున గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాధారణంగా చాలా మంది గణపతి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు ఉదయం, సాయంత్రం పూజలు చేసి తొమ్మిదవ రోజున విగ్రహ నిమజ్జనం చేస్తారు.

 
వినాయక చవితి. అంటేనే వీధులన్ని కోలాహాలంగా మారుతాయి..రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించిన మండపాల్లో అంతే అందంగా ముస్తాబు చేసిన వినూత్న రీతుల్లో భారీ వినాయక విగ్రహలు కొలువుదీరి నవరాత్రులు పూజలందుకుంటాయి. పల్లె పట్టణం తేడా లేకుండా ఎవరికీ తోచిన విధంగా వారు వినాయక ప్రతిమలు తయారు చేసి తమ భక్తిని చాటుకుంటున్నారు.
 

వినాయక చవితి. అంటేనే వీధులన్ని కోలాహాలంగా మారుతాయి..రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించిన మండపాల్లో అంతే అందంగా ముస్తాబు చేసిన వినూత్న రీతుల్లో భారీ వినాయక విగ్రహలు కొలువుదీరి నవరాత్రులు పూజలందుకుంటాయి. పల్లె పట్టణం తేడా లేకుండా ఎవరికీ తోచిన విధంగా వారు వినాయక ప్రతిమలు తయారు చేసి తమ భక్తిని చాటుకుంటున్నారు.

1 / 5
ప్రస్తుతం వినాయక పండుగ వాతావరణం అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. మన ఇళ్లలో చేసే ఏ శుభకార్యాలైన గణపతి పూజ తర్వాతే మిగిలిన పనులు చేస్తారు. ఇక వినాయక చవితి పండుగ వచ్చిందంటే అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తారు.
 

ప్రస్తుతం వినాయక పండుగ వాతావరణం అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. మన ఇళ్లలో చేసే ఏ శుభకార్యాలైన గణపతి పూజ తర్వాతే మిగిలిన పనులు చేస్తారు. ఇక వినాయక చవితి పండుగ వచ్చిందంటే అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తారు.

2 / 5
క్రమంలోనే హైదరాబాద్‌లోని ఒక చోట ఏర్పాటు చేసిన ముత్యాల గణేషుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. ఇందుకోసం మొత్తం 11, 116 ముత్యాలను అతికించి అద్భుతంగా తయారు చేశారు.  ఈ విగ్రహం అందర్ని ఆకట్టుకుంటుంది. ఒక్కసారి ముత్యాల గణేషుడిని చూసి దర్శనం చేసుకుందామని భక్తులు ఎగబడుతున్నారు. ముత్యాల గణపతిని చూసి ఆశ్చర్యపోతున్నారు.
 

క్రమంలోనే హైదరాబాద్‌లోని ఒక చోట ఏర్పాటు చేసిన ముత్యాల గణేషుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. ఇందుకోసం మొత్తం 11, 116 ముత్యాలను అతికించి అద్భుతంగా తయారు చేశారు. ఈ విగ్రహం అందర్ని ఆకట్టుకుంటుంది. ఒక్కసారి ముత్యాల గణేషుడిని చూసి దర్శనం చేసుకుందామని భక్తులు ఎగబడుతున్నారు. ముత్యాల గణపతిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

3 / 5
వివిధ రూపాల్లో కొలువు దీరిన విఘ్నేశ్వరుడి మండపాలు, విగ్రహలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. నెమలి పించం అలంకరణతో తయారు చేసిన గణపతి విగ్రహం భక్తులను మరింత ఆకట్టుకుంటోంది. పూర్తిగా నెమలి పించాలతో అలంకరించబడిన లంభోదరుడి రూపం చూసిన భక్తులు పరవశించిపోతున్నారు.
 

వివిధ రూపాల్లో కొలువు దీరిన విఘ్నేశ్వరుడి మండపాలు, విగ్రహలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. నెమలి పించం అలంకరణతో తయారు చేసిన గణపతి విగ్రహం భక్తులను మరింత ఆకట్టుకుంటోంది. పూర్తిగా నెమలి పించాలతో అలంకరించబడిన లంభోదరుడి రూపం చూసిన భక్తులు పరవశించిపోతున్నారు.

4 / 5
ఒకప్పుడు గణపతికి పూజ చేయాలంటే వివిధ రకాల పుష్పాలను సేకరించి వాటిని దండలుగా చేసి కట్టేవారు. కానీ ప్రస్తుతం స్వామివారికి పుష్పాల స్థానంలో కరెన్సీ నోట్లను దండలుగా రూపొందించి తమ భక్తిని చాటుకుంటున్నారు. కొన్ని చోట్ల పెద్ద మొత్తంలో కరెన్సీనోట్లతో వినాయక మండపాలు తయారు చేసి, భక్తితో స్వామివారిని కోలుస్తున్నారు భక్తులు.
 

ఒకప్పుడు గణపతికి పూజ చేయాలంటే వివిధ రకాల పుష్పాలను సేకరించి వాటిని దండలుగా చేసి కట్టేవారు. కానీ ప్రస్తుతం స్వామివారికి పుష్పాల స్థానంలో కరెన్సీ నోట్లను దండలుగా రూపొందించి తమ భక్తిని చాటుకుంటున్నారు. కొన్ని చోట్ల పెద్ద మొత్తంలో కరెన్సీనోట్లతో వినాయక మండపాలు తయారు చేసి, భక్తితో స్వామివారిని కోలుస్తున్నారు భక్తులు.

...

Complete article

Link to comment
Share on other sites

  • Replies 21
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TELUGU

    19

  • Vijay

    2

  • Sanjiv

    1

TV9 Ismart News: గణపతి మెడలో ఆరు తులాల బంగారుచైన్.. మర్చిపోయి నిమజ్జనం! | యూత్ అంటే ఇట్లుండాలే !

ఇండ్లల్ల వెట్కున్న గణపతులకు గూడ గల్లీల్ల వెట్టిన గణేషులకి తీశిపోని తీర్ల గ్రాండుగ నిమజ్జనాలు చేస్తుంటరు. బ్యాండ్ బాజాలతోటి బారాత్లు తీస్తరు. గట్లనే అందర్లెక్క ఓతాన ఓ ఇంటోళ్లు కూడ మాసంబురంగ ఇంట్ల పెట్టిన గణ్పతిని నిమజ్జనం చేసోచ్చినంక నెత్తినోరు కొట్కుంట నిమ్మజ్జనం కాడికి మల్ల ఉర్కిండ్రట.. మరీ ఎందుకు ఏందన్నది ఈ ముచ్చటింటే సమజైతది.

iSmart News : గణపతి మెడలో ఆరు తులాల బంగారుచైన్.. మర్చిపోయి నిమజ్జనం! | యూత్ అంటే ఇట్లుండాలే ! - TV9
Gold chian
ఇండ్లల్ల వెట్కున్న గణపతులకు గూడ గల్లీల్ల వెట్టిన గణేషులకి తీశిపోని తీర్ల గ్రాండుగ నిమజ్జనాలు చేస్తుంటరు. బ్యాండ్ బాజాలతోటి బారాత్లు తీస్తరు. గట్లనే అందర్లెక్క ఓతాన ఓ ఇంటోళ్లు కూడ మాసంబురంగ ఇంట్ల పెట్టిన గణ్పతిని నిమజ్జనం చేసోచ్చినంక నెత్తినోరు కొట్కుంట నిమ్మజ్జనం కాడికి మల్ల ఉర్కిండ్రట.. మరీ ఎందుకు ఏందన్నది ఈ ముచ్చటింటే సమజైతది..

Bike birth day
యాపీ బర్త్ డే టు యూ. యాపీ యాపీ బర్త్ డే టూయూ. యాపీ బర్త్ డే టూయూ… ఏంది ఏమో గట్ల సూస్తరు. అర్రే ఏంది అట్ల సూస్తరు.. నాతోటి మీరు కూడ విష్షెస్ చెప్పుండ్రి.. నీ కథ మంచిగనే ఉన్నదమ్మ… ఎవలి పుట్టిన రోజో చెప్పవ్.. ఎన్నో పుట్టినరోజో తెల్వది. పాట వాడి, విష్సెస్ చెప్పు..దీవానార్తులు వెట్టంటే ఎట్లా అని గరమైతుండ్రా ఎట్లా..? అవ్ అది కూడ నిజమే గద. సరే లేండ్రి ఇగో బర్తుడే బాయిని సూయిస్తున్న .. మీరు కూడ నిండు పదిగేనేండ్లు సల్లగుండాలని దీవానార్తులు పెట్టుర్రి..

kmm chori
లీడర్లు ఏ వర్గానికి ఏం తాయిలాలిస్తే ఓట్లు మన బొచ్చెల పడ్తయి అని ఆలోచన చేశ్నట్టు .. దొంగలు కూడ యే దుక్నంల సొర్రి చోరీ చేస్తే ఏం పడ్తల్ పడ్తయ్యని శాన ఆలోచన చేస్తరు.. ఒక దుకాండ్లపడ్డమంటే మాలన్న మనకు అక్కెర్రాలే.. పైకమన్న పాయిదా రావాలని ప్లాన్లే స్కుంటరు.. గందుకే రెక్కీలు చేషి, టార్గెట్లు పెట్టి మార్కెట్ల దుక్నాలను హఫా చేస్తుంటరిట్ల

Milk ritulu
మనకు ఇప్పుడు పాలు కావాల్నంటే దుకాండ్లకు పోతున్నం..ముప్పై రూపాలిస్తున్నం పాల ప్యాకిట్ దెచ్చుకుంటున్నం చాయలు..కాపీలు తాగుతున్నం. పెర్గుతోడు పెట్కుంటున్నం..కాని ఆ పాలు మనకాడికి అంత అల్కగొస్తున్నయ్యంటే ఎంతో మంది పాడి రైతుల కస్టమున్నది.. అయితే పాల ప్యాకిట్లు కొంటున్న కస్టమర్లు బాగనే ఉంటుర్రు.. నడ్మిట్ల అమ్ముకుంటున్న కంపినోల్లు మంచిగనే ఉంటుర్రుగాని ఆరుగాలం కస్టపడి, పాడి జీవాలను నమ్ముకోని పాలుతీస్తున్న మాకే శాపాలు తల్గినట్టైతుందని రోడ్డెక్కిండ్రు ఓకాడి పాడి రైతులు

NTR fan
చెట్టంత కొడ్కు ఆవుసు కండ్ల ముంగట కరిగిపోతుందని తెలుస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల బాదెట్లుంటది. కొడుకే ఊపిరి అని బతికిన తల్లిదండ్రులకు ఆ కొడ్కు ఊపిరి ఉండదని తెల్షినప్పుడు ఆ బాదను ఎవ్వలు తీరుస్తరు…గసోంటి కష్టమే అచ్చింది తి తమ్మున్కి.. శిన్న ఎన్టీఆర్ అన్నంటే ప్రాణమిడ్షే నా కొడ్కు దేవర సిన్మాదాక బత్కినా సాలు అని ఆతల్లిదండ్రులు ఏడ్సుకుంట చెప్తున్నది సూస్తుంటే కండ్లల్ల నీల్లు తిర్గవట్టినయి

School bill
శానమందికి గుండెలు గుబెల్లు మనేది ఎప్పుడో తెల్సా.?? ఒక్క తారీక్ రాంగనే కట్టాల్సిన బిల్లులు చూషి గుండే గుబెల్లుమంటది. అప్పుడప్పుడు అన్పిస్తుంటది ఈ బిల్లులు బిల్కుల్ లేని లోకమేదన్న ఉంటే మంచిగుండు అని.. కాని అది గాని పని గద.. బిల్లులంటే యాదొచ్చే ఓ కాంట్రక్టర్కు కూడ గిట్లనే ముందుగాలు బిల్లింగు కట్టుమన్నరట సర్కారోల్లు ..కాని బిల్లింగు కట్టినంక బిల్లులు అడ్గుతే బిన్ లాడెన్ను చూశ్నట్టు సూస్తుర్రట. అత్త మీద కోపం దుత్త మీద చూయించినట్టు ఆ కాంట్రాక్టరన్న ఏం చేషిండో సూడుర్రిగ

SP teaching
బల్లే పిల్లలకు టీచర్లంటే ఎట్ల బయముంటదో బైట పోలీస్ సార్లను సూస్తే పబ్లిక్కు అట్ల భయముంటది. పిలగాల్లు మంచి పౌరులుగా ఎద్గేతట్టు సార్లు నేర్పిస్తే.. ఆ పౌరులు పద్దతి తప్పకుంట క్రమశిక్షణల వెట్టేటోల్లు పోలీసోల్లు. రక్షక భటులుగా పబ్లిక్ను రక్షణిచ్చుడే కాదు.. తప్పుచేస్తే శిక్షిస్తరు కూడ.. అట్లనే ఖాకీలంటే చాకులు పట్టుకున్నోల్లను రాకుడే కాదు చాక్ పీసులు పట్టి పీస్‌ ఫుల్గ ఇట్ల పాఠాలు కూడ చెప్తుంటరు అన్పిచ్చిండు గీ వనపర్తి ఎస్పీ గిరిధర్ సారు..

...

Complete article

Link to comment
Share on other sites

  • The title was changed to Ganesh Chaturthi and Nimajjanam / Visarjan

Ganesh Immersion: దారులన్నీ సాగర్‌ వైపే.. ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనం షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ వ్యాప్తంగా రేపు గణనాథుల నిమజ్జనం ఉండనుంది. ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేషుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. దానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్ పరిధిలో గణేశ్ నిమజ్జనం కోసం దాదాపుగా 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ సహా నగరంలో ఉన్న ఇతర అన్ని..

 
Ganesh Immersion: దారులన్నీ సాగర్‌ వైపే.. ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనం షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ వ్యాప్తంగా రేపు గణనాథుల నిమజ్జనం ఉండనుంది. ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేషుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. దానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్ పరిధిలో గణేశ్ నిమజ్జనం కోసం దాదాపుగా 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ సహా నగరంలో ఉన్న ఇతర అన్ని చెరువుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుంచి గణేష్‌ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్యాంక్‌ బండ్‌ దగ్గర 8 చోట్ల పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయంటున్నారు పోలీసులు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ఖైరతాబాద్‌ గణేష్‌ నిమజ్జనం జరగనుంది. ఇవాళ్టి నుంచి ఖైరతాబాద్‌ గణేష్‌ తరలింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు సాయంత్రం 4గంటల్లోపు బాలాపూర్‌ గణేష్‌ నిమజ్జనం జరిగేలా చూస్తామంటున్నారు పోలీసులు. రేపు హైదరాబాద్‌లో అన్ని దారులు సాగర్‌ వైపే దారి తీస్తాయి.

బాలాపూర్‌లో గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం దగ్గర గణేష్‌ విగ్రహాల ప్రధాన ఊరేగింపు ప్రారంభమై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి ప్రవేశిస్తుంది. కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌, ఎంబీఎన్‌ఆర్‌ ఎక్స్‌ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్, ఆలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొజంజాహి మార్కెట్, అబిడ్స్‌ ఎక్స్‌ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్‌ మార్గ్, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లో హుస్సేన్‌ సాగర్‌ని చేరుకుంటుంది. మిగిలిన ఊరేగింపులన్నీ వచ్చి ఈ ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.

సికింద్రాబాద్‌ నుంచి వచ్చే వినాయక విగ్రహ ఊరేగింపులు సంగీత్‌ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్‌ జంక్షన్, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, ట్యాంక్‌బండ్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డుకు వెళ్లనున్నాయి. చిలకలగూడ నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్, నారాయణగూడ ఫ్లైఓవర్, వై.జంక్షన్, హిమాయత్‌నగర్‌ నుంచి లిబర్టీ వైపు వెళ్తాయి. ఉప్పల్‌ నుంచి వచ్చే గణేష్ ఊరేగింపులు రామంతాపూర్, శ్రీ రమణ జంక్షన్, ఛే నంబరు, తిలక్‌నగర్, ఓయూ ఎన్‌సీసీ గేట్, విద్యానగర్‌ జంక్షన్, ఫీవర్‌ ఆస్పత్రి, బర్కత్‌పుర జంక్షన్ మీదుగా వెళ్తాయి. ఆ ఊరేగింపులు నారాయణగూడ వైఎంసీఏకి చేరుకొని, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు నుంచే వచ్చే ఊరేగింపుతో కలవనుంది.

దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు ఐఎస్‌ సదన్, సైదాబాద్, చంచల్‌గూడ ఉంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్‌ రోడ్డులో కలవనుంది. తార్నాక వైపు వచ్చే విగ్రహాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యాకేంద్రం రోడ్డు, అడిక్‌మెట్‌ వైపు వెళ్లి విద్యానగర్‌ మీదుగా ఫీవర్‌ ఆసుపత్రి వద్దకు చేరుకోనున్నాయి. టోలిచౌకి, రేతిబౌలి, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే గణేష్‌ విగ్రహాలు మాసబ్‌ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్‌ జంక్షన్, ఇక్బాల్‌ మినార్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు వెళ్లనున్నాయి. ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ మీదుగా మోహిదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్‌ వద్ద చేరి, ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు వెళ్లనున్నాయి.

టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్‌ ప్రాంతాల నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, వోల్గా హోటల్‌ ఎక్స్‌రోడ్, గోషామహల్, మీదుగా వెళ్లి ఎంజేఎం దగ్గర ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి. ఊరేగింపు కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రజలు అందుకు అనుగుణంగా తమ ప్రయాణ మార్గాన్ని నిర్దేశించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇక ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనం పై నిషేధాజ్ఞలను ప్రభుత్వం ఎత్తేసింది. నిమజ్జనం కోసం బడా బడా క్రేన్లను రంగంలోకి దింపింది. దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. ఇక అందరిచూపు ఖైరతాబాద్‌ బడా గణేష్‌ మీదే ఉంది. బడా గణేష్‌ దగ్గర తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. రేపు తెల్లవారుజాము 4 గంటలకు టస్కర్‌పైకి గణనాథుడు చేరుతాడు.

ఊరేగింపు ఇలా..

ఉదయం 6 గంటల నుంచి బడా గణేష్‌ శోభాయాత్ర కొనసాగనుంది. ఖైరతాబాద్‌, సైదాబాద్‌, ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్ ద్వారా ట్యాంక్‌బండ్‌కు తరలించనున్నారు. క్రేన్‌ నెంబర్‌ 4 దగ్గరకు మహాగణపతి రానుంది. సుమారు ఏడు గంటలపాటు నిమజ్జన ఘట్టం కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తి అయ్యేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది భారీ భద్రత ఏర్పాటు చేసింది.

Link to comment
Share on other sites

  • The title was changed to Ganesh Vinayak Chaturthi and Nimajjanam / Visarjan

Jagtial District: Snake on Ganesh - వినాయక మండపంలో వింత ఘటన.. గణేష్ మేడలో నాగుపాము | NTV

 

Link to comment
Share on other sites

Khairatabad Ganesh Nimajjanam LIVE | ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం 2024 Live | Ganesh Nimajjanam 2024|Ntv

 

Link to comment
Share on other sites

ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు | Devotees Throng To See Khairatabad Ganesh 2024 | ABN

 

Link to comment
Share on other sites

ఖైరతాబాద్ గణేష్ కోసం ఏం చేసారో చూడండి | Huge Devotees Rush at Khairatabad Ganesh | RTV

 

Link to comment
Share on other sites

Khairatabad Ganesh 2024 LIVE | ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు - TV9

 

Link to comment
Share on other sites

ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు....Huge Devotees Rush At Khairatabad Ganesh | TV5

 

Link to comment
Share on other sites

ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు..| Devotees Rush At Khairatabad Ganesh | Tv5 News

 

Link to comment
Share on other sites

ఖైరతాబాద్ గణేశుడి దర్శనం నిలిపివేత | Khairatabad Ganesh Darshan Updates | ABN

 

Link to comment
Share on other sites

LIVE: Khairatabad Ganesh Idol Immersion Work | Vinayaka Nimajjanam 2024 | కదిలిన మహా గణపతి | ZEE

 

Link to comment
Share on other sites

LIVE:శోభాయాత్రకు సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణేష్ |Khairatabad Ganesh Shobha Yatra | Ganesh nimajjanam

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...