-
💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.
- 0
Question
TELUGU
Pradhan Mantri Ujjwala Yojana 2.0 scheme: How to get Free LPG Connections? మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ కనెక్షన్ పొందడం ఎలా?
గ్రామాల్లోని ప్రతి ఇంట్లో మహిళలకు ఉచిత గ్యాస్‌సిలిండర్లను అందించేందుకు ఉజ్వల యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌ను అందిస్తోంది కేంద్రం. తద్వారా మహిళలు సులభంగా గ్యాస్‌తో ఆహారాన్ని వండుకోవచ్చు. ప్రతి గ్రామాల్లో మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేసుకోకుండా గ్యాస్ సిలిండర్‌పై..
గ్రామాల్లోని ప్రతి ఇంట్లో మహిళలకు ఉచిత గ్యాస్‌సిలిండర్లను అందించేందుకు ఉజ్వల యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌ను అందిస్తోంది కేంద్రం. తద్వారా మహిళలు సులభంగా గ్యాస్‌తో ఆహారాన్ని వండుకోవచ్చు. ప్రతి గ్రామాల్లో మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేసుకోకుండా గ్యాస్ సిలిండర్‌పై మాత్రమే వంట చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్‌ను తీసుకువచ్చింది.
ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాలను పొందేందుకు ఇలా దరఖాస్తు చేసుకోండి
☛ అధికారిక వెబ్‌సైట్ www.pmuy.gov.in కి వెళ్లండి
☛ ఇక్కడ మీరు హోమ్ పేజీకి వెళ్లి డౌన్‌లోడ్ ఎంపికను ఎంచుకోవాలి.
☛ ఇక్కడ మీరు అనేక భాషలలో ఫారమ్‌లు కనిపిస్తాయి. మీ సౌలభ్యం ప్రకారం.. మీకు సంబంధించిన ఫారమ్‌ను ఎంచుకోండి.
☛ ఇది కాకుండా, మీరు ఈ ఫారమ్‌ను ఎల్‌పీజీ సెంటర్ నుండి కూడా పొందవచ్చు.
☛ దీని తర్వాత, ఫారమ్ నుండి ప్రింట్ అవుట్ తీసుకొని మొత్తం సమాచారాన్ని పూరించండి.
☛ మీరు ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాలను కూడా సమర్పించాలి.
☛ మీరు సమీప LPG సెంటర్‌లో ఫారమ్‌ను సమర్పించాలి.
☛ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత, మీకు ఉచిత గ్యాస్ కనెక్షన్ లభిస్తుంది.
పథకం ప్రయోజనం ఎవరికి లభిస్తుంది?
☛ లబ్ది పొందిన మహిళ వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి.
☛ లబ్ది పొందిన మహిళకు ఇప్పటికే ఎలాంటి LPG కనెక్షన్ ఉండకూడదు.
☛ అలాగే, లబ్ధిదారుడు బిపిఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి.
☛ లబ్ధి పొందిన మహిళ దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి.
దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు
☛కుల ధృవీకరణ పత్రం:
☛ BPL రేషన్ కార్డు
☛ ఆధార్ కార్డ్
☛ మొబైల్ నంబర్
☛ ఆదాయ ధృవీకరణ పత్రం
☛ నివాస ధృవీకరణ పత్రం
☛ పాస్‌పోర్ట్ సైజు ఫోటో
ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు?
ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు గ్యాస్ కనెక్షన్‌తో పాటు ఉచితంగా సిలిండర్‌ను అందజేస్తున్నారు. దీనితో పాటు, సిలిండర్‌తో పాటు గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా లభిస్తుంది.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.