Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 1

Cricket, NFL, etc. ​🏏​🏈⚾🏉​​​​​​​🏀


ADMINISTRATOR

Question

  • Administrators

Have fun discussing your most favorite topic here...

Cheers!

Administrator

--
Administrator
Telugus.com

Telugus.com

Link to comment
Share on other sites

12 answers to this question

Recommended Posts

  • 0

T20 World Cup 2024: 3 జట్లతో టీమిండియా సూపర్ 8 పోరు.. ఏ జట్టుపై ఎలాంటి రికార్డులు ఉన్నాయంటే?

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా సూపర్-8 మ్యాచ్‌ల లైనప్ సిద్ధంగా ఉంది. అంటే ఐసీసీ టోర్నీలో ఈ దశలో ఎప్పుడు, ఏ జట్టుతో తలపడుతుందనే షెడ్యూల్ వెల్లడైంది. సూపర్-8లో టీమ్ ఇండియా తలపడబోతున్న జట్లు పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో సంచలనాలకు మారుపేరుగా మారాయి. అంటే, భారత జట్టుకు గ్రూప్‌ స్టేజ్‌ కంటే సూపర్‌-8 సవాల్‌ ఉత్కంఠగా ఉండబోతోందన్నమాట.

india-t20-world-cup-super-8-schedule.jpg

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా సూపర్-8 మ్యాచ్‌ల లైనప్ సిద్ధంగా ఉంది. అంటే ఐసీసీ టోర్నీలో ఈ దశలో ఎప్పుడు, ఏ జట్టుతో తలపడుతుందనే షెడ్యూల్ వెల్లడైంది. సూపర్-8లో టీమ్ ఇండియా తలపడబోతున్న జట్లు పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో సంచలనాలకు మారుపేరుగా మారాయి. అంటే, భారత జట్టుకు గ్రూప్‌ స్టేజ్‌ కంటే సూపర్‌-8 సవాల్‌ ఉత్కంఠగా ఉండబోతోందన్నమాట.

టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్-8 దశలో టీం ఇండియా తన తొలి మ్యాచ్‌ను జూన్ 20న ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనుంది. ఆ తర్వాత జూన్ 22న సూపర్-8లో టీమిండియా రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరగనుంది. జూన్ 24న ఆస్ట్రేలియాతో భారత జట్టు మూడో, చివరి సూపర్-8 మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇప్పుడు, ఈ ముగ్గురు ప్రత్యర్థులు టీమ్ ఇండియాకు ఎంత పెద్ద సమస్యగా మారతారు, గత మ్యాచ్‌ల రికార్డులను బట్టి అంచనా వేయవచ్చు.

ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్‌ రికార్డ్..

సూపర్-8 మ్యాచ్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు 9వ సారి టీ20 క్రికెట్‌లో తలపడనున్నాయి. ఇంతకు ముందు ఆడిన 8 మ్యాచ్‌ల్లో భారత్ 6 గెలిచింది. 1 మ్యాచ్ టై కాగా, 1 మ్యాచ్ అసంపూర్తిగా ఉంది. అంటే, అఫ్గానిస్థాన్ జట్టు ఇప్పటి వరకు భారత్‌తో ఏ టీ20 మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్-8 తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ పైచేయి సాధిస్తుందనడానికి ఇది సూచన.

బంగ్లాదేశ్‌పై టీమిండియా రికార్డ్..

బంగ్లాదేశ్‌తో భారత్ రెండో మ్యాచ్ ఆడనుంది. టీ20 క్రికెట్‌లో ఇరు జట్లు తలపడడం ఇది 14వ సారి. ఇంతకు ముందు ఆడిన 13 మ్యాచ్‌ల్లో భారత్ 12 సార్లు గెలిచింది. కాగా బంగ్లాదేశ్ పేరిట 1 మ్యాచ్ ఉంది. అంటే, రెండో మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్‌పై 12-1 తేడాతో భారత్ పైచేయి సాధించింది.

ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా రికార్డ్..

ఇప్పుడు సూపర్-8లో ఆస్ట్రేలియాతో తలపడే భారత్ మూడో మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. టీ20 క్రికెట్‌లో ఇరు జట్ల మధ్య ఇది 32వ మ్యాచ్‌. ఇంతకు ముందు ఆడిన 31 మ్యాచ్‌ల్లో భారత్ 19 గెలుపొందగా, ఆస్ట్రేలియా 11 మ్యాచ్‌లు గెలిచింది. అయితే, రెండు జట్ల మధ్య 1 మ్యాచ్ అసంపూర్తిగా ఉంది.

టీ20 ప్రపంచకప్‌లో భారత్ vs ఆస్ట్రేలియా..

టీ20 ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌ల గురించి మాట్లాడుకుంటే, ఇప్పటివరకు జరిగిన 5 ఎన్‌కౌంటర్లలో ఇక్కడ కూడా 3-2 తేడాతో టీమ్ ఇండియా పైచేయి సాధించింది. అయితే, వెస్టిండీస్ గడ్డపై రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా ఓ విషయం కలవరపెడుతోంది. వెస్టిండీస్‌లో ఇరు జట్లు తలపడడం ఇది రెండోసారి. ఇంతకు ముందు ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అంటే భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరి ఈసారి విజయం సాధించాలని కోరుకుంటోంది.

Link to comment
Share on other sites

  • 0

T20 World Cup: టీమిండియా సెమీస్ చేరాలంటే.. సూపర్-8లో ఆ ఒక్క ‘గండం’ దాటాల్సిందే..

టీ20 ప్రపంచ కప్‌.. ఇప్పటి వరకు 20 టీమ్‌లు లీగ్‌ స్టేజ్‌లో తలపడ్డాయి. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌ల్లోనూ టాప్ బ్యాటర్లకు చెమటలు పట్టాయి. ఇక నుంచి ఎనిమిది జట్లతో కూడిన ‘సూపర్-8’ సమరం మొదలు కానుంది. టీమ్‌ఇండియా పోరాటం గురువారం నుంచి ప్రారంభమవుతుంది.

team-india-openars.jpg?w=1280

టీ20 ప్రపంచ కప్‌.. ఇప్పటి వరకు 20 టీమ్‌లు లీగ్‌ స్టేజ్‌లో తలపడ్డాయి. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌ల్లోనూ టాప్ బ్యాటర్లకు చెమటలు పట్టాయి. ఇక నుంచి ఎనిమిది జట్లతో కూడిన ‘సూపర్-8’ సమరం మొదలు కానుంది. టీమ్‌ఇండియా పోరాటం గురువారం నుంచి ప్రారంభమవుతుంది. సంచలనాలకు మారుపేరు అఫ్గానిస్థాన్‌. అందుకు ఉదాహరణ లీగ్‌ స్టేజ్‌లో న్యూజిలాండ్‌పై 84 పరుగుల తేడాతో విజయం సాధించడం. టీ20 క్రికెట్‌లో ఇదొక భారీ గెలుపు. ఇలాంటి జట్టుతో భారత్‌ జూన్ 20న బార్బడోస్ వేదికగా తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

గ్రూప్-D నుంచి రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌కు లీగ్‌ స్టేజ్‌లో దక్షిణాఫ్రికా చేతిలోనే ఓటమిపాలైంది. శ్రీలంక, నెదర్లాండ్స్‌, నేపాల్‌ను ఓడించి సూపర్‌-8కి అర్హత సాధించింది. బంగ్లాదేశ్‌తో సూపర్‌-8లో భారత్ జూన్ 22న ఆంటిగ్వా వేదికగా ఆడనుంది. గ్రూప్‌-Bలో నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకొనేందుకు దూసుకొచ్చింది. లీగ్‌ స్టేజ్‌లో కఠినమైన ప్రత్యర్థిగా భావించిన ఇంగ్లాండ్‌పైనా ఘనవిజయం సాధించింది. ఆసీస్‌తో భారత్ జూన్ 24న సెయింట్‌ లూసియా వేదికగా తలపడనుంది.

సూపర్‌-8లో భారత్‌ ప్రత్యర్థులు అఫ్గాన్‌, బంగ్లా, ఆసీస్‌. మూడు మ్యాచుల్లోనూ భారత్‌ గెలిస్తే.. సెమీస్‌కు చేరుకొనేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే మాత్రం నెట్‌రన్‌రేట్‌ కీలకం అవుతుంది. భారత్‌కు అఫ్గాన్, బంగ్లా నుంచి ప్రతిఘటన ఎదురైనా.. విజయం సాధించే అవకాశాలు ఎక్కువే. మొదటి రెండు మ్యాచ్‌లు ఇవే జట్లతో ఉండటం కూడా మనకు కలిసొచ్చే అంశమే. ఈ గ్రూప్‌లో మనకు కఠిన ప్రత్యర్థి ఆసీస్‌. ఒకవేళ తొలి రెండు మ్యాచుల్లో ఒక్కటి ఓడినా.. మనకు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లా మారిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే వరుస విజయాలను ఖాతాలో వేసుకోవాల్సిందే.

Link to comment
Share on other sites

  • 0

T20 World Cup 2024: ఇవాళ్టి నుంచి టీ20 ప్రపంచకప్ సూపర్-8 సమరం.. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదిగో

ఈ రౌండ్‌లో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. సూపర్-8గా పిలిచే ఈ రౌండ్‌లో ఎనిమిది జట్లను 2 గ్రూపులుగా విభజించారు. ఇక్కడ గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియాలు బలమైన జట్లుగా కనిపిస్తుండగా, గ్రూప్-2లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి.

t20-world-cup-2024-3.jpg?w=1280

టీ20 ప్రపంచకప్ 2024: టీ20 ప్రపంచకప్ రెండో రౌండ్ మ్యాచ్‌లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌లో అమెరికా, దక్షిణాఫ్రికా జట్లు తలపడగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ రౌండ్‌లో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. సూపర్-8గా పిలిచే ఈ రౌండ్‌లో ఎనిమిది జట్లను 2 గ్రూపులుగా విభజించారు. ఇక్కడ గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియాలు బలమైన జట్లుగా కనిపిస్తుండగా, గ్రూప్-2లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి.

రెండు గ్రూపులుగా జట్లు:

గ్రూప్-1

  • భారతదేశం
  • ఆస్ట్రేలియ
  • ఆఫ్ఘనిస్తాన
  • బంగ్లాదేశ్

గ్రూప్-2

  • యూఎస్ఏ
  • వెస్టిండీస్
  • దక్షిణ ఆఫ్రికా
  • ఇంగ్లాండ్

ఇక్కడ 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. ఒకే గ్రూపులోని జట్లు ఒకదానితో ఒకటి పోరాడుతాయి. దీని ప్రకారం ఒక్కో జట్టుకు 3 మ్యాచ్‌లు ఉంటాయి. ఉదాహరణ: టీమ్ ఇండియా గ్రూప్-1లో ఉంది, కాబట్టి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది భారత జట్టు.

మొదటి రౌండ్‌లానే రెండో రౌండ్‌లోనూ పాయింట్ల పట్టిక లెక్కింపు ఉంటుంది. అంటే ఇక్కడ రెండు గ్రూపులకు వేర్వేరుగా మార్కులు ఉంటాయి. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి. దీని ప్రకారం గ్రూప్-1 నుంచి 2 జట్లు, గ్రూప్-2 నుంచి 2 జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి.

సెమీఫైనల్ పోరు ఇలా..

పైన పేర్కొన్న విధంగా, రెండు గ్రూపుల నుండి మొత్తం 4 జట్లు సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి. దీని తర్వాత రెండు గ్రూపుల జట్లు పరస్పరం పోరాడుతాయి. అంటే గ్రూప్-1లోని జట్లు గ్రూప్-2లోని జట్లతో నాకౌట్ మ్యాచ్‌లు ఆడతాయి.

ఆఖరి పోరు:

సెమీఫైనల్స్‌లో గెలిచిన రెండు జట్లు ఫైనల్స్‌లోకి ప్రవేశించనున్నాయి, తదనుగుణంగా జూన్ 29న జరిగే ఫైనల్ పోరులో ఛాంపియన్ టైటిల్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.

టీమిండియా షెడ్యూల్..

జూన్ 20న సూపర్-8 రౌండ్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. దీని తర్వాత జూన్ 22న బంగ్లాదేశ్‌తో, జూన్ 24న భారత్ తన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

T20 World Cup 2024: ఆఖరి ఘట్టానికి టీ20 ప్రపంచ కప్.. సెమీస్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..

ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, కెనడా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఒమన్, పాపువా న్యూ గినియా, స్కాట్లాండ్, శ్రీలంక, ఉగాండా, USA, వెస్టిండీస్ జట్లు టోర్నీ నుంచి నిష్ర్కమించగా... ప్రస్తుతం భారత్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ జట్లు ప్రపంచ కప్ కోసం పోటీ పడనున్నాయి

t20-world-cup-2024-1-1.jpg

ప్రతిష్ఠాత్మక T20 ప్రపంచ కప్ నాకౌట్ దశకు చేరుకుంది. మొత్తం 20 జట్లతో మొదలైన టోర్నీ ఇప్పుడు 4 జట్ల పోరుగా మారింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు నాకౌట్ దశలో పోటీపడనున్నాయి.

t20-world-cup-2024-2-1.jpg

ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, కెనడా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఒమన్, పాపువా న్యూ గినియా, స్కాట్లాండ్, శ్రీలంక, ఉగాండా, USA, వెస్టిండీస్ జట్లు టోర్నీ నుంచి నిష్ర్కమించగా... ప్రస్తుతం భారత్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ జట్లు ప్రపంచ కప్ కోసం పోటీ పడనున్నాయి.

t20-world-cup-2024-3-1.jpg

వెస్టిండీస్‌కు చెందిన కరేబియన్ ఐలాండ్స్ స్టేడియం సెమీస్ మ్యాచ్‌లకు కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. దీని ప్రకారం తొలి సెమీఫైనల్ ట్రినిడాడ్-టొబాగోలో జరగనుండగా, రెండో మ్యాచ్ గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇలా...

t20-world-cup-2024-4-1.jpg

దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్: జూన్ 27న దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ట్రినిడాడ్, టొబాగోలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరుగుతుంది. భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

t20-world-cup-2024-5-1.jpg

భారత్ వర్సెస్ ఇంగ్లండ్: జూన్ 27న భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

t20-world-cup-2024-8.jpg?w=1280&enlarge=

జూన్ 29న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగే ఫైనల్‌లో ఈ రెండు సెమీ-ఫైనల్‌లలో విజేతలు అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌తో 9వ టీ20 ప్రపంచకప్‌కు తెరపడనుంది.

Link to comment
Share on other sites

  • 0

T20 World Cup: విశ్వవిజేతగా నిలిచిన భారత్.. టీమిండియాకు అభినందనలు తెలిపిన సెలబ్రిటీస్..

ఒక దశలో సౌతాఫ్రికా బ్యాటర్స్ దూకుడుగా ఆడడంతో భారతీయులలో ఆందోళన నెలకొంది. కానీ చివరి ఓవర్ లో భారత్ అద్భుతమైన బౌలింగ్ తో విజేతలుగా నిలిచి ప్రపంచ కప్ అందుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియాకు దేశ ప్రజలు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా టీమిండియా ఆటతీరును కొనియాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్ టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

T20 World Cup

t20-world-cup-1.jpg?w=1280

సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్‏లోనే టీమ్ ఇండియా విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ టీ20 వరల్డ్ కప్‏లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించడంతో దేశమంతా సంబరాలు చేసుకుంటుంది. మ్యాచ్ అనంతరం స్టేడియంలోని అభిమానులతోపాటు ఆటగాళ్లు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మొదట భారత్ 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. కోహ్లి (76), అక్షర్ (47)తో రాణించారు. ఇక దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 169 పరుగులు చేయడంతో భారత్ ఖాతాలో టీ20 వరల్డ్ కప్ విజయం నిలిచింది. ఒక దశలో సౌతాఫ్రికా బ్యాటర్స్ దూకుడుగా ఆడడంతో భారతీయులలో ఆందోళన నెలకొంది. కానీ చివరి ఓవర్ లో భారత్ అద్భుతమైన బౌలింగ్ తో విజేతలుగా నిలిచి ప్రపంచ కప్ అందుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియాకు దేశ ప్రజలు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా టీమిండియా ఆటతీరును కొనియాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్ టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

క్రికెట్ అభిమానులను నెల రోజుల పాటు ఉర్రూతలూగించిన టీ20 వ‌రల్డ్‌క‌ప్‌-2024కు శుభం కార్డ్ ప‌డింది. జూన్ 29(శ‌నివారం) భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య‌ జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ముగిసింది. ఈ టైటిల్ పోరులో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన టీమిండియా.. రెండో సారి జగజ్జేతగా నిలిచింది

దీంతో 140 కోట్ల భారతీయుల కల నెరవేరింది. ఇక విజేత‌గా నిలిచిన టీమిండియా ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

టీ20 వ‌రల్డ్‌క‌ప్ విజేత‌కు ఎన్ని కోట్లంటే?

టీ20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు 2.45 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ. 20.42 కోట్లు) అందుకుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన సఫారీలకు 1.28 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10.67 కోట్లు) లభించింది.

సెమీఫైనల్‌కు చేరుకున్న ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లకు  చెరో రూ. 6.56 కోట్లు దక్కాయి. అదే విధంగా సూప‌ర్‌-8కు చేరుకున్న మొత్తం 8 జ‌ట్ల‌కు రూ.3.17 కోట్లు ప్రైజ్‌మనీ ల‌భించ‌నుంది. అదేవిధంగా 9 నుంచి 12వ స్థానాల్లో నిలిచిన జట్లకు- రూ. 2.05 కోట్లు, 13 నుంచి 20 స్థానాల్లో ఉన్న జట్లకు- రూ. 1.87 కోట్లు అంద‌నున్నాయి. 

ఇక ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రాకు రూ.12.45 లక్షల న‌గ‌దు బ‌హుమ‌తి ల‌భించ‌నుంది.

PM Modi congratulates Team India upon winning T20 World Cup

మహేష్ బాబు.. ఈ కప్ మనది.. బ్లూ జెర్సీలు ధరించిన మన హీరోలు ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్లు. టీమిండియాకు శిరసు వంచి వందనం చేస్తున్నాను. సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ చారిత్రక విజయం పట్ల అమితగర్వంతో పొంగిపోతున్నానని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి.. 17 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్ కప్ ను గెలవడం అద్భుతం. భారత్ ఇప్పుడు ప్రపంచం అగ్రభాగన ఉంది. విరాట్ కోహ్లీ భలే ఆడావు. బుమ్రా, హార్దిక్, అక్షర్, అర్షదీప్ అన్నింటికి మించి సరైన సారథి రోహిత్ శర్మకు తిరుగులేని ఆటతీరు కనబర్చిన యావత్ జట్టుకు శిరసు వంచి వందనం చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. అలాగే నమ్మశక్యం కానీ రీతిలో క్యాచ్ పట్టిన సూర్య కుమార్ యాదవ్ అదరహో అనిపించాడు అని అన్నారు.

రామ్ చరణ్.. టీమిండియాకు అనూహ్య విజయం. ఇండియా బాగా ఆడారు. బుమ్రా అద్భుతమైన ప్రదర్శన. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యకు అభినందనులు. మా కెప్టెన్ కు వందనాలు. ఈ విజయాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన టీమిండియాకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు చరణ్.

జూనియర్ ఎన్టీఆర్.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవడం పై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

రాజమౌళి.. 

అల్లు అర్జున్..  

సల్మాన్ ఖాన్..

 

Link to comment
Share on other sites

  • 0

IND Vs ZIM: ఇదేం చెత్తాట‌ సామీ.. పసికూన చేతిలో ఘోరంగా ఓడిన టీమిండియా.. స్కోర్ల వివరాలు

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘోర పరాజయం పాలయ్యింది. పసికూన చేతుల్లో భారత్ ఆలౌట్ కావడమే కాదు.. 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్(31), వాషింగ్టన్ సుందర్(27), ఆవేశ్ ఖాన్(16) మినహా మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు

Ind Vs Zim

ind-vs-zim-6.jpg?w=1280

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘోర పరాజయం పాలయ్యింది. పసికూన చేతుల్లో భారత్ ఆలౌట్ కావడమే కాదు.. 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్(31), వాషింగ్టన్ సుందర్(27), ఆవేశ్ ఖాన్(16) మినహా మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో చటారా, కెప్టెన్ సికిందర్ రజా చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బెన్నెట్, మసకద్జా, ముజారబని, జొన్గ్వే చెరో వికెట్ తీశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.

అంతకముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఆతిధ్య జట్టు జింబాబ్వేను బ్యాటింగ్‌కు దింపింది. మొదటి ఓవర్‌లోనే బౌలర్ ముఖేష్ కుమార్.. జింబాబ్వే ఓపెనర్ కియాను గోల్డెన్ డకౌట్ చేశాడు. అయితే ఆ తర్వాత మదేవేరే(21), బెన్నెట్(22) రెండో వికెట్‌కు 34 పరుగులు జోడించారు. ఇక కెప్టెన్ సికిందర్ రాజా(17), మైర్స్(23), వికెట్ కీపర్ మదందే(29) హ్యాండీ రన్స్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లకు జింబాబ్వే 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు.. సుందర్ 2 వికెట్లు.. ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ చెరో వికెట్ తీశారు.

ఇక 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత బ్యాటర్లు ఏమాత్రం సరైన షాట్స్‌తో అలరించలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ(0), రుతురాజ్ గైక్వాడ్(7), రియాన్ పరాగ్(2), రింకూ సింగ్(0), ధృవ్ జురెల్(6) పేలవ షాట్స్ ఆడి తమ వికెట్లను పారేసుకున్నారు. కెప్టెన్ గిల్(31) కొద్దిసేపు అలరించగా.. సికిందర్ రాజా అతడ్ని బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆల్‌రౌండర్ సుందర్(27), ఆవేశ్ ఖాన్(16)తో కలిసి మ్యాచ్ పూర్తి చేద్దామని చూసిన.. ఆఖరి ఓవర్‌లో టీమిండియా ఆలౌట్ అయింది. మొత్తానికి నిర్ణీత ఓవర్లకు భారత్ 102 పరుగులకు ఆలౌట్ అయ్యి.. 13 పరుగులతో ఓటమిని చవిచూసింది.

Link to comment
Share on other sites

  • 0

Video: 61 runs in 12 balls - విజయానికి 12 బంతుల్లో 61 పరుగులు.. రిజల్ట్ మీరు అస్సలు ఊహించలేరంతే.. ఎక్కడో తెలుసా?

ECI T10 Romania: ఆస్ట్రియా విజయానికి చివరి 2 ఓవర్లలో 61 పరుగులు కావాలి. ఆస్ట్రియా జట్టు ఎనిమిదో ఓవర్ వరకు 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానీ, తొమ్మిదో ఓవర్లో ఆస్ట్రియా కెప్టెన్ అకిబ్ ఇక్బాల్ 41 పరుగులు చేశాడు. ఇందులో వైడ్ బాల్ బౌండరీ, నో బాల్‌లో రెండు సిక్సర్లు ఇలా పరుగుల వర్షం కురిసింది.

eci-t10-romania-vs-austria.jpg?w=1280

ECI T10 Romania vs Austria: క్రికెట్ మైదానంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట అద్భుతం జరుగుతూనే ఉంటాయి. ఒకవైపు బ్యాట్స్‌మెన్స్ తమ తుఫాన్ బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు సృష్టిస్తుంటే.. మరోవైపు బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుంటారు. ఇప్పుడు అలాంటి ఘటనే జరగడంతో ఆస్ట్రియా జట్టు 61 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11 బంతుల్లోనే ఛేదించి ఉత్కంఠ విజయం సాధించింది. చివరి దశ వరకు విజయం చేతిలోనే ఉన్న రొమేనియా జట్టు.. చివరి రెండు ఓవర్లలో బౌలర్ల పేలవమైన బౌలింగ్ కారణంగా ఓటమి మూల్యం చెల్లించుకుంది.

రొమేనియా బ్యాటింగ్ అద్భుతం..

నిజానికి యూరోపియన్ క్రికెట్‌లో ఆస్ట్రియా, రొమేనియా మధ్య మ్యాచ్ జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఈసీఐ రొమేనియా టీ10 లీగ్ మ్యాచ్‌లో రొమేనియా దూకుడుగా బ్యాటింగ్ చేసి 167 పరుగులు చేసింది. రొమేనియా బ్యాట్స్‌మెన్ అరియన్ మహ్మద్ 39 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 104 పరుగులు చేయగా, మహ్మద్ మోయిస్ 14 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 42 పరుగులు చేశాడు.

ఇక్బాల్ తుఫాన్ బ్యాటింగ్..

Austria chase runs in last 2 overs!!

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఆస్ట్రియా జట్టుకు ఈ ఛేజింగ్ దాదాపు అసాధ్యం. అప్పటికే ఆ జట్టు టాప్‌ మూడు వికెట్లు పడిపోయాయి. చివరి 2 ఓవర్లలో విజయానికి 61 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రియా జట్టు ఎనిమిదో ఓవర్ వరకు 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానీ, తొమ్మిదో ఓవర్లో ఆస్ట్రియా కెప్టెన్ అకిబ్ ఇక్బాల్ 41 పరుగులు చేశాడు. ఇందులో వైడ్ బాల్ బౌండరీ, నో బాల్‌లో రెండు సిక్సర్లు ఇలా పరుగుల వర్షం కురిసింది.

19 బంతుల్లో 72 పరుగులు..

ఆఖరి ఓవర్లో ఇమ్రాన్ ఆసిఫ్ సిక్సర్ కొట్టగా, అకిబ్ స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత అకిబ్ వరుసగా 3 సిక్సర్లు బాది జట్టుకు కేవలం 9.5 ఓవర్లలోనే అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో అకిబ్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 72 పరుగులు చేశాడు. ఇమ్రాన్ ఆసిఫ్ కూడా 12 బంతుల్లో 1 బౌండరీ, 2 సిక్సర్లతో అజేయంగా 22 పరుగులు చేశాడు. దీంతో పాటు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రియా ఈసీఐ రొమేనియా టైటిల్‌ను కైవసం చేసుకుంది.

..

Complete article

Link to comment
Share on other sites

  • 0

David Rush: ఒకటి, రెండు కాదు.. ఒకే రోజు 15 వరల్డ్ గిన్నిస్ రికార్డ్‌లు సాధించిన అమెరికన్..

ఇప్పటి వరకు 250 ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టాడు. ఇక తాజాగా ఒకే రోజులో ఏకంగా 15 గిన్నిస్ వరల్డ్ రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా లండన్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కార్యాలయాలను సందర్శించి ప్రస్తుతం తన వద్ద ఉన్న 180 ఏకకాల మెడల్స్‌ను వేలం వేయడానికి వెళ్లాడు.

David Rush

david-rush.jpg?w=1280

అమెరికాకు చెందిన డేవిడ్ రష్ అనే వ్యక్తి సంచలనం సృష్టించాడు. ఇప్పటికే వరుస రికార్డులు బ్రేక్‌ చేసిన వ్యక్తిగా కీర్తి గడించిన అమెరికాకు చెందిన డేవిడ్ రష్ మరోమారు తన సత్తా చాటుకున్నాడు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకే రోజు 15 వరల్డ్ గిన్నిస్ రికార్డ్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలోని ఇడాహోకు చెందిన డేవిడ్ రష్.. ఇప్పటి వరకు 250 ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టాడు. ఇక తాజాగా ఒకే రోజులో ఏకంగా 15 గిన్నిస్ వరల్డ్ రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా లండన్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కార్యాలయాలను సందర్శించి ప్రస్తుతం తన వద్ద ఉన్న 180 ఏకకాల మెడల్స్‌ను వేలం వేయడానికి వెళ్లాడు.

లండన్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన డేవిడ్ రష్ తనవద్ద గల 180 శీర్షికలను వేలం వేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఒకే రోజు 15 రికార్డులు ఎలా బద్దలు కొట్టాడో ఆశ్చర్యంగా ఉందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక న్యాయనిర్ణేత విల్ సిండెన్ పేర్కొన్నారు.

...

Complete article

A big day out for @DavidWRush at GWR HQ

 

Link to comment
Share on other sites

  • 0

Paris Olympics 2024: India wins 6 medals - బై, బై పారిస్.. 6 పతకాలతో ఒలింపిక్స్ ప్రచారాన్ని ముగించిన భారత అథ్లెట్లు..

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ ప్రచారం ముగిసింది. టోక్యో ఒలింపిక్స్‌లో 1 స్వర్ణం, 2 రజతం, 4 కాంస్య పతకాలతో మొత్తం 6 పతకాలు సాధించిన భారత్ ఈసారి పేలవ ప్రదర్శన చేసింది. ఎందుకంటే గతేడాదితో పోలిస్తే ఈసారి భారతీయులు కేవలం 6 పతకాలు మాత్రమే సాధించారు. ఈ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో కేవలం ఐదుగురు మాత్రమే పతకాలు సాధించడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం.

paris-olympics-2024-3.jpg?w=1280&enlarge

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ ప్రచారం ముగిసింది. టోక్యో ఒలింపిక్స్‌లో 1 స్వర్ణం, 2 రజతం, 4 కాంస్య పతకాలతో మొత్తం 6 పతకాలు సాధించిన భారత్ ఈసారి పేలవ ప్రదర్శన చేసింది. ఎందుకంటే గతేడాదితో పోలిస్తే ఈసారి భారతీయులు కేవలం 6 పతకాలు మాత్రమే సాధించారు.

manu-baker.jpg

ఈ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో కేవలం ఐదుగురు మాత్రమే పతకాలు సాధించడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం. అంటే మను భాకర్ రెండు పతకాలు సాధించింది. దీని ప్రకారం పారిస్ ఒలింపిక్స్‌లో భారతీయులు సాధించిన పతకాల జాబితా ఎలా ఉందో చూద్దాం..

manu-baker-1.jpg

యువ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో మను కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం ద్వారా భారత్ పతక ఖాతా తెరిచింది.

paris-olympics-2024-1-1.jpg

ఆ తర్వాత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మను భాకర్ సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భారత్‌కు 2వ కాంస్య పతకాన్ని అందించింది. దీంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచింది.

swapnil-kusale-1.jpg

షూటింగ్‌లో భారత్ మూడో పతకం సాధించడం విశేషం. 50 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో స్వప్నిల్ కుసాలే 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

hockey-india.jpg

పురుషుల హాకీ గేమ్‌లో నాలుగో పతకం వచ్చింది. 3వ స్థానం కోసం జరిగిన పోరులో భారత హాకీ జట్టు 2-1తో స్పెయిన్ జట్టును ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

neeraj-chopra-7.jpg

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి 2వ స్థానంలో నిలిచి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. దీని ద్వారా వరుసగా రెండు ఎడిషన్లలో పతకాలు సాధించి ప్రత్యేక ఫీట్ సాధించాడు.

aman-sehrawat-8.jpg

యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ భారత్‌కు ఆరో పతకాన్ని అందించాడు. పురుషుల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో 21 ఏళ్ల అమన్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

vinesh-phogat-12.jpg

50 కిలోల మహిళల రెజ్లింగ్ పోటీలో వినేష్ ఫోగట్ ఫైనల్స్‌లోకి ప్రవేశించినప్పటికీ, చివరి రౌండ్‌లో అదనపు బరువు కారణంగా అతను అనర్హురాలైంది. అయితే, వినేష్ ఫోగట్ సెమీ-ఫైనల్ వరకు అర్హత సాధించినందున రజత పతకాన్ని ప్రదానం చేయాలని క్రీడల మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వినేష్‌కు అనుకూలంగా తీర్పు వస్తే రజత పతకం ఖాయం కానుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Video: Pakistan Cricket Team is in ICU, need professional doctors - Rashid Latif - ‘పాక్ క్రికెట్ ఐసీయూలో ఉంది.. ప్రొఫెషనల్ డాక్టర్లు కావాలి’: మాజీ ప్లేయర్ విమర్శలు

Pakistan Cricket Team: T20 ప్రపంచ కప్ 2024లో US జట్టుపై అవమానకరమైన ఓటమిని చవిచూసిన పాకిస్థాన్ జట్టు ఇప్పుడు స్వదేశంలో బంగ్లాదేశ్‌పై క్లీన్ స్వీప్ అయింది. ఈ అవమానకరమైన ఓటమి కారణంగా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు దాని అభిమానుల కోపానికి గురి అయ్యింది. అలాగే జట్టులోని మాజీ అనుభవజ్ఞుల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది.

 
Video: 'పాక్ క్రికెట్ ఐసీయూలో ఉంది.. ప్రొఫెషనల్ డాక్టర్లు కావాలి': మాజీ ప్లేయర్ విమర్శలు
Pakistan Cricket Team

Pakistan Cricket Team: ఆటగాళ్ల పేలవ ప్రదర్శన కారణంగా.. వరుస ఓటములతో షాక్‌కు గురైన పాక్ జట్టు.. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. T20 ప్రపంచ కప్ 2024లో US జట్టుపై అవమానకరమైన ఓటమిని చవిచూసిన పాకిస్థాన్ జట్టు ఇప్పుడు స్వదేశంలో బంగ్లాదేశ్‌పై క్లీన్ స్వీప్ అయింది. ఈ అవమానకరమైన ఓటమి కారణంగా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు దాని అభిమానుల కోపానికి గురి అయ్యింది. అలాగే జట్టులోని మాజీ అనుభవజ్ఞుల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. కాగా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఐసీయూలో ఉందని మాజీ సీనియర్ క్రికెటర్ రషీద్ లతీఫ్ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వరుసగా 10 పరాజయాలు..

పాకిస్థాన్ క్రికెట్ జట్టు తమ సొంత మైదానంలో ఆడిన గత 10 టెస్టుల్లో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. ఈ 10 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ 4 మ్యాచ్‌లు డ్రా చేసుకోగా, 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాకిస్థాన్ చివరిసారిగా 2021లో దక్షిణాఫ్రికాపై సొంతగడ్డపై టెస్టు గెలిచింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ 3-0తో పాకిస్థాన్‌పై, ఆస్ట్రేలియాపై 1-0తో, బంగ్లాదేశ్‌పై 2-0తో గెలుపొందాయి.

రషీద్ లతీఫ్ ఏం చెప్పాడంటే?

మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో పాకిస్థాన్ క్రికెట్ ఐసీయూలో ఉంది. పాక్ బృందానికి ప్రొఫెషనల్ వైద్యులు అవసరం. స్వదేశంలో గానీ, విదేశీ గడ్డపై గానీ జట్టు సరిగా ఆడలేకపోతోంది. జట్టు వ్యవహారాలను నిర్వహించడానికి సాంకేతికంగా నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం ఉంది. అది శారీరక శిక్షణ లేదా ఆర్థిక నిర్వహణ. పాక్ జట్టు పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోకపోతే.. పాకిస్థాన్ క్రికెట్ ప్రమాదంలో పడుతుందని రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు.

బంగ్లాదేశ్‌పై తొలి ఓటమి..

క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాక్ జట్టు ఓడిపోలేదు. అందుకే, బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు పాక్ క్రికెట్ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్‌పై ఆ జట్టు విజయం సాధించి ఉంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకోవడం సులువుగా ఉండేది. కానీ, పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ నిరాశాజనక ప్రదర్శనతో ఓడిపోయింది. దీంతో పాక్‌ క్రికెట్‌ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...