Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

OTT Platforms, Plans & Movies ​🎥​ ​📺​​​​​​​📽️


TELUGU

Recommended Posts

Netflix for FREE without any subscription! ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఇక పై నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రీగా సినిమాలు, సిరీస్లు చూడొచ్చు..

ఓటీటీ సంస్థలు పెరిగాయి..దాంతో ఓటీటీ కంటెంట్ కూడా పెరిగింది. ప్రతి శుక్రవారం ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలు నెల రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక వెబ్ సిరీస్ లకు కొదవే లేదు.

Netflix

netflix-1.jpg?w=1280

కరోనా పుణ్యమా అని ఓటీటీల వాడకం ఎక్కువైంది. లాక్ డౌన్ సమయంలో థియేటర్స్ కు వెళ్లలేక చాలా మంది ఓటీటీలో సినిమాలు చూడటం మొదలు పెట్టారు. అలా మెల్లగా సినిమాలు థియేటర్స్ లో చూడటం కంటే ఓటీటీల్లోనే చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు ఆడియన్స్. ఓటీటీ సంస్థలు పెరిగాయి..దాంతో ఓటీటీ కంటెంట్ కూడా పెరిగింది. ప్రతి శుక్రవారం ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలు నెల రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక వెబ్ సిరీస్ లకు కొదవే లేదు. చాలా రకాల వెబ్ సిరీస్ లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు అలరిస్తున్న ఓటీటీ సంస్థల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నెట్‌ఫ్లిక్స్ గురించే..

నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటికే చాలా రకాల సినిమాలు ఉన్నాయి. హాలీవుడ్ కంటెంట్ తో పాటు తెలుగు కంటెంట్ కూడా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ప్రముఖ సినిమాలు ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ లోనే స్త్రీమింగ్ అవుతుంటాయి. అలాగే ఓన్లీ నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సిరీస్ లు కూడా చాలా ఉన్నాయి. అయితే సబ్ స్క్రిప్షన్ తీసుకుంటేనే నెట్ ఫ్లిక్స్ లో కంటెంట్ చూడొచ్చు.. కానీ ఇప్పుడు ఫ్రీగా కంటెంట్ చూసే వెసులుబాటు కలిపిస్తుందట నెట్‌ఫ్లిక్స్. అదెలా అంటే..

ప్రస్తుతం ఉన్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెట్ అందిచడంతో పాటు ప్రేక్షకులు మెచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లు అందించడంలో నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. యూరప్, ఆసియాలోని ప్రేక్షకులను టార్గెట్ గా చేసుకొని నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు కొత్త ప్లాన్ తీసుకు వస్తుందని తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ ను ఇండియాకు తీసుకు వస్తారా లేదా అనేది చూడాలి. అయితే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకుండానే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోని సినిమాలు, వెబ్ సిరీసులను ఉచితంగా చూడొచ్చట.. అయితే వీటిలో యాడ్స్ ఎక్కువ వస్తాయట.. 20 నిమిషాలకు ఓ యాడ్, లేదా అరగంటకు ఓ యాడ్ వస్తుందట. అడ్వర్టైజ్‌మెంట్స్‌తోనే ఉచితంగా వీక్షించవచ్చని తెలుస్తోంది. యాడ్స్ లేకుండా సినిమాలు, సిరీస్ లు చూడటానికి డబ్బులు కట్టి సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలట. ఈ కొత్త ప్లాన్ ను త్వరలోనే యూరప్, ఆసియాలో తీసుకురానున్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ ఫ్రీ ప్లాన్ ఇండియా కు వస్తుందేమో చూడాలి.

...

Complete article

Link to comment
Share on other sites

  • The title was changed to Netflix for FREE without any subscription! ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఇక పై నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రీగా సినిమాలు, సిరీస్లు చూడొచ్చు..
  • 3 weeks later...
  • Replies 26
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TELUGU

    12

  • Sanjiv

    7

  • Vijay

    6

  • ADMINISTRATOR

    2

దైర్యముంటేనే చూడండి..! సీను సీనుకు సుస్సు పడాల్సిందే.. ఈ మూవీ ఎక్కడుందంటే

ప్పటికే వందల సంఖ్యలో హారర్ మూవీస్ వివిధ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో చాలా బెస్ట్ మూవీస్ ఉన్నాయి. ఇతర భాషల్లో రిలీజ్ అయిన హారర్ సినిమాలు కూడా తెలుగులో డబ్ ఆయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ హారర్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా చూడాలంటే ధైరం ఉండాల్సిందే.. ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తే వెన్నులో ఒణుకు పుడుతుంది.

horror-movie.jpg?w=1280

ఓటీటీలో వణికించే సినిమాలు చాలానే ఉన్నాయి. హారర్ సినిమాలు చూడటానికి నెటిజన్స్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే వందల సంఖ్యలో హారర్ మూవీస్ వివిధ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో చాలా బెస్ట్ మూవీస్ ఉన్నాయి. ఇతర భాషల్లో రిలీజ్ అయిన హారర్ సినిమాలు కూడా తెలుగులో డబ్ ఆయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ హారర్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా చూడాలంటే ధైరం ఉండాల్సిందే.. ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తే వెన్నులో ఒణుకు పుడుతుంది. ఇప్పటికీ ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఇంతకు ఈ సినిమా కథ ఏంటంటే.. అంతగా ఈ సినిమాలో బయపడటానికి ఏముందంటే..

ఈ సినిమాలో.. ఆశ (రేవ‌తి) ఓ స్కూల్‌లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. భ‌ర్త చ‌నిపోవ‌డంతో కొడుకు వినును, పెంచుతుంటుంది. వీరితో పాటు ఆశ అమ్మ కూడా ఉంటుంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అయితే విను ఎంబీబీఎస్ చ‌ద‌వాల‌ని ఆశపడుతుంటాడు. కానీ త‌ల్లి ఆశ‌ బ‌ల‌వంతంగా అత‌డిని బీఫార్మ‌సీలో చేర్పిస్తుంది. చ‌దువు పూర్తిచేసిన విను రెండేళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుంటాడు. కానీ ఒక్క జాబ్ కూడా అతనికి రాదు. దాంతో అతను సొంతఊరు వదిలి మరో ప్లేస్ కు వెళ్లి జాబ్ చేయాలని అనుకుంటాడు. కానీ అతని తల్లి ఆశ అందుకు ఒప్పుకోదు. ఆతర్వాత ఒకరోజు అతని అమ్మమ్మ చనిపోతుంది.

ఆమె చనిపోయిన దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది. విను అమ్మమ్మ చ‌నిపోయిన కొన్ని రోజుల త‌ర్వాత ఇంట్లో వింత శ‌బ్దాలు, కొన్ని ఆకారాలు విను చూస్తాడు. ఇదే విషయం చెప్తే ఎవరూ అతన్ని నమ్మరు. అయితే విను ఫ్యామిలిలో చాలా మంది  మాన‌సిక స‌మ‌స్య‌తో బాధపడుతుంటారు. దాంతో విను కూడా అదే సమస్యతో బాధపడుతున్నాడని డాక్టర్ చెప్తాడు. ఆతర్వాత కొన్ని సంఘటనలతో వినుతో పాటు ఆశ కూడా ఇంట్లో ఏదో ఉంద‌నే నిజం తెలుసుకుంటుంది. అయితే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది.? అక్కడ ఉన్నది ఏంటి.? వీరి కంటే ముందు ఆ ఇంట్లో ఉన్నవారికి ఏమైంది.?  విను.. ఆశ‌ ప్రాణాల‌తో  బయటపడ్డారా.? లేదా.? అన్న‌దే సినిమాలోనే చూడాలి. ఈ సినిమా పేరు భూత‌కాలం. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Link to comment
Share on other sites

OTT Movies this week: ఓటీటీలో మూవీ ఫెస్టివల్.. ఈ శుక్రవారం స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీకెండ్‌లో మొత్తం 27 మూవీస్ ప్లస్ సిరీసులు అలరించనున్నాయి.

ఆహా ఓటీటీలో..

  • ద అకాలీ – తమిళ సినిమా
  • బూమర్ అంకుల్ – తెలుగు డబ్బింగ్ మూవీ (జూలై 20)

నెట్‌ఫ్లిక్స్

  • ఆడు జీవితం – తెలుగు డబ్బింగ్ సినిమా ఫైండ్ మీ ఫాలింగ్ – ఇంగ్లిష్ సినిమా
  • స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ – ఇంగ్లిష్ మమూవీ
  • స్వీట్ హోమ్ సీజన్ 3 – కొరియన్ వెబ్ సిరీస్
  • కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 – ఇంగ్లిష్ వెబ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది)
  • మాస్టర్ ఆఫ్ ద హౌస్ – థాయ్ వెబ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ – హిందీ వెబ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • కోబ్రా కోయ్ సీజన్ 6 పార్ట్ 1 – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
  • మాస్టర్ ఆఫ్ ద హౌస్ – థాయ్ సిరీస్
  • పసుత్రి గాజే – ఇండోనేసియన్ సినిమా

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • నాగేంద్రన్స్ హనీమూన్ – తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్
  • యంగ్ ఉమెన్ అండ్ ద సీ – ఇంగ్లిష్ సినిమా

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • బెట్టీ లా ఫీ – స్పానిష్ వెబ్ సిరీస్
  • మ్యూజిక్ షాప్ మూర్తి – తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది)
  • అన్ ఇంటరప్టెడ్ టాప్ క్లాస్ టెన్నిస్ – ఇంగ్లీష్ సిరీస్

జీ5

  • బహిష్కరణ – తెలుగు వెబ్ సిరీస్
  • బర్జాక్ – హిందీ వెబ్ సిరీస్

జియో సినిమా

  • ఐఎస్ఎస్ – ఇంగ్లిష్ సినిమా
  • మిస్టర్ బిగ్ స్టఫ్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది)

ఆపిల్ ప్లస్ టీవీ

  • లేడీ ఇన్ ద లేక్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్

హోయ్ చోయ్ టీవీ

  • ధర్మజుద్దా – బెంగాలీ సినిమా

బుక్ మై షో

  • ద డీప్ డార్క్ – ఫ్రెంచ్ సినిమా
  • ద వాచర్స్ – ఇంగ్లిష్ సినిమా

లయన్స్ గేట్ ప్లే

  • అర్కాడియన్ – ఇంగ్లిష్ మూవీ

డిస్కవరీ ప్లస్

  • ద బ్లాక్ విడోవర్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది)
Link to comment
Share on other sites

Tollywood Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే.. థ్రిల్ ఇచ్చే వెబ్ సిరీస్‏లు..

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కల్కి 2898 ఏడి హవానే కొనసాగుతుంది. ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన రాయన్ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది.

అలాగే యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు, మరికొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి.

అలాగే అటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ కామెడీ చిత్రాలు, వెబ్ సిరీస్ సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. అందుకే ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ ఏంటో తెలుసుకుందామా.

OTT Movies

ott-movies-5.jpg?w=1280

రాజు యాదవ్.. జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా నటించిన సినిమా రాజు యాదవ్. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంకిత కారాట్ కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

భయ్యా జీ.. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో అపూర్వ సింగ్ కర్కి దర్శకత్వం వహించిన సినిమా భయ్యా జీ. మనోజ్ బాజ్ పాయ్ కెరీర్ లో 100వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం శుక్రవారం నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

బ్లడీ ఇష్క్.. టాలీవుడ్ హీరోయిన్ అవికా గోర్, వర్దన్ పూరి జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ బ్లడీ ఇష్క్. విక్రమ్ భట్ తెరకెక్కించిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.

నెట్ ఫ్లిక్స్.. 

  • అట్లాస్.. హాలీవుడ్ మూవీ.. జూలై 26
  • డ్రాగన్ ప్రిన్స్ సీజన్ 6.. హాలీవుడ్ వెబ్ సిరీస్.. జూలై 26
  • ఎలైట్ సీజన్ 8.. హాలీవుడ్ వెబ్ సిరీస్.. జూలై 26
  • ది డెకామెరాన్.. హాలీవుడ్ వెబ్ సిరీస్.. జూలై 25

అమెజాన్ ప్రైమ్ వీడియో… 

  • ది మినిస్ట్రీ ఆఫ్ అన్ జెంటిల్ మాన్లీ వార్ ఫేర్.. హాలీవుడ్.. జూలై 25

ఆహా.. 

  • యేవమ్.. తెలుగు.. జూలై 25
  • భరతనాట్యం.. తెలుగు.. జూలై 27

హాట్ స్టార్.. 

  • చట్నీ సాంబార్.. తమిళం.. జూలై 26
  • ది కర్దాషియన్స్ సీజన్ 5.. హాలీవుడ్ వెబ్ సిరీస్.. జూలై 25

జియో సినిమా.. 

  • విచ్ బ్రింగ్స్ మీ టూ యూ .. హాలీవుడ్.. జూలై 26
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Kalki 2898 AD in Netflix and Prime OTT: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు ఓటీటీల్లోకి కల్కి.. స్ట్రీమింగ్ డేట్ ఇదిగో

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా థియేటర్లలో విడుదలై దాదాపు 40 రోజులు పూర్తయిపోయింది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా అక్కడక్కడా ఆడుతున్నప్పటికీ థియేట్రికల్ రన్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కల్కి ఇప్పటివరకు సుమారు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే బాహుబలి తర్వాత వరుసగా ప్లాఫ్ లు అందుకున్న డార్లింగ్ కల్కి సినిమాతో మళ్లీ తన స్టామినాను చూపించాడు. దీంతో కల్కి సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారికోసమే కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.

kalki-2898-ad-movie-12.jpg?w=1280

Kalki 2898 AD Movie

ఇదే ఆగస్టు నెలలోనే ప్రభాస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా కల్కి సినిమా ఏకంగా రెండు ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆగస్ట్ 23 నుంచి కల్కిని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధింంచి ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ వారియర్స్, పీబీ కల్ట్స్ అనే ఫ్యాన్ పేజీలో కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ పోస్టర్ దర్శనమిచ్చింది. దీని ప్రకారం నెట్ ఫ్లిక్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలనూ ఈ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో కల్కి స్ట్రీమింగ్ కానుంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రసారం చేయనున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమాలో ప్రభాస్ సరసన హిందీ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ తదితరులు క్యామియో రోల్స్ లో మెరిశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు రూ. 700 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కల్కి సినిమాను నిర్మించారు.

After a blockbuster outing at Box Office [ 8 Weeks ] #Kalki2898AD will be streaming in #AmazonPrime South Languages & Netflix Hindi & English on August 23rd.

https://www.instagram.com/p/C-Hqg5PPgY6

Link to comment
Share on other sites

Bharateeyudu 2 OTT: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‌కు భారతీయుడు 2.. ఎక్కడ చూడొచ్చంటే?

తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ భారతీయుడు 2 సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్లాఫ్ టాక్ రావడంతో చాలామంది ఓటీటీలో ఈ సినిమాను చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు వారి కోసమే మరికొన్ని గంటల్లో ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. భారతీయుడు 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ

Bharateeyudu 2 Movie

bharateeyudu-2-movie-1.jpg?w=1280

లోక నాయకుడు కమల్‌ హాసన్‌- సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘భారతీయుడు 2’. దాదాపు 28 ఏళ్ల (1996)క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమా భారతీయుడుకు ఇది సీక్వెల్‌. అయితే ఆ మ్యాజిక్ ను కొనసాగించడంలో భారతీయుడు 2 ఘోరంగా విఫలమైంది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ తారాగణం, ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఉన్నప్పటికీ ఔట్ డేటెస్ కథా, కథనాలు సినిమాకు మైనస్ గా మారాయని రివ్యూలు వచ్చేశాయి. తమిళంలో ఈ సినిమాకు ఒక మోస్తరు గానే వసూళ్లు వచ్చాయి. అయితే తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ భారతీయుడు 2 సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్లాఫ్ టాక్ రావడంతో చాలామంది ఓటీటీలో ఈ సినిమాను చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు వారి కోసమే మరికొన్ని గంటల్లో ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. భారతీయుడు 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆగస్టు 9 నుంచి కమల్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు కొన్ని రోజుల రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అంటే ఇవాళ్టి అర్ధ రాత్రి నుంచే భారతీయుడు 2 సినిమా ఓటీటీలో ప్రత్యక్షం కానుందన్నమాట. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ భారతీయుడు 2 సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.

భారతీయుడు 2 సినిమాలో సిద్ధార్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా, బ్రహ్మానందం, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.ప్రతిష్ఠాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ సుమారు రూ. 250 కోట్లతో భారతీయుడు 2 సినిమాను నిర్మించారని సమాచారం. అయితే ఓవరాల్ గా ఈ సినిమా కేవలం రూ. 130 కోట్లను మాత్రమే కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక భారతీయుడు 2 సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15 న ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే థియేటర్లలో నెగెటివ్ టాక్ రావడంతో ఒక వారం రోజులు ముందుగానే కమల్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నారు. మరి థియేటర్లలో భారతీయుడు 2 సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి కమల్ నటనను ఆస్వాదించండి.

...

Complete article

Link to comment
Share on other sites

The Birthday Boy OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ థ్రిల్లింగ్ మూవీ.. ది బర్త్‌డే బాయ్‌ను ఎక్కడ చూడొచ్చంటే?

రిలీజ్ కు ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. వెరైటీగా ప్రమోషన్లు నిర్వహించడం, టీజర్ ,ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో ది బర్త్ డే బాయ్ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే జులై 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది

The Birthday Boy Movie

birthday-boy.jpg?w=1280

ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌ క‌న‌కాల తదితరులతో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘ది బర్త్‌డే బాయ్‌’. బొమ్మ బొరుసా బ్యానర్ పై ఐ.భరత్‌ నిర్మాణంలో విస్కీ దాసరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. వెరైటీగా ప్రమోషన్లు నిర్వహించడం, టీజర్ ,ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో ది బర్త్ డే బాయ్ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే జులై 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే చిన్న సినిమా కావడంతో ఎక్కువ మంది జనాలకు రీచ్ కాలేకపోయింది. థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేకపోయిన ది బర్త్ డే బాయ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ది బర్త్ డే బాయ్ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్టు 9 నుంచి ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఆహా. అలాగే సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ది బర్త్ డే బాయ్ సినిమాలో ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్ర‌శాంత్ శ్రీ‌నివాస్ సంగీతం అందించారు. న‌రేష్ ఆడుపా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, సంకీర్త్ రాహుల్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. 2016లో దర్శకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటననే కథగా మలిచి ది బర్త్ డే బాయ్ సినిమాను తెరకెక్కించారు. పుట్టినరోజు వేడుకల్లో ఓ స్నేహితుడు ఎలా చనిపోయాడు? ఆ తర్వాత జరిగిన సంఘటనలేంటి? అనేవి ఈ సినిమాలో కీలకాంశాలు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా.? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

...

Complete article

Link to comment
Share on other sites

Upcoming OTT Telugu Movies Release Dates | 18 New OTT Movies Telugu | Raayan OTT | Kalki 2898 AD OTT | Manamey | Buddy

 

Link to comment
Share on other sites

Kalki 2898 AD OTT: అఫీషియల్.. ప్రభాస్ కల్కి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ప్రభాస్ అభిమానులకు ఈ రోజు రెండు గుడ్ న్యూస్ లు అందాయి. డార్లింగ్- హను రాఘవ పూడి సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావడం ఒకటైతే.. మరొకటి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న బ్లాక్ బస్టర్ కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రావడం. ఆగస్టు 15 నాటికి ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. అంటే దాదాపు థియేట్రికల్ రన్ ముగిసినట్టే. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఇంకా డార్లింగ్ మూవీ ఆడుతోంది.

Kalki 2898 AD Movie

kalki-2898-ad-movie-2.jpg?w=1280

ప్రభాస్ అభిమానులకు ఈ రోజు రెండు గుడ్ న్యూస్ లు అందాయి. డార్లింగ్- హను రాఘవ పూడి సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావడం ఒకటైతే.. మరొకటి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న బ్లాక్ బస్టర్ కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రావడం. ఆగస్టు 15 నాటికి ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. అంటే దాదాపు థియేట్రికల్ రన్ ముగిసినట్టే. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఇంకా డార్లింగ్ మూవీ ఆడుతోంది. ఈ నేపథ్యంలో కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఆగస్టు 3 వారంలో ప్రభాస్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. అయితే ఆగస్టు 23న కాకుండా ఒక రోజు ముందే అంటే ఆగస్టు 22 నుంచే కల్కి మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. కల్కి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే హిందీ వెర్షన్ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 22 నుంచి కల్కి సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ తో పాటు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్లను కూడా రిలీజ్ చేశాయి.

నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ తదితరులు క్యామియో రోల్స్ లో మెరిశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు రూ. 700 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కల్కి సినిమాను నిర్మించారు. ఓవరాల్ గా ఈ సినిమాకు రూ.1200 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. మరి థియేటర్లలో కల్కి సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకో 5 రోజులు ఆగండి.

Link to comment
Share on other sites

Demonte Colony 2 Telugu, HHVM, New OTT Movies Telugu 😎, Pushpa 2, Prabhas, Vettaiyan, Agra 🥵, Devara

 

Link to comment
Share on other sites

  • The title was changed to OTT Platforms, Plans & Movies ​🎥​ ​📺​​​​​​​📽️
  • 3 weeks later...

IPTV Scams: ఫ్రీ.. మీ కొంప ముంచుతుంది.. ఐపీటీవీ స్కామ్‌లను గుర్తించకపోతే నేరం చేసినట్లే..!

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అబ్బ ఎంత ఆనందమో.. ఇప్పుడు వినోద ప్రపంచంలో ఫ్రీ అనే మాట ఎంత మంచిగా వినిపిస్తుందో.. అంతే దోపిడి జరుగుతోంది.. చట్టవిరుద్ధమైన IPTV సేవలు చౌక స్ట్రీమింగ్‌ను అందించవచ్చు.. కానీ అవి స్కామ్, మాల్వేర్, భద్రతా ప్రమాదాల వంటి ప్రమాదాలతో ముడిపడి ఉంటాయి.. చట్టబద్ధమైన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు కట్టుబడి ఉండటం మీ భద్రతకు ఎందుకు కీలకమో ఇప్పుడు తెలుసుకోండి.

 
IPTV Scams: ఫ్రీ.. మీ కొంప ముంచుతుంది.. ఐపీటీవీ స్కామ్‌లను గుర్తించకపోతే నేరం చేసినట్లే..!
IPTV Scam Alert

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అబ్బ ఎంత ఆనందమో.. ఇప్పుడు వినోద ప్రపంచంలో ఫ్రీ అనే మాట ఎంత మంచిగా వినిపిస్తుందో.. అంతే దోపిడి జరుగుతోంది.. వినోదాన్ని అందించే ఓటీటీ (Over-the-top media service) ప్లాట్‌ఫాంలు ఎన్ని ఉన్నా.. ఫ్రీ అనగానే మన మనస్సు అటువైపే లాగుతుంది.. వాస్తవికత, కొత్తదనంతో వృద్ధి చెందే డిజిటల్-కంటెంట్ స్పేస్‌లో ఖచ్చితమంటూ ఏదీ లేదు. అందుకోసమే ఇలాంటి వాటిని ఉపయోగించి అక్రమ ఐపీటీవీ (Internet Protocol television)లు రెచ్చిపోతున్నాయి. దీంతో చాలామంది ఎంటర్టైన్మెంట్ ను ఫ్రీగా దొరుకుతుందని అలాంటి ప్లాట్‌ఫాంలకు వెళ్లి స్కామ్ ల బారిన పడుతున్నారు. డిజిటల్ హక్కులు, మేధో సంపత్తి సూక్ష్మబేధాలను అర్థం చేసుకోకుండా అక్రమ IPTV ద్వారా పైరేటెడ్ కంటెంట్‌ను వినియోగిస్తున్నట్లయితే.. మీకో హెచ్చరిక.. మీరు చట్టాన్ని అతిక్రమిస్తున్నట్లే.. ఇది నేరం కూడానూ.. మీ టీవీ వీక్షణ అనుభవం విషయానికొస్తే.. నిజాయితీగా ఉండండి.. ఉండనివ్వండి.. పైరేటెడ్ కంటెంట్ వీక్షకుల సంఖ్య పెరిగినట్లే .. స్కామ్ ల బారిన పడటం కూడా షరామామూలుగా మారుతుంది. చట్టవిరుద్ధమైన IPTV సేవలు చౌక స్ట్రీమింగ్‌ను అందించవచ్చు.. కానీ అవి స్కామ్, మాల్వేర్, భద్రతా ప్రమాదాల వంటి ప్రమాదాలతో ముడిపడి ఉంటాయి.. చట్టబద్ధమైన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు కట్టుబడి ఉండటం మీ భద్రతకు ఎందుకు కీలకమో ఇప్పుడు తెలుసుకోండి.

చట్టపరమైన పరిధిలో లేని వాటిని వినియోగించే నైతిక సందిగ్ధతతో పాటు, IPTV సంభావ్య చట్టపరమైన పరిణామాలతో కూడిన అనేక ఇతర సమస్యలతో నిండి ఉంటుంది. YuppTV, Hotstar, Netflix, Amazon, Zee5, SonyLIV, SunNXT, Aha, Colors, ఇతరత్రా రిస్క్ ప్రూఫ్, ప్రీమియం టీవీ వీక్షణ అనుభవానికి హామీ ఇచ్చే చట్టపరమైన సేవలను మాత్రమే ఎంచుకోవడం దీనికి సాధ్యమైన సరైన మార్గం..

ఈ పైరసీ సమస్యను పరిష్కరించడానికి భారతదేశం ఉత్తమంగా కృషి చేస్తోంది.. ఇలాంటి సమయంలో ఇన్ఫోటైన్‌మెంట్ వినియోగదారులుగా మీరు చేయగలిగేవి చాలా ఉన్నాయి. స్టార్టర్స్ కోసం, IPTV మోసాలకు దూరంగా ఉండండి.. చట్టబద్ధమైన స్ట్రీమింగ్ సేవలకు మాత్రమే కట్టుబడి ఉండండి..

అసలు స్కామ్ ఎలా జరుగుతుందంటే..

పైరేటెడ్ కంటెంట్ ప్రపంచంలోకి ఆకర్షించడం చాలా సులభం.. కానీ వాస్తవికత ప్రమాదకరం కాదు. ఇంటర్నెట్‌లోని తాజా స్కామ్‌లో IPTV బాక్స్‌లు, యాప్‌లు, వెబ్‌సైట్‌ల ద్వారా OTT ప్లాట్‌ఫారమ్‌లు, ప్రముఖ టీవీ ఛానెల్‌ల నుండి ప్రీమియం కంటెంట్‌ను అందించే అక్రమ స్ట్రీమింగ్ సేవలు ఉన్నాయి. JadooTV, World Max TV, Maxx TV, Vois IPTV, పంజాబీ IPTV, Chitram TV, BOSS IPTV, Tashan IPTV, Real TV, Indian IPTV వంటి ఈ అక్రమ కేటుగాళ్ళు చౌకగా లేదా ఉచిత యాక్సెస్‌ను అధిక-నాణ్యత కంటెంట్‌తో అందిస్తామంటూ వీక్షకులను ఆకర్షిస్తున్నారు. ఇలా చట్టబద్ధమైన వినోదాన్ని అందించడానికి బదులుగా, వారు వినియోగదారులను మోసం, వెబ్‌లో ట్రాప్ లో పడేస్తారు.. తద్వారా వీక్షకులు అనేక ప్రమాదాలకు గురికావాల్సి ఉంటుంది.

ప్రమాదాలు

మీరు మీ నెలవారీ వినోద బిల్లులో కొన్ని రూపాయలను ఆదా చేయవచ్చు.. కానీ, IPTV పైరసీ చాలా నష్టాన్ని కలిగిస్తుంది.. ఇది మోసాలతో పాటు భద్రతా పరమైన ప్రమాదాల బారిన పడేలా చేస్తుంది..

చట్టపరమైన పరిణామాలు..

పైరేటెడ్ కంటెంట్ చూడటం అనైతికం కాదు-ఇది చట్టవిరుద్ధం.. భారతదేశం, అమెరికా, బ్రిటన్, ఐరోపా అంతటా అనేక దేశాల్లో, IPTV పైరసీలో పాల్గొనడం తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారి తీస్తుంది. పైరేటెడ్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ లేదా డౌన్‌లోడ్ చేయడం ద్వారా పట్టుబడిన వినియోగదారులు భారీ జరిమానాలు, వ్యాజ్యాలు, నేరారోపణలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదాహరణకు, UK ఇప్పటికే పైరేటెడ్ కంటెంట్‌ను యాక్సెస్ చేసినందుకు అనేక మంది వ్యక్తులను ప్రాసిక్యూట్ చేసింది.. ఇది నేరం తీవ్రతను హైలైట్ చేసింది.

భద్రతా ప్రమాదాలు..

చట్టవిరుద్ధమైన స్ట్రీమింగ్ సేవలను ఉపయోగించడం అత్యంత ముఖ్యమైన ప్రమాదాలలో ఒకటి భద్రతా ప్రమాదం. ఈ ప్లాట్‌ఫారమ్‌లు తరచుగా చట్టబద్ధమైన సేవల్లో కనిపించే బలమైన భద్రతా చర్యలను కలిగి ఉండవు. దీని వలన వినియోగదారులు మాల్వేర్, వైరస్‌లు, డేటా ఉల్లంఘనలకు గురవుతారు. మీ పేరు, ఇమెయిల్ చిరునామా, క్రెడిట్ కార్డ్ వివరాల వంటి వ్యక్తిగత సమాచారం దొంగిలించబడవచ్చు.. దుర్వినియోగం చేయబడవచ్చు.. ఇది గుర్తింపు దొంగతనం.. ఆర్థిక మోసానికి దారి తీస్తుంది.

కంటెంట్ సృష్టికర్తలకు ఆదాయ నష్టం..

మీరు పైరేటెడ్ కంటెంట్‌ను ప్రసారం చేసిన ప్రతిసారీ, కంటెంట్ సృష్టికర్తలు, ప్రసారకులు, చట్టబద్ధమైన స్ట్రీమింగ్ సేవలు ఆదాయాన్ని కోల్పోతాయి. ఈ నష్టం వీక్షకులకు అందుబాటులో ఉన్న కంటెంట్ నాణ్యత, వైవిధ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. సృష్టికర్తలకు సరైన పరిహారం అందనప్పుడు, వారు అధిక-నాణ్యత ప్రదర్శనలు, చలనచిత్రాలను రూపొందించడానికి కష్టపడవచ్చు. ఇది అందరికీ అందుబాటులో ఉండే వినోద ఎంపికలలో క్షీణతకు దారి తీస్తుంది.

IPTV పైరసీకి వ్యతిరేకంగా భారత్ పోరాటం..

IPTV పైరసీని ఎదుర్కోవడానికి భారతదేశం గణనీయమైన చర్యలు తీసుకుంది. సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) కాపీరైట్ ఉల్లంఘన ఫిర్యాదులను నిర్వహించడానికి నోడల్ అధికారులను నియమించింది. పైరసీ వెబ్‌సైట్‌లకు ప్రాప్యతను నిలిపివేయడానికి ఇది పని చేస్తుంది. నవంబర్ 2023లో, ఢిల్లీ హైకోర్టు 45 పోకిరీ పైరేట్ వెబ్‌సైట్‌లపై నిషేధం జారీ చేసింది. ఈ సైట్‌లను బ్లాక్ చేయమని, చట్టవిరుద్ధమైన కంటెంట్ వ్యాప్తిని అరికట్టడానికి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది.

ఈ పైరసీ వెబ్‌సైట్ల డొమైన్‌లను బ్లాక్ చేయాలని డొమైన్ నేమ్ రిజిస్ట్రార్‌లకు ఆదేశాలు జారీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా సింగ్ ఈ పోరాటంలో ముందంజలో నిలించారు. ఈ డొమైన్‌లతో అనుబంధించబడిన KYC, క్రెడిట్ కార్డ్, మొబైల్ నంబర్‌లను డిమాండ్ చేయడం, రాడార్‌లో పైరేట్‌లు పనిచేయడం కష్టతరం చేయడం ఇందులో ఉంది. భారత ప్రభుత్వం, న్యాయవ్యవస్థ సంయుక్త ప్రయత్నాల వల్ల IPTV పైరేట్స్ దేశంలో తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగించడం కష్టతరంగా మారింది.

IPTV పైరసీ ఎలా పనిచేస్తుంది

IPTV పైరసీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం వల్ల.. దాని వల్ల కలిగే నష్టాలపై మనకు అవగాహన కలుగుతుంది. IPTV పైరసీ అనేది ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) నెట్‌వర్క్‌ల ద్వారా టెలివిజన్ కంటెంట్, అనధికారిక పంపిణీ-ప్రసారాన్ని కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా ఎలా పని చేస్తుందో తెలుసుకోండి..

IPTV సర్వర్‌ల ఉపయోగం: ఈ సర్వర్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ప్రత్యక్ష ప్రసార టీవీ ఛానెల్‌లు, చలనచిత్రాలు, షోలను ప్రసారం చేయడం, అనుమతి లేకుండా కాపీరైట్ చేయబడిన కంటెంట్‌ను హోస్ట్ చేస్తాయి.. పంపిణీ చేస్తాయి.

సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లు: అనేక IPTV పైరసీ కార్యకలాపాలు సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తాయి. చట్టపరమైన సేవల కంటే చాలా తక్కువ ధరలకు పైరేటెడ్ కంటెంట్ విస్తారమైన లైబ్రరీకి యాక్సెస్‌ను అందిస్తాయి.

పైరేటెడ్ IPTV బాక్స్‌లు – యాప్‌లు: ఇవి వినియోగదారులను పైరేట్ సర్వర్‌లకు కనెక్ట్ చేసే సవరించిన పరికరాలు లేదా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లు, తరచుగా చట్టబద్ధమైన IPTV సేవల వినియోగదారు అనుభవాన్ని అనుకరిస్తాయి.

ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లు: చట్టపరమైన ప్రసార ఛానెల్‌లను దాటవేస్తూ ప్రత్యక్ష TV ఛానెల్‌లు – ఆన్-డిమాండ్ కంటెంట్‌కు లింక్‌లను హోస్ట్ చేసే వెబ్‌సైట్‌ల ద్వారా కొంత పైరసీ జరుగుతుంది.

పీర్-టు-పీర్ షేరింగ్: కొన్ని సందర్భాల్లో, IPTV పైరసీ అనేది పీర్-టు-పీర్ నెట్‌వర్క్‌లను కలిగి ఉంటుంది. ఇక్కడ వినియోగదారులు నేరుగా కంటెంట్‌ను పంచుకుంటారు.. ఇది చట్ట అమలు ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తుంది.

ప్రధాన చట్టవిరుద్ధ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు – వాటి ప్రమాదాలు – చట్టపరమైన శిక్షలు

చట్టవిరుద్ధ సేవ  ప్రమాదాలు చట్టపరమైన పరిణామాలు
Fmovies మాల్వేర్, డేటా థెఫ్ట్, ఫండింగ్ క్రిమినల్ యాక్టివిటీస్ ప్రాసిక్యూషన్, భారీ జరిమానాలు
Guru IPTV గుర్తింపు దొంగతనం, ఫిషింగ్ జైలు శిక్ష, చట్టపరమైన చర్యలు
Chitram TV అనుచితమైన కంటెంట్‌కు గురికావడం, హ్యాకింగ్ చేయడం జరిమానాలు, జైలు శిక్ష
BOSS IPTV డేటా ఉల్లంఘన, Ransomware గణనీయమైన ఆర్థిక జరిమానాలు
JadooTV డార్క్ వెబ్ కార్యకలాపాలలో పాల్గొనడం నేరారోపణలు

వినియోగదారులకు ఏ చట్టపరమైన ఎంపికలు ఉన్నాయి?

IPTV పైరసీతో సంబంధం లేకుండా వినోదాన్ని ఆస్వాదించాలని చూస్తున్న వినియోగదారులకు చట్టపరమైన ఎంపికలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. YuppTV, Netflix, Amazon Prime, Hotstar, Zee5, SunNXT వంటి ప్లాట్‌ఫారమ్‌లు టీవీ షోల నుండి సినిమాల వరకు అనేక రకాల కంటెంట్‌ను అందిస్తాయి. ఇవన్నీ చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లో ఉన్నాయి. ఈ చట్టబద్ధమైన సేవలకు సభ్యత్వం పొందడం ద్వారా వీక్షకులు మాల్వేర్ లేదా చట్టపరమైన పరిణామాలకు గురికావడం వంటి చట్టవిరుద్ధ స్ట్రీమింగ్ ప్రమాదాలను నివారించవచ్చు.

అంతేకాకుండా, ఈ చట్టపరమైన ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం కంటెంట్ సృష్టికర్తలకు, వినోద పరిశ్రమకు మద్దతు ఇస్తుంది. అధిక-నాణ్యత కంటెంట్ ఉత్పత్తిని కొనసాగించడాన్ని నిర్ధారిస్తుంది. ఇది సురక్షితమైన, మరింత నైతిక ఎంపిక, ఇది కస్టమర్ సేవ, తల్లిదండ్రుల నియంత్రణలు, విశ్వసనీయ స్ట్రీమింగ్ నాణ్యత అదనపు ప్రయోజనాలతో కూడా వస్తుంది. ఈ విషయాలను గమనించి IPTV స్కామ్‌లకు నో చెప్పండి.. అసలైన ఎంటర్టైన్‌మెంట్‌తో ఎంజాయ్ చేయండి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 2 weeks later...

OTT Movies: Plane Hijack Movies - విమానాల హైజాక్.. ఓటీటీల్లోని ఈ సూపర్ హిట్ సినిమాలను అసలు మిస్ కావొద్దు

ప్రస్తుతం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతోన్న 'IC 814 కాందహార్ హైజాక్' వెబ్ సిరీస్ వివాదాస్పదం అవుతోంది. 199లో జరిగిన IC 814 కాందహార్ ఫ్లైట్ హైజాక్ స్టోరీ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. దీనికి ముందు కూడా విమానాల హైజాక్ కు సంబంధించి పలు సినిమాలు, సిరీస్ లు తెరకెక్కాయి.

 
OTT Movies: విమానాల హైజాక్.. ఓటీటీల్లోని ఈ సూపర్ హిట్ సినిమాలను అసలు మిస్ కావొద్దు
Flight Hijack Based Movies

విమానాల హైజాక్‌కి సంబంధించి సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే వచ్చాయి. ఇందులో ఎక్కువ భాగం యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించినవే. ప్రస్తుతం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘IC 814 కాందహార్ హైజాక్’ వెబ్ సిరీస్ వివాదాస్పదం అవుతోంది. 199లో జరిగిన IC 814 కాందహార్ ఫ్లైట్ హైజాక్ స్టోరీ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. దీనికి ముందు కూడా విమానాల హైజాక్ కు సంబంధించి పలు సినిమాలు, సిరీస్ లు తెరకెక్కాయి. అవన్నీ ప్రస్తుతం వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

IC814: ‘IC 814 కాందహార్ హైజాక్’

1999 లో జరిగిన కాందహార్ హైజాక్ సంఘటనను ఆధారంగా చేసుకుని అనుభవ్ సిన్హా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు.అయితే తీవ్రవాదులకు హిందూ పేర్లను పెట్టడంతో ఈ సిరీస్ కాంట్రవర్సీ అయ్యింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ చూడొచ్చు.

Bell Bottom: ‘బెల్ బాటమ్

అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ చిత్రం కూడా యదార్థ సంఘటనల ఆధారంగానే రూపొందింది. . 1980లో విమానం హైజాక్‌కు సంబంధించిన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, లారా దత్తా, వాణి కపూర్, జైన్ ఖాన్ దురానీ, మోమితా మోయిత్రా ప్రధాన పాత్రలు పోషించారు. మీరు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో చూడవచ్చు.

Neerja: నీర్జా

సోనమ్ కపూర్ నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా. నీర్జా. ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ హోస్టెస్ నీర్జా భానోత్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. 1986లో, కరాచీ నుండి పాన్ యామ్ ఫ్లైట్ 73లో 359 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ఆమె తన ప్రాణాలను అర్పించారు. ఈ చిత్రంలో సోనమ్ కపూర్, షబానా అజ్మీ, యోగేంద్ర టికె, శేఖర్ రవిజాని నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడవచ్చు.

Hijack: ‘హైజాక్’

2008లో విడుదలైన ‘హైజాక్’ చిత్రంలో షైనీ అహుజా, ఈషా డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కృనాల్ శివదాసాని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814 హైజాక్ ఆధారంగా రూపొందించబడింది. దుబాయ్‌లో ఓ విమానాన్ని కొందరు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. మీరు ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

వీటితో పాటు అక్కినేని నాగర్జున నటించిన గగనం, విద్యుత్ జమ్వాల్ ఐబీ 71, యామీ గౌతమ్ చోర్ నిఖలే కా భాగా, సిద్ధార్థ్ మల్హోత్రా యోధా, అజయ్ దేవ్ గణ్, అభిషేక్ బచ్చన్ ల జమీన్ సినిమాలు కూడా విమానాల హైజాక్ కు సంబంధించిన కథలతోనే తెరకెక్కినవే.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...