Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 2

Vastu Tips


TELUGU

Question

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి, ఈ దిక్కులో నిద్రపోతే అదృష్టం తలుపుతట్టడం ఖాయం

వాస్తు శాస్త్రం అనేది భారతదేశంలో ఒక పురాతన అధ్యయన విభాగం , రోజురోజుకు గుర్తింపు పొందుతూనే ఉంది. ఇది నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సిస్టమ్. దీన్ని సరిగ్గా అప్లై చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది.

FotoJet-2022-06-07T232424.917-784x441.jp

మంచం ఏ దిశలో ఉండాలి...

వాస్తు ప్రకారం, మంచం తలుపుకు అభిముఖంగా ఉంచకూడదు. మంచి నిద్ర పొందడానికి మీరు మీ తలని దక్షిణ లేదా తూర్పు దిశలో ఉంచి పడుకోవాలి. మీ మంచం అంచు వాలుగా లేకుండా చూసుకోండి. మంచం ఉత్తరం వైపు ఉంచవద్దు. దీని కారణంగా, వాతావరణం , ఉద్రిక్తత , ఒత్తిడి జోడించబడతాయి.

వార్డ్‌రోబ్ , అల్మెరా

అల్మెరా , కప్ బోర్డ్ వంటి భారీ వస్తువులు పడకగదికి దక్షిణం, నైరుతి లేదా పడమర దిశలో ఉండేలా చూసుకోండి. మీరు ఇంట్లో సురక్షితంగా ఉండాలనుకుంటే, దక్షిణ దిశను సురక్షితంగా ఉంచండి. , అది ఉత్తరాన తెరిచి ఉండనివ్వండి. వాస్తు ప్రకారం, పడకగదిని అత్యంత విశ్రాంతి ప్రదేశంగా ఉంచడం చాలా ముఖ్యం. కాబట్టి, వార్డ్‌రోబ్ డోర్‌పై అద్దాన్ని ఇన్‌స్టాల్ చేయకుండా ఉండండి. దీంతో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

అద్దం అమర్చడంలో శ్రద్ధ వహించండి.  అద్దాలు మీలో ఉన్న శక్తిని ప్రతిబింబిస్తాయి. మీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దం మంచానికి ఆనుకుని ఉండవచ్చు. కానీ, అందులోని అద్దం నేలకు తగలకుండా చూసుకోవాలి. అద్దం నేల నుండి ఐదు అడుగుల ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. అలాగే రెండు అద్దాలను ఒకదానికొకటి ఎదురుగా అమర్చవద్దు. దీని కారణంగా, ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది.

పడకగదిలో గాడ్జెట్‌లు లేదా టీవీ, టీవీ , మొబైల్‌ను అనుమతించకూడదు. ఇది నిద్రకు హాని చేస్తుంది. అవి మొత్తం శక్తిని ప్రభావితం చేస్తాయి. మీ గదిలో ఇప్పటికే ఏదైనా గాడ్జెట్ ఉన్నట్లయితే, దానిని ఆగ్నేయ దిశలో ఉంచండి.

...

Complete article

NOTE: For information only. No scientific evidence.

Link to comment
Share on other sites

11 answers to this question

Recommended Posts

  • 0

Vastu Tips: Quarreling couple? దంపతుల మధ్య నిత్యం గొడవలా.? ఈ వాస్తు లోపాలను సరి చేసుకోండి

అయితే మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని వాస్తు లోపాలు జీవన విధానంపై ప్రభావం చూపుతాయని వాస్తు పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా పడకగదిలో ఉండే వాస్తు దోషాలు దంపతుల మధ్య గొడవలకు దారి తీస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

vastu-tips-1.jpg?w=1280

భారతీయులను, వాస్తును వేరు చేసి చూడలేని పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా హిందువులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. అందుకే కొత్తింటి నిర్మాణం మొదలు పెట్టగానే ముందుగా వాస్తు జ్యోతిష్యులను సంప్రదిస్తారు. అయితే కేవలం ఇంటి నిర్మాణానికే పరిమితం కాకుండా ఇంట్లో గదుల నిర్మాణం విషయంలో, వస్తువులు ఏర్పాటు చేసుకునే విధానంలో కూడా వాస్తు చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతుంటారు.

అయితే మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని వాస్తు లోపాలు జీవన విధానంపై ప్రభావం చూపుతాయని వాస్తు పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా పడకగదిలో ఉండే వాస్తు దోషాలు దంపతుల మధ్య గొడవలకు దారి తీస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్‌ రూమ్‌లో బెడ్‌ను కచ్చితంగా నైరుతి గోడకు అనుకుని ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే నిద్రపోయే సమయంలో దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, తూర్పు లేదా పడమర దిశలకు తల పెట్టుకొని పడుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక ఇంట్లో బెడ్ రూమ్‌ ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్య మూలలో ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. కేవలం పూజ గదికి మాత్రమే కేటాయించిన ఈశాన్యంలో బెడ్ రూమ్‌ ఉంటే దంపతుల మధ్య విభేదాలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

* బెడ్‌ రూమ్‌లో వీలైనంత వరకు లైట్ కలర్స్‌ వేసుకోవాలి. లైట్ పింక్‌, లైట్‌ బ్లూ వంటి కలర్స్‌ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.

* ఇక బెడ్‌ రూమ్‌లో మంచి సువాసన వచ్చే పర్‌ఫ్యూమ్‌ను ఉపయోగించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో ఆక్సిటోసిన్‌ హార్మోన్లు విడుదలవుతాయి.

* బెడ్‌ రూమ్‌ కచ్చితంగా నైరుతి లేదా ఆగ్రేయంలో మాత్రమే ఉండాలి. ఈ దిశలో ఉంటేనే దపంతుల మధ్య బంధం బలోపేతమవుతుంది.

* ఇక బెడ్‌ రూమ్‌లో ఏర్పాటు చేసుకునే ఫొటోల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. పూలు, మొక్కలు, చిన్న పిల్లలు వంటి ఫొటోలను ఏర్పాటు చేసుకోవాలి.

Link to comment
Share on other sites

  • 0

Vastu tips: కొత్తింటిని కడుతున్నారా.? ముందు ఈ బేసిక్‌ విషయాలు తెలుసుకోండి

ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు చెబుతుంటారు. జీవితంలో ఇంటికి ఎంతటి ప్రాధాన్యత ఉందో చెప్పేందుకు ఈ సామెత ఉదాహరణగా చెప్పొచ్చు. ఎవరి స్థోమతకు తగ్గట్లు, ఎవరి అభిరుచులకు తగ్గట్లు వారు ఇంటి నిర్మాణం చేపడుతుంటారు. అయితే ఇంటి నిర్మాణం చేపట్టే వారు కచ్చితంగా కొన్ని బేసిక్‌ వాస్తు విషయాలు తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు...

vastu-tips-12.jpg?w=1280

ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు చెబుతుంటారు. జీవితంలో ఇంటికి ఎంతటి ప్రాధాన్యత ఉందో చెప్పేందుకు ఈ సామెత ఉదాహరణగా చెప్పొచ్చు. ఎవరి స్థోమతకు తగ్గట్లు, ఎవరి అభిరుచులకు తగ్గట్లు వారు ఇంటి నిర్మాణం చేపడుతుంటారు. అయితే ఇంటి నిర్మాణం చేపట్టే వారు కచ్చితంగా కొన్ని బేసిక్‌ వాస్తు విషయాలు తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంటి నిర్మాణం కోసం చూసే స్థలం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థలం ఎప్పుడైనా పక్కాగా చతురస్రాకారంలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉంటేనే ఇంటి నిర్మాణం వాస్తుకు అనుగుణంగా ఉంటుంది.

* ఇక మీ స్థలానికి ఎదురుగా వీధి పోటు ఉందో చూసుకోవాలి. అంటే ప్లాట్‌కి ఎదురుగా రోడ్డు ఉంటే వీధి పోటుగా చెబుతుంటారు. వీధి పోటు అనగానే చెడు అని భావిస్తారు కానీ కొంత మంచి కూడా ఉంది. ముఖ్యంగా ఈశాన్యానికి, తూర్పు వీధిపోటు మంచివిగా చెబుతుంటారు. అయితే ఆగ్నేయానికి దక్షిణం, వాయువ్యానికి పశ్చిమంగా ఉండే వీధిపోట్లు ఓ మోస్తరు మంచివని చెబుతుంటారు.

* ఇంటి నిర్మాణంలో కీలకమైన బోర్‌ విషయంలో కూడా వాస్తు పాటించాలి. ఇంట్లో బోర్‌ కచ్చితంగా ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలి. ఇంటిపైన ట్యాంక్‌ నైరుతి దిశలో ఉండాలి.

* ఇంట్లో హాల్‌ తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య ముఖంగా ఉండాలే చూసుకోవాలి. లివింగ్ రూమ్‌లో పశ్చిమ లేదా నైరుతి దిశలో బరువైన ఫర్నిచర్‌ను ఉంచాలి.

* బెడ్‌రూమ్‌ నైరుతి దిశలో ఉండడం శ్రేయస్కరంగా నిపుణులు చెబుతుంటారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో బెడ్ రూమ్‌లో ఉండే అద్దంలో మంచం పడకుండా చూసుకోవాలి.

* వంటగది ఇంటికి ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వంటగదిలో గోడలకు పసుపు, గులాబీ, నారింజ, రెడ్ కలర్‌ వంటివి వేసుకోవాలి.

* పిల్లల గదిని ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవడం బెటర్‌. దీనివల్ల వారికి తెలివితేటలు పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.

* ఇక పూజ గది కచ్చితంగా తూర్పు లేదా ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలి. పూజ గదిలో తెలుపు, లేత గోధుమరంగు, లేత పసుపు లేదా ఆకుపచ్చ రంగులు వేస్తే మంచిది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

Link to comment
Share on other sites

  • 0

Vastu Tips: ఇంట్లో ప్రశాంతత కరువైందా.? ఓసారి ఇవి చెక్‌ చేసుకోండి..

భారతీయులను, వాస్తును వేరుగా చూడలేని పరిస్థితి. చాలా మంది వాస్తును కచ్చితంగా పాటిస్తారు. స్థలం కొనుగోలు నుంచి మొదలు ఇంటి నిర్మాణం వరకు ప్రతీది కచ్చితంగా వాస్తుకు అనుగుణంగా ఉండాలని భావిస్తుంటారు. అందుకోసం వాస్తు పండితుల సూచనలు పాటిస్తుంటారు. ఇక వాస్తు అనేది కేవలం ఇంట్లో ఉండే వారి శారీరక ఆరోగ్యంపై మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ఇంట్లో ఉండే కొన్ని వాస్తు దోషాల కారణంగా మానసిక ప్రశాంతత లభించదని చెబుతున్నారు. ఇంతకీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆ వాస్తు లోపాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

vastu-for-stress-free-life.jpg?w=1280

  • ఇంటికి తూర్పు దిశ ఎంతో ముఖ్యమైంది. ముఖ్యంగా ప్రధాన ద్వారంగా ఉపయోగించే తూర్పు దిశలో చెత్తాచెదరం లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
     
  • ఇంట్లో తూర్పు దిశలో ఎట్టి పరిస్థితుల్లో బరువైన వస్తువులను పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
     
  • అలాగే తూర్పు దిశలో ఇంటికంటే ఎత్తు ఎక్కువగా ఉన్న చెట్టను పెంచకూడదని వాస్తు పండితలు చెబుతున్నారు. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
     
  • ఇంటికి ఈశాన్యం దిశ ఖాళీగా ఉండాలి, ఈ దిశలో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. అలాగే ఇంటి స్థలం మొత్తంతో పోల్చితే ఈశాన్యం దిశలో ఎక్కువ స్థలం ఉండేలా చూసుకోవాలి.
     
  • ఇంటి ఆగ్నేయ దిశ ఇతర దిశలతో పోల్చితే ఎత్తుగా ఉండకూడదు. ఇలా ఉంటే ఇంట్లో ఉండేవారికి అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
     
  • ఇంట్లో వంటగది ఎట్టి పరిస్థితుల్లో నైరుతి దిశలో ఉండకూడదు. వంటగది ఆగ్నేయ దిశలో ఉండడమే కరెక్ట్‌.
     
  • బోర్‌ ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ దిశలో ఉండకూడదు. ఇలా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. బోర్‌ ఈశాన్యం దిశలోనే ఉండాలి.
     
  • అలాగే ఇంటి ప్రధాన ద్వారం నైరుతి దిశలో ఉండడం వల్ల ఇంట్లో ఉండేవారికి మానసిక సమస్యలు తప్పవని చెబుతున్నారు.
     
  • అన్నింటికంటే ముఖ్యంగా ఇంటిలోపలికి గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చేలా వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

NOTE: For information only. No scientific evidence.

Link to comment
Share on other sites

  • 0

Car Vastu: కారు విషయంలో కూడా వాస్తు పాటించాలా.? నిపుణులు ఏమంటున్నారంటే

ఇంటి విషయంలో ఏలా అయితే వాస్తును పాటిస్తామే కారు విషయంలో కూడా పాటించాలని పండితులు చెబుతున్నారు. కారులో ఉండే వస్తువుల వల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల కారు పదేపదే పాడవ్వడం లేదా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని వాస్తు పండితులు విశ్వాసం. అందుకే నెగిటివ్‌ ఎనర్జీని దూరం చేయడానికి...

car-vastu.jpg?w=1280

వాస్తు అనగానే మనం కేవలం ఇంటికి మాత్రమే సంబంధించినదిగా భావిస్తాం. అయితే కారు విషయంలో కూడా వాస్తు వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త కారు కొనుగోలు చేసే సమయంలో పాటించాల్సిన వాస్తు నియమాలను తర్వాత కూడా పాటించాలని చెబుతున్నారు. ఇంతకీ కారు విషయంలో పాటించాల్సిన ఆ వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటి విషయంలో ఏలా అయితే వాస్తును పాటిస్తామే కారు విషయంలో కూడా పాటించాలని పండితులు చెబుతున్నారు. కారులో ఉండే వస్తువుల వల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల కారు పదేపదే పాడవ్వడం లేదా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని వాస్తు పండితులు విశ్వాసం. అందుకే నెగిటివ్‌ ఎనర్జీని దూరం చేయడానికి పాటించాల్సిన వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • వాస్తు ప్రకారం కారులో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవాలని చెబుతున్నారు. కారులో వినాయకుడి విగ్రహం ఉండడం వల్ల నెగిటివ్‌ ఎనర్జీ దూరమవుతుందని చెబుతున్నారు. ఏదైనా నెగిటివ్‌ ఎనర్జీ ఉంటే దూరమవుతుందని విశ్వసిస్తారు.
     
  • ఇక కారులో నెగిటివ్‌ ఎనర్జీ తొలగిపోవాలంటే నల్ల తాబేలు పెట్టుకోవాలి. దీనిని శుభప్రదంగా భావిస్తారు. వాస్తు శాస్త్రంలో నల్ల తాబేలుకు ప్రత్యకత ఉంటుంది. అందుకే కారులో నల్ల తాబేలు కచ్చితంగా ఉండాలని చెబుతున్నారు.
     
  • కారులో నిత్యం నీరు ఉండేలా చూసుకోవాలి. ఇది నెగిటివ్‌ ఎనర్జీని దూరం చేయడంలో సహాయపడుతుంది. అలాగే కారు సీటు కింద రాతి ఉప్పు పెట్టడం ద్వారా కూడా నెగిటివ్‌ ఎనర్జీ దూరమవుతుంది.
     
  • కారులో నెగిటివ్ ఎనర్జీ దూరమవ్వాలంటే నెమలి ఈకలను పెట్టుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించవచ్చు.
     
  • కారులో క్రిస్టల్ స్టోన్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కారులో నెగిటివ్‌ ఎనర్జీ పెరగకుండా అడ్డుకట్ట వేయడంలో ఉపయోగపడుతుంది.
     
  • గోల్డ్‌ కలర్‌లో ఉండే చైనీస్‌ నాణేలను కారులో ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని వాస్తు పండితులు అంటున్నారు.
     
  • ఇక కారులో ఎట్టి పరిస్థితుల్లో విరిగిన, పగిలిన వస్తువులు ఉండకుండా చూసుకోవాలి. కారు అద్దాలు క్రాక్ వచ్చినా, కొంచెం పగిలినా వెంటనే మార్చేయాలి.

NOTE: For information only. No scientific evidence.

Link to comment
Share on other sites

  • 0

Benefits of Peacock feathers: నెమలి ఈక ప్రతికూలత నుంచి ఆర్థిక సంక్షోభం వరకు ప్రతిదీ తొలగించగలదు..

అనేక జంతువులు, పక్షులను హిందూ మతంలో పవిత్రమైనవిగా పుజ్యనీయమైనవిగా భావిస్తారు. అంతేకాదు హిందూ దేవతలు, దేవుళ్ల వాహనాలుగా అనేక జంతువులు, పక్షులు ఉన్నాయి. తత్ఫలితంగా సాంప్రదాయ హిందూ మతంలో దేవతలు, దేవతలతో పాటు జంతువులు, పక్షులను పూజించే సంప్రదాయం ఉంది. అందులో నెమలి ఒకటి. ఈ అందమైన పక్షి జాతీయ పక్షి. గణేశుడు, శ్రీ కృష్ణుడు, కార్తీకేయుడు సహా అనేక ఇతర దేవుళ్లతో ముడిపడి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.

Peacock Feather Tips

peacock-feather-tips.jpg?w=1280

భారత ప్రభుత్వ ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏదైనా జంతువును చంపడం శిక్షార్హమైన నేరం. కనుక మతపరమైన కారణాలతో లేదా విలాసం కోసం జంతువులను చంపడం క్షమించరాని నేరం. భారత శిక్షాస్మృతి ప్రకారం జాతీయ పక్షి మొదలు దేశంలోని జాతీయ జంతువును చంపితే కఠిన శిక్ష విధిస్తారు. హిందూమతంలో అనేక జంతువులను, పక్షులను శుభ శకునాలుగా పరిగణిస్తారు. అంతేకాదు హిందూ దేవుళ్లకు వాహనాలుగా అనేక జంతువులు, పక్షులు ఉన్నాయి. తత్ఫలితంగా సాంప్రదాయ హిందూ మతంలో దేవతలు, దేవుళ్లతో పాటు జంతువులు, పక్షులను పూజించే సంప్రదాయం ఉంది. అందులో నెమలి ఒకటి. ఈ అందమైన పక్షి జాతీయ పక్షి. గణేశుడు, శ్రీ కృష్ణుడు, కార్తీకేయుడు సహా అనేక ఇతర దేవుళ్లతో ముడిపడి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. నెమలి ఈకలు ఇంటి అలంకరణలో చాలా ప్రసిద్ధ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం ఇంటిని అలంకరించడానికి నెమలి ఈకలను ఉపయోగిస్తే అది చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజు వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకను ఇంట్లో ఏ దిశలో పెట్టుకోవడం వలన శుభఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం..

ప్రతికూలతను తొలగించడానికి: ఇంట్లో ఏదైనా ప్రతికూల శక్తి ఉందని మీరు భావిస్తే.. నెమలి ఈకలు బెస్ట్ రెమిడీ. రోజూ ఇంట్లో తగాదాలు, అలజడి, కుటుంబ సమస్యలు ఉంటే నెమలి ఈక అనేక ప్రయోజనాలను ఇస్తుంది. నెమలి ఈకలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ త్వరగా పాజిటివ్‌గా మారుతుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు గణేశ విగ్రహం పక్కన నెమలి ఈకను ఉంచడం శుభప్రదంగా వాస్తు శాస్త్రం పేర్కొంది.

ఆర్థిక సంక్షోభం: కొన్నిసార్లు ఎంత కష్టపడి పని చేసినా తగిన ఫలితం ఉండదు. రాత్రి పగలు కష్టపడి పనిచేసినా ఆర్ధిక కష్టాలతో ఇబ్బంది పడతారు. రావాల్సిన మొత్తం చేతికి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఎవరికైనా జరిగితే అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి, ఇంట్లో, పనిలో చేసే ప్రాంతంలో నెమలి ఈకను ఉంచండి. ఇలా చేయడం వలన అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం.

దిష్టి దోషం: ఎవరైనా నరదృష్టి , దిష్టి దోషంతో బాధపడుతుంటే జీవితంలో కష్టాలు నష్టాలతో ఇబ్బంది పడుతుంటే ఇంట్లో నెమలి ఈకను అందరికీ కనిపించే చోట ఉంచండి. ఇలా చేయడం వలన దిష్టి దోషం పోతుందని నమ్మకం.

చదువులో విజయం: పిల్లలు చదువు విషయంలో నెగ్లెక్ట్ గా ఉంటే.. అప్పుడు పిల్లలు చదువుకునే గదిలో లేదా చదివే చోట నెమలి ఈకలను పెట్టవచ్చు. ఇలా చేయడం వలన పిల్లలకి చదువు పట్ల శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుంది.

 

Link to comment
Share on other sites

  • 0

Vastu Tips: ఈ వాస్తు దోషాలు.. మానసిక సమస్యలకు కారణాలు..

ఇల్లు వాస్తుకు అనుగుణంగా లేకపోతే ఇంట్లో ఉండే వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయాన్ని చాలా మంది విశ్వసిస్తారు. అందుకే ఇంటిని వాస్తుకు అనుగుణంగా నిర్మిస్తుంటారు. అయితే వాస్తు లోపాలు ఉంటే కేవలం శారీరక ఆరోగ్యంపై మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని...

Vastu Tips

vastu-tips-8.jpg?w=1280

ఇల్లు వాస్తుకు అనుగుణంగా లేకపోతే ఇంట్లో ఉండే వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయాన్ని చాలా మంది విశ్వసిస్తారు. అందుకే ఇంటిని వాస్తుకు అనుగుణంగా నిర్మిస్తుంటారు. అయితే వాస్తు లోపాలు ఉంటే కేవలం శారీరక ఆరోగ్యంపై మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉండే కొన్ని వాస్తు దోషాలు మానసిక సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ దోషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

* వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉంటే మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఇది నెగిటివ్‌ ఎనర్జీ పెరగడానికి కారణమవుతుందని అంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలకు దారి తీస్తుంది. కాబట్టి విరిగిన వస్తువులు ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి.

* ఇంట్లో ఆగిపోయిన గడియారం కూడా ఉండకూదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆర్థికంగానే కాకుండా ఇతర పనులు కూడా ముందుకు సాగవు. ఫలితం మానసిక అశాంతి నెలకొంటుంది.

* ఇక ఇంట్లో పిల్లర్‌ కింద కూర్చొని పనిచేయకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇది తలనొప్పి, మానసిక అశాంతికి దారి తీస్తుందని అంటున్నారు.

* అలంకరణ కోసం ఉపయోగించే చిత్ర పటాల్లో భయంగొలిపేవి ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఉగ్ర రూపంలో ఉండే దేవతల ఫొటోలు, యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు ఉండకూదు. వీటి వల్ల కూడా మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది.

* ఇంటి పెద్ద ఎల్లప్పుడూ నైరుతి దిశలో పడుకోవాలి. పాదాలు పడమర దిశలో, ఉత్తరం వైపు తల ఉండకూడదని గుర్తుపెట్టుకోవాలి. తల ఆగ్నేయంలో ఉంటే మంచిది. నిద్రించేందుకు సరైన దిశను ఎంచుకోవాలి. లేదంటే మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో పగిలిన అద్దం ఉండకూడదు. ఇలాంటి అద్దంలో ముఖం చూసుకుంటే సమస్యలు వస్తాయి. అలాగే అద్దం దక్షిణం లేదా పడమర గోడకు అమర్చకూడదు.

* ఇంట్లో ఉండే ట్యాప్స్‌ నుంచి వాటర్‌ లీక్‌ కాకుండా చూసుకోవాలి. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడంతో పాటు మానసిక ప్రశాంతత సైతం దెబ్బతింటుంది.

Link to comment
Share on other sites

  • 0

Rose plants on which side of the house? ఇంట్లో గులాబీ మొక్కను ఏ దిశలో నాటాలి.. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే గులాబీతో ఈ పరిహారం చేసి చూడండి

మన జీవితంలో చెట్లు, మొక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వీటితో పాటు పువ్వులకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పువ్వులు మన ఇంటిలో సువాసన వెదజల్లడమే కాదు పాజిటివ్ ఎనర్జీని కూడా ఉత్పత్తి చేస్తాయి, దీని కారణంగా ఇంట్లో ఉన్నవారు ఒత్తిడి లేకుండా, సంతోషంగా ఉంటారు. పూజలో కూడా పువ్వులను ఉపయోగిస్తారు. అందువల్ల వాస్తు శాస్త్రంలో వీటికి భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. ప్రకృతిలో ఎన్నో రకాల పువ్వులు ఉన్నాయి. అయితే మన నిత్యం పూజలో ఉపయోగించేవి మాత్రం కొన్ని రకాల పువ్వులే.. వీటన్నింటిలో గులాబీ పువ్వుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

rose-flowres3.jpg

వాస్తు శాస్త్రంలో గులాబీ పువ్వుని ప్రేమకు చిహ్నంగా అభివర్ణించారు. అయితే జ్యోతిషశాస్త్రంలో ఈ గులాబీ పువ్వు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంది. ఇంట్లోకి గులాబీలు తీసుకురావడం వల్ల అందం రావడమే కాదు ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందని చెబుతారు. అంతేకాదు ఎవరికైనా ఏదైనా ప్రేమ సంబంధిత సమస్యలు ఉంటే, ఇంట్లో గులాబీలను తీసుకురావడం ద్వారా పరిష్కరించవచ్చని అంటారు.

ఇంట్లో ఏ దిశలో గులాబీ మొక్కను నాటాలంటే ఇంట్లో గులాబీ మొక్కను పెంచుకోవాలంటే కూడా కొన్ని వాస్తు నియమాలున్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి నైరుతి దిశలో గులాబీ మొక్కలను నాటాలి. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఎరుపు పువ్వులు నాటడానికి ఈ దిశ ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో గులాబి చెట్టును నాటడం వల్ల ఇంటి యజమానికి సామాజిక ప్రతిష్ట పెరుగుతుందని చెబుతారు. అంతేకాకుండా ఈ చెట్టు కుటుంబ సంబంధాలను బలంగా ఉంచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది. ఎరుపు రంగు గులాబీని శక్తివంతంగా భావిస్తారు. అయితే తెలుపు రంగు గులాబీలను శాంతికి సూచికగా పరిగణిస్తారు. అందువల్ల ఈ గులాబీ చెట్లను పెంచుకోవడం వలన ఇంట్లో శ్రేయస్సు ఉంటుందని నమ్మకం.

దీనితో పాటు ఎవరికైనా కుటుంబ జీవితంలో సమస్యలు ఉంటే.. ఆ వ్యక్తులు శుక్రవారం రోజున గులాబీ పువ్వులను ముఖ్యంగా ఎరుపు రంగు గులాబీ పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించాలని జ్యోతిషశాస్త్రంలో చెప్పబడింది. ఇలా చేయడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీ దేవి అనుగ్రహంతో అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.

ఆర్థిక సంక్షోభం నివారణ కోసం ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే.. గులాబీ పువ్వులతో చేసే పరిహారం బెస్ట్ రెమిడి. వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి సాయంత్రం హారతి సమయంలో గులాబీ పువ్వుపై కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దీనితో పాటు శుక్రవారం దుర్గాదేవికి 5 రకాల గులాబీ పువ్వులను సమర్పించండి. దీంతో వీలైనంత త్వరగా డబ్బు కొరత తీరుతుంది. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.

ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవి ఆలయానికి వెళ్లి ఎర్ర గులాబీలను సమర్పించాలని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఇలా చేయడం శుభప్రదం. ఇలా 11 శుక్రవారాలు నిరంతరం చేస్తే ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.

సంక్షోభాన్ని నివారించడానికి జీవితంలో కష్టాల నుంచి బయటపడడానికి హనుమంతుని ఆరాధన అత్యుత్తమం. హనుమంతుడి అనుగ్రహం ఉన్న వారు జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తాడు. అందుకే హనుమంతుడిని సంకట మోచనుడు అని పిలుస్తారు. ఇందుకోసం శనివారం రోజున హనుమంతుడికి సింధూరం, నువ్వుల నూనె, వేరు శనగలను సమర్పించండి. దీని తరువాత హనుమంతుడికి ఎర్ర గులాబీల దండను సమర్పించండి. లడ్డూలను నైవేద్యంగా సమర్పించండి. పూజ తరువాత ఈ ప్రసాదాన్ని ప్రజలకు పంచండి. ఇలా వరుసగా 7 శనివారాలు చేయండి. ఇలా చేయడం వలన అన్ని కష్టాలు తొలగిపోతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి.

ఉద్యోగం కోసం ఎవరైనా నిరుద్యోగంతో ఇబ్బంది పడుతుంటే ఉపాధి అవసరం అనుకుంటే ఆ వ్యక్తి ఉదయాన్నే పాదరక్షలు లేకుండా హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఎర్ర గులాబీని సమర్పించాలి. ఈ పరిహారాన్ని మంగళవారం నుంచి ప్రారంభించాలి. హనుమంతునికి వరుసగా 40 రోజులు గులాబీ పువ్వులు సమర్పిస్తే త్వరలో ఉద్యోగం పొందవచ్చు.

ఎక్కడ గులాబీల మొక్కలను నాటవద్దు అంటే ఇంటి ముందు గులాబీ మొక్కను నాటకూడదని అంటారు. ఈ కారణంగా ఇంట్లో వివాదాలు ప్రారంభమవుతాయి. దీని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య చిక్కులు తలెత్తుతాయి. కొన్నిసార్లు ఈ చిక్కులు అభిప్రాయ భేదాలుగా కూడా మారవచ్చు. ముళ్ల మొక్కను ఇంటి ముందు నాటితే జీవితంలో సమస్యలు పెరుగుతాయి. కనుక గులాబీ మొక్కను ఎప్పుడూ ఇంటి లోపల లేదా పెరట్లో పెంచుకోవాలి.

Link to comment
Share on other sites

  • 0

Bedroom Vastu tips: బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..

ఇంట్లో ప్రతీ గది వాస్తుకు అనుకూలంగా ఉండాలని పండితులు చెబుతుంటారు. అందుకే ఇంటి పునాది మొదలు, గోడలకు వేసుకునే రంగుల వరకు అన్నీ వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. ఇక ఇంట్లో వంట గదికి, పూజ గదికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో బెడ్ రూమ్‌కు కూడా ప్రాధాన్యత ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు...

Bedroom Vastu

bedroom-vastu.jpg?w=1280

ఇంట్లో ప్రతీ గది వాస్తుకు అనుకూలంగా ఉండాలని పండితులు చెబుతుంటారు. అందుకే ఇంటి పునాది మొదలు, గోడలకు వేసుకునే రంగుల వరకు అన్నీ వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. ఇక ఇంట్లో వంట గదికి, పూజ గదికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో బెడ్ రూమ్‌కు కూడా ప్రాధాన్యత ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంతోషం ఉండాలంటే కచ్చితంగా బెడ్ రూమ్‌ వాస్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ బెడ్‌ రూమ్‌ విషయంలో తీసుకోవాల్సిన ఆ వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • ఇంట్లో బెడ్ రూమ్‌ ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం దిశలో ఉండకూడదు. ఈశాన్యం అనేది దేవుళ్లకు కేటాయించింది. అందుకే ఈశాన్యంలో అయితే పూజా గది ఉండాలి లేదంటే ఖాళీ స్థలం ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు.
     
  • ఇక బెడ్ రూమ్‌ ఉండకూడని మరో దిశ ఆగ్నేయం. ఆగ్నేయంలో వంట గది ఉండాలి. ఆగ్నేయం అగ్ని దిశగా చెబుతుంటారు. ఈ దిశలో బెడ్ రూమ్‌ ఉంటే దంపతుల మధ్య గొడవలకు దారి తీస్తుంది. మానసిక అశాంతి ఉంటుంది.
     
  • ఇంట్లో బెడ్‌ రూమ్‌ను నైరుతిలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక పిల్లల బెడ్‌ రూమ్‌ వాయువ్య మూలలో ఉండొచ్చు. ఇంటి యజమాని కచ్చితంగా నైరుతి దిశలో పడుకోవం మంచిది.
     
  • అలాగే బెడ్ రూమ్‌లో ఉండే కిటికీలులు తూర్పు, ఉత్తరం గోడలకు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మానసిక సమస్యలు దరిచేరవు.
     
  • పడుకునేప్పుడు తల దక్షిణం వైపు, పాదాలు ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే స్టీల్‌కు బదులుగా వీలైనంత వరకు చెక్కతో చేసిన మంచాన్నే ఉపయోగించాలి.
     
  • ఇక బెడ్‌ రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో అద్దం ఉండకూడదు. మరీ ముఖ్యంగా అద్దంలో మంచం పడేలా ఉంటే దంపతుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.
     
  • అలాగే బెడ్‌ రూమ్‌లో ఉండే వాష్‌ రూమ్‌లో మంచం పడకుండా ఉండాలి. ముఖ్యంగా మంచంపై పడుకునే వారి కాళ్లు బాత్‌రూమ్‌లోకి పడకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు.
     
  • ఇక బెడ్‌రూమ్‌లో లాకర్‌ పెట్టుకునే వారు దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. దక్షిణం వైపు సంపాదలకు అధిపతి కుబేరుడు ఉంటాడు. ఆ దిశలో లాకర్ పెట్టుకుంటే మీ సంపద కూడా నిలుస్తుంది.
     
  • బెడ్‌ రూమ్‌లో గోడలకు వేసుకునే కలర్స్‌ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బెడ్ రూమ్‌ గోడలకు లైట్ కలర్స్‌ వేసుకోవాలి. దీనిల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

 

Link to comment
Share on other sites

  • 0

Clipping nails in the evenings: సాయంత్రం పూట గోర్లను కట్ చేయకూడదు ఎందుకో తెలుసా?

ఇంట్లో కొన్ని పనులను కొంత సమయం తర్వాత చేయకూడదని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. పూర్వం నుంచి కూడా వీటిని ఫాలో చేస్తూ వస్తున్నారు. ఇలా చాలా రకాల పనులు ఉంటాయి. వీటిల్లో గోర్లను కట్ చేయడం కూడా ఒకటి. గోర్లను మంగళ వారం, శుక్రవారం కట్ చేయవద్దని, అదే విధంగా సాయంత్రం కూడా తీయ కూడదని అంటారు. సూర్యాస్తమయం తర్వాత గోర్లను కట్ చేయకూడదనే ఆచారం ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారు. దీని వల్ల పలు సమస్యలు వస్తాయి అంటారు. మరి సూర్యాస్తమయం..

vastu-tips-4-2.webp

ఇంట్లో కొన్ని పనులను కొంత సమయం తర్వాత చేయకూడదని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. పూర్వం నుంచి కూడా వీటిని ఫాలో చేస్తూ వస్తున్నారు. ఇలా చాలా రకాల పనులు ఉంటాయి. వీటిల్లో గోర్లను కట్ చేయడం కూడా ఒకటి. గోర్లను మంగళ వారం, శుక్రవారం కట్ చేయవద్దని, అదే విధంగా సాయంత్రం కూడా తీయ కూడదని అంటారు.

సూర్యాస్తమయం తర్వాత గోర్లను కట్ చేయకూడదనే ఆచారం ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారు. దీని వల్ల పలు సమస్యలు వస్తాయి అంటారు. మరి సూర్యాస్తమయం తర్వాత ఎందుకు గోర్లను కట్ చేయకూడదు? దీని వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

సూర్యాస్తమయం తర్వాత గోర్లను కట్ చేయడం వల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయని నమ్ముతారు. అంతే కాదు జీవితంలో కూడా కష్టాలను ఎదుర్కుంటారని, ఆహారం విషయంలో అవస్థలు ఏర్పడతాయని అంటారు.

అలాగే సాయంత్రం పూట గోర్లను కట్ చేయడం వల్ల శని గ్రహానికి కోపం వస్తుందని అంటారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుందని అంటారు. అలాగే అప్పులు చెల్లించడంలో ఇబ్బందులు, ఆదాయం తగ్గిపోతుందట.

జ్యోతిష్య కారణాలు ఏంటంటే.. రాత్రి పూట శని గ్రహాన్ని పాలక గ్రహంగా భావిస్తారు. కాబట్టి ఈ సమయంలో గోర్లు కట్ చేయడం వల్ల శని, రాహుల గ్రహాల ప్రభావం పడుతుందని నమ్ముతారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత గోర్లు కట్ చేయకూడదని అంటారు

 

Link to comment
Share on other sites

  • 0

Debts bothering you? Follow these Vastu rules - అప్పులు ఇబ్బందులు పెడుతున్నాయా.? ఈ వాస్తు నియమాలు పాటించండి..

కొత్తింటి నిర్మాణమే కాకుండా, అద్దెంటిలో ఉన్నా ముందుగా వాస్తును పాటిస్తుంటారు. వాస్తుకు అనుగుణంగా ఇంటి నిర్మాణం, ఇంట్లో గదులు ఉండేలా చూసుకుంటారు. వాస్తు శాస్త్రంలో ప్రతీ అంశాన్ని స్పష్టంగా తెలిపారు. ఇక ఆర్థికపరంగా చూస్తే కొన్ని రకాల వాస్తు దోషాలు అప్పుల సమస్యలను పెంచుతాయిని వాస్తు పండితులు చెబుతున్నారు....

vastu-tips-10.jpg?w=1280

భారతీయులను, వాస్తును విడదీసి చూడలేని పరిస్థితి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులపై వాస్తు ప్రభావం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సహజంగా వాస్తు మనిషి ఆరోగ్యంపైనే కాకుండా, ఆర్థికంగాను ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే ఇంటి నిర్మాణం మొదలు, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల వరకు అన్ని విషయాల్లో వాస్తును తూచా తప్పకుండా పాటిస్తుంటారు.

కొత్తింటి నిర్మాణమే కాకుండా, అద్దెంటిలో ఉన్నా ముందుగా వాస్తును పాటిస్తుంటారు. వాస్తుకు అనుగుణంగా ఇంటి నిర్మాణం, ఇంట్లో గదులు ఉండేలా చూసుకుంటారు. వాస్తు శాస్త్రంలో ప్రతీ అంశాన్ని స్పష్టంగా తెలిపారు. ఇక ఆర్థికపరంగా చూస్తే కొన్ని రకాల వాస్తు దోషాలు అప్పుల సమస్యలను పెంచుతాయిని వాస్తు పండితులు చెబుతున్నారు. అప్పుల బాధ నుంచి ఉపశమనం పొందాలంటే పాటించాల్సిన కొన్ని వాస్తు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంంట్లో ఈశాన్యం దిశకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతుంటారు. ఈ దిశ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని వాస్తు పండితులు చెడుతున్నారు. ఈశాన్యంలో ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. అలాగే ఈ దిశలో చెత్తాచెదారం లేకుండా నిత్యం పరిశ్రుభ్రంగా ఉండాలి.

* ఇంటి ఆగ్నేయ మూలను సంపదకు చిహ్నంగా చెబుతుంటారు. ఈ దిశలో ఉండే వస్తువులు సంపదను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. అందుకే ఈ దిశలో మ‌నీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అప్పుల బాధ నుంచి బయటపడొచ్చు.

* వాస్తులో ఉత్త దిశకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వ్యాపారంతో పాటు, వృత్తిలో పురోగతి సాధించాలంటే ఉత్తరం దిశపై శ్ర‌ద్ధ వ‌హించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో తలుపులు కిటీకీలు ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఉత్తరం నుంచి వెలుతురు, గాలి వ‌చ్చేలా చూసుకోవాలి. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.

* ఇక గోడలకు వేసే రంగుల విషయంలో కూడా పలు సూచనలు పాటించాలని పండితులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఇంట్లో లేత రంగులు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

* ఇంట్లో ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే, ఐశ్యర్యం కలగాలన్నా ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ఏర్పాటు చేసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. లాఫింగ్‌ బుద్ధ, తాబేలు వంటి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.

Link to comment
Share on other sites

  • 0
  • Administrators

There is a new, separate section for ALL Spiritual/Vastu news/tips at the bottom of our Latest News page for a focussed reading.

HTH

--
Administrator
Telugus.com

Telugus.com

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...