Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

Employees Provident Fund (EPF) & EPFO: పీఎఫ్


Question

Posted

How to check your Provident Fund (EPF) balance from home: పీఎఫ్ బ్యాలెన్స్ ఇంట్లో నుంచే తెలుసుకోవచ్చా?

పీఎఫ్ చందాదారులందరూ ప్రతినెలా తమ జీతం నుంచి చందా చెల్లిస్తారు. ఇది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. కానీ చాలామందికి తమ ఖాతాలో సొమ్ము ఎంత ఉందో తెలియదు. దానిని తెలుసుకోవాలని అనుకున్నా ఏం చేయాలో తెలియదు. కానీ పీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడం చాలా సులభం. ఎస్ఎమ్ఎస్, మిస్ట్ కాల్, యూఎన్ ఏ నంబర్ ను ఉపయోగించి చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

epfo-2.jpg?w=1280

వివిధ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు పీఎఫ్ ఖాతాలుంటాయి. వీరి జీతంలోని ప్రతి నెలా కొంత మొత్తం తీసి, దానిలో జమచేస్తారు. యజమాన్యాలు కూడా తమ వాటాను కార్మికుల పేరు మీద కడతాయి. ఆ ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఆ డబ్బంతా ఏక మొత్తంలో అందజేస్తారు. దాని ద్వారా ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక ఆసరా కలుగుతుంది. పీఎఫ్ చందాదారులందరూ ప్రతినెలా తమ జీతం నుంచి చందా చెల్లిస్తారు. ఇది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. కానీ చాలామందికి తమ ఖాతాలో సొమ్ము ఎంత ఉందో తెలియదు. దానిని తెలుసుకోవాలని అనుకున్నా ఏం చేయాలో తెలియదు. కానీ పీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడం చాలా సులభం. ఎస్ఎమ్ఎస్, మిస్ట్ కాల్, యూఎన్ ఏ నంబర్ ను ఉపయోగించి చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

ఎస్ఎమ్ఎస్ ద్వారా..

  • ఎస్ఎమ్ఎస్ ద్వారా తమ ఖాతాలోని పీఎఫ్ బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు.
  • ముందుగా మీ ఫోన్ లో మెసేజ్ లను తెరవండి
  • EPFOHO అని టైప్ చేసి మీ యూఏఎన్ నంబర్, మీ భాష ప్రాధాన్యతలోని మొదటి మూడు అక్షరాలను టైప్ చేయండి.
  • దాహరణకు మీరు ఇంగ్లీష్ కోసం ENG అని టైప్ చేయాలి.
  • అనంతరం 773829 9899కు మెసేజ్ పంపండి.
  • వెంటనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ ను తెలియజేస్తూ రిటర్న్ మెసేజ్ వస్తుంది.
  • మీ యూఏఎన్ నంబర్ కు రిజిస్టర్డ్ అయిన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే పంపే అవకాశం ఉంటుంది.
  • వేరే నంబర్ నుంచి పంపితే మీకు వివరాలు రావు.

మిస్డ్ కాల్ తో..

కేవలం మీ ఫోన్ నుంచి మిస్డ్ కాల్ చేసి పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే అవకాశం. ఇది చాలా సులభం. మీ యూఏఎన్ నంబర్ కు లింక్ అయిన ఫోన్ నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వండి. వెంటనే మీకు బ్యాలెన్స్ తెలియజేస్తూ మెసేజ్ వస్తుంది.

యూఏఎన్ అంటే..

ఈపీఎఫ్ చందాాదారులైన ప్రతి ఉద్యోగికీ 12 అంకెల నంబర్ ను కేటాయిస్తారు. దానిని యూనివర్సల్ అక్కౌంట్ నంబర్ (యూఏఎన్) అంటారు. దీనికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గుర్తింపు ఉంటుంది. ఉద్యోగి ఎన్ని సంస్థలకు మారినా ఈ నంబర్ పర్మినెంట్ గా ఉంటుంది. పీఎఫ్ చందాదారులకు యూఏఎన్ అనేది చాలా కీలకం. పీఎఫ్ కు సంబంధించిన ప్రతి పనికీ ఆ నంబర్ అవసరమవుతుంది. మీరు బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవాలన్నా ఆ నంబర్ ఉంటేనే సాధ్యమవుతుంది. అయితే కొందరికి ఆ నంబర్ తెలియకపోవచ్చు, మరికొందరు మరిచిపోయి ఉంటారు. అయినా ఎటువంటి ఆందోళన వద్దు. చాలా సులభంగా మన యూఏఎన్ ను తెలుసుకునే వీలుంది.

  • ముందుగా unifiedportal-mem.epfindia.gov.inని సందర్శించాలి
  • ప్రధాన పేజీలో ‘మీ యూఏఎన్ తెలుసుకోండి’ అనే ఎంపికపై క్లిక్ చేయండి.
  • మీ ఈపీఎఫ్ ఖాతా నంబర్, సభ్యుల ఐడీ వంటి అవసరమైన వివరాలను నమోదు చేయండి.
  • మీకు ఒక పిన్ నంబరు వస్తుంది. దానిని నమోదు చేయండి.
  • వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు యూఏఎన్ ను పంపిస్తారు.
  • ఒకవేళ మీ యూఏఎన్ యాక్టివేట్ కాకపోతే, మీరు యాక్టివ్ యువర్ యూఏఎన్ అనే దానిపై క్లిక్ చేయాలి.
  • అక్కడ తెలిపిన ప్రకారం వివరాలు నమోదు చేయాలి.

...

Complete article

13 answers to this question

Recommended Posts

  • 0
Posted

EPFO: ఒక్క మిస్డ్ కాల్ ద్వారా మీ పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు..ఎలాగంటే..

EPFO : ఉద్యోగుల జీతం నుండి కొంత డబ్బు ప్రతి నెల పీఎఫ్‌ ఖాతాలో జమ చేయబడుతుంది. ప్రభుత్వం పీఎఫ్‌ ఖాతాపై స్థిర వడ్డీని ఇస్తుంది. వీటన్నింటిని నిర్వహించే పని ప్రభుత్వం తరపున ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చేస్తుంది. ఈపీఎఫ్‌వో పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేసే సేవను అందిస్తుంది. మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ని కూడా తెలుసుకోవచ్చు. మిస్డ్ కాల్ కాకుండా, ఉద్యోగులు నాలుగు మార్గాల్లో..

epfo1-1.jpg?w=1280

EPFO : ఉద్యోగుల జీతం నుండి కొంత డబ్బు ప్రతి నెల పీఎఫ్‌ ఖాతాలో జమ చేయబడుతుంది. ప్రభుత్వం పీఎఫ్‌ ఖాతాపై స్థిర వడ్డీని ఇస్తుంది. వీటన్నింటిని నిర్వహించే పని ప్రభుత్వం తరపున ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చేస్తుంది. ఈపీఎఫ్‌వో పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేసే సేవను అందిస్తుంది. మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ని కూడా తెలుసుకోవచ్చు. మిస్డ్ కాల్ కాకుండా, ఉద్యోగులు నాలుగు మార్గాల్లో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

మిస్డ్ కాల్ ద్వారా: మీరు మిస్డ్ కాల్ ద్వారా మీ పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్‌ను కూడా తనిఖీ చేయవచ్చు. దీని కోసం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. మీరు ఈ నంబర్‌కు కాల్ చేసిన వెంటనే, అది ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. దీని తర్వాత బ్యాలెన్స్ వివరాలు మీ నంబర్‌కు వస్తాయి.

EPFO వెబ్‌సైట్ ద్వారా: మీరు EPFO వెబ్‌సైట్ ద్వారా మీ PF ఖాతా బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా మీరు మీ UAN నంబర్‌ను నమోదు చేయాలి. మీరు పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి. మీరు మీ పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు మీ ఆన్‌లైన్ పాస్‌బుక్ పొందుతారు.

SMS ద్వారా: మీరు సాధారణ SMS పంపడం ద్వారా మీ పీఎఫ్‌ ఖాతాలోని బ్యాలెన్స్‌ని కూడా తనిఖీ చేయవచ్చు. దీని కోసం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి EPFOHO అని టైప్‌ చేసి ఆపై మీ UAN నంబర్‌ను నమోదు చేయాలి. 7738299899 నంబర్‌కు పంపాలి.

ఉమాంగ్ పోర్టల్ ద్వారా: మీరు ఉమాంగ్ పోర్టల్ ద్వారా EPFO సౌకర్యాలను కూడా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా మీరు దీని ద్వారా మీ పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్‌ను కూడా తనిఖీ చేయవచ్చు. ఉమాంగ్ యాప్‌ను గూగుల్ ప్లే, యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • 0
Posted

PF Calculator: బేసిక్‌ సాలరీ రూ.12000 ఉంటే పదవీ విరమణ తర్వాత పీఎఫ్‌ ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా?

ప్రావిడెంట్ ఫండ్ అనేది సాధారణ నెలవారీ జీతం పొందేవారికి. సంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్‌ వారి పొదుపు. అందుకే పీఎఫ్ ప్రయోజనాలను పక్కాగా పొందేందుకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపుతున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బాధ్యత. ప్రస్తుత చట్టం ప్రకారం.. ఉద్యోగి, యజమాని (కంపెనీ) ఇద్దరూ ఈపీఎఫ్‌కి సహకారం అందిస్తారు.

epfo-1.jpg?w=1280

ప్రావిడెంట్ ఫండ్ అనేది సాధారణ నెలవారీ జీతం పొందేవారికి. సంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్‌ వారి పొదుపు. అందుకే పీఎఫ్ ప్రయోజనాలను పక్కాగా పొందేందుకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపుతున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బాధ్యత. ప్రస్తుత చట్టం ప్రకారం.. ఉద్యోగి, యజమాని (కంపెనీ) ఇద్దరూ ఈపీఎఫ్‌కి సహకారం అందిస్తారు. పీఎఫ్‌ సహకారం అనేది ప్రాథమిక చెల్లింపు, డియర్‌నెస్ అలవెన్స్‌లో నిర్ణీత శాతం. పీఎఫ్‌ వడ్డీ రేట్లు ప్రతి సంవత్సరం మారుతుంటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌పై వార్షిక వడ్డీ 8.25 శాతం.

రూ.12,000 జీతం:

మీరు పదవీ విరమణ చేసినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి, పొదుపును చేతిలో ఉంచుకునే మార్గాలలో పీఎఫ్‌ ఒకటి. తక్కువ జీతం పొందే వ్యక్తి పీఎఫ్‌ నుండి ఎంత రూపాయలు పొందవచ్చో చూద్దాం. మీ ప్రాథమిక జీతం (+DA) రూ.12,000 అనుకుందాం.

మీకు 25 ఏళ్లు ఉంటే మీరు పదవీ విరమణపై దాదాపు 87 లక్షలు రిటైర్మెంట్ ఫండ్‌గా పొందుతారు. ఈ రేటు వార్షిక వడ్డీ రేటు 8.25 శాతం. సగటు వార్షిక జీతం 5 శాతం పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లు, జీతం పెరుగుదల మారితే గణాంకాలు కూడా మారవచ్చు.

  • ప్రాథమిక చెల్లింపు + డీఏ = రూ.12,000
  • ప్రస్తుత వయస్సు = 25 సంవత్సరాలు
  • పదవీ విరమణ వయస్సు = 60 సంవత్సరాలు
  • ఉద్యోగి నెలవారీ సహకారం = 12 శాతం
  • యజమాని నెలవారీ సహకారం = 3.67 శాతం
  • ఈపీఎఫ్‌పై వడ్డీ = 8.25 శాతం
  • వార్షిక సగటు జీతం పెరుగుదల = 5 శాతం

పదవీ విరమణ సమయంలో మెచ్యూరిటీ ఫండ్ = రూ.86,90,310 (మొత్తం సహకారం రూ.21,62,568, వడ్డీ రూ.65,27,742)

పెన్షన్, పీఎఫ్‌

ఉద్యోగి ప్రాథమిక జీతం (+DA)లో 12% EPF ఖాతాలో జమ చేయబడుతుంది. 12% మొత్తం రెండు భాగాలలో పెట్టుబడి పెట్టబడుతుంది. 8.33% ఉద్యోగి పెన్షన్ ఖాతాలో, మిగిలిన 3.67% EPF ఖాతాలో పెట్టుబడి పెట్టబడుతుంది. ప్రాథమిక వేతనం రూ.15,000 కంటే తక్కువ ఉన్న ఉద్యోగులు ఈ పథకంలో చేరాలి.

...

Complete article

  • 0
Posted

EPF EPFO: పెళ్లి కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత డబ్బు డ్రా చేసుకోవచ్చు? నిబంధనలు తెలుసుకోండి!

ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు తమ ఉద్యోగంలో చేరినప్పటి నుండి వారి జీతంలో కొంత భాగాన్ని పీఎఫ్‌ పథకం కింద వారి బ్యాంక్ ఖాతా నుండి కట్‌ అవుతుంటుంది. ఇవి పీఎఫ్‌ ఖాతాలో జమ అవుతాయి. అలా తీసివేసిన ఈ డబ్బును దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేస్తే, పదవీ విరమణ సమయంలో వడ్డీతో సహా వెనక్కి తీసుకోవచ్చు. కొంతమందికి పదవీ విరమణకు ముందు..

epfo.jpg?w=1280

ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు తమ ఉద్యోగంలో చేరినప్పటి నుండి వారి జీతంలో కొంత భాగాన్ని పీఎఫ్‌ పథకం కింద వారి బ్యాంక్ ఖాతా నుండి కట్‌ అవుతుంటుంది. ఇవి పీఎఫ్‌ ఖాతాలో జమ అవుతాయి. అలా తీసివేసిన ఈ డబ్బును దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేస్తే, పదవీ విరమణ సమయంలో వడ్డీతో సహా వెనక్కి తీసుకోవచ్చు. కొంతమందికి పదవీ విరమణకు ముందు ఆ డబ్బు అవసరం కావచ్చు. కానీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO)ని నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం ఉద్యోగులు 3 కారణాల వల్ల మాత్రమే తమ పీఎఫ్‌ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ 3 పరిస్థితులలో మాత్రమే ఉద్యోగులు పీఎఫ్‌ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు:

1. మీరు 58 సంవత్సరాలు నిండిన తర్వాత మీ డబ్బును వడ్డీతో విత్‌డ్రా చేసుకోవచ్చు.

2. పని చేసే వ్యక్తి 2 నెలల పాటు పనిలో లేనట్లయితే పీఎఫ్‌ ఖాతా నుండి డబ్బు తీసుకోవచ్చు.

3. ఉద్యోగి పదవీ విరమణ వయస్సులోపు మరణిస్తే పిఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇది కాకుండా ఒక ఉద్యోగి తన కొన్ని ముఖ్యమైన అవసరాల కోసం పీఎఫ్‌ ఖాతా నుండి డబ్బు తీసుకోవచ్చు. అయితే దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మీరు దానిని అనుసరిస్తే మాత్రమే మీరు పీఎఫ్‌ ఖాతా నుండి డబ్బును తిరిగి పొందవచ్చు.

వివాహం కోసం..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద ఉద్యోగులు తమ పెళ్లి ఖర్చుల కోసం తమ పీఎఫ్ ఖాతా నుండి డబ్బు తీసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. దీని ప్రకారం.. షరతుల కింద ఈ డబ్బు తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.

పీఎఫ్‌ వాపసు కోసం గడువు:

పెళ్లికి పిఎఫ్ డబ్బును తిరిగి పొందాలనుకునే వారు కనీసం 7 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. వివాహితులు వివాహం కోసం పీఎఫ్‌ మొత్తాన్ని క్లెయిమ్ చేయలేరు. పీఎఫ్‌పై వడ్డీతో సహా ఉద్యోగి సహకారంలో 50% మాత్రమే తిరిగి పొందవచ్చు. ఉద్యోగులు తమ పెళ్లికి పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చన్న రూల్ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, పిల్లల వివాహాల కోసం వాపసును క్లెయిమ్ చేయవచ్చు.

  • 0
Posted

Repaying Home Loan with EPF: పీఎఫ్ సొమ్ముతో హోమ్‌లోన్ క్లియర్ చేస్తున్నారా..? ఆ విషయం తెలుసుకోకపోతే మీ సొమ్ము ఫసక్

ఆర్‌‌బీఐ ఇటీవల గృహ రుణాలపై  కీలకమైన రెపో రేట్లను కొనసాగించినప్పటికీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో సహా పలు బ్యాంకులు తమ రెపో-లింక్డ్ హోమ్ లోన్ రేట్లను మార్చి 2024లో 10-15 బేసిస్ పాయింట్లు పెంచాయి. ఫలితంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.70 శాతం నుంచి  9.80 శాతం వరకు ఉన్నాయి. దీంతో గృహ రుణ చెల్లింపుదారులకు ఈఎంఐలు కట్టడం భారంగా మారింది. దీంతో రుణ ముందస్తు చెల్లింపు గానీ, పొడిగించిన రుణ కాల వ్యవధిని ఎంచుకోవాల్సి వస్తుంది.

bank-home-loan-1.jpg?w=1280

ఆర్‌‌బీఐ ఇటీవల గృహ రుణాలపై  కీలకమైన రెపో రేట్లను కొనసాగించినప్పటికీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో సహా పలు బ్యాంకులు తమ రెపో-లింక్డ్ హోమ్ లోన్ రేట్లను మార్చి 2024లో 10-15 బేసిస్ పాయింట్లు పెంచాయి. ఫలితంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.70 శాతం నుంచి  9.80 శాతం వరకు ఉన్నాయి. దీంతో గృహ రుణ చెల్లింపుదారులకు ఈఎంఐలు కట్టడం భారంగా మారింది. దీంతో రుణ ముందస్తు చెల్లింపు గానీ, పొడిగించిన రుణ కాల వ్యవధిని ఎంచుకోవాల్సి వస్తుంది. చాలా మంది రుణగ్రహీతలు తమ రుణాలను త్వరగా క్లియర్ చేయాలనే ఆసక్తితో పొదుపు లేదా వారి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల వంటి పెట్టుబడులను ఉపయోగిస్తున్నారు. అయితే పొదుపుతో గృహ రుణం తిరిగి చెల్లిస్తే పర్లేదు కానీ, ఈపీఎఫ్ ఉపసంహరణ ద్వారా రుణం చెల్లించాలనుకునే వాళ్లు ఓ సారి ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ ఉపసంహరణపై నిపుణుల సూచనలను ఓ సారి తెలుసుకుందాం. 

హోమ్ లోన్ రీపేమెంట్ కోసం మీ ఈపీఎఫ్ ఉపసంహరణ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈపీఎఫ్ పొదుపులు వడ్డీతో పాటు పెరుగుతాయి. పైగా ఈపీఎఫ్ సొమ్ము మీ రిటైర్మెంట్ పొదుపులో ముఖ్యమైన భాగం. ఈ నిధులను విత్‌డ్రా చేయడం వల్ల ఈ మొత్తం తగ్గిపోతుంది. దీని ఫలితంగా పదవీ విరమణ ప్రయోజనాలు తగ్గుతాయి. గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేటును పొందేందుకు రుణ ఏకీకరణ లేదా బ్యాలెన్స్ బదిలీ వంటి ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. అయితే మీ లోన్‌ని తిరిగి చెల్లించడానికి మీరు ఈపీఎఫ్ ఉపసంహరణను ఎంచుకోవాలా? లేదా? అనేది లోన్ రీపేమెంట్‌కు సంబంధించిన అత్యవసరత, అవసరమైన మొత్తం, మీ మొత్తం ఆర్థిక పరిస్థితి వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ ఈపీఎఫ్ ఉపసంహరణ ముందు వాటి వల్ల కలిగే నష్టాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ రిటైర్మెంట్ కార్పస్, భవిష్యత్తు ఆర్థిక భద్రతను తగ్గిస్తుంది.

మీ ఈపీఎఫ్ ఉపసంహరణకు ముందు మీ హోమ్ లోన్‌ని నిర్వహించడానికి అన్ని మార్గాలను అన్వేషించడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వడ్డీ రేటుపై మళ్లీ చర్చలు జరపడం, లోన్ వ్యవధిని పొడిగించడం లేదా అదనపు చెల్లింపులు చేయడం సాధ్యమేనా? అనే అంశాలపై అవగాహన తెచ్చుకోవాలంటున్నారు. ముఖ్యంగా రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన ఆవశ్యకతను అంచనా వేయాలని పేర్కొంటున్నారు. అలాగే ఈపీఎఫ్ ఉపసంహరణలు ఉపసంహరణకు కారణంతో మీ ఉద్యోగ కాల వ్యవధి ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను ఏ స్థాయిలో ఉంటుందో? ఈపీఎఫ్ఓ మార్గదర్శకాలతో మీ అవసరాలకు అనుగుణంగా సమాచారం తెలుసుకోవాలి. ఈ విషయంపై మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఆర్థిక నిపుణులను సంప్రదించడం మంచిది. 

  • 0
Posted

EPF Pension: 6 Types of Pensions - మీకు పీఎఫ్‌ ఖాతా ఉందా? ఈ 6 రకాల పెన్షన్ల గురించి మీకు తెలుసా?

సంఘటిత రంగంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భద్రత కల్పించేందుకు.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పని చేస్తుంది. అయితే ఉద్యోగులు జీతంలో 12 శాతం కట్‌ చేసి పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తారు. ఉద్యోగి నుంచి ఎంత మొత్తం కట్‌ చేస్తారో.. కంపెనీ కూడా అంతే మొత్తంలో యాడ్‌ చేసి జమ చేస్తుంది. అంతేకాదు దీనిపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ జమ చేస్తుంది. ఈ మొత్తం అంతా కూడా ఉద్యోగి పీఎఫ్‌ అకౌంట్‌లో జమ అవుతుంది..

 
PF Pension: మీకు పీఎఫ్‌ ఖాతా ఉందా? ఈ 6 రకాల పెన్షన్ల గురించి మీకు తెలుసా?

సంఘటిత రంగంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భద్రత కల్పించేందుకు.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పని చేస్తుంది. అయితే ఉద్యోగులు జీతంలో 12 శాతం కట్‌ చేసి పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తారు. ఉద్యోగి నుంచి ఎంత మొత్తం కట్‌ చేస్తారో.. కంపెనీ కూడా అంతే మొత్తంలో యాడ్‌ చేసి జమ చేస్తుంది. అంతేకాదు దీనిపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ జమ చేస్తుంది. ఈ మొత్తం అంతా కూడా ఉద్యోగి పీఎఫ్‌ అకౌంట్‌లో జమ అవుతుంది. ఈ పీఎఫ్‌ను ఉద్యోగి ఆరోగ్య, వివాహ, ఇంటి నిర్మాణం వంటి పనుల కోసం డబ్బులను మధ్యలో ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జమ అయిన డబ్బును రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రూపంలో పొందుతారు. అయితే ఈపీఎఫ్ఓ మొత్తం 6 రకాల పెన్షన్స్ ఇస్తుందన్న సంగతి మీకు తెలుసా? ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. వీటి గురించి తెలుసుకుందాం.

EPS 95 కింద ఈపీఎఫ్ఓ పెన్షన్లు అందజేస్తుంది. ఈ పెన్షన్లకు ఎలాంటి వారు అర్హులో చూద్దాం. పెన్షన్‌ పొందాలంటే తప్పకుండా ఈపీఎఫ్ఓ సభ్యులై ఉండాలి. వారు 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉండాలని గుర్తించుకోండి. అలాగే 58 సంవత్సరాల వయసు దాటాలి. ముందస్తు పెన్షన్ పొందేందుకు 50 ఏళ్ల వయసు నిండి ఉండాలి. 60 ఏళ్ల వరకు వాయిదా వేసుకుంటే అదనంగా పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

  1. సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ – 10 సంవత్సరాలు ఉద్యోగ సర్వీస్ పూర్తి చేసిన వారు లేదా 58 సంవత్సరాలు నిండిపోయి.. రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులకు ఈ పెన్షన్ వస్తుంది.
  2. డిసేబుల్డ్ పెన్షన్ - తమ సర్వీసు కాలంలో తాత్కాలిక లేక శాశ్వత అంగవైకల్యం బారిన పడిన ఈపీఎఫ్ చందాదారులు.. ఈ పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటంఉది. ఇందు కోసం వయసు 50 లేదా 58 నిండి ఉండాల్సిన అవసరం లేదని గుర్తించుకోండి. కనీసం ఒక నెల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ చెల్లించినా ఈ పెన్షన్ వస్తుంది.
  3. పిల్లల లేదా వితంతు పెన్షన్ - పీఎఫ్ సబ్‌స్క్రైబర్ మరణిస్తే.. అతని భార్య లేదా భర్త, 25 ఏళ్లలోపు ఉన్న ఇద్దరు పిల్లలు కూడా ఈ పెన్షన్ పొందవచ్చు. ఇక మృతుల మొదటి సంతానం వయసు 25 ఏళ్లు దాటి మూడో బిడ్డ ఉంటే.. అప్పుడు అతను కూడా పెన్షన్ అందుకోవచ్చు. ఇక్కడ కూడా పదేళ్ల సర్వీసు ఉండాలన్న రూల్‌ లేదు.
  4. ముందస్తు పెన్షన్ - 50 ఏళ్లు పైబడినవారు, పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారు ఈ ముందస్తు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. ముందస్తు పెన్షన్ ఎంచుకుంటే.. ఏటా 4 శాతం తక్కువ పెన్షన్ అందుకుంటారు. ఉదాహరణకు చూస్తే.. 58 ఏళ్లు నిండిన వారికి రూ. 10 వేల చొప్పున పెన్షన్ వస్తుందనుకుంటే.. 57 ఏళ్లు ఉన్న వారికి ఇది రూ. 9600 గా ఉంటుంది. ఇలా సంవత్సరం తగ్గుతున్న కొద్దీ పెన్షన్ తగ్గుకుంటూ వస్తుంది.
  5. అనాథ పెన్షన్ - పీఎఫ్ ఖాతా ఉన్న వ్యక్తి .. వారి జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించినట్లయితే.. వారి ఇద్దరు పిల్లలకు పెన్షన్‌ లభిస్తుంది. దీనిని ఆర్ఫాన్ పెన్షన్ అంటారు. వయసు మాత్రం 25 ఏళ్ల లోపు ఉండాలి. అయితే 25 ఏళ్లు దాటితే వారికి పెన్షన్ మొత్తం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
  6. నామినీ పెన్షన్ - పీఎఫ్ ఖాతాదారు మరణించిన తర్వాత.. అతడి నామినీ ఈ పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే దీని కోసం ఈపీఎఫ్ఓ పోర్టల్లో ముందుగా ఇ- నామినీ పేర్కొనాల్సి ఉంటుంది.
  • 0
Posted

Pension Withdraw: పీఎఫ్‌ పెన్షనర్లకు కేంద్ర గుడ్‌న్యూస్‌.. ఇక ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్‌ విత్‌డ్రా

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య ఎక్కువ. వారి రిటైర్‌మెంట్‌ తర్వాత గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు వీలుగా ఎంప్లాయ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(ఈపీఎప్‌)లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. అలాగే ఉద్యోగుల పెట్టుబడి ఆధారంగా రిటైరయ్యాక ప్రతి నెలా ఈపీఎఫ్‌ఓ పింఛన్‌ అందిస్తుంది. అయితే తాజాగా ఈపీఎఫ్‌ పింఛన్‌దారులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

 
Pension Withdraw: పీఎఫ్‌ పెన్షనర్లకు కేంద్ర గుడ్‌న్యూస్‌.. ఇక ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్‌ విత్‌డ్రా
EPFO

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య ఎక్కువ. వారి రిటైర్‌మెంట్‌ తర్వాత గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు వీలుగా ఎంప్లాయ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(ఈపీఎప్‌)లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. అలాగే ఉద్యోగుల పెట్టుబడి ఆధారంగా రిటైరయ్యాక ప్రతి నెలా ఈపీఎఫ్‌ఓ పింఛన్‌ అందిస్తుంది. అయితే తాజాగా ఈపీఎఫ్‌ పింఛన్‌దారులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇక ఏ బ్యాంకు బ్రాంచ్‌ నుంచైనా పింఛన్‌ విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.  జనవరి 2025 నుంచి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పెన్షన్ స్కీమ్‌లో నమోదు చేసుకున్న పింఛనుదారులు తమ నిధులను దేశవ్యాప్తంగా ఏదైనా బ్యాంక్ లేదా బ్రాంచ్ నుంచి యాక్సెస్ చేయగలరని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ ఉద్యోగుల కోసం తీసుకున్న తాజా నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం ఈపీఎఫ్ పింఛనుదారులు తమ ఖాతా ఉన్న నిర్దిష్ట బ్యాంక్ లేదా బ్రాంచ్‌ని తప్పనిసరిగా సందర్శించి పెన్షన్ విత్‌డ్రా చేసుకుంటున్నారు. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశానికి అధ్యక్షత వహించిన మాండవియా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) 1995 కోసం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ (సీపీపీఎస్)ని ప్రవేశపెట్టే విధానాన్ని ఆమోదించారని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కొత్త విధానం దేశంలోని ఏదైనా బ్యాంకు శాఖ ద్వారా అయినా పెన్షన్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. పీఎఫ్‌వోను ఆధునీకరించే దిశగా సీపీపీఎస్ ఆమోదం ఒక ముఖ్యమైన దశ అని నిపుణులు చెబుతున్నారు. సీపీపీఎస్ ఆమోదం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఒక ప్రధాన మైలురాయి అని పేర్కొంటున్నారు. ఈ వ్యవస్థ పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తుంది. ముఖ్యంగా పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా ఉంటుంది.  దాదాపు 78 లక్షల మంది ఈపీఎస్-95 పెన్షనర్లు కొత్త కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ నుంచి ప్రయోజనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు. 

పదవీ విరమణ తర్వాత వారి స్వగ్రామాలకు వెళ్లే పెన్షనర్లకు ప్రభుత్వ చర్యలు ఉపశమనం కలిగిస్తాయి. ఈపీఎఫ్ఓ ఐటీ ఆధునికీకరణ ప్రాజెక్ట్ సెంట్రలైజ్డ్ ఐటీ ఎక్విప్డ్ సిస్టమ్‌లో భాగమైన కొత్త సౌకర్యం 1 జనవరి 2025న ప్రారంభిస్తారు. తదుపరి దశలో సీపీపీఎస్ సజావుగా ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్)కి మారుతుంది. ప్రస్తుత విధానంలో ప్రతి ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం కేవలం మూడు లేదా నాలుగు బ్యాంకులతో ప్రత్యేక ఒప్పందాలను ఏర్పరచుకోవాలి. కొత్త విధానంతో పెన్షనర్లు తమ పెన్షన్ ప్రారంభమైనప్పుడు ధ్రువీకరణ కోసం బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేదని, చెల్లింపులు విడుదలైన వెంటనే జమ అవుతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 

...

Complete article

  • 0
Posted

How to check your PF Account Balance: మీ పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవాలా? ఈ 4 సులభమైన పద్ధతుల్లో..

జీతం తీసుకునే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (PF) గురించి బాగా తెలుసు. ప్రతి నెలా ఉద్యోగి ప్రాథమిక వేతనం, డీఏలో 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఇది కాకుండా, మీ యజమాని (కంపెనీ) కూడా దాని వైపు నుండి అదే మొత్తాన్ని అందజేస్తుంది. యజమాని డిపాజిట్ చేసిన ఈ 12 శాతంలో 3.67 శాతం మీ పీఎఫ్ ఖాతాకు, మిగిలిన 8.33 శాతం పెన్షన్ స్కీమ్‌కు..

 
PF Account Balance: మీ పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవాలా? ఈ 4 సులభమైన పద్ధతుల్లో..

జీతం తీసుకునే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (PF) గురించి బాగా తెలుసు. ప్రతి నెలా ఉద్యోగి ప్రాథమిక వేతనం, డీఏలో 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఇది కాకుండా, మీ యజమాని (కంపెనీ) కూడా దాని వైపు నుండి అదే మొత్తాన్ని అందజేస్తుంది. యజమాని డిపాజిట్ చేసిన ఈ 12 శాతంలో 3.67 శాతం మీ పీఎఫ్ ఖాతాకు, మిగిలిన 8.33 శాతం పెన్షన్ స్కీమ్‌కు వెళ్తుంది. మీరు చాలా సులభమైన మార్గాల్లో మీ పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. తెలుసుకుందాం.

SMS ద్వారా..

ఈపీఎఫ్‌వో సభ్యులు 7738299899కి SMS పంపడం ద్వారా వారి పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్, వారి ఖాతాలోని తాజా సహకారాన్ని తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు రిజిస్టర్డ్ నంబర్ నుండి AN EPFOHO ENG అని టైప్ చేసి సందేశాన్ని పంపాలి. ఇక్కడ ENG అని ఆంగ్ల భాష సూచిస్తుంది. మీరు వేరే భాషలో తెలుసుకోవాలనుకుంటే, ఆ భాషలోని మొదటి మూడు అక్షరాలను టైప్‌ చేయండి.

మిస్డ్ కాల్ ద్వారా..

మీ మొబైల్ నంబర్ UANతో రిజిస్టర్ అయినట్లయితే మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు. ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ చేసిన తర్వాత మీకు ఈపీఎఫ్‌వో నుండి కొన్ని సందేశాలు వస్తాయి. అందులో మీ పీఎఫ్‌ ఖాతాల బ్యాలెన్స్ మీకు కనిపిస్తుంది.

ఉమంగ్ యాప్:

ఉద్యోగులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఉమంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా తమ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ని ఉపయోగించి వినియోగదారులు క్లెయిమ్‌లను సమర్పించవచ్చు. వారి ఈపీఎఫ్‌ పాస్‌బుక్‌ని వీక్షించవచ్చు. వారి క్లెయిమ్‌లను ట్రాక్ చేయవచ్చు. ఇందుకోసం యాప్‌లో మీ ఫోన్ నంబర్‌ను నమోదు చేసి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఈపీఎఫ్‌వో పోర్టల్:

ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కి వెళ్లి ఉద్యోగుల విభాగంపై క్లిక్ చేసి, ఆపై సభ్యుల పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి. మీరు మీ యూఏఎన్‌, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా పీఎఫ్‌ పాస్‌బుక్‌ని యాక్సెస్ చేయవచ్చు. ఇది ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్‌తో పాటు ఉద్యోగి, యజమాని సహకారాన్ని చూపుతుంది. ఏదైనా పీఎఫ్‌ బదిలీ మొత్తం, సేకరించిన పీఎఫ్‌ వడ్డీ మొత్తం కూడా కనిపిస్తుంది.

...

Complete article

  • 0
Posted

EPF Withdrawal without Employer's involvement: యజమానితో పనిలేకుండా పీఎఫ్ విత్ డ్రా చేయొచ్చు.. అదెలా అంటే..

ఒక వ్యక్తి రెండు నెలల కంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉంటే, వారు తమ ఈపీఎఫ్ కార్పస్‌లో 100% ఉపసంహరించుకోవడానికి అర్హులు. అదనంగా, కొత్త నిబంధనల ప్రకారం, ఒక నెల కంటే ఎక్కువ కాలం నిరుద్యోగులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 
EPF Withdrawal: యజమానితో పనిలేకుండా పీఎఫ్ విత్ డ్రా చేయొచ్చు.. అదెలా అంటే..

ఉద్యోగులకు గొప్ప భరోసా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్). ఇది పొదుపుతో పాటు పదవీ విరమణ సమయానికి ఉపయుక్తంగా ఉండే గొప్ప పథకం. ఇది ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగి ఉండే ఖాతా. ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి ప్రాథమిక వేతనంలో 12శాతం ఈ ఖాతాలో జమచేస్తారు. అలాగే ఆ ఉద్యోగి యజమాని నుంచి కూడా కొంత మొత్తం జమవుతుంది. ఈ నిధుల నుంచి ఏటా వడ్డీ వస్తుంది. ఈ నిధులను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిర్వహిస్తుంది. ఈ నిధుల నుంచి కొంత మొత్తాన్ని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకు ఈపీఎఫ్ఓ కొన్ని నిబంధనలను కూడా విధించింది. అలాగే పూర్తిగా కూడా బ్యాలెన్స్ ను విత్ డ్రా చేసుకోవచ్చు. మీ యజమాని అనుమతించకపోయినా విత్ డ్రా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

పీఎఫ్ మొత్తం విత్ డ్రా..

ఉద్యోగులు ఈ కింది పరిస్థితుల్లో తమ మొత్తం ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు.

పదవీ విరమణ.. పదవీ విరమణ వయస్సు వచ్చిన తర్వాత పూర్తి ఈపీఎఫ్ కార్పస్‌ను ఉపసంహరించుకోవచ్చు.

నిరుద్యోగం.. ఒక వ్యక్తి రెండు నెలల కంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉంటే, వారు తమ ఈపీఎఫ్ కార్పస్‌లో 100% ఉపసంహరించుకోవడానికి అర్హులు. అదనంగా, కొత్త నిబంధనల ప్రకారం, ఒక నెల కంటే ఎక్కువ కాలం నిరుద్యోగులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

పాక్షిక పీఎఫ్ ఉపసంహరణ..

ఉద్యోగులు వారి సర్వీస్ కాలం,ఉపసంహరణ ఉద్దేశానికి సంబంధించిన నిర్దిష్ట పరిస్థితులలో వారి ఈపీఎఫ్ నిధులలో కొంత భాగాన్ని కూడా ఉపసంహరించుకోవచ్చు. ఇంటి నిర్మాణం/కొనుగోలు, వైద్య చికిత్స, గృహ రుణం తిరిగి చెల్లించడం, ఇల్లు పునర్నిర్మాణం, పెళ్లి వంటి వాటికి పాక్షికంగా పీఎఫ్ ను విత్ డ్రా చేసుకోవచ్చు.

విత్ డ్రా ప్రక్రియ ఎలా అంటే..

యజమాని సంతకం లేకుండానే ఈపీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేయడం సాధ్యమవుతుంది. సాధారణంగా క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించిన తర్వాత 15 పని దినాలలోపు పూర్తి చేయవచ్చు. ఈ ఉపసంహరణను ప్రారంభించడానికి, మీరు కాంపోజిట్ క్లెయిమ్ ఫారమ్ (ఆధార్) లేదా తుది పరిష్కారం కోసం ఫారమ్ 19, పెన్షన్ ఉపసంహరణ కోసం ఫారమ్ 10సీ, పాక్షిక ఉపసంహరణ కోసం ఫారమ్ 31తో సహా అవసరమైన డాక్యుమెంట్లను అందించాలి .

యజమాని ఆమోదం లేకుండా ఈపీఎఫ్ ఉపసంహరణకు అర్హత పొందేందుకు మీకు యాక్టివ్ యూనివర్సల్ ఖాతా నంబర్ (యూఏఎన్) ఉందని, మీ కేవైసీ వివరాలు లింక్ చేసి, ధ్రువీకరించి ఉందని నిర్ధారించుకోండి. అలాగే మీ మొబైల్ నంబర్ మీ యూఏఎన్ తో లింక్ అయి ఉందని సరిచూసుకోండి. వీటి సాయంత మీ యజమాని సంతకం అవసరం లేకుండానే మీరు మీ ఈపీఎఫ్ మొత్తాన్ని విజయవంతంగా ఉపసంహరించుకోవచ్చు. దీని వల్ల ఉద్యోగులకు ప్రక్రియ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

ఇవి అవసరం..

  • యూనివర్సల్ ఖాతా సంఖ్య (యూఏఎన్)
  • ఈపీఎఫ్ నుంచి నగదు బదిలీ కోసం బ్యాంక్ ఖాతా సమాచారం
  • మీ గుర్తింపు, ప్రస్తుత చిరునామా (ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా ఓటరు ఐడీ వంటివి) నిర్ధారించే చెల్లుబాటు అయ్యే పత్రాలు.
  • బదిలీని సులభతరం చేయడానికి ఐఎఫ్ఎస్సీ కోడ్, ఖాతా సంఖ్యను కలిగి ఉన్న రద్దు చేసిన చెక్కు అవసరం అవుతుంది.
  • 0
Posted

PF New Rule: Withdraw Rs. 1 lakh within 6 months of joining a job - జాబ్‌లో చేరి 6 నెలలు కాకున్నా రూ.1 లక్ష విత్‌డ్రా.. కొత్త రూల్‌!

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు ఏదైనా అత్యవసరమైన సమయాల్లో డబ్బులు కావాలంటే దొరకని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ఈపీఎఫ్‌వో సరికొత్త రూల్‌ తీసుకువచ్చింది. ఇప్పుడు, ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల

 
PF New Rule: జాబ్‌లో చేరి 6 నెలలు కాకున్నా రూ.1 లక్ష విత్‌డ్రా.. కొత్త రూల్‌!

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు ఏదైనా అత్యవసరమైన సమయాల్లో డబ్బులు కావాలంటే దొరకని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ఈపీఎఫ్‌వో సరికొత్త రూల్‌ తీసుకువచ్చింది. ఇప్పుడు, ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం ఒకేసారి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఉన్న రూ. 50,000 పరిమితి ఉండేది. కానీ నిబంధనలు మార్చిన తర్వాత లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.

6 నెలలు పూర్తి కాకున్నా డబ్బులు తీసుకోవచ్చు:

ప్రస్తుత ఉద్యోగంలో చేరి ఆరు నెలలు కూడా పూర్తి కాకున్నా కూడా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. వివాహం, వైద్య చికిత్సల వంటి సందర్భాల్లో ఉద్యోగులను డబ్బు అత్యవసరంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ నిబంధన ఎంతగానో మేలు జరగనుంది.

2023-24 ఆర్థిక సంవత్సరానికి (FY24) పీఎఫ్‌ ఖాతాలపై 8.25 శాతం వడ్డీ రేటును ప్రభుత్వం అందిస్తోంది. ఈ వడ్డీ రేటు మధ్య తరగతి వేతన జీవులకు చాలా కీలకం. మరో కీలక సంస్కరణను కూడా సర్కారు తీసుకొచ్చింది. గతంలో, EPFO పార్ట్‌నర్‌షిప్‌ నుంచి మినహాయించిన కంపెనీలను ప్రభుత్వ రంగ ‘రిటైర్మెంట్‌ ఫండ్‌ మేనేజర్‌’కు మార్చడానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇలా మినహాయింపు పొందిన సంస్థలు, ప్రధానంగా 1954లో ఈపీఎఫ్‌వో ఏర్పాటుకు ముందున్న పదవీ విరమణ పథకాల్లో ఉన్నాయి. ఆ సంస్థలు ఇప్పుడు ఈపీఎఫ్‌వో కిందకు వచ్చే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

అలాగే ప్రస్తుతం ఉన్న రూ. 15,000 ఆదాయ పరిమితిని పెంచడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిపైన ఉన్న వాళ్లు ప్రావిడెంట్ ఫండ్‌కు కాంట్రిబ్యూట్‌ చేయడం తప్పనిసరి. రూ.15,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఉద్యోగులకు, రిటైర్మెంట్ సేవింగ్స్‌ అండ్‌ పెన్షన్‌ కోసం తమ ఆదాయంలో ఎంత కేటాయించాలనుకుంటున్నారో నిర్ణయించుకునేందుకు ఇప్పుడు ఎక్కువ సౌలభ్యం లభిస్తోంది. అంతేకాదు ఎంప్లాయీస్‌ స్టేట్ ఇన్సూరెన్స్‌కు (ESI) వర్తించే రూ. 21,000 థ్రెషోల్డ్‌ని పెంచే ప్రణాళికలు కూడా కేంద్ర ప్రభుత్వం టేబుల్‌పై ఉన్నాయి.

  • 0
Posted

Public Provident Fund (PPF) - Big Changes From October 1st - You Must Know!🤔 #shorts #ppf #kowshikmaridi

 

  • 0
Posted

EPFO: Claiming EPF without Aadhaar card - ఆధార్‌ లేకుండానే ఈపీఎఫ్‌ క్లెయిమ్‌… వారికి మాత్రమే

ఉద్యోగుల భవిష్యత్తు నిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పీఎఫ్‌ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే క్రమంలో ఆధార్‌ కార్డ్‌ లింక్‌ చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. అయితే ఈ వెసులుబాటు అందరికీ కాదని కేవలం కొందరికి మాత్రమే అని తెలిపారు..

EPFO: ఆధార్‌ లేకుండానే ఈపీఎఫ్‌ క్లెయిమ్‌... వారికి మాత్రమే

ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ చేసుకోవాలంటే కొన్ని రకాల నిబంధనలు ఫాలో కావాలనే విషయం తెలిసిందే. వీటిలో ఆధార్‌ లింక్‌ ఒకటి. ఇందుకోసం ఉద్యోగులు కచ్చితంగా యూఎన్‌ఎన్‌ నెంబర్‌కు ఆధార్‌ను లింక్‌ చేయాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెబుతూ.. ఫిజికల్ క్లెయిమ్‌లను సెటిల్ చేయడానికి ఇకపై తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్‌ఓ ప్రకటించింది.

కొత్తగా సవరించిన విధానంలో భాగంగా ఈ మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మినహాయింపు అందరు ఉద్యోగులకు వర్తించదు. కొంతమంది ఉద్యోగులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని తెఇలపారు. భారతదేశంలో తమ అసైన్‌మెంట్ పూర్తి చేసి, ఆధార్ పొందకుండా స్వదేశానికి తిరిగి వెళ్లిన అంతర్జాతీయ వర్కర్లు, విదేశాలకు వలస వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందిన ఆధార్ లేని భారతీయులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.

ఆధార్‌ కార్డు లేకుండా నేపాలీ, భూటాన్‌ పౌరులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని చెబుతున్నారు. ఈ ఉద్యోగులు ఆధార్‌కు బదులుగా పాస్‌పోర్ట్‌లు లేదా వారి పౌరసత్వ గుర్తింపు వంటి సర్టిఫికెట్స్‌ను అల్టర్‌నెటివ్‌గా ఉపయోగించుకోవచ్చు. ‘డ్యూ డిలిజెన్స్’ ప్రక్రియలో భాగంగా, మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయాలని, పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్ రూ. 5 లక్షలకు మించి ఉంటే సంబంధిత యాజమాన్యాలతో వివరాలను ధ్రువీకరించాలని ఈపీఎఫ్‌వో అధికారులకు సూచించింది. సెటిల్‌మెంట్‌ సొమ్మును నెఫ్ట్‌ ద్వారానే బదిలీ చేయనున్నట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే ఈపీఎఫ్‌ఓ వచ్చే ఏడాది కీలక మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై పీఎఫ్‌ ఖాతాదారులు క్లెయిమ్‌ చేసుకున్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే విధానాన్ని మరింత సులభతరం చేయనుంది. ఏటీఎమ్‌ నుంచి పీఎఫ్‌ సొమమును విత్‌డ్రా చేసుకునే విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

...

Complete article

  • 0
Posted

EPFO: Important rules changed - ఈపీఎఫ్ఓలో కీలక నిబంధనల మార్పు.. ఇకపై వారి క్లెయిమ్స్‌కు నో ఆధార్

భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరికి రిటైర్‌మెంట్ సమయంలో ఆర్థిక భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా సొమ్ము పొదుపు చేస్తుంది. ఉద్యోగితో పాటు యజమాని సమానా వాటాతో ఉండే ఈ పీఎఫ్ విత్‌డ్రాకు మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పీఎఫ్ విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ తన నిబంధనలు మార్చే అవకాశం ఉంది. ఆ నిబంధనల వివరాలను తెలుసకుందాం.

ప్రస్తుత రోజుల్లో పీఎఫ్ విత్‌డ్రాకు ఆధార్ తప్పనిసరి. యూనివర్సల్ అకౌంట్ నంబర్‌ని ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంది. అయితే ఇటీవల కొన్ని వర్గాల ఉద్యోగులకు ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. దీంతో ఆధార్ లేని ఉద్యోగులు ఈపీఎఫ్ఓ క్లెయిమ్‌లు చేయవచ్చు.
 

ప్రస్తుత రోజుల్లో పీఎఫ్ విత్‌డ్రాకు ఆధార్ తప్పనిసరి. యూనివర్సల్ అకౌంట్ నంబర్‌ని ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంది. అయితే ఇటీవల కొన్ని వర్గాల ఉద్యోగులకు ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. దీంతో ఆధార్ లేని ఉద్యోగులు ఈపీఎఫ్ఓ క్లెయిమ్‌లు చేయవచ్చు.

ఆదార్ లేకుండా పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే పాస్‌పోర్ట్‌లు, పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు లేదా ఇతర అధికారిక గుర్తింపు కార్డుల వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలు అవుతుంది. అలాగే రూ. 5 లక్షలకు మించిన క్లెయిమ్‌లను ప్రాసెసర్ చేయాలంటే యజమాని ధ్రువీకరణ తప్పనసరి అవుతుంది.

భారత్‌లో పనిచేసి, ఆధార్‌ను పొందలేకపోయిన అంతర్జాతీయ ఉద్యోగులు తమ స్వదేశాలకు తిరిగి వస్తే వారి పీఎఫ్ విత్‌డ్రాకు ఆధార్ అవసరం లేదు. అలాగే విదేశీ పౌరసత్వం ఉన్న భారతీయ పౌరులు, నేపాల్, భూటాన్ పౌరులుశాశ్వతంగా విదేశాలకు వెళ్లిన భారతీయ పౌరులు పీఎఫ్ విత్‌డ్రాకు ఆధార్ అవసరం లేదని ఈపీఎఫ్ఓ ఇటీవల స్పష్టం చేసింది.

ఆదార్ లేకుండా పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే పాస్‌పోర్ట్‌లు, పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు లేదా ఇతర అధికారిక గుర్తింపు కార్డుల వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలు అవుతుంది. అలాగే రూ. 5 లక్షలకు మించిన క్లెయిమ్‌లను ప్రాసెసర్ చేయాలంటే యజమాని ధ్రువీకరణ తప్పనసరి అవుతుంది.

అయితే ఇలాంటి క్లెయిమ్‌లను ఆమోదించే ముందు అన్ని క్లెయిమ్‌లను జాగ్రత్తగా పరిశీలించాలని ఈపీఎఫ్ఓ అధికారులను ఆదేశించింది. ఇది అప్రూవల్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ ద్వారా ఈ-ఆఫీస్ ఫైల్ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ చేస్తారు.

ఉద్యోగులు అదే యూఏఎన్‌ను నిర్వహించాలని లేదా వారి మునుపటి సర్వీస్ రికార్డులను అదే యూఏఎన్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది . ఎందుకంటే ఇది క్లెయిమ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.

  • 0
Posted

EPFO: You can now approve your own withdrawals - గుడ్‌న్యూస్‌.. విత్‌డ్రా కోసం స్వయంగా మీరే ఆమోదించుకోవచ్చు.. పీఎఫ్‌ ఖాతాదారులకు మరో కొత్త సదుపాయం!

EPFO: చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బు విత్‌డ్రా విషయంలో మరింత సులభతరం కానుంది. ఉద్యోగులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. ఈపీఎఫ్‌వో నుంచి విత్‌డ్రా చేసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది. ఇది వచ్చే ఏడాదిలో అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి..

EPFO: గుడ్‌న్యూస్‌.. విత్‌డ్రా కోసం స్వయంగా మీరే ఆమోదించుకోవచ్చు.. పీఎఫ్‌ ఖాతాదారులకు మరో కొత్త సదుపాయం!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును స్వయంచాలక ప్రక్రియ ద్వారా ఉపసంహరించుకోవడానికి “స్వీయ-ఆమోదం” విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అంతే మీరు పీఎఫ్‌ విత్‌డ్రాను మీరే ఆమోదించుకోవచ్చు. ఇది వరకు పీఎఫ్‌ సంస్థ అప్రూవల్‌ వచ్చే వరకు ఆగాల్సి ఉండేది. అప్పుడు మన అకౌంట్లో డబ్బులు జమ అయ్యేవి. ఇప్పుడు ఎంప్లాయి తన పీఎఫ్‌ డబ్బు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత తానే స్వయంగా ఆమోదించుకునే సదుపాయం రానుంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ విధానం అందుబాటులోకి వస్తుందని ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ప్రస్తుతం పీఎఫ్‌ నిధులను ఉపసంహరించుకోవడంలో చెక్‌, ఇతర వివరాలు, సబ్‌స్క్రైబర్‌లు ఫారమ్‌లను సమర్పించి, ఆమోదాల కోసం వేచి ఉండాలి. ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఉద్యోగి తానే ఆమోదం చేసుకోవచ్చు. ప్రక్రియను చాలా వేగంగా, అవాంతరాలు లేకుండా చేస్తుంది. ఈ సిస్టమ్ అప్‌గ్రేడెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌లో పనిచేస్తుందని, మార్చి 2025 నాటికి సిద్ధం అవుతుందని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది.

చందాదారులు విద్య లేదా వివాహం కోసం పీఎఫ్‌ నిధులలో 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. హోమ్ లోన్ రీపేమెంట్ కోసం, ఉపసంహరణ పరిమితి 90% వద్ద వరకు ఉంటుంది. EPFO ప్రస్తుతం దాని IT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇది సభ్యులు సుదీర్ఘమైన మాన్యువల్ ఆమోద ప్రక్రియను దాటవేయడానికి అనుమతిస్తుంది. ఈ అప్‌గ్రేడ్‌లో భాగంగా చందాదారులు త్వరలో ఈపీఎఫ్‌ అధికారులచే ఇప్పటికే ఉన్న మాన్యువల్ చెక్‌ల ద్వారా కాకుండా, వారి ఉపసంహరణ మొత్తం గురించి నేరుగా EPFOకి తెలియజేయవచ్చు.

ప్రాసెస్ చేసిన క్లెయిమ్ మొత్తాన్ని కలిగి ఉండేలా EPFOకి లింక్ చేయబడిన డిజిటల్ వాలెట్‌ను ప్రవేశపెట్టవచ్చని కూడా నివేదికలు వెల్లడించాయి. ఈ ఫీచర్ పరిశీలనలో ఉంది. అయితే దీనిని ఖరారు చేయడానికి ముందు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)తో తదుపరి సంప్రదింపులు అవసరం. FY24 చివరి నాటికి EPFO మొత్తం కార్పస్ రూ. 24.75 లక్షల కోట్లు. ఈ మొత్తంలో దాదాపు 63% ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్‌లు, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు)తో సహా ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి ఉంది.

రూ. 1 లక్ష వరకు క్లెయిమ్‌ల కోసం ఆటో-ప్రాసెసింగ్

ఈపీఎఫ్‌వో ఇప్పటికే రూ. 1 లక్ష వరకు ముందస్తు క్లెయిమ్‌ల కోసం ఆటో-మోడ్ ప్రాసెసింగ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఒక్క మార్పు వల్ల 40% క్లెయిమ్‌లు మాన్యువల్ జోక్యం లేకుండా స్వయంచాలకంగా ప్రాసెస్ అవుతాయి. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా.. పీఎఫ్ విత్‌డ్రాలను వీలైనంత సులభతరం చేయడమే లక్ష్యమని అన్నారు. భవిష్యత్తులో చందాదారులు తమ పీఎఫ్ డబ్బును ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పించే ఆలోచన ఉందని ఆయన అన్నారు.

...

Complete article

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...