Jump to content
  • 2

H1-B, EAD, 485, GC, Citizenship... ​🇺🇸​


TELUGU

Question

11 answers to this question

Recommended Posts

  • 0

దేశీయంగా హెచ్-1బీ వీసా పునరుద్ధరణ కోసం పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన యూఎస్ఏ

జనవరి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు అప్లికేషన్లకు ఆహ్వానం

రెన్యూవల్ స్టేటస్‌లో ఉన్న హెచ్-1బీ వీసాదారులకు చక్కటి అవకాశం

వేలాది మంది ఐటీ నిపుణులకు ప్రయోజనం

cr-20240131tn65b99e0edd197.jpg

భారతీయ ఐటీ నిపుణులకు అగ్రరాజ్యం అమెరికా గుడ్‌న్యూస్ చెప్పింది. దేశీయంగా హెచ్-1బీ వీసా పునరుద్ధరణకు అవకాశమిస్తూ ఒక పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ నిర్ణయం వేలాది మంది ఇండియన్ టెకీలకు ప్రయోజనం చేకూర్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ జనవరి 29 నుంచి ఏప్రిల్ 1, 2024 వరకు, లేదా అన్ని అప్లికేషన్ స్లాట్‌లు నిండే వరకు ఈ రెండింట్లో ఏది ముందైతే అది చివరి తేదీగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం రెన్యూవల్ స్టేటస్‌లో ఉన్న హెచ్-1బీ వీసాదారులు అమెరికాకు వెళ్లక ముందే భారత్‌లోనే అప్లికేషన్‌ పెట్టుకొని పునరుద్ధరించుకోవచ్చు. గతేడాది జూన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఈ మేరకు ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే.

ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా హెచ్-1బీ వీసాను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పించడం దాదాపు 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమం ద్వారా వారానికి నాలుగు వేల దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. అప్లికేషన్ స్లాట్లను జనవరి 29, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 26 తేదీలలో విడుదల చేస్తామని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. సూచించిన తేదీల్లో మాత్రమే అప్లికేషన్లు స్వీకరిస్తామని, వారాంతపు పరిమితి పూర్తయ్యే వరకు మొదట స్వీకరించిన దరఖాస్తుకే ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. ఒక తేదీలో అప్లికేషన్‌ పెట్టలేని వారు మరో తేదీలో ప్రయత్నించవచ్చని వివరించింది. దరఖాస్తుదారు పాస్‌పోర్ట్, ఇతర అవసరమైన ధ్రువీకరణ పత్రాలు స్వీకరించిన తేదీ నుండి 6-8 వారాలపాటు ప్రాసెసింగ్ టైమ్ ఉంటుందని వివరించింది. పైలట్ ప్రోగ్రామ్‌లో వీసా పునరుద్ధరణ సాధ్యపడని వ్యక్తులు యూఎస్ ఎంబసీ లేదా విదేశాల్లోని కాన్సులేట్లలో దరఖాస్తు చేసుకొని హెచ్1వీసా పునరుద్ధరణను కొనసాగించవచ్చునని స్టేట్ డిపార్ట్‌మెంట్ వివరాలను వెల్లడించింది.

...

Read full article

Link to comment
Share on other sites

  • 0

అమెరికా వచ్చే వృత్తి నిపుణులకు ప్రత్యేకంగా హెచ్1బీ వీసాలు

లాటరీ పద్దతిలో వీసాల కేటాయింపు

దాంతో ఒక్కొక్కరు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్న వైనం

ఇకపై ఎన్ని దరఖాస్తులు చేసినా ఒకే అప్లికేషన్ గా పరిగణింపు

cr-20240131tn65ba7070418cb.jpg

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణులకు అమెరికా స్వర్గధామం అనడంలో అతిశయోక్తి లేదు. అనేక టెక్ కంపెనీలకు, దిగ్గజ సంస్థలకు పుట్టినిల్లయిన అమెరికాలో అత్యధిక వేతనాలు, ప్యాకేజీలు లభిస్తుండడంతో వివిధ రంగాల నిపుణులు అగ్రరాజ్యం బాటపడుతుంటారు. 

ఇలా పెద్ద సంఖ్యలో వలస వచ్చే వృత్తి నిపుణుల కోసం అమెరికా ప్రత్యేకంగా హెచ్1బీ వీసాలు మంజూరు చేస్తుంటుంది. డిమాండ్ ను తట్టుకోవడం కోసం లాటరీ పద్ధతిలో హెచ్1బీ వీసాలు కేటాయిస్తుంటుంది. దాంతో ఒక్కొక్కరు పెద్ద సంఖ్యలో వీసా రిజిస్ట్రేషన్ దరఖాస్తులు చేసుకుంటుండడం అమెరికాను పునరాలోచనలో పడేసింది. 

ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా, వాటిని ఒక అప్లికేషన్ గానే భావిస్తారు. "ఒక వ్యక్తి-ఒక దరఖాస్తు"... "దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు" అనే భావన కలిగించేలా ఈ నిబంధన తీసుకువచ్చినట్టు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) విభాగం వెల్లడించింది. 

అంతేకాదు, ఇకపై ప్రతి దరఖాస్తుదారు తన పాస్ పోర్టు, ప్రయాణ వివరాలకు సంబంధించి వాస్తవాలనే దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం అని తేలితే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు. 2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని యూఎస్ సీఐఎస్ తెలిపింది.

...

Read full article

Link to comment
Share on other sites

  • 0

నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఫీజులు పెంచిన అమెరికా

హెచ్1బీ, ఎల్1, ఈబీ5 వీసాల ఫీజులు పెంపు

పెంచిన రేట్లు ఏప్రిల్ 1 నుంచి వర్తింపు

cr-20240201tn65bbc82a2e4c2.jpg

అగ్రరాజ్యం అమెరికా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఫీజులు పెంచింది.  హెచ్1బీ, ఎల్1, ఈబీ5 వీసాల ఫీజు, దరఖాస్తు ఫీజును పెంచుతూ ఓ ప్రకటన చేసింది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 

వీసా                         పాత ఫీజు              కొత్త ఫీజు
హెచ్1బీ                   రూ.38,160         రూ.64,706
హెచ్1బీ రిజిస్ట్రేషన్       రూ.829              రూ.17,835
ఎల్1                       రూ.38.160         రూ.1,14,887
ఈబీ6                      రూ.3,04,845      రూ.9,25,718  

హెచ్1బీ వీసా: ఇతర దేశాల వృత్తి నిపుణులకు అమెరికాలో ప్రవేశం కోసం ఈ వీసాలు జారీ చేస్తారు. 
ఎల్1 వీసా: వివిధ దేశాల్లో బ్రాంచిలు ఉన్న అమెరికన్ కంపెనీలు ఆయా బ్రాంచిల నుంచి అమెరికాలో పనిచేసేందుకు ఉద్యోగులను రప్పిస్తుంటాయి. ఈ అంతర్గత బదిలీలపై వచ్చేవారికి ఇచ్చే వీసాను ఎల్1 వీసాగా పరిగణిస్తారు.


ఈబీ5 వీసా: అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే వీసాలు ఇవి. రూ.4 కోట్లు, అంతకుమించి పెట్టుబడి పెట్టగలిగి ఉండి, కనీసం 10 మందికి ఉపాధి కల్పించగల పెట్టుబడిదారులకు, వారి కుటుంబ సభ్యులకు ఈబీ5 వీసాలు కేటాయిస్తారు.

...

Read full article

Link to comment
Share on other sites

  • 0

అమెరికా వీసా పొందుతున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది భారతీయ విద్యార్థులకు ఏకంగా 1.4 లక్షల వీసాలు జారీ చేసినట్టు అమెరికా ఎంబసీ ప్రకటించింది.

1_4e9e2df23c_V_jpg--799x414-4g.webp

ఎన్నారై డెస్క్: అమెరికా వీసా (US visa) పొందుతున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది భారతీయ విద్యార్థులకు ఏకంగా 1.4 లక్షల వీసాలు జారీ చేసినట్టు అమెరికా ఎంబసీ (US Embassy in India) ప్రకటించింది. తద్వారా వరుసగా మూడో ఏడాది రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేశామని తెలిపింది ( US Issues Record 1.4 Million Visas To Indians In 2023). ఇతర దేశాలన్నిటికంటే ఎక్కువగా భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేశామని వెల్లడించింది. అంతేకాకుండా, వీసా కోసం వేచి చూసే సమయాన్ని రికార్డు స్థాయిలో 75 శాతం మేర తగ్గించామని పేర్కొంది.

2022తో పోలిస్తే గతేడాది యూఎస్ వీసా దరఖాస్తుదారుల సంఖ్య 60 శాతం మేర పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది దరఖాస్తుదారుల్లో ఒక భారతీయుడున్నారు. గతేడాది మొత్తం 7 లక్షల పర్యాటక వీసాలు జారీ అయ్యాయి. అన్ని కేటగిరీల వీసాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. సిబ్బంది సంఖ్య పెంచడం, అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో పర్యాటక వీసాల వెయిటింగ్ పీరియడ్‌ను 1000 రోజుల నుంచి 250 రోజులకు తగ్గించామని అమెరికా ఎంబసీ పేర్కొంది. ప్రపంచంలోని అమెరికా వీసా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికమని వెల్లడించింది. మిలియన్ మందికి పైగా ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ స్టూడెంట్ల వాటా పావుశాతానికి పైగానే ఉంటుందని పేర్కొంది.

...

Read full article

Link to comment
Share on other sites

  • 0

not possible to get a GC for new comers anymore?

even Pakistanis can get GC in a year "directly" but Indians cannot get it in their lifetime even after filing H-1B route going forward

NO more Green Cards! New Rules In America | H-1B & GC Process Guide For Indians | Rahul Reddy | TV

 

  • Best 1
Link to comment
Share on other sites

  • 0

భారత్‌కు చెందిన వృద్ధురాలు దాయి‌బాయ్‌కు అమెరికా పౌరసత్వం

అమె ఫొటోను ట్వీట్ చేస్తూ అమెరికా వలసల శాఖ హర్షం

పౌరసత్వం కోసం ఓ జీవితకాలం వేచి చూడాల్సి రావడంపై నెట్టింట ఆగ్రహం

cr-20240407tn66120e0627f1c.jpg

అమెరికాలో 99 ఏళ్ల భారతీయురాలికి పౌరసత్వం లభించడం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పౌరసత్వం కోసం ఇంత సుదీర్ఘకాలం వేచి చూడాల్సి రావడం దురదృష్టకరమని అనేక మంది వ్యాఖ్యానించారు. 

ఓర్లాండోలోని అమెరికా వలసల శాఖ దాయి‌బాయ్ అనే వృద్ధురాలికి పౌరసత్వం లభించిన విషయాన్ని ఇటీవల ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ‘‘వయసనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని అంటారు. దాయి‌బాయ్ విషయంలో ఇది రుజువైంది. భారత్‌కు చెందిన దాయి‌బాయ్ ఇటీవలే అమెరికా పౌరసత్వ ప్రమాణం చేశారు’’ అని అమెరికా వలసల శాఖ తన ట్వీట్‌లో పేర్కొంది. దాయిబాయ్ కుమార్తె తమ కార్యాలయంలోనే పనిచేస్తోందని వెల్లడించింది. 

కాగా, ఈ ట్వీట్‌పై అనేక మంది సెటైర్లు పేల్చారు. కొందరు విచారం వ్యక్తం చేశారు. హెచ్-1బీ వీసాదారులు కొందరు తమ జీవితకాలంలో గ్రీన్ కార్డు పొందే పరిస్థితి కూడా లేదని నెటిజన్లు వాపోయారు. పసిపాపగా అమెరికాలో కాలుపెట్టిన దాయి‌బాయ్ వృద్ధాప్యంలో పౌరసత్వం పొందిందంటూ సెటైర్లు పేల్చారు. గ్రీన్ కార్డులు, పౌరసత్వం కోసం కొన్ని సందర్భాల్లో 150 ఏళ్లు కూడా వేచి చూడాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. ఇటీవల కాలంలో అమెరికా వీసాల జారీలోనూ చాలా జాప్యం జరుగుతోందని కొందరు పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

గుజరాత్ to అమెరికా - లక్షల్లో Dunki జంపింగ్ | #dunki #Donkeyflight | Journalist C Vanaja

 

Link to comment
Share on other sites

  • 0

Dunki Route: అమెరికా కల కోసం 33 లక్షలు ఖర్చు చేసి, 22 నెలలు జైల్లో కూడా ఉన్నాడు, కానీ BBC Telugu

 

Link to comment
Share on other sites

  • 0

H1B Visa for IT Employees in US | H1B Visa Requirements and Application | Journalist Ashok | Eha

 

Link to comment
Share on other sites

  • 0

2022లో 65,960 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

మరో 128,878 మంది మెక్సికన్లకు అమెరికా పౌరసత్వం

విదేశాల్లో పుట్టి అమెరికా పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య 2,831,330

cr-20240422tn6625ca3113386.jpg

భారతీయులు భారీ స్థాయిలో అమెరికా పౌరసత్వం పొందుతున్నారు. అమెరికా పౌరులుగా మారిన విదేశీయుల్లో సంఖ్యాపరంగా భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో మెక్సికో ప్రజలు ఉన్నారు. అమెరికా సెన్సస్ బ్యూరో తాజా గణాంకాల ప్రకారం, 2022లో 128,878 మంది మెక్సికన్లు అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. 65,960 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు. ఆ తరువాత స్థానాల్లో ఫిలిప్పీన్స్, క్యూబా, డోమినికన్ రిపబ్లిక్, వియత్నాం, చైనీయులు ఉన్నారు. 

సెస్సస్ బ్యూరో ప్రకారం, 2022లో అమెరికాలో ఉంటున్న మొత్తం విదేశీయుల సంఖ్య 46 మిలియన్లు. దేశ జనాభాలో వీరి సంఖ్య 14 శాతం. అమెరికాలోని విదేశీయుల్లో దాదాపు 53 శాతం మంది తమకు అమెరికా పౌరసత్వం ఉన్నట్టు తెలిపారు. ఇక 2022లో మొత్తం 969,380 మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. 

ఇక 2023 లెక్కల ప్రకారం, విదేశాల్లో పుట్టి అమెరికా పౌరసత్వం పొందిన మొత్తం భారతీయుల సంఖ్య 28,31,330. అమెరికా పౌరసత్వం ఉన్న విదేశీయుల్లో మెక్సికన్లు (1,06,38,429 మంది) తొలిస్థానంలో నిలవగా భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. అయితే, విదేశాల్లో పుట్టి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న వారిలో 42 శాతం మందికి అమెరికా పౌరులయ్యే అర్హత లేదని ఈ నివేదికలో తేలింది. ఇక గ్రీన్ కార్డు ఉన్న 2,90,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం పొందే అర్హత ఉందని ప్రభుత్వ గణాంకాలు తేల్చాయి. 

అమెరికా వీసా, గ్రీన్ కార్డు, పౌరసత్వానికి సంబంధించిన బ్యాక్‌లాగ్‌ల గురించి కూడా పలు వివరాలు వెల్లడయ్యాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 8,23,702 మంది పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,08,000 పౌరసత్వ అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది కాస్త తక్కువ.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Student Visa: అమెరికా వెళ్లే భార‌త విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. త్వ‌ర‌లో వీసా స్లాట్లు ఓపెన్‌

03-05-2024 Fri 10:40 | National

స్టూడెంట్ వీసా ఇంట‌ర్వ్యూ స్లాట్ల‌ను విడుద‌ల చేసేందుకు రెడీ అవుతున్న యూఎస్

తొలి విడ‌త‌గా ఈ నెల రెండో వారంలో వీసా స్లాట్ల‌ విడుద‌ల‌

ఆగ‌స్టు రెండోవారం వ‌ర‌కు అందుబాటులోకి వీసా స్లాట్లు

cr-20240503tn663471e144132.jpg

ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా వెళ్లే భార‌త విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌. యూఎస్ స‌ర్కార్ స్టూడెంట్ వీసా ఇంట‌ర్వ్యూ తాలూకు స్లాట్ల‌ను విడుద‌ల చేసేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా ద‌శ‌ల‌వారీగా స్లాట్ల‌ను విడుద‌ల చేయాల‌ని భావిస్తోంది. ఈ నెల రెండోవారం నుంచి ఆగ‌స్టు రెండోవారం వ‌ర‌కు స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక అగ్ర‌రాజ్యంలో ఫాల్ సీజ‌న్‌కు సంబంధించిన సెమిస్ట‌ర్ ఆగ‌స్టు-సెప్టెంబ‌ర్ మ‌ధ్య ప్రారంభం అవుతుందనే విష‌యం తెలిసిందే. 

కాగా, ప్ర‌తియేటా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్య‌లో విద్యార్థులు అమెరికా వెళ్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే గ‌త కొంత‌కాలంగా వీసా ఇంట‌ర్వ్యూ తేదీల కోసం చాలామంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఢిల్లీలోని అమెరికా రాయ‌బార కార్యాల‌యంతో పాటు ముంబై, చెన్నై, హైద‌రాబాద్‌, కోల్‌క‌తా కాన్సులేట్ కార్యాల‌యాల్లో స్టూడెంట్స్ కు సేవ‌లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు హైద‌రాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జ‌న‌ర‌ల్ ఆఫీస్ అధికారి ఒక‌రు మీడియాతో తెలిపారు. 

అలాగే త‌ర‌చుగా వ‌స్తున్న వెబ్‌సైట్ స‌మ‌స్య‌ను కూడా చ‌క్క‌దిద్దిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. వీసా స్లాట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను 2023 జులైలో ఆధునికీక‌రించామ‌ని చెప్పిన అధికారులు, సాంకేతిక లోపాల‌ను త‌గ్గించేందుకు నూత‌న వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఇంకా వెబ్‌సైట్ ఇబ్బందులు ఉంటే సాయం కోసం support-india@ustravelsdocs.com ను సంప్ర‌దించాల‌ని కోరారు. 

ఈ సంద‌ర్భంగా అధికార ప్ర‌తినిధి మాట్లాడుతూ.. "యూఎస్‌-ఇండియా మధ్య ఉన్న స‌త్స‌సంబంధాల దృష్ట్యా భార‌త్‌కు అమెరికా అధిక ప్రాధాన్యం ఇవ్వ‌డం జ‌రుగుతోంది. 2023లో ఏకంగా 11 ల‌క్ష‌ల నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల‌ను ఇండియ‌న్స్‌కు అగ్ర‌రాజ్యం జారీ చేసింది. అలాగే 3.75 ల‌క్ష‌ల మందికి పిటిష‌న్ ఆధారిత తాత్కాలిక ఉపాధి వీసాల‌ను (హెచ్‌1బీ) కూడా ఇవ్వ‌డం జ‌రిగింది. 

ఇక భార‌తీయుల నుంచి వీసాల కోసం భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే హైద‌రాబాద్‌లో 300 మిలియ‌న్ డాల‌ర్లు వెచ్చించి కొత్త కార్యాల‌యాన్ని తెరిచాం. స్టెమ్ కోర్సుల‌తో పాటు ఇంజినీరింగ్‌లో ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌, మైక్రో ఇంజ‌నీరింగ్‌, కంప్యూట‌ర్ కోర్సులైన ఏఐ, రోబోటిక్స్‌ల‌పై కూడా భార‌తీయ విద్యార్థులు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అటు అమెరికా-భార‌తీయ యూనివ‌ర్సిటీలు నిర్వ‌హిస్తున్న డ్యూయ‌ల్ డిగ్రీల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. 

2022-23 గ‌ణాంకాల ప్ర‌కారం యూఎస్‌లో ఆప్ష‌న‌ల్ ప్రాక్టిక‌ల్ ట్రైనింగ్ (ఓపీటీ) కి సంబంధించి 69,062 మంది విద్యార్థుల‌తో ఇండియా మొద‌టి స్థానంలో ఉంది. వ‌రుస‌గా మూడోసారి ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌తో పోలిస్తే ఇండియ‌న్ స్టూడెంట్స్ భారీ సంఖ్య‌లో అమెరికాలో చదువుకునేందుకు వెళ్ల‌డం జ‌రిగింది" అని అధికారి ప్ర‌తినిధి చెప్పుకొచ్చారు.    

కాగా, తాజా లెక్క‌ల ప్ర‌కారం అమెరికాలో చ‌దువుతున్న భార‌తీయ విద్యార్థుల సంఖ్య 2,68,923కు చేరింది. ఇది ఆల్‌టైమ్ రికార్డుగా యూఎస్ స‌ర్కార్ వెల్ల‌డించింది. యూఎస్‌లో చ‌దువుకుంటున్న ప్ర‌తి మిలియ‌న్ విదేశీ విద్యార్థుల‌లో 25 శాతం మంది ఇండియ‌న్సే ఉంటున్నారు. 2023లో గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య 63 శాతం పెర‌గ‌గా, అండ‌ర్ గ్రాడ్యుయేట్స్ 16 శాతం పెరిగిన‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...