Jump to content
  • 3

CM Jagan Bus Yatra: వైసిపి మేమంత సిద్దం ఎన్నికల ప్రచారం


Vijay

Question

Recommended Posts

  • 0

మేమంతా సిద్ధం అంటూ జగన్ చేస్తున్న బస్ యాత్ర ఎలా ఉండబోతుంది.. ఎలా ఉంది? JAGAN Bus Yatra

 

Link to comment
Share on other sites

  • 0

జోష్‌లో వైసీపీ...నిరుత్సాహంలో కూట‌మి | YSRCP Graph Increase and TDP Graph Downfall | greatandhra.com

 

Link to comment
Share on other sites

  • 0

Jagan: మే 13న పేదలకు, పెత్తందార్లకు మధ్య కురుక్షేత్రం జరగబోతోంది: సీఎం జగన్

మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ బస్సు యాత్ర

నేడు ఎమ్మిగనూరులో సభ

పేదలంతా ఒకవైపు, పెత్తందార్లు ఒకవైపు అంటూ సీఎం జగన్ వ్యాఖ్యలు

కూటమి పేరుతో కుట్రలు చేసే మోసగాళ్లను నమ్మవద్దని పిలుపు

cr-20240329tn6606c273cb75a.jpg

ఏపీ సీఎం జగన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మే 13న జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రం అని అభివర్ణించారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అని... పేదలంతా ఒక వైపు, పెత్తందార్లు మరో వైపు అని పేర్కొన్నారు. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్న మోసగాళ్లను నమ్మవద్దని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. 

"పొత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ పేదలకు అండగా నిలిచేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జెండాలు జత కట్టిన పెత్తందార్లను ఓడించేందుకు మీరు సిద్ధమా?" అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో పేదల వ్యతిరేకులను ఓడించండి... ఎన్నికల్లో గెలిచేది మనమే... ఏ కుట్రలూ మనల్ని అడ్డుకోలేవు అని ధీమా వ్యక్తం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jagan: కోడుమూరు చేరుకున్న జగన్ బస్సు యాత్ర.. ఈరోజు రూట్ మ్యాప్ ఇదిగో!

మూడో రోజుకు చేరిన జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర

మధ్యాహ్నం ఎమ్మిగనూరులో బహిరంగ సభ

జగన్ వెంట ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

cr-20240329tn660667a8c6f61.jpg

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేబట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర మూడోరోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పెంచికలపాడు నుంచి మూడో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. మూడో రోజు బస్సు యాత్ర సందర్భంగా జగన్ ఎక్స్ వేదికగా... 'కర్నూలు జిల్లా సిద్ధమా?' అని ట్వీట్ చేశారు. కాసేపటి క్రితం బస్సుయాత్ర కోడుమూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ ను వైసీపీ శ్రేణులు గజమాలతో సత్కరించాయి. జగన్ కు సంఘీభావంగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు.

జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్ ఖాన్, జరదొడ్డి సుధాకర్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉన్నారు. ఈనాటి బస్సు యాత్రలో ఎమ్మిగనూరులో బహిరంగ సభను నిర్వహించనున్నారు. పత్తికొండ దగ్గర కేజీఎన్ ఫంక్షన్ హాల్లో రాత్రికి జగన్ బస చేస్తారు. మూడో రోజు యాత్ర పెంచికలపాడు, రామచంద్రాపురం, కోడుమూరు, హంద్రీ కైరవాడి, గోనెగండ్ల, రాళ్లదొడ్డి, ఎమ్మిగనూరు, అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బినిగేరే, ఆస్పరి, చిన్న హుల్తి మీదుగా కొనసాగుతుంది.

...

Complete article

20240329fr66066657c2c4f.jpg

Link to comment
Share on other sites

  • 0

Vallabhaneni Vamsi: జగన్ ప్రభుత్వమే ఉత్తమమైనది: వల్లభనేని వంశీ

జగన్ పాలనలో పేదలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్న వంశీ

జగన్ ప్రభుత్వంపై తనకు కూడా ఎంతో తృప్తి ఉందని వ్యాఖ్య

ప్రజలు ఓటు వేసిన వారే గెలుస్తారన్న వంశీ

cr-20240330tn6607dc621948c.jpg

ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రంలోని పేద వర్గాలన్నీ ఆత్మగౌరవంతో బతుకుతున్నాయని వల్లభనేని వంశీ అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేది వైసీపీ ప్రభుత్వమని చెప్పారు. జగన్ ఐదేళ్ల పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సాయం చేసిందని అన్నారు. తాను టీడీపీ ప్రభుత్వంలో పనిచేశా, వైసీపీ ప్రభుత్వంలో పని చేశానని... జగన్ ప్రభుత్వమే ఉత్తమమైనదని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ ప్రభుత్వంపై ప్రజలతో పాటు తనకు కూడా ఎంతో సంతృప్తి ఉందని అన్నారు. తనను ఓడిస్తామని నియోజకవర్గంతో సంబంధం లేని వాళ్లు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. గెలుపు ఓటములను నిర్ణయించేది ప్రజలని... నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వారు గెలుస్తారని చెప్పారు. వార్తల్లో నిలిచేందుకు కొత్తగా వచ్చిన వాళ్లు ఏదో ఒకటి మాట్లాడుతుంటారని విమర్శించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jagan: నేడు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్న జగన్ మేమంతా సిద్ధం యాత్ర.. రూట్ మ్యాప్ ఇదిగో!

నాలుగో రోజుకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర

ఉదయం 11 గంటలకు గుంతకల్ నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న యాత్ర

11.30 గంటలకు గుత్తిలో రోడ్ షో

cr-20240330tn66079304c6c4f.jpg

ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల్లో కొనసాగిన యాత్ర... ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తోంది. నిన్న రాత్రి కర్నూలు జిల్లా పత్తికొండలోని కేజీఎన్ ఫంక్షన్ హాలు వద్ద జగన్ బస చేశారు. ఈనాటి యాత్ర పత్తకొండ నుంచి ప్రారంభమవుతుంది. గుంతకల్ నియోజకవర్గం బసినేపల్లి వద్ద యాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. గుత్తిలో జగన్ రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రికి ధర్మవరం నియోజకవర్గం సంజీవపురంలో జగన్ బస చేస్తారు. 

...

Complete article

మేమంతా సిద్ధం యాత్ర నేటి రూట్ మ్యాప్:

20240330fr66079156296bb.jpg

Link to comment
Share on other sites

  • 0

Jagan: 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా?: మదనపల్లె సభలో సీఎం జగన్

మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ ఎన్నికల ప్రచారం

నేడు మదనపల్లెలో సభ

ప్రతిపక్షంలో ఉన్న వారు విడివిడిగా రాలేకపోతున్నారని ఎద్దేవా

ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరూ చేయలేకపోతున్నారని వ్యాఖ్యలు

cr-20240402tn660c06b8e2095.jpg

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా నేడు మదనపల్లె సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఏపీలో ఎన్నికలు వస్తున్నాయని, కానీ ప్రతిపక్షంలో ఉన్నవారంతా విడివిడిగా రాలేపోతున్నారని ఎద్దేవా చేశారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదని ఎత్తిపొడిచారు. అధికారం కోసం గుంపులుగా, తోడేళ్ల మందలా, జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తున్నారని విమర్శించారు. జెండాలు జతకట్టడమే వారి పని అని, మీ గుండెల్లో గుడికట్టడమే జగన్ చేసిన పని అని పేర్కొన్నారు.

ఇలాంటి పొత్తు చూసి భయపడేవారు లేరు

మీ బిడ్డ ప్రతి గుండెలో ఉన్నాడు. మీ గుండెల్లో మన ప్రభుత్వం ఉంది. ఇవాళ మీ బిడ్డ ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడండి. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ.... ఇంతమంది ఒక్క జగన్ ను ఎదుర్కొనేందుకు కుట్రపూరితంగా ఏకమవుతున్నారు. కానీ వారందరికీ తెలియని విషయం ఒకటుంది. 

99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా? అటు, గతంలో పరీక్షలు  రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్ ఈసారి పరీక్ష పాసవుతాడా? మేనిఫెస్టోను బైబిల్ గానూ, ఖురాన్ గానూ, భగవద్గీతగానూ భావించి 99 శాతం వాగ్దానాలను నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు, 10 శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో నెరవేర్చని మోసకారి బాబు, ఆయన కూటమి ఈసారి నిలబడగలుగుతుందా? 

విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చినా, ఇలాంటి పొత్తులను చూసి మన అభిమానులు కానీ, మన పార్టీ  నేతలు  కానీ, మన వాలంటీర్లు కానీ, ఇంటింటా అభివృద్ధి అందుకున్న పేదలు కానీ... వీరిలో ఏ ఒక్కరైనా భయపడతారా?

ఆ నైతికత మాకు మాత్రమే ఉంది
 
ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ యుద్ధానికి మనం ఎలా సిద్ధం అయ్యామంటే... ఇంటింటికీ అందితేనే అది సంక్షేమం అని చూపించాం కాబట్టి, గ్రామానికి మంచి చేయడం అంటే ఇదీ అని చూపించాం కాబట్టి, మంచి చేసే ప్రక్రియలో ఎక్కడా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు కాబట్టి, గత ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు... వారికి జరగాల్సిన మంచి వారికి జరగాలి అని వారికి సంక్షేమం అందించాం కాబట్టి, ప్రతి ఒక్కరికీ ఇలా మేలు చేయగలిగాం కాబట్టి, గతంలో ఎన్నడూ ఇలా రాజకీయాల్లో జరగలేదు కాబట్టి, గతంలో రాష్ట్రంలో ఇలాంటి పాలన ఎన్నడూ చూడనట్టుగా చేయగలిగాము కాబట్టి... ఇవాళ మనకు మాత్రమే ఇంటింటికీ వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు ఉంది. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వారిని గత ప్రభుత్వం మీకు ఏం చేసింది అని అడిగి, మనం ఏం చేశామో వారిని అడిగి వారి మనసును తట్టి, వారి హృదయాన్ని గెలిచి, జగన్ సీఎంగా ఉంటేనే ఈ పథకాలన్నీ అమలవుతాయని చెప్పగలిగే నైతికత మనకు మాత్రమే ఉంది.

మళ్లీ ఎందుకు గెలవాలంటే...

ఈసారి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 లోక్ సభ స్థానాలతో మళ్లీ మనమే ఎందుకు గెలవాలి అంటే... మన అక్కచెల్లెమ్మలను ఈ ఐదేళ్ల మాదిరే వచ్చే ఐదేళ్లు కూడా ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలి. కుటుంబాలకు మూలం అక్కచెల్లెమ్మలు. పథకాల సాయంతో వారిని మరింత బలంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో మళ్లీ అధికారం అడుగుతున్నాం. గతంలో ఎవరూ చేయని విధంగా, ఎవరికీ ఆలోచన రాని విధంగా రూ.2.70 లక్షల కోట్లు సంక్షేమం కింద పారదర్శకంగా, అవినీతిరహితంగా అందించాం. 

చంద్రబాబు పేరు చెబితే ఏమీ గుర్తుకు రాదు

బటన్ నొక్కి నేరుగా డీబీటీ ద్వారా అందించింది రూ.2.70 లక్షల కోట్లు అయితే, నాన్ డీబీటీ కూడా కలిపితే... నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు, వారి పిల్లలకు అందించే గోరుముద్ద, విద్యార్థులకు అందించే ట్యాబ్ లు, విద్యా దీవెన... ఇలాంటివన్నీ కలుపుకుంటే ఈ 58 నెలల కాలంలో అక్షరాలా రూ.3.75 లక్షల కోట్లు మా అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చాం. ఎక్కడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు, ఒక్క రూపాయి లంచం లేదు, ఒక్క రూపాయి దోపిడీ లేదు, ఒక్క రూపాయి కమీషన్ లేదు... ఇదీ మన ట్రాక్ రికార్డు! 

అదే చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాదు, ఆయన చేసిన ఏ స్కీము గుర్తుకురాదు. అదే... మీ జగన్ పేరు చెబితే... వార్డు/గ్రామ సచివాలయం, వాటిలో పది శాశ్వత ఉద్యోగాలు, ఇంటికే వచ్చే వాలంటీర్లు, వారు అందించే పెన్షన్, లంచాలు, వివక్ష లేని పాలన, బటన్ నొక్కితే అక్కచెల్లెమ్మల ఖాతాలో నమోదయ్యే ఆర్థికసాయం, విలేజ్ క్లినిక్ లు, ఉచితంగా మందులు, ఉచితంగా వైద్య పరీక్షలు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం, ప్రపంచస్థాయి చదువులు, పిల్లల చేతుల్లో ట్యాబ్ లు, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన, రైతు భరోసా, గ్రామాల్లో ఆర్బీకేలు, రైతులకు సున్నా వడ్డీ, రైతన్నలకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతన్నలకు ఉచిత పంట బీమా, రైతన్నకు ఇన్ పుట్ సబ్సీడీ... ఇవన్నీ గుర్తుకు వస్తాయి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ అన్ని వర్గాలను ఆదుకునేది ఎవరూ అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్.

...

Complete article

  • Like 1
Link to comment
Share on other sites

  • 0

YS Jagan: మీరంతా అరుంధతి సినిమా చూశారా?: సీఎం జగన్

02-04-2024 Tue 19:27 | Andhra

మదనపల్లెలో వైసీపీ మేమంతా సిద్ధం సభ

హాజరైన సీఎం జగన్

చంద్రబాబు, పవన్, మోదీలను టార్గెట్ చేస్తూ విమర్శలు

cr-20240402tn660c0ecbcde2a.jpg

ఏపీ సీఎం జగన్ మదనపల్లెలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సభ సందర్భంగా ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడుకుందాం... మాట్లాడదామా, వద్దా? అన్నారు. 

"ఈ ఎన్నికల్లో మనం పోరాడుతోంది ఎవరితోనో తెలుసా... అబద్ధాలనే పునాదులుగా, మోసాలనే అలవాటుగా మార్చుకున్న ఓ జిత్తులమారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. ఆ ముఠా నాయకుడి పేరు నారా చంద్రబాబు నాయుడు! 

మీరంతా అరుంధతి సినిమా చూశారా? ఆ సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా, ఇప్పుడు ఐదేళ్ల తర్వాత చంద్రబాబు అనే పసుపుపతి అధికారం కోసం వదల బొమ్మాళీ వదల అంటున్నాడు... పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడుతున్నాడు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నాడు. 

ఈ పసుపుపతి 2014లోనూ ఇదే మాదిరి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు. ఇంటింటికీ హామీ పత్రం పంపించాడు. రైతులకు రుణమాఫీ అన్నాడు... చేశాడా? పొదుపు సంఘాలకు రుణమాఫీ అన్నాడు... చేశాడా? ఆడబిడ్డ పుట్టగానే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు... కనీసం ఒక్కరికైనా ఒక్క రూపాయి అని డిపాజిట్ చేశాడా? 

ఇంటింటికీ ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలనెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నాడు... ఇచ్చాడా? అర్హులైన వారికి 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని హామీ ఇచ్చారు... హామీ పత్రం మీద మోదీ బొమ్మ, దత్తపుత్రుడి బొమ్మ కూడా వేసుకున్నారు... చంద్రబాబు సంతకం పెట్టిన పాంప్లెట్ ఇది. 

కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం అయినా ఇచ్చాడా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు, రాష్ట్రాన్ని సింగపూర్ ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు... ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు... మన మదనపల్లెలో అలాంటిదేమైనా కనిపిస్తోందా? ఇవి ముఖ్యమైన హామీలు... ఆయన మేనిఫెస్టో చూస్తే 650 హామీలు కనిపిస్తాయి. 

ముఖ్యమైన హామీల పరిస్థితే ఇలా ఉంటే, ఇక మేనిఫెస్టో సంగతి దేవుడెరుగు! ఆ మేనిఫెస్టో ఎవరికీ కనపడదు... ఎన్నికలైపోగానే చెత్తబుట్టలో ఉంటుంది... గతంలో జరిగింది ఇదే! మరి ఇదే పొత్తు, ఇదే ముగ్గురు, ఇవే పార్టీలు... గతంలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకుండా, మీటింగులు పెడుతూ మరోసారి ఇదే డ్రామా ఆడుతున్నారు. 2014 కంటే ఇంకా ఎక్కువ హామీలు ఇస్తూ మరో మేనిఫెస్టోతో డ్రామాకు తెరలేపుతున్నారు. 

మళ్లీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికీ బంగారం, ఇంటికో బెంజ్ కారు అంటున్నారు... సూపర్ సిక్స్ అంటున్నారు! దీని గురించి ప్రజలు ఆలోచించాలి. మళ్లీ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్న ఈ పశుపతిని, ఈ పసుపుపతిని ఏ ఒక్కరైనా నమ్మవచ్చా? నమ్మినవారిని నట్టేట ముంచి, అధికారం దక్కించుకోవడానికి, మరోసారి మన రాష్ట్రాన్ని దోచుకోవాలన్నది బాబు ప్లాన్. 

ఈ మనిషికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు... వీళ్లకు అధికారం కావాల్సింది దోచుకోవడం కోసం, దోచుకున్నది పంచుకోవడం కోసం. మరి ఇలాంటి బాబుకు, ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా వద్దా? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం వద్దన్న వాళ్లకు బుద్ధి  చెప్పాలా వద్దా? 

పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులకు వెళ్లి అడ్డుకున్న ఇలాంటి పార్టీకి సమాధి కట్టండి. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడండి. 

బీసీల తోకలు కత్తిరిస్తా అన్న ఇదే చంద్రబాబు తోకను, ఆ బాబును వెనకేసుకొస్తున్న తోకలను కూడా కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. నాన్న గారు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ తో, మైనారిటీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాటమాడుతున్న ఈ చంద్రబాబుకు, ఈ కూటమికి 30 చెరువుల నీళ్లు తాగించండి. 

జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేది ఏంటో తెలుసా... మీకు మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లోనే ఉంటుంది... అధికారంలో ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ఇచ్చిన ప్యాకేజిని గటగటా తాగేసి, తన వారిని తాకట్టు పెట్టిన గ్లాసు సింకులోనే ఉంటుంది. ఇది ప్రజల మాట!... అంటూ సీఎం జగన్ ప్రసంగించారు.

...

Complete article

  • Haha 1
Link to comment
Share on other sites

  • 0

CM Jagan Full Speech at Madanapalle Public Meeting | Memantha Siddham | YSRCP Bus Yatra | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Tiller tipper lorry driver as YSRCP MLA mocked by Chandrababu

CM Jagan Strong Counter To Chandrababu Naidu | YSRCP Singanamala Candidate Veeranjaneyulu

 

Orey Babu, what is the qualification of your Pawala? Inter failed? 10th failed??

:emoji-lol:

Link to comment
Share on other sites

  • 0

🔴LIVE : CM YS Jagan Memantha Siddham Bus Yatra || Day 7 || Damalacheruvu Road Show

 

Link to comment
Share on other sites

  • 0

YS Jagan | కూటమిని మరోసారి తరమి కొట్టాలి : సీఎం వైఎస్‌ జగన్‌ 

YS Jagan | ఏపీలో కూటిమి పేరుతో ఎన్నికలకు వస్తున్న పార్టీలను మరోసారి తరమి కొట్టాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌(YS Jagan) పిలుపునిచ్చారు.

YS-Jagan-25_V_jpg--816x480-4g.webp?sw=17

అమరావతి : ఏపీలో కూటిమి పేరుతో ఎన్నికలకు వస్తున్న పార్టీలను మరోసారి తరమి కొట్టాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌(YS Jagan) పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా మదనపల్లెలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు 99శాతం హామీలు నెరవేర్చామని, ఇంటింటికీ వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు వైసీపీకే ఉందని పేర్కొన్నారు. జగన్‌ సీఎంగా ఉంటేనే పథకాలన్నీ కొనసాగుతాయని అన్నారు. లంచాలు, వివక్ష లేని ఐదేండ్ల వైసీపీ (YSP) పాలనలో రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.

చంద్రబాబు (Chandra Babu) పేరు చెబితే ఒక పథకం కూడా గుర్తుకు రాదని, జగన్‌ పేరు చెబితేనే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకువస్తాయని పేర్కొన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను అడ్డుకునేవారిని ఎన్నికల్లో తగినవిధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పేదల భవిష్యత్‌ కోసం వైసీపీ గెలుపు ఖాయమనిపిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. 66లక్షల మంది పేదలకు నష్టం కలిగించేలా చంద్రబాబు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి పింఛన్లు ఆపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మేలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. విపక్షాల పొత్తుతో ఎవరూ భయపడడం లేదని తెలిపారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

CM Jagan Speech in Naidupeta: మళ్ళీ అధికారంలోకి వస్తే తొలి సంతకం వాలంటీర్‌ వ్యవస్థ పైనే, నాయుడుపేట మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్

సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజు కొనసాగుతోంది. తిరుపతి జిల్లా పరిధిలో గురువారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగింది. సాయంత్రం నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు

YS-jagan-memantha-siddham--784x441.jpg

సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజు కొనసాగుతోంది. తిరుపతి జిల్లా పరిధిలో గురువారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగింది. సాయంత్రం నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు.సీఎం జగన్ మాట్లాడుతూ.. మరో ఐదు వారాల్లో ఎన్నికలనే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. జూన్‌ 4వరకు ఓపిక పట్టండి. మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది. తొలి సంతకం వాలంటీర్‌ వ్యవస్థపైనే చేసి.. పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తాం అని సీఎం జగన్‌ ప్రకటించారు. ప్రతీ వర్గానికి మంచి చేసే మనం.. మోసం చేసే చంద్రబాబు కూటమితో తలపడతున్నాం.

జగన్‌ను ఓడించాలని వాళ్లు.. పేదలను గెలిపించాలని మనం. మరో చారిత్రక విజయం దక్కించుకోవడం కోసం సిద్ధమా? అని నాయుడుపేట ప్రజా ప్రభంజనంను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కావు. పేద సామాజిక వర్గ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ఈ ఓటు కేవలం ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకునేందుకు కాదు.. మన తలరాతను, మన భవిష్యత్తులను మనంతట మనమే రాసుకునేందుకని గుర్తు ఉంచుకోండి’’ అని సీఎం జగన్‌ గుర్తు చేశారు.  ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడండి, మదనపల్లి మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్, ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు మనకు మాత్రమే ఉందని వెల్లడి

ఈ ఎన్నికలు రెండు భావజాలాలు.. పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలం మధ్య జరుగుతున్న సంఘర్షణ. అన్ని వర్గాలకు మనం మంచి చేశాం. 75 శాతం నా అని పిలుచుకునే సామాజిక వర్గాలకు డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లలో నగదు జమ చేసి లబ్ధి అందించాం. పెన్షన్లను మూడు వేల రూపాయాలకు పెంచుకుంటూ వచ్చాం. ఒకటో తేదీన వలంటీర్ల రూపంలో పెన్షన్లు ఇంటి వద్దకే అందించాం. అలాంటిది.. తన మనిషితో ఫిర్యాదు చేయించి పెన్షన్ల పంపిణీన్ని అడ్డుకున్నది చంద్రబాబు. పేదలకు ఇళ్ల పట్టాలు అందవద్దని కోర్టులకు వెళ్లారు. పేదల భవిష్యత్తు కొరకు.. అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమా? అని అడుగుతున్నా అని సీఎం జగన్‌ మరోసారి ప్రశ్నించారు.

CM Jagan Speech Videos

 

రెండు రోజుల్లో పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు విడిచారు.

ఇంత మంది మరణానికి కారణమైన చంద్రబాబుని హంతకుడు అందామా?

రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి. చెడిపోయాయి. ఏ స్థాయికి అంటే.. అవ్వాతాతలకు ఇంటి వద్ద ఇచ్చే పెన్షన్లను.. తాము చెబితేనే చంద్రబాబునాయుడు ఆపించారని అహంకార ధోరణితో వాళ్ల పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థులు(రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు పేరు ప్రస్తావన) చెప్పారు. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారో చూస్తున్నాం. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వా, తాతలు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబును హంతకుడు అందాం.. అంతకంటే దారుణంగా చెబుదామా?.వలంటీర్‌ వ్యవస్థతో చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  చంద్రబాబు మనిషా శాడిస్టా, పూతలపట్టులో సీఎం జగన్ తీవ్ర విమర్శలు, ఈసీకి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపాటు

అయ్యా చంద్రబాబు.. నువ్వు 14 ఏళ్లు, మూడుసార్లు సీఎం అని చెబుతావ్‌ కదా. మరి అన్నేళ్లు చేశానని చెప్పుకుంటూ.. నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచిగానీ, సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తొస్తుందా?.. (లేదు అనే మాట వినిపించింది). పైగా చంద్రబాబుకి గుర్తొచ్చేది.. వెన్నుపోటు అని సింబాలిక్‌గా సైగతో చూపించారు సీఎం జగన్‌. మనకు కోట్ల మంది అభిమానులు ఉంటే.. ఆ యెల్లో ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు ఉన్నారు. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఓ దత్తపుత్రుడు. అంతా పొరుగు రాష్ట్రం నుంచే ఉన్నారు. వీళ్ల రాజకీయం దోచుకోవడం.. దాచుకోవడం.

గత 58 నెలల్లో మీ బిడ్డ వేసిన అభివృద్ధి, సంక్షేమ విత్తనాలు రాబోయే రోజుల్లో చూస్తారు. ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టే.. వాళ్ల(చంద్రబాబు అండ్‌ కో) మాదిరి పొత్తులు, కుట్రలు, ఎత్తులు, జిత్తులతో పని లేదు. మోసం చేయలేదు. మంచి చేశాను కాబట్టే మళ్లీ ఓటేయమని అడిగేందుకు మీ ముందుకు రాగలిగాను. కాబట్టే.. మీ జగన్‌ ఇలా ఈరోజున స్వచ్ఛమైన మనషుతో, మంచి చేశాననే ఆత్మవిశ్వాసంతో ఆశీస్సులు కోరుతున్నాడు. రాబోయే ఎన్నికల కోసం కూడా అబద్ధాలు చెప్పడు. సాధ్యం కాని వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టడు. చంద్రబాబులా కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలనుకోవడం లేదు. పేదలపై ఈ జగన్‌కు ఉన్న ప్రేమ.. ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు.. ఉండదు. మీ బిడ్డ మాట ఇస్తే తప్పేదే లేదు.. గుర్తు పెట్టుకోండి అని సీఎం జగన్‌ చెప్పారు.

...

Complete article

CM Jagan's full speech

 

Link to comment
Share on other sites

  • 0

Jagan: ఈ కిచిడీ మేనిఫెస్టోతో మేం పోటీపడాలనుకోవడంలేదు: సీఎం జగన్

తిరుపతి జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర

నాయుడుపేటలో భారీ బహిరంగ సభ

చంద్రబాబు వల్లే 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారన్న జగన్

జూన్ 4న మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమేనని వెల్లడి

cr-20240404tn660eb0ead9865.jpg

ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు తిరుపతి జిల్లాలో కొనసాగింది. ఈ సాయంత్రం నాయుడుపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం జగన్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... చంద్రబాబు దుర్మార్గం వల్లే ఇవాళ రాష్ట్రంలో 31 మంది అవ్వాతాతల ప్రాణాలు పోయాయని అన్నారు. పెన్షన్లను మేం చెబితేనే చంద్రబాబు ఆపించారు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారని, వారిది అహంకార ధోరణి అనాలా, సిగ్గులేనితనం అనాలా? అని మండిపడ్డారు. చంద్రబాబును హంతకుడు అందామా, అంతకంటే దారుణం అని అందామా? అని సీఎం జగన్ తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు. 

వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. జూన్ 4న వచ్చేది తమ ప్రభుత్వమేనని, తాము రాగానే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ యథావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. 

"ఈ ఎన్నికలు రెండు వేర్వేరు భావజాలాల మధ్య జరుగుతున్న సంఘర్షణ. పేదల అనుకూల భావజాలం ఒకవైపు, పెత్తందారుల అనుకూల భావజాలం మరోవైపు. ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం కాబట్టే... పొత్తులు, కుట్రలు, ఎత్తులు, జిత్తులతో పనిలేకుండా నేరుగా మీ ముందుకు వచ్చాం. సాధ్యం కాని వాగ్దానాలను కూడా మేనిఫెస్టోలో పెట్టి చంద్రబాబు కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలనుకోవడం లేదు. 

2014లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చాడా అని అడుగుతున్నా. పొదుపు సంఘాలకు పూర్తి రుణమాఫీ అన్నాడు, ఆడబిడ్డ  పుడితే రూ.25 వేలు ఇస్తానన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు, పేదలకు మూడు సెంట్ల స్థలం అన్నాడు... వీటిలో ఒక్క హామీ అయినా నెరవేర్చాడా? 

ఇప్పుడు కూడా ఆ పెద్దమనుషులే మరోసారి రంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు. కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా అని అడుగుతున్నా? వీళ్ల మోసాల నుంచి పేదలను కాపాడుకోవడానికి ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్లు బయటికి రావాలి. ఈ ప్రభుత్వం చేసిన మంచిని వందలమందికి తెలియజేయాలి. 

మరో రెండు నెలల్లో మీ బిడ్డ మళ్లీ  అధికారంలోకి వస్తున్నాడు. ఈసారి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 లోక్ సభ స్థానాలతో డబుల్ సెంచరీ సాధించేందుకు మీ దీవెనలు కోరుతున్నా" అని సీఎం జగన్ పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

జగనన్న చెప్పిన వార్త విని సభలో డ్యాన్సులు వేసిన ఆటో డ్రైవర్లు Tipper tiller driver

 

Link to comment
Share on other sites

  • 0

YS Jagan's Memanta Siddham Bus Yatra schedule for tomorrow unveiled

YSRCP State General Secretary Talashila Raghuram has unveiled the schedule for the 9th day of the "Memanta Siddham" bus journey scheduled for Saturday, April 6.

1436892-jagan-mohan-reddy.webp

On this leg of the trip, YSR Congress Party President and Chief Minister YS Jagan Mohan Reddy is set to commence the day's travel at 9 am from the location where Chintareddy Palem resided. The journey will take them through Kovvuru Cross, Sunnabatti, Tippa, and Govaram, with a planned lunch break scheduled upon arrival at RSR International School.

Subsequently, the route will lead to Kavali National Highway via Kavali Cross, where the Chief Minister is slated to engage in a public meeting and deliver an address at 3 pm. Following the conclusion of the meeting, the journey will continue through Elurupadu, Ulavapadu Cross, Singarayakonda Cross, Oguru, Kandukur, Ponnalur, and Venkupalem before culminating at Juvvigunta Cross for the night.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

YS Jagan: నేను అడిగితే చంద్రబాబు సమాధానం చెప్పడంలేదు... మీకు చెబుతాడేమో!: సీఎం జగన్

నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ

చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించిన సీఎం జగన్

చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువచ్చే పథకం ఒక్కటీ లేదని ఎద్దేవా 

అబద్ధాలు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అని వ్యాఖ్యలు

cr-20240406tn66114453314a7.jpg

ఏపీ సీఎం జగన్ నేడు మేమంతా సిద్ధం 9వ రోజు యాత్ర కొనసాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ, విపక్ష నేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువచ్చే పథకం ఒక్కటీ లేదని అన్నారు. అబద్ధాలు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అని అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టో అంటూ గతంలో రంగురంగుల కాగితాలు ఇచ్చాడని, వాటిలో ఎన్ని అమలు చేశాడో చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని నిలదీశారు. 

"ఎన్నికలు అయిపోయాక ఎప్పుడైనా నాలాగా, ఇవిగో నేను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఇవిగో నేను నెరవేర్చిన హామీలు అని చెప్పగలరా అని నేను చంద్రబాబును అడిగితే, ఆయన సమాధానం చెప్పడంలేదు. మీకేమైనా సమాధానం చెబుతాడేమో అడిగి చూడండి. 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటున్నావు... మేనిఫెస్టోలో చెప్పినదాంట్లో ఒక్కటైనా చేశాను అని పబ్లిక్ గా చెప్పే కార్యక్రమం ఒక్కసారైనా చేశావా? చంద్రబాబు ఎన్నికల ముందే మేనిఫెస్టో చూపిస్తాడు, ఎన్నికలు అయిపోయాక మాత్రం మేనిఫెస్టో చూపించడు. నాకైతే చూపించలేదు... పోనీ మీకైనా చూపించాడా? కనీసం మేనిఫెస్టో కాపీనైనా చూపించే దమ్ము, ధైర్యం, నిబద్ధత నీకుందా చంద్రబాబూ? అని అడగుతున్నా. 

చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగా. మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు... 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు... గ్రామాల్లో కానీ, పేదల గుండెల్లో కానీ, సామాజికవర్గాల్లో కానీ, అభివృద్ధిలో కానీ, పేదలకు మంచి చేయడంలో కానీ నిజంగా మీ మార్క్ అంటూ ఉంటే, మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఎందుకయ్యా చంద్రబాబూ? అని అడుగుతున్నా. నాకైతే చంద్రబాబు సమాధానం ఇవ్వడంలేదు, మీకేమైనా ఇచ్చాడా? ఇవ్వడు గాక ఇవ్వడు. 

ఇదే పెద్ద మనిషి చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగా. వెన్నుపోటు పొడిచో, తడిగుడ్డతో గొంతు కోయడం ద్వారానో, కుట్రలు, కుతంత్రాలు తోనో, నీ ఎల్లో మీడియాతో ప్రచారం చేయించుకునో, 30 ఏళ్ల కిందట  ఏదో విధంగా ముఖ్యమంత్రివి అయ్యావు. ఇప్పటికీ కూడా, జనం ముందుకు వచ్చినప్పుడు నేను గతంలో ఈ మంచి పని చేశాను అని ఒక్కసారి కూడా చెప్పుకోకుండా, నేను ఇంటికి కేజీ బంగారం ఇస్తాను, ఇంటికో బెంజి కారు కొనిస్తాను, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంటావు... పేదల గుండెల్లో గుడి కట్టుకునేలా ఈ పథకం చేశాను అని ఏనాటికైనా చెప్పుకోగలవా? అని అడిగాను. 

దీనికైనా సమాధానం చెబుతాడా అంటే  దీనికీ చెప్పడు. పోనీ నాకు సమాధానం చెప్పకపోయినా, మీకైనా సమాధానం చెప్పాడా? అని అడుగుతున్నా. చెప్పలేదు అనడం కంటే చెప్పలేడు అనడమే కరెక్ట్. ఎందుకంటే.... ప్రజలతోనూ, పేదలతోనూ చంద్రబాబుది అతకని బంధం. చంద్రబాబు నోటికి ఫెవికాల్ వేసుకుంటాడు, ఫెవిక్విక్ పూసుకుని నోరు మూసుకుంటాడు. 

మరి మీ బిడ్డ, మీ జగన్ సిద్ధం సిద్ధం అని సభలు పెట్టి ఏం చెబుతున్నాడంటే... ఇంటింటికీ మంచి చేస్తూ ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి, వివిధ పథకాల ద్వారా నగదు బదిలీ చేస్తున్నాడు. ఇదంతా చేసింది 58 నెలల పాలనలోనే. అది కూడా తొలిసారిగా పాలన చేపట్టాక చేసిన అభివృద్ధి ఇది. ఇవాళ మీ బిడ్డ మీ ముందు గొప్పగా నిలబడి, మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించి ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చి మీ ఆశీస్సులు కోరుతున్నాడు. 

ఇంటింటికీ పౌర సేవలను డోర్ డెలివరీ చేయిస్తున్నాడు మీ బిడ్డ. మీ జగన్ లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థ తీసుకువచ్చాడు. వైసీపీకి ఓటు వేయని వారికి కూడా మంచి చేసే వ్యవస్థ తీసుకువచ్చాం. గ్రామాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు మార్చాడు మీ జగన్, వ్యవసాయాన్ని మార్చాడు మీ జగన్. అవ్వాతాతల ఆర్థిక సాధికారత ఇదీ అంటూ మీ బిడ్డ జగన్ చేసి చూపించాడు. 

మరి 14 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు... జగన్ చేసిన దాంట్లో కనీసం 10 శాతం అయినా నేను చేశాను అని ఇదీ చంద్రబాబు గుండెలపై చేయి వేసుకుని ధైర్యంగా చెప్పగలడా? 

ప్రతి గ్రామానికి ఏడు వ్యవస్థలు తీసుకువచ్చాం. సచివాలయ వ్యవస్థ, వాలంటీరు వ్యవస్థ, ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం) వ్యవస్థ, విలేజ్ క్లినిక్ వ్యవస్థ, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియా, నాడు-నేడు, ప్రతి గ్రామంలో ఓ మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశా యాప్, గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీ, ఓ లంచాలు లేని, వివక్ష లేని పాలనతో గ్రామ స్వరూపాన్నే మార్చానని ధైర్యంగా చెబుతున్నాడు మీ బిడ్డ జగన్. 

కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామమైనా తీసుకోండి... నేను చెప్పే ప్రతి మాట ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకు ఏం చేశానో ధైర్యంగా మీ ముందు నిలుచుని చెప్పగలుగుతున్నాడు మీ బిడ్డ. 

మీకు మంచి జరిగితే మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని అడగ్గలుగుతున్నాడు మీ బిడ్డ. మీరు వేసే ఓటు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు, మీరు వేసే ఓటుతో వచ్చే ఐదేళ్లలో మీ తలరాతలు మారుతాయి" అంటూ సీఎం జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

YS Jagan: చంద్రబాబును 'పశుపతి'తో పోల్చుతూ సీఎం జగన్ వ్యాఖ్యలపై సీఈవో నోటీసులు

మేమంతా సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు

అరుంధతి సినిమాలోని పశుపతితో పోల్చుతూ వ్యాఖ్యలు

మోసం చేయడమే చంద్రబాబు అలవాటు అని వెల్లడి

సీఎం జగన్ వ్యాఖ్యలను సీఈవో దృష్టికి తీసుకెళ్లిన వర్ల రామయ్య

48 గంటల్లో సీఎం జగన్ వివరణ ఇవ్వాలంటూ ముఖేశ్ కుమార్ మీనా నోటీసులు

cr-20240407tn661276a19f503.jpg

ఇటీవల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ విపక్ష నేత చంద్రబాబును అరుంధతి సినిమాలోని పశుపతితో పోల్చడం తెలిసిందే. చంద్రబాబు పసుపతి... మోసం చేయడమే చంద్రబాబు అలవాటు అంటూ వ్యాఖ్యానించారు. 

అయితే, ఈ వ్యాఖ్యలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని సీఈవోకు ఫిర్యాదు చేశారు. 

దీనిపై సీఈవో ముఖేశ్ కుమార్ మీనా స్పందించారు. సీఎం జగన్ కు నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘనే అని ప్రాథమిక అంచనాకు వచ్చామని మీనా తెలిపారు. సీఎం జగన్ సకాలంలో స్పందించకపోతే ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jagan: విలువలు లేని రాజకీయాలు వచ్చేశాయ్.. చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను: జగన్

రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దన్న జగన్

చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్టేనని వ్యాఖ్య

14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు అవ్వాతాతల కోసం ఏం చేశారని ప్రశ్న

cr-20240408tn66139ec8df635.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబులా తాను అబద్ధాలు చెప్పలేనని అన్నారు. రూ. 3 వేలు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో మనదేనని చెప్పారు. నెలకు రూ. 2 వేల కోట్లు పెన్షన్లకే ఇస్తున్నామని తెలిపారు. ఓట్ల కోసం ఎంతైనా ఇస్తానని చంద్రబాబు అంటారని... రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దని చెప్పారు. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమలో జగన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటున్న బాబు మాటలను నమ్మొద్దని జగన్ అన్నారు. రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయని... విలువలు లేని, విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చాయని అన్నారు. ఇలాంటి రాజకీయాలను మార్చేందుకే తాను వచ్చానని చెప్పారు. చంద్రబాబుకు అవ్వాతాతలపై ప్రేమ లేదని జగన్ అన్నారు. అవ్వాతాతలను పట్టించుకోవాలంటే వారిపై ప్రేమ ఉండాలని చెప్పారు. గత ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేదని... ఇప్పుడు మన ప్రభుత్వంలో 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని... ఈ విషయాన్ని అందరూ గమనించాలని అన్నారు. 

పెన్షన్ కోసం అవ్వాతాతలు బాధలు పడకూడదనేది తన కోరిక అని జగన్ చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు అవ్వాతాతల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చంద్రబాబు బుట్టలో పడేశారని విమర్శించారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం తనకు రాదని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్టేనని చెప్పారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

YS Jagan: చంద్రబాబుకు ఓటేస్తే నేను తెచ్చిన పథకాలన్నీ ఆపేస్తాడు: కొనకనమిట్లలో సీఎం జగన్

ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో మేమంతా సిద్ధం సభ

హాజరైన సీఎం జగన్

చంద్రబాబు ఆలోచనలు ఎప్పటికీ పాతాళంలోనే ఉంటాయని విమర్శలు

అవ్వాతాతలను చంపిన నరహంతకుడు చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు

cr-20240407tn6612b5b568406.jpg

ఏపీ సీఎం జగన్ ఈ సాయత్రం ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో విపక్షనేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమం ఆగిపోతుంది... మీ బిడ్డ తెచ్చిన పథకాలన్నీ చంద్రబాబు ఆపేస్తాడు అని స్పష్టం చేశారు. 

చంద్రబాబు ఆలోచనలు ఎప్పటికీ పాతాళంలోనే ఉంటాయని... వెన్నుపోట్లు, కుట్రలు, మోసాలు, అబద్ధాలే చంద్రబాబు మార్కు రాజకీయం అని సీఎం జగన్ విమర్శించారు. ఇంటింటికీ అందుకున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని, ఇప్పుడు పెన్షన్లు అందకుండా చేయడమే అందుకు నిదర్శనమని అన్నారు. నిమ్మగడ్డ రమేశ్ తో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి అవ్వాతాతల పెన్షన్లను అడ్డుకున్నది చంద్రబాబే అని సీఎం జగన్ ఆరోపించారు. 

"చంద్రబాబు ఒక శాడిస్టు... అవ్వాతాతలను బలిగొన్నాడు, దళితులను అవమానించాడు... అలాంటి వ్యక్తిని శాడిస్టు అనక ఇంకేం అనాలి? వైసీపీ ప్రభుత్వంలో తన కుటుంబానికి మేలు జరిగిందని చెప్పిన గీతాంజలిని వేధించి చంపారు. మన ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని చూసి చంద్రబాబు అసూయ ద్వేషాలతో రగిలిపోతున్నాడు... చంద్రబాబు కడుపుమంటకు 20 జెలూసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా సరిపోవు. తన అసూయతో అవ్వాతాతలను చంపుతూ నరహంతకుడిలా మారాడు. 

ఆదివారం అయినా, సెలవు రోజు అయినా వాలంటీర్లు ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు. వాలంటీరు వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి... అందుకే వాలంటీరు వ్యవస్థ లేకుండా చేయాలని చూస్తున్నాడు. మండిపోతున్న ఎండల్లో అవ్వాతాతలను పెన్షన్ కోసం నిలబెట్టి వాళ్ల ప్రాణాలు బలిదీసుకుంటున్నాడు. పేదలను బలిదీసుకుంటున్న చంద్రబాబు శాడిస్ట్ కాక ఇంకేంటి? 

చంద్రబాబు అంటే గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా? 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకుంటాడు... ఏంచేశాడో ప్రజలకు తెలుసు. ఈ ఐదేళ్లలో మీ బిడ్డ పాలన ఎలా ఉందో మీరు చూశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లతో ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లు, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడులు, ఆసుపత్రులకు కొత్త రూపు, పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువు, ఆరోగ్య శ్రీ పరిధి రూ.25 లక్షలకు పెంపు, అవ్వాతాతలకు రూ.3 వేల పెన్షన్, అక్కచెల్లెమ్మలకు రూ.2.70 లక్షల కోట్ల నగదు బదిలీ... ఇవన్నీ మీ బిడ్డ పాలనలో జరిగినవే. 

ప్రజలకు మేలు చేయడం కోసం మనకు అధికారం కావాలనుకున్నాం. చంద్రబాబు దోచుకోవడం కోసం అధికారం కావాలంటున్నాడు. 2014లోనూ ఈ ముగ్గురు కలిసి కూటమిగా వచ్చారు. ఆనాడు అనేక హామీలతో ఇంటింటికీ తిరిగారు. ఆ హామీలు ఏమయ్యాయని అడుగుతున్నా. పొదుపు సంఘాల రుణమాఫీ అన్నారు, నిరుద్యోగులకు రూ.2 వేల భృతి అన్నారు... నెరవేర్చారా అని అడుగుతున్నా. చంద్రబాబు చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఇప్పుడు పేదల భవిష్యత్ ను కాలరాసేందుకు మూడు పార్టీల కూటమి అంటూ వస్తున్నారు... ఇవి జగన్ కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు... చంద్రబాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు... జెండాలు జతకట్టి వస్తున్న వాళ్లకు, ప్రజలే అజెండాగా వస్తున్న మనకు జరుగుతున్న ఎన్నికలు ఇవి... మన అడుగులు ముందుకా, వెనక్కా అని తేల్చే ఎన్నికలు ఇవి"... అంటూ సీఎం జగన్ ప్రసంగించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Andhra Pradesh tops in social security pensions: Jagan

Amaravati: Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy on Monday said that no other state in the country is providing Rs 3,000 as a pension to 66 lakh beneficiaries. Interacting with pension beneficiaries at Darsi in Prakasam district as part of his election campaign, he claimed that the YSR Congress party government is spending Rs 2,000 crore per month on social security pensions.

1437392-ys-jagan-mohan-reddy.webp

"We are spending Rs 24,000 crore per year. In the last five years, we have spent over Rs 90,000 crore on pensions, which is higher than the other states in the country. If we look at other states on their pension expenditure, Bihar is spending Rs 4,300 crore, Uttar Pradesh Rs 5.160 crore, Karnataka Rs 4,700 crore, and Telangana Rs 7,180 crore," he said.

On the difference between the current YSRCP government and the previous TDP regime in disbursing the pensions, he said: "In the TDP regime, only 39 lakh beneficiaries received Rs 1,000 as a pension, but two months before the election, they increased it to Rs 2000, but now we have not only increased the amount to Rs 3000 but extended it to 66.34 lakh eligible beneficiaries."

The Chief Minister said that the government has been providing pensions to over 66 lakh beneficiaries without corruption or discrimination based on caste, religion, and political affiliation. He also noted that his government has taken the volunteer system like nowhere else in the country and delivers welfare measures like pensions to the beneficiaries on their doorstep.

"Chandrababu Naidu often says that he was Chief Minister for 14 years, but he never thought about you (people)," he told old-age pensioners, alleging that the Telugu Desam Party (TDP) chief was giving false assurances to deceive people as he did in 2014.

"Before the election. people will come up with a manifesto promising good governance but the manifesto would be thrown in the dustbin post-election. But I can't lie like Chandrababu Naidu and his alliance partners. If we promise something, it will be executed," he asserted.

"I should say what can be done instead of promising the impossible. There is no other state in the country who can compete with the YSRCP government in terms of providing welfare measures to the poor," he claimed.

"The cost of Chandrababu Naidu's promises is exceeding Rs 1.4 lakh crore on top of the current ongoing welfare measures in Andhra Pradesh. They are giving such assurances to deceive everyone just like before the 2014 election," the YSRCP chief said.

The beneficiaries told the Chief Minister how the pension received by them after the YSRCP came to power helped them overcome financial difficulties. Narsimha Rao, a beneficiary of Divyang pension, stated that volunteers visit houses of disabled people and enquire about what help they need, not just with pensions but also with certificates or Aadhaar cards, making sure they don’t have to go out.

Another beneficiary Venkatapati stated that during the TDP rule, he used to go to the panchayat office at 4 in the morning to receive the pension. “We were forced to sit amidst mosquitos without chairs. People who came later had to wait for long hours or were asked to come the following day. They used to give out pensions for up to 7 days. After the Jagan government introduced a volunteer system, pensions were delivered on the doorstep," he said.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...