- 1
Sabdham (Telugu) #trailer #review | Aadhi | Arivazhagan | Thaman S | Simran | Laila | Lakshmi Menon
-
Similar Content
-
Now Playing
-
Beverly Hills Cop: Axel F
-
The Inheritance
-
Descendants: The Rise of Red
-
Boneyard
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
Goyo
-
A Quiet Place: Day One
-
Le Dernier Jaguar
-
Despicable Me 4
-
Trigger Warning
-
Twisters
-
The Exorcism
-
Bad Boys: Ride or Die
-
Deadpool & Wolverine
-
The Garfield Movie
-
The Strangers: Chapter 1
-
Monkey Man
-
My Spy The Eternal City
-
Question
TELUGU
Very interesting!
Sabdham (Telugu) - Official Teaser | Aadhi | Arivazhagan | Thaman S | Simran | Laila | Lakshmi Menon
Sabdham Teaser: మాటల్లేవ్, కానీ ఆ సౌండ్‌కు వణికిపోతారు - భయపెడుతోన్న ‘శబ్దం’, ఆది కొత్త మూవీ టీజర్ చూశారా?
Sabdham Movie Teaser: హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబోలో రూపొందుతున్న తాజా చిత్రం 'శబ్దం'. ఇప్పటికే వీరిద్దరి కలిసి కాంబోలో వచ్చిన ‘వైశాలి’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. చాలా కాలం తర్వారా మళ్లీ వీరిద్దరు అదే జానర్ లో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘వైశాలి’ సినిమాను మించి హిట్ కొట్టడమే టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని 7జీ ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
మాటలు లేకుండానే భయపెడుతున్న ‘శబ్దం’ టీజర్
‘శబ్దం’ సినిమా టీజర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సినిమా ఆత్మల కారణంగా ఎదురయ్యే సంఘటన చుట్టూ తిరుగుతున్నట్లు అర్థం అవుతోంది. ఆత్మల మీద రీసెర్చ్ చేసే పాత్రలో ఆది కనిపిస్తున్నారు. ఆది హాంటెడ్ హౌస్ దగ్గర చిత్ర విచిత్రమైన సంఘటనలు జరిగేటప్పుడు కొన్ని సౌండ్స్ ను రికార్డు చేస్తాడు. అసలు విషయం ఏంటనేది ఎక్కడా రివీల్ కాకుండా టీజర్ ను వదిలారు మేకర్స్. ఈ సినిమాలో నటిస్తున్న కీలక నటులు అందరినీ పరిచయం చేశారు. గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో ఆది కనిపిస్తున్నాడు. మొత్తంగా దర్శకుడు అరివళగన్ ఈసారి ఆత్మలను లీడ్ చేసుకుని సరికొత్తగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇక అరుణ్ పద్మనాభన్ సినిమాటోగ్రఫీ మరో లెవల్ అని చెప్పుకోవచ్చు. ఆయన ప్రతి ఫ్రేమ్ లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మాయ చేశారు. హారర్ థ్రిలర్ సినిమాకు తన సంగీతంతో మరింత భయాన్ని యాడ్ చేశారు. టీజర్లో థమన్ అందించిన స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ అదుర్స్ అని చెప్పుకోవచ్చు.
‘వైశాలి’ని మించి సక్సెస్ అందుకునేనా?
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబై, మున్నార్, చెన్నై సహా పలు ప్రాంతాల్లో జరిగింది. అంతేకాదు, ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఏకంగా 2 కోట్ల రూపయాలతో 120 ఏళ్ల నాటి పురాతన లైబ్రరీ సెట్‌ను వేసినట్లు చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ లో దాన్ని హైలెట్ చేస్తూ చూపించారు. 2009లో వచ్చిన ‘వైశాలి’ తమిళంతో పాటు తెలుగలోనూ మంచి వసూళ్లను సాధించింది. అప్పట్లో సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇన్నాళ్లకు మళ్లీ ఇద్దరి కాంబోలో ‘శబ్దం’ రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తప్పకుండా ఈ సినిమా కూడా చక్కటి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టితో పాటు లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
...
Complete article
Link to comment
Share on other sites
1 answer to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.