Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

World news


Sanjiv

Recommended Posts

indonesia: ఇండోనేసియాలో మూడు రోజుల్లో ఐదు సార్లు బద్దలైన అగ్నిపర్వతం 11 వేల మందికిపైగా స్థానికులను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం

ఆకాశంలో సుమారు 2 కి.మీ. ఎత్తు వరకు దుమ్ము, ధూళి వ్యాప్తి

సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత

పొరుగున ఉన్న మలేసియాలోనూ పలు విమాన సర్వీసుల రద్దు

cr-20240418tn6620ab9287a34.jpg

ఇండోనేసియాలోని ఉత్తర సులవేసీ ప్రావిన్సు రాజధాని మనాడో సమీపంలో ఉన్న మౌంట్ రౌంగ్ అగ్నిపర్వతం మూడు రోజుల వ్యవధిలో ఐదు సార్లు బద్దలైంది. భగభగ మండే ఎర్రని లావా కిందున్న సముద్రంలో కలవగా, ఆకాశంలోకి సుమారు 2 కిలోమీటర్ల ఎత్తు వరకు భారీ స్థాయిలో దుమ్ము, ధూళి వ్యాపించాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని 11 వేల మందికిపైగా స్థానికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే మనాడోలోని శామ్ రతులంగి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును గురువారం సాయంత్రం వరకు తాత్కాలికంగా మూసేశారు. 

ముందు ఒకసారి.. ఆ తర్వాత మరో నాలుగుసార్లు
మౌంట్ రౌంగ్ అగ్నిపర్వతం స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9:45 గంటలకు (13:45 జీఎంటీ) తొలిసారి బద్దలైంది. ఆ తర్వాత బుధవారం ఒక్కరోజులోనే నాలుగుసార్లు బద్దలై దుమ్ము, ధూళిని విరజిమ్మింది. దీంతో ఇండోనేసియా అగ్నిపర్వత ఏజెన్సీ నాలుగో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అగ్నిపర్వత ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరం వరకు ఖాళీ చేయాల్సిన ప్రాంతాలను 6 కిలోమీటర్ల దూరం వరకు పెంచింది.

వేల మంది ఖాళీకి ఆదేశం
ముందుగా 800 మందికిపైగా స్థానికులను ఆ ప్రాంతం నుంచి తరలించిన అధికారులు ఆ తర్వాత అక్కడ నివసిస్తున్న 11,665 మంది స్థానికులను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. అగ్నిపర్వతంలో ఓ భాగం సముద్రంలో కుప్పకూలే అవకాశం ఉందని... ఇది సునామీ వచ్చేందుకు దారితీయొచ్చని ఆందోళన చెందుతున్నారు. 1871లో ఇలాగే జరిగిందని గుర్తుచేశారు.

విమాన సర్వీసుల రద్దు
అగ్నిపర్వతం వెదజల్లే బూడిద వల్ల విమానాలకు ప్రమాదం తలెత్తుతుందన్న ఉద్దేశంతో శామ్ రతులంగి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి విమాన రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో చైనా, సింగపూర్, ఇండోనేసియాకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇండోనేసియాకు సమీపంలోని మలేసియాలో ఉన్ కోటా కినబాలు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోనూ కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి.

...

Complete article

Link to comment
Share on other sites

  • The title was changed to World news

Japan earthquake: జపాన్ ను వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు.. వీడియో ఇదిగో!

బుధవారం అర్ధరాత్రి ఘటన.. ఊగిపోయిన భవనాలు

భయాందోళనలలో జపాన్ వాసులు

వారం పాటు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వ సూచన

cr-20240418tn6620a4e71f8ee.jpg

జపాన్ లో బుధవారం అర్ధరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భవనాలు ఊగిపోయాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4 పాయింట్లుగా నమోదైందని జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. భూకంప ప్రభావంతో ఆ తర్వాత మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని, మరో వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. తాజా భూకంపంలో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదని వివరించింది. క్యూషు, షికోకు దీవుల మధ్య ఉన్న బుంగో జలసంధిలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. బుధవారం రాత్రి 11:30 గంటల (జపాన్ కాలమానం) ప్రాంతంలో ఎహిమె, కోచి ప్రిఫెక్షర్ (జిల్లాల) లో భూమి కంపించిందని అధికారులు తెలిపారు.

దీంతో పలుచోట్ల వాటర్ సప్లై పైపులు పగిలిపోయాయని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిమాసా హయాషి మీడియాకు వివరించారు. షికోకు ఎలక్ట్రిక్ పవర్ కు చెందిన ఇకాట న్యూక్లియర్ ప్లాంట్ పై భూకంప ప్రభావం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, భౌగోళిక పరిస్థితుల కారణంగా జపాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్రతీ ఐదు భూకంపాలలో ఒకటి జపాన్ లోనే నమోదవుతుంది. జపాన్ చరిత్రలోనే అత్యంత తీవ్రతతో 2011 మార్చి 11న భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 9 పాయింట్లుగా నమోదైంది.

...

Complete article

 

Link to comment
Share on other sites

Dubai Rains reasons: దుబాయ్ లో ఆకస్మిక వరదలకు కారణం అదేనా...?

ఇవాళ దుబాయ్ లో భారీ వరదలు

అతలాకుతలమైన ఎడారి రాజ్యం

క్లౌడ్ సీడింగ్ వల్లే ఆకస్మిక వర్షాలు, వరదలు అంటున్న నిపుణులు

cr-20240417tn661fc25bf2da1.jpg

అత్యధిక భూభాగం ఎడారిగా ఉండే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో తీవ్రస్థాయిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గల్ఫ్ దేశాల్లో పచ్చదనం అన్నది అత్యంత అరుదుగా కనిపించే విషయం. 

అయితే గత కొన్నేళ్లుగా దుబాయ్, ఒమన్ తదితర ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఏడాది సగటు వర్షపాతం 200 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే కుండపోత వానలు కురుస్తున్నాయి. 

తాజాగా, దుబాయ్ లో కుంభవృష్టి, వరదలు అతలాకుతలం చేశాయి. ఒక్క రోజు వ్యవధిలో 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడారి దేశాల్లో ఈ స్థాయిలో వర్ష బీభత్సానికి క్లౌడ్ సీడింగ్ కారణమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

 విమానాలు, రాకెట్ల ద్వారా మేఘాల్లో రసాయనాలు చల్లి, ఆ మేఘాలు కరిగి వర్షంలా మారే ప్రక్రియనే క్లౌడ్ సీడింగ్ అంటారు. పెరుగుతున్న జనాభాకు తగినంత నీటిని అందించడం, అత్యధిక ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడం, భూగర్భ జలవనరులను పెంపొందించడం వంటి ఉద్దేశాలతో అరబ్ దేశాలు క్లౌడ్ సీడింగ్ ను ఆశ్రయిస్తున్నాయి. ఇలా కృత్రిమ వర్షాలను కురిపించే ప్రయత్నంలోనే ఒక్కోసారి అతి భారీ వర్షాలు కురిసి, వరదలు పోటెత్తుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. 

1982 నుంచి యూఏఈలో కృత్రిమ వర్షాలపై ప్రయోగాలు జరిగాయి. 2000వ సంవత్సరంలో నాసా, దక్షిణాఫ్రికా పరిశోధక బృందాల సాయంతో యూఏఈ పాలకులు క్లౌడ్ సీడింగ్ ను ముమ్మరం చేశారు. సౌదీ అరేబియా, ఒమన్ వంటి ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇదే బాటపట్టాయి. 

కృత్రిమ వర్షాలను కురిపించడం అనేది ఒకరకంగా ప్రకృతిని ఉల్లంఘించడం వంటిదేనన్నది వాతావరణ పరిశోధకుల మాట. ఒకచోట ఇలా అత్యధిక వర్షపాతాలు కురిపిస్తే, అది మరో చోట అనావృష్టికి దారి తీసి కరవు ఏర్పడుతుందన్న విషయం గమనించాలని, ప్రకృతి వనరుల నియంత్రణలో మానవ జోక్యం తగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

కాగా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ మేఘమథనం పేరిట క్లౌడ్ సీడింగ్ నిర్వహించినా ఆశించిన ఫలితాలు రాలేదు.

...

Complete article

Link to comment
Share on other sites

Dubai Floods: క్లౌడ్ సీడింగ్ కాకుంటే.. మరి దుబాయ్ వరదలకు కారణమేంటి..?

ఆరు విమానాలతో క్లౌడ్ సీడింగ్ చేశారంటూ ప్రచారం

ఓవైపు ఉరుములు మెరుపులు ఉంటే క్లౌడ్ సీడింగ్ ఎలా చేస్తామన్న దుబాయ్

నేషనల్ సెంటర్ ఫర్ మెటరాలజీ డిప్యూటీ డీజీ వివరణ

cr-20240418tn6620c3cb969ad.jpg

వర్షపు చుక్క కనిపించడమే అరుదైన ఎడారి ప్రాంతం దుబాయ్ లో కుండపోతగా వర్షం కురవడం.. రోడ్లు, కాలనీలు నదులను తలపించేలా మారడం వెనక కారణమేంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. క్లౌడ్ సీడింగ్ పేరుతో ప్రకృతితో చెలగాటం ఆడడం వల్లే దుబాయ్ వాసులకు ఈ కష్టం వచ్చిందని నిపుణులు చెబుతుండగా.. సాధారణ రోజుల్లో క్లౌడ్ సీడింగ్ చేయడం నిజమే కానీ ఈ వరదలకు క్లౌడ్ సీడింగ్ కు సంబంధం లేదని యునైటెడ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం స్పష్టం చేసింది. 

మేఘాలు ఏర్పడిన తొలిదశలోనే క్లౌడ్ సీడింగ్ సాధ్యమని, ఓవైపు ఉరుములు, మెరుపుల వాతావరణంలో క్లౌడ్ సీడింగ్ ఎలా చేస్తామంటూ ప్రశ్నిస్తోంది. ఈమేరకు యూఏఈలోని నేషనల్ సెంటర్ ఫర్ మెటరాలజీ (ఎన్సీఎం) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అల్ యాజీది ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. దుబాయ్ లో ప్రస్తుత వరదలకు క్లౌడ్ సీడింగ్ కారణం కాదని, మంగళవారం క్లౌడ్ సీడింగ్ ఆపరేషన్ నిర్వహించలేదని స్పష్టం చేశారు.

మరి వరదలకు కారణమేంటి..
ఏడాదిన్నరలో కురిసే వర్షం ఒక్క రోజులోనే దుబాయ్ ను ముంచెత్తడానికి కారణం ఏంటనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఎడారి ప్రాంతం కావడంతో దుబాయ్ లో వర్షాన్ని కృత్రిమంగా కురిపిస్తారు. పక్కనే ఉన్న సముద్రంలో నీటి ఆవిరి కారణంగా ఆకాశంలో ఏర్పడే మేఘాలపైకి విమనాలను పంపి క్లౌడ్ సీడింగ్ చేస్తారు. దీంతో తరచూ దుబాయ్ లో వర్షం కురుస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కూడా ఇలా కృత్రిమంగా వర్షం కురిపించి వాతావరణం చల్లబడేలా చేస్తున్నారు. ఈ నెల 16 (మంగళవారం)న కూడా అధికారులు క్లౌడ్ సీడింగ్ చేశారని, ఆరు, ఏడు విమానాలను మేఘాల్లోకి పంపించారని ప్రచారం జరుగుతోంది.

దీంతో దుబాయ్ ని కుండపోత వర్షం ముంచెత్తిందని వాతావరణ నిపుణులు ఆరోపించారు. ఈ ప్రచారంపై ఎన్సీఎం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్పందిస్తూ.. అయితే, తాజాగా కురిసిన భారీ వర్షానికి కారణం క్లౌడ్ సీడింగ్ కాదని తేల్చిచెప్పారు. దీంతో క్లౌడ్ సీడింగ్ కాకుంటే దుబాయ్ లో కుండపోత వర్షానికి ఒకే ఒక అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా అరేబియా పెనిన్సులా మీదుగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ పై ఏర్పడిన భారీ తుపాను వల్లే దుబాయ్ ని వర్షం ముంచెత్తి ఉంటుందని వివరించారు.

...

Complete article

20240418fr6620c45e4e29d.jpg

Link to comment
Share on other sites

Dubai: దుబాయ్‌లో భారీ వర్షాలు... హెల్ప్‌లైన్ నెంబర్లు విడుదల చేసిన దౌత్య కార్యాలయం

ఏడున్నర దశాబ్దాలుగా ఎన్నడూలేని భారీ వర్షాలు కురవడంతో స్తంభించిన జనజీవనం

విమానాశ్రయాల్లోనే ఉండిపోయిన వేలాదిమంది ప్రయాణికులు

హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేసిన దౌత్యకార్యాలయం

+971501205172, +971569950590, +971507347676, +971585754213 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని వెల్లడి

cr-20240418tn66214193947c1.jpg

భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలమైంది. ఏడున్నర దశాబ్దాలుగా ఎన్నడూలేని భారీ వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది. వేలాదిమంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే ఉండిపోయారు. ఈ క్రమంలో దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం అక్కడి దౌత్య కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేసింది. దుబాయ్‌లో ఎవరైనా చిక్కుకుపోతే +971501205172, +971569950590, +971507347676, +971585754213 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని తెలిపింది.

విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులతో మాట్లాడినట్లు తెలిపింది. అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. భారత్‌లోని తమ కుటుంబ సభ్యులతో ప్రయాణికులు మాట్లాడుకునేందుకు సదుపాయాలు కల్పించినట్లు తెలిపింది. దుబాయ్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ హెల్ప్ లైన్ నెంబర్లు కొనసాగుతాయని వెల్లడించింది.

...

Complete article

Link to comment
Share on other sites

  • The topic was featured

Inside Dubai's major cleanup operation after city left underwater by freak rainfall

 

Link to comment
Share on other sites

Dubai: దుబాయ్‌లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద విమానాశ్ర‌యం నిర్మాణం..

ఎక్స్' వేదిక‌గా దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్ర‌క‌ట‌న

అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరిట ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు

ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 2.9ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తున్న దుబాయ్‌

ఏడాదికి 260 మిలియన్ల మంది రాక‌పోక‌లు కొన‌సాగించేలా విమానాశ్ర‌య నిర్మాణం

400 టెర్మినల్ గేట్లు, ఐదు స‌మాంత‌ర‌ రన్‌వేలు ఈ విమానాశ్రయం సొంతం

cr-20240429tn662ef812ec552.jpg

దుబాయ్‌లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద విమానాశ్ర‌యం నిర్మాణం కానుంది. ఈ మేర‌కు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదివారం ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఎయిర్‌పోర్టును అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిల‌వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 34.85 బిలియన్ డాల‌ర్లు వెచ్చిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అంటే భార‌తీయ క‌రెన్సీలో రూ. 2.9ల‌క్ష‌ల కోట్లు అన్న‌మాట‌. ప‌దేళ్ల‌లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని దుబాయ్ అధికారులు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. 

ఏడాదికి 260 మిలియన్ల మంది రాక‌పోక‌లు కొన‌సాగించేలా ఈ విమానాశ్ర‌యాన్ని నిర్మిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఇక అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్ర‌స్తుత‌ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుందని ఆయన చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు నుండి అన్ని కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ చేయడం జ‌రుగుతుంద‌న్నారు.

400 టెర్మినల్ గేట్లు, ఐదు స‌మాంత‌ర‌ రన్‌వేలు ఈ విమానాశ్రయం సొంతం. ఈ ఎయిర్‌పోర్టు ఫ్లాగ్‌షిప్ క్యారియర్ ఎమిరేట్స్, లోబడ్జెట్‌ విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్‌తో పాటు ప్రపంచాన్ని దుబాయ్‌కి, బయటికి కనెక్ట్ చేసే అన్ని ఎయిర్‌లైన్ భాగస్వాములకు కొత్త డెస్టినేష‌న్‌ కానుందని దుబాయ్ ప్రభుత్వ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్-మక్తూమ్ వెల్ల‌డించారు. ఈ నిర్మాణం "ప్రపంచ వేదికపై ప్రముఖ ఏవియేషన్ హబ్‌గా దుబాయ్ స్థానాన్ని మరింత పటిష్ఠం చేస్తుంది" అని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ దుబాయ్ మీడియాతో అన్నారు.

"అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది రాక‌పోక‌లు కొన‌సాగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఏడాదికి దాదాపు 260 మిలియన్ల మంది ప్రయాణీకులు ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్ర‌యాణాలు కొన‌సాగించ‌వ‌చ్చు. ఇది ప్రస్తుత దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కంటే ఐదు రెట్లు అధికం. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని కార్యకలాపాలు రాబోయే సంవత్సరాల్లో దీనికి బదిలీ అవుతాయి. విమానాశ్రయం 400 ఎయిర్‌క్రాఫ్ట్ గేట్‌లు, ఐదు సమాంతర రన్‌వేలను కలిగి ఉంటుంది. ఏవియేషన్ రంగంలో తొలిసారిగా కొత్త ఏవియేషన్ టెక్నాలజీలు ఉపయోగించబడతాయి” అని అల్ మక్తూమ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

...

Complete article

Today, we approved the designs for the new passenger terminals at Al Maktoum International Airport, and commencing construction of the building at a cost of AED 128 billion as part of Dubai Aviation Corporation's strategy. Al Maktoum International Airport will enjoy the world's largest capacity, reaching up to 260 million passengers. It will be five times the size of the current Dubai International Airport, and all operations at Dubai International Airport will be transferred to it in the coming years. The airport will accommodate 400 aircraft gates and feature five parallel runways. New aviation technologies will be employed for the first time in the aviation sector. As we build an entire city around the airport in Dubai South, demand for housing for a million people will follow. It will host the world's leading companies in the logistics and air transport sectors. We are building a new project for future generations, ensuring continuous and stable development for our children and their children in turn. Dubai will be the world's airport, its port, its urban hub, and its new global center. HH Sheikh Mohammed

 

Link to comment
Share on other sites

Chennai: వావ్.. అంద‌రూ క‌లిసి నెల‌ల చిన్నారిని కాపాడారు.. వైర‌ల్ వీడియో!

29-04-2024 Mon 08:50 | National

చెన్నైలో నాలుగో అంత‌స్తు నుంచి కింద‌కు జారిప‌డ్డ ఏడు నెల‌ల చిన్నారి

అదృష్ట‌వ‌శాత్తూ మ‌రో అంత‌స్తు అంచున ప‌డి ఆగిన పాప‌

తిరుముల్లైవాయల్‌లోని హై-రైజ్‌ అపార్ట్‌మెంట్ సొసైటీలో ఘ‌ట‌న

cr-20240429tn662f121b53c25.jpg

త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో ఓ ఏడు నెల‌ల చిన్నారి ప్ర‌మాద‌వ‌శాత్తూ అపార్ట్‌మెంట్ నాలుగో అంత‌స్తు నుంచి కింద‌కు జారింది. అదృష్ట‌వ‌శాత్తూ మ‌రో అంత‌స్తు అంచున ప‌డి ఆగింది. దీంతో చిన్నారిని ర‌క్షించేందుకు హౌసింగ్ సొసైటీలోని ప‌లువురు ముందుకొచ్చారు. బెడ్ షీట్లు పట్టుకుని కొంత‌మంది కింద నిల్చున్నారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు వ్య‌క్తులు పైకెక్కి చిన్నారిని ర‌క్షించారు. తిరుముల్లైవాయల్‌లోని హై-రైజ్‌ అపార్ట్‌మెంట్ సొసైటీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. పాప‌ను ర‌క్షించిన వారిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

...

Complete article

 

Link to comment
Share on other sites

Harry Potter Castle destroyed in Russia attack: రష్యా దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం

01-05-2024 Wed 17:14 | International

ఉక్రెయిన్ లోని ఒడెస్సా నగరంలో ఉన్న హ్యారీపోటర్ కోట

ఇసికందర్ క్షిపణితో రష్యా దాడి

దాడిలో ఐదుగురి దుర్మరణం

cr-20240501tn66322b1439d92.jpg

ఉక్రెయిన్ పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో హ్యారీపోటర్ కోట ధ్వంసమయింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో ఈ కోట ఉంది. ఎంతో ప్రసిద్ది చెందిన ఈ కోట... అత్యంత సుందర భవనాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇసికందర్ క్షిపణికి క్లస్టర్ వార్ హెడ్ ను అమర్చి కోటపైకి రష్యా ప్రయోగించినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా... 30 మంది గాయపడినట్టు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. 

క్షిపణి ఢీకొన్న చోట నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వరకు శకలాలు పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి కారణంగా చుట్టుపక్కల ఉన్న మరో 20 భవనాలు కూడా దెబ్బతిన్నాయి. దాడికి సంబంధించిన చిత్రాలను ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ విడుదల చేశారు. ఇందులో ఓ సుందర భవనం అగ్నికీలలకు ఆహుతి అవుతున్న చిత్రం కూడా ఉంది. మరోవైపు ఖార్కీవ్ నగరంలోని ఓ రైల్వే లైన్ పై రష్యా గైడెడ్ బాంబ్ తో దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఉక్రెయిన్ లో రెండో పెద్ద నగరం ఖార్కీవ్.

...

Complete article

 

2024-04-29t183824z-1464969175-rc2ig7avl4

 

Gravitas: Russian attack destroys "Harry Potter castle" in Ukraine's Odesa, kills 5 | Ukraine War

 

Link to comment
Share on other sites

  • 3 months later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...