Jump to content
  • 1

Crime news


TELUGU

Question

Crime News | నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తిన భర్త.. పరిస్థితులను బట్టి అవతారాలను మార్చిన భార్య

బడా వ్యాపార వేత్తగా బిల్డప్‌ ఇస్తూ.. మ్యాట్రీమోని వెబ్‌సైట్ల ద్వారా పెళ్లిళ్ల కోసం ప్రయత్నిస్తున్న యువతులను మోసం చేస్తున్న ఘరానా దంపతులను సీసీఎస్‌ స్పెషల్‌ జోన్‌ క్రైమ్‌ టీమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

young-women_V_jpg--816x480-4g.webp?sw=17

ఘరానా దంపతులు అరెస్టు

Crime News | సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): బడా వ్యాపార వేత్తగా బిల్డప్‌ ఇస్తూ.. మ్యాట్రీమోని వెబ్‌సైట్ల ద్వారా పెళ్లిళ్ల కోసం ప్రయత్నిస్తున్న యువతులను మోసం చేస్తున్న ఘరానా దంపతులను సీసీఎస్‌ స్పెషల్‌ జోన్‌ క్రైమ్‌ టీమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్‌ డీసీపీ శ్వేత కథనం ప్రకారం.. యెలిగంటి రంజిత్‌ అలియాస్‌ రాధాకృష్ణ అలియాస్‌ రాకేశ్‌, సంధ్య దంపతులు. ఉప్పల్‌ పరిధిలోని ఫిర్జాదిగూడలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. 2022లో తమ సెల్‌ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తూ.. తెలుగు మ్యాట్రీమోని వెబ్‌సైట్లను పరిశీలించాడు. ఆ సమయంలో చాలా మంది యువతులు మ్యాట్రీమోని వెబ్‌సైట్లలో పెండ్లి కోసం తమ ప్రొఫైల్స్‌ అప్‌లోడ్‌ చేస్తున్న విషయాన్ని గుర్తించాడు.

దీంతో అతడు కూడా నిత్య పెండ్లి కొడుకు అవతారమెత్తాడు. యాప్‌లో ప్రొఫైల్‌ చూసి, పెండ్లికి సిద్ధం.. నేను ఫలానా దగ్గర ఉద్యోగం చేస్తున్నా.. నీ జీతం ఇంతా.. నేను బిల్డర్‌ను, ఫలానా వద్ద నా వెంచర్‌ నడుస్తున్నది.. ఇలా ధనవంతుడిగా తనకు తాను పరిచయం చేసుకున్నాడు. అతడి భార్య కూడా సహకరిస్తూ పరిస్థితులను బట్టి ఆమె ఒక్కో రకమైన వేషం మార్చింది. యువతులకు అతడిపై నమ్మకం కుదరగానే.. పర్సనల్‌గా కలుద్దామంటూ చెప్పి.. మాటలు కలుపుతాడు. ఆ తరువాత తనకు అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చిందంటూ.. కట్నం డబ్బులో మినహాయించుకోవచ్చు అంటూ.. రకరకాల కారణాలు చూపుతూ యువతుల వద్ద నుంచి అందినకాడికి దోచేశారు.

ఈ ఘటనపై కొందరు బాధితులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతి నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. నిందితులపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పదుల సంఖ్యలో బాధితులను, లక్షల్లో మోసాలు చేసినట్లు విచారణలో బయటపడింది. షాదీ.కామ్‌, తదితర మ్యాట్రీమోని సైట్లలో పెండ్లి సంబంధాలు చూసే సమయంలో వారి వారి ప్రొఫైల్‌ను జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే నిర్ణయాలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ దంపతుల బారినపడి మోసపోయిన వారెవరైనా ఉంటే.. పోలీసులను సంప్రదించాలని సూచించారు.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

Hyderabad man loses ₹18.50 lakh to parcel scam

A 51-year-old man from Hyderabad lost ₹18.50 lakh to a parcel scam.

The Hyderabad cybercrime police said the man received a call from a person claiming to be from DHL International Courier Services in Andheri, Mumbai, claiming that a parcel, with his Aadhaar ID, had arrived for him from Shanghai.

“He was told the parcel contained a bunch of ATM cards, 15 passports, a laptop, four kilogrammes of clothes and MDMA. They explained that the victim was in trouble and got on a WhatsApp video call with him, with the contact number showing the logo of the Mumbai police,” said the officials.

When he was told that there was an FIR on his name, he panicked and asked for a solution. The scammers then asked him to transfer money to a bank account in the name of ‘software analysis’. He ended up transferring ₹18.50 lakh. The police have registered a case.

Officials warned that if a call raises suspicions, the public should end the call immediately and without any fear, report the same to the nearest police station without engaging further.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Viral Video: Son beats father to death - కలియుగం పతాకస్థాయికి చేరుకుందా?.. ఆస్తి కోసం తండ్రిని కొట్టి చంపిన వీడియోపై నెటిజన్ల విస్మయం

29-04-2024 Mon 12:06 | National

తమిళనాడులోని పెరంబళూరులో ఘటన

కుమారుడి దెబ్బలకు తాళలేక తండ్రి మృతి

వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్ల ఫైర్

ఆ మృగాన్ని కూడా అలాగే ట్రీట్ చేయాలని డిమాండ్

cr-20240429tn662f40025d5b6.jpg

ఆస్తి సంబంధించిన గొడవలో కన్నతండ్రిని ముఖంపై విచక్షణ రహితంగా, ఆపకుండా పిడిగుద్దులు కురిపించి, ఆపై కాళ్లతో తన్ని ఆయన మరణానికి కారణమయ్యాడో కుమారుడు. తమిళనాడులోని పెరంబళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ ప్రైవేటు కంపెనీ యజమాని అయిన 65 ఏళ్ల కులందైవేలు ఇంట్లో సోఫాపై కూర్చుని ఉండగా కోపంగా వచ్చిన కుమారుడు సంతోష్ ఆయన ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో రక్తం కారుతూ ఆయన అలాగే కుప్పకూలిపోయారు. ఈ నెల 18న ఆయన మరణించారు. ఆ తర్వాత కూడా కోపం చల్లారని సంతోష్ కాళ్లతో తండ్రిని తన్నాడు. తండ్రిపై దాడిచేస్తున్న కుమారుడిని చూసిన ఇతర కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని అతడిని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విడిపించుకుని తండ్రిపై దాడి చేయాలన్న కోపంతో ఊగిపోయాడు. 

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సంతోష్‌పై కేసు నమోదైంది.  వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కలియుగం పతాకస్థాయికి చేరుకుందని కొందరు కామెంట్ చేస్తే.. కన్నతండ్రిపై ఇంత దారుణంగా దాడిచేసిన అతడిని కఠినంగా శిక్షించాలని మరికొందరు డిమాండ్ చేశారు. పోలీసులు అతడిని కూడా అదే విధంగా చేయాలని ఇంకొందరు కోరారు. ఇలాంటి మృగం విషయంలో పోలీసులు ఇంకా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

...

Complete article

WARNING: GRAPHIC AND DISTURBING CONTENT!!

क्या पता था इस बाप को जो उसका बेटा है वही उसकी जान लेने पर उतारू हो जायेगा। कुछ प्रॉपर्टी के चक्कर में इस व्यक्ति को अपने पिता को बेरहमी से पीटा जिसके बाद सदमे में उनकी मौत भी हो गई। सच में कलयुग अपने पीक स्टेज पर है।

 

Link to comment
Share on other sites

  • 0

Sahil Khan: 4 రాష్ట్రాలు.. 5 రోజులు.. 1800 కిలోమీటర్లు.. పోలీసులకు దొరక్కుండా సాహిల్ పరుగులు

29-04-2024 Mon 12:10 | Entertainment

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో అరెస్టైన యాక్టర్ సాహిల్ ఖాన్

రాష్ట్రాలు తిరుగుతూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు

చివరకు ఛత్తీస్ గఢ్ లో పోలీసులకు చిక్కిన బాలీవుడ్ యాక్టర్

cr-20240429tn662f40ec88008.jpg

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ యాక్టర్ సాహిల్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ అరెస్టును తప్పించుకోవడానికి సాహిల్ చాలా గట్టిగానే ప్రయత్నించాడట. నాలుగు రోజులు రోడ్లపై పరుగులు తీస్తూనే ఉన్నాడట. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వివిధ ప్రయాణ సాధనాలలో తిరిగాడని, ఓవైపు పరుగులు పెడుతూనే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 25న రోడ్డెక్కిన సాహిల్.. నాలుగు రోజుల్లో ఐదు రాష్ట్రాలు తిరిగాడని, పోలీసులకు చిక్కకుండా ఏకంగా 1800 కిలోమీటర్లు ప్రయాణించాడని సమాచారం.

బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుల ప్రమేయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసులో తన పేరు కూడా బయటకు రావడంతో సాహిల్ ఖాన్ అప్రమత్తమయ్యాడు. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. సాహిల్ ను అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో వెనక్కి తగ్గారు. అయితే, ఈ నెల 25 న సాహిల్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి సాహిల్ విశ్వ ప్రయత్నమే చేశాడు. ఈ నెల 25న మహారాష్ట్ర నుంచి గోవాకు చేరుకున్న సాహిల్.. అక్కడి నుంచి కర్ణాటకలోని హుబ్బళికి, అటుపై హైదరాబాద్ కు చేరుకున్నాడు.

తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని ముఖానికి స్కార్ఫ్ చుట్టుకున్నాడు. అయితే, సాహిల్ ను ట్రాక్ చేసిన పోలీసులు ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసి సాహిల్ హైదరాబాద్ నుంచి జెండా ఎత్తేసి ఛత్తీస్ గఢ్ కు పారిపోయాడు. రోడ్డు బాలేదని, రాత్రి పూట కారు నడపలేనని డ్రైవర్ చెప్పినా సాహిల్ వినిపించుకోలేదు. రాత్రికిరాత్రే జగదల్ పూర్ కు చేరుకుని ఆరాధ్య ఇంటర్నేషనల్ హోటల్ లో దిగాడు. అయినా పోలీసుల కళ్లుగప్పలేకపోయాడు. సాహిల్ ఎక్కడున్నది ఎప్పటికప్పుడు ట్రాక్ చేసిన పోలీసులు జగదల్ పూర్ లోని హోటల్ లో అతడిని అదుపులోకి తీసుకుని ముంబై తరలించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Karnataka: అమాన‌వీయం.. మూగ కొడుకును మొస‌ళ్ల న‌దిలో విసిరేసిన త‌ల్లి!

Deaf kid thrown into a river of crocodiles!

క‌ర్ణాట‌క‌లోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలో ఘ‌ట‌న

పుట్టు మూగ కొడుకు విష‌య‌మై భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌

ఇదే విష‌య‌మై ఇటీవ‌ల మ‌రోసారి దంప‌తుల‌ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

విసుగెత్తిన త‌ల్లి మూగ కొడుకును మొస‌ళ్ల న‌దిలో విసిరేసిన వైనం

cr-20240506tn663851e697f86.jpg

క‌ర్ణాట‌క‌లోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలో అమాన‌వీయ ఘ‌ట‌న జ‌రిగింది. భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డిన భార్య మూగ‌వాడైన ఆరేళ్ల కుమారుడిని మొస‌ళ్లు ఉండే న‌దిలో విసిరేసింది. దాంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ర‌వి కుమార్, సావిత్రి దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు. పెద్ద కొడుకు పుట్టు మూగ‌. దాంతో ఆ పిల్లాడి విష‌య‌మై సావిత్రితో భ‌ర్త త‌ర‌చూ గొడ‌వ ప‌డేవాడు. 

ఎందుకు అలా మూగ‌వాడికి జ‌న్మ‌నిచ్చావంటూ, ఆ పిల్లవాడిని ఎక్క‌డైనా వ‌దిలేసి రావాల‌ని భార్య‌తో ర‌వి కుమార్‌ మూర్ఖంగా ఘ‌ర్ష‌ణ‌ప‌డేవాడు. ఇదే విష‌య‌మై శ‌నివారం సాయంత్రం మ‌రోసారి వారి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. భ‌ర్త గొడ‌వ‌ల‌తో విసుగెత్తిపోయిన‌ సావిత్రి మూగ కొడుకును తీసుకెళ్లి మొస‌ళ్లు ఉండే కాళి న‌దిలో విసిరేసింది. సావిత్రి త‌న కుమారుడిని న‌దిలో విసిరేయ‌డం చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు గ‌జ ఈత‌గాళ్ల సాయంతో బాలుడి కోసం వెతికించారు. 

కానీ, అప్ప‌టికే చీక‌టి ప‌డ‌డంతో బాలుడు దొర‌క‌లేదు. ఆదివారం ఉద‌యం బాలుడి మృత‌దేహాన్ని పోలీసులు వెలికితీశారు. పిల్లాడి శ‌రీరంపై గాయాలు ఉండ‌డంతో పాటు ఒక చేయి కూడా లేక‌పోవ‌డంతో మొస‌ళ్లు దాడి చేసి ఉంటాయ‌ని పోలీసులు వెల్ల‌డించారు. అనంత‌రం బాలుడి మృత‌దేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రినీ అదుపులోకి తీసుకున్న దండేలి రూర‌ల్ పోలీసులు వారిపై సెక్ష‌న్ 109, 302 కింద కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ట్లు తెలిపారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

NRI Student stabbed: అస్ట్రేలియాలో ఎన్నారై హత్య.. ఇద్దరు భారతీయ సోదరుల అరెస్టు!

09-05-2024 Thu 06:49 | NRI

ఆస్ట్రేలియాలో ఎంటెక్ విద్యార్థి నవ్‌జీత్ సంధూ హత్య

నవ్‌జీత్‌ను కత్తితో ఛాతిలో పొడిచి హత్య చేసిన ఇద్దరు భారత విద్యార్థులు

ఇంటి రెంటు విషయంలో విద్యార్థుల మధ్య గొడవ పరిష్కరించే ప్రయత్నంలో ఘటన

పరారీలో ఉన్న నిందితులను తాజాగా అరెస్టు చేసిన పోలీసులు 

మృతుడు, నిందితులు హర్యానాలోని కర్నాల్ జిల్లా వాసులుగా గుర్తింపు

cr-20240509tn663c249f82cd2.jpg

ఆస్ట్రేలియాలో హర్యానా విద్యార్థి నవ్‌జీత్ సంధూ హత్య కేసులో ఇద్దరు భారత విద్యార్థులను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. విక్టోరియా పోలీస్ హోమిసైడ్ డిటెక్టివ్‌లు మంగళవారం పరారీలో ఉన్న నిందితులు అభిజిత్ (26), రాబిన్ గార్టాన్ (27)ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు, నిందితులు హర్యానాలోని కర్నాల్‌ జిల్లాకు చెందిన వారని తెలిసింది. 

ఆదివారం మెల్బోర్న్‌లోని ఓర్మాండ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ హత్య జరిగింది. ఆ రాత్రి సంధూను నిందితులు ఛాతిలో పొడిచి చంపేశారు. ఇంటి రెంటు విషయంలో కొందరు విద్యార్థుల మధ్య గొడవ జరుగుతుండగా సంధూ మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే హత్య జరిగిందని మృతుడి బంధువు తెలిపాడు. కాగా, నిందితులిద్దరూ అన్నదమ్ములని తెలిసింది. ఇక మెల్బోర్న్‌లో ఎంటెక్ చదువుతున్న సంధూ 2022 నవంబర్‌లో ఆస్ట్రేలియా వెళ్లాడు. 

సంధూది సామాన్య రైతు కుటుంబం. తల్లిదండ్రులకు అతడొక్కడే కొడుకు. కుమారుడి మరణంతో కష్టాల్లోపడ్డ తల్లిదండ్రులను ఆదుకునేందుకు ఆన్‌లైన్‌లో గోఫండ్ మీ పేజ్ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించారు. ‘‘నవ్‌జీత్ సింగ్ సంధూ తెలివైన విద్యార్థి. అతడు ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాడు. ఓ వివాదంలో మధ్యవర్తిత్వం నెరపే క్రమంలో దురదృష్టవశాత్తూ కన్నుమూశాడు. తన కుటుంబ భవిష్యత్తు కోసం అతడు స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వచ్చాడు. అతడి తల్లిదండ్రులకు సంధూ ఒక్కడే కొడుకు. అతడికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు’’ అని సంధూ గోఫండ్‌మీ పేజ్‌లో పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Sai Varshith Kandula: వైట్‌హౌస్‌పై దాడి.. నేరం అంగీక‌రించిన తెలుగు కుర్రాడు!

16-05-2024 Thu 11:58 | NRI

గ‌తేడాది అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్‌హౌస్‌పై దాడికి య‌త్నించిన సాయి వ‌ర్షిత్ కందుల

గత ఏడాది మే 22న ఒక ట్ర‌క్కుతో స‌రాస‌రి శ్వేత‌సౌధంలోకి దూసుకెళ్లేందుకు య‌త్నం

నాజీల స్ఫూర్తితో అగ్ర‌రాజ్యంలో అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌నే ఇలా చేశానంటూ కోర్టులో అంగీక‌రించిన తెలుగు కుర్రాడు

cr-20240516tn6645aa93c2851.jpg

హైద‌రాబాద్‌కు చెందిన సాయి వ‌ర్షిత్ కందుల (20) గ‌తేడాది అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్‌హౌస్‌పై దాడికి య‌త్నించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కోర్టులో త‌న నేరాన్ని అత‌డు అంగీక‌రించాడు. మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో నివాసం ఉండే అతడు గత ఏడాది మే 22న వాషింగ్ట‌న్ డీసీ చేరుకున్నాడు. ఆ త‌ర్వాత‌ ఒక ట్ర‌క్కుని అద్దెకు తీసుకుని స‌రాస‌రి శ్వేత‌సౌధంలోకి దూసుకెళ్లేందుకు య‌త్నించి సెక్యూరిటీ అధికారుల‌కు దొరికిపోయాడు. జ‌ర్మ‌నీకి చెందిన‌ నాజీల స్ఫూర్తితో అగ్ర‌రాజ్యంలో అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌నే ఇలా చేశానంటూ వ‌ర్షిత్ పోలీసుల వ‌ద్ద చెప్పాడు. 

కాగా, వ‌ర్జీనియాలోని డల్లెస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కందుల వ‌ర్షిత్ ట్రక్కును అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. సంఘ‌ట‌న రోజు రాత్రి 9:35 గంటలకు శ్వేత‌సౌధానికి వెళ్లాడు. ఆ త‌ర్వాత ట్ర‌క్కు న‌డుపుతూ భ‌ద్ర‌తా సిబ్బందిని దాటుకుని లోప‌లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే, ఉన్న‌ట్టుండి ట్ర‌క్కు ఆగిపోవ‌డంతో సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోయాడు. ఆ స‌మ‌యంలో అత‌డు నాజీ స్వస్తిక్ జెండాను కూడా ప్రదర్శించాడు. దాంతో యూఎస్‌ పార్క్ పోలీసులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు ఘటనా స్థలంలో వ‌ర్షిత్‌ను అరెస్టు చేశారు.

అమెరికా న్యాయవాది మాథ్యూ గ్రేవ్స్ మాట్లాడుతూ.. "ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని జ‌ర్మ‌నీ నాజీ భావజాలమైన‌ నియంతృత్వంతో భర్తీ చేయడం వ‌ర్షిత్‌ ఉద్దేశమ‌ని పేర్కొన్నారు. అతను తన లక్ష్యాలను సాధించడానికి అధ్యక్షుడు సహా యూఎస్ కీల‌క‌ అధికారులను హత్య చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఇక ఈ దాడి వలన భారీ ఆర్థిక నష్టం జరిగింది. యూ-హౌల్ ఇంటర్నేషనల్‌కు 50వేల డాల‌ర్లు, మరమ్మతుల‌ కోసం నేషనల్ పార్క్ సర్వీస్‌కు 4,322 డాల‌ర్ల ఖర్చు అయింది. వ‌ర్షిత్‌ తన పన్నాగాన్ని అమ‌లు చేయ‌డానికి వారాల తరబడి దాడికి ప్లాన్‌ చేశాడని న్యాయ శాఖ పేర్కొంది. కాగా, వ‌ర్షిత్ కందుల‌కు ఆగ‌స్టు 23వ తేదీన యూఎస్‌ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి డాబ్నీ ఎల్‌. ఫ్రెడరిచ్ శిక్షను ఖ‌రారు చేయ‌నున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Hyderabad origin youth pleads guilty for White House attack

Sai Varshith Kandula, a 20-year-old with family ties to Hyderabad’s Chandanagar area and living in the United States on a Green Card, has admitted to charges of damaging federal property.

The incident occurred last year when Kandula embarked on a journey from St. Louis, Missouri, to Washington D.C. Upon reaching the capital, he rented a U-Haul truck and deliberately drove it into Lafayette Square, a park located just north of the White House.

Following the crash, Kandula unfurled a Nazi flag, an act that drew significant attention and raised alarms about his motives. When apprehended by law enforcement officers, Kandula revealed his intentions to the police. He stated that his plan was to get to the White House, seize power, and take control of the nation. His actions and statements indicated a desire to disrupt the government and instate himself as the leader of the country.

 

Link to comment
Share on other sites

  • 0

Chudidar Gang robberies: చెడ్డీ గ్యాంగ్ తరహాలో చుడీదార్ గ్యాంగ్... ఎక్కడో కాదు హైదరాబాదులోనే!

20-05-2024 Mon 15:38 | Telangana

గతంలో హైదరాబాదులో చెడ్డీ గ్యాంగ్ విజృంభణ

నిక్కర్లు, బనియన్లు ధరించి దోపిడీలు

అదే కోవలో ఇప్పుడు చుడీదార్లు ధరించి దొంగతనాలు

ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని జెక్ కాలనీలో ఘటన

cr-20240520tn664b211022a98.jpg

హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైట్ నిక్కర్లు, బనియన్లు మాత్రమే ధరించి చోరీలకు పాల్పడడం ఈ ముఠా ప్రత్యేకత. ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే చుడీదార్ గ్యాంగులు బయల్దేరినట్టు అర్థమవుతోంది. అందుకు వీడియోనే నిదర్శనం. 

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెక్ కాలనీలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆకృతి ఆర్కేడ్ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. చుడీదార్ ధరించిన దొంగలు ఆయన ఇంట్లోకి చొరబడి రూ.1 లక్ష నగదు, ఒక ల్యాప్ ట్యాప్, నాలుగు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అపార్ట్ మెంట్ సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

...

Complete article

సీసీటీవీ ఫుటేజ్.. హైదరాబాద్‌లో చెడ్డి గ్యాంగ్‌ తరహాలో కొత్తగా చుడీదార్ గ్యాంగ్ కలకలం ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చుడీదార్ వేసుకుని వచ్చి 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ చోరీ చేశారు.

 

Link to comment
Share on other sites

  • 0

Telangana: 2 వేలు పెట్టుబడి పెడితే సూపర్ ప్రాఫిట్.. ఆపై 69 లక్షలు ఇన్వెస్ట్.. కట్ చేస్తే..

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో అమాయకుల బ్యాంక్‌ ఖాతాలను కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి భారీగా మోసపోయాడు. లాభాలు ఇప్పిస్తామని చెప్పడంతో పలు దఫాలుగా రూ.69 లక్షలు జమ చేశాడు బాధితుడు. చివరకూ మోసపోయానని గ్రహించి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

stock-trading.jpg?w=1280

సంగారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్‌కు సంబంధించిన మెసేజ్‌ రావడంతో.. వివరాలను యాప్‌లో నమోదు చేసిన అమీన్‌పూర్‌ పరిధిలోని భవానీపురానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి భారీగా మోసపోయాడు. లాభాలు ఇప్పిస్తామని చెప్పడంతో పలు దఫాలుగా రూ.69 లక్షలు జమ చేశాడు బాధితుడు. చివరకూ మోసపోయానని గ్రహించి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదులో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదట యాప్‌లో రూ.2 వేలు పెట్టుబడి పెట్టిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగికి లాభాలు చూపించారు. లాభాలు భారీగా రావడంతో తర్వాత 15.37లక్షలు యాప్‌లో జమ చేశాడు. తన లాభం, అసలు డబ్బు చెల్లించాలని కోరగా యాప్‌ నుంచి స్పందన లేదు. అమీన్‌పూర్‌ పరిధిలోని హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన స్టాక్‌ ట్రేడర్‌ ఆన్‌లైన్‌లో ట్రేడింగ్‌ చేస్తుండేవాడు. ఆయన కూడా ఇలాగే సైబర్‌ వలకు చిక్కాడు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌లో 27.71 లక్షలు జమ చేశాడు.

కొన్ని రోజుల తర్వాత యాప్‌ మార్ఫింగ్‌ లోగోతో ఉన్నట్టు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి వద్దనే ఉంటూ సింపుల్ గా లక్షలు సంపాదించాలనే ఆశతో సైబర్ నేరగాళ్లు పంపే లింక్‌లను క్లిక్‌ చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు యాప్‌లో పెట్టుబడి పెట్టండి..టాస్క్‌లు పూర్తి చేస్తే లక్షల్లో డబ్బు ఇస్తాం..కేవలం ఫొటోలకు, వీడియోలకు లైక్‌ కొట్టి వేలల్లో సంపాదించొచ్చు అంటూ ఇలా సైబర్‌ నేరగాళ్లు ఎంతోమందిని బురిడీ కొట్టేస్తున్నారు. లక్షల్లో డబ్బును కాజేస్తున్నారు. ఇలాంటి కేసులు ఒక్క సంగారెడ్డి జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకు 323 సైబర్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు బాధితులు సైబర్‌ నేరగాళ్ల చేతిలో 22.71 కోట్ల వరకు మోసపోయారు. ఇందులో సకాలంలో బాధితులు ఫిర్యాదు చేయగా రూ.3.62 కోట్ల వరకు ఫ్రీజ్‌ చేసారు.

 

Link to comment
Share on other sites

  • 0

Cyber Fraud card activation: ఇదో కొత్త రకం సైబర్ మోసం.. అదమరిస్తే అంతే సంగతులు.. కార్డ్ అక్టివేషన్ పేరుతో ఖాతా ఖాళీ!

ఎంతగా చైతన్యం తెస్తున్నప్పటికీ, భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ, రోజురోజుకూ సైబర్‌ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసు శాఖ, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒకచోట ప్రజలు సైబర్‌ మోసాల బారిన పడుతూనే ఉన్నారు.

cyber-crime-3.jpg?w=1280

ఎంతగా చైతన్యం తెస్తున్నప్పటికీ, భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ, రోజురోజుకూ సైబర్‌ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసు శాఖ, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒకచోట ప్రజలు సైబర్‌ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నా నూరిళ్ల, రిజ్వనా అనే దంపతులను సైబర్ నేరగాళ్లు భలే బురిడీ కొట్టించారు. నూరిళ్ల, భార్య రిజ్వనాకు చెరో ఒకటి RBL బ్యాంకు నుండి క్రెడిట్ కార్డులు ఇంటికి వచ్చాయి. ఆ తరువాత వాటిని యాక్టివేట్ చేయాలని సైబర్ నేరగాళ్ళు భార్య, భర్తలకు ఇద్దరికీ కాల్ చేసి నమ్మబాలికారు. వారిని నమ్మిన నూరిళ్ల తన సెల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీలు వారికీ చెప్పడంతో వెంటనే అకౌంట్ నుండి మొదటిసారి రూ.51,445,రెండవ సారి రూ.51,475 ఇలా విడతల వారీగా రూ.1,85,000 నగదు మొత్తం కాజేశారు. తన అకౌంట్ నుండి డబ్బులు కట్ అవడాన్ని గమనించిన నూరిళ్ల తాను మోసపోయానని గ్రహించారు. దీంతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 0

Restaurant owner cheated of Rs. 96,000: టీ తాగేందుకు వచ్చి హోటల్ యజమానికి టోకరా.. రూ. 96 వేలు హాంఫట్

టెక్నాలజీ పెరగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. టెక్కాలజీని ఉపయోగించి కేటుగాళ్లు ఎన్నో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా హోటల్‌లో టీ తాగేందుకు వచ్చిన వ్యక్తి.. ఏకంగా ఆ హోటల్‌ నిర్వాహకుడి ఫోన్‌ నుంచే 96వేల రూపాయలు కొట్టేశాడు. సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

online-fraud.jpg?w=1280

టెక్నాలజీ పెరగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. టెక్కాలజీని ఉపయోగించి కేటుగాళ్లు ఎన్నో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా హోటల్‌లో టీ తాగేందుకు వచ్చిన వ్యక్తి.. ఏకంగా ఆ హోటల్‌ నిర్వాహకుడి ఫోన్‌ నుంచే 96వేల రూపాయలు కొట్టేశాడు. సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

విషయం తెలుసుకున్న ఆ హోటల్ యజమానితోపాటు, గ్రామస్తులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే…అక్కన్నపేట మండల కేంద్రంలోని హోటల్‌లో టీ తాగేందుకు వచ్చిన ఓ వ్యక్తి, డబ్బులు చెల్లించే నెపంతో అతని నుంచే తస్కరించాడు. ఏకంగా ఆ హోటల్‌ నిర్వాహకుడి ఫోన్‌ నుండి గూగుల్‌ పే ద్వారా రూ.96వేలు చోరీ చేశాడు. రాజస్థాన్‌కు చెందిన నారాయణ అనే వ్యక్తి గత ఐదేళ్లుగా అక్కన్నపేట మండల కేంద్రంలో హోటల్‌ నిర్వహిస్తున్నాడు. ఆయన హోటల్‌కు చత్తీస్ ఘడ్‌కు చెందిన ఓ వ్యక్తి టీ తాగేందుకు వచ్చాడు. టీ తాగిన తర్వాత తన వద్ద డబ్బులు లేవని తన మిత్రుడు గూగుల్‌ పే ద్వారా డబ్బు పంపిస్తాడని చెప్పి ఫోన్‌ చేసి నంబర్‌ చెప్పాలని హోటల్‌ నిర్వాహకుడు నారాయణను కోరాడు.

దీంతో ఆ హోటల్‌ నిర్వాహకుడు ఆ వ్యక్తి చెప్పిన నంబర్‌కు ఫోన్‌ చేయడంతో 500 రూపాయలు అవతలి వ్యక్తి గూగుల్‌ పే చేశాడు. అనంతరం సదరు వ్యక్తి హోటల్‌ నిర్వాహకుడిని ఒకసారి ఫోన్‌ ఇవ్వాలని, తన స్నేహితుడికి ఫోన్‌ చేసి మాట్లాడుతానని తీసుకుని నారాయణ గూగుల్‌ పే నుండి రూ.96వేలు తన స్నేహితుడి ఫోన్‌ నంబర్‌కు పంపించాడు. పనిలో పడిన హోటల్‌ నిర్వాహకుడు నారాయణ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత చూసే సరికి తన అకౌంట్‌లో డబ్బులు ఖాళీ అవ్వడంతో షాక్ అయ్యాడు. తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే అక్కన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు హోటల్‌ నిర్వాహకుడు నారాయణ. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Crime News: పరాయి బంధం కోసం.. పేగు బంధాన్నే తెంచేస్తున్నారు.. ఇది దేనికి సంకేతం?

మనిషి మృగంలా మారుతుంటే.. బంధాలు, అనుబంధాల బందాలు తెగిపోతున్నాయి. మానవ సంబంధాలు మసైపోతున్నాయి. ఏకాకి జీవితం నాది అంటూ కుటుంబానికి, కుటుంబ బంధాల్లోని మాధుర్యానికి నోచుకోక కొందరు అలమటిస్తుంటే.. పరాయి మనుషుల మోజులో పడి.. కుటుంబాల్ని సొంత చేతులతోనే సర్వనాశనం చేసుకునేవాళ్లు మరికొందరు.

crime-news-3.jpg?w=1280

మనిషి మృగంలా మారుతుంటే.. బంధాలు, అనుబంధాల బందాలు తెగిపోతున్నాయి. మానవ సంబంధాలు మసైపోతున్నాయి. ఏకాకి జీవితం నాది అంటూ కుటుంబానికి, కుటుంబ బంధాల్లోని మాధుర్యానికి నోచుకోక కొందరు అలమటిస్తుంటే.. పరాయి మనుషుల మోజులో పడి.. కుటుంబాల్ని సొంత చేతులతోనే సర్వనాశనం చేసుకునేవాళ్లు మరికొందరు. పేట్రేగిపోతున్న క్రైమ్‌ కల్చర్‌లో మానవ సంబంధాలనే మాట మంటగలిచి పోతోంది. క్షణికావేశంతో, ఐహిక సుఖాల కోసం నేరాలకు పాల్పడి, తమ వాళ్లను తామే మట్టుబెట్టడం దేనికి సంకేతం?

కనిపెంచిన తల్లి, కట్టుకున్న భార్య, సర్వస్వం అనుకున్న భర్త… దీపం వెలిగించి… కుటుంబాల్ని బతికించి వెలుగులు ఇవ్వాల్సిన ఈ బంధాలే బతుకుల్ని బండ బారుస్తున్నాయి. నిండు జీవితాల్ని బుగ్గిపాలు చేస్తున్నాయి. పంచభూతాల సాక్షిగా ఏర్పడిన బంధాల విలువను మర్చిపోయి, మానవ సంబంధాలు మట్టిలో కలిపేసి.. తమ జీవితాలను తామే కాలరాసుకుంటున్న సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీచర్ ఉద్యోగం చేసుకుంటూ కూతురిని ఉన్నత స్థానంలో చూసుకోవాలని పరితపిస్తున్న తండ్రిని.. ఆ కన్న కూతురే కాటేసింది. ప్రియుడి మోజులో పడి.. కన్న తండ్రినే కడతేర్చింది పాతికేళ్ల హర్షిత. మదనపల్లి ఎగువ కురువ వంకలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో టీచర్ దొరస్వామి ఫ్యామిలీ నివాసం ఉంటోంది. రెండేళ్ల క్రితం దొరస్వామి భార్య లత అనారోగ్యంతో మృతి చెందడంతో ఇంట్లో తండ్రి, కూతురు మాత్రమే ఉంటున్నారు. అయితే 25 ఏళ్ల హర్షిత ఇద్దరు అబ్బాయిలతో ప్రేమాయణం నడుపుతోంది. ఈ విషయం తెలిసిన దొరస్వామి.. హర్షితకు కుప్పంలో పెళ్లి సంబంధం చూశాడు. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని హర్షిత.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే హత్య చేయించింది. బీఈడీ చదివిన హర్షిత.. తండ్రినే చంపి ఇప్పుడు కటకటాలపాలైంది.

ఆదిలాబాద్‌‌లోనూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి జీవితం విషాదాంతమైంది. గాదిగూడ మండలం అర్జుని కొలాంగూడ శివారులో జాదవ్ గజానంద్ అనే 40 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. తలపై బండరాయితో కొట్టి.. కిరాతకంగా చంపారు. ఈ హత్య కేసును విచారించేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాథోడ్ రమేష్ అనే ప్రియుడి మోజులో పడిన భార్య విజయలక్ష్మి.. తన అపవిత్ర బంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో భర్తనే హత్య చేయించి ఏమీ తెలీనట్టుగా వ్యవహరించింది. అయితే విజయలక్ష్మికి ప్రియుడు రాథోడ్ రమేష్‌కి మధ్య ఫోన్ సంభాషణలు, మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.

పరాయి బంధం కోసం.. పేగు బంధాన్నే తెంచేసిన ఓ కసాయి తల్లి ఉదంతం.. పటాన్‌చెరులో వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేటకు చెందిన కర్రె స్వాతి కుటుంబం ఆర్సీపురంలో నివాసం ఉంటోంది. భర్త రాజు చనిపోవడంతో.. కుమారుడు విష్ణువర్థన్, కుమార్తెతో కలిసి స్వాతి ఆర్సీపురంలోనే ఉంటోంది. ఆమెకు అదే బస్తీలో ఉంటున్న ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చీమకుర్తికి చెందిన దొంతు అనిల్‌‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఈ విషయం తెలిసిన కొడుకు… తల్లిని వారించాడు. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల పదవ తేదీన కూడా కొడుకు నిలదీశాడు. వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని సూచించాడు. కానీ కన్న కొడుకు కంటే అనిల్‌తో అపవిత్ర బంధమే ఆ తల్లికి ముఖ్యమైంది. ఆ చిన్నారిని గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత టవల్‌తో బాలుడి మెడకు ఉరేసి కిటికీకి వేలాడదీసింది. బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అర్థరాత్రి ప్రియుడు అనిల్‌తో కలిసి స్కూటీ మీద కుమారుడి డెడ్ బాడీ తీసుకెళ్లిన స్వాతి.. ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు‌ పక్కన పొదల్లో పడేసింది. ఉదయాన్నే డెడ్‌బాడీని గుర్తించిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకుని.. తమదైన స్టైల్‌లో విచారించడంతో.. కన్నతల్లి కర్కశత్వం వెలుగులోకి వచ్చింది.

ఇక ఖమ్మం పట్టణానికి చెందిన భవానీది మరో విచిత్రమైన గుండె గోస. పుట్టుకతో వచ్చిన లోపం ఆమె పాలిట శాపంగా మారింది. అత్తింటి వేధింపులతో అరణ్య రోధన అనుభవిస్తోంది. ఖమ్మం పట్టణానికి చెందిన భవానీకి, బోనకల్లుకు చెందిన భాస్కరాచారికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భవానీకి అందరిలాగా ఎడమవైపు కాకుండా కుడివైపున గుండె ఉంది. పెళ్లైన 16రోజులకు అత్తింటి వారికి ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి ఆమెకు గుండె గోస మొదలైంది. భవానీని భర్త భాస్కరాచారి దూరం పెట్టారు. తనకు న్యాయం చేయాలని అత్తమామలను వేడుకున్నా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని పోలీసుల దగ్గరకు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. భాస్కరాచారి తండ్రి హెడ్ కానిస్టేబుల్ కావడంతో పోలీసుల దగ్గర న్యాయం జరగడం లేదని భవానీ కోర్టుకు వెళ్లింది. గుండె కుడివైపుకు ఉన్నా కాపురం చేయొచ్చని కోర్టు తీర్పు చెప్పింది. ఆ కోర్ట్ తీర్పును పట్టుకుని భర్త కోసం అత్తవారింటికి భవానీ వెళ్తే.. తన మామ తీవ్రంగా కొట్టడం అత్యంత బాధాకరం.

మనిషికీ మనిషికీ మధ్య దూరం తగ్గించాల్సిన రక్త సంబంధాలు.. సరికొత్త రక్తచరిత్రలకు సిరాక్షరాలుగా మారుతున్నాయి. అయినవాళ్లనే నెత్తుటి మడుగులో చూడాల్సిన ఖర్మలు దాపురిస్తున్నాయి. మనవాళ్లను చంపడమంటే మనల్ని మనమే చంపుకోవడం.. మానవ సంబంధాలకు పాతరెయ్యడం. క్షణికావేశం వదిలిపెట్టి.. అరక్షణం ఆలోచిస్తే చాలు.. ఈ రక్తపాతాలు ఆగిపోతాయి. కానీ.. ఆలోచించేదెవ్వరు..?

Link to comment
Share on other sites

  • 0

How to double money by dipping it in colored water? రంగునీటిలో ముంచి నగదు మాయం చేసిన కేటుగాళ్లు.. కంగుతిన్న పోలీసులు..

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమాలో బంగారాన్ని నదిలో వేస్తే రెట్టింపు అవుతుందని మోసం చేసిన సీన్ తరహాలోనే అమాయకులను బురిడీ కొట్టించింది ఓ ముఠా. కాకపోతే ఆ సీన్‎లో బంగారం బదులు.. నగదును ఉంచి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ కేటుగాళ్లు చేసిన మోసాన్ని చూసి పోలీసులే షాక్ తిన్నారు.

nalgonda-1.jpg?w=1280

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమాలో బంగారాన్ని నదిలో వేస్తే రెట్టింపు అవుతుందని మోసం చేసిన సీన్ తరహాలోనే అమాయకులను బురిడీ కొట్టించింది ఓ ముఠా. కాకపోతే ఆ సీన్‎లో బంగారం బదులు.. నగదును ఉంచి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ కేటుగాళ్లు చేసిన మోసాన్ని చూసి పోలీసులే షాక్ తిన్నారు. డబ్బులు రెట్టింపు చేస్తామంటూ బురిడి కొట్టించిన ముఠాను పోలీసులు కటకటాలపాలు చేశారు.

బీహార్‎కు చెందిన రామ్ నరేష్ యాదవ్.. తాపీ మేస్త్రిగా నల్లగొండ మండలం చందనపల్లిలో పనిచేశాడు. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ రామాచారి ఇంటికి కూడా తాపీ మేస్త్రిగా పనిచేయడంతో ఇద్దరు మధ్య పరిచయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం రామ్ నరేష్ యాదవ్ బీహార్‎కు చెందిన అతని ఫ్రెండ్స్ షేక్ సిరాజ్, షేక్ అఫ్తాబ్‎లు ఆర్ఎంపీ డాక్టర్ రామాచారి ఇంటికి వెళ్లారు. డబ్బులను రెట్టింపు చేసే లిక్విడ్ ఉందని చెప్పారు. మీ దగ్గర ఉండే డబ్బును రెట్టింపు చేసి ఇస్తామని ఆశ చూపించారు. వారి మాటలను నమ్మిన రామాచారి అతని బావమరిది భూమి కొనుగోలు చేసేందుకు తెచ్చిన రూ.33 లక్షల నగదును తన ఇంటి ఫస్ట్ ఫ్లోర్‎లో వారికి ఇచ్చారు.

లిక్విడ్‎తో నగదు మాయం..

కేటుగాళ్లు తమ వెంట తెచ్చుకున్న లిక్విడ్‎ను బకెట్లో పోసి రూ. 33 లక్షలను అందులో ముంచి బయటకు తీసి బ్రౌన్ టేప్‎తో బండిల్స్‎గా కట్టారు. గంట తర్వాత వాటిని స్టవ్‎పై వేడిచేసి ఒక రోజు తర్వాత ఓపెన్ చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించారు. లిక్విడ్‎లో ముంచి తీసిన బండిల్స్‎కు హైదరాబాద్‎కు వెళ్లి లేబుల్స్ కొనుక్కొస్తామని కేటుగాళ్లు చెప్పారు. ఇంతలోనే అమరేంద్ర చారి తన ఇంటికి వెళ్ళగా, పేషెంట్ వచ్చాడని రామాచారి మొదటి ఫ్లోర్ నుండి కిందికి దిగాడు. ఇదే అదునుగా దుండగులు తమ ప్లాన్‎ను ఆచరణలో పెట్టారు. అప్పటికే రామ్ నరేష్ యాదవ్, సిరాజ్‎లు తమవద్ద ఉన్న బ్యాగులో కింద ఒకటి.. పైనఒకటి ఒరిజినల్ రూ.500 నోట్లు పెట్టి.. మధ్యలో తెల్లటి కాగితాలతో ప్యాక్ చేసి ఉంచిన డబ్బు కట్టలను తెచ్చుకున్నారు. వీటిని అసలైన కరెన్సీ నోట్ల స్థానంలో ఉంచి వాటిని ఆ ముఠా తమ బ్యాగులో వేసుకున్నారు. హైదరాబాద్‎కు వెళ్లి లేబుల్స్ తీసుకుని ఉదయం వస్తామని చెప్పి కేటుగాళ్లు పరారయ్యారు.

మరుసటి రోజు జాదూగాళ్లు రాకపోవడంతో నకిలీ కరెన్సీ బండిల్స్‎ను ఓపెన్ చేసిన రామాచారి, తన బావమరిది అమరేంద్ర చారిలు అవాక్కయ్యారు. మోసపోయామని గ్రహించిన రామాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్‎గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నల్గొండ రైల్వే స్టేషన్‎లో బిహార్‎కు పారిపోయేందుకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరి బ్యాగ్‎లను చెక్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి విచారించగా ఘరానా మోసం బయటపడిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. నిందితుల నుంచి రూ.24 లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లు, కలర్ సీసాలు, తెల్ల కాగితాల పేపర్ కట్టలను స్వాగతం చేసుకున్నామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు. ఇలాంటి ఘరానా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి కేటుగాళ్లు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

:emoji-lol-giggle:

Link to comment
Share on other sites

  • 0

Viral Video: రైలులో చీప్‌గా వచ్చిందని పవర్ బ్యాంక్ కొనేశాడు.. తీరా చూస్తే

సమోసాలు, వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్స్.. ఇలా ఒకటేమిటి ఆహార పదార్ధాలతో మొదలుపెడితే.. రకరకాల వస్తువుల వరకు అన్నింటిని కూడా రైలు ప్రయాణాల్లో అమ్ముతుంటారు కొందరు విక్రేతలు. ఇప్పటిదాకా రైలులో అమ్మే ఆహార పదార్దాలే నాసిరకంగా ఉంటాయన్న సంగతి పక్కనపెడితే..

viral-video-24.jpg?w=1280

సమోసాలు, వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్స్.. ఇలా ఒకటేమిటి ఆహార పదార్ధాలతో మొదలుపెడితే.. రకరకాల వస్తువుల వరకు అన్నింటిని కూడా రైలు ప్రయాణాల్లో అమ్ముతుంటారు కొందరు విక్రేతలు. ఇప్పటిదాకా రైలులో అమ్మే ఆహార పదార్దాలే నాసిరకంగా ఉంటాయన్న సంగతి పక్కనపెడితే.. కీచైన్లు, చార్జర్లు, పవర్ బ్యాంకులు కూడా ఇదే రీతిలో ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో పలు రైళ్లల్లో సెల్‌ఫోన్ చార్జర్లు, మొబైల్ పవర్ బ్యాంకుల అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఇక వాటిని మీరూ కొన్నారంటే.. మోసపోవడం ఖాయమని చెప్పేలా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను ‘im_sankot’ అనే నెటిజన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశాడు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి రైలులో ప్రయాణిస్తున్నాడు. ఇక అప్పుడే అటుగా వచ్చిన ఓ విక్రేతదారుడిని ఆపి.. పవర్ బ్యాంక్ గురించి పరిశీలించాడు. సదరు సేల్స్ పర్సన్ పవర్ బ్యాంక్‌కు పూర్తి గ్యారెంటీ ఇవ్వడంతో పాటు.. ఒకవేళ పాడైతే.. రిటర్న్ బ్యాక్ చేయొచ్చునని చెప్పాడు. ఇక ఆ అమ్మేవాడి దగ్గరున్న పవర్ బ్యాంక్ నాణ్యత ఎలా ఉందో.. చెక్ చేసేందుకు వినియోగదారుడు తీసుకోగా.. దాన్ని ఓపెన్ చేసి చూడటంలో అందులో మట్టి దర్శనమిచ్చింది. ఇలా మీరు వినియోగదారులను మోసం చేస్తున్నారా.? అంటూ వీడియో తీయడంతో భయపడ్డ విక్రేత వెంటనే వీడియో రికార్డింగ్ ఆపాయలంటూ డిమాండ్ చేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతుండగా.. నెటిజన్లు లైకుల మీద లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

पावर बैंक में निकली मिट्टी, सावधान रहें सतर्क रहें

 

Link to comment
Share on other sites

  • 0

These Google search can get you into trouble: గూగుల్‌లో వీటి గురించి వెతుకుతున్నారా.? జైలుకు వెళ్తారు జాగ్రత్త..

అంతలా గూగుల్‌ జీవితంలో ఓ భాగమైపోయింది. అయితే చేతిలో స్మార్ట్ ఫోన్‌ ఉంది కదా అని గూగుల్‌లో ఏది పడితే అది సెర్చ్‌ చేస్తే మాత్రం కష్టాలు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అంశాల గురించి గూగుల్‌ సెర్చ్‌ చేస్తే దానిని నేరంగా పరగణించే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ గూగుల్‌లో సెర్చ్‌ చేయకూడని ఆ అంశాలు ఏంటో ఇప్పుడు తెలుుకుందాం..

google-search.jpg?w=1280

గూగుల్‌.. ఈ పేరు తెలియని వారు ఉండనరడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే గూగుల్‌ సెర్చ్‌లో వెతికే రోజులు వచ్చేశాయ్‌. ప్రతీ సమస్యకు గూగుల్‌లో కచ్చితంగా పరిష్కారం లభిస్తుందని చాలా మంది నమ్మకంతో ఉంటారు. అందుకే తెలిసిన సమాచారాన్ని కూడా ఓసారి గూగుల్‌లో సెర్చ్‌ చేసి కాన్ఫామ్‌ చేసుకుంటుంటారు.

అంతలా గూగుల్‌ జీవితంలో ఓ భాగమైపోయింది. అయితే చేతిలో స్మార్ట్ ఫోన్‌ ఉంది కదా అని గూగుల్‌లో ఏది పడితే అది సెర్చ్‌ చేస్తే మాత్రం కష్టాలు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అంశాల గురించి గూగుల్‌ సెర్చ్‌ చేస్తే దానిని నేరంగా పరగణించే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ గూగుల్‌లో సెర్చ్‌ చేయకూడని ఆ అంశాలు ఏంటో ఇప్పుడు తెలుుకుందాం..

* దేశంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతోన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం చిన్నారుల విషయంలో వ్యవహరిస్తోంది. గూగుల్ సెర్చ్‌లో చిన్నారుల అశ్లీల చిత్రాలకు సంబంధించి ఏదైనా సెర్చ్‌ చేయడం లేదా షేర్‌ చేయడం లాంటివి చేస్తే చట్ట విరుద్ధం. దీంతో మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

* ఇక గూగుల్‌ వెతకకూడని మరో అంశం. బాంబును ఎలా తయారు చేస్తారు. నిజానికి కొందరు తమకు అవసరం లేని అంశమైనా సరదా కోసమైనా ఇలాంటివి సెర్చ్‌ చేస్తుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదు. నిఘా వర్గాలు ఇలాంటి వారి కోసం సెర్చ్‌ చేసే వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతాయనే విషయాన్ని మర్చిపోకూడదు.

* భారతదేశంలో అబార్షన్‌కు సంబంధించి కొన్ని నిర్ధిష్ట చట్టాలు ఉన్నాయి. నిర్ణీత సమయం తర్వాత డాక్టర్‌ను సంప్రదించకుండా గర్భస్రావం చేసుకోవడం అనేది భారత చట్టాల ప్రకారం నేరం. కాబట్టి గూగుల్‌లో అబార్షన్స్‌కు సంబంధించి ఎలాంటి సెర్చ్‌ చేసినా నేరంగా పరిగణిస్తారు.

* గూగుల్‌ సెర్చ్‌ చేయడమే కాదు కొన్ని రకాల కంటెంట్‌ను అప్‌లోడ్ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇతరుల ప్రైవేట్‌ వీడియోలను లేదా ఫొటోలను గూగుల్‌లో షేర్‌ చేయడం నేరంగా పరిగణిస్తారు. ఇలా చేస్తే కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే. ఇక అత్యాచార బాధితురాలి పేరు లేదా ఆమెకు సంబంధించిన వివరాలను సెర్చ్‌ చేయడం కూడా నేరంగా భావిస్తారు.

Link to comment
Share on other sites

  • 0

Robberies on Highway 65 Hyderabad to Vijayawada: హైవే నెం.65 దోపిడీకి రహదారి! | Theft on National Highway No. 65 - TV9

 

Link to comment
Share on other sites

  • 0

Hyderabad: వీరిని మాత్రమే టార్గెట్ చేస్తూ నేరాలు.. ఆ ముఠా అసలు సీక్రెట్ ఇదే..

ఇటీవల ఎటు చూసినా నేర కథలే అధికంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో అధిక శాతం జంట నగరాల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళలో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటివెనుక ఏదో ఒక ముఠా ఆపరేషన్ ఉంటుంది.

hyderabad-16.jpg?w=1280

ఇటీవల ఎటు చూసినా నేర కథలే అధికంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో అధిక శాతం జంట నగరాల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళలో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటివెనుక ఏదో ఒక ముఠా ఆపరేషన్ ఉంటుంది. అయితే జరుగుతున్న ప్రతి ఘటనలోనూ ఒక పాయింట్ కామన్‎గా కనిపిస్తుంది. అదే వాహనం లేకపోవడం. అవును మీకు వాహనం లేకపోతే కచ్చితంగా ఏదో ఒక సమస్యలో ఇరుక్కోవడం పక్కగా కనిపిస్తుంది. వరుసగా జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే ఇదే విషయం నిజమని స్పష్టమవుతుంది. సౌత్ జోన్‎లో ఎక్కువగా నేరాలు జరగడం సర్వసాధారణం. అయితే ఈ నేరాలు జరగడానికి ప్రధాన కారణం అక్కడ వాహనాలను రాత్రి వేళలో తక్కువగా వాడుతుండటం. మర్డర్ జరిగిన ప్రతిసారి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే చనిపోయిన వ్యక్తికి ఎలాంటి వాహనము ఉండదు. కచ్చితంగా తాను నడుచుకుంటూ వెళుతున్న క్రమంలోనే ప్రత్యర్ధులు వచ్చి దాడి చేయడం మూకుమ్మడి అటాకులకు పాల్పడటం జరుగుతుంది.

ఇది కేవలం ఒక హత్య నేరంకు మాత్రమే పరిమితం కాదు. అనేక రకాల నేరాలకు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులే టార్గెట్గా మారుతున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాదులో చైన్ స్నాచర్లతో పాటు మొబైల్ స్నాచర్లు ఎక్కువైపోయారు. ఈ ఘటనలలోనూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారే టార్గెట్గా చేసుకొని నేరాలు జరుగుతున్నాయి. చేతిలో మొబైల్ పట్టుకొని వెళుతున్న వారిని మొబైల్ స్నాచింగ్ ముఠా టార్గెట్ చేసి సెల్ఫోన్లను బైక్ పై వచ్చి అపహరించి పారిపోతున్నారు. ఇక చైన్ స్నాచింగ్‎లోను ఇదే తతంగం కనిపిస్తుంది. నడుచుకుంటూ ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్గా చేసుకొని చైన్ స్నాచింగ్ ముఠాలు నేరాలకు పాల్పడుతున్నారు. జరుగుతున్న నేరాలు ఎక్కువగా రాత్రుల సమయాల్లోనే ఉంటున్నాయి. వాహనం లేకుండా రాత్రులు నడుచుకుంటూ వెళుతున్న వారే ఎక్కువగా నేరస్తులకు టార్గెట్‎గా మారుతున్నారు. ఇటీవల హైదరాబాద్‎లో జరిగిన ఏడు హత్యలలోను ఇదే కీలక పాయింట్‎గా కనిపిస్తోంది. ఏదైనా నేరం జరిగితే రాత్రి వేళలో సహాయం చేయడానికి కూడా చుట్టుపక్కల వారు ఎవరు ఉండరు. కాబట్టి రాత్రి సమయంలోనే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
On 6/25/2024 at 12:41 PM, Sanjiv said:

These Google search can get you into trouble: గూగుల్‌లో వీటి గురించి వెతుకుతున్నారా.? జైలుకు వెళ్తారు జాగ్రత్త..

అంతలా గూగుల్‌ జీవితంలో ఓ భాగమైపోయింది. అయితే చేతిలో స్మార్ట్ ఫోన్‌ ఉంది కదా అని గూగుల్‌లో ఏది పడితే అది సెర్చ్‌ చేస్తే మాత్రం కష్టాలు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అంశాల గురించి గూగుల్‌ సెర్చ్‌ చేస్తే దానిని నేరంగా పరగణించే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ గూగుల్‌లో సెర్చ్‌ చేయకూడని ఆ అంశాలు ఏంటో ఇప్పుడు తెలుుకుందాం..

google-search.jpg?w=1280

గూగుల్‌.. ఈ పేరు తెలియని వారు ఉండనరడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే గూగుల్‌ సెర్చ్‌లో వెతికే రోజులు వచ్చేశాయ్‌. ప్రతీ సమస్యకు గూగుల్‌లో కచ్చితంగా పరిష్కారం లభిస్తుందని చాలా మంది నమ్మకంతో ఉంటారు. అందుకే తెలిసిన సమాచారాన్ని కూడా ఓసారి గూగుల్‌లో సెర్చ్‌ చేసి కాన్ఫామ్‌ చేసుకుంటుంటారు.

అంతలా గూగుల్‌ జీవితంలో ఓ భాగమైపోయింది. అయితే చేతిలో స్మార్ట్ ఫోన్‌ ఉంది కదా అని గూగుల్‌లో ఏది పడితే అది సెర్చ్‌ చేస్తే మాత్రం కష్టాలు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అంశాల గురించి గూగుల్‌ సెర్చ్‌ చేస్తే దానిని నేరంగా పరగణించే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ గూగుల్‌లో సెర్చ్‌ చేయకూడని ఆ అంశాలు ఏంటో ఇప్పుడు తెలుుకుందాం..

* దేశంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతోన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం చిన్నారుల విషయంలో వ్యవహరిస్తోంది. గూగుల్ సెర్చ్‌లో చిన్నారుల అశ్లీల చిత్రాలకు సంబంధించి ఏదైనా సెర్చ్‌ చేయడం లేదా షేర్‌ చేయడం లాంటివి చేస్తే చట్ట విరుద్ధం. దీంతో మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

* ఇక గూగుల్‌ వెతకకూడని మరో అంశం. బాంబును ఎలా తయారు చేస్తారు. నిజానికి కొందరు తమకు అవసరం లేని అంశమైనా సరదా కోసమైనా ఇలాంటివి సెర్చ్‌ చేస్తుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదు. నిఘా వర్గాలు ఇలాంటి వారి కోసం సెర్చ్‌ చేసే వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతాయనే విషయాన్ని మర్చిపోకూడదు.

* భారతదేశంలో అబార్షన్‌కు సంబంధించి కొన్ని నిర్ధిష్ట చట్టాలు ఉన్నాయి. నిర్ణీత సమయం తర్వాత డాక్టర్‌ను సంప్రదించకుండా గర్భస్రావం చేసుకోవడం అనేది భారత చట్టాల ప్రకారం నేరం. కాబట్టి గూగుల్‌లో అబార్షన్స్‌కు సంబంధించి ఎలాంటి సెర్చ్‌ చేసినా నేరంగా పరిగణిస్తారు.

* గూగుల్‌ సెర్చ్‌ చేయడమే కాదు కొన్ని రకాల కంటెంట్‌ను అప్‌లోడ్ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇతరుల ప్రైవేట్‌ వీడియోలను లేదా ఫొటోలను గూగుల్‌లో షేర్‌ చేయడం నేరంగా పరిగణిస్తారు. ఇలా చేస్తే కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే. ఇక అత్యాచార బాధితురాలి పేరు లేదా ఆమెకు సంబంధించిన వివరాలను సెర్చ్‌ చేయడం కూడా నేరంగా భావిస్తారు.

గూగుల్‌లో ఎలాంటివి సెర్చ్ చేస్తే..| Latest News Updates | Google Search | @sumantvlive

 

Link to comment
Share on other sites

  • 0

Cyber Frauds: మహిళలు, యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్.. రెచ్చిపోతున్న మాయగాళ్లు..!

సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి..టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు జనం సొమ్మును దోచేస్తున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇతర యాప్‌లు, లింకులు, ఈ మెయిల్స్‌తో హ్యాకర్ల మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నేరాల నియంత్రణపై దృష్టిపెట్టారు.

cyber-crime-2.jpg?w=1280

సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి..టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు జనం సొమ్మును దోచేస్తున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇతర యాప్‌లు, లింకులు, ఈ మెయిల్స్‌తో హ్యాకర్ల మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నేరాల నియంత్రణపై దృష్టిపెట్టారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు వారి ఉచ్చులో పడకుండా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న కూడా ఈ మోసాలు ఆగడం లేదు. మహిళలు, యువత, సాఫ్ట్ వేర్ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్ళు.

సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి. తస్మాత్‌ జాగ్రత్త అని పోలీసులు ప్రజలకు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు అమాయకులు వారి ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీలు, రివార్డులు, జాబ్స్‌, కమీషన్లు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశ చూపి, నిలువునా ముంచుతున్నారు. బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నామని, ఆధార్‌ నంబర్‌ చెప్పండి.. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పండి.. మీ ఏటీఎం పనిచేయడం లేదని, మీరు కారు గెలుచుకున్నారని, మనీ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో, క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతామని, ఇలా రకరకాలుగా సైబర్‌ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తూ తెలియకుండానే డబ్బులు కాజేస్తున్నారు..

ఉమ్మడి మెదక్ జిల్లాలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశ చూపి అకౌంట్ల నుంచి లక్షలు మాయం చేస్తున్నారు. వాట్సప్, ఫేస్ బుక్, ఇన్స్ట్రాగ్రామ్, టెలిగ్రామ్ వంటి యాప్ లను ఆసరా చేసుకుని అమాయకులను సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఈజీ మనీ మీద ఉన్న ఆశను ఆసరాగా చేసుకుని టెక్నాలజీ సహాయంతో పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేస్తున్నారు. లోన్ యాప్, ఎస్ఎంఎస్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్, బిట్ కాయిన్ , క్రిప్టో కరెన్సీ, పార్ట్ టైమ్ జాబ్ పేరుతో సామాన్యులను మోసగిస్తున్నారు. సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పటికి సైబర్ మోసాలకు బ్రేక్ పడటం లేదు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మోసపోతున్న ఉదంతాలు ఉమ్మడి జిల్లాలో తరచూ ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.

తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో మనీ లాండరింగ్ కేసు పేరిట సైబర్ మోసం జరిగింది. పటాన్ చెరు మండ‌లం లక్డారం చెందిన వ్యక్తి అకౌంట్ నుంచి రూ. 3 లక్షలు డ్రా చేశారు సైబర్ నేరస్థులు. ఇలా సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, సదాశివపేట ప్రాంతాల్లో ఎక్కువగా సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ లో ఇటీవలే సైబర్ నేరగాళ్లు సుమారు రూ.57 లక్షలు కాజేశారు. నెల రోజుల క్రితం అమీన్ పూర్ లో నివసిస్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ మహిళా ఉద్యోగులకు రెట్టింపు డబ్బు ఆశ చూపిన కేటుగాళ్ళు బురిడీ కొట్టించారు. అధిక డబ్బుకు ఆశపడి ఓ మహిళా రూ.21 లక్షలు, మరో మహిళ రూ.4.6 లక్షలు పోగొట్టుకున్నారు.

అలాగే మరో ఇద్దరు వ్యక్తులను టాస్క్ ల పేరుతో బురిడీ కొట్టించి ఓ వ్యక్తి నుంచి రూ.30 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.1.60 లక్షలు కాజేశారు. బాధితులు1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయగా, వా వివరాలను పోలీసులు సీక్రెట్గా ఉంచి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే నెలన్నర రోజుల క్రితం సంగారెడ్డిలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరాగాళ్లు ఓ లింక్ పంపితే దాన్ని అతను ఓపెన్ చేసి చూసేసరికి ఐదు నిమిషాల్లో అతని అకౌంట్ లో నుంచి రూ.11లక్షలు మాయమయ్యాయి. నారాయణఖేడ్ లో 20 రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఎంప్లాయ్ తనకు వచ్చిన ఫేక్ ఐడీని ఓపెన్ చేసి చూడగా దశలవారీగా రూ.19 లక్షలు పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక సిద్దిపేట జిల్లా పరిధిలో కూడా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు..ఈ ఏడాది జనవరి నుంచి మే మొదటి వారం వరకు రూ.40.99 లక్షలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. జిల్లాలో గత 2 నెలల కాలంలో దాదాపు 270 సైబర్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కాగా, వాటిలో 150 కేసుల్లో పెద్ద మొత్తంలో డబ్బులను ఫ్రీజ్ చేసి సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితుడికి సైబర్ నేరగాడు ఫోన్ చేసి మీకు రూ.3 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయిందని చెప్పి దానికోసం ప్రాసెస్ చార్జీ, జీఎస్టీ, ఇన్సూరెన్స్, సిబిల్ స్కోర్ ల కోసం ఖర్చులు ఉంటాయని చెప్పగానే నమ్మిన బాధితుడు రూ.45,570 పంపించాడు. తరువాత సైబర్ మోసగాడు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేసి కంప్లైంట్ చేశాడు. దీంతో సైబర్ నేరగాడికి చేరిన అకౌంట్లో ఉన్న రూ.45,570లు ఫ్రీజ్ చేశారు.

ఇక మెదక్ జిల్లాలో కూడా తరచూ సైబర్ నేరాలు వెలుగు చూస్తున్నాయి.. గతేడాది 27 సైబర్ కేసులు బుక్ అయ్యాయి..గత ఫిబ్రవరి 2వ తేదీన మనోహరాబాద్ మండల కేంద్రంలో నివసిస్తున్న కృష్ణ జిల్లాకు చెందిన యావ శ్రీనివాస్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్చేసి మాయమాటలు చెప్పి ఓ లింక్ పంపారు. అతను లింక్ ఓపెన్ చేయగా అతని బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.1.75 లక్షలు పోయాయి. గత ఫిబ్రవరి 22 వ తేదీన మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన చెలిమ చంద్రశేఖర్ ఫోన్‌కు టెలిగ్రామ్ ద్వారా ఓ లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేస్తే డబ్బులు వస్తాయని గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి చెప్పారు. అతను ఆ లింక్ ఓపెన్ చేయగా అతని బ్యాంక్ అకౌంట్ లో నుంచి రూ.1.42 లక్షలు పోయాయి.

గత ఏప్రిల్ నెలలో మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె, కౌడిపల్లికి గ్రామానికి చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.1.05 లక్షలు పోగొట్టుకున్నారు. వెల్మకన్నకు చెందిన బ్యాంక్ మిత్ర విఠల్ రూ.75 వేలు, కౌడిపల్లికి చెందిన మరో బ్యాంక్ మిత్ర శ్రీనివాస్ గౌడ్ రూ.30 వేలు ట్రాన్స్ ఫర్ చేశారు. తర్వాత తాము సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి మోసపోయామని గుర్తించారు.

ఇలా సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారని, వీటిపై విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం అంటున్నారు పోలీసులు.. మొబైల్‌కు వచ్చిన లింక్‌లు, మెసేజ్‌లు చదవకుండా క్లిక్‌ చేయవద్దు. అనుకోకుండా బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బు పోతే 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు డయల్‌ చేస్తే సంబంధిత అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేస్తారు. పోలీసులను ఆశ్రయించాలి. అనవసర యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. వాట్సాప్‌ నంబర్లకు వచ్చే మెసేజ్‌లు, సెల్‌ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే అనవసర లింకులు ఓపెన్‌ చేయొద్దు. ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్‌, సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దు. తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు పోలీసులు…

ఇవి పాటిస్తే మంచిది అంటున్నారు ఎక్స్‌ఫర్ట్స్!

  • మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు.
  • అనవసర సమయాల్లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ చేయడం మంచిది.
  • గుర్తుతెలియని వ్యక్తులు పంపిన లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయకూడదు.
  • అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించుకోవాలి.
  • బహుమతులు, లాటరీలు గెల్చుకున్నారంటూ వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మవద్దు.
  • వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగం కల్పిస్తామని చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలి.
  • బయటి ప్రాంతాల్లో ఉచిత వైఫై ఉపయోగించకపోవడం మంచిది.
  • సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలు అప్‌లోడ్‌ చేయకపోవడం ఉత్తమం
Link to comment
Share on other sites

  • 0

Crypto Currency Scam: క్రిప్టోకరెన్సీ పేరుతో వెలుగులోకి నయా స్కామ్.. ఏకంగా 36 లక్షలు హాంఫట్..!

గతంలో పొదుపు చేసుకున్న సొమ్మను బందిపోట్లు ఎత్తుకుపోయినట్లు ప్రస్తుతం మారిన టెక్నాలజీ వల్ల బ్యాంకుల్లో ఉన్న సొమ్మును కేటుగాళ్లు కొట్టేస్తున్నారు. ఇటీవల కాలంలో డబ్బుకు ప్రత్యామ్నాంగా క్రిప్టో కరెన్సీ అధిక ప్రాచుర్యం పొందింది. క్రిప్టో కరెన్సీను ఎవరూ తస్కరించేలేరనే నమ్మకంతో చాలా మంది ఆ కరెన్సీ గురించి తెలియకపోయినా దాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Crypto Currency

crypto-currency.jpg?w=1280

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు వచ్చి చేరాయి. ఓ రకంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ కూడా యువతకు నిత్యావసరంగా మారిందంటే అతిశయోక్తి కాదు. గతంలో పొదుపు చేసుకున్న సొమ్మను బందిపోట్లు ఎత్తుకుపోయినట్లు ప్రస్తుతం మారిన టెక్నాలజీ వల్ల బ్యాంకుల్లో ఉన్న సొమ్మును కేటుగాళ్లు కొట్టేస్తున్నారు. ఇటీవల కాలంలో డబ్బుకు ప్రత్యామ్నాంగా క్రిప్టో కరెన్సీ అధిక ప్రాచుర్యం పొందింది. క్రిప్టో కరెన్సీను ఎవరూ తస్కరించేలేరనే నమ్మకంతో చాలా మంది ఆ కరెన్సీ గురించి తెలియకపోయినా దాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆసక్తినే అవకాశంగా మలుచుకున్న కేటుగాళ్లు ఇటీవల ఓ మహిళను మోసగించి రూ.36 లక్షలు దోచుకున్నారు. ఈ తాజాగా ఘటన గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ముంబైకి చెందిన 44 ఏళ్ల మహిళ క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో పడి రూ. 36 లక్షలకు పైగా పోగొట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. స్టాక్ వ్యాపారి అయిన మహిళ ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులపై బీఎన్‌ఎస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద జూలై 3న ఖర్ఘర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిందితుడు బాధితురాలి వద్దకు వెళ్లి ఆమెను క్రిప్టోకరెన్సీ వ్యాపారంలోకి దింపాడు. కాలక్రమేణా ఇద్దరూ కలిసి రూ. 36,80,151 పెట్టుబడి పెట్టడానికి ఆమెను ఒప్పించారు. బాధితురాలు తన పెట్టుబడిపై రాబడి ఏదని నిందితులను ప్రశ్నించగా మాయమాటలు చెబుతూ తిరిగారు. దీంతో  తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

Link to comment
Share on other sites

  • 0

E-challan scam: ఈ-చలాన్ పేరిట భారీ స్కామ్.. మెసేజ్ వచ్చిందని తొందర పడ్డారో అంతే సంగతులు..

ఇ-చలాన్ స్కామ్‌ లో భాగంగా మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది. మీ వాహనానికి భారీ జరిమానా విధించారని, దాన్ని చెల్లించాలని అందులో ఉంటుంది. అందుకోసం నకిలీ లింక్ ను కూడా పంపిస్తారు. దాన్ని క్లిక్ చేయడం వల్ల మన డేటా చోరీకి గురవుతుంది. అలాగే జరిమానా రూపంలో డబ్బులు కూడా నష్టపోతాం.

scam-alert.jpg?w=1280

ఆన్ లైన్ మోసాలు రోజుకో కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. వీటి బారిన పడి అనేక మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. టెక్నాలజీ బాగా పెరిగి, ప్రజలకు సులువుగా సేవలు అందుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల ఆ టెక్నాలజీతోనే మోసాలకు పాల్పడుతున్నారు. గతంతో బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి ఓటీపీ నంబర్ల అడిగేవారు. ఆ వివరాలు చెప్పిన ప్రజల బ్యాంకు ఖాతాలో సొమ్ములను లాగేసేవారు. తర్వాత పార్సిల్ స్కామ్, డిజిటల్ అరెస్ట్ తదితర ఘటనలు జరిగాయి. ఇప్పుడు కొత్తగా ఇ-చలాన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

తీవ్ర నష్టం..

ఇ-చలాన్ స్కామ్‌ లో భాగంగా మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది. మీ వాహనానికి భారీ జరిమానా విధించారని, దాన్ని చెల్లించాలని అందులో ఉంటుంది. అందుకోసం నకిలీ లింక్ ను కూడా పంపిస్తారు. దాన్ని క్లిక్ చేయడం వల్ల మన డేటా చోరీకి గురవుతుంది. అలాగే జరిమానా రూపంలో డబ్బులు కూడా నష్టపోతాం.

ఇ-చలాన్ స్కామ్ అంటే..

ట్రాఫిక్ చలానా పెండింగ్ లో ఉందని, దాన్ని చెల్లించాలని మనకు మెసేజ్ వస్తే వెంటనే అప్రమత్తమవుతాము. దాన్ని చెల్లించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విషయాన్నే సైబర్ నేరగాళ్ల తమకు అనుకూలంగా మార్చుకున్నారు. చలానా చెల్లిచాలంటూ నకిలీ లింక్ లను పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేయడం వల్ల అనేక అనర్థాలు కలుగుతాయి. కాబట్టి మీకు ఇలాంటి మెసేజ్ లు వస్తే అప్రమత్తంగా ఉండండి. అది నిజమా, కాదా అని ముందు నిర్ధారణ చేసుకోండి.

డ్రైవర్లే బాధితులు..

ఇ-చలాన్ స్కామ్‌ల బాధితుల్లో డ్రైవర్లు ఎక్కువగా ఉంటున్నారు. వీరికే నేరగాళ్లు ఎక్కువగా మెసేజ్ లు పంపిస్తున్నారు. ట్రాఫిక్ అధికారుల నుంచి వచ్చిన విధంగా వాటిని రూపొందిస్తున్నారు. డ్రైవర్లు సాధారణంగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించామా అనే భయంతో వారు జరిమానాలకు చెల్లించడానికి సిద్ధపడతారు.

డేటా చోరీ..

సైబర్ నేరగాళ్ల పంపిన నకిలీ మెసేజ్ ల కారణంగా తీవ్ర నష్టాలు కలుగుతాయి. దానిలోకి లింక్ ను క్లిక్ చేయగానే నకిలీ వెబ్‌సైట్‌కి వెళ్లిపోతాం. దానిలో మన క్రెడిట్ కార్డ్ సమాచారం, లాగిన్ ఆధారాలు, వ్యక్తిగత వివరాలను నమోదు చేయడంతో ఆ డేటా అంతా చోరీకి గురవుతుంది. అలాగే ఆర్థికంగా నష్టపోతాం. మన పరికరంలో మాల్వేర్ కూడా డౌన్‌లోడ్ అయిపోయే అవకాశం ఉంది. అది మన డేటాను దొంగిలించడం, మన కార్యాచరణను పర్యవేక్షించగలదు, పరికరాన్ని నియంత్రించడం చేయగలదు.

జాగ్రత్తలు తీసుకోండి..

  • ఇ-చలాన్ స్కామ్‌ నుంచి మిమ్మల్ని రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి మెసేజ్ లపై అప్రమత్తంగా ఉండాలి. ముందుగా మీకు వచ్చిన మెసేజ్ లో అన్ని విషయాలను పరిశీలన చేయాలి. మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, మీరు నిబంధనలు ఉల్లంఘించారా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి.
  • ఆ వివరాలు లేకుంటే అది బహుశా స్కామ్ అని భాశించాలి. అలాగే మెసేజ్ లలో లింక్‌లను క్లిక్ చేయడానికి బదులుగా నేరుగా స్థానిక ట్రాఫిక్ అథారిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఎల్లప్పుడూ అధికారిక ఛానెల్‌లను ఉపయోగించాలి.
  • చట్టబద్ధమైన ప్రభుత్వ వెబ్‌సైట్‌లు సాధారణంగా జీవోవి.ఇన్ డొమైన్‌ను ఉపయోగిస్తాయి. కాబట్టి విభిన్న పొడిగింపులు, అనుమానాస్పద యూఆర్ఎల్ పట్ల జాగ్రత్తగా ఉండండి.
  • ఇలాంటి అనుమానిత మెసేజ్ లు వస్తే అధికారులకు నివేదించండి.
Link to comment
Share on other sites

  • 0

Money-Doubling Scam: డబుల్ ధమాకా డబ్బుల స్కీం.. ఆశ చూపి రూ. 40 కోట్లతో జనానికి కుచ్చుటోపీ..!

అమాయక జనాలే ఆ కేటుగాళ్లకు టార్గెట్. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పెట్టిన పెట్టుబడి కంటే రెట్టింపు ఇస్తామని అత్యాశ కల్పించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు ఎక్కువగా వస్తాయని నమ్మించారు. దీంతో పెట్టుబడులు పెట్టండి.. భారీగా ఆదాయం పొందండి అంటూ కేటుగాళ్లు విసిరిన వలలో వందల మంది చిక్కుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లాది రూపాయలను కుచ్చుటోపి పెట్టారు.

money-doubling-scam.jpg?w=1280

అమాయక జనాలే ఆ కేటుగాళ్లకు టార్గెట్. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పెట్టిన పెట్టుబడి కంటే రెట్టింపు ఇస్తామని అత్యాశ కల్పించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు ఎక్కువగా వస్తాయని నమ్మించారు. దీంతో పెట్టుబడులు పెట్టండి.. భారీగా ఆదాయం పొందండి అంటూ కేటుగాళ్లు విసిరిన వలలో వందల మంది చిక్కుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లాది రూపాయలను కుచ్చుటోపి పెట్టారు.

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో ఘరానా మోసగాడు డబుల్ ధమాకా డబ్బుల స్కీంతో ఏకంగా రూ40 కోట్లు కొల్లగొట్టాడు. చింతపల్లి మండలం మాల్ (గోడుకొండ్ల )వద్ద మదిని సంజయ్ రెడ్డి కుమారుడు మనీష్ రెడ్డి నాలుగేళ్ల క్రితం మనీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడర్స్ పేరుతో ఆఫీస్ తెరిచాడు. వంద పెట్టుబడితో రూ. 2వందలు, వెయ్యి పెడితే రూ. 2 వేలు, పదివేలు పెడితే ఇరవై వేల రూపాయలు, రూ. లక్షతో రెండు లక్షల రూపాయలు అంటూ డబుల్ ధమాకా ఆశ చూపించాడు.

మొదట్లో పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బులు ఇచ్చి నమ్మించాడు. ఏకంగా గ్రామానికి చెందిన 10మంది ఏజెంట్లను పెట్టుకుని వారికి నెలకు రూ.16 వేల జీతం ఇస్తూ టార్గెట్ పెట్టుకున్నాడు. చింతపల్లి మండలంతోపాటు మర్రిగూడ, నాంపల్లి, యాచారం, ఇబ్రహీంపట్నం, కరీంనగర్, నిజామాబాద్, చౌటుప్పల్, హైద్రాబాద్ వరకు విస్తరించాడు. దీంతో మనీష్ రెడ్డి మనీ ట్రాప్ లోకి సామాన్యులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరిపోయారు.

ఆశ అన్ని మరిచేలా చేస్తుంది. వేలు లక్షలు పెట్టుబడి పెట్టారు. అందరికీ ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చాడు. వందలాది మంది నుండి సుమారు రూ.40 కోట్లు కొల్లగొట్టాడు. కొంతకాలం కొందరికి ఇంటికి, వాహనాలకు లోన్లు ఇస్తానని నమ్మించాడు. ఆ తరువాత ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లదీసిన మనీష్ రెడ్డి 7 నెలలుగా వడ్డీ చెల్లించకుండా బోర్డు తిప్పేశాడు. మనీష్ రెడ్డి బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, లెక్చరర్లు, స్టూడెంట్స్ ఉన్నారు.

గ్రామానికి దూరంగా ఉంటూ బాధితులనుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు మనీష్ రెడ్డి. చాలామంది బాధితులు అత్యాశతో బంధువుల నుంచి అప్పుగా తీసుకొచ్చి లక్షల రూపాయలు మనీష్ రెడ్డి చేతులో పోశారు. కొద్ది రోజులుగా ఫోన్ స్విచాఫ్ చేయడంతో బాధితులకు అనుమానం కలిగింది. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ మనిష్ రెడ్డి పై బాధితులు ఒత్తిడి పెంచారు. రెట్టింపు డబ్బులు దేవుడెరుగు తాము పెట్టిన పెట్టుబడి డబ్బులు ఇవ్వాలంటూ బాధితులు కోరుతున్నారు. పిల్లలు అవసరాల కోసం డబ్బులు వస్తాయని అత్యాశతో ఏజెంట్లతో మనిష్ రెడ్డి వద్ద పెట్టుబడి పెట్టామని బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరుతున్నారు.

మాల్ గ్రామానికి మనీష్ రెడ్డి వచ్చాడని తెలుసుకున్న బాధితులు తమ పెట్టుబడి డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. వడ్డీ ఇవ్వకున్నా పర్వాలేదు అసలైనా ఇవ్వమని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నా దగ్గర రూపాయి కూడా లేదు జైల్లో పెట్టుకుంటారా, చంపేస్తారా చంపేయండి అంటూ మొండికేశాడు. దీంతో తానే పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కాడు మనిష్ రెడ్డి. గ్రామస్తుల వేధింపులు భరించలేక పోతున్నానంటూ పోలీసులకు మొర పెట్టుకున్నాడు. కేసు నమోదు చేసి జైలుకు పంపాలని మనీష్ రెడ్డి స్వయంగా పోలీసులను ఆశ్రయించాడు. స్టాక్ మార్కెట్ పేరుతో మునిశ్ రెడ్డి మోసం చేశాడంటూ చాలామంది బాధితులు తమను ఆశ్రయిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న విచారణ జరుపుతున్నామని చెబుతున్నారు. స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో అధిక మొత్తం ఇస్తానని చెప్పేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలా ఎవరైనా మోసం చేసే ప్రయత్నం చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచించారు..

ఈ కేసులో కొసమెరుపు ఏమిటంటే కొందరు రూ. లక్ష నుండి రూ. 10లక్షలు పెట్టుబడి పెడితే, ఒక ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ సహా ఓ బ్యాంక్ క్యాషియర్ రూ. 60లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. డబుల్ ధమాకా పేరుతో సామాన్యులను మోసం చేసిన మనిశ్ రెడ్డి.. బెట్టింగ్ లో పెట్టి ఐదు కోట్ల రూపాయలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో ఈ కేటుగాడు ఎన్ని కోట్లు కొల్లగొట్టాడో తేలనుంది. ఈజీ మనీ కోసం అత్యాశ పడకూడదని, ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. బి కేర్ ఫుల్.

Link to comment
Share on other sites

  • 0

Cyber Fraud: చనిపోయిన వ్యక్తి కుటుంబాలను వదలని సైబర్ నేరగాళ్లు.. ఏకంగా బీమా సొమ్ము వచ్చిందంటూ..!

చనిపోయిన వ్యక్తికి బీమా సొమ్ము శాంక్షన్ అయింది.. కొంత డబ్బు అకౌంట్‌లో డిపాజిట్ చేయాలంటూ మోసానికి తెగబడ్డారు సైబర్ నేరగాళ్లు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. అసలే ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి విషాదంలో ఉన్న కుటుంబాలను సైతం సైబర్ నేరగాళ్లు వదలడం లేదు.

cyber-crime-1.jpg?w=1280

చనిపోయిన వ్యక్తికి బీమా సొమ్ము శాంక్షన్ అయింది.. కొంత డబ్బు అకౌంట్‌లో డిపాజిట్ చేయాలంటూ మోసానికి తెగబడ్డారు సైబర్ నేరగాళ్లు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. అసలే ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి విషాదంలో ఉన్న కుటుంబాలను సైతం సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. చనిపోయిన వ్యక్తికి ఇన్సూరెన్స్ డబ్బు మంజూరు అయింది. ఆ మొత్తం అకౌంట్‌లో జమ కావాలంటే మీరు కొంత డబ్బు డిపాజిట్ చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులకు మాయ మాటలు చెప్పి బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు.

ఉరవకొండ నియోజకవర్గంలోని బెళుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన రైతు తిప్పేస్వామి (44) ఇటీవలే గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు తిప్పే స్వామికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రైతు తిప్పేస్వామి ఆకస్మిక మృతితో తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో ఆ ఊరి సర్పంచ్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నేను డీఎస్పీని మాట్లాడుతున్నాను.. అంటూ అవతలి వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్నాడు. మీ గ్రామానికి చెందిన రైతు మరణానంతరం కుటుంబానికి ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయల భీమా సొమ్ము మంజూరు అయిందని, రెండు విడతలుగా సొమ్ము విడుదల అవుతుందని గ్రామ సర్పంచ్‌ని నమ్మబలికాడు.

వెంటనే మృతి చెందిన రైతు తిప్పేస్వామి కుటుంబ సభ్యులతో ఫోన్ లో తనతో మాట్లాడించాలని సర్పంచ్‌కు చెప్పాడు. దీంతో గ్రామ సర్పంచ్ మృతుడు తిప్పేస్వామి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి ఫోన్‌లో సదర్ నకిలీ డీఎస్పీతో మాట్లాడించాడు. కుటుంబ సభ్యులతో సదరు నకిలీ డీఎస్పీ ఫోన్‌లో మాట్లాడుతూ… ఆ డబ్బు విడుదల కావాలంటే రూ.18,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. తమతో మాట్లాడుతున్న వ్యక్తి నిజంగానే డీఎస్పీ నే అనుకున్న తిప్పే స్వామి కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ రామిరెడ్డి సైతం సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఉచ్చులో పడ్డారు. అప్పుడే అంత్యక్రియలకు, ఇతర కార్యక్రమాలకు ఉన్న డబ్బు అంతా ఖర్చయిపోయిందని, తమ వద్ద డబ్బు లేదని తిప్పే స్వామి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే ఆ కుటుంబానికి ఉపయోగపడుతుందని భావించిన సర్పంచ్ రామిరెడ్డి మానవతా దృక్పథంతో పదివేల రూపాయలు సాయం చేశాడు. మిగిలిన మొత్తాన్ని మృతుడు తిప్పే స్వామి సోదరుడి అకౌంట్ నుండి మొత్తం రూ. 18,500 అవతలి వ్యక్తి సూచించిన మొబైల్ నెంబర్(9611156511) కు ఫోన్ పే చేశారు. ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేసిన మరు నిమిషంలోనే సదరు నకిలీ డీఎస్పీ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయింది. ఇతర నెంబర్ల నుంచి కూడా ట్రై చేసినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు మోసపోయామని తెలిసి భోరుమన్నారు. అసలే కుటుంబ పెద్దను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న తమను ఇలా సైబర్ నేరగాళ్లు మోసం చేయడం పట్ల రైతు తిప్పే స్వామి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసం ఆఖరికి సైబర్ నేరగాళ్ళు ఎంతకు తెగించారని అనుకుంటున్నారు గ్రామస్తులు. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Link to comment
Share on other sites

  • 0

Hyderabad matrimony fraud: అమ్మాయిలూ జరభద్రం..! డేటింగ్ యాప్‌లో మాయలోడు.. ఇది మామూలు స్టోరీ కాదు..

వీడు మాడూలు కేటుగాడు కాదు.. పలు డేటింగ్ యాప్‌లలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. అమాయక అమ్మాయిలను టార్గెట్ చేసి వారితో మాట్లాడి.. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు.. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది.. చివరకు రకరకాల కారణాలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తాడు.. ఈ షాకింగ్ ఘటన సైబరాబాద్ పరిధిలో..

crime-news-18.jpg?w=1280

వీడు మాడూలు కేటుగాడు కాదు.. పలు డేటింగ్ యాప్‌లలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. అమాయక అమ్మాయిలను టార్గెట్ చేసి వారితో మాట్లాడి.. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు.. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది.. చివరకు రకరకాల కారణాలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తాడు.. ఈ షాకింగ్ ఘటన సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనాథ్ రెడ్డి అనే వ్యక్తి పలు డేటింగ్ యాప్ లను కేంద్రంగా చేసుకొని పలువురు యువతులను మోసం చేశాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి..

కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనాథ్ రెడ్డి.. టిండర్, నీతో లాంటి డేటింగ్ యాప్ లలో తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా గూగుల్‌లో పనిచేస్తున్నానని ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. కొంతమంది యువతలను టార్గెట్ చేసి వారి ప్రొఫైల్స్ పై ఇంట్రెస్ట్ చూపించాడు. గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావటంతో సాధారణంగానే పలువురు యువతులు శ్రీనాథ్ ప్రొఫైల్ ను లైక్ చేశారు. అలా లైక్ చేసిన వారితో శ్రీనాధ్ రెడ్డి చాటింగ్ చేసేవాడు.. అలా టచ్ లోకి వచ్చిన యువతులతో మాటలు కలుపుతూ.. పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు.. ఈ క్రమంలోనే యువతులు ఎవరైనా కలుద్దాం.. అని చెప్పగానే.. షూర్ అంటూ నిమ్మించేవాడు.. తీరా కలిసే సమయానికి తన కుటుంబం సమస్యల్లో ఉందని, తన తల్లికి తీవ్ర అనారోగ్య సమస్య ఏర్పడిందని.. ఆర్థిక ఇబ్బందులని.. ఇలా రకరకాల కారణాలు చెప్పి బాధిత యువతుల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు.

తీరా అసలు నిజం తెలుసుకున్న యువతులు తామ మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదు చేసే క్రమంలో పలువురు యువతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ తరహాలో మోసం చేయడం పట్ల యువతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమనుంచి తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని యువతులు పోలీసులకు మొరపెట్టుకున్నారు.

ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. శ్రీనాథ్ రెడ్డిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. శ్రీనాథ్ రెడ్డి ఇలా తీసుకున్న డబ్బులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని.. ఆన్లైన్ గేమ్స్ ఆడటంతోపాటు.. ఆన్లైన్లో, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

 

Link to comment
Share on other sites

  • 0

gas delivery boy murders school girl shailaja

నాగరాజు ఇంట్లో శైలజ తల్లి గాజులు🔴LIVE | Big Twist In Guntur 7th class Shailaja | Nagaraju | RTV

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...