Jump to content

Celebrity news


TELUGU

Recommended Posts

Ileana on why fewer opportunities from South: సౌత్ లో నాకు సినిమా అవకాశాలు తగ్గిపోవడానికి కారణం ఇదే: ఇలియానా

30-04-2024 Tue 13:48 | Entertainment

సౌత్ లో బిజీగా ఉన్న సమయంలో బాలీవుడ్ సినిమా చేశానన్న ఇలియానా

దీంతో దక్షిణాది వారు తాను బాలీవుడ్ కి మకాం మార్చానని అనుకున్నారన్న ఇల్లీ

ఇదే కారణంతో దక్షిణాది దర్శకనిర్మాతలు తనకు అవకాశాలు ఇవ్వలేదని వెల్లడి

cr-20240430tn6630a95b3f2f5.jpg

గోవా బ్యూటీ... ఇలియానా. టాలీవుడ్ లో ఆమెది ఒక చరిత్ర. తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న ఇల్లీ... కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఏలింది. తెలుగు సినీ పరిశ్రమలో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్ ఇలియానానే. ఇప్పుడు ఆమె సౌత్ ఇండస్ట్రీ నుంచి దాదాపు కనుమరుగు అయిందనే చెప్పుకోవాలి. కొత్తకొత్త హీరోయిన్లు వస్తుండటంతో ఆమె హవా తగ్గిపోయింది. తాజాగా ఆమె దక్షిణాదిలో ఎందుకు అవకాశాలు తగ్గాయో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. 

2012లో తాను అనురాగ్ బసు దర్శకత్వంలో బాలీవుడ్ లో 'బర్ఫీ' చిత్రంలో ప్రధాన పాత్రను పోషించానని ఇలియానా తెలిపింది. ఆ టైమ్ లో తాను సౌత్ లో చాలా బిజీగా ఉన్నానని... అయితే, 'బర్ఫీ' వంటి చిత్రాల్లో అవకాశాలు చాలా అరుదుగా వస్తాయని తాను భావించాని... అందుకే తాను ఆ సినిమాకి ఓకే చెప్పానని వెల్లడించింది. కానీ, దక్షిణాది వాళ్లంతా తాను సౌత్ ను వదిలేసి బాలీవుడ్ కి మకాం మార్చానని భావించారని అనుకున్నారని... ఆ ఆలోచనతోనే దక్షిణాది దర్శకనిర్మాతలు తనకు అవకాశాలు ఇచ్చేందుకు వెనుకాడారని తెలిపింది. 

బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తాను సినిమాలను ఎంచుకునే విధానంలో కూడా మార్పు వచ్చిందని ఇలియానా తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని తనకు అనిపిస్తుంటుందని చెప్పింది. ఇలా ఎందుకు జరిగిందో కూడా తనకు అర్థం కావడం లేదని తెలిపింది. ఇలియానా ఒక బిడ్డకు తల్లి అయిన సంగతి అందరికీ తెలిసిందే. దక్షిణాదిలో దాదాపు ఆమె కెరీర్ ముగిసినట్టేనని చెప్పుకోవచ్చు.

...

Complete article

Link to comment
Share on other sites

Nidhi Agarwal: అదృష్టానికి దగ్గరలో అందాల నిధి!

30-04-2024 Tue 15:54 | Entertainment

అందంతో మెప్పించిన నిధి అగర్వాల్  

ఆరంభంలోనే యూత్ ను ఆకట్టుకున్న బ్యూటీ 

నిదానంగా సాగుతున్న కెరియర్ 

చేతిలో పవన్ .. ప్రభాస్ సినిమాలు  

cr-20240430tn6630c6c722e66.jpg

ఈ మధ్య కాలంలో వెండితెరకి పరిచయమయ్యే హీరోయిన్స్ .. కాస్తంత అందం ఉంటే చాలు, తమకి తాముగా మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. చాలామంది చాలా తేలికగా స్టార్ హీరోయిన్స్ దరిదాపుల్లోకి వెళ్లిపోతున్నారు. కానీ చక్కని కనుముక్కుతీరుతో .. యూత్ హృదయాలను పొలోమంటూ పడగొట్టిన నిధి అగర్వాల్ మాత్రం అదృష్టానికి దగ్గరలోనే ఆగిపోయింది. నిధి అగర్వాల్ తన కెరియర్ ను మొదలుపెట్టి ఏడేళ్లు దాటిపోయింది. ఈ ఏడేళ్లలో ఆమె ఏడు సినిమాలు మాత్రమే చేసింది. సాధారణంగా ఒక భాషలో ఒక హీరో ఒక సినిమా చేసేలోగా హీరోయిన్స్ ఓ మూడు నాలుగు సినిమాలు చేసేస్తూ ఉంటారు. కానీ నిధి అగర్వాల్ మొదటి నుంచి కూడా ఈ విషయంలో వెనకబడే ఉంది. యూత్ లో తనకున్న క్రేజ్ ను ఆయుధంగా చేసుకుని ముందుకు దూసుకెళ్లలేకపోయింది. నిజానికి నిధి అగర్వాల్ తరువాత ఇండస్ట్రీకి వచ్చిన ఆ స్థాయి బ్యూటీలు చాలా తక్కువ. తెలుగులో కంటే బాలీవుడ్ లో ఆమె ఎక్కువగా సక్సెస్ అవుతుందని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ఆమె తన కెరియర్ ను పరిగెత్తించే విషయంలో చాలా బద్ధకంగా ఉందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 'హరిహర వీరమల్లు' .. 'రాజా సాబ్' సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల హిట్ తోనైనా ఆమె కెరియర్ పుంజుకుంటుందేమో చూడాలి. 

...

Complete article

20240430fr6630c6b59d657.jpg

20240430fr6630c6c12d386.jpg

Link to comment
Share on other sites

  • The topic was featured

Thotapalli Madhu: దూసుకుపోతున్న ఇంటర్వ్యూ .. దుమారం రేపుతున్న మాటలు!

30-04-2024 Tue 12:29 | Entertainment

రచయితగా అనేక చిత్రాలకు పనిచేసిన తోటపల్లి మధు 

ఒక ఇంటర్యూలో అనేక అంశాలపై మాటలు 

చనిపోయిన వ్యక్తుల గురించిన ప్రస్తావన 

అసహనంతో ఉన్న ఇండస్ట్రీ పెద్దలు

cr-20240430tn663096c0a1239.jpg

ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేసిన తోటపల్లి మధు, ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. ఒక విషయానికీ .. మరో విషయానికి ముడిపెడుతూ ఆయన చాలామంది నటీనటుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సావిత్రి తినేసి .. తాగేసి లావైపోయారు. బి. సరోజాదేవి తనని దాటుకుని ముందుకు వెళ్లడాన్ని ఆమె తట్టుకోలేకపోయారు" అని ఆయన అన్నారు. 

సావిత్రి మాదిరిగానే శ్రీదేవి కూడా మద్యం ఎక్కువగానే తీసుకుంటుందనీ, ఐశ్వర్య రాయ్ తనని దాటేసి వెళ్లడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారని అన్నారు. గ్లామర్ గా కనిపించడం కోసం, శ్రీదేవి చాలా సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని చెప్పారు. ఇక శోభన్ బాబు దానాలు పెద్ద మొత్తంలో చేసేవారు అంటూనే, జయలలిత ద్వారా ఆయనకి ఆ డబ్బు ఎలా వచ్చింది? ఎంజీఆర్ ఎందుకు ఆ టోపీ పెట్టుకుంటారు? అనే విషయాలపై కూడా మాట్లాడారు.

 జయసుధ తనతో సీరియల్ రాయించుకుని అతికష్టం మీద పాతికవేలు ఇచ్చారని చెప్పారు. తాను .. వాణివిశ్వనాథ్ వివాహం చేసుకోవడానికి గుడికి వెళ్లామనీ, ఆ రోజున గ్రహణం కావడం వలన గుడి మూసి ఉండటంతో తమ పెళ్లి జరగలేదని చెప్పాడు. ఇలా ఈ ఇంటర్వ్యూలో అనేక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన వ్యక్తుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల, ఇండస్ట్రీ పెద్దలు అసహనంతో .. అసంతృప్తితో ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.  

...

Complete article

Link to comment
Share on other sites

Venu on Balagam: మా నాన్న విషయంలో నాకు కలిగిన బాధనే 'బలగం': డైరెక్టర్ వేణు

01-05-2024 Wed 11:17 | Entertainment

సినిమాల్లో సరైన బ్రేక్ రాలేదన్న వేణు 

ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డానని వెల్లడి

110 సినిమా తరువాత 'జబర్దస్త్'కి వెళ్లానని వివరణ 

తనకి ఎదురైన అనుభవమే కథగా మారిందని వ్యాఖ్య

cr-20240501tn6631d76b5f069.jpg

ఆ మధ్య వచ్చిన 'బలగం' సినిమా ఒక సంచలనాన్ని సృష్టించింది. పాత కాలం నాటి రోజులను గుర్తుచేస్తూ, ఊళ్లో వాళ్లంతా కలిసి చూసిన సినిమా ఇది. అలాంటి ఆ సినిమాకి దర్శకత్వం వహించిన వేణుని ప్రశంసించనివారు లేరు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న వేణు, ఈ సినిమాను గురించిన విషయాలను ఈ వేదిక ద్వారా పంచుకున్నాడు. 

"నేను 110 సినిమాలు చేసిన తరువాత 'జబర్దస్త్'కి వెళ్లాను. కానీ మనసు మళ్లీ సినిమా వైపుకు లాగడంతో అటువైపు వెళ్లాను. సీరియల్స్ చేస్తున్నాడని సినిమా వాళ్లు పిలవడం మానేశారు. సినిమాలే చేస్తాడట అనేసి సీరియల్స్ వైపు నుంచి అవకాశాలు రాలేదు. ఆ సమయంలో నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను" అని అన్నాడు. 

"గతంలో నేను కొన్ని సినిమాలకు రైటర్ గా కూడా చేశాను .. ట్రాక్స్ రాశాను. అలా నా కోసం ఎందుకు రాసుకోకూడదని చెప్పి, నేను ప్రధాన పాత్రగా అనుకుని 'బలగం' రాసుకున్నాను. మా నాన్న విషయంలో నాకు ఎదురైన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుని, ఆ బాధను కాగితంపై పెట్టాను. అలా ఆ కథ పెరుగుతూ వెళ్లింది. జనంలో నుంచి పుట్టిన కథ కావడం వలన, చాలా వేగంగా కనెక్ట్ అయింది" అని చెప్పాడు.

...

Complete article

Balagam Movie Director Venu Exclusive Interview With Teenmaar Chandravva | V6 Entertainment

 

Balagam Movie Director Venu Yeldandi Exclusive Interview | Buchanna Muchata | Dil Raju | Mic Tv News

 

Venu Exclusive Interview | Balagam Movie | Venu Yeldandi || Signature Studios

 

Link to comment
Share on other sites

Yamuna: ఆ హీరో చాలా సీరియస్ గా ఉండేవారు: సీనియర్ హీరోయిన్ యమున

01-05-2024 Wed 10:41 | Entertainment

'మౌనపోరాటం'తో పరిచయమైన యమున

వినోద కుమార్ ఇబ్బంది పడ్డారని వెల్లడి 

దాసరి గారితో వర్క చేయడం అదృష్టమని వ్యాఖ్య 

ఆయన గొప్పతనం అదేనని వివరణ  

cr-20240501tn6631cef0694d5.jpg

యమున .. తన తొలి సినిమా 'మౌనపోరాటం'తోనే ఆమె ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత వచ్చిన 'ఎర్ర మందారం' .. 'మామగారు' వంటి సినిమాలు, ఆమె కెరియర్ గ్రాఫ్ ను పెంచుతూ వెళ్లాయి. తాజాగా 'సిగ్నేచర్ స్టూడియోస్' వారికి ఇచ్చిన ఇంటర్యూలో యమున మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

'మౌనపోరాటం' సినిమా తరువాత నేను వరుసగా చాలా సినిమాలు చేసి ఉండవలసింది. అలాగే పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుని ఉండవలసింది. కానీ అప్పటికీ నాకు ఏమీ తెలియదు. ఎలా ముందుకు వెళ్లాలి .. కెరియర్ ను ఎలా బిల్డ్ చేసుకోవాలనే విషయంలో ఎంతమాత్రం అవగాహన ఉండేది కాదు. అందువలన నేను పెద్ద సినిమాలు చేయలేకపోయానని అనుకుంటున్నాను. అలా అని చెప్పి ఆ విషయాన్ని గురించి బాధపడటం లేదు కూడా" అని అన్నారు. 

"వినోద్ కుమార్ తో నా కాంబినేషన్ చాలా బాగుంటుందని అంతా అనుకుంటారు. ఇద్దరం కలిసి అంత సహజంగా నటిస్తున్నామంటే చాలా ఫ్రెండ్లీగా ఉండి ఉంటామని అనుకుంటారు. కానీ నిజానికి ఆయన చాలా సీరియస్ గా ఉండేవారు. ఎక్కువగా మాట్లాడేవారు కాదు. నేను గలగలమని మాట్లాడే టైపు .. ఆయనేమో సైలెంట్. అందువలన ఆయనతో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ.

వినోద్ కుమార్ గారు చాలా హైట్ ఉండేవారు .. నేను చూస్తే హైట్ తక్కువ. అందువలన ఇద్దరికీ అస్సలు మ్యాచ్ అయ్యేది కాదు. నా పక్కన  కాస్త వంగిపోయి నిలబడటానికి ఆయనకి విసుగు వచ్చేది. అయినా మా కాంబినేషన్లో వచ్చిన సినిమాలు హిట్ కావడం గొప్ప విషయం" అని చెప్పారు. "ఇక దాసరి నారాయణరావుగారి దర్శకత్వంలోను  .. ఆయన నటుడిగా చేసిన సినిమాలలోను నాకు అవకాశం దొరకడాన్ని నేను అదృష్టంగా భావిస్తూ ఉంటాను. అయన అప్పటికప్పుడు సీన్స్ రాయడం .. డైలాగ్స్ రాయడం చూసి ఆశ్చర్యపోయేదానిని" అని చెప్పారు. 

...

Complete article

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Sai Pallavi - Birthday Special Video | #Thandel | Naga Chaitanya | Chandoo Mondeti | Devi Sri Prasad

 

Link to comment
Share on other sites

Sreemukhi: పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్న శ్రీముఖి?

13-05-2024 Mon 17:58 | Entertainment

బుల్లితెర టాప్ యాంకర్ గా కొనసాగుతున్న శ్రీముఖి

మూడు పదులు దాటుతున్నా పెళ్లి చేసుకోని అందాల భామ

శ్రీముఖి తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారన్న ముక్కు అవినాశ్

cr-20240513tn66420771bba0f.jpg

తెలుగు బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి... అడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తొలుత సినీ నటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి ఆ తర్వాత యాంకర్ గా మారింది. 'పటాస్' వంటి ప్రోగ్రామ్ తో క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి... ఆ తర్వాత పలు షోలతో టాప్ యాంకర్ గా అవతరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో 4, 5 షోలు ఉన్నాయి. ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా, జెమిని తదితర ఛానళ్లలో ఆమె షోలు చేస్తోంది. 

మరోవైపు శ్రీముఖి వయసు మూడు పదులు దాటిపోతోంది. ఆమె పెళ్లి ఎప్పుడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆమె పెళ్లిపై జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... శ్రీముఖి తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చూస్తున్నారని తెలిపాడు. ఈ ఏడాది ఆమె పెళ్లి జరిగే అవకాశం ఉందని చెప్పాడు. శ్రీముఖికి నచ్చిన కుర్రాడు దొరికితే పెళ్లి అయిపోతుందని తెలిపాడు.

...

Complete article

Link to comment
Share on other sites

Eesha Reba: ఎవరినైనా కలుసుకోవాలంటే భయంవేసేది: ఈషా రెబ్బా

16-05-2024 Thu 12:32 | Entertainment

హీరోయిన్ గా కొనసాగుతున్న ఈషా రెబ్బా 

రంగు విషయంలో అవమానించారని వ్యాఖ్య 

అక్కడ భాషకి ప్రాధాన్యతనిస్తారని వివరణ  

తనకి పట్టుదల ఎక్కువని వెల్లడి

cr-20240516tn6645af85d9d97.jpg

ఈషా రెబ్బా .. పక్కా తెలుగు అమ్మాయి. కథానాయికగా ఇక్కడ నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "నేను ఇక్కడ మొదటి సినిమా కోసం ఆడిషన్స్ కి వెళుతుంటే, తెలుగు అమ్మాయివని చెప్పకు .. నార్త్ నుంచి వచ్చినట్టుగా చెప్పు అని నా ఫ్రెండ్స్ చెప్పారు. కానీ అలా చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను తెలుగు అమ్మయిననే చెప్పాను" అని అన్నారు. 

"ఇక్కడ తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ రావడం కష్టమే. కెమెరా ముందుకు వెళ్లగానే తెలుగు అమ్మాయినని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్లంతా మొహాలు మాడ్చేస్తారు. అదే మలయాళ సినిమాల్లో అయితే, తమ భాష వచ్చినవారికే వాళ్లు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. భాషరాని వారిని పెట్టుకుని, వాళ్లు సమయాన్ని వృథా చేసుకోరు. నేను ఇక్కడ ఒక సినిమా చేసేలోగా ఒక మలయాళ హీరో 6 సినిమాలు చేశాడు" అని అన్నారు. 

కెరియర్ ఆరంభంలో నల్లగా ఉన్నాననే అవమానాలు కూడా నాకు ఎదురయ్యాయి. ఆడిషన్స్ కి వెళితే, ఎంతనల్లగా ఉన్నారో చూడండి అని నాకు చూపించేవారు. దాంతో అవకాశాల కోసం ఎవరినైనా కలవాలంటే నాకు భయం వేసేది. కానీ నాలో కొంచెం మొండితనం కూడా ఉంది. అందువలన ఎవరేమనుకుంటే అనుకోనీ అన్నట్టుగా ముందుకు వెళ్లాను" అని చెప్పారు.  

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...