Jump to content
  • 0

Telangana Decade Celebrations | Telangana Formation Day 2024


TELUGU

Question

Tank Bund being decked up for T-Formation Day

1450534-tank-bund.webp

The major event will have attractions like carnival... Hyderabad: As a part of the Telangana Formation Day celebrations, Tank Bund is being decked up. The major event will have attractions like carnival with colourful lighting and some 80 stalls serving food items to handicrafts. The officials including Secretary MA&UD Dana Kishore and other HoDs of various departments including GHMC, HMWSSB, Panchayat Raj, HMDA, City Police reviewed the preparations at the Tank Bund.

...

Complete article

Link to comment
Share on other sites

3 answers to this question

Recommended Posts

  • 0

KCR Write Open Letter To CM Revanth declining invitation | దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ దూరం.. రేవంత్‌కు బహిరంగ లేఖ

 

Link to comment
Share on other sites

  • 0

Revanth Reddy: తెలంగాణ జీవనశైలి స్వేచ్ఛ.. బానిసత్వాన్ని భరించం.. దశాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్‌ ప్రకటన

తెలంగాణ అవిర్భావ దినోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండా ఎగురువేసిన సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సంధర్బంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

revanth-reddy.jpg?w=1280

ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఏ హోదాలో ఆహ్వానిస్తారన్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి రావడానికి తల్లికి ఏ హోదా కావాలని ప్రశ్నించారు సీఎం. సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆవిర్బావ వేడుకల్లో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి.. పదేళ్లలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా ఇప్పటి వరకు రాష్ట్ర గేయం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి.. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం రాష్ట్ర ప్రజల తత్వవమని చెప్పారు. సంక్షేమం ముసుగులో చెరబట్టాలని చూస్తే ఇక్కడి సమాజం సహించదన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామని స్పష్టం చేశారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను సీఎం రేవంత్‌ విడుదల చేశారు.

జై తెలంగాణ నినాదంతో ప్రసంగం ప్రారంభించిన సీఎం.. ఆకలినైనా భరిస్తాం.. స్వేచ్ఛను హరిస్తే ఊరుకోమన్నారు. ప్రాంతేతరులు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరుముతామన్నారు. ప్రజాభవన్‌లో ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమ మాకు లేదన్న రేవంత్ రెడ్డి, పదేళ్లలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందన్నారు. సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారిందన్నారు. తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ కృతజ్ఞతలు తెలిపారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లి సోనియాకు హోదా అవసరమా? తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి పునర్ఘాటించారు.

...

Complete article

Telangana Decade Celebrations LIVE | CM Revanth Reddy | Telangana Formation Day 2024 - TV9

 

Link to comment
Share on other sites

  • 0

Green Telangana Master Plan: ‘గ్రీన్ తెలంగాణ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం’.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం రేవంత్..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించింది ప్రభుత్వం. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మొదటి అవతరణ దినోత్సవం కావడం, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసిన పార్టీగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వేడుకలు చేపట్టింది. జూన్ 2న సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన కార్నివాల్‌, లేజర్‌ షో, పోలీస్‌ బ్యాండ్ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ పదేళ్ల పండుగ.. రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది.

cm-revanth.jpg?w=1280

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించింది ప్రభుత్వం. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మొదటి అవతరణ దినోత్సవం కావడం, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసిన పార్టీగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వేడుకలు చేపట్టింది. జూన్ 2న సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన కార్నివాల్‌, లేజర్‌ షో, పోలీస్‌ బ్యాండ్ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ పదేళ్ల పండుగ.. రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం దగ్గర నివాళుర్పించి, పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లారు. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటను రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. పదేళ్లలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం వచ్చాక పాలనను గాడిలో పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందన్న సీఎం.. తెలంగాణ అభివృద్ధి కోసం గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామన్న ఆయన.. మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ ఆమె ప్రత్యేక వీడియో సందేశం పంపారు. తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీలను పూర్తిచేయడానికి రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేస్తుందన్నారు. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ఆవిర్బావ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సాంస్కృతిక, సాహిత్య, కళాకారులతో అద్భుతమైన ప్రదర్శనలు చేపట్టారు. కూచిపూడి, భరతనాట్యంతో పాటు వివిధ కళాఖండాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలు శాఖల మంత్రులు, పలువురు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు అద్దం పట్టేలా ఏర్పాటు చేసిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, ఫుడ్‌స్టాళ్లు కనువిందు చేస్తున్నాయి. 700 మంది కళాకారులతో అద్భుత ప్రదర్శన, సాంస్కృతిక నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ట్యాంక్‌బండ్‌పై 5వేల మంది జాతీయ పథకంతో భారీ ఫ్లాగ్‌ వాక్‌ నిర్వహించారు. చివరలో నిర్వహించిన లేజర్‌ షో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలువనుంది.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...