Jump to content
  • 1

Kumari aunty street food


TELUGU

Question

Kumari aunty: కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ అక్కడే ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

తొలగించకుండానే ట్రాఫిక్ క్రమబద్దీకరించాలని పోలీసులకు ఆదేశం

సోషల్ మీడియాలో విమర్శల నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి

స్వయం ఉపాధి పొందుతున్న పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి

సీపీఆర్వో అయోధ్య రెడ్డి ట్వీట్

cr-20240131tn65b9fa3ada348.jpg

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ తొలగింపు విషయంలో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించుకున్నారు. ఫుడ్ స్టాల్ ను తొలగించవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎక్కడైతే ఆమె వ్యాపారం చేసుకుందో ఇకపైనా అదే స్థలంలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కొనసాగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. అక్కడ ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి సీపీఆర్వో అయోధ్య రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు.

ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోందనే కారణంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను పోలీసులు మూసివేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో విపరీతంగా పాపులారిటీ సంపాదించుకున్న కుమారి ఆంటీ.. అదే పాపులారిటీ కారణంగా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసుల నిర్ణయాన్ని తప్పుబడుతూ, కుమారి ఆంటీకి మద్దతుగా నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దాకా చేరడంతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం స్పందించారు.

...

Read full article

Link to comment
Share on other sites

7 answers to this question

Recommended Posts

  • 0

జగన్ కు అనుకూలంగా మాట్లాడిందని కుమారిపై కక్ష సాధింపు చేశారన్న వైసీపీ

తెలంగాణ ప్రభుత్వాన్ని ఉసిగొల్పి దాడి చేయించారంటూ మండిపాటు

ఏపీ సీఎం జగన్ వల్ల తనకు ఓ ఇల్లు ఏర్పడిందని గతంలో కుమారి ఆంటీ వెల్లడి

cr-20240131tn65b9e406b4130.jpg

తెలంగాణలో ఓ ఫుడ్ సెంటర్ మూసివేత ఏపీలో పార్టీల మధ్య వివాదం రేపింది.. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనపై ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో గొడవపడుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ప్రస్తుతం ఏపీలో రాజకీయ రచ్చకు దారితీసింది. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ను పోలీసులు మూసివేయించిన విషయం తెలిసిందే. దీనికి యూట్యూబర్లు, మీడియానే కారణమని నెటిజన్లు మండిపడుతుండగా.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు మూసివేయించారో తెలియట్లేదని కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేశారు.

కుమారి ఆంటీ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చారు. ఇక్కడ చిన్నగా ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ఏపీ సీఎం జగన్ వల్ల తనకు ఏపీలో ఓ ఇల్లు ఏర్పడిందని గతంలో కుమారి ఆంటీ మీడియాకు చెప్పారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

...

Read full article

Link to comment
Share on other sites

  • 0

ముఖ్యమంత్రి తన హోటల్‌ను తెరిపించాలని నిర్ణయించడం సంతోషకరమన్న కుమారి ఆంటీ

రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల తాను చాలా హ్యాపీగా ఉన్నానని వెల్లడి

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్పందించడం గొప్ప విషయమని హర్షం 

cr-20240131tn65ba2a71c53f3.jpg

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోటల్‌ను తెరిపించాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమని హైదరాబాద్, మాదాపూర్ కు చెందిన కుమారి ఆంటీ ఆనందం వ్యక్తం చేశారు. తన హోటల్ తెరుచుకునేలా డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేసిన తర్వాత మీడియా ప్రతినిధులు కుమారి ఆంటీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సీఎం రేవంత్ నిర్ణయం పట్ల నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానని... ఇది ఆయన తమకు ఇచ్చిన వరం అన్నారు. రోడ్ సైడ్ హోటళ్లకు ప్రభుత్వం ఇంత మద్దతు ఇవ్వడం సంతోషమే అన్నారు.

తాను గత పదమూడేళ్లుగా స్ట్రీట్ ఫుడ్‌ను నిర్వహిస్తున్నానని కుమారి ఆంటీ తెలిపారు. తన హోటల్ తొలగింపుకు సంబంధించి మొదట తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. నిన్న 50 వేల రూపాయల ఫుడ్ వృథా అయిందన్నారు. తన ఫుడ్ కోర్టు బండిని సీజ్ చేశారని... తన కొడుకును కొట్టారని వాపోయారు. ఇంత జరిగాక మళ్ళీ హోటల్ తెరుస్తామని తాము అస్సలు అనుకోలేదని... తనలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్ మహిళను గుర్తించి ఓ ముఖ్యమంత్రి స్పందించడం గొప్ప విషయం అన్నారు. అందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

...

Read full article

Link to comment
Share on other sites

  • 0

ప్రస్తుతం నగరం చుట్టుపక్కల నుంచి జనాలు కుమారీ ఆంటీ చేతి వంట రుచి చూసేందుకు ఎగబడుతున్నారు. ఇన్‌స్టా గ్రామ్‌, ఫేస్‌ బుక్‌, యూట్యూబ్‌.. ఎక్కడ చూసినా కుమారీ ఆంటీ ఫుడ్‌ స్టాల్ వీడియోలే దర్శనమిస్తున్నాయి. యూట్యూబర్లతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా ఆమె ఇంటర్వ్యూల కోసం పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి

kumari-aunty-4.jpg?w=1280

సోషల్‌ మీడియా పుణ్యమా అని కుమారీ ఆంటీ క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. సాక్షాత్తూ సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించడంతో ఆమె పేరు నెట్టింట మార్మోగిపోతోంది. ప్రస్తుతం నగరం చుట్టుపక్కల నుంచి జనాలు కుమారీ ఆంటీ చేతి వంట రుచి చూసేందుకు ఎగబడుతున్నారు. ఇన్‌స్టా గ్రామ్‌, ఫేస్‌ బుక్‌, యూట్యూబ్‌.. ఎక్కడ చూసినా కుమారీ ఆంటీ ఫుడ్‌ స్టాల్ వీడియోలే దర్శనమిస్తున్నాయి. యూట్యూబర్లతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా ఆమె ఇంటర్వ్యూల కోసం పోటీ పడుతున్నాయి.

ఇటీవల సందీప్‌ కిషన్‌ తన లేటెస్ట్‌ మూవీ ఊరి పేరు భైరవ కోన మూవీ ప్రమోషన్లలో భాగంగా కుమారీ ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ను సందర్శించారు. హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ తదితరులతో కలిసి అక్కడకు వచ్చిన సందీప్‌ ఇక్కడ టేస్టీ ఫుడ్‌ను ఆస్వాదించి వెళ్లారట. ఇందుకు గానూ కుమారీ ఆంటీ చేతిలో పదివేలు పెట్టాడట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారని పోలీసులు కుమారీ ఆంటీ స్టాల్‌ను క్లోజ్‌ చేయించినప్పుడు సందీప్ కిషన్‌ ఆమెకు మద్దతుగా ట్వీట్‌ చేశాడు. కుమారీ ఆంటీకి తన చేతనైన సాయం చేస్తానంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. అలాగే ఆమె ఫుడ్‌ స్టాల్‌ను రీ ఓపెన్‌ చేయించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలిపాడీ యంగ్‌ హీరో.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

సోషల్ మీడియాలో ఫుడ్ లవర్స్.. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారీ ఆంటీ వీడియోలను వైరల్ చేశారు. దాంతో ఆమె దగ్గర భోజనం చేయడానికి జనాలు ఎగబడ్డారు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ జామ్ అవుతున్న కారణంగా ఆమెను షాప్ తీసేయాలని చెప్పారు. దాంతో ఆమె జీవనాదారం పోతుందని పోలీసులను బ్రతిమిలాడుకుంది. ఆ తర్వాత పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగింది.

kumari-aunty-5.jpg?w=1280

సోషల్ మీడియా పుణ్యమా అని కుమారీ ఆంటీ ఓవర్ నైట్ లో ఫెమ్స్ అయ్యింది. అంతే కాదు ఆమెకు లేనిపోని చిక్కులు కూడా తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో ఫుడ్ లవర్స్.. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారీ ఆంటీ వీడియోలను వైరల్ చేశారు. దాంతో ఆమె దగ్గర భోజనం చేయడానికి జనాలు ఎగబడ్డారు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ జామ్ అవుతున్న కారణంగా ఆమెను షాప్ తీసేయాలని చెప్పారు. దాంతో ఆమె జీవనాదారం పోతుందని పోలీసులను బ్రతిమిలాడుకుంది. ఆ తర్వాత పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగింది. చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించి. ఆమె షాప్ ను తొలగించవద్దు అని.. త్వరలోనే ఆమె ఫుడ్ స్టాల్ కు వస్తానని అన్నారు. దాంతో ఆమె ఓవర్ నైట్ సెలబ్రెటీ అయ్యింది.

తాజాగా కుమారీ ఆంటీని స్టార్ యాంకర్ సుమ ఇమిటేట్ చేశారు. కుమారీ ఆంటీ లానే భోజనం వడ్డిస్తూ.. ఆమె డీజే సాంగ్ కు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Kumari Aunty: సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ 'కుమారి ఆంటీ' క్రేజ్ మాములుగా లేదుగా..!

టీవీ షోస్ నుంచి ఏకంగా టీవీ సీరియ‌లో ద‌ర్శ‌నం

'రాజేశ్వ‌రి విలాస్ కాఫీ క్ల‌బ్' అనే సీరియ‌ల్‌లో అతిథి పాత్రలో మెరిసిన కుమారి ఆంటీ

ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుద‌ల‌

cr-20240311tn65eef89c03ac3.jpg

కుమారి ఆంటీ.. ఇప్పుడు ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అంతలా పాప్యుల‌ర్ అయ్యారామె. హైద‌రాబాద్‌లో ఒక‌చోట రోడ్డు ప‌క్క‌న ఫుడ్ బిజినెస్ చేసుకునే ఆమెను 'మీది మొత్తం థౌజెండ్ అయ్యింది.. రెండు లివ‌ర్లు ఎక్స్‌ట్రా' అనే ఈ ఒక్క డైలాగ్ రాత్రికి రాత్రే సోష‌ల్ మీడియా స్టార్‌గా మార్చేసింది. ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్, ఇన్‌స్టా ఇలా ఏ సామాజిక మాధ్య‌మంలో చూసినా ఆమె ఫుడ్ వీడియోసే క‌నిపించాయి. అలా ఒక్క దెబ్బ‌తో సోష‌ల్ మీడియాను త‌న‌వైపు తిప్పుకున్నారు. 

ఎంతలా అంటే.. ఒక‌ప్పుడు ఆమె ఫుడ్ సెంట‌ర్ వ‌ద్ద అంత‌గా జ‌నం ఉండేవారు కాదు. ఇప్పుడు ఆమె ఫుడ్ సెంట‌ర్ వ‌ద్ద ఏకంగా ట్రాఫిక్ జామ్ వ‌ర‌కు వెళ్లింది. దాంతో ఆమె ఫుడ్ సెంట‌ర్‌ను మూసేయాల‌ని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఆ త‌ర్వాత ఈ స‌మ‌స్య సీఎం దృష్టికి వెళ్ల‌డంతో ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇంకేముంది.. కుమారి ఆంటీ పాప్యులారిటీ మ‌రింత పెరిగిపోయింది. 

ఆ త‌ర్వాత టీవీ షోస్‌కు రావ‌డం మొద‌లైంది. ఇప్పుడు ఏకంగా టీవీ సీరియ‌ల్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న 'రాజేశ్వ‌రి విలాస్ కాఫీ క్ల‌బ్' అనే డైలీ సీరియ‌ల్‌లో అతిథి పాత్రలో ఎంట్రీ ఇచ్చి ప్రేక్ష‌కుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. త్వ‌ర‌లో ప్ర‌సారంకానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ఒక‌టి తాజాగా విడుద‌లైంది. దీనిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. 'మా కుమారి ఆంటీతో మాములుగా ఉండ‌దు మ‌రి', 'కుమారి ఆంటీనా మ‌జాకా', 'ఇదెక్క‌డి మాస్ క్రేజ్ రా మావా' అంటూ కామెంట్ చేస్తున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...