Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

Medaram Jatara: మేడారం జాతర


TELUGU

Question

Medaram Jatara: మేడారం జాతర రోజుల్లో హైదరాబాదు నగరంలో తిరిగేవి తక్కువ బస్సులే!

ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర

హైదరాబాద్ పరిధిలోని 2850 బస్సుల్లో 2000 మేడారంకు కేటాయింపు

హైదరాబాద్‌లో అందుబాటులో ఉండే బస్సులు 850 మాత్రమే

cr-20240219tn65d3423e340d9.jpg

హైదరాబాద్ నగరంలో తరుచూ మీరు బస్సుల్లో ప్రయాణిస్తుంటారా? లేదా ఈ నెల 24వ తేదీ వరకు బస్సుల్లో తిరిగే పనులు ఉన్నాయా? అయితే ఇది మీకోసమే! మేడారం జాతర పూర్తయ్యే వరకు కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సిందే! ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర సందర్భంగా నగరానికి చెందిన పలు ఆర్టీసీ బస్సులను మేడారంకు కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2850 బస్సులు తిరుగుతున్నాయి. అయితే ఇందులో 2 వేల బస్సులను ఎల్లుండి నుంచి మేడారం జాతరకు కేటాయించారు. ఇప్పటికే కొన్ని బస్సులను కేటాయించగా.. మరికొన్నింటిని జాతర సమయంలో కేటాయిస్తున్నారు.

నగరం నుంచి మేడారంకు కేటాయించే 2000 బస్సుల్లో 250 హైదరాబాద్ నగరం నుంచి మేడారం జాతరకు వెళ్లనుండగా.. మిగతావి ఇతర ప్రాంతాల నుంచి వెళతాయి. దీంతో 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నగరంలో బస్సుల్లో ప్రయాణించడం కష్టమే. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం కింద నగరంలో తిరిగే మహిళల సంఖ్య 18 లక్షల వరకు ఉంది

...

Complete article

Link to comment
Share on other sites

12 answers to this question

Recommended Posts

  • 0

Medaram Jatara: Adilabad RTC aims to transport 1.2 lakh passengers

The services are being operated since February 17 round the clock and additional buses will be operated as per demand of the passengers and requirement of the traffic, said TSRTC Adilabad Regional Manager Solomon

RTC_V_jpg--816x480-4g.webp?sw=1728&dsz=8

Mancherial: TSRTC Adilabad Regional Manager Solomon said that steps were being taken to operate sufficient number of special bus services to avoid inconvenience of devotees who participate in the biennial Medaram jatara slated for February 21.

Speaking to Telangana Today, Solomon explained a slew of arrangements were made by the public transport system in view of the tribal fair. He said 445 buses were arranged this time as against 305 services in 2020 with an expectation that the total number of passengers to be around 1.20 lakh. The number of services was enhanced by taking 2020 as the base year instead of 2022, which was hit by Covid-19 pandemic. The services are being operated since February 17 round the clock. Additional buses will be operated as per demand of the passengers and requirement of the traffic.

The regional manager noted that a major portion of the services were being run from Mancherial, Srirampur, Mandamarri, Chennur and Bellampalli towns to ferry the passengers to Medaram. The origin of the services is a special point, created on the grounds of Zilla Parishad High School (Boys) in Mancherial town. Devotees were requested to visit the point to avail the services.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Medaram Jatara: మేడారం జాతర... గద్దెపై కొలువుదీరిన జంపన్న

20-02-2024 Tue 23:05 | Telangana

ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సమ్మక్క-సారలమ్మ జాతర

కన్నెపల్లి నుంచి జంపన్నను తీసుకువచ్చిన పూజారి

మూడ్రోజుల పాటు పూజలు అందుకోనున్న జంపన్న

cr-20240220tn65d4e2ea9117f.jpg

తెలంగాణలో జరిగే చారిత్రాత్మక క్రతువు మేడారం మహా జాతర రేపు ప్రారంభం కానుంది. ఈ సమ్మక్క-సారలమ్మ జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు.  

కాగా, ఆచారం ప్రకారం సమ్మక్క తనయుడు జంపన్న గద్దెపైకి చేరుకున్నాడు. కన్నెపల్లిలో కొలువైన జంపన్నను సంప్రదాయబద్ధంగా సంపెంగ వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి తీసుకువచ్చారు. కర్ర, డాలును జంపన్నకు ప్రతిరూపంగా కొలుస్తారు. మూడ్రోజుల పాటు  భక్తుల పూజలు అందుకోనున్న జంపన్నను తిరిగి శనివారం నాడు కన్నెపల్లి తీసుకురానున్నారు. 

తెలంగాణ నుంచే కాకుండా, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు వస్తారు. ఈసారి మేడారం జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

నేడు గద్దెపైకి సారలమ్మ

వన దేవతల్లో ఒకరైన సారలమ్మ బుధవారం మేడారం గద్దె మీదకు రానుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దె మీదకొస్తారు.

9_SARALAMMA_1_2f419b27fc_V_jpg--799x414-

వన దేవతల్లో ఒకరైన సారలమ్మ బుధవారం మేడారం గద్దె మీదకు రానుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దె మీదకొస్తారు. సారలమ్మ మేడారానికి వేంచేయడంతోనే నాలుగురోజుల మహాజాతరకు తెరలేవనుంది. ఈ మేరకు బుధవారం తెల్లవారుజాము నుంచే సారలమ్మ కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలవుతాయి. పొద్దున్నే సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి.. ఆలికి ముగ్గులతో అలంకరిస్తారు. ప్రధాన పూజారి అయిన కాక సారయ్య పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం ఆదివాసీ పూజారులు రహస్య పూజలు చేస్తారు. ఈ సమయంలోనే పూజారి సారయ్యను సారలమ్మ ఆవహిస్తుంది. తర్వాత సారలమ్మ (సారయ్య రూపంలో)ను ఆలయం నుంచి గద్దెల వైపు పూజారులు తీసుకొస్తారు. సమ్మక్క గారాల బిడ్డ అయిన సారలమ్మ ధైర్యానికి, వీరత్వానికి, త్యాగానికి ప్రతీక. 12వ శతాబ్దాంలో తమ గిరిజన ప్రాంతాన్ని కాపాడుకునేందుకు కాకతీయలతో సారలమ్మ యుద్ధం సాగించిన తీరును, వీరమరణం ద్వారా ఆమె త్యాగాన్ని భక్తులు స్మరించుకుంటూ దైవంగా కొలుస్తారు. తల్లిని మొక్కితే సంతానం ప్రాప్తిస్తుందని, రుగ్మతలు పోతాయని భక్తుల విశ్వాసం. ఫలితంగా మేడారానికి సాగుతున్న సమయంలో సారలమ్మకు కన్నెపల్లిలో భక్తులు ఎదురెళ్లి మంగళహారతులు ఇస్తారు. సంతానం కలగాలని, సమస్యలు తీరాలని తడి బట్టలతో భక్తులు వరం పడతారు.

సారలమ్మ వీధిలోకి రాగానే పూజారులు పీటలు వేసి కాళ్లు కడిగి.. మంగళహారతులు ఇచ్చి తల్లిని సాగనంపుతారు. సారలమ్మ కన్నెపల్లి మీదుగా తన తమ్ముడు జంపన్నను పలకరిస్తూ జంపన్నవాగును దాటి సాయంత్రానికి గద్దెకు చేరుకుంటుంది. అలాగే మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును .. ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి పగిడిద్దరాజు తమ్ముడు గోవిందరాజును పడిగె రూపాల్లో రాత్రి 8 గంటలవరకు గద్దెపైకి తీసుకొస్తారు. 22న అంటే.. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెకు చేర్చుతారు. ఆ రోజు మహాజాతర మరోస్థాయికి చేరుతుంది. 24న సాయం త్రం వనదేవతలు తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమవుతారు. కాగా, ఈసారి జాతర కు 1.3 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తులకు ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా రూ.105 కోట్ల నిధులు కేటాయించింది. తాత్కాలికంగా 5,600 మరుగుదొడ్లు నిర్మించారు. 200 దాకా ఉన్న శాశ్వత మరుగుదొడ్లకు మరమ్మతులు చేశారు. మేడారం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్‌ తదితర చోట్ల 354 బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌ను ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాట్లను మంత్రులు సీతక్క, పొన్నం, కొండా సురేఖ, పొంగులేటి పర్యవేక్షిస్తున్నారు. జాతర మూడోరోజు, శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మేడారానికి వస్తున్నారు.

మేడారానికి ఎలా వెళ్లాలి?

మేడారం వచ్చే భక్తులు హైదరాబాద్‌ నుంచైతే తొలుత వరంగల్‌కు రావాలి. రైలులో వచ్చే భక్తులైతే ఖాజీపేట, వరంగల్‌ రైల్వేస్టేషన్లలో దిగి అక్కడి నుంచి నేరుగా 163 జాతీయ రహదారిపై నుంచి ములుగు-ఏటూరునాగారం ప్రధాన రహదారి వెంట వెళ్లాల్సి ఉంటుంది. హనుమకొండ నుంచి 85 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే పస్రా వస్తుంది. అక్కడి నుంచి ఎడమ వైపునకు మేడారం రహదారి ఆర్చీతో స్వాగతం పలుకుతుంది. పస్రా నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే మేడారం చేరుకోవచ్చు. ఒకవేళ ఆర్టీసీ బస్సులో ప్రయాణించాల్సి వస్తే హనుమకొండ బస్టాండ్‌ నుంచి నేరుగా మేడారానికి వందలాది బస్సులు సిద్ధంగా ఉంటాయి.

జాతరకు ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌,: తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో పాల్గొనే భక్తులు, సందర్శకుల కోసం రాష్ట్ర పర్యాటక సంస్థ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నాలుగు రోజుల పాటు ఉదయం 6:30 గంటలకు సికింద్రాబాద్‌ యాత్రి నివాస్‌, బషీర్‌బాగ్‌ సెంట్రల్‌ రిజర్వేషన్‌ కార్యాలయం నుంచి ఎసీ, నాన్‌ ఎసీ, వోల్వో బస్సులు బయలుదేరుతాయని పర్యాటక సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేష్‌ నాయుడు తెలిపారు. ఈ బస్సుల్లో వెళ్లే భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసినట్లు వివరించారు

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Food safety officials detect cotton candy laced with carcinogen at Medaram Jatara

Telangana State Food Laboratory officials today seized a stock of cotton candy (peechu mithai in Telugu) laced with a potent carcinogen at the Medaram Jatara site. “We detected the presence of Rhodamine B, which is a banned substance known to cause cancer. It is an industrial dye and should not be used as a food colour,” said G. Laxmi Narayana Reddy, Head of State Food Laboratory, who led the food safety enforcement team. The team used Ethyl acetate method for spot testing and spectrophotometry for quantification of Rhodamine B, informed Mr. Reddy, who is Chief Public Analyst at the institution.

dc-Cover-cl68ilqpcdhsjg29ujfrm6pae4-2022

This is the first time the State has acted against the use of the fluorescent pink colour used for colouring cotton candy. “As of now, there is no Statewide ban, but we will be acting against the use of the industrial dye whenever it is used in foods as it has a immediate as well as long term health impact,” said the official.

Last week, Tamil Nadu was the first state to slap a ban on the sale of cotton candy coloured with the industrial dye. Other States like Puducherry have followed, while Andhra Pradesh has raised the surveillance level to detect the dye used to colour food

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Medaram Jatara: మేడారం జాతరకు పోటెత్తుతున్న భక్తులు

ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర

వనదేవతలుగా పేరుగాంచిన సమ్మక్క-సారలమ్మ

అతిపెద్ద గిరిజన పండుగల్లో ఒకటిగా మేడారం జాతర

cr-20240221tn65d5e0a49efb1.jpg

తెలంగాణలో చారిత్రాత్మక మేడారం జాతర నేడు ప్రారంభమైంది. గిరిజనులకు అతి పెద్ద పండుగగా పేరుగాంచిన ఈ సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఒక్క తెలంగాణ ఆర్టీసీ ద్వారానే 1.50 లక్షల మంది భక్తులు మేడారం తరలివచ్చారు. ఇప్పటిదాకా ఆర్టీసీ మేడారం జాతరకు 3,600 ట్రిప్పులు నడపడం విశేషం. అటు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ రైడ్ కూడా ఏర్పాటు చేయడం తెలిసిందే. 

మేడారంలో ఈసారి లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భారీ డిజిటల్ స్క్రీన్లపై వనదేవతలు సమ్మక్క-సారలమ్మ జీవిత చరిత్రను ప్రదర్శిస్తున్నారు. మేడారం జాతరలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న వాటిలో ఇదొకటి. 

కాగా, మేడారం జాతరపై మంత్రి సీతక్క స్పందించారు. మేడారం మహా జాతరకు భారీగా భక్తులు తరలి వస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. మేడారం జాతరకు గతంలో ఎడ్లబండ్లపై వచ్చేవారని, ఇప్పుడు హెలికాప్టర్లలో వస్తున్నారని వివరించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Medaram Jatara comes to an end, deities return to forest

The jatara ended with the goddesses’ “Tallula Vanapravesham” (entry into the forest) as the vermilion casket was carried back to Chilukalagutta and kept there until the next jatara.

medaram_V_jpg--816x480-4g.webp?sw=1728&d

Mulugu: The four-day tribal fair Sammakka Saralamma Jatara, popular as the Medaram Jatara, at Medaram village of Tadwai mandal ended on Saturday as lakhs of tribal devotees left for their hamlets and villages after paying obeisance to the tribal goddesses.

The jatara ended with the goddesses’ “Tallula Vanapravesham” (entry into the forest) as the vermilion casket was carried back to Chilukalagutta and kept there until the next jatara.

Goddess Sammakka was taken to Chilukalagutta, Saralamma to Kannepalli, Govinda Raju to Kondai and Pagididda Raju to Poonugonda.

Devotees, both tribal and non-tribal, from different parts of Telangana and neighbouring States of Andhra Pradesh, Odisha, Chhattisgarh, Maharashtra, Madhya Pradesh and Karnataka converged at the place to celebrate the tribal fair. A huge number of devotees thronged Medaram from early hours on Saturday while those who had darshan and offered prayers, camping in temporary tents, returned to homes with the blessings of the tribal deities.

It is estimated that more than one crore devotees visited Sammakka and Saralamma in three days. Governor Tamilisai Soundararajan and Chief Minister A Revanth Reddy earlier visited the Jatara and paid tributes to the tribal deities. Around 20 lakh devotees reportedly paid their respects to the Goddesses on the last day.

Thousands of devotees offered ‘bangaram’ (jaggery) to the goddesses and took the holy bath in Jampanna Vagu. Panchayat Raj Minister D Anasuya, who camped in Medaram for the last four days, supervising the arrangements for smooth conduct of the tribal fair, thanked all officials and staff members of medical, sanitation, revenue, police and other departments for making the jatara a huge success.

BRS MLC K Kavitha on Saturday offered jaggery of the weight of BRS chief and former Chief Minister K Chandrashekhar Rao to Sammakka and Sarakka. The jaggery offering made to the tribal deities on behalf of Chandrashekhar Rao was dispatched online to Medaram. The jaggery offered to the tribal deities is viewed as precious as gold and is called ‘bangaram’.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

RTC Bus: మేడారం నుంచి తిరిగి వస్తూ బస్సులోనే మందేసిన భక్తులు.. వీడియో ఇదిగో!

గురువారం ఆర్టీసీ బస్సులో ఘటన.. వీడియో తీసి ట్వీట్ చేసిన ప్రయాణికుడు

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

ఫన్నీగా రియాక్టవుతున్న నెటిజన్లు.. 

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించాలని డిమాండ్

cr-20240224tn65d9983b27861.jpg

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడిపింది. అయితే, గురువారం జాతర నుంచి తిరిగి వస్తున్న ఓ బస్సులో ఐదుగురు ప్రయాణికులు మద్యం సేవించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. బస్సులో కింద కూర్చున్న ప్రయాణికులలో ఐదుగురు వ్యక్తులు మద్యంతో పార్టీ చేసుకున్నారు. మిగతా ప్రయాణికులు చూస్తుండగానే మద్యం తాగుతూ మత్తులో ఊగిపోయారు. ఈ తతంగాన్నంతా ఓ ప్రయాణికుడు వీడియో తీసి ట్వీట్ చేశాడు.

ట్విట్టర్ లో ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘జీడీపీ పెరిగేది ఇలానే. బస్ టికెట్ తీసుకుంటే రూ.100 తో అయిపోయేది. కానీ, మహిళలకు ఉచిత ప్రయాణంతో మగవాళ్లు మద్యం కొనుగోలు చేశారు. దీంతో ప్రభుత్వానికి రూ.1000 లాభం’ అని కామెంట్ పెట్టాడు

...

Complete article

 

  • Haha 1
Link to comment
Share on other sites

  • 0

Medaram Jatara: మేడారం హుండీ లెక్కింపు... తొలిరోజు ఆదాయం రూ.3.15 కోట్లు

518 హుండీలకు గాను తొలి రోజు 134 హుండీల లెక్కింపు పూర్తి

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న లెక్కింపు

ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయనున్న అధికారులు

cr-20240229tn65e099ac3c551.jpg

మేడారం మహాజాతర హుండీ లెక్కింపు గురువారం నాడు ప్రారంభమైంది. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశారు. మొత్తం 518 హుండీలను పదిరోజుల పాటు లెక్కించనున్నారు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరుగుతోంది. సమ్మక్క సారలమ్మలకు భక్తులు పెద్ద ఎత్తున బంగారం, నగదును సమర్పించుకున్నారు.

అయితే హుండీ లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు రావడం కలకలం రేపింది. ఈ నకిలీ కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ చిత్రం ఉంది. గురువారం మధ్యాహ్నం తెరిచిన ఓ హుండీలో అంబేడ్కర్ ఫొటోతో నకిలీ రూ.100 నోట్లు కనిపించాయి. లెక్కింపు కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏ రోజు లెక్కించిన మొత్తాన్ని ఆ రోజు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఈసారి  ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

మేడారం సమ్మక్క సారలమ్మ వార్ల హుండీ ఆదాయం తొలిరోజు రూ.3.15 కోట్లుగా ఉంది. మేడారం మహాజాతర హుండీ లెక్కింపు గురువారం నాడు ప్రారంభమైంది. మొత్తం 518 హుండీలను లెక్కించనున్నారు. ఇందులో భాగంగా నేడు మొదటి రోజు 134 హుండీలను దేవాదాయ శాఖ అధికారులు లెక్కించగా మూడు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని అధికారులు బ్యాంకులో జమ చేస్తారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో లెక్కిస్తున్నారు. లెక్కింపు కోసం సీసీ కెమెరాలతో పాటు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Medaram Jathara | నా భర్త బెట్టింగ్‌ మానాలి.. అక్క కొడుకుకు ఐఐటీ లో సీటు రావాలి.. సమ్మక్క భక్తురాలి విచిత్ర కోరిక 

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల్లో భక్తుల విచిత్ర కోరి కల చీటీలు బయటపడుతున్నాయి. ‘నా భర్త బెట్టింగ్‌ మానివేయాలి...

01-69_V_gif--816x480-4g.webp?sw=1728&dsz

Medaram Jathara | వరంగల్‌, మార్చి 3: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల్లో భక్తుల విచిత్ర కోరి కల చీటీలు బయటపడుతున్నాయి. ‘నా భర్త బెట్టింగ్‌ మానివేయాలి… అక్క కొడుకుకు ఐఐటీ లో సీటు రావాలి’ అని ఓ భక్తురాలు రాసిన కాగితం హుండీ లెక్కింపులో ఆదివారం బయట పడింది. కోరిన కోర్కెలు తీర్చే తల్లి సమ్మక్క ఆ భక్తురాలి కోరిక తీరుస్తుందో లేదో చూడాలి మరి.

Link to comment
Share on other sites

  • 0

మేడారం జాతర ఆదాయం రూ.12.7 కోట్లు

మేడారం జాతర ఆదాయం రూ.12,71,79,280 వచ్చింది. గతంలో కన్నా ఈసారి రూ.26,29,553 ఎక్కువ వచ్చింది. ఈసారి భక్తులు ఎక్కువగానే వచ్చినా.. హుండీ ఆదాయం పెద్దగా పెరగలేదు. కాగా, మేడారం హుండీల లెక్కింపు మంగళవారం ముగిసింది. భక్తుల నుంచి కానుకగా వచ్చిన 800 గ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండిని బ్యాంకులో భద్రపరిచారు. నాణేలను లెక్కించాల్సి ఉంది

Link to comment
Share on other sites

  • 0

Medaram Jatara: పూర్తయిన మేడారం హుండీ లెక్కింపు... రూ.13.25 కోట్ల ఆదాయం

540 హుండీలను వారం రోజుల పాటు లెక్కించిన అధికారులు

క్రితంసారి కంటే రూ.1.79 కోట్ల ఆదాయం ఎక్కువ వచ్చినట్లు వెల్లడి

హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఎనిమిది రోజుల పాటు మేడారం హుండీల లెక్కింపు

cr-20240306tn65e894238a6dd.jpg

మేడారం సమ్మక్క సారక్క జాతర హుండీ లెక్కింపు పూర్తయింది. మొత్తం 540 హుండీలను వారం రోజుల పాటు లెక్కించారు. హుండీల ద్వారా రూ.13.25 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2022 మేడారం జాతర కంటే ఈ ఏడాది జాతరకు రూ.1.79 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఎనిమిది రోజుల పాటు మేడారం హుండీలను లెక్కించారు.

ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర ఘనంగా జరిగింది. జాతర అనంతరం హుండీలను టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు. నోట్లు, కాయిన్స్ కలిపి మొత్తం 13 కోట్ల 25 లక్షల 22 వేల 511 రూపాయలు వచ్చాయి. 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండి వచ్చింది. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...