Jump to content
  • 0

‘చలో మేడిగడ్డ’ విజయవంతం


TELUGU

Question

మేడిగడ్డ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు.. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్‌ఎస్‌ చేపట్టిన ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చింది. వందలాది మంది నేతలు, వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు వెంటరాగా పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ శాసనసభాపతులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, సబిత ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కదిలారు.

palla_V_jpg--816x480-4g.webp?sw=1728&dsz

‘చలో మేడిగడ్డ’ విజయవంతంరైతు ప్రయోజనాలే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ యాత్ర

పెద్ద ఎత్తున కదిలివచ్చిన శ్రేణులు, రైతుల అపూర్వ స్వాగతం

హైదరాబాద్‌ నుంచి దారిపొడవునా జన నీరాజనం

రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల్లో అనూహ్య స్పందన

మేడిగడ్డ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు.. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్‌ఎస్‌ చేపట్టిన ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చింది. వందలాది మంది నేతలు, వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు వెంటరాగా పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ శాసనసభాపతులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, సబిత ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కదిలారు. మేడిగడ్డ ప్రాజెక్టును పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, రైతుల ప్రయోజనాలను కాపాడాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఈ యాత్ర విజయవంతమైంది. ఈ యాత్ర పార్లమెంటు ఎన్నికల కోసం కాదని, దీనిని రాజకీయ కోణంలో చూడొద్దని, త్వరగా ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లందేలా చూడాలన్నదే తమ లక్ష్యమని ఆ పార్టీ ప్రకటించింది. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పింది. ఒకవైపు యాత్రకు బీఆర్‌ఎస్‌ పార్టీ పూనుకోవడంతో మరోవైపు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హడావుడిగా మీడియా సమావేశాలు పెట్టి నష్టనివారణ చర్యలకు ప్రయత్నించడమే దీనికి నిదర్శనం.

ఊరూరా ఘనస్వాగతం

మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల పర్యటనకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన పిలుపునకు ఊరూరా విశేష స్పందన వచ్చింది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకల్లా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నేతలు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సరిగ్గా 8.30 గంటలకు అక్కడి నుంచి మేడిగడ్డకు వాహనశ్రేణి ప్రారంభమైంది. సుమారు 1,000 మంది పార్టీ నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. మార్గమధ్యంలో ఉప్పల్‌, భువనగిరి, జనగామ, వరంగల్‌, పరకాల, భూపాలపల్లి జిల్లాలకు చెందిన నేతలంతా హైదరాబాద్‌ నుంచి వస్తున్న వాహన శ్రేణులకు జత కలిశారు. పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్‌, మంథని, పెద్దపల్లి, కరీంనగర్‌ తదితర ప్రాంతాల నుంచి నేతలు నేరుగా మేడిగడ్డకే చేరుకున్నారు. మార్గమధ్యంలో స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున తోరణాలు ఏర్పాటుచేశారు. పలుచోట్ల పటాకలు కాలుస్తూ, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. జనగామ జిల్లా పెంబర్తి వద్ద, లింగాలఘనపురం మండలం నెల్లుట్ల బైపాస్‌ రోడ్డులో, శాయంపేట మండలం మాందారిపేట స్టేజీ వద్ద, పరకాల అంబేద్కర్‌ సెంటర్‌, గణపురం మండలం గాంధీనగర్‌ జంక్షన్‌లో, రేగొండలో, కాటారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ యాత్ర బృందానికి స్వాగతం పలికారు.

‘జల ప్రదాత’కు జేజేలు

జల ప్రదాతకు స్వాగతం, అపర భగీరథుడికి స్వాగతం.. అంటూ ఊరూరా పోస్టర్లు వెలిశాయి. గ్రామాల్లోని ప్రజలు చేతులెత్తి యాత్ర బృందం వాహన శ్రేణికి ఎదురొచ్చి అభివాదం చేశారు. మేడిగడ్డ బరాజ్‌ వద్దకు చేరుకున్న పార్టీ బృందానికి పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. బరాజ్‌ మొత్తం జనంతోనే నిండిపోయింది. ఒక దశలో పోలీసులు అకడికి వచ్చిన వారిని అదుపు చేయలేకపోయారు. బరాజ్‌ గేట్లను మూసివేశారు. దీనిపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు బరాజ్‌ మీదకు అందరినీ అనుమతించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

అడుగడుగునా పరిశీలించిన బృందం

మేడిగడ్డ బరాజ్‌లో కుంగిన పిల్లర్లను బీఆర్‌ఎస్‌ బృందం పరిశీలించింది. బరాజ్‌ పైనుంచి, కింది వరకు వెళ్లి గేట్లను కూడా పరిశీలించారు. దెబ్బతిన్న 19, 20, 21 పిల్లర్ల వద్దకు స్వయంగా వెళ్లి చూశారు. బృందానికి రిటైర్డ్‌ ఇంజనీర్లు దామోదర్‌రెడ్డి, వెంకటేశం, నీటిపారుదల రంగ నిపుణులు వీ ప్రకాశ్‌ తదితరులు అకడ జరిగిన పరిస్థితిని వివరించారు. దెబ్బతిన్న పిల్లర్లను ఎలా బాగు చేయవచ్చో వివరిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలనూ సూచించారు. ఎమ్మెల్యేల బృందంలో ఉన్న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కూడా ప్రభుత్వం పూనుకుంటే ఎలా బాగు చేయవచ్చో చెప్పారు. మేడిగడ్డను పరిశీలించిన తర్వాత బీఆర్‌ఎస్‌ బృందం నేరుగా అన్నారం బరాజ్‌కు చేరుకున్నది. అక్కడ కూడా లోపాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్న ప్రాంతాలనూ పరిశీలించింది.

కడియం ‘ప్రజెంటేషన్‌’కు విశేష స్పందన

అన్నారం బరాజ్‌ గడ్డపై నీటిపారుదల శాఖ మాజీ మంత్రి కడియం శ్రీహరి ‘కాళేశ్వరంపై కాంగ్రెస్‌ విషప్రచారం.. బీఆర్‌ఎస్‌ వాస్తవాలు’ పేరుతో రూపొందించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ఇచ్చారు. ప్రజలకు వాస్తవాలను వివరిస్తుండగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆసక్తిని కనబర్చారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నపుడు ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి మంచి స్పందన వచ్చింది. రాజకీయంగా తమపై దాడి చేయండి.. ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తామంటే ఊరుకోబోమని కడియం చేసిన వ్యాఖ్యలపై పార్టీ కార్యకర్తలు లేచి నిలబడి అండగా ఉంటామని.. ప్రభుత్వం తీరు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రజలకు నష్టం చేస్తే చూస్తూ ఊరుకోబోమని.. పోరాటాలు బీఆర్‌ఎస్‌కు కొత్త కాదని కడియం అంటే.. మేమంతా మీ వెంటే ఉంటామంటూ చప్పట్లతో ఆయన వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు.

కేటీఆర్‌ లెక్కల వివరాలకు చప్పట్ల హోరు

కాళేశ్వరం ప్రాజెక్టు అత్యుత్తమంగా ఉన్నదని లెకలతో సహా మాజీ మంత్రి కేటీఆర్‌ వివరిస్తున్నంత సేపు కార్యకర్తలు చప్పట్లతో అభినందించారు. హరీశ్‌రావు ఒంటిచేత్తో అసెంబ్లీలో కాంగ్రెస్‌ సరారును నిలదీశారని, ఆ పార్టీ విధానాలను ఎండగట్టారని చెప్పినపుడు నినాదాలు మిన్నంటాయి. కాంగ్రెస్‌ పార్టీ చెప్తున్న అబద్ధాలను ప్రజలకు హరీశ్‌రావు ఏనాడో చెప్పారని వివరించారు. తుమ్మడిహట్టి వద్ద నీటి లభ్యత విషయంలో మంత్రి ఉత్తమ్‌ చేసిన ఆరోపణలను సాక్షాలతో సహా హరీశ్‌రావు సభలో వివరించారని తెలిపారు. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ రాసిన లేఖను సభలో చూపించారని చెప్పారు.

అలసట లేకుండా అర్ధర్రాతి వరకు సాగిన యాత్ర

ఉదయం 8.30 గంటలకు మొదలైన బీఆర్‌ఎస్‌ బృందం యాత్ర అలసట లేకుండా కొనసాగింది. మేడిగడ్డ, అన్నారం బరాజ్‌ సందర్శన అర్ధరాత్రి వరకు సాగింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా ఈ యాత్రలో ఆసాంతం పాల్గొన్నారు. ఇంజినీర్ల సంఘం జేఏసీ నేత వెంకటేశం సభాముఖంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సాంకేతిక అంశాలను వివరించారు. ముమ్మాటికీ ఇకడ నీళ్లు ఉంటాయన్న అంచనాలతోనే ప్రాజెక్టు కట్టారని, మేడిగడ్డకు మరమ్మతులు చేసి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని, మరమ్మతులు చేస్తే ఈ ప్రభుత్వానికే పేరు వస్తుందని చెప్పారు. ప్రాజెక్టులకు ఇలాంటి సమస్యలు తలెత్తడం ఇదే తొలిసారి కాదని, ఇలాంటి సమస్యలు వస్తాయని, వచ్చిన సమస్యలను భూతద్దంలో చూపించవద్దని హితవు పలికారు.

ఉత్తమ్‌ ఇదిగో లేఖ!

తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నా కూడా బీఆర్‌ఎస్‌ సరార్‌ కావాలనే రీడిజైన్‌ చేసిందని ఇటీవల మంత్రి ఉత్తమ్‌ చేసిన ఆరోపణల్లోని డొల్లతనాన్ని మేడిగడ్డ వేదికగా హరీశ్‌రావు బట్టబయలు చేశారు. తుమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల జలాలు అందుబాటులో లేవని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీడబ్ల్యూసీనే తెలంగాణకు లేఖ రాసిందని వెల్లండించారు. అ లేఖను మేడిగడ్డ వేదికగా చూపారు. ఇదిగో సాక్ష్యం అంటూ ఉత్తమ్‌ ఆరోపణలను హరీశ్‌ ఎండగట్టారు.

అంతంకాదిది ఆరంభం: కేటీఆర్‌

‘చలో మేడిగడ్డ’ పర్యటనతో బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగబోదని కేటీఆర్‌ ప్రకటించారు. రైతుల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా కొట్లాడతామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని కాంపోనెంట్లను, రిజర్వాయర్లను, ప్రాజెక్టులను సందర్శిస్తామని తెలిపారు. ప్రజాసమస్యలు, కాంగ్రెస్‌ హామీల అమలు కోసం కూడా పర్యటనలు చేపడతామని వెల్లడించారు. ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి వెల్లువలా తరలివచ్చిన పార్టీ నాయకులకు, శ్రేణులకు, ప్రజలకు కేటీఆర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

...

Complete article

Link to comment
Share on other sites

2 answers to this question

Recommended Posts

  • 0

ఒక్క పిల్లర్‌ కుంగితే ఇంత రాద్ధాంతమా?

‘‘కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు. వంద అంకాలతో కూడుకున్న మహోన్నత ప్రాజెక్టు. ఒక్క పిల్లర్‌ కుంగితేనే కాంగ్రెసోళ్లు రాద్ధాంతం చేస్తున్నారు.

2ktr_355a7c4d82_V_jpg--799x414-4g.webp

మాపై పగ తీర్చుకోండి.. రైతులకు నీళ్లివ్వండి

కాళేశ్వరం వంద అంకాల్లో మేడిగడ్డ ఒకటి

చిన్న సమస్యను పెద్దదిగా చూపుతున్నారు

ప్రాజెక్టే నిష్ఫలమైనట్లు ప్రచారం చేస్తున్నారు

మరమ్మతులు చేసి నీళ్లివ్వొచ్చని ఇంజనీర్లు

చెప్తున్నా సర్కార్‌ పట్టించుకోవట్లే: కేటీఆర్‌

కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేయాలని

రేవంత్‌ కుట్ర: హరీశ్‌రావు

బీఆర్‌ఎస్‌ ‘చలో మేడిగడ్డ’లో ఉద్రిక్తత

గేటును తోసి దూసుకొచ్చిన కార్యకర్తలు

కేటీఆర్‌ బృందానికి కాంగ్రెస్‌ నిరసన సెగ

‘‘కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు. వంద అంకాలతో కూడుకున్న మహోన్నత ప్రాజెక్టు. ఒక్క పిల్లర్‌ కుంగితేనే కాంగ్రెసోళ్లు రాద్ధాంతం చేస్తున్నారు. చిన్న సమస్యను భూతద్దంలో చూపుతూ మొత్తం ప్రాజెక్టే నిష్పలమైనట్లు ప్రచారం చేస్తున్నారు. రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మాపై పగ ఉంటే తీర్చుకోండి. కానీ, రైతులకు మాత్రం సాగు నీరు ఇవ్వండి’’ అని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ‘‘చలో మేడిగడ్డ’’లో భాగంగా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బస్సుల్లో బయలుదేరిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నేతలు... సాయంత్రం 4.40 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీలోని 7వ బ్లాక్‌లో పగుళ్లు ఏర్పడి.. కుంగిపోయిన 20వ పిల్లర్‌ను పరిశీలించిన తర్వాత కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. 1.6 కిలోమీటర్లు పొడవున్న మేడిగడ్డ బ్యారేజీలో 50మీటర్ల పరిధిలో చిన్న సమస్య ఏర్పడితే దాన్ని పెద్దదిగా చూపిస్తున్నారని ఆరోపించారు. మరమ్మతు చేసుకుని బ్యారేజీని వాడుకోవచ్చని ఇంజనీర్లు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకొనైనా సరే వానాకాలంలోపు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే కరీంనగర్‌, ఇతర జిల్లాల్లో నీరు లేక పంటలు ఎండుతున్నాయని, ప్రభుత్వం నీటిని ఎత్తిపోస్తే రైతులకు లాభం జరుగుతుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ నిపుణులతో కమిటీ వేసి సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, నిపుణుల సలహాలు తీసుకుని బ్యారేజీని పునరుద్ధరించాలని సూచించారు. కాంగ్రెస్‌ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు ప్రాజెక్టులు రెండు సార్లు కొట్టుకుపోయాయని, నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లీకేజీలు వచ్చాయని గుర్తు చేశారు. కానీ, ఆయా అంశాలపై తామెప్పుడూ రాజకీయం చేయలేదని అన్నారు. ఇది ప్రారంభమేనని, కాళేశ్వరం పరిధిలోని మిగతా ప్రాంతాల్లో తమ పార్టీ పర్యటనలు ఉంటాయని వెల్లడించారు.

అన్నారంలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

మేడిగడ్డ నుంచి నుంచి అన్నారం బ్యారేజీకి బయలుదేరి వెళ్లిన బీఆర్‌ఎస్‌ బృందం.. అక్కడ లీకేజీలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం అక్కడే పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణలో కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేసి బీఆర్‌ఎ్‌సను పడగొట్టేందుకు కుట్ర జరుగుతోంది. గతంలో ప్రగతిభవన్‌ను బాంబులతో పేలుస్తామన్న రేవంత్‌.. ఇప్పుడు కేసీఆర్‌నే లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. బీఆర్‌ఎ్‌సను పడగొట్టాలంటే కాళేశ్వరాన్ని పడగొట్టాలన్నట్టుగా సీఎం వ్యవహార శైలి ఉంది’’ అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర లేని రేవంత్‌.. కనీసం పరిపాలనైనా సరిగ్గా చేయాలని సూచించారు. అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రె్‌సకు లేదన్నారు. కాంగ్రెస్‌ గొప్పగా చెప్పుకొనే ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టులో ఓ సర్వేతోపాటు మొబిలైజేషన్‌ పేరిట రూ.1460 కోట్ల బిల్లులు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి, 20లక్షల ఎకరాలకు నీరు అందించామని స్పష్టం చేశారు. చెరువులు, కాల్వలకు గోదావరి నీటిని అనుసంధానం చేశామని, ఎండకాలంలోనూ చెరువులు మత్తళ్లు పోశాయని గుర్తు చేశారు.

తమపై ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదని, రైతు ప్రయోజాలను దెబ్బతీస్తే ఊరుకోమని హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజీని వర్షాకాలంలోపు మరమ్మత్తులు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేస్తోందని, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌.. ప్రాజెక్టులపై పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కానీ, తాము మేడిగడ్డకు రాగానే మీడియా సమావేశం పెట్టి మేడిగడ్డను రిపేరు చేపిస్తామని చెప్పారని, ఇది తమ పాక్షిక విజయమని పేర్కొన్నారు. దెబ్బతిన్న పిల్లర్లను మరమ్మత్తు చేయాల్సింది పోయి రాజకీయ దురుద్దేశాలతో దుష్ప్రచారం చేస్తున్నారని, వచ్చే వర్షాకాలంలో వరదలొచ్చి బ్యారేజీకి ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సాంకేతిక అడ్డంకులు ఏర్పడడం వల్లే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చారు. కాళేశ్వరానికి అనుమతులు లేవంటూ మంత్రి ఉత్తమ్‌ అబద్ధాలు చెబుతున్నారంటూ.. అనుమతులకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, మధుసూదనాచారి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత..

బీఆర్‌ఎస్‌ నేతల మేడిగడ్డ బ్యారేజీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేటీఆర్‌, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు తమనూ బ్యారేజీపైకి అనుమతించాలంటూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళన చేశారు. సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బ్యారేజీ వైపునకు దూసుకురాగా పోలీసులు ప్రధాన గేటును మూసివేశారు. కానీ పోలీసు బందోబస్తు తక్కువగా ఉండటంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు గేటును నెట్టివేసి, లోపలకు దూసుకొచ్చాయి. ఈ క్రమంలో తొక్కిసలాట జరగడంతో పలువురు మహిళ కార్యకర్తలు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.

పేలిన బస్సు టైర్‌..

లింగాలఘణపురం: మేడిగడ్డ పర్యటనకు బయలుదేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బస్సు స్వల్ప ప్రమాదానికి గురైంది. ఏఆర్‌01టీ0752 నంబరు గల బస్సు వెనుకవైపు టైరు పెద్ద శబ్దం పేలిపోవడంతో బస్సులో ఉన్నవారందరూ భయాందోళనకు గురయ్యారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల శివారులో ఈ ఘటన చోటుచేసుకోగా, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Harish Rao: మేడిగడ్డలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం పోయినట్లుగా మాట్లాడుతున్నారు: హరీశ్ రావు

రేవంత్ రెడ్డి బృందం గతంలో మేడిగడ్డ వద్దకు వచ్చి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపణ

కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్న హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రజాప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందన్న మాజీ మంత్రి

మేడిగడ్డను రిపేర్ చేస్తామని ఉత్తమ్ చెప్పడం బీఆర్ఎస్‌కు పాక్షిక విజయమన్న హరీశ్ రావు

cr-20240301tn65e1f6629c014.jpg

మేడిగడ్డలోని కొన్ని పిల్లర్లు మాత్రమే కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం పోయినట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. మేడిగడ్డలో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పిల్లర్లు మాత్రమే డ్యామేజ్ అయ్యాయని తెలిపారు. ఇక్కడకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం గతంలో వచ్చి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. తాము మేడిగడ్డ పర్యటనకు వస్తే దాని నుంచి మళ్లించేందుకు కాంగ్రెస్ వాళ్లు పోటీ పర్యటనలు చేయడం విడ్డూరమన్నారు.

కాంగ్రెస్ ప్రజాప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్‌ను పడగొట్టాలంటే కాళేశ్వరంను పడగొడితే చాలు అన్నట్లుగా అధికార పార్టీ తీరు ఉందని ఆరోపించారు. అసలు కేసీఆర్‌నే లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రగతి భవన్‌ను బాంబులతో పేలుస్తామన్న రేవంత్ ఇప్పుడు కేసీఆర్‌ను ఆనవాళ్లు లేకుండా చేస్తామని అనడం దారుణమన్నారు. తాము మేడిగడ్డ పర్యటన అనగానే కాంగ్రెస్ వాళ్లు కాగ్ రిపోర్ట్ అంటూ... పాలమూరు విజిట్ అంటూ వెళుతున్నారని మండిపడ్డారు.

తాము మేడిగడ్డ పర్యటనకు రాగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మేడిగడ్డను రిపేర్ చేస్తామని చెప్పారని వెల్లడించారు. అంటే బీఆర్ఎస్ పాక్షికంగా విజయం సాధించినట్లే అన్నారు. బీఆర్ఎస్‌పై ఇన్నాళ్లు కాంగ్రెస్ కుట్రలు చేసిందని ఆరోపించారు. ఎంతసేపూ మా మీద ఆరోపణలే తప్ప రైతుల కోసం పని చేయాలని చూడటం లేదన్నారు. అసత్య ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న లోపాలు సహజమేనని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కూలిపోయిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...