Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

KTR | కాంగ్రెస్ పాల‌న‌లో రైతుల‌కు నీళ్లు & క‌రెంట్ క‌రువు: కేటీఆర్ (water & electricity shortage)


TELUGU

Recommended Posts

KTR | కాంగ్రెస్ పాల‌న‌లో రైతుల‌కు క‌రెంట్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి: కేటీఆర్

KTR | కాంగ్రెస్ పాల‌న‌లో రైతుల‌కు క‌రెంట్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. రాత్రి 11:15 గంట‌ల నుంచి వ్య‌వ‌సాయానికి త్రీ ఫేజ్ క‌రెంట్ వ‌స్తుంద‌ని ఎన్‌పీడీసీఎల్ రైతుల‌కు మేసేజ్‌లు పంపుతుంద‌ని ఆయ‌న తెలిపారు. దీంతో రైతులు అర్ధ‌రాత్రి పూట బావుల వ‌ద్ద పండుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు.

ktr-karimnagar4_V_jpg--816x480-4g.webp?s

KTR | క‌రీంన‌గ‌ర్ : కాంగ్రెస్ పాల‌న‌లో రైతుల‌కు క‌రెంట్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. రాత్రి 11:15 గంట‌ల నుంచి వ్య‌వ‌సాయానికి త్రీ ఫేజ్ క‌రెంట్ వ‌స్తుంద‌ని ఎన్‌పీడీసీఎల్ రైతుల‌కు మేసేజ్‌లు పంపుతుంద‌ని ఆయ‌న తెలిపారు. దీంతో రైతులు అర్ధ‌రాత్రి పూట బావుల వ‌ద్ద పండుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా ఇరుకుళ్ళ గ్రామంలో సాగు నీరందక ఎండిన వరి పంట పొలాలను వినోద్ కుమార్ నేతృత్వంలో కేటీఆర్, గంగుల క‌మ‌లాక‌ర్, పాడి కౌశిక్ రెడ్డి పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ రైతుల‌తో మాట్లాడారు.

అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ప‌రిస్థితిని చూడ‌లేద‌ని రైతులు తెలిపారు. మొద‌టిసారి ఇవాళ పంటలు ఎండిపోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నేల నెర్రెలు బారుతోంద‌ని, మార్చి మొద‌టి వారంలోనే ఇట్ల ప‌రిస్థితి ఉందంటే.. ఏప్రి, మే నెల‌లో ప‌రిస్థితి ఏందోన‌ని రైతులు భ‌య‌ప‌డుతున్నారు. ఎస్సార్ఎస్పీలో నీళ్లు ఉన్న‌ప్ప‌టికీ క‌క్ష‌తో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు నీళ్లు ఇస్తాలేరని రైతులు వాపోయార‌ని కేటీఆర్ తెలిపారు. రేవంత్ ప్ర‌భుత్వం చిల్ల‌ర రాజ‌కీయం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. ఏ నియోజ‌క‌వ‌ర్గంలోనైనా రైతులు రైతులే అని స్ప‌ష్టం చేశారు. ఎస్సార్ఎస్పీ నుంచి సాగునీరు విడుద‌ల చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున‌ డిమాండ్ చేస్తున్నామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాల‌న‌లో క‌రెంట్ కోసం కాప‌లా కాసే ప‌రిస్థితి

రాత్రి 11:15 గంట‌ల నుంచి త్రీ ఫేజ్ క‌రెంట్ వ‌స్తుంద‌ని ఎన్‌పీడీసీఎల్ వారు రైతుల‌కు మేసేజ్‌లు పంపిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. ఆ మేసేజ్‌ల‌ను కూడా మీడియాకు చూపించారు. 12 ఏండ్ల త‌ర్వాత మ‌ళ్లీ మొద‌టిసారి క‌రెంట్ కోసం అర్ధ‌రాత్రి పూట బావుల వ‌ద్ద పండుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని రైతులు చెబుతున్నారు. తెలంగాణ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మొన్న‌టి వ‌ర‌కు ఆ ప‌రిస్థితి లేకుండే. ఇవాళ కాంగ్రెస్ పాల‌న‌లో క‌రెంట్ కోసం కాప‌లా కాసే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని రైతులు చెప్పార‌ని తెలిపారు. ఇది కాలం తెచ్చిన క‌రువు కాదు.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెచ్చిన క‌రువు.. ఎందుకంటే కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక కామ‌ధేనువు, క‌ల్ప‌త‌రువు లాంటి ప్రాజెక్టు. మేడిగ‌డ్డ‌లో రిపేర్లు చేయ‌కుండా రైతుల కొంప పుచ్చుకుంటుంది ఈ ప్ర‌భుత్వం. రైతుల మీద ప్రేమ ఉంటే కాఫ‌ర్ డ్యామ్ క‌ట్టి.. నీళ్లు మ‌ళ్లించి, లిఫ్ట్ చేసి పంట‌ల‌ను కాపాడాల‌ని కోరుతున్నామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

24 గంట‌ల క‌రెంట్ ఇస్తున్నామ‌ని ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు

బ‌య‌ట ముఖ్య‌మంత్రేమో 24 గంట‌ల క‌రెంట్ ఇస్తున్నామ‌ని న‌రుకుతున్నాడు. రైతాంగానికి అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం అని ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇస్తున్నాడు. ఇక్క‌డ క్షేత్రంలో చూస్తే ప‌రిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇవాళ నా ప‌ది ఎక‌రాల పంట పోయింది ఎవ‌రు బాధ్యులు అని ఓ రైతు ప్ర‌శ్నించాడు. సాగునీరు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఎండిపోయిన పంట‌ల‌కు న‌ష్ట ప‌రిహారం ఇవ్వాలి. క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌పై నిర్ణ‌యం తీసుకొని జీవో ఇవ్వండి.

...

Complete article

Link to comment
Share on other sites

KTR | ఇది కాలం తెచ్చిన క‌రువు కానేకాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన క‌రువే.. : కేటీఆర్

KTR | నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాలం మంచిగా కాలేదు.. క‌రువు వ‌స్తున్న‌ది.. అంద‌రం క‌లిసి ఎదుర్కొందాం అంటున్నాడు. ఇది కాలం తెచ్చిన క‌రువు కానేకాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన క‌రువు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు.

ktr-karimnagar3_V_jpg--816x480-4g.webp?s

KTR | క‌రీంన‌గ‌ర్ : నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాలం మంచిగా కాలేదు.. క‌రువు వ‌స్తున్న‌ది.. అంద‌రం క‌లిసి ఎదుర్కొందాం అంటున్నాడు. ఇది కాలం తెచ్చిన క‌రువు కానేకాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన క‌రువు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. క‌రీంన‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ క‌ద‌న భేరీ సన్నాహ‌క స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

తెలంగాణ‌లోని భౌగోళిక‌, వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, రైతుల దుస్థితి ప‌ట్ల కేసీఆర్‌కు పూర్తిస్థాయి అవ‌గాహ‌న ఉంది. కాబ‌ట్టే రైతుల‌కు నీళ్లు ఇవ్వాల‌నే సంక‌ల్పంతో ప‌ని చేశారు. గ‌తంలో ఎన్నో ఏండ్లు వ‌రుస క‌రువు చూశాం. కేసీఆర్ ముందు చూపుతోనే ఆ క‌రువు మీద సంధించిన బ్ర‌హ్మాస్త్ర‌మే కాళేశ్వ‌రం ప్రాజెక్టు. ఇవాళ కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగ‌మైన‌ మేడిగ‌డ్డ‌లో రిపేర్లు చేసి ఉంటే చొప్ప‌దండి, హుజురాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, మాన‌కొండూరులో ఎండుతున్న పంట‌ల‌కు ఆ నీళ్లు ఇచ్చే అవ‌కాశం ఉంటుండే. ఈ స‌న్నాసి రేవంత్ రెడ్డికి మేడిగ‌డ్డ‌, కాళేశ్వ‌రం, మ‌ల్ల‌న్నాసాగ‌ర్ అంటే ఎంటో తెల్వ‌దు. చెరువులు నింపుడు తెల్వ‌దు. రైతుల పంట‌లు కాపాడుడు అంత‌కంటే తెల్వ‌దు. అందుకే ఇది కాలం తెచ్చిన క‌రువు కానేకాదు.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఉన్న త‌ర్వాత కూడా కాంగ్రెస్ తెచ్చిన క‌రువు అని ఊరురా చెప్పాలి. ఇదే టైంలో కేసీఆర్ ఉండి ఉంటే ఎట్లైనా నీళ్లు తెచ్చి పంట‌లు కాపాడుతుండే. కేసీఆర్‌ను బ‌ద్నాం చేయాల‌నే ఉద్దేశంతోనే ఎల్ఎండీని ఖాళీ చేస్తున్నారు. భ‌విష్య‌త్‌లో క‌రీంన‌గ‌ర్‌లో కూడా గొంతు ఎండుత‌ది.. డైలీ వాట‌ర్ స‌ప్ల‌యి బంద్ అయిత‌ది. కేసీఆర్‌ను బ‌ద్నాం చేయ‌డానికి ఇంత చిల్లర రాజ‌కీయం స‌రికాదు అని కేటీఆర్ మండిప‌డ్డారు.

90 రోజుల్లోనే రేవంత్ ప్ర‌జాభిమానాన్ని కోల్పోయారు..

గ‌తంలో టీడీపీని ముంచిండు.. ఇప్పుడు కాంగ్రెస్‌ను కూడా ముంచేట‌ట్టు ఉన్నార‌ని ముస్లిం సోద‌రులు భావిస్తున్నారు. మోదీని రేవంత్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఆత్మ‌గౌర‌వం క‌లిగిన ఏ తెలంగాణ బిడ్డ మాట్లాడ‌ని, ఒప్పుకొని మాట‌లు రేవంత్ మాట్లాడారు. రైతుబంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నారు. మిష‌న్ భ‌గీర‌థ‌ను చూసి హ‌ర్ ఘ‌ర్ జ‌ల్, మిష‌న్ కాక‌తీయను చూసి అమృత్ స‌రోవ‌ర్ అని పెట్టుకున్నారు. అలా అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి ఆద‌ర్శంగా మారింది. అలాంటి తెలంగాణ మోడ‌ల్‌ను కించ‌ప‌రుస్తూ.. గుజ‌రాత్ మోడ‌ల్‌ను చేస్తాం ఈ రాష్ట్రాన్ని అని రేవంత్ మాట్లాడుతున్నారు. గుజ‌రాత్ మోడ‌ల్ అంటే తెల్లారితే హిందువులు, ముస్లింలు త‌న్నుకోవ‌డ‌మా..? రైళ్లల్లో పోయేటోళ్ల‌ను కాల్చి చంపుడా..? గుజ‌రాత్ మోడ‌ల్ అంటే.. అందులో నీకేం న‌చ్చింది. గుజ‌రాత్ మోడ‌ల్‌ను బేక‌ర్ మోడ‌ల్, అట్ట‌ర్ ప్లాఫ్ మోడ‌ల్ అని రాహుల్ అంటాడు. అదానీని పొట్టుపొట్టు తిడుతాడు రాహుల్. నువ్వేమో అదానీతో ఆల‌య‌బ‌ల‌య్ చేసుకుంటావ్. దిక్కుమాలిన ప‌నులు చేసిన రేవంత్ ప్ర‌భుత్వం.. 90 రోజుల్లోనే ప్ర‌జాభిమానాన్ని కోల్పోయి ప్ర‌జ‌ల్లో ప‌ల‌చ‌న అయింది అని కేటీఆర్ పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 3 weeks later...

KTR | మేడిగడ్డ రిపేర్‌కు తీరికలేదా?

KTR | కాళేశ్వరంపై కడుపు మంట, కేసీఆర్‌పై కండ్ల మంటతో 3 నెలలుగా మేడిగడ్డను రిపేర్‌ చేయించకపోవటం వల్లే లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఇదే సీజన్‌లో కాళేశ్వరం ద్వారా మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసి, మిడ్‌మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, తంగళ్లపల్లి మండలంలోని అన్ని చెరువులను నింపి సాగునీరిచ్చినట్టు గుర్తుచేశారు.

ktr-21_V_jpg--816x480-4g.webp?sw=1728&ds

సర్కారు ముందుకురాక లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు

సీఎం రేవంత్‌ ఢిల్లీకి చక్కర్లు కొడుతుండు

రైతులను మాత్రం పట్టించుకుంటలేడు

ఇది ముమ్మాటికీ కాంగ్రెస్‌ తెచ్చిన కరువే

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో

ఎండిన పంటల పరిశీలన

KTR | రాజన్న సిరిసిల్ల, మార్చి 28 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరంపై కడుపు మంట, కేసీఆర్‌పై కండ్ల మంటతో 3 నెలలుగా మేడిగడ్డను రిపేర్‌ చేయించకపోవటం వల్లే లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఇదే సీజన్‌లో కాళేశ్వరం ద్వారా మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసి, మిడ్‌మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, తంగళ్లపల్లి మండలంలోని అన్ని చెరువులను నింపి సాగునీరిచ్చినట్టు గుర్తుచేశారు. మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగితే రిపేర్‌ చేయించేందుకు సీఎంకు టైం సరిపోవటం లేదా? అని ప్రశ్నించారు. 3 పిల్లర్ల వద్ద కాఫర్‌ డ్యాం కట్టి, వృథాగా సముద్రంలోకి పోతున్న నీటిని పంపింగ్‌ చేసి ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదని తెలిపారు. అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదని, పక్కా కాంగ్రెస్‌ తెచ్చిన కరువేనని విమర్శించారు. పంటలు ఎండిపోయి రైతులు అరిగోస పడుతుంటే పరామర్శించే తీరికలేదు గానీ, గత 4 నెలలుగా 15 సార్లు విమానం ఎక్కే, విమానం దిగే అన్నట్టు ఢిల్లీకి జాతర పోవుడు, యాత్రలు చేసుడు తప్ప ఇంతవరకు సీఎంగానీ, మంత్రులుగానీ రైతుల పొలాల దిక్కుచూసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు.

వేసిన పంటలు మేతకు తప్ప ఎందుకూ పనికిరాకుండా పోయాయని అన్నారు. రైతుల గోస చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో రైతుబంధు కోసం పెట్టిన రూ.7 వేల కోట్లను రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాకు, వారి పేమెంట్లకు పెట్టిన చిల్లర ప్రభుత్వమని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీమేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, ఎన్నికల కోడ్‌ అడ్డురాకుండా ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక లేఖ రాసి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో కౌలు రైతు జింకా పరశరాములుకు చెందిన ఎండిన వరిపంటను కేటీఆర్‌ పరిశీలించారు. పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయానంటూ కంటతడిపెట్టిన రైతును ఓదార్చి, అధైర్యపడవద్దని, అండగా కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరం ఉన్నామని భరోసా ఇచ్చారు. అనంతరం సిరిసిల్ల, వేములవాడలో జరిగిన పలు శుభకార్యాలకు హాజరయ్యారు. చీర్లవంచలో ‘నమస్తేతెలంగాణ’ బ్యూరో ఇన్‌చార్జి కడపర్తి ప్రకాశ్‌రావు కుటుంబసభ్యులను పరామర్శించారు. బీవైనగర్‌లోని షాదీఖానాలో ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యారు. సిరిసిల్లలోని 33వ వార్డుకు చెందిన బీఆర్‌ఎస్‌ నేత మూడం సాయికుమార్‌ను పరామర్శించారు. ఇటీవల పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుని సాయికుమార్‌ గాయాలపాలయ్యారు. మెరుగైన వైద్యం అందిస్తామని ఆయనకు భరోసా ఇచ్చారు.

అధైర్యపడొద్దు అండగా ఉంటాం

‘రైతులు అధైర్యపడొద్దు. అండగా మేమున్నాం. దయచేసి చేతులు జోడించి మొక్కుతున్నా ఆత్మహత్యల్లాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడి కుటుంబాలను ఇబ్బందులపాలు చేయొద్దు’ అని రైతులకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ‘కొంత మోసపోయి కాంగ్రెస్‌కు ఓట్లేసి గెలిపించుకున్నారు. మిమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోనప్పటికీ, మంత్రులు, సీఎంకు తీరిక లేకపోయినా? మీ తరఫున మేముంటాం’ అని తెలిపారు. ప్రతి గ్రామానికి వస్తామని, మీ కోసం కేసీఆర్‌ స్వయంగా వస్తున్నారని ధైర్యం చెప్పారు. ప్రభుత్వ మెడలు వంచైనాసరే నష్టపరిహారం సాధించుకుందామని, మేడిగడ్డ రిపేర్‌ చేయించి కాళేశ్వరం నీళ్లు తెచ్చుకుందామని, ధాన్యానికి బోనస్‌, రుణమాఫీ సాధించుకుందామని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పెట్టిన ఆరు డిమాండ్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. రైతుల్లో భరోసా నింపేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ వెంట నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిషత్తు మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, టీఎస్‌టీపీడీసీ మాజీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, ఎంపీపీ పడిగెల మానస, ఏఎంసీ మాజీ చైర్‌పర్సన్‌ పూసపల్లి సరస్వతి, బీఆర్‌ఎస్‌ నాయకులు గజభీంకార్‌ రాజన్న ఉన్నారు.

ప్రభుత్వానికి 6 డిమాండ్లు

రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందున ప్రభుత్వం వెంటనే స్పందించాలి.

కాంగ్రెస్‌ ఇచ్చిన మాట ప్రకారం రైతుభరోసా రూ.15 వేలు ఇవ్వాలి.

కౌలురైతులకు, రైతుకూలీలకు ఇస్తానన్న పైసలు వెంటనే ఇవ్వాలి.

ప్రభుత్వ నిర్లక్ష్యం, చెరువులు నింపకపోవటం, నీళ్లు ఇవ్వనందుకే పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు ఇస్తూ ఆర్డర్‌ తెచ్చింది. రైతులపై చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి.

కోతకు వచ్చిన పంటలను కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇవ్వాలి.

రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ముందుకు రావాలి.

...

Complete article

Link to comment
Share on other sites

  • The title was changed to KTR | కాంగ్రెస్ పాల‌న‌లో రైతుల‌కు water & electricity క‌రువు: కేటీఆర్
  • The title was changed to KTR | కాంగ్రెస్ పాల‌న‌లో రైతుల‌కు నీళ్లు & క‌రెంట్ క‌రువు: కేటీఆర్ (water & electricity)

రైతన్నను కాటేస్తున్న కాంగ్రెస్‌ సర్కార్‌

‘కాంగ్రెస్‌ దొంగ హామీలతో రైతులను ముంచి గద్దెనెకింది. సాగునీటి నిర్వహణలో ఘోరంగా విఫలమై రైతన్న పొట్టకొడుతున్నది’ అని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. సాగునీరందక ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

01-748_V_jpg--816x480-4g.webp?sw=1728&ds

ఎమ్మెల్సీ మధుసూదనాచారి

చిట్యాల (మొగుళ్లపల్లి), మార్చి 28 : ‘కాంగ్రెస్‌ దొంగ హామీలతో రైతులను ముంచి గద్దెనెకింది. సాగునీటి నిర్వహణలో ఘోరంగా విఫలమై రైతన్న పొట్టకొడుతున్నది’ అని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. సాగునీరందక ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. గురువారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం కాసులపాడు గ్రామ శివారులో సాగునీరందక ఎండిపోయిన వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సిరికొండ మాట్లాడుతూ.. కేసీఆర్‌ పాలనలో ఎకరం ఎండిపోకుండా నీరందించినట్టు కొనియాడారు. కానీ, కాంగ్రెస్‌ మూడు నెలల పాలనలో రైతులకు ముప్పుతిప్పలు తెచ్చిపెట్టిందని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగానికి యాసంగి పంటలకు నీరందించే సోయి లేదని విమర్శించారు. నష్టపోయిన రైతులు మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు.

...

Complete article

Link to comment
Share on other sites

CBN ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం!!

Congress ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం!!

History doesn't LIE

Link to comment
Share on other sites

  • The title was changed to KTR | కాంగ్రెస్ పాల‌న‌లో రైతుల‌కు నీళ్లు & క‌రెంట్ క‌రువు: కేటీఆర్ (water & electricity shortage)

KCR Pressmeet | రైతులకు ప్రతి ఎకరాకు రూ.25వేలు పరిహారం ఇవ్వాలి.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ డిమాండ్‌ 

KCR Pressmeet | ఎండిపోయిన పంటలకు ప్రతి ఎకరానికి రూ.25వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ నష్టపరిహారం ఇచ్చేదాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తామని చెప్పారు.

kcr11_V_jpg--816x480-4g.webp?sw=1728&dsz

KCR Pressmeet | ఎండిపోయిన పంటలకు ప్రతి ఎకరానికి రూ.25వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ నష్టపరిహారం ఇచ్చేదాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తామని చెప్పారు. అవసరమైతే ఎక్కడికక్కడ గ్రామాల్లో మీ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తామని స్పష్టం చేశారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో నీళ్లందక ఎండిపోయిన పంటలను కేసీఆర్‌ పరిశీలించారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

ఒకప్పుడు పంటలు నష్టపోతే కేంద్రానికి నివేదిక పంపించాల్సి ఉండేది.. మూడు నెలల తర్వాత అధికారులు వచ్చి పరిశీలించి.. రిపోర్టు రాయాలి.. అయినా రైతులకు పరిహారం అందే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. అందుకే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని మార్చేశా అని తెలిపారు. భయంకరమైన రాళ్ల వాన పడి మహబూబాబాద్‌, ఖమ్మం, ఇలా చాలా జిల్లాల్లో పంట నష్టం జరిగితే స్వయంగా వెళ్లి పరిశీలించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడప్పుడే రైతులు బలపడుతున్నరు కాబట్టి వాళ్ల పరిస్థితి దిగజారవద్దని.. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఎకరానికి 10వేలు నష్టపరిహారం ఇచ్చా అని తెలిపారు. నష్టపోయిన ఆ పొలంలోనే నిల్చుండి ప్రకటించడమే కాకుండా.. ఐదారు రోజుల్లోనే నష్టపరిహారం అందించానని అన్నారు. ఆనాడు దాదాపు 500 కోట్లను రైతులకు అందించామని చెప్పారు. అదే ఇవాళ రాళ్ల వాన పడితే అడిగే దిక్కులేదని మండిపడ్డారు. అకాల వర్షాలు పడి సుమారు లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతే దాని గురించి మాట్లాడే దిక్కే లేదని అన్నారు. ఓ ఎమ్మెల్యే పోడు.. మంత్రి పోడు.. ముఖ్యమంత్రికి అయితే ఢిల్లీ యాత్రలతోనే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఏదేమైనా సరే.. రణరంగమైనా సరే.. ఈ ప్రభుత్వం మెడలు వంచి పరిహారం ఇప్పిస్తామని చెప్పారు.

2014లో కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగిపోయిన నాడు కూడా 470 కోట్ల బకాయిలు పెట్టిపోతే.. మేం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చామని కేసీఆర్‌ తెలిపారు. అదే ఈనాడు తాము ఏ బకాయిలు పెట్టలేదని అన్నారు. 50 ఏండ్ల కాంగ్రెస్‌, టీడీపీ పరిపాలనలో ఏనాడు ఇవ్వని 10వేలు నష్టపరిహారం అందిస్తే.. ఆనాడు దాన్ని ఎకసెకం చేసి మాట్లాడారని మండిపడ్డారు. 10 వేలు ఏమూల సరిపోద్ది.. 20 వేలు ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్‌ నాయకులు అన్న మాటలను గుర్తు చేశారు. మరి ఇవాళ ఏడ పడుకున్నరు.. తలకాయ ఏడ పెట్టుకున్నారని నిలదీశారు. గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నరా? వీళ్లు రైతులు కాదా? ప్రజలు కాదా? వీళ్ల గురించి పట్టింపు లేదా? అని మండిపడ్డారు. ప్రజల తరఫున మాట్లాడేటోళ్లు లేరని అనుకుంటున్నారా? ఒక మహాసముద్రం అంత బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంది.. ఊరుకోదని హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వందకు వంద శాతం రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

పంటలను మీరే ఎండబెట్టిర్రు కాబట్టి.. మీ అసమర్థత వల్లే ఎండిపోయినయి కాబట్టి నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నానని కేసీఆర్‌ తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చి ఎన్యుమరేట్‌ చేయాలని సూచించారు. ఏ జిల్లాల్లో ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ రైతు పంట ఎంత ఎండిపోయిందనే లెక్కలు తీయాలని అన్నారు. ధరలు అన్నీ పెరిగినయ్‌ కాబట్టి.. ఎకరాకు రూ.25వేలు నష్టపరిమారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పరిహారం ఇచ్చే దాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తామని తెలిపారు. ఎక్కడికక్కడ మీ మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తామని అన్నారు.. ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు మాకు ఉంటది కాబట్టి.. ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతు మేమే అని తెలిపారు. ‘ మీరు ఒకర్నో.. ఇద్దర్నో కుక్కల్నో.. నక్కల్నో గుంజుకుని ఓహో అహా అని సంకలు గుద్దుకోవచ్చు. అది చిల్లర రాజకీయ స్టంట్‌. ప్రజల సమస్యల ముందు, ప్రజల బాధ ముందు.. ఎండిపోయిన పంటల ముందు చిల్లర రాజకీయాలు చేయడం కాదు ‘ అని అన్నారు. ఎండిన ప్రతి ఎకరాన్ని మీరు ఎన్యుమరేట్‌ చేయించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ దళాలు తిరుగుతున్నాయని.. కచ్చితంగా లెక్కలు తీస్తామ

...

Complete article

Link to comment
Share on other sites

KCR | మళ్లీ బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నయ్‌..? నీటిమోతలెందుకు ? రేవంత్‌ సర్కారు నిలదీసిన కేసీఆర్‌

KCR | మళ్లీ బిందెలు ఎందుకు ప్రత్యక్షమవుతున్నయ్‌ ? ఎందుకు నీటిమోతలు స్టార్ట్‌ అయ్యాయంటూ రేవంత్‌రెడ్డి సర్కారు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిలదీశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.

KCR-03-1_V_jpg--816x480-4g.webp?sw=1728&

KCR | మళ్లీ బిందెలు ఎందుకు ప్రత్యక్షమవుతున్నయ్‌ ? ఎందుకు నీటిమోతలు స్టార్ట్‌ అయ్యాయంటూ రేవంత్‌రెడ్డి సర్కారు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిలదీశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీఆర్‌ఎస్‌ పాలనలో అద్భుతంగా మారి, ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబర్‌ వన్‌ స్థాయికి చేరుకొని.. ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి ? దీనికి కారణం ఏంటీ. ప్రపంచ దేశాలు, యూఎన్‌ఓ, 15-16 రాష్ట్రాలు కొనియాడి అమలు చేసుకుంటున్న పథకం మిషన్‌ భగీరథ. రాష్ట్రంలో ఎందుకు మంచినీళ్ల కొరత రావాలి ? చీఫ్‌ సెక్రెటరీ స్టేట్‌మెంట్‌లో సోర్సెస్‌ అన్నీ బారాబరి ఉన్నయ్‌.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అద్భుతంగా ఉండవచ్చని చెబుతున్నరు’ అని కేసీఆర్‌ అన్నారు.

దానికి జర్నలిస్టులే సాక్షి..

‘హైదరాబాద్‌ సిటీలో ఒక రూపాయికే నల్లా కన్షెన్‌ ఇచ్చి.. 20వేల లీటర్ల ఫ్రీ నీరు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంట్లో నల్లాపెట్టి నీరిచ్చాం. దీనికి జర్నలిస్టులే సాక్షి. దానిలో ఎందుకు లోపం వస్తుంది. ఏంది కారణం ? మేం అసెంబ్లీలో ఛాలెంజ్‌ చేశాం. నేను స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ టర్మ్‌లోగా భగీరథ కంప్లీట్‌ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని.. ఓట్లు అడగదని ఛాలెంజ్‌గా చెప్పి పథకాన్ని పూర్తి చేశాం. ఆ తర్వాత ఐదేళ్లు బ్రహ్మాండంగా నడిపాం. బిందెపట్టుకొని ఆడబిడ్డ ఎక్కడా రోడ్డుపై కనిపించలేదు. అన్నీ మామయ్యాయి. మంచినీళ్లు ట్యాంకర్లు ఐదుసంవత్సరాల్లో కనిపించలేదు. ఎందుకు మళ్లీ బిందెలు ప్రత్యక్షమవుతున్నయ్‌ ? ఎందుకు నీటిమోతలు స్టార్ట్‌ అయ్యాయి. నీళ్ల ట్యాంకర్లు ఎందుకు విచ్చలవిడి వ్యాపారం చేస్తున్నయ్‌. హైదరాబాద్‌ సిటీలో ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపురిస్తుంది ? ఇవీ ఆలోచించాల్సిన విషయాలు’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పడు కరెంటు ఉంటే వార్త అనేకాడికి వచ్చింది..

‘ఒకటింబావు సంవత్సరంలో చాలాదారుణంగా ఉన్న విద్యుత్‌ రంగాన్ని సుమారు రూ.35వేలకోట్లు ఖర్చు చేసి.. రకరకాల పద్ధతులు అవలంభించి.. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీని సంప్రదించి.. మెదడును కరుగదీసి.. విద్యుత్‌ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. భారతదేశంలో అన్నిరంగాలకు 24గంటలు ఒక సెకండ్‌ కరెంటుపోకుండా ఏర్పాటు చేసిన ఘనత మా ప్రభుత్వానిది. మీరు అందరూ అనుభవించారు. నాడు కరెంటు పోతే వార్త.. ఈ రోజు కరెంటు ఉంటే వార్త అనేకాడికి వచ్చింది. విద్యుత్‌ అనేది చిన్న విషయం కాదు. నోటిమాటలు.. పిట్టకథలు కాదు కదా. అద్భుతమైన వ్యవస్థ. దాన్ని తీర్చిదిద్ది.. ఏడున్నర, ఎనిమిదేళ్లు అద్భుతంగా ప్రజలకు సరఫరా చేశాం. ప్రజలకు, పరిశ్రమలు, వ్యవసాయానికి, ఐటీకి, ఇతర రంగాలకు 24/7 కరెంటు సరఫరా చేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ’ అని గుర్తు చేశారు.

రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది?

‘ఒక అగ్రగామి రాష్ట్రం. ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది ఇయ్యాల. వంద రోజుల్లో ఇంత అస్తవ్యస్తం ఏందీ? దీంట్లో ఉన్న తమషా ఏందీ ? కొత్తగా నడిపించేది ఏమీ లేదు.. కొత్తగా మొద్దులు మోసేది లేదు.. కట్టెలు కొట్టేది లేదు. కొత్త గడ్డపారలు పట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్లు నడిపించలేని అసమర్థత ఏందీ? అశక్తత ఏందీ? కట్టిన ఇల్లు. పెట్టిన పొయ్యే కదా? దాన్నే నడిపించే తెలివిలేకపోతే ఎలా? మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే.. ఇప్పుడున్న, రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ ప్రభుత్వ అసమర్థత, అవివేకం, తెలివితక్కువ తనం, అవగాహనా రాహిత్యం, దేన్నీ ఎట్లా వాడాలో తెలియని అర్భకత్వం మనకు కనిపిస్తుంది. ఉన్న కరెంటును, మిషన్‌ భగీరథను వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చే హైదరాబాద్‌ నీళ్లు లేవు. మళ్లీ వాటర్‌ బిల్స్‌.. ట్యాంకర్ల వ్యాపారం జరుగుతుంది. కొనలేక జనం చస్తున్నరు. మళ్లీ జనరేట్లర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నయ్‌. మళ్లీ స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది’ అంటూ కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

KCR | ఇది వచ్చిన కరువు కాదు.. అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేసీఆర్‌

KCR | రాష్ట్రంలో కరువు పరిస్థితులకు అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన ఆయన.. ఇది వచ్చిన కరువు కాదని, అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరువని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి కారణం మీరు. కరెంటు లో వోల్టేజ్‌ సరఫరాకు కారణం మీరు. మీకంటే ముందు ఎనిమిదేండ్లు మేం బ్రహ్మాండంగా కరెంటు ఇచ్చినం. ఎనిమిదేండ్లు ఇచ్చిన కరెంటు ఇప్పుడెట్ల మాయమైంది’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

KCR-03-1_V_jpg--816x480-4g.webp?sw=1728&

KCR | రాష్ట్రంలో కరువు పరిస్థితులకు అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన ఆయన.. ఇది వచ్చిన కరువు కాదని, అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరువని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి కారణం మీరు. కరెంటు లో వోల్టేజ్‌ సరఫరాకు కారణం మీరు. మీకంటే ముందు ఎనిమిదేండ్లు మేం బ్రహ్మాండంగా కరెంటు ఇచ్చినం. ఎనిమిదేండ్లు ఇచ్చిన కరెంటు ఇప్పుడెట్ల మాయమైంది’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

‘మేం పదేండ్లు రైతులను మేం బ్రహ్మండంగా చూసుకున్నం. ఇప్పుడు వాళ్ల కండ్ల పొంటి నీళ్లు వస్తుంటే ఎట్ల చూడాలె. వాళ్లు బాధలు పడుతుంటే చూసి ఎట్ల ఊకోవాలె. ఇప్పుడే ఇట్లుంటే ముందుముందు ఎట్లుంటదని రైతులు భయాందోళన చెందుతున్నరు. అందుకే వాళ్లపక్షాన మేం నిలబడ్డం. డిసెంబర్‌ 9న రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తమన్నరు. డిసెంబర్‌ 9 పొయ్యి ఎన్నాళ్లయ్యింది..? ముఖ్యమంత్రి ఎక్కడున్నరు..? మీరు దొంగ హామీలు ఇచ్చి తప్పించుకోలేరు. మేం వెంటపడి తరుముతం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక ఇడిసిపెట్టేది లేదు. బ్యాంకులోళ్లు రైతుల ముక్కుపిండి రుణాలు వసూలు చేస్తున్నరు. మీకు బాధ లేదా..? కనీసం రైతుల దుస్థితి గురించి ఆలోచనైనా చేస్తున్నరా..? రైతుల పక్షాన ఎవడు మాట్లాడెటోడు లేడు, అడిగేటోడు లేడని మీరు అనుకుంటున్నరా..?’ అని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు.

‘నేను రైతులకు చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ రణరంగమైనా సృష్టిస్తది. ప్రధాన ప్రతిపక్షంగా మీరు మాకు బాధ్యత ఇచ్చారు. కానీ ఎమ్మటే మాట్లాడితే ఓర్వలేని తనం అంటరని ఓపిక పట్టిన. ఇప్పుడు నాలుగో నెల వచ్చింది. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నయ్‌ కాబట్టి చూస్తూ ఊరుకోలేక వచ్చిన’ అన్నారు. అదేవిధంగా వాగ్ధానలు ఎగవెడితే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘మీరు వాగ్ధానాలను ఎగవెట్టి ఊరేగుదాం అనుకుంటున్నరా..? వాగ్ధానాలు ఎగవెడితే బిడ్డా నిద్ర గూడ పోనియ్యం చెప్తున్నా’ అని కేసీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

KCR | కరెంటు కోతలకు తెలివితక్కువ కాంగ్రెస్‌ అసమర్థతే కారణం : కేసీఆర్‌

KCR | రాష్ట్రంలో కరెంటు స్విచ్ఛాప్‌ చేసినట్లుగా ఎందుకు మాయమైంది బీఆర్‌ఎస్‌ అధినేత్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. ఈ పరిస్థితికి అసమర్థ, అవివేక, తెలివితక్కువ కాంగ్రెస్‌ పార్టీ అసమర్థత తప్ప మరేం కారణం కాదు’ అన్నారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన ఆదివారం ఎండిపోయిన పంటలను పరిశీలించారు.

KCR-04_V_jpg--816x480-4g.webp?sw=1728&ds

KCR | రాష్ట్రంలో కరెంటు స్విచ్ఛాప్‌ చేసినట్లుగా ఎందుకు మాయమైంది బీఆర్‌ఎస్‌ అధినేత్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. ఈ పరిస్థితికి అసమర్థ, అవివేక, తెలివితక్కువ కాంగ్రెస్‌ పార్టీ అసమర్థత తప్ప మరేం కారణం కాదు’ అన్నారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన ఆదివారం ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీ అందరికి సమాచారం కోసం చెబుతున్నా. హైదరాబాద్‌కు పెట్టుబడులు, ఐటీరంగంలో పెట్టుబడులు వచ్చిన తర్వాత.. హైదరాబాద్‌ను పవర్‌ ఐలాండ్‌ సిటీగా మార్చాం. ఎలాంటి పరిస్థితిని తీసుకువచ్చామంటే.. ఐటీ కంపెనీలు, ఇంటర్నేషన్‌ దిగ్గజాలు సైతం న్యూయార్క్‌, లండన్‌లో పవర్‌ పోతుంది కానీ.. హైదరాబాద్‌లో పోదు అనే స్థితికి తీసుకువచ్చాం. స్టోరీలాగా చెప్పడం లేదు’ అన్నారు.

ఎక్కడ పవర్‌ ఉన్నా కొనుగోలు చేశాం..

‘బీఆర్‌ఎస్‌ వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో నేషనల్‌ గ్రిడ్‌కు మన రాష్ట్రం అనుసంధానం లేకుండే. వార్ధా-డిచ్‌పల్లి, వరంగల్‌-వరోరా, అంగుల్‌-పలాస, పీజీసీఐఎల్‌ వెంటపడి రాత్రింబళ్లు కష్టపడి మూడులైన్లు కలిపించాం. దాంతో తెలంగాణ, ఏపీ నేషనల్‌ పవర్‌గ్రిడ్‌కు అనుసంధానమయ్యాం. మనకు ఏదైనా సందర్భంలో షార్టేజ్‌ ఏర్పడితే ఇండియా మొత్తంలో ఎక్కడ పవర్‌ ఉన్నా కొనుక్కునే అవకాశాన్ని కల్పించగలిగాం. 7600 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ను 18వేల మెగావాట్లకు తీసుకెళ్లాం. 1600 రామగుండంలో, 4వేలు యాదాద్రి థర్మల్‌ స్టేషన్‌లో 5600 మెగావాట్ల పవర్‌ అడిషనల్‌గా వచ్చే సదుపాయం కల్పించాం. మొన్ననే ఎన్టీపీసీ 1600 మెగావాట్లను ప్రధాని స్వయంగా వచ్చి జాతికి అంకితం చేశారు. వాళ్ల వెంబడిపడి.. తరిమితరిమి దాన్ని చేయించాను. పదిసార్లు రామగుండం వెళ్లి మీకు ఏం కావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడిగి పనులు పూర్తి చేయించాం. మా ప్రభుత్వం పోయిన తర్వాత ప్రధాని ప్రారంభించారు. ఇప్పుడు ఆ సప్లయ్‌ అదనంగా వచ్చింది. 1600 మెగావాట్లలో 85శాతం అదనంగా వచ్చింది. ఎన్టీపీసీ ఏం చేస్తుందంటే.. ఏ రాష్ట్రంలో ఉందో.. దానికి 85శాతం ఇస్తుంది. 15 శాతం జాతీయ అవసరాల కోసం తీసుకుంటారు. ఆ ప్రకారంగా అద్భుతమైన కరెంటు 1500 మెగావాట్ల కరెంటు అదనంగా వస్తుంది’ అన్నారు.

ప్రభుత్వం పట్టించుకుంటే యాదాద్రిలో కరెంటు వచ్చేది..

‘ఈ ప్రభుత్వం పట్టించుకోని చేస్తలేదు కానీ.. యాదాద్రిలో ఒకటో రెండో యూనిట్లలో కరెంటు వచ్చేది. ఇందులో తెలంగాణకే.. బయటకు ఇచ్చే అవసరం ఉండదు. 1500-1600 మెగావాట్ల కరెంటు వస్తుండే. మరి ఇంత ఉజ్వలంగా తయారైన పవర్‌ సిస్టమ్‌ ఇవాళ ఇబ్బందిపడుతుంది. ఇది పరిపాలకుల అసమర్థత అవునా? కదా? మీరే ఆలోచన చేయాలి. పని చేయలేనటువంటి.. చేతగానటువంటి ప్రభుత్వ విధానమనుకోవాలా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. లేక దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు.. ఉండి దరిద్రం ఎందుకు? ఏ కారణం ? ఇంత అద్భుతమైన పవర్‌ సిస్టమ్‌ ఫెయిల్‌ అవుతుంది రాష్ట్రంలో. ఏడు సంవత్సరాలు నడిచిన సిస్టమ్‌.. అందుబాటులో ఉన్న కరెంటు స్విచ్ఛాప్‌ చేసినట్లుగా ఎందుకు మాయమైంది. దీనికి ఎవడు సమాధానం చెప్పాలి.. ఎవడు బాధ్యత వహించాలి. ఇది క్రాస్‌ టాక్‌ కాదు. ఏడు ఏడున్నరేళ్లు బ్రహ్మాండంగా నడిచిన సిస్టమ్‌ నడవడం లేదంటే ఎవరి అసమర్థత? ఎవరి వైఫల్యం’ అంటూ

నాలుగు నెలల తర్వాత నా గొంతు విప్పుతున్నా..

‘వందకు వందశాతం నేను ఆరోపిస్తున్నా.. అసమర్థ, అవివేక, తెలివితక్కువ కాంగ్రెస్‌ పార్టీ అసమర్థత. మరేం కాదు. వాళ్లకు తెలివిలేదు పాపం. పవర్‌ సిస్టమ్‌లో ఐఏఎస్‌ ఆఫీసర్లను తొలగించి టెక్నోక్రస్ట్‌ను పెట్టాం. వాళ్ల ఆధ్వర్యంలోనే నడిపాం. కాబట్టే సమర్థవంతంగా నడిచింది. వీళ్లు ఐఏఎస్‌ ఆఫీసర్లను తెచ్చిపెట్టారు. వానికి పట్టదు.. నా మంత్రులకు పట్టదు. తీరిక లేదు మంత్రులకు. రాజకీయాల కోసం తీరిక ఉన్నది కాని.. ప్రజల అవసరాల కోసం తీరిక లేదు. రైతుబంధు వేయడానికి తీరిక లేదు. మేం రైతుబంధు వేస్తే వారం పదిరోజుల్లోనే వేసేవాళ్లం. వీళ్లు అనుమానాలు కలిగించి.. ఐదెకరాలు, మూడెకరాలు.. ఏడెకరాలకు వేస్తమని.. ఏదో విజయం సాధించామని తోకమట్ట. అదేదో గొప్ప ఢంబాచారమని.. అదో వేస్ట్‌ పథకం అన్నట్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నరు. ఇది నాలుగో నెల. ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు. ఇప్పుడు నా గొంతు విప్పుతున్నా. ఎవరైనా కొత్తగా గెలిస్తే సమయం ఇస్తాం. రెండు మూడు నాలుగు నెలలు సమయం ఇస్తం. వాళ్లు సర్దుకోవాలి. అవగాహన చేసుకోవాలి కదా. ఐదేళ్లు అద్భుతంగా నడిపాం. బ్రహ్మాండంగా మిషన్‌ భగీరథలో నీళ్లు ఇచ్చాం. రాలేదా? హైదరాబాద్‌ నగరంలో బయట గ్రామాల్లో ఒక్కనాడు ఒక్క ట్యాంకర్‌ కనిపించిందా? ఇవాళ ట్యాంకర్‌ కొనుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ సమర్థులు ఎవరు. ఇవాళ ఉన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు కాదా? అంటూ కేసీఆర్‌ ప్రశ్నించారు.

...

Complete article

Link to comment
Share on other sites

KCR: 'కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతుల ఆత్మహత్యలు' - పంటలకు రూ.500 బోనస్ కోసం నిరసన దీక్షలకు కేసీఆర్ పిలుపు

Telangana News: కాంగ్రెస్ 100 రోజుల పాలనలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. సూర్యాపేటలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.

bb162050c707c901b5c771b6b023554717118900

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు

Kcr Sensational Comments on CM Revanth Reddy: తెలంగాణలో అన్నదాతలు మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని అనుకోలేదని.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అంతా ఆలోచించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో  ఎండిపోయిన పంటలను ఆదివారం పరిశీలించిన ఆయన.. సూర్యాపేటలోని (Suryapeta) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణకు స్వల్ప కాలంలోనే ఈ దుస్థితి ఎందుకు రావాలి.?. సాగునీళ్లు ఇస్తారని నమ్మి రైతులు పంటలు వేసుకున్నారని.. ముందే చెబితే వేసుకునే వాళ్లం కాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇంత కష్టకాలం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.' అని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

'పదేళ్లలో రైతుల అనుకూల విధానాలు' 

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల అనుకూల విధానాలు చేపట్టామని.. వ్యవసాయాన్ని అద్భుతమైన దశకు తీసుకెళ్లామని కేసీఆర్ అన్నారు. 'రైతు బంధు పేరిట పెట్టుబడి సాయం అందించాం. సకాలంలో అన్నదాతలకు సాగునీరు అందించాం. పండిన ప్రతి గింజను కొన్నాం. ధాన్యం దిగుబడిలో పంజాబ్ ను దాటేశాం. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మా హయాంలో తాగునీటి సమస్యను పక్కా ప్రణాళికతో అధిగమించాం. ప్రపంచం మెచ్చిన మిషన్ భగీరథ నిర్వహణలో లోపాలెందుకు వస్తున్నాయి.?. బీఆర్ఎస్ హయాంలో రోడ్లపై బిందెలు పట్టుకుని ఏ ఆడబిడ్డా కనిపించలేదు. ఎక్కడా నీళ్ల ట్యాంకర్లు సైతం కనిపించలేదు. నేడు మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. భాగ్యనగరంలో కూడా నీళ్లు ట్యాంకర్లు ఎందుకు కనిపిస్తున్నాయి.?. ఎన్నో సమస్యలు అధిగమించి రైతులు, గృహ అవసరాలకు నిరంతరం కరెంట్ సరఫరా చేశాం. అప్పట్లో కరెంట్ పోతే వార్త. ఇప్పుడు మాత్రం ఉంటే వార్త. అగ్రగామిగా ఉన్న రాష్ట్రానికి ఎందుకు చెదలు పట్టాయి.?. ప్రభుత్వ అసమర్థత వల్లే.. మళ్లీ జనరేటర్లు, ఇన్వెర్టర్లు వస్తున్నాయి. రాత్రింబవళ్లు కొట్లాడి నేషనల్ పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేయించాం. ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. గత 8 ఏళ్లుగా బోరు బండ్లు బంద్ అయితే, ఇప్పుడు పల్లెల్లో బోర్ల హోరు వినిపిస్తోంది. ఇప్పటికీ సాగర్ లో 14 నుంచి 15 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది.' అని కేసీఆర్ పేర్కొన్నారు.

సీఎం రేవంత్ పై విమర్శలు

కేంద్ర మంత్రులు తియ్యగా మాట్లాడితే.. కేఆర్ఎంబీకి అంతా అప్పగించేశారని, ఈ ముఖ్యమంత్రికి రైతుల బాధ పట్టదని.. ఢిల్లీ యాత్రలే సరిపోతున్నాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 'ఒక్కరినో.. ఇద్దరినో మీవైపు గుంజుకుని ఆహా ఓహో అనొద్దు. అధికారం వస్తుంటుంది. పోతుంటుంది. బీఆర్ఎస్ సముద్రమంత పార్టీ. ప్రభుత్వం మారిన నాలుగో నెల వరకూ నేను ఏమీ మాట్లాడలేదు. కానీ, ఇప్పుడు లక్షల ఎకరాలు ఎండుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. వాగ్దానాలు అమలు చేయకుంటే మిమ్మల్ని నిద్రపోనివ్వం. డిసెంబర్ 9 నాటికి రుణాలన్నీ మాఫీ చేస్తామన్న సీఎం ఏరీ.?. పోలీసులకు నా విజ్ఞప్తి ఒక్కటే. మీరు అతిగా పోవొద్దు. మేమూ ఇలాగే చేసుంటే కాంగ్రెస్ పార్టీ ఉండేదే కాదు. రైతులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు.' అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఏప్రిల్ 6న నిరసన దీక్షలు

అన్ని పంటలకు రూ.500 బోనస్ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 6న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

...

Complete article

Link to comment
Share on other sites

KCR | మేం దురుసు ప్రవర్తనకు పోతే కాంగ్రెస్‌ నశ్యానికి కూడా మిగలకుండె: కేసీఆర్‌

KCR | కాంగ్రెస్‌ హయాంలో పోలీసులు ప్రజలపట్ల, ప్రతిపక్ష పార్టీ శ్రేణులపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. ఈ దురుసు ప్రవర్తనను తగ్గించుకోవాలని హెచ్చరించారు. ఇవాళ సూర్యాపేటలో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఆయన పోలీసుల తీరును తప్పుపట్టారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికార పార్టీ కోసం దురుసుగా ప్రవర్తించడం సబబు కాదని కేసీఆర్‌ హితవు పలికారు.

KCR-9_V_jpg--816x480-4g.webp?sw=1728&dsz

KCR : కాంగ్రెస్‌ హయాంలో పోలీసులు ప్రజలపట్ల, ప్రతిపక్ష పార్టీ శ్రేణులపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. ఈ దురుసు ప్రవర్తనను తగ్గించుకోవాలని హెచ్చరించారు. ఇవాళ సూర్యాపేటలో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఆయన పోలీసుల తీరును తప్పుపట్టారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికార పార్టీ కోసం దురుసుగా ప్రవర్తించడం సబబు కాదని కేసీఆర్‌ హితవు పలికారు.

‘ప్రజాస్వామ్యంలో ప్రజలుంటరు. ప్రజలకు బాధలుంటయ్‌. ప్రజాస్వామ్యంలో అతిగా పోవద్దని పోలీస్‌ మిత్రులకు చెబుతున్నా. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మేం గూడా పదేళ్లు అధికారంలో ఉన్నం. పదేళ్లలో మేం ఇదే దురుసు ప్రవర్తనకు పోతే కాంగ్రెస్ నశ్యానికి కూడా మిగలకుండె. పదేళ్లు మేం ప్రజల సంక్షేమానికి పనికొచ్చే పనులు చేసినం. ఉన్నోన్ని లేనోన్ని కడుపుల పెట్టుకుని కంటికిరెప్పలా చూసుకున్నం. అదే ప్రజలను ఇప్పుడు మీరు మోసం చేస్తమంటే ఊరుకోం. రెండు లక్షల రుణ మాఫీ ఏమైంది..? ఎందుకు స్పందిస్తలేరు. ఎప్పటికల్లా చేస్తరో ఎందుకు చెప్తలేరు..? బ్యాంకులు రైతులకు నోటీలిస్తున్నా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపరు..? దానికి సమాధానం కావాలి. మేం ప్రజల పక్షాన, రైతాంగం పక్షాన అడుగుతున్నం’ అన్నారు.

వరి పంటకు రూ.500 బోనస్‌ ఇయ్యాలె: కేసీఆర్‌

‘ప్రభుత్వం వరి పంటకు రూ.500 బోనస్‌ ఇయ్యాలె. రైతులకు రూ.500 బోనస్‌ ఇవ్వాలంటూ ఏప్రిల్‌ 2న బీఆర్‌ఎస్‌ శ్రేణులు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమొరాండం సమర్పించండి. అదే రోజున శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులం హైదరాబాద్‌లో ప్రభుత్వానికి మెమొరాండం ఇస్తం. ఏప్రిల్‌ 6న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వరి పంటకు బోనస్‌ కోసం దీక్షలు చేయండి. బోనస్‌ ఇచ్చే దాకా కాంగ్రెస్‌ సర్కారును వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రైతులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎప్పుడూ ఈ అసమర్థ పాలనే ఉండదు. మీ కోసం ఈ ప్రభుత్వంతో పోరాడుతం. అందరం కలిసి యుద్ధం చేద్దాం. వాళ్లు ఇచ్చిన వాగ్ధానాలన్నీ నెరవేర్చే దాకా వెంటపడి తరుముదాం. దయచేసి ఆత్మస్తైర్యం కోల్పోవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని కేసీఆర్‌ అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

KCR | నా కండ్ల ముందే మళ్లీ ట్యాంకర్లతో నీళ్లు దౌర్భాగ్యం వస్తదనుకోలేదు : కేసీఆర్‌

KCR | అద్భుతమైన మంచినీళ్ల సదుపాయం ఉన్న తెలంగాణలో.. నా కండ్ల ముందే మళ్లీ ట్యాంకర్లు కొనుక్కునే దౌర్భాగ్యం వస్తదనుకోలేదంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

KCR-06_V_jpg--816x480-4g.webp?sw=1728&ds

KCR | అద్భుతమైన మంచినీళ్ల సదుపాయం ఉన్న తెలంగాణలో.. నా కండ్ల ముందే మళ్లీ ట్యాంకర్లు కొనుక్కునే దౌర్భాగ్యం వస్తదనుకోలేదంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మిషన్‌ భగీరథ పట్టించుకునే నాథుడే లేడు. నేను రెండుమూడు జిల్లాల ఇంజినీర్లను అడిగాను. నిర్మించింది మీరే.. నడిపింది మీరే ఇప్పుడేమైందని అడిగితే.. సార్‌ ఇందులో అసలు కిటుకు వేరే ఉన్నది. అడిగేవాడు లేడు.. మీ ఆఫీసులో స్మితా సబర్వాల్‌ అనే సెక్రెటరీ సఫరేట్‌గా ఉండేవారు. ప్రతిరోజూ మానిటరింగ్‌ చేస్తుండే. ఎక్కడున్నా ఆమె గద్దలా వచ్చివాలి అందరు ఇంజినీర్లను తీసుకువచ్చి సమీక్షస్తుండేది.

బ్రహ్మాండంగా జరుగుతుండేది. చిన్న పైపు పోయినా తెల్లవారేలోగా మళ్లీ వేసేవారు. ఇవాళ 15 రోజులైనా పట్టించుకునే పరిస్థితి లేదని చెబుతున్నరు. మిషన్‌ భగీరథ నీళ్లు కరెంటు రావాలంటే.. నాణ్యత గల కరెంటు, నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండాలి. ఈ ప్రభుత్వం తెలివితక్కువ తనం వల్ల మళ్లీ ఇవాళ లక్షల మోటార్లు కాలిపోతున్నయ్‌. ఒక్కో రైతు మోటారు రెండుమూడు సార్లు కాలిపోతున్నాయి. ఎందుకు ఈ పరిణామాలు జరుగుతున్నయ్‌. ఇంకా మూడు నెలలు గడవాలి. జూన్‌ చివరిపోతే తప్పా ఊటలు రావు. అది భగవంతుడు కరుణించి వర్షాలు కురిస్తే మళ్లీ నీటి ఊటలు వస్తయ్‌. మూడు మూడున్నర నెలలు ఇంకా ఎంత భయంకరంగా పరిస్థితి ఉంటది. నేను బాధతో.. దుఃఖంతో మాట్లాడుతున్నా. అద్భుతమైన మంచినీళ్ల సదుపాయం ఉన్న తెలంగాణ నాకండ్ల ముందే నాశనమైతది అనుకోలేదు’ అన్నారు.

ఏ కారణంతో నీళ్ల గోస వచ్చింది..?

‘నేను బాధతో మాట్లాడుతున్న.. అద్భుతమైన మంచినీళ్ల సదుపాయం ఉన్న తెలంగాణ.. 100 రోజుల్లో నా కండ్ల ముందే ఇంత నాశనమైతది. నా కండ్ల ముందే బిందెలు పట్టుకుని తిరుగుతరు.. నా కండ్ల ముందే బోర్లు వేసుకునే దుస్థితి వస్తది.. నా కండ్ల ముందే ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యం వస్తది అని నేను అనుకోలేదు. ఏ కారణంతో నీళ్లకు షాటేజీ వచ్చింది? హైదరాబాద్‌ ఏనాటికైనా ప్రధానం కాబట్టి ఎల్లంపల్లి నుంచి సింగిల్‌ లైన్‌ ఉంది.. సంవత్సరానికి 12 టీఎంసీ వస్తది.. కృష్ణా నుంచే ఫేజ్‌ ఉందని.. సాగర్‌లో 100 టీఎంసీల పైచిలుకు డెడ్‌ స్టోరేజీ ఉంటదని.. పాత అక్కంపల్లి మీదనే ఆధారపడకుండా రూ.1,450 కోట్లతో సుంకిశాల ప్రాజెక్టును మంజూరు చేశాం. మా ప్రభుత్వం పోయేనాటికే 70-75 శాతం పనులు కూడా అయిపోయాయి. మొన్న కాంట్రాక్టర్‌ను అడిగితే.. ఈ గవర్నమెంట్‌ చెబితే రెండు మూడు నెలల చేసి అందిస్తామని చెప్పారు. ఒక్కసారి అది పూర్తయితే నీటి సదుపాయానికి ఢోకా ఉండదు. సాగర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం వాడుకునే పరిస్థితి ఉంటది. ఇవేవీ చేయకుండా.. సమీక్షలు లేకుండా.. అడ్డగోలు మాటలు.. పిచ్చి ప్రచారాలు చేస్తున్నారు. ఎంతసేపు గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే చిల్లర టాక్టిక్స్‌ తప్ప ఏమీ కనిపించడం లేదన్నారు’ అంటూ కేసీఆర్‌ మండిపడ్డారు.

...

Complete article

Link to comment
Share on other sites

CBN ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం!!

Congress ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం!!

History doesn't LIE

Link to comment
Share on other sites

పంటలు ఎండిపోతయని ముందే కేసీఆర్‌ ఎందుకు చెప్పలె?

‘పంటలు ఎండిపోక ముందే కేసీఆర్‌ మాకు చెప్పవచ్చు కదా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పంటలు ఎండిపోయిన తర్వాత ఆ మంటల వద్ద కేసీఆర్‌ చలికాచుకోవాలని అనుకున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద 6న కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించబోయే బహిరంగసభ ఏర్పాట్లను రేవంత్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు.

చనిపోయిన 200మంది రైతుల వివరాలిస్తే పరిహారమిస్తం

48గంటల్లోనే వివరాలివ్వండి.. కోడ్‌ ముగిశాక ఆర్థికసాయం

ఎన్నికల కోడ్‌తో కొన్ని గ్యారెంటీలు ఇవ్వలేకపోయాం: రేవంత్‌

కాంగ్రెస్‌ వచ్చాక కరువు వచ్చిందన్నది అబద్ధం

మా ప్రభుత్వం రాకముందే వర్షాలు కురవలేదు

నష్టపోయిన రైతులకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఫండ్‌ నుంచి 100 కోట్ల పరిహారమివ్వాలి: రేవంత్‌

జూన్‌ 9న ఇండియా కూటమి ప్రమాణమని ధీమా

CM_V_jpg--816x480-4g.webp?sw=1728&dsz=81

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (నమస్తే తెలంగాణ): ‘పంటలు ఎండిపోక ముందే కేసీఆర్‌ మాకు చెప్పవచ్చు కదా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పంటలు ఎండిపోయిన తర్వాత ఆ మంటల వద్ద కేసీఆర్‌ చలికాచుకోవాలని అనుకున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద 6న కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించబోయే బహిరంగసభ ఏర్పాట్లను రేవంత్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అంటూ కేసీఆర్‌ చేసిన విమర్శలను ప్రస్తావించారు. పంటలు ఎండిపోకముందే కేసీఆర్‌ తమకు ఈ విషయం చెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రెండు వందల మంది రైతులు చనిపోయారని అంటున్నారని, ఆ వివరాలను తమకు అందిస్తే బాధిత రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తామని వివరించారు. అయితే, అందుకు 48 గంటలు మాత్రమే సమయం ఇస్తున్నామని చెప్పడం గమనార్హం. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ఆర్థికసాయం అందజేస్తామని తెలిపారు. కోడ్‌ అమల్లోకి వచ్చాక పాలన ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్లడంతో కొన్ని హామీలు నెరవేర్చలేకపోయినట్టు చెప్పారు.

రైతులకు సాయం చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. కేసీఆర్‌ పదేం డ్ల తర్వాత పొలంబాట పట్టడం సంతోషకరమని తెలిపారు. మాజీ సీఎం అయిన కేసీఆర్‌కు ఏ సీజన్‌లో కరువు వస్తుందో తెలియ దా? అని ప్రశ్నించారు. నిరుడు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలోనే వర్షాలు కురవలేదని, ఆ కారణంగానే కరువు వచ్చిందని చెప్పారు.

ఇప్పుడు ఆ పాపాలను తమ ఖాతాలో వేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు వేసేందుకు 10 నెలల సమయం తీసుకుందని, వారు ఎప్పుడెప్పుడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశారో ఆ వివరాలన్నీ ఉన్నాయని, కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే చూపించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. తాము ఇప్పటికే 65 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు జమచేశామని, మిగిలింది 4 లక్షలమంది రైతులేనని తెలిపారు.

జనరేటర్‌తో ప్రెస్‌మీట్‌ పెట్టి నిందలా?
జనరేటర్‌తో ప్రెస్‌మీట్‌ పెట్టి విద్యుత్తు పో యిందని తమ ప్రభుత్వంపై కేసీఆర్‌ నిందలు వేస్తున్నారని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఏదైనా సమస్యపై తాము ఆందోళనకు పిలుపునిస్తే అరెస్ట్‌ చేసేవారని, కానీ తాము అలా చేయడం లేదని గుర్తుచేశారు. కేసీఆర్‌ పర్యటనకు తాము అన్ని ఏర్పాట్లు చేశామని, తాము తలచుకుంటే కేసీఆర్‌ అసలు బయటకు వచ్చేవారే కాదని పే ర్కొన్నారు.

బాండ్ల రూపంలో వచ్చిన రూ.1500 కోట్లు బీఆర్‌ఎస్‌ ఖాతాలో ఉన్నాయని, ఆ పాపపు సొమ్ము నుంచి రైతులకు ఓ రూ.100 కోట్లు సాయం చేయవచ్చు కదా అ ని సూచించారు. పార్లమెంట్‌ ఎన్నికల కోసమే కేసీఆర్‌ పొలంబాట పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్‌ తమకు సూచనలు చేస్తే, వాటిలో న్యాయమైనవైతే అమలు చేస్తామని తెలిపారు. .

తుక్కుగూడ సభలో మ్యానిఫెస్టో
6న తుక్కుగూడలో జరిగే సభలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ నేతలతో కలిసి సభా ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సభకు మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ హాజరవుతారని తెలిపారు.

కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వస్తే రాష్ర్టానికి జరిగే మే లును ఈ సభ ద్వారా చెప్తామని పేర్కొన్నారు. సోనియాగాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎన్నికల కోడ్‌ ముగిశాక మిగతా హామీలను అమలు చేస్తామని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి సర్కారేనని, జూన్‌ 9న ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం ఉంటుందని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...