Jump to content
  • 0

కాల్వల్లో నీళ్లిడువరు.. ఎవుసానికి కరెంటియ్యరు


TELUGU

Question

‘కేసీఆర్‌ ప్రభుత్వంలో గుట్టలపై కూడా పంటలు పండించాం. గతంలో వలసబాట పట్టిన మేము పదేండ్లుగా పంటల బాట పట్టినం. ఏటా రెండు పంటలు పండించి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు సంపాదించేవాళ్లం.

sheep_V_jpg--816x480-4g.webp?sw=1728&dsz

కాంగ్రెస్‌ హయాంలో అన్నీ కరువే..

పదేండ్లలో చూడని కష్టాలు మళ్లీ మొదలు

సాగునీరు లేక ఎండిపోతున్న వరి పంటలు

గొర్రెలు, పశువులకు మేతలవుతున్న పొలాలు

వడ్లు అమ్మాల్సిన రైతులకు గొడ్డుగడ్డి కోసే స్థితి

‘కేసీఆర్‌ ప్రభుత్వంలో గుట్టలపై కూడా పంటలు పండించాం. గతంలో వలసబాట పట్టిన మేము పదేండ్లుగా పంటల బాట పట్టినం. ఏటా రెండు పంటలు పండించి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు సంపాదించేవాళ్లం. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాల్వల నీళ్లు బంద్‌ అయ్యాయి. మేం వేసుకున్న పంటలన్నీ ఎండిపోతున్నాయి. పంట పెట్టుబడి అందకపోవడంతో అప్పులు చేశాం.

వాటిని ఎవరు తీర్చాలి ? మాకు మళ్లీ బొంబాయి కష్టాలు మొదలవుతున్నాయి’ అంటూ వనపర్తి మండలంలోని కీర్యాతండా, గుంత తండాలకు చెందిన గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఈ రెండు తండా ప్రజలదే కాదు.. రాష్ట్రంలోని రైతులందరీ పరిస్థితీ ఇలాగే ఉంది.

కాంగ్రెస్‌ హయాంలో కాల్వల్లో నీళ్లు రాక, సమయానికి కరెంట్‌ రాక రైతులు అరిగోసపడుతున్నారు. పొలం తడి పెట్టేందుకు తండ్లాట పడుతున్నారు. కండ్ల ముందే ఎండిన పంటను చూడలేక ట్యాంకర్లతో నీళ్లు పెడుతూ తల్లడిల్లిపోతున్నారు. పొట్ట దశలోకి వచ్చిన పచ్చని పంటలను పశువుల మేతగా వదిలేస్తున్నారు. వడ్లు అమ్ముకోవాల్సిన రైతులు గొర్రెలకు, పశువులకు అడ్డికి పావుశేరుకు గడ్డి అమ్ముకుంటున్నారు.

మళ్లీ బొంబాయి కష్టాలు..
ఎప్పటిలాగే కాల్వ నీళ్లు వస్తాయని ఆశపడ్డ. ఎనిమిది ఎకరాల్లో వరి వేశాను. ఇప్పటికే నాలుగెకరాలు ఎండిపోయింది. మిగిలింది కూడా ఎండిపోవడమే తప్పా పండేది లేదు. లక్షల రూపాయల పంటలు పండించినోళ్లమే తినడానికే మళ్లీ కొనుక్కొనే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతుబంధు కూడా పడడం లేదు. మాకు మళ్లీ బొంబాయి కష్టాలు మొదలయ్యాయి.
– ఎల్‌.పాండు, కుంటోని తండా, వనపర్తి మండలం

పరిహారం ఇవ్వాలి..
కాల్వ ద్వారా నీళ్లు విడుదల చేయకుండా ముందే నిలుపుదల చేయడంతో వేసుకున్న పంటలన్నీ ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. ఎండిపోతున్న పంట చేలను చూస్తే.. ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. పదేండ్లుగా పంటలు పండించిన రైతులు ప్రస్తుతం కన్నీరుమున్నీరవుతున్నారు. పెట్టుబడిలేక అప్పుల పాలవుతున్న రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి.
-కె.మాణిక్యం, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు, వనపర్తి

కరెంటోళ్లు కనికరించకపాయే ఇదీ గొల్లపల్లి రైతుల గోస
నెన్నెల, మార్చి 9 : ‘100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఆయిల్‌ లీకవుతుందని, లో వోల్టేజీ సమస్య ఉందని నెల కిందే ఏఈకి చెప్పినం. బోర్లు కాలిపోతున్నయి… నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నయి.. ఎంత మొరపెట్టుకున్నా కరెంటోళ్లు కనికరించకపాయే’ అని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన రైతులు శనివారం నెర్రెలు బారిన పంట పొలాలను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఊరిలోని 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ పరిధిలో 80 ఎకరాలకు పైగా వరి సాగయ్యిందని, అధికారుల నిర్లక్ష్యంతో పంట చేతికందకుండా పోయే పరిస్థితి దాపురించిందని తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ విషయమై ఏఈ మల్లయ్యను వివరణ కోరగా, రైతులంతా ఒకేసారి మోటర్లు స్టార్ట్‌ చేయడం వల్ల డీటీఆర్‌ మీద ఓవర్‌లోడ్‌ పడుతుందని, దాంతో ఫీజులు ఆగడంలేదని, రైతులు సమన్వయంతో కరెంటును వినియోగించుకోవాలని అన్నారు.

ట్యాంకర్‌ అద్దెకు తీసుకున్న..
నాలుగు ఎకరాల్లో వరి సాగు చేసిన. సుమారు రూ. 60 వేల వరకు పెట్టుబడి అయ్యింది. పొలమంతా పొట్ట, ఈత దశలో ఉంది. సాగునీళ్లు లేక ఇబ్బంది అవుతుండడంతో ఓ రైతు వద్ద రూ. 10 వేలకు బోర్‌ నీళ్లు మాట్లాడుకొని ట్యాంకర్‌ను అద్దె తీసుకొని వరి చేనుకు పోస్తున్న. ఇలా రెండెకరాలు పారుతుంది. మిగిలిన రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది. ఏడేనిమిదేళ్లుగా నీళ్ల కరువు లేకుండా ఉండేది. ఇప్పుడే ఇబ్బంది అవుతుంది. నష్టపోయిన రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తారో చూడాలె మరి.

...

Complete article

Link to comment
Share on other sites

1 answer to this question

Recommended Posts

  • 0

Harish Rao | ఎంపీ ఎల‌క్ష‌న్స్ ఉన్నాయ‌ని కాంగ్రెస్ ఈ మాత్రం క‌రెంట్ ఇస్తోంది : హ‌రీశ్ రావు

Harish Rao | కేసీఆర్ పాల‌న‌లో ఏ రోజు కూడా క‌రెంట్ పోలేదు.. కానీ ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో క‌రెంట్ కోత‌లు మొద‌ల‌య్యాయ‌ని సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. నిన్న ఒక ఊరికి వెళ్తే క‌రెంట్ కోత‌లు మొద‌ల‌య్యాయ‌ని రైతులు ఆవేద‌న చెందార‌ని ఆయ‌న గుర్తు చేశారు.

Harishrao1_V_jpg--816x480-4g.webp?sw=172

Harish Rao | హైద‌రాబాద్ : కేసీఆర్ పాల‌న‌లో ఏ రోజు కూడా క‌రెంట్ పోలేదు.. కానీ ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో క‌రెంట్ కోత‌లు మొద‌ల‌య్యాయ‌ని సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. నిన్న ఒక ఊరికి వెళ్తే క‌రెంట్ కోత‌లు మొద‌ల‌య్యాయ‌ని రైతులు ఆవేద‌న చెందార‌ని ఆయ‌న గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మున్నూరు కాపు సంఘం నేత‌లు తెలంగాణ భవన్‌లో హరీశ్ రావును కలిసి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మీ వినతిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకు వెళతాం. మీ ఆలోచనలను వివరిస్తాము. కేసీఆర్ ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే వ్యక్తి. మున్నూరు కాపు నేతలకు గతంలోనూ ఎంతో మందికి అవకాశం కల్పించారని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో 13 హామీలు అన్నారు. డిసెంబ‌ర్ 9వ తేదీన‌ రుణమాఫీ అన్నారు. ఎన్ని 9 తేదీలు మారినా రుణమాఫీ కావడం లేదని విమర్మించారు హరీశ్ రావు. బోనస్ విషయంలో దగా, రుణమాఫీ విషయంలో దగా, ఉచిత కరెంట్ విషయంలో దగా, రైతు బంధు విషయంలో దగా.. కాంగ్రెస్ పాలన అంటేనే దగా అన్నట్లు ఉంది. చెప్పుకుంటూ పోతే మొత్తం 420 దగాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఈ మాత్రం కరెంట్ ఇస్తోంది. ఎన్నికలు అయిపోతే కరెంట్ కోతలు పూర్తి స్థాయిలో ఉంటాయని హరీశ్ రావు అన్నారు.

మోదీని బడే భాయ్ అని, ఎల్లప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉండాలని రేవంత్ అన్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదు అని రేవంత్ చెప్పకనే చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలో ఉన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వచ్చేది లేదు, ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే పోయేదేమీ లేదు. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే బీఆర్‌ఎస్ పోరాటంతోనే సాధ్యం అవుతుందన్నారు. రుణమాఫీ, రైతు బంధు, కరెంట్, బోనస్ ఇవ్వనందుకు రైతులు ఏకమై వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చుర‌క‌ పెట్టాలన్నారు హరీశ్‌రావు.

బాండ్ పేపర్ ఇచ్చి రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ ఓడిపోతేనే.. కాంగ్రెస్ హామీలు అమలు అవుతాయన్నారు. మార్చి నెలాఖరుకు ఎండలు ముదిరితే పంట సాగు ఎలా అని రైతులు ఆందోళన పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. రెండు సార్లు గేలిపిస్తే పార్టీకి మోసం చేశారు బీబీ పాటిల్. వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. దేశంలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతి పక్ష హోదా కూడా వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు హరీశ్ రావు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...