Jump to content
  • 0

వంద రోజుల్లో.. వంద తప్పులు, పదేళ్ల తరువాత.. రైతులకు తిప్పలు


TELUGU

Question

నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన ‘అబద్ధాల హస్తం’
వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ఎక్స్ వేదికగా
వంద ప్రశ్నలు సంధించిన బిఆర్‌ఎస్

Hand.jpg

మనతెలంగాణ/హైదరాబాద్ : 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7వ తేదీన అధికారం చేపట్టింది. దీంతో ఆదివారం(మార్చి 17) నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో.. వంద తప్పులు.. పదేళ్ల తర్వాత.. రైతులకు తిప్పలు అంటూ బిఆర్‌ఎస్ ఎక్స్ వేదికగా 100 ప్రశ్నలు సంధించింది. నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన ‘అబద్ధాల హస్తం’ అని విమర్శించింది.ఈ మేరకు ఆదివారం బిఆర్‌ఎస్ పార్టీ చేసిన ట్వీట్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రీట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనపై బిఆర్‌ఎస్ వంద ప్రశ్నలు

1. రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది..?
2. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇంకెప్పుడు..?
3. రైతుబంధును సీరియల్ లాగా ఎంతకాలం సాగదీస్తారు..?
4. వరి పంటకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైంది ?
5. ప్రతి మహిళకు రూ.2500 హామీ మరిచిపోయారా..?
6. మూడు నెలలైనా పెన్షన్లను రూ.4000 కు ఎందుకు పెంచలేదు..?
7. ఒకటో తేదీన జీతాలన్నారు. అందరికీ ఎందుకు అందడం లేదు..?
8. 200 యూనిట్లు దాటితే మొత్తం కరెంట్ బిల్లు ఎందుకు కట్టాలి..?
9. గృహజ్యోతికి ఏటా 8 వేల కోట్లు అవసరమైతే బడ్జెట్లో 2400 కోట్లే ఎందుకు పెట్టారు..?
10. దళితబంధు పథకాన్ని అర్థాంతకరంగా ఎందుకు నిలిపివేశారు..?
11. అంబేద్కర్ అభయహస్తం పథకం అడ్రస్ లేకుండా ఎందుకు చేశారు..?
12. ఒకే ఒక్క రోజు ప్రజాభవన్‌కు వెళ్లి.. ఆ తరువాత ఎందుకు ముఖం చాటేశారు..?
13. చిన్న లోపాన్ని భూతద్దంలో చూపెట్టి మేడిగడ్డ బ్యారేజీపై ఎందుకు కుట్ర చేశారు..?
14. కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టేశారు..?
15. భూగర్భ జలాలు అడుగంటుతున్నా చెరువులు ఎందుకు నింపడం లేదు..?
16. పంట చేతికొచ్చే సమయంలో రైతులకు సాగునీళ్లివ్వకపోవడం ఘోరం కాదా..?
17. పదేళ్ల తరువాత పచ్చని పంటలు ఎండిపోవడం మీరు చేసిన పాపం కాదా..?
18. వేళాపాళా లేని కోతలు, కరెంట్ షాకులతో ఇంకెంతమంది రైతులను బలి తీసుకుంటారు..?
19. సమైక్యరాష్ట్రంలో కొనసాగిన రైతు ఆత్మహత్యలకు మళ్లీ తెరలేపడం నేరం కాదా..?
20. పంజాబ్‌ను తలదన్నిన తెలంగాణను కరువుకు కేరాఫ్‌గా ఎందుకు మార్చారు..?
21. యాసంగి సాగు గణనీయంగా తగ్గినా ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి..?
22. వాటర్ ట్యాంకర్లతో పంటలు కాపాడుకునే దుస్థితిని ఎందుకు కల్పించారు..?
23. బోర్ల రాంరెడ్డి ఎదుర్కొన్న ఆనాటి పరిస్థితి మళ్లీ రైతులకు ఎందుకొచ్చింది..?
24. పల్లెలు పట్టణాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎందుకు పాతరేశారు..?
25. నాణ్యత లేని కరెంట్ వల్ల కాలిపోతున్న మోటర్లకు బాధ్యులెవరు..?
26. మళ్లీ యూరియా కోసం క్యూలైన్ లో నిలబడే సంస్కృతి ఎందుకు తెచ్చారు..?
27. సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పగించారు..?
28. మిషన్ భగీరథను మూలనపడేసి.. మళ్ళీ ట్యాంకర్ల రాజ్యమా..?
29. ఫ్రీ బస్సు అని ఆశపెట్టి మహిళలను ఇబ్బందులకు గురిచేస్తారా..?
30. ఆటో డ్రైవర్ల పొట్టగొట్టి.. ఏటా ఇస్తామన్న రూ.12 వేలు ఎగ్గొడతారా..?
31. పదేళ్లు సంతోషంగా ఉన్న నేతన్నల జీవితాలను ఎందుకు ఆగం చేశారు..?
32. ఆర్డర్లు ఇవ్వకుండా సాంచాల సంక్షోభాన్ని ఎందుకు సృష్టించారు..?
33. ఆత్మగౌరవంతో బతుకుతున్న నేతన్నలను అవమానిస్తారా..?
34. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించిన జర్నలిస్టుపై దాడి చేస్తారా..?
35. బిఆర్‌ఎస్ హయాంలో వచ్చిన పెట్టుబడులను మీ ఖాతాలో వేసుకుంటారా..?
36. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కంపెనీ చెన్నైకి తరలిపోతున్నా గుడ్లప్పగించి చూస్తారా..?
37. కేన్స్ సెమీ కాన్ సంస్థను గుజరాత్ రాష్ట్రానికి ధారాదత్తం చేస్తారా..?
38. ప్రపంచం మెచ్చిన టీఎస్ ఐపాస్‌ను కాదని.. కొత్త పాలసీ పాటపాడతారా..?
39. గురుకుల నియామకాల్లో వెయ్యి బ్యాక్ లాగ్ పోస్టులు మిగలడం మీ వైఫల్యంకాదా..?
40. పచ్చని వికారాబాద్ అడవులపై రాడార్ చిచ్చు పెడతారా..?
41. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు తెరతీస్తారా..?
42. శంషాబాద్ మెట్రోను ముందుచూపు లేకుండా ఎలా రద్దుచేస్తారు..?
43. దేశానికే తలమానికం లాంటి ఫార్మా సిటీని ముక్కలు చేస్తారా..?
44. కల్యాణలక్ష్మి పథకంతో ఇస్తామన్న తులం బంగారం ఏమైంది..?
45. Free LRS పై మాటతప్పి ప్రజల నుంచి రూ.20 వేల కోట్లు దోచుకుంటారా..?
46. రక్షణ భూముల అప్పగింతలో బీఆర్‌ఎస్ కష్టాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటారా..?
47. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు పాతరేసి ఆ రూట్‌లో శాశ్వతంగా మెట్రో లేకుండా చేస్తారా..?
48. గొర్రెల పథకం లబ్దిదారులు డీడీలు కట్టినా ఇంకెప్పుడు పంపిణీ చేస్తారు..?
49. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీని ఇంకెప్పుడు పూర్తి చేస్తారు..?
50. సాక్షాత్తు ప్రియాంకా గాంధీ హామీఇచ్చిన నిరుద్యోగ భృతి ఏమైంది..?
51. కెసిఆర్ కిట్ – రూ.13 వేల ఆర్థిక సాయాన్ని ఇస్తారా..? లేదా..?
52. గర్భిణీలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్ పథకం ఏమైంది..?
53. వెంటనే తెల్ల కార్డులను అందిస్తామన్న హామీ అమలు ఇంకెప్పుడు..?
54. విద్యార్థుల బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కు ఎందుకు బ్రేకులు వేశారు..?
55. ధరణి పోర్టల్‌ను దెబ్బతీయడం దళారుల రాజ్యం కోసమేనా..?
56. ధూపదీప నైవేద్యం పథకాన్ని కొండెక్కించడం సమంజసమేనా..?
57. 33 జిల్లాలను కుదించాలని కుట్ర చేయడం తిరోగమన చర్య కాదా..?
58. వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములపై కన్నేయడం తప్పు కాదా..?
59. సొంత ప్రభుత్వంలోని దళిత ఉపముఖ్యమంత్రిని అవమానిస్తారా..?
60. సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీని అర్థాంతరంగా ఎందుకు నిలిపివేశారు..?
61. బిఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన 30 వేల ఉద్యోగాల భర్తీని మీ ఖాతాలో వేసుకుంటారా..?
62. ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్లలో నష్టపరుస్తారా..?
63. ఉద్యోగాలకు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పి.. ఫీజు వసూలు చేస్తారా..?
64. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామన్న పెండింగ్ డిఏలు ఇంకెప్పుడు ఇస్తారు..?
65. మూడు నెలలుగా పీహెచ్ సీల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందికి జీతాలు ఇవ్వరా..?
66. 38 మందికి పైగా ఆటోడ్రైవర్ల బలిదానాలకు బాధ్యులు మీరు కాదా..?
67. 175 మంది రైతుల ఆత్మహత్యలకు కారణం మీరు కాదా..?
68. సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలకు తెరతీసింది మీరు కాదా..?
69. గురుకులాల్లో విద్యార్థినుల ఆత్మహత్యలు మీకు కనిపించడం లేదా..?
70. పంచాయతీ ఎన్నికలు పెట్టకుండా స్పెషల్ ఆఫీసర్‌లకు పాలన అప్పగిస్తారా..?
71. అప్పు చేయడం తప్పు అని.. మీరే వేల కోట్ల రుణాలు ఎలా తీసుకుంటారు..?
72. అధికారంలోకి రాగానే మళ్లీ ఇసుక మాఫియాకు దారులు తెరిచారా..?
73. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా..?
74. సచివాలయం ముందు తెలంగాణ తల్లికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు..?
75. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని ఎందుకు తొలగిస్తారు..?
76. జై తెలంగాణ అని నినదించిన పాపానికి లాఠీలతో రెచ్చిపోతారా..?
77. బిఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న బీజేపీతో చీకటి ఒప్పందాలెందుకు..?
78. గుజరాత్ మోడల్‌ను మెచ్చుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా..?
79. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు తెలంగాణను ఏటీఎంగా మార్చేశారా..?
80. పరిపాలనను గాలికొదిలేసి.. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంటారా..?
81. బిఆర్‌ఎస్ కార్యకర్తలపై కక్షగట్టి ఇంకెన్ని అక్రమ కేసులు పెడతారు..?
82. పచ్చని తెలంగాణను కరువుకు కేరాఫ్‌గా మార్చింది మీరు కాదా..?
83. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టండని అన్నదాతలను అవమానిస్తారా..?
84. కౌలు రైతులకు ఎకరానికి 15 వేల హామీని ఇంకెప్పుడు నిలబెట్టుకుంటారు..?
85. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న మాట మరిచిపోయారా..?
86. విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అడ్రస్ ఎక్కడ..?
87. రూ.3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాల హామీని గాలికి వదిలేశారా..?
88. సాగునీరు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా.. నష్టపరిహారం అందించరా..?
89. 18 ఏళ్లు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడిస్తారు..?
90. యూత్ కమిషన్ ఏర్పాటు – రూ.10 లక్షలు వడ్డీ లేని రుణ హామీ ఏమైంది..?
91. తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారా..?
92. ఎస్‌సి విద్యార్థులకు ఇస్తామన్న విద్యా జ్యోతులు పథకం గుర్తుందా..?
93. పవర్ లూమ్స్, ఇతర పరికరాలపై 90 శాతం సబ్సిడీ గ్యారెంటీ ఏమైంది..?
94. దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ హామీని పూర్తిస్థాయిలో అమలు చేసేదెప్పుడు..?
95. మైనిఫెస్టోలో రూ.1.70 లక్షల కోట్ల హామీలిచ్చి.. బడ్జెట్‌లో నిధులు కేటాయించరా..?
96. పదేళ్లలో పెంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని వందరోజుల్లోనే దెబ్బతీస్తారా..?
97. ఎన్నికలకు ముందు మీ పార్టీ ఇచ్చిన ఐదు డిక్లరేషన్లను మీరే కాలరాస్తారా..?
98. బాబుతో కలిసి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే కుతంత్రాలు చేస్తారా..?
99. విభజన హామీలు నెరవేర్చని కేంద్రంపై అంత ప్రేమ ఎందుకు..?
100. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారా..?

...

Complete article

 

Link to comment
Share on other sites

3 answers to this question

Recommended Posts

  • 0

“No implementation of guarantees, Congress govt looting Telangana,” alleges G Kishan Reddy

no-implementation-of-guarantees-congress

Union Minister G Kishan Reddy on Sunday hit out the Congress-led Telangana government for allegedly not fulfilling the promises made by the party ahead of assembly polls.

The BJP leader said that the Congress has not implemented its “six guarantees” even after 100 days in power. He further accused the Telangana government of “imposing Rahul Gandhi tax” and taking money from real-estate firms, and sending it to the “high command.”

“In Telangana, assembly elections took place 3 months ago, In that poll, the Congress party mentioned that the implementation of 6 guarantees will commence in 100 days once they come to power. There is no execution of guarantees; it’s been 100 days,” Reddy said.

The Congress said that “Every woman will be given a Rs 2,500 allowance per month, they did not even provide that guarantee. Not just that, Congress has never fulfilled any of the promises made by the party in the last 75 years. There is no change in the state of Telangana after the formation of the Congress government,” said Reddy.
Reddy further alleged, “The way previous BRS government looted Telangana, the same way current Congress government is imposing Rahul Gandhi tax and taking money from real-estate firms, manufacturing units and sending it to the high command.”

Earlier, addressing a rally in Nagarkurnool on Saturday, Prime Minister Narendra Modi also lashed out at Congress and Bharat Rasthra Samithi and said that both these parties have crushed the dreams and aspirations of Telangana.
The PM said Telangana people have decided to bring back Modi for a third time at the Centre.

The general election for 543 Lok Sabha seats will be held in seven phases from April 19, with counting to be held on June 4. Elections to the state legislatures of Andhra Pradesh, Arunachal Pradesh, Odisha and Sikkim will also be held in the same period

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Not many issues for farmers under Congress rule, claims Revanth

The gates were already opened for leaders from other parties to join the Congress, he said.

Revanth-Reddy-asks-Modi-to-_V_jpg--816x4

Hyderabad: Chief Minister A Revanth Reddy appeared to be in a self-contradicting mood on Sunday, while stating that in the 100 days of the Congress government, there were not many issues relating to power or water supply to farmers.

At the same time, he said the State government was approaching Karnataka for water supply to tide over the crisis since there were drought conditions prevailing in the State.

“Since the election code is in vogue, officials will now have to take up this issue. The State administration will be under the purview of the Election Commission. We have a limited role to play,” he said at a Meet the Media programme here.

Regarding a potential power and water crisis in the summer, the Chief Minister said it was due to less rainfall last year that groundwater levels had declined and drought conditions were prevailing.

Even after saying this, he put the blame on the previous government for the circumstances, alleging that negligence of the previous dispensation had seen water levels in the reservoirs being “not maintained to the required levels”.

“Water was released for power generation and there was complete disarray in administration,” he alleged.

On the power situation, he said the present State government was supplying ‘excess power than required’ and yet there were power cuts because a few ‘linemen were deliberately disrupting power supply in VIP areas’.

After instructions were issued to the department to initiate strict action against such personnel, things were now getting streamlined, he said. The Chief Minister also found fault with the Telangana State Electricity Regulatory Commission (TSERC) for reportedly serving a notice to the State government, asking it to deposit the subsidy component for the 200 unit free power supply scheme with the discoms before issuing zero bills.

He questioned TSERC Chairman T Sri Ranga Rao whether such instructions were issued to the previous government while it was supplying 24 hour free power to farmers.

“The moment the Congress government began issuing zero bills, the ERC issued notices,” he said, warning Rao that he would not remain in the seat for long and that they (the Congress) had “their own calculations”.

Earlier, Revanth Reddy claimed that with the Lok Sabha election schedule being announced, he would showcase his political acumen as the TPCC president. The gates were already opened for leaders from other parties to join the Congress, he said.

“We have completed 100 days of governance in the State. I have started my politics (indicating the joining of BRS MP Ranjith Reddy and MLA Danam Nagender into the Congress),” he said.

“When opposition parties openly disclose their intentions about dethroning the Congress government, it is my responsibility to respond in equal measure,” he said.

Stating that the Congress government was focusing on cutting down wasteful expenditure, the Chief Minister said the monthly GST revenue was increasing steadily since the last two months by initiating action against tax evaders.

GST revenue of nearly Rs.1,000 crore was estimated to come every month and this would be utilized for implementing schemes, he said. Farmers need not worry about Rythu Bharosa assistance.

Already, financial assistance was extended to 62 lakh farmers and genuine beneficiaries would definitely be covered. Apart from the 68 lakh farmers identified under the scheme, new farmers could apply for assistance, he said.

The Chief Minister also came down heavily on BJP Malkajgiri MP candidate Etala Rajender for accusing the State government of tapping phones of opposition leaders.

“The BJP government is in power at the Centre and it can order a probe into phone tapping complaints,” he said. On BSP leader RS Praveen Kumar quitting BSP, the Chief Minister said the former IPS officer would have become the DGP if he had continued in service.

“We had offered the TSPSC chairman post to Praveen Kumar but he declined. I’m not sure he will join KCR’s party,” Revanth Reddy said.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Kishan Reddy: అబద్ధాలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

అబద్ధాలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఆదివారం నాడు బీజేపీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ వెబ్ సైట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... పోరాటాలతో వచ్చిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బలి అయ్యిందన్నారు. పదేళ్లలో తెలంగాణ ఇబ్బందులకు గురైందని చెప్పారు.

kishan_reddy_cf96a429ae_V_jpg--799x414-4

హైదరాబాద్: అబద్ధాలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఆదివారం నాడు బీజేపీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ వెబ్ సైట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... పోరాటాలతో వచ్చిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బలి అయ్యిందన్నారు. పదేళ్లలో తెలంగాణ ఇబ్బందులకు గురైందని చెప్పారు. ధర్నా చౌక్‌ను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాన్ చేసిందని మండిపడ్డారు. అనేక కారణాలతో కేసీఆర్ ఓడిపోయారు కాని తెలంగాణ గెలవలేదని చెప్పారు. కాంగ్రెస్ డిక్లరేషన్‌ల పేరుతో ప్రకటనలు చేయించారని చెప్పారు.కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలకు అమలు చేయడం లేదన్నారు. మహిళల కు నెలకు రూ. 2500 పథకం, రైతు భరోసా రూ.2లక్షల రుణమాఫీ హామీ ఏమైందని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12వేల రూపాయలపై వరిపంటకు బోనస్ పైనా స్పష్టత లేకుండా పోయిందని చెప్పారు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డు విషయం మరచిపోయినట్టు కనిపిస్తుందని అన్నారు.

పాల ఉత్పత్తి దారులకు లీటరుకు రూ.5 బోనస్ అమలు చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు ఇస్తామన్న రూ. 4వేల నిరుద్యోగ భృతి గారడిగానే మారిందన్నారు. అమ్మాయిలకు ఇస్తామన్న స్కూటీలు ఇవ్వలేదన్నారు. మహిళలకు పదిలక్షల వడ్డీ లేని రుణాల హామీను ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని... అసలు ఇస్తారా ఇవ్వరో చెప్పాలని నిలదీశారు. 57ఏళ్లు నిండిన వారికీ ఇస్తానన్న రూ.4వేల చేయూత ఏమైందని ప్రశ్నించారు. హామీలను ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని విరుచుకుపడ్డారు. ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో నేటి నుంచి క్యాంపైయిన్ ప్రారంభించామని తెలిపారు. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే వరకు ఈ ప్రభుత్వంను వెంటాడుతామని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...