Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

Andhra Pradesh Men wear sarees for Holi in Kurnool | చీరలు కట్టిన మగాళ్లు.. ఎందుకో తెలిస్తే షాక్ (AP)


TELUGU

Question

Kurnool News: హోలీ రోజు వింత ఆచారం - మహిళల వేషధారణలో పురుషులు, ఎక్కడంటే?

Holi Different Ritual: హోలీ రోజున ఆ గ్రామంలో యువకులు చీర కట్టుకుని ఆడవారి వేషధారణలోకి మారిపోతారు. వారు ఎందుకలా చేస్తారు.? ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందో.. తెలుసా.!

f56e3320af3b71f40b52a77bfe81ad1117113821

Holi Different Ritual in Kurnool District: హోలీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రంగులు చల్లుకోవడం, కాముని దహనం. పండుగ సందర్భంగా చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆద్యంతం సంబరాల్లో మునిగి తేలుతారు. రంగుల నీళ్లు చల్లకుంటూ డ్యాన్సులు చేస్తూ సందడి చేస్తారు. అయితే, ఆ గ్రామంలో యువకులు మాత్రం హోలీ రోజున వింత ఆచారం పాటిస్తారు. చీరలు కట్టుకుని ఆభరణాలు, పువ్వులతో సింగారించుకుని.. ఆడవారి వేషధారణలో మారిపోతారు. వారు ఎందుకలా చేస్తారో తెలియాలంటే ఇది చదవాల్సిందే.

ee1fd3d6f538c9391640b852b09d92d217113823

కర్నూలు (Kurnool) జిల్లా ఆదోని (Adoni) మండలం సంతకుళ్లారు గ్రామం. ఈ గ్రామస్థులు హోలీ రోజున అనాదిగా ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. అదేంటంటే.. హోలీ రోజున పురుషులు మహిళల వేషధారణలోకి మారతారు. చీర కట్టుకుని, పువ్వులు పెట్టుకుని.. ఆభరణాలు సింగారించుకుంటారు. ఆ స్త్రీ వేషధారణతో రతీ మన్మథులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేస్తే తాము కోరిన కోర్కెలు తీరుతాయని వారి నమ్మకం. పెళ్లి కాని అబ్బాయిలు వివాహం కోసం, నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగం కోసం, అనారోగ్య సమస్యలు, కోరిన కోర్కెలు తీరాలంటే ఇలా హోలీ రోజున ఆలయంలో పూజిస్తే అవి నెరవేరుతాయని వారు విశ్వసిస్తారు. తరాతరాల నుంచి తాము ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నట్లు గ్రామస్థులు వెల్లడించారు.

మరో ఆచారం

ఇదే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు తమ ఇలవేల్పు సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడులో జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఈ వేడుకలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే అనారోగ్య సమస్యలు, వివాహం, సంతానం సమస్యలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అదే నమ్మకంతో భక్తులు వారి దవడలు, వీపునకు పొడవాటి ఇనుప కడ్డీలు గుచ్చుకుని భక్తిని చాటుకుంటారు. ఇలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని.. ఇది తమ పెద్దల నుంచి వస్తోన్న ఆనవాయితీ అని పేర్కొంటున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

1 answer to this question

Recommended Posts

  • 0

Kurnool | కర్నూలు జిల్లాలో వింత ఆచారం..! మ‌గాళ్లు మ‌గువ‌ల్లా మారి ఆ దేవుడికి పూజ‌లు

Kurnool | క‌ర్నూల్ జిల్లాలో వింత ఆచారం వెలుగులోకి వ‌చ్చింది. మ‌గాళ్లు మ‌గువ‌ల్లా మారి.. ర‌తి మ‌న్మ‌ధుల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ ఆచారం ఎప్ప‌ట్నుంచో కొన‌సాగుతోంద‌ని స్థానికులు తెలిపారు. ప్ర‌తి ఏడాది హోలీ పండుగ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి వారం రోజుల పాటు ఇలాగే త‌యారై పూజ‌లు నిర్వ‌హిస్తామ‌ని స్థానికులు తెలిపారు.

men-woman_V_jpg--816x480-4g.webp?sw=1728

Kurnool | క‌ర్నూల్ : క‌ర్నూల్ జిల్లాలో వింత ఆచారం వెలుగులోకి వ‌చ్చింది. మ‌గాళ్లు మ‌గువ‌ల్లా మారి.. ర‌తి మ‌న్మ‌ధుల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ ఆచారం ఎప్ప‌ట్నుంచో కొన‌సాగుతోంద‌ని స్థానికులు తెలిపారు. ప్ర‌తి ఏడాది హోలీ పండుగ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి వారం రోజుల పాటు ఇలాగే త‌యారై పూజ‌లు నిర్వ‌హిస్తామ‌ని స్థానికులు తెలిపారు.

కర్నూల్ జిల్లా ఆదోని మండ‌లం సంతేకుళ్లురు గ్రామంలో ర‌తి మ‌న్మ‌ధులు అనే ఆయ‌లం ఉంది. ఇక్క‌డ మ‌గ‌వారు ఆడ‌వారి వేష‌ధార‌ణ‌లో వ‌చ్చి.. ర‌తి మ‌న్మ‌ధుల‌కు పూజ‌లు నిర్వ‌హించి, మొక్కులు తీర్చుకుంటారు. ఇది ఎన్నో ఏండ్ల నుంచి కొన‌సాగుతున్న సంప్ర‌దాయ‌మ‌ని స్థానికులు పేర్కొన్నారు.

men-woman1_V_jpg--816x480-4g.webp?sw=172

ఈ సంద‌ర్భంగా ఓ యువ‌కుడు మాట్లాడుతూ.. సాధార‌ణంగా హోలీ పండుగ వ‌చ్చిందంటే రంగుల‌తో పండుగ‌ జ‌రుపుకుంటారు. కానీ త‌మ గ్రామంలో మ‌గ‌వారు స్త్రీల వేషం వేసుకుని ర‌తి మ‌న్మ‌ధుల‌కు పూజ‌లు నిర్వ‌హించి కోరిక‌లు కోరుతారు. ఈ పూజ‌లు నిర్వ‌హించ‌డం ద్వారా కుటుంబాల‌ను చ‌ల్ల‌గా చూస్తాడ‌ని, వ్యాపారంలో, ఆరోగ్యంలో మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని న‌మ్మ‌కం. గ‌త ఏడు సంవ‌త్స‌రాల నుంచి తాను ఈ వేష‌ధార‌ణ‌లో వ‌చ్చి పూజ‌లు నిర్వ‌హిస్తున్నాను. తన నాన్న ఆరోగ్యం బాగాలేక‌పోతే వైద్యుల‌కు చూపించాం. కానీ మెరుగు ప‌డ‌లేదు. తాత ఆదేశాల మేర‌కు నాన్న ఆడ‌వారి వేష‌ధార‌ణ‌లో వ‌చ్చి పూజ‌లు నిర్వ‌హించిన త‌ర్వాత బాగైంది. ఆ త‌ర్వాత నాన్న ఆదేశంతో తాను కూడా ప్ర‌తి ఏడాది ఒక రోజు ఇలా మ‌గువ‌ల మారి పూజ‌లు నిర్వ‌హిస్తున్నాను. తాను కోరిన కోరిక‌ల‌న్నీ తీర్చుతున్నాడు ఆ దేవుడు. ఈ వారం రోజుల పాటు పూజ‌లు నిర్వ‌హిస్తే ఆ దేవుడు మ‌మ్మ‌ల్ని కాపాడుతాడ‌ని గ్రామ‌స్తుల న‌మ్మ‌కం అని యువ‌కుడు కేదార్‌నాథ్ తెలిపారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...