Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Cyber crimes


Recommended Posts

Posted

Cyber fraud | కస్టమర్‌ కేర్‌ పేరుతో సైబర్‌ మోసం.. అకౌంట్‌లో నుంచి రూ.50 వేలు మాయం

Cyber fraud | ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన కార్డ్‌లెస్‌ మైక్‌లను (Cordless mics) ఎక్సేంజ్‌ చేసుకునే ప్రయత్నంలో ఉన్న వ్యక్తిని సైబర్‌ నేరగాళ్లు బురిడి కొట్టించి (Cyber fraud) డబ్బులు కాజేశారు.

cyber-crimes-1024x576.jpg

బంజారాహిల్స్‌,మార్చి 27 : ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన కార్డ్‌లెస్‌ మైక్‌లను((Cordless mics) )ఎక్సేంజ్‌ చేసుకునే ప్రయత్నంలో ఉన్న వ్యక్తిని సైబర్‌ నేరగాళ్లు బురిడి కొట్టించి(Cyber fraud) డబ్బులు కాజేశారు. ఈ సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 2లోని ఇందిరానగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి సీహెచ్‌.శేఖర్‌ ఇటీవల అమెజాన్‌లో కార్డ్‌ లెస్‌ మైక్‌లుఆర్డర్‌ ఇచ్చాడు.

అయితే అవి సంతృప్తికరంగా పనిచేయకపోవడంతో ఎక్సేంజ్‌ చేసుకోవాలని భావించాడు. దీనికోసం అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తుండగా ఓ వ్యక్తి వాట్సప్‌లో మెసేజ్‌ చేశాడు. తాము పంపించే లింక్‌లో వివరాలను నమోదు చేయాలని, ఆధార్‌ కార్డు, ఏటీఎం కార్డు తదితర వివరాలను నమోదు చేస్తే ఎక్సేంజ్‌ చేస్తారని నమ్మబలికారు.

దీంతో వారు సూచించిన లింక్‌లో వివరాలన్నీ నమోదు చేయగానే బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ.50వేలు మాయమయ్యాయి. దీంతో తాను సైబర్‌ నేరగాళ్ల బారిన పడినట్లు గుర్తించిన బాదితుడు బుధవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

...

Complete article

  • 3 weeks later...
  • Replies 20
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Vijay

    15

  • TELUGU

    6

Posted

Cyber crimes stealing 5 crores a day! ప్రతిరోజూ రూ.5 కోట్లు లూటీ

ప్రజలు ఈజీ మనీకి ఎక్కువగా ఆశపడుతుండటంతో సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త ఎత్తుగడతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక్క తెలంగాణ నుంచే రోజుకు రూ.5 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.1,800 కోట్ల డబ్బును.. కర్ర విరగకుండా, చుక్క రక్తం చిందకుండా దోచేస్తున్నారు. ఈ ఏడాది మూడు నెలల్లో నమోదైన టాప్‌-5 సైబర్‌ నేరాల్లో బిజినెస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌ టాప్‌లో ఉన్నది.

April 12, 2024 / 02:19 AM IST

రాష్ట్రం నుంచే ఏటా రూ.1800 కోట్లు

రోజుకొక ఎత్తుగడతో సైబర్‌ నేరాలు

ఫ్రాడ్స్‌లో బిజినెస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ టాప్‌

ప్రజలు ఈజీ మనీకి అలవాటు పడొద్దు

సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో సూచన

cyber_V_jpg--816x480-4g.webp?sw=1728&dsz

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (నమస్తే తెలంగాణ): ప్రజలు ఈజీ మనీకి ఎక్కువగా ఆశపడుతుండటంతో సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త ఎత్తుగడతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక్క తెలంగాణ నుంచే రోజుకు రూ.5 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.1,800 కోట్ల డబ్బును.. కర్ర విరగకుండా, చుక్క రక్తం చిందకుండా దోచేస్తున్నారు. ఈ ఏడాది మూడు నెలల్లో నమోదైన టాప్‌-5 సైబర్‌ నేరాల్లో బిజినెస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌ టాప్‌లో ఉన్నది.

ప్రస్తుతం బెట్టింగ్‌లకు వ్యసనరులైన వారిని గుర్తించి.. వారికి ఈజీమనీని పరిచయం చేసి, అక్కడ బిజినెస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వైపు మళ్లిస్తున్నట్టు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. రూ.వెయ్యి నుంచి పెట్టుబడి పెట్టించి రూ. లక్షలు, కోట్లలో మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. తర్వాతి స్థానాల్లో ఓటీపీ ఫ్రాడ్స్‌, అడ్వైర్టెజ్‌మెంట్‌ ఫ్రాడ్స్‌ (ఓఎల్‌ఎక్స్‌), ఫెడ్‌ఎక్స్‌ కొరియర్‌ సర్వీసెస్‌, సెక్స్‌టార్షన్‌ వంటివి టాప్‌-5 నేరాల్లో ఉన్నట్టు వెల్లడించారు. గతంలో విపరీతంగా పెరిగిన సెక్స్‌టార్షన్‌ మోసాలు.. ప్రస్తుతం తెలంగాణలో తగ్గుముఖం పట్టినట్టు తెలిపారు. సాంకేతిక వినియోగం అధికంగా ఉన్న తెలంగాణలోనే ఈ తరహా భారీ లూటీ జరుగుతుండటం ఆందోళనకరమని, పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి ప్రధాన కారణం ప్రజల్లో సైబర్‌ నేరాలపై అవగాహన లేకపోవడమేనని తెలిపారు. ఈజీ మనీ వైపు అడుగులు వేయొద్దని సూచించారు.

...

Complete article

  • 3 weeks later...
Posted

Cyber crook cheats software job aspirant from Siddipet to tune of Rs. 16.75 lakh

The accused Sanduru Aravind Reddy (27), of Malla Samudram in Chittor district of Andhra Pradesh, had lured her by offering a job in Cognizent from the back door after accessing her contact details

Cyber-Crook_V_jpg--816x480-4g.webp?sw=17

Siddipet: A cyber fraudster cheated a woman,  aspiring to get into a software job, from Siddipet by demanding and receiving Rs 16.75 lakhs from her over a period of time.

The victim had uploaded her profile on an employment site. The accused Sanduru Aravind Reddy (27), a resident of Malla Samudram in Peddapanajani mandal of Chittor district of Andhra Pradesh, had lured her by offering a job in Cognizent from the back door after accessing her contact details

Trusting him, the victim, whose name the Police have not disclosed, has sent Rs 16.75 lakhs to his phone number over Google Pay.

When she tried to call him, he could not be reached and the phone number remained switched off then after. Then, the victim has filed a complaint by calling to 1930. Cybercrime ACP Srinivas and Inspector Shekar had investigated the case and traced the accused by using modern technology.

He has been remanded. ACP Srinivas has urged people not to fall prey to such fraudsters.

...

Complete article

  • The title was changed to Cyber crimes
  • 6 months later...
Posted

Cyber Crime: Retired employee falls victim to cyber criminals and loses 38 lakhs - మాయాగాళ్ల వలలో చిక్కి లక్షల రూపాయలు సమర్పించకున్న రిటైర్డ్ ఉద్యోగి..!

74 ఏళ్ల రిటైర్డ్ మహిళను స్కామర్లు వాట్సాప్ ద్వారా టార్గెట్ చేశారు. ఆమెకు అంధేరీ పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తున్నట్లు నమ్మబలికారు.

 
Cyber Crime: మాయాగాళ్ల వలలో చిక్కి లక్షల రూపాయలు సమర్పించకున్న రిటైర్డ్ ఉద్యోగి..!

‘డిజిటల్ అరెస్టు’ ముప్పు నుండి అప్రమత్తంగా ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలను హెచ్చరించారు. మోసపూరిత యాప్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతూ.. అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ‘ఫేస్‌బుక్’, ‘ఇన్‌స్టాగ్రామ్’, ‘వాట్సాప్’, టెలిగ్రామ్ వంటి సామాజిక వేదికల ద్వారా నిర్వహిస్తున్నారు. పిగ్ బచ్చరింగ్ స్కామ్‌లుగా ప్రసిద్ధి చెందిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, నకిలీ వెబ్‌సైట్‌లు, వాట్సాప్ గ్రూపులను అధిక లాభాల ఆశజూపి ప్రజలను ఆకర్షిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఈ మాయాగాళ్ల వలలో చిక్కి లక్షల రూపాయలు సమర్పించకున్నారు.

74 ఏళ్ల రిటైర్డ్ మహిళను స్కామర్లు వాట్సాప్ ద్వారా టార్గెట్ చేశారు. ఆమెకు అంధేరీ పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తున్నట్లు నమ్మబలికారు. ఆమె పేరుపై FIR క్రైమ్ నెంబర్ MH-1045/0924 నమోదైందని తెలిపారు. ఆమె మొబైల్ నంబర్‌కు వరుసగా మెసెజ్‌లు పంపారు. CBI, RBI నుండి నకిలీ లేఖలు పంపించి, మనీల్యాండరింగ్ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ఆమెతోపాటు నరేష్ గోయల్, జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ పై విదేశీ మారకం ఉల్లంఘనలపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని నమ్మబలికారు కేటుగాళ్లు.

ఈ క్రమంలోనే ఆమె బ్యాంక్ వివరాలు వెల్లడించమని డిమాండ్ చేశారు. లేదంటే ఆమె ఖాతాలు మూసివేస్తామని, అరెస్ట్ చేయాల్సి ఉంటుందని బెదిరించారు. అరెస్ట్ కాకుండా ఉండాలంటే, ఆమెను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన నిధులను డిపాజిట్ చేయమని సూచించారు. స్కామర్లు తమను ఒక రహాస్య ఏజెన్సీగా చూపించి, మాట్లాడుతున్న విషయం బయటపెట్టవద్దని ఆదేశించారు. ఇందుకోసం కేటుగాళ్లు చూపించిన ఖాతాలోకి డబ్బులు బదిలీ చేశారు. ఒత్తిడిలో ఆమె తన ఫిక్స్‌డ్ డిపాజిట్ ను ఉపసంహరించి, రూ. 37.90 లక్షలను స్కామర్ ఖాతాలో RTGS ద్వారా డిపాజిట్ చేశారు. అనంతరం తాను మోసపోయానని గ్రహించి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ అరెస్టులు, సైబర్ క్రైమ్స్‌పై హైలెవెల్ కమిటీ వేసింది. ఒక్కో క్రైమ్‌ని కచ్చితంగా ఛేదించేలా ఆదేశాలిచ్చింది. కేవలం డిజిటల్‌ అరెస్టుల రూపంలోనే కాదు.. డిజిటల్‌ ట్రేడింగ్, డేటింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేరు చెప్పి కోట్లకు కోట్లు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరేం అడిగినా సమాచారం ఇవ్వొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్, పాన్, ఏటీఎం, క్రెడిట్‌ కార్డ్‌ డిటైల్స్‌తో పాటు ఓటీపీలు చెప్పొద్దంటున్నారు. మెసేజ్‌లు, వాట్సాప్‌లలో వచ్చే లింక్‌లను క్లిక్‌ చేయడం, తెలియని యాప్స్‌ డౌన్‌లోడ్ చేసుకోవడం చేయొద్దని కోరుతున్నారు. ఒకవేళ మోసపోతే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైబర్‌ క్రైమ్‌ 1930కి కంప్లైంట్ చేస్తే పోయిన డబ్బు రాబట్టుకోవచ్చు. సో, ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని చట్టాలు చేసినా.. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మాత్రం చేయగలిగిందేం లేదు.

Posted

Cyber Crime: Cyber criminals scam 2 crores - రూ. 10 వేలు ఆశచూపి, రూ. 2 కోట్లు కొట్టేశారు.. నిండా మునిగిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సైబర్ మోసం బారిన పడి ఏకంగా రూ. 2.29 కోట్లను కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. బాచుపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(51)కి ఫోన్‌ నంబరును గుర్తుతెలియని వ్యక్తులు జులై 10న ‘కేఎస్‌ఎల్‌ అఫీషియల్‌ స్టాక్‌’ పేరుతో ఉన్న వాట్సప్‌ గ్రూపులో యాడ్‌ చేశారు...

 
Cyber Crime: రూ. 10 వేలు ఆశచూపి, రూ. 2 కోట్లు కొట్టేశారు.. నిండా మునిగిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

మన అత్యాశను ఆసరాగా చేసుకొని రెచ్చిపోతున్నారు సైబర్‌ నేరస్థులు. మారిన టెక్నాలజీతోపాటు నేరాల శైలి కూడా మారుతోంది. ప్రజలను నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు కేటుగాళ్లు. అయితే ఈ సైబర్‌ నేరాల బారిన ఏదో చదువుకోని వారు, టెక్నాలజీపై అవగాహనలేని వారు మాత్రమే పడుతున్నారనకుంటే పొరబడినట్లే టెక్నాలజీపై ఎంతో పట్టు ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా ఈ మోసాల బారిన పడుతుండడం గమనార్హం.

తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సైబర్ మోసం బారిన పడి ఏకంగా రూ. 2.29 కోట్లను కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. బాచుపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(51)కి ఫోన్‌ నంబరును గుర్తుతెలియని వ్యక్తులు జులై 10న ‘కేఎస్‌ఎల్‌ అఫీషియల్‌ స్టాక్‌’ పేరుతో ఉన్న వాట్సప్‌ గ్రూపులో యాడ్‌ చేశారు.

ఈ క్రమంలోనే నారాయణ జిందాల్‌ అనే వ్యక్తి కోటక్‌ సెక్యూరిటీస్‌లో చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారని, షేర్ల క్రయవిక్రయాలపై మెలకువలు నేర్పిస్తుంటారని.. గ్రూపులోని సభ్యులు తరచూ చాటింగ్‌ చేసేవారు. అక్టోబరు 2 నుంచి కోటక్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ స్ట్రాటజీ ప్లాన్‌ ప్రారంభిస్తున్నానంటూ నారాయణ జిందాల్‌ పేరుతో ఒక వ్యక్తి పోస్టు చేశారు. ఇందులో చేరాలంటే కోటక్‌ ప్రో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, వీఐపీ ట్రేడింగ్‌ ప్లాన్‌లో చేరితే లాభాలు వస్తాయని చెప్పి నమ్మించారు.

ఇక ఇందులో చేరినందుకు తాము భారీగా లాభాలు పొందినట్లు గ్రూపు సభ్యుల పేరుతో మెసేజ్‌లు చేస్తూ వచ్చారు. దీంతో ఇదంతా నిజమేనని నమ్మిన సదరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. అందులోని కస్టమర్‌ కేర్‌ ప్రతినిధి సూచనల ప్రకారం డబ్బులు పంపడం ప్రారంభించాడు. మొదటిసారి రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టినందుకు 10 శాతం లాభం వచ్చినట్లు యాప్‌లో చూపించారు. దీంతో లాభాలు వస్తున్నాయి కదా అంటూ.. డబ్బులు పెడుతూ వెళ్లాడు. ఇలా పలు దఫాల్లో ఏకంగా పలు షేర్లు కేటాయిస్తున్నామని రూ. 2.29 కోట్లు బదిలీ చేయించుకున్నారు.

అయితే ఈ మొత్తంలో కేవలం రూ. 10వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇచ్చారు. రూ. 2.29 కోట్ల పెట్టుబడికి రూ. 1.10 కోట్ల లభం వచ్చిందంటూ చూపించారు. మొత్తం రూ. 3.29 కోట్లు విత్‌డ్రా చేయాలంటే మరో రూ.40 లక్షలు కట్టాలని చెప్పారు. డబ్బు మొత్తం విత్‌డ్రా చేసుకోవాలంటే రకరకాల నిబంధనలు చెప్పడంతో అనుమానం వచ్చింది. దీంతో మోసపోయోనన్న విషయం అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Posted

Telangana News: Cyber criminals use new traps to scam innocent people - సైబర్ నేరస్తుల సరికొత్త ట్రాప్..నమ్మితే పెడతారు టోపీ..జర జాగ్రత్త లేకుంటే మీరు ఇలానే..

సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త మోసంతో ప్రజలకు బురిడి కొట్టిస్తున్నారు. అత్యసర పరిస్థితుల్లో ఉన్నామని తమ బ్యాంకు ఖాతా లేదా ఫోన్‌ పని చేయడం లేదని డబ్బు పంపాలంటూ వంచిస్తున్నారు. నమ్మకం కుదరకపోతే ఇంకో మిత్రుడి ఖాతా నుంచి డబ్బు బదిలీ చేస్తున్నామంటూ అచ్చం బ్యాంకుల తరహాలోనే డమ్మీ సందేశాలు పంపిస్తున్నారు

 
Telangana News: సైబర్ నేరస్తుల సరికొత్త ట్రాప్..నమ్మితే పెడతారు టోపీ..జర జాగ్రత్త లేకుంటే మీరు ఇలానే..

జనం డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్‌ నేరగాళ్లు మరో కొత్త మోసంతో ముందుకొస్తున్నారు. బ్యాంకుల తరహాలో డబ్బు జమ చేసినట్లు డమ్మీ సందేశాలు పంపిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. అత్యసర పరిస్థితుల్లో ఉన్నామని తమ బ్యాంకు ఖాతా లేదా ఫోన్‌ పని చేయడం లేదని డబ్బు పంపాలంటూ వంచిస్తున్నారు. నమ్మకం కుదరకపోతే ఇంకో మిత్రుడి ఖాతా నుంచి డబ్బు బదిలీ చేస్తున్నామంటూ అచ్చం బ్యాంకుల తరహాలోనే డమ్మీ సందేశాలు పంపిస్తున్నారు. ఈ నకిలీ సందేశాలు చూసి డబ్బు నిజంగానే వచ్చిందని భావిస్తున్న కొందరు అవతలి వ్యక్తులు చెప్పిన ఖాతాకు తిరిగి పంపించి మోసపోతున్నారు. డబ్బులు పంపే ముందు తనిఖీ చేసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లికి చెందిన ప్రైవేటు ఉద్యోగికి ఇటీవల ఒకరు ఫోన్‌ చేసి కంపెనీలో సహోద్యోగినని తన వాళ్లు ఆసుపత్రిలో ఉన్నారని పరిచయం చేసుకున్నాడు. ఫోన్‌ సాంకేతిక సమస్యతో ఆసుపత్రి బిల్లు చెల్లించడం ఇబ్బంది అవుతోందని, కొంత డబ్బు కావాలని అడిగాడు. బదులుగా తన మిత్రుడు ఫోన్‌పే, గూగుల్‌పేకి డబ్బు పంపిస్తాడని చెప్పి 9 విడతల్లో రూ.3.74 లక్షలు బదిలీ చేయించాడు. డబ్బు ఖాతాలో జమ అయినట్లు సందేశాలు రావడంతో ప్రైవేటు ఉద్యోగి నిజమేనని మొత్తం రూ.3.74 లక్షలు తిరిగి పంపాడు. మరుసటిరోజు బ్యాంకు ఖాతాను తనిఖీ చేయగా రూ.3.74 లక్షలు జమవ్వలేదు. ఇదేంటని ఆరా తీయగా సందేశాలు నకిలీ అని.. అవతలి వ్యక్తి మోసం చేసినట్లు తేలింది. ఇలా సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క అవాకాశాన్ని వదలడం లేదు. ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా.. అందిన కాడికి దోచేస్తున్నారు. ఇటీవల హైదరబాద్ నగరంలో ఈ తరహా కేసులు పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బాధితులు కనీసం డబ్బు ఖాతాలో జమ చేసిందో లేదో కూడా చూసుకోవడం లేదని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేస్తే నమ్మొద్దని వారు హెచ్చరిస్తున్నారు.

Posted

Cyber Scam: Pensioners in danger - డేంజర్‌లో పింఛన్ దారులు.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కామ్..

పింఛన్ తీసుకునే వారందరూ ఏడాదికోసారి జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాలి. లేకపోతే వారికి ప్రతి నెలా వచ్చే పింఛన్ ఆగిపోతుంది. ప్రతి ఏటా నవంబర్ లో వీటిని అందజేయాలి. స్కామర్లు ఈ విషయాన్నిగుర్తించి, మోసాలకు పాల్పడుతున్నారు. పింఛనర్ల వాట్సాప్ నంబర్లకు నకిలీ సందేశాలు పంపిస్తున్నారు.

 
Cyber Scam: డేంజర్‌లో పింఛన్ దారులు.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కామ్..

అన్ని రంగాల్లో టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగింది. వివిధ రకాల పనులు చాలా సులువుగా జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరక్కుండానే పనులు చేసుకునే అవకాశం లభించింది. ఇదే సమయంలో సైబర్ స్కాములు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజల అవసరాలను అలుసుగా తీసుకుని వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా పింఛన్ దారులను లక్ష్యంగా చేరుకుని కొత్త స్కాముకు తెరతీశారు. జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాలంటూ వాట్సాప్ లో నకిలీ మెసేజ్ లు పంపుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. అప్రమత్తంగా ఉండాలని పింఛన్ లబ్ధిదారులకు సూచిందింది.

జీవన్ ప్రమాణ్ పత్రం అంటే..

పింఛన్ తీసుకునే వారందరూ ఏడాదికోసారి జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాలి. లేకపోతే వారికి ప్రతి నెలా వచ్చే పింఛన్ ఆగిపోతుంది. ప్రతి ఏటా నవంబర్ లో వీటిని అందజేయాలి. స్కామర్లు ఈ విషయాన్నిగుర్తించి, మోసాలకు పాల్పడుతున్నారు. పింఛనర్ల వాట్సాప్ నంబర్లకు నకిలీ సందేశాలు పంపిస్తున్నారు. జీవన్ ప్రమాణ్ పత్రం అప్ డేట్ చేసుకోవాలని లింక్ లను పంపి, వారి వ్యక్తిగత సమాచారం చోరీ చేస్తున్నారు. లింక్ లో కోరిన సమాచారం ఇవ్వకపోతే పింఛన్ ఆగిపోతుందని భయపెడుతున్నారు.

మోసం జరిగే తీరు..

  • ముందుగా పింఛన్ దారుల వాట్సాప్ నంబర్ కు మోసగాళ్లు నకిలీ మెసేజ్ పంపిస్తారు. తాము ప్రభుత్వ అధికారులమని పరిచయం చేసుకుంటారు.
  • పింఛన్ దారుల జీవన్ ప్రమాణ్ పత్రం కాల వ్యవధి పూర్తి కానుండడంతో కొత్తది సమర్పించాలని అడుగుతారు. లేకపోతే పింఛన్ రాదని భయపెడతారు.
  • ఒక లింక్ ను పంపి, దానిలో కోరిన వివరాలు నమోదు చేయాలని అడుగుతారు. దానిలోని పీపీవో నంబర్, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలను నింపాలని ఆదేశిస్తారు.
  • ఆ వివరాలన్నీ నమోదు చేస్తే మీ ఖాతాను హాక్ అవుతుంది. మీ డబ్బులను తస్కరిస్తారు.

జాగ్రత్త అవసరం..

  • ఇలాంటి మోసాలపై పింఛన్ లబ్ధిదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. జీవన్ ప్రమాణ్ పత్రాలను వాట్సాప్ ద్వారా సమర్పించే అవకాశం ఉండదు. అలా పంపించాలని అధికారులెవ్వరూ అడగరు.
  • జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాలంటూ వాట్సాప్ లో సందేశాలు వస్తే నమ్మకూడదు. లింక్ లను అస్సలు క్లిక్ చేయకూడదు.
  • వాట్సాప్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, పీపీవో నంబర్, వ్యక్తిగత సమాచారం పంపకూడదు.
  • కేవలం అధికార వెబ్ సైట్ లను మాత్రమే సందర్శించాలి. ముఖ్యంగా మీ బ్యాంకును సంప్రదించాలి. లేకపోతే అధికారిక సీపీఏవో వెబ్ సైట్ ను మాత్రమే సందర్శించాలి.
  • ఇలాంటి మెసేజ్ లు వస్తే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ)కి ఫార్మార్డ్ చేయాలి. లేకపోతే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి.
Posted

Cyber criminals pose as Mumbai Crime Branch police and scam 72 lakhs - ‘మేం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం..’ అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే రూ.72లక్షలు హాంఫట్..!

'పేలుడు జరిగిన ప్రాంతంలో మీ ఏటీఎం కార్డు ఉంది. మర్యాదగా ఒప్పుకో.. లేకపోతే అరెస్టు చేస్తాం' అంటూ బెదిరించారు. అదేవిధంగా కేసు నుంచి బయట పడాలంటే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతా పంపాలన్నారు.

 
'మేం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం..' అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే రూ.72లక్షలు హాంఫట్..!

క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు. ఏకంగా రూ. 72 లక్షలు స్వాహా చేశారు కేటుగాళ్లు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో ఓ రైల్వే ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు కుచ్చు టోపీ పెట్టారు. బ్యాంకు ఖాతాలో నుంచి ఏకంగా రూ. 72 లక్షలు స్వాహా చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

అనంతపురం జిల్లా గుత్తిలోని చంద్రప్రియ నగర్ కు చెందిన రైల్వే ఉద్యోగికి నాలుగు రోజుల క్రితం ఫోన్ వచ్చింది. ‘మేం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం… ఇటీవల ముంబైలో జరిగిన బాంబు పేలుళ్ళలో నువ్వెందుకు ఉన్నావు’ అంటూ అవతలి వైపు నుంచి గద్గద స్వరంతో రైల్వే ఉద్యోగికి వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ బ్యాక్ గ్రౌండ్ లో అచ్చం ఒక క్రైమ్ బ్రాంచ్ ఆఫీసు ఎలా ఉంటుందో.. అలాగే వీడియో కాల్ లో హడావుడి సృష్టించారు. దీంతో భయపడిన ఆ రైల్వే ఉద్యోగి తాను ముంబైకే వెళ్ల లేదని చెప్పగా సైబర్ నేరగాళ్లు రైల్వే ఉద్యోగిని దబాయించారు.

అంతటితో ఆగని కేటుగాళ్లు, ‘పేలుడు జరిగిన ప్రాంతంలో మీ ఏటీఎం కార్డు ఉంది. మర్యాదగా ఒప్పుకో.. లేకపోతే అరెస్టు చేస్తాం’ అంటూ బెదిరించారు. అదేవిధంగా కేసు నుంచి బయట పడాలంటే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతా పంపాలన్నారు. దీంతో ఆ రైల్వే ఉద్యోగి మొదట రూ.12 లక్షలు, ఆ తర్వాత రూ. 60 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు అకౌంట్ కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆఖరికి ఫిక్సిడ్ డిపాజిట్ లో ఉన్న రూ. 22 లక్షల రూపాయలను డబ్బును.., ఎఫ్డీలు రద్దు చేసుకుని సైబర్ మోసగాళ్లకు సమర్పించుకున్నాడు.

అయితే, నాలుగు రోజుల నుంచి ముభావంగా ఉన్న రైల్వే ఉద్యోగి మహ్మమద్ వలీని సహచరులు ఏమైందని ప్రశ్నించగా, జరిగిన విషయం అంతా చెప్పారు. స్నేహితుల సూచన మేరకు బాధితుడు గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆరా తీస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఫోన్ నంబర్లలో ఒకటి జమ్మూ కశ్మీర్ నుంచి, మరొకటి కోల్‌కతా నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు రైల్వే ఉద్యోగి మహమ్మద్ వలి పోలీసులను ఆశ్రయించడం ఆలస్యం అవ్వడంతో.. 72 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం గుత్తి పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం వేట మొదలుపెట్టారు.

Posted

Hyderabad: This is the peak of Cyber Crimes 8 crores scammed - సైబర్‌ నేరాల్లో ఇది పరాకాష్ట.. రూ. 8 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగపోతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని రకాల చర్యలు చేపట్టినా నేరస్థులు మాత్రం ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తి సైబర్ దాడిలో ఏకంగా రూ. 8 కోట్లు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ అంశం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. షేర్ మార్కెట్ పేరుతో జరిగిన ఈ మోసానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Hyderabad: సైబర్‌ నేరాల్లో ఇది పరాకాష్ట.. రూ. 8 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..

షేర్లలో పెట్టుబడులు పేరిట సైబర్ నేరస్థుల మోసాలు కొనసాగుతూ ఉన్నాయి హైదరాబాద్ బంజరాహిల్సకు చెందిన ఇంజనీరింగ్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ నుంచి ఏకంగా 8 కోట్ల రూపాయలను కాజేశారు సైబర్ నేరస్తులు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో లో ఈ కేసు నమోదు అయింది మిలానీ లయన్స్ ఎస్సై జి అని గ్రూప్ నిర్వాహకుల పేరిట బాధితుడికి సెల్ఫోన్కు జూలై మొదటి వారిలో ఒక లింకు వచ్చింది ఓపెన్ చేసి ఎస్ఐజి ట్రెండింగ్ అని వాట్సప్ గ్రూప్ లో చేరారు.

తొలత షేర్ మార్కెట్ బ్లాక్ రేట్ ఐపిఓల గురించి నిర్వాహకులు కీలక సమాచారం అందించారు 20 రోజుల తర్వాత ఎరిక్ రాబర్ట్ సన్ అతడి సహకరాలు మిలానీ లయన్ సిఫార్సుతో బాధితుడిని ఆర్కే గ్లోబల్ యాప్ లో బాధితుడని చేర్పించారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టించడం ప్రారంభించారు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ద్వారా ఐపివోలు దగ్గర చేస్తామని దాంతో భారీగా లాభాలు వస్తాయని ఆశపెట్టారు.

బాధితుడు అందుకు అంగీకరించడంతో కొన్ని బ్యాంకు ఖాతాల నెంబర్లను సూచించి వాటిలోకి ఆన్‌లైన్‌లోనే నగదు బదిలీ చేయాలని సూచించారు అలా ఆర్కే గ్లోబల్ యాప్ ద్వారా జూలై 16 నుంచి నగదు బదిలీ ప్రారంభించారు ఇలా పెట్టిన పెట్టుబడికి కోట్లల్లో లాభాలు వచ్చినట్లు డీమార్ట్ ఖాతాలో కనిపించేవి జులై 22న 2000 ఉప సంహరించుకోవాలనుకోవడంతో బాధితులలో నమ్మకం ఏర్పడింది. దీంతో పలు విడతలుగా బాధితులు సొమ్ము బదిలీ చేశారు సెప్టెంబర్ 19 కొంత డబ్బులు డ్రా చేసుకున్నాడు. అయితే యాప్‌లో కనిపించిన మొత్తం డబ్బు మాత్రం ఖాతాలోకి జమ కాలేదు.

అయితే ఆ సమయానికి లాభాలతో కలిపి ఖాతాలో 37.5 కోట్ల కనిపిస్తోంది నగదు డ్రా కోసం ఆ మొత్తం పై రెండు శాతం చెల్లించాలని మళ్లీ మోసం చేశారు. దీంతో సుమారు రూ. 75 లక్షల చెల్లించాడు. అనంతరం సెబీ తనిఖీల పేరిట మరో రెండు కోట్ల జమ చేయాలని సూచించారు అంత చెల్లించలేనని బాధితుడు చెప్పడంతో 1.25 కోట్లు రుణంగా ఇస్తామంటూ.. నమ్మబలికారు. మిగిలిన రూ. 75 లక్షలను బాధితుడితో జమ చేయించుకున్నారు. అలా ఆయన నుంచి 8.15 కోట్ల రూపాయలను కాజేశారు.

Posted

Cyber Crimes: వందలే కదా అని మీరు వదిలేస్తుంటే.. వాళ్లు వేల కోట్లు వెనకేసుకుంటున్నారు

ఇప్పటి వరకు మొత్తం 17 కోట్ల 13 లక్షల ఫిర్యాదులు పోలీసులకు అందగా అందులో 85 శాతం అంటే సుమారు 14.5 కోట్ల ఫిర్యాదులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే.

 
వందలే కదా అని మీరు వదిలేస్తుంటే.. వాళ్లు వేల కోట్లు వెనకేసుకుంటున్నారు

మే 22, 2024 బెంగళూరులోని ఈస్ట్ రామమూర్తినగర్ బాధితురాలు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఫెడ్ ఎక్స్ కొరియర్ స్కామ్‌కి కోటి రూపాయల నష్టం. కొరియర్ వచ్చిందంటూ ఫెడ్ ఎక్స్ తరపున ఫోన్ చేస్తున్నామంటూ ఆమెకు ఓ కాల్ వచ్చింది. ఆ పేరున తైవాన్ వెళ్లాల్సిన ఓ కొరియర్‌ను ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు సీజ్ చేశారని చెప్పారు. అక్కడితో ఆగితో ఈ కథలో పెద్ద కిక్కు లేదు. ఆ పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని బెదిరించారు. అక్కడ నుంచి కథ కస్టమ్స్‌కి మారింది. తాము కస్టమ్స్ అధికారులమంటూ మరి కొందరు ఫోన్‌లో బెదిరించడం మొదలు పెట్టారు. పార్శిల్‌లో డ్రగ్స్‌తో పాటు పాస్ట్ పోర్టులు, ఇతర వస్తువులు ఉన్నాయని, ఆల్రెడీ విచారణ మొదలైందంటూ భయపెట్టారు. అక్కడితో ఆగలేదు. మరొకరు ఫోన్ చేసి నార్కోటిక్స్ కేసులో ఆమె పాత్ర ఉందంటూ బెదిరింపులకు దిగాడు. ఆన్ లైన్లో ఇంటరాగేషన్ పేరుతో భయపెట్టారు. కేసు నుంచి బయటపడాలంటే వెరిఫికేషన్‌కు సపోర్ట్ చెయ్యాలని, అందుకోసం ఆర్బీఐకి కొంత డబ్బు పంపాలని, వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తిరిగి అకౌంట్లోకి వచ్చేస్తాయని చెప్పి విడతల వారీగా కోటీ రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అంతే సడన్‌గా కాల్ కట్టయ్యింది. విచారణ పూర్తయ్యింది. అక్కడితో వారి క్రైం కథా చిత్రం కూడా పూర్తయ్యింది. ఇంత జరిగిన తర్వాత కోటి రూపాయలు ఇచ్చేసిన తర్వాత కానీ ఆమెకు తాను మోసపోయానన్న సంగతి తెలియలేదు. ఆ తర్వాత లబో దిబో మంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది.

బెంగళూరు వరకు ఎందుకు…? కొద్ది రోజుల క్రితం వైజాగ్‌లోనూ ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. మీకు లాటరీ తగిలిందనగానే లింక్ క్లిక్ చేశారు.లాటరీ మాట దేవుడెరుగు.. ఖాతాలో ఉన్న కాస్త డబ్బులు కూడా కనిపించకుండా పోయాయి.

01

మొత్తంగా వైజాగ్, బెంగళూరు అనే కాదు… దేశ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 5 సైబర్ కంప్లైంట్లు నమోదవుతున్నాయి. అంటే రోజూ నమోదవుతున్న సైబర్ క్రైం ఫిర్యాదుల సంఖ్య అక్షరాల ఏడు వేలు. ఇప్పటి వరకు మొత్తం 17 కోట్ల 13 లక్షల ఫిర్యాదులు పోలీసులకు అందగా అందులో 85 శాతం అంటే సుమారు 14.5 కోట్ల ఫిర్యాదులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే.

తాజాగా నేషనల్ సైబర్ క్రైం రిపోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతి రోజూ సుమారు ప్రజల నుంచి సైబర్ క్రైమ్స్‌కు సంబంధించి 67 వేల ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఒక్క 2024 తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా 1700 కోట్ల రూపాయల సైబర్ క్రైం మోసాలు దేశంలో జరిగాయి. సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీస్ లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా ఏటా 70 వేల కోట్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయట. అయితే ఈ నేరాల విలువ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో లెక్క చెబుతున్నప్పటికీ… జరుగుతున్న నేరాల సంఖ్య విషయంలో మాత్రం పెద్దగా తేడాలు ఉండటం లేదు.

02

నిజానికి గతంలో సైబర్ నేరాల వల్ల ఏటా దేశంలో జరిగే నష్టం సుమారు 10 వేల కోట్లు ఉండేదని సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీస్ చెబుతున్నాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నప్పటికీ దాని విలువ విషయంలో భిన్నాభిప్రాయాలుండటానికి ప్రధాన కారణం ఈ సెబర్ నేరాల్లో చాలా వరకు చిన్న మొత్తాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఫిర్యాదులు ఇచ్చే వారి సంఖ్య పెద్దగా ఉండటం లేదు. లా ఎన్ ఫోర్స్‌మెంట్ దృష్టిలో పడకుండా ఉండేందుకు స్కామర్స్ చిన్న చిన్న మొత్తాలపైనే ఎక్కువ స్థాయిలో దృష్టి పెడుతున్నారు. ఫలితంగా ఆ మోసాల గురించి ఎవరో ఫిర్యాదు చేస్తే తప్ప నేరుగా చట్టం చేతికి చిక్కడం లేదు.

03

ఎక్కువగా ఈ స్కామ్‌లు మియన్మార్, లావోస్, కాంబోడియా, చైనా దేశాల బేస్‌గా జరుగుతున్నాయి. ఇండియాలో కొందర్ని అపాయింట్ చేసుకొని వారిని ఎరలుగా వాడుకుంటున్నారు. ఇలాంటి స్కామ్స్‌కి మన దేశంలో బీహార్‌లోని నలంద జిల్లా చాలా ఫేమస్. అలాగే గడిచిన 8 ఏళ్లుగా జవా కటియా అనే గ్రామం కూడా సైబర్ క్రైం సెంటర్‌గా పేరుంది. ఇలా దొంగలించే సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చేస్తున్నారు. ఫలితంగా వాటిని ట్రాక్ చెయ్యడం కూడా సాధ్యం కావడం లేదు.

సైబర్ క్రైం ఎన్నిరకాలు ?

కొరియర్ స్కామ్‌లు: దేశంలో ఇప్పుడు ఫెడ్ ఎక్స్ కొరియర్ స్కామ్ చాలా ఫేమస్. దాదాపు ప్రతి ఒక్కరికీ ఈ కాల్స్ రోజూ ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటాయి. ఇందులో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మీపై డ్రగ్స్, నార్కోటిక్స్ అభియోగాలు ఉన్నాయని.. ఇలా ఏదో ఒక పేరుతో బెదిరించి డబ్బులు గుంజేస్తుంటారు. ఈ కథనం ప్రారంభంలో ప్రస్తావించిన బెంగళూరు యువతి ఘటన అందుకు ఉదాహరణ.

జాబ్ స్కామ్స్: భారీ జీతాలతో ఉద్యోగాలిస్తామని, అందుకు ముందుగా కొంత ఫీ చెల్లిస్తే చాలంటూ వచ్చే కాల్స్ ఈ తరహావి. వారు చెప్పే భారీ జీతానికి ఆశపడి ఫీజు చెల్లించారో మీ పని అయిపోయినట్టే.

ఇన్వెస్టిమెంట్ స్కామ్స్: ఇందులో బాధితుల్ని సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం పెంచుకుంటారు. ఆ తర్వాత ఓ నకిలీ స్కీమ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే మిమ్మల్ని ఒప్పిస్తారు. ఇలాంటివి సాధారణంగా క్రిప్టో మోసాలు క్యాటగిరిలో ఉంటాయి.

తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించేద్దాం.. అని ఇంటర్నెట్‌లో ఈ తరహా వెతికే వారు ఈజీగా ఇలాంటి మోసగాళ్ల వలలో చిక్కుకుంటారు. వాళ్ల డేటాను సేకరించి వాళ్లనే టార్గెట్‌గా చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అలాగే వీళ్లు ఎప్పుడూ ఒకే లోకేషన్‌లో ఉండరు. అలాగే నలుగురుగైదురు ఈ ఆపరేషన్‌లో భాగంగా ఉంటూ ఉంటారు కూడా. పని పూర్తయ్యాక.. వాళ్ల ఆచూకీ, ఆనవాళ్లు కూడా కనిపించకుండా చేస్తారు. నిజానికి ఇలాంటి విషయాల్లో ఫిర్యాదులిచ్చినా చాలా వరకు దాని ఎంక్వైరీకి అయ్యే ఖర్చుతో పోల్చితే బాధితుడికి జరిగే నష్టం అతి తక్కువ కావడంతో చిన్న చిన్న మొత్తాల విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తుంటుంది. అలాగే చిన్న మొత్తంలో నష్టపోయినప్పుడు బాధితులు కూడా దాని కోసం ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ, పోలీసుల చుట్టూ ఎవడు తిరుగుతాడులే అని వదిలేస్తున్నారు కూడా. కానీ ఈ చిన్న చిన్న మొత్తాలే వందల, వేల కోట్ల ఆదాయంగా మారుతోంది ఈ తరహా స్కామర్లకు.

signal-2024-09-12-133300-006.jpeg

పదో స్థానంలో ఇండియా

ప్రపంచంలో సైబర్ క్రైం నేరాల బారిన పడుతున్న దేశాలలో ఇండియా పదో స్థానంలో ఉంది. దీంతో ఈ తరహా మోసాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెడుతోంది. తాజాగా కేంద్ర హోంమంత్రి లాంచ్ చేసిన సస్పెక్ట్ రిజస్ట్రీ ప్రకారం దేశంలో జరుగుతున్న సైబర్ మోసాలలో సుమారు 14 లక్షల మంది క్రిమినల్స్ భాగస్వాములై ఉన్నారని తేలింది. ఈ సస్పెక్స్ట్ రిజస్ట్రీని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సెంట్రల్ ఇన్విస్టిగేషన్, ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు వినియోగించుకోవచ్చు. దీనిని ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ రూపొందించింది.

సైబర్ మోసాలకు గురయ్యే వారు గోల్డెన్ అవర్‌లో అంటే బ్యాంక్ నుంచి మోసగాళ్లు మీ డబ్బును వారి ఖాతాల్లోకి బదిలీ చేసుకునే తొలి గంటలో 1930కి కాల్ చెయ్యాలి, లేదా WWW.cybercrime.gov.inలో ఫిర్యాదు చెయ్యాలి. అలా చేస్తే వెంటనే మీ డబ్బుల్ని వారి ఖాతాల్లోకి వెళ్లకుండా ఫ్రీజ్ చెయ్యచ్చు. అలా 2021 నుంచి ఇప్పటి వరకు NCRP సుమారు 2800 కోట్ల రూపాయలను రికవరీ చేసింది. తద్వారా సుమారు 8లక్షల50వేల మంది బాధితులకు మేలు జరిగింది. NCRP ప్రకారం దేశంలో ఇప్పటి వరకు సుమారు 47.8 లక్షల సైబర్ క్రైం ఫిర్యాదులు అందాయి.

దేశంలో పెరిగిపోతున్న సైబర్ క్రైం నేరాలను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా 5 వేల మంది సైబర్ కమాండోలను వచ్చే ఐదేళ్లలో నియమిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా ప్రకటించారు. నేరం జరిగిన వెంటనే వీరు రెస్పాండ్ అవుతారని చెప్పారు. అలాగే ఇకపై ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ హోం మినిస్ట్రీ ఆధ్వర్యంలో పని చేయనుంది.

సర్కారు ప్రయత్నాలు సరే.. మన సంగతేంటి.. సైబర్ నేరాల బారిన పడకుండా మనకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం.

  1. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ , ఈమెయిల్స్, మెసేజ్‌ల జోలికి వెళ్లకండి
  2. అలాగే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌ల్లోని లింకులు, అటాచ్మెంట్స్ క్లిక్ చెయ్యద్దు.
  3. ఆఫర్ల పేరుతో వచ్చే కాల్స్ విషయంలో అనవసరంగా తొందరపడి అనర్ధాలు తెచ్చుకోవద్దు.
  4. డబ్బులు పంపేటప్పుడు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేటప్పుడు సదరు కంపెనీ చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోండి. అలాగే మీ మొబైల్ ఫోన్లలలో కొన్ని యాప్స్‌ కాల్ లాగ్స్‌ని, కెమెరాను , మైక్రోఫన్ యాక్సిస్ అడుగుతాయి. వాటికి ఓకే చెప్పేటప్పుడు తప్పనిసరిగా వెరిఫై చేసుకోండి.
  5. మీ ఆన్ లైన్ అకౌంట్లకు కఠినమైన పాస్ వర్డ్స్‌ను ఏర్పాటు చేసుకోండి. అలాగే టూ స్టెప్ వెరిఫికేషన్‌ను కచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి.
  6. మీ మొబైల్, ల్యాప్ ట్యాప్ సాప్ట్ వేర్ అలాగే సెక్యూరిటీ సిస్టమ్స్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోండి.
  7. ఎప్పటికప్పుడు సైబర్ క్రైం విషయంలో వస్తున్న వార్తల్ని, వారి మోడస్ ఆపరెండీని గమనిస్తూ ఉండండి. భవిష్యత్తులో మీకు కూడా అదే తరహా కాల్స్, లేదా మెసేజెస్ లేదా మెయిల్స్ రావచ్చు. మీరు అనుకోకుండానే వాటిని క్లిక్ చేసే ప్రమాదం కూడా ఉంది.
  8. గాడ్జెట్స్ వాడకంలో స్మార్ట్‌గా మాత్రమే కాదు… కేర్‌ఫుల్‌గా కూడా ఉండండి.
Posted

Banking Frauds: New Phone numbers - బ్యాంకింగ్ మోసాలకు చెక్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త నెంబర్ సిరీస్

ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడంతో నగదు డిపాజిట్, విత్ డ్రాతో పాటు నగదు బదిలీ సేవలు కూడా చాలా సౌకర్యంగా మారాయి. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉంటుందన్న చందాన ఆన్‌లైన్ బ్యాంకింగ్ వినియోగించి చేసే మోసాల సంఖ్య కూడా పెరిగిపోయింది.

 
Banking Frauds: బ్యాంకింగ్ మోసాలకు చెక్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త నెంబర్ సిరీస్
Cyber Fraudsters

ముఖ్యంగా ఫేక్ కాల్స్ ద్వారా కేటుగాళ్లు బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును మాయం చేస్తున్నారు. కాల్ చేసే నంబర్లు కూడా బ్యాంకుల అధికారిక నెంబర్లు అనేలా భ్రమ పెడుతూ మోసగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేలా భారత ప్రభుత్వం కీలక చర్యలను తీసుకుంటుంది. త్వరలో బ్యాంకులకు 160తో ప్రారంభమయ్యే కొత్త 10 అంకెల ఫోన్ నంబర్ సిరీస్‌ను అందించనుంది. 160 సిరీస్ నెంబర్‌తో ఫోన్స్ వస్తే అవి కచ్చితంగా బ్యాంకుల నుంచి అధికారికంగా వచ్చే ఫోన్స్ కింద భావించవచ్చు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అధికారిక సంస్థల నుంచి కాల్స్‌ను సులభంగా గుర్తించవచ్చు. ఈ ప్రకటన మేలోనే వెలువడినా తాజాగా ఈ నెంబర్ కోసం ప్రభుత్వం చర్యలను తీసుకుంటుంది. ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత మోసగాళ్లు వ్యక్తులను మోసగించడం చాలా కష్టంగా ఉంటుంది. వినియోగదారులు చట్టబద్ధమైన కాల్స్‌ను సులభంగా గుర్తించవచ్చు. ప్రారంభంలో 160 సిరీస్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ ద్వారా నియంత్రించే సంస్థలు ఉపయోగించవచ్చు. స్టాండర్డిస్డ్ నంబరింగ్ ఫార్మాట్ వినియోగదారులకు పెట్టుబడులు కోరే లేదా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించే మోసపూరిత సంస్థలను సులభంగా గుర్తించడంలో సహాయపడుతుందని డీఓటీ  చెబుతుంది.

ప్రభుత్వం, రెగ్యులేటర్లు అయాచిత కాల్స్‌కు అధిక జరిమానాలు విధించే అవకాశం ఉంది. భవిష్యత్తులో, ఈ నంబరింగ్ వ్యవస్థలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, వివిధ టెలికాం ప్రొవైడర్లు రానున్నారు. అదనంగా స్పామ్ కాల్లను తగ్గించడానికి ప్రభుత్వం ఇతర చర్యలు తీసుకుంటోంది. ట్రాయ్ ప్రమోషనల్ కాల్స్ కోసం ఉపయోగించేలా 140 సిరీస్‌ నంబర్‌ను లాంచ్ చేసిన విధితమే. ఈ కొత్త కొత్త నంబర్లు 1600ABCXXX  ఉంటుంది. ఇక్కడ “ఏబీ” టెలికాం సర్కిల్‌ను సూచిస్తుంది. 

Posted

RTC driver scammed out of 11 lakhs: జనగామ జిల్లాలో సైబర్ మోసం.. 11 లక్షలు పోగొట్టుకున్న RTC డ్రైవర్..ఏం జరిగిందంటే..

తీరా రామేశ్వర్ అకౌంట్ లో కేవలం 149 రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి... అది గమనించిన కండక్టర్ లబోదిబోమంటూ వెంటనే బ్యాంకుకు వెళ్లి పరిశీలించాడు.. అప్పటికే అకౌంట్లోను డబ్బంతా సైబర్ మోసగాళ్లు కాజేసినట్టు తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఫలితం లేదు..

Cyber Fraudsters

cyber-fraudsters.jpg?w=1280

ఇంటికంటే బ్యాంకు పదిలం అనే భావనతో బ్యాంకులలో పైసా పైసా కూడా పెట్టుకునే ప్రజలు ఇప్పుడు సైబర్ మోసగాల వలలో చిక్కుకొని విలవిలాడుతున్నారు.. కష్టార్జితమంతా ఆ కేటుగాళ్లు కళ్ళు మూసి తెరిచేలోపే దోచేస్తున్నారు.. తాజాగా జనగామ జిల్లాలో ఓ కండక్టర్ తన జీవితకాలమంతా సంపాదించుకుని పోగు చేసుకున్న సొమ్మంతా ఒక్క నిమిషంలోనే కాజేశారు సైబర్ మోసగాళ్లు.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 లక్షల రూపాయలు కాజేయడంతో ఆ కండక్టర్ కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

రామేశ్వర్ అనేవ్యక్తి జనగామ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్నాడు.. తన జీవిత ఆశయం సొంత ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో పైసా పైసా పోగు చేసుకుంటున్నాడు. దాదాపు 11 లక్షలకు పైగా బ్యాంకులో జమ చేసుకున్నాడు.. బ్యాంకులో ఉంటే భద్రంగా ఉంటాయని నమ్మకంతో ఎంతో భరోసాతో ఉన్నాడు.. కానీ సైబర్ మోసగాళ్లు నిండా ముంచేశారు.

బ్యాంకు నుండి మాట్లాడుతున్నామని ఏపీకే అప్డేట్ చేస్తున్నామని నమ్మించారు. ఒక లింక్ పంపించి అందులో ఇతకి వివరాలు అప్డేట్ చేయాలని సూచించారు.. పూర్తి ఆధారాలు ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా ఊడ్చేశారు..

తీరా రామేశ్వర్ అకౌంట్ లో కేవలం 149 రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి… అది గమనించిన కండక్టర్ లబోదిబోమంటూ వెంటనే బ్యాంకుకు వెళ్లి పరిశీలించాడు.. అప్పటికే అకౌంట్లోను డబ్బంతా సైబర్ మోసగాళ్లు కాజేసినట్టు తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఫలితం లేదు..

జీవితకాలమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మంతా సైబర్ మోసగాళ్లు కాజేయడంతో తల్లడిల్లి పోతున్నారు.. తనలాంటి మోసం ఎవరికి జరగవద్దని, ఇలాంటి సైబర్ మోసగాలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు.

Posted

2 crores scammed by cyber criminals - ఒకేరోజు ఇద్దరు బాధితులు.. కట్ చేస్తే రూ. 2 కోట్లు హాంఫట్..

సైబర్ నేరగాళ్లు రూట్ మారుస్తున్నారు. బాగా చదువుకోని, ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారినే టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్‌ మీడియాను సైతం శాసించే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కూడా అత్యాశకు పోయి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలను గుడ్డిగా నమ్ముతు.. ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఏకంగా ఓటీపీలను సైతం చెప్పేస్తున్నారు. సంపాదించిన సొమ్మునంతా ఆ కేటుగాళ్ల చేతుల్లో పెడుతున్నారు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించి విలవిల్లాడుతున్నారు.

Cyber Attack

cyber-attack.jpg?w=1280

సైబర్ నేరగాళ్లు రూట్ మారుస్తున్నారు. బాగా చదువుకోని, ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారినే టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్‌ మీడియాను సైతం శాసించే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కూడా అత్యాశకు పోయి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలను గుడ్డిగా నమ్ముతు.. ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఏకంగా ఓటీపీలను సైతం చెప్పేస్తున్నారు. సంపాదించిన సొమ్మునంతా ఆ కేటుగాళ్ల చేతుల్లో పెడుతున్నారు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించి విలవిల్లాడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు నిన్న ఒక్క రోజే ముగ్గురి నుంచి రెండు కోట్ల రూపాయలకి పైగా కాజేసారు.

పటాన్ చెరులో నాగార్జున అనే వ్యక్తికి లేడి వాయిస్‎తో బురిడీ కొట్టించి లక్షలు కాజేశారు. అమీన్ పూర్‎లో నివాసం ఉండే ఓ ప్రయివేటు ఉద్యోగి నుంచి రూ.98 లక్షల 40 వేలు మాయం చేసారు. అలాగే తూప్రాన్‎లో ఓ యువతికి తెలియకుండానే లోన్ తీసుకుని.. అకౌంట్ నుంచి రూ.5 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి మళ్లించుకున్నారు. ఓ యువతికి గుర్తు తెలియని నంబర్ నుండి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, తన పేరుమీద ఇంటర్నేషనల్ కొరియర్ వచ్చిందని చెప్పారు. తాను ఎటువంటి ఆర్డర్ చేయలేదు అని ఆ యువతి సమాధానం ఇచ్చింది. అప్పుడు ఇది ఏదో మోసంలాగా ఉంది అని.. మీరు వెంటనే ఇదే కాల్ ద్వారా సైబర్ క్రైమ్‎ను సంప్రదించడానికి ఫోన్ లో 1 నొక్కండి అని చెప్పారు సైబర్ నేరగాళ్లు. నేరగాళ్ల మాటలు నమ్మిన ఆ యువతి తన ఫొన్‎లో 1 నొక్కగానే ఫోన్ కట్ అయ్యింది. ఈలోపే యువతి ఫోన్‎లో ఏపీకే అనే యాప్ డౌన్లోడ్ అయ్యి,స్కైప్ ద్వారా ఆమెకు వీడియో కాల్ వచ్చింది. ఆ తరువాత ఆమె ఖాతాలోకి రూ.6 లక్షలు వచ్చాయి.

కంగారు పడిన మహిళ వెంటనే, తన భర్తకు సమాచారం ఇచ్చింది. ఆ తరువాత బ్యాంక్‎కు వెళ్లి చూడగా, ఆమె ఖాతా నుండి అప్పటికే 6 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నట్లు మెసేజ్ వచ్చింది. క్రమంగా లక్ష రూపాయల చొప్పున అకౌంట్లో నగదు తగ్గుతూ వచ్చింది. వెంటనే అప్రమత్తం అయిన యువతి 1930కి ఫోన్ చేసి విషయాన్ని తెలుపగా లక్ష 20 వేల రూపాయల ఫ్రీజ్ చేసారు అధికారులు.

ఇక ఇలాగే అమీన్‌పూర్ పరిధిలోని ఏఆర్ బృందావన్ కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి జూన్ 17 వ తేదీన ట్రేడింగ్‎కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. ఆ లింకును ఓపెన్ చేసి తన వివరాలను నమోదు చేశారు. కాగా అపరిచిత ట్రేడింగ్ నిర్వాహకులు ఐడిని క్రియేట్ చేసి ఇచ్చారు. ఇలా అతని నగదు ఆన్ లైన్‎లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. అతను పెట్టిన పెట్టుబడికి, లాభాలు చూపిస్తూ వచ్చారు సైబర్ నేరగాళ్లు. కాగా ముందుగా బాధితుడు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయగా, మూడు లక్షలు లాభాలు చూపించారు. ఇలా పలు దఫాలుగా బాధితుడు మొత్తం రూ.98 లక్షల 40 వేలు ఇన్వెస్ట్ చేశాడు.

తాను పెట్టిన నగదుతో పాటు, వచ్చిన లాభాలు ఇవ్వాలని అడిగాడు. అయితే ఎలాంటి స్పందన ఇవ్వలేదు సైబర్ మోసగళ్లు. దీంతో బాధితుడు తాను మోసపోయినట్లుగా గుర్తించాడు. ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే బాధితుడు పోగొట్టుకున్న నగదులో లక్ష రూపాయలను హోల్డ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పటాన్ చెరు పారిశ్రామికవాడలో భారీ సైబర్ మోసం చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్లు వాట్సప్ లో పంపిన లింక్ ద్వారా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‎మెంట్‎లో కోటి రూపాయలు పోగొట్టుకున్నడు బాధితుడు. 1930 కాల్ ద్వారా రూ.24 లక్షలు ఫ్రీజ్ చేయించారు పోలీసులు. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ గ్రాండియో గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నాడు బాధిత వ్యక్తి నాగార్జున. అతనికి నాడియ కామి అనే మహిళ వాట్స్ ఆప్ మెసేజ్ ద్వారా స్టాక్ మార్కెట్‎లో ఇన్వెస్ట్‎మెంట్ చేస్తే ఎక్కువ మొత్తంలో సంపాదించొచ్చు అని చెప్పింది. ఆశతో రూ.99,78,526.70 (సుమారు కోటి రూపాయలు ) పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత ఎవరూ స్పందించక పోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.

Posted

Krishna District: Cyber crime scam leading to housewife's suicide! ఈ గృహిణి ఆత్మహత్యకు ముందు మాటలు వింటే కన్నీళ్లు ఆగవు

భర్త కష్టాల్లో ఉంటే ..పోపుల డబ్బాలో దాచిన డబ్బుతో ఆదుకునేవాళ్లు. కుటుంబానికి అండగా నిలవాలనుకున్న ఆమెకు..యాప్‌ లోన్‌ ఎండమావిలా కన్పించింది. గండం గట్టెక్కుతుందనే ఆశతో రుణం తీసుకోవడానికి సిద్ధపడింది. అంతే ఆ యాప్‌లోనే యమపాశమై నిండు ప్రాణం తీసింది. సరస్వతి ఆఖరి మాటలు వింటే ..దు:ఖం కట్టలు తెగడం ఖాయం.

sravanthi.jpg?w=1280

ఓ వైపు దేశం డిజిటిల్‌ కరెన్సీతో దూసుకుపోతుంటే..మరోవైపు సైబర్‌ కేటుగాళ్లు సరికొత్త పంథాల్లో ఖాతాలను కొల్లగుడుతున్నారు. మరోవైపు యాప్‌ లోన్‌ ముసుగులో  మళ్లీ  డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి.  లోన్‌ యాప్‌ ఆగడాలకు ఓ నిండు జీవితం బలైపోయింది.  అప్పు …ప్రాణానికి ముప్పు… లోన్‌ యాప్‌ జోలికి వెళ్తే   డెఫినెట్‌గా లైఫ్‌కు రిస్క్‌.  లోన్‌ కావాలా అంటూ  కుప్పలు తెప్పలుగా మెసేజ్‌లు పంపుతారు. ఫోన్స్‌ చేస్తారు. తక్కువ వడ్డీ..సులభ వాయిదాలు.. ఎలాంటి ష్యూరిటీలు కూడా అవసరం లేదంటారు. తీరా కమిటయ్యాక. ఇక చుక్కలే. ఒక్క ఈఎంఐ లేటయినా పరువుతో గేమ్స్‌ ఆడుతారు. వేధించి వేధించి చంపేస్తారు. చచ్చేదాక టార్చర్‌ పెడుతారు.  ఎంతోమంది బాధితులు లోన్‌యాప్‌ ఉచ్చులో పడి ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో  దారుణం జరిగింది.

కృష్ణా జిల్లా మంటాడలో  శ్రీకాంత్‌- సరస్వతి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఉన్నంతలో సంతోషంగా ఉండే కుటుంబం. ఐతే కొన్ని రోజులుగా ఆర్ధిక  సమస్యలతో సతమతమవుతున్నారు. ఆ క్రమంలో సరస్వతి ఫోన్‌కు ఓ లోన్‌యాప్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. ఎలాంటి ష్యూరిటీలు లేకుండా సులభ వాయిదాలతో తక్కువ వడ్డీకే  అప్పు  ఇవ్వబడను అనేది  సారాంశం.  ఆ తరువాత ఫోన్లు కూడా వచ్చాయి.   కష్టాల నుంచి గట్టెక్కడానికి ఓ దారి దొరికిందని  సంతోషపడింది సరస్వతి.  భర్తకు  సాయపడినట్టు అవుతుందనుకుంది.  5 లక్షల లోన్‌ ఇస్తామన్నారు. కానీ   ప్రాసెస్‌లో భాగంగా ముందుగా కొంత డబ్బు కట్టాలన్నారు. 20 వేలు.. 40 వేలు.. 80 వేల ఇలా విడతలవారీగా డబ్బులు వసూలు చేశారు. 5 లక్షలు వస్తాయన్న నమ్మకంతో  నగలు తాకట్టు పెట్టి..అందినకాడల్లా అప్పులు చేసి డబ్బులు కట్టారామె.  తనను డబ్బులు పంపమనడే కానీ  ఎంతకూ వాళ్లు లోన్‌ మంజూరు చేయకపోవడంతో  చివరకు  తాను మోసపోయానని అర్ధమైందామెకు. ఎవరికీ చెప్పుకోలేక.   చేసిన అప్పులు తీర్చే దారిలేక  చివరకు తన జీవితాన్ని ఫనంగా పెట్టింది. బావా.. తప్పుచేశాను. మన కుటుంబం కోసమే ఈ పనిచేశాను ఆమె సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ముఖం చూపించలేక.. తనువు చాలించింది.

తమకు ఇదంతా తెలియదని వాపోయారు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు. కనీసం ఎవరికైనా ఒక్క మాట చెప్పి వుంటే బాగుండేదన్నారు. సరస్వతి  ఆత్మహత్య లాంటి ఘటనను ప్రజలందరూ సీరియస్‌గా పరిగణలోకి తీసుకోవాలన్నారు  పోలీసులు. ఆర్థిక అవసరాల కోసం ఊరికే డబ్బులు ఎవరు ఇవ్వరని మొబైల్ ఫోన్లకి వచ్చే మెసేజ్లు ఆధారంగా లోన్స్ ఇస్తామని చెప్పే వారి మాటలు నమ్మొద్దని  సూచించారు.

సరస్వతి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇలాంటి దారుణాలకు కారణం అవగాహన లేకపోవడం. ప్రతీ ఒక్కరూ సైబర్‌ క్రైమ్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా మోసం చేస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే నిందితులను అరెస్ట్‌ చేయడం సహా మీ డబ్బుల్ని మీకు ఇప్పించే అవకాశాలు అంతగా ఉంటాయి.  ఆందోళన పడొద్దు..జీవితాలను ఫనంగా పెట్టొద్దు.

Posted

Cyber Fraud: చనిపోయిన వ్యక్తి కుటుంబాలను వదలని సైబర్ నేరగాళ్లు.. ఏకంగా బీమా సొమ్ము వచ్చిందంటూ..!

చనిపోయిన వ్యక్తికి బీమా సొమ్ము శాంక్షన్ అయింది.. కొంత డబ్బు అకౌంట్‌లో డిపాజిట్ చేయాలంటూ మోసానికి తెగబడ్డారు సైబర్ నేరగాళ్లు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. అసలే ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి విషాదంలో ఉన్న కుటుంబాలను సైతం సైబర్ నేరగాళ్లు వదలడం లేదు.

cyber-crime-1.jpg?w=1280

చనిపోయిన వ్యక్తికి బీమా సొమ్ము శాంక్షన్ అయింది.. కొంత డబ్బు అకౌంట్‌లో డిపాజిట్ చేయాలంటూ మోసానికి తెగబడ్డారు సైబర్ నేరగాళ్లు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. అసలే ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి విషాదంలో ఉన్న కుటుంబాలను సైతం సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. చనిపోయిన వ్యక్తికి ఇన్సూరెన్స్ డబ్బు మంజూరు అయింది. ఆ మొత్తం అకౌంట్‌లో జమ కావాలంటే మీరు కొంత డబ్బు డిపాజిట్ చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులకు మాయ మాటలు చెప్పి బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు.

ఉరవకొండ నియోజకవర్గంలోని బెళుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన రైతు తిప్పేస్వామి (44) ఇటీవలే గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు తిప్పే స్వామికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రైతు తిప్పేస్వామి ఆకస్మిక మృతితో తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో ఆ ఊరి సర్పంచ్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నేను డీఎస్పీని మాట్లాడుతున్నాను.. అంటూ అవతలి వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్నాడు. మీ గ్రామానికి చెందిన రైతు మరణానంతరం కుటుంబానికి ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయల భీమా సొమ్ము మంజూరు అయిందని, రెండు విడతలుగా సొమ్ము విడుదల అవుతుందని గ్రామ సర్పంచ్‌ని నమ్మబలికాడు.

వెంటనే మృతి చెందిన రైతు తిప్పేస్వామి కుటుంబ సభ్యులతో ఫోన్ లో తనతో మాట్లాడించాలని సర్పంచ్‌కు చెప్పాడు. దీంతో గ్రామ సర్పంచ్ మృతుడు తిప్పేస్వామి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి ఫోన్‌లో సదర్ నకిలీ డీఎస్పీతో మాట్లాడించాడు. కుటుంబ సభ్యులతో సదరు నకిలీ డీఎస్పీ ఫోన్‌లో మాట్లాడుతూ… ఆ డబ్బు విడుదల కావాలంటే రూ.18,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. తమతో మాట్లాడుతున్న వ్యక్తి నిజంగానే డీఎస్పీ నే అనుకున్న తిప్పే స్వామి కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ రామిరెడ్డి సైతం సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఉచ్చులో పడ్డారు. అప్పుడే అంత్యక్రియలకు, ఇతర కార్యక్రమాలకు ఉన్న డబ్బు అంతా ఖర్చయిపోయిందని, తమ వద్ద డబ్బు లేదని తిప్పే స్వామి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే ఆ కుటుంబానికి ఉపయోగపడుతుందని భావించిన సర్పంచ్ రామిరెడ్డి మానవతా దృక్పథంతో పదివేల రూపాయలు సాయం చేశాడు. మిగిలిన మొత్తాన్ని మృతుడు తిప్పే స్వామి సోదరుడి అకౌంట్ నుండి మొత్తం రూ. 18,500 అవతలి వ్యక్తి సూచించిన మొబైల్ నెంబర్(9611156511) కు ఫోన్ పే చేశారు. ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేసిన మరు నిమిషంలోనే సదరు నకిలీ డీఎస్పీ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయింది. ఇతర నెంబర్ల నుంచి కూడా ట్రై చేసినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు మోసపోయామని తెలిసి భోరుమన్నారు. అసలే కుటుంబ పెద్దను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న తమను ఇలా సైబర్ నేరగాళ్లు మోసం చేయడం పట్ల రైతు తిప్పే స్వామి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసం ఆఖరికి సైబర్ నేరగాళ్ళు ఎంతకు తెగించారని అనుకుంటున్నారు గ్రామస్తులు. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...