Jump to content
  • 2

Wealth secrets: How to make money, save money and get rich? ​💰​


TELUGU

Question

  • Answers 70
  • Created
  • Last Reply

Top Posters For This Question

  • Sanjiv

    40

  • TELUGU

    27

  • Vijay

    3

  • ADMINISTRATOR

    1

Recommended Posts

  • 0

ప్రి-అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌ ఆఫర్‌ ఉంటే, కేవలం 5 నిమిషాల్లో వ్యక్తిగత రుణం మంజూరవుతుంది.

87b25ff386ec19dec5011046a6adaca317063491

Personal Loan Vs Gold Loan: మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆర్థిక అవసరాలు పెరుగుతున్నాయి. కొందరికి అత్యవసరంగా డబ్బు కావలసివస్తుంది. అలాంటి అర్జెన్సీలో, రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి.. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం, రెండోది.. వ్యక్తిగత రుణం తీసుకోవడం. మొదటిదాన్ని సురక్షిత రుణంగా (Secured loan), రెండో దాన్ని అసురక్షిత రుణంగా (Unsecured loan) బ్యాంక్‌లు/ఆర్థిక సంస్థలు భావిస్తాయి. అర్హతల ఆధారంగా ఈ రెండు లోన్లూ తక్షణమే లభిస్తాయి, ఆర్థిక అవసరాలను తీరుస్తాయి.

పర్సనల్‌ లోన్‌ Vs గోల్‌ లోన్‌లో దేనిని ఎంచుకోవడం ఉత్తమం అన్నది.. లోన్ ఆమోదం, వడ్డీ రేటు, రుణ మొత్తం, తిరిగి చెల్లించే కాలం వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది.

1. రుణం ఇచ్చే అవకాశాలు
ఇంతకముందే చెప్పుకున్నట్లు, వ్యక్తిగత రుణం అనేది అసురక్షిత రుణం కిందకు వస్తుంది. రుణగ్రహీత క్రెడిట్ స్కోర్‌, నెలవారీ ఆదాయం, చేసే పని, బ్యాంక్‌/ఆర్థిక సంస్థతో సంబంధాలు, తీసుకునే లోన్‌ మొత్తం, తిరిగి చెల్లించే కాలం, EMI వంటి విషయాలపై ఆధారపడి లోన్‌ మంజూరు కావచ్చు/కాకపోవచ్చు. గోల్డ్‌ లోన్‌ దీనికి విరుద్ధం. మన బంగారాన్ని తాకట్టు పెడతాం కాబట్టి, బ్యాంక్‌లు మరోమాట మాట్లాడకుండా లోన్‌ శాంక్షన్‌ చేస్తాయి. తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నవాళ్లకు ఇది సరైన ఆప్షన్‌.

2. రుణం మంజూరు సమయం
బ్యాంక్‌/ఆర్థిక సంస్థలో రద్దీ లేకపోతే, గోల్డ్ లోన్‌ను అరగంటలో తీసుకోవచ్చు. రద్దీ ఎక్కువగా ఉంటే కొన్ని గంటలు పట్టొచ్చు. ఇక.. ప్రి-అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌ ఆఫర్‌ ఉంటే, కేవలం 5 నిమిషాల్లో వ్యక్తిగత రుణం మంజూరవుతుంది. ప్రి-అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌ ఆఫర్‌ లేకపోతే, బ్యాంక్‌కు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. ఆ తర్వాత 2 నుంచి 7 రోజుల్లో లోన్‌ వస్తుంది.

3. వడ్డీ రేటు
సాధారణంగా, వ్యక్తిగత రుణంపై వడ్డీ రేటు 10.5% నుంచి ప్రారంభమవుతుంది. ఇది కూడా రుణగ్రహీత క్రెడిట్ స్కోర్‌, నెలవారీ ఆదాయం వంటి విషయాలపై ఆధారపడుతుంది. గోల్డ్ లోన్ వడ్డీ రేటు బ్యాంక్‌ను బట్టి మారుతుంది. ఇది సెక్యూర్డ్‌ లోన్‌ కాబట్టి, సాధారణంగా వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. పైగా, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే బంగారం రుణాలు తక్కువ వడ్డీకి దొరుకుతాయి. అయితే.. మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నవాళ్ల విషయంలో.. ఈ రెండు వడ్డీ రేట్ల మధ్య పెద్దగా తేడా ఉండకపోవచ్చు.

4. రుణం మొత్తం
సాధారణంగా, వ్యక్తిగత రుణం రూ.50 వేల నుంచి రూ.15 లక్షల వరకు లభిస్తాయి. కస్టమర్‌ క్రెడిట్‌ ప్రొఫైల్‌ ఆధారంగా ఈ పరిమితిని రూ.50 లక్షల వరకు కూడా బ్యాంక్‌లు పొడిగిస్తాయి. బంగారం రుణం విషయంలో.. లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిపై లోన్‌ అమౌంట్‌ ఆధారపడి ఉంటుంది. అంటే... తాకట్టు పెట్టి తీసుకునే బంగారం మార్కెట్‌ విలువలో నిర్దిష్ట శాతాన్ని లోన్‌ రూపంలో బ్యాంక్‌ ఇస్తుంది. RBI రూల్‌ ప్రకారం, LTV నిష్పత్తి 75%గా ఉంది. దీనికి మించి లోన్‌ రాదు.

...

Read full article...

 

Link to comment
Share on other sites

  • 0

Credit Card: ఖాతాదారుడి క్రెడిట్ కార్డ్ అకౌంట్‌లో జమ అవుతుంది. క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు నుంచి ఆ మొత్తాన్ని తగ్గించి బిల్‌ కట్టొచ్చు

567470a7579c25f903c9c1fb6c591fd317063442

Credit Cards With Attractive Cashback Offer: ఒకప్పుడు, క్రెడిట్‌ కార్డ్‌ల కోసం జనం వెంపర్లాడితే... ఇప్పుడు బ్యాంక్‌లు వెంటపడుతున్నాయి. క్రెడిట్‌ కార్డ్‌ కస్టమర్లను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన ఫీచర్లను ఎరగా వేస్తున్నాయి. అలాంటి ఎరల్లో ఒకటి 'క్యాష్‌ బ్యాక్ ప్రోగ్రామ్‌'. 

క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌తో ఉన్న క్రెడిట్‌ కార్డ్‌లు యూజర్లను బాగానే మెప్పిస్తున్నాయి. ఈ తరహా కార్డ్‌లపై వచ్చే క్యాష్‌ బ్యాక్.. ఖాతాదారుడి క్రెడిట్ కార్డ్ అకౌంట్‌లో జమ అవుతుంది. క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు నుంచి ఆ మొత్తాన్ని తగ్గించి బిల్‌ కట్టొచ్చు. 

క్యాష్‌ బ్యాక్‌ అందించే 5 క్రెడిట్‌ కార్డ్‌లు ‍‌(5 Credit cards offering attractive cashback)

5 క్రెడిట్‌ కార్డ్‌లు మంచి క్యాష్‌ బ్యాక్‌ అందిస్తున్నాయి. వీటిలో ఏ కార్డ్‌ ద్వారానైనా ఒక వ్యక్తి ఒక నెలలో రూ.లక్ష రూపాయలు ఖర్చు పెడితే.. అతనికి ఒక సంవత్సరంలో ఎంత డబ్బు క్యాష్‌ బ్యాక్‌ రూపంలో తిరిగి వస్తుందన్న లెక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి.

క్యాష్‌ బ్యాక్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ (Cashback SBI Credit Card)
క్యాష్‌ బ్యాక్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే.. ఈ కార్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో చేసే ఖర్చుపై 5% డబ్బు తిరిగొస్తుంది. ఆఫ్‌లైన్ ద్వారా చేసే ఖర్చుపై 1% క్యాష్‌ బ్యాక్ వస్తుంది. ఉదాహరణకు... ఒక వ్యక్తి ఒక నెలలో రూ.లక్ష రూపాయలను ఈ కార్డ్‌ ద్వారా ఖర్చు చేశాడనుకుందాం. అందులో, రూ. 20,000 మొత్తాన్ని ఆన్‌లైన్‌లో ఖర్చు చేసి, మిగిలిన రూ. 80,000 మొత్తాన్ని ఆఫ్‌లైన్‌లో ఖర్చు చేస్తే... అతనికి ఏడాదిలో వచ్చే మొత్తం క్యాష్‌బ్యాక్ రూ. 21,600 అవుతుంది.

హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా క్రెడిట్ కార్డ్ (HDFC Millenia Credit Card)
ఈ కార్డ్ ద్వారా... అమెజాన్‌, బుక్‌ మై షో, కల్ట్‌.ఫిట్‌, ఫ్లిప్‌కార్డ్‌, మింత్ర, సోనీ లివ్‌, స్విగ్గీ, టాటా క్లిక్‌, ఉబర్‌, జొమాటో ఫ్లాట్‌ఫామ్స్‌లో చేసే స్పెండింగ్‌ మీద 5% క్యాష్‌ తిరిగొస్తుంది. ఇతర ఖర్చులపై 1% క్యాష్‌ బ్యాక్‌ అందుతుంది. క్యాష్‌ బ్యాక్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ తరహాలోనే, ఈ కార్డ్‌ ద్వారా ఒక నెలలో రూ. 20,000 మొత్తాన్ని ఆన్‌లైన్‌లో ఖర్చు చేసి, మరో రూ. 80,000 మొత్తాన్ని ఆఫ్‌లైన్‌లో ఖర్చు చేస్తే... ఏడాదిలో వచ్చే క్యాష్‌బ్యాక్ రూ. 21,600 అవుతుంది.

యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ (Axis Bank Ace Credit Card)
ఈ కార్డ్‌ ద్వారా... బిల్లు చెల్లింపులపై 5% క్యాష్‌ బ్యాక్, స్విగ్గీ, జొమాటో, ఓలా ఫ్లాట్‌ఫామ్స్‌లో చేసే ఖర్చులపై 4% క్యాష్‌ బ్యాక్, ఇతర అన్ని స్పెండింగ్స్‌ మీద 2% క్యాష్‌బ్యాక్‌ వర్తిస్తుంది. ప్రతి నెలా.. బిల్ పేమెంట్లు & 4% క్యాష్‌బ్యాక్‌ వచ్చే కేటగిరీలపై రూ. 10,000 ఖర్చు చేసి; మరో రూ. 90,000 ఇతర విషయాల కోసం స్పెండ్‌ చేస్తే, ఆ వ్యక్తికి ఆ సంవత్సరంలో రూ. 20,400 డబ్బు తిరిగి వస్తుంది.

...

Read full article...

 

Link to comment
Share on other sites

  • 0

the first tip is golden - touch and feel it - most people would lose interest in buying it after feeling it.

Buying NEW Mobile? Watch this #ytshorts #iphone

 

Link to comment
Share on other sites

  • 0

మీ Loan పై ఇలా లక్షలు SAVE చేయచ్చు #trending #ytshorts

 

Link to comment
Share on other sites

  • 0

ఇక Credit Card Bills ఇలా కట్టోద్దు interest #shorts

 

Link to comment
Share on other sites

  • 0

Post Office Scheme: పైసా వసూల్ స్కీమ్.. రోజుకు రూ.50 ఆదా చేస్తే.. చేతికి రూ.35 లక్షలు

Gram Suraksha Yojana Scheme Details in Telugu: పోస్టాఫీసు అమలు చేస్తున్న సేవింగ్ స్కీమ్స్‌లో గ్రామ సురక్ష యోజన స్కీమ్‌ ఒకటి. ఈ స్కీమ్‌లో ప్రతి రోజూ రూ.50 ఇన్వెస్ట్ చేస్తే.. రూ.35 లక్షల వరకు చేతికి అందుకోవచ్చు. ఈ స్కీమ్ పూర్తి వివరాలు మీ కోసం..

307768-gram-suraksha-yojana-scheme.jpg?i

Gram Suraksha Yojana Scheme Details in Telugu: ప్రస్తుతం పోస్టాఫీసు ద్వారా అనేక రకాల సేవింగ్ స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్‌ చేస్తే ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టి కోట్లాది మంది మంచి ఆదాయం పొందుతున్నారు. మీరు కూడా ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నట్లయితే.. మీకు బంపర్ ఆఫర్ ఉంది. ప్రతి రోజూ 50 రూపాయలు పొదుపు చేస్తే.. చేతికి రూ.35 లక్షలు పొందొచ్చు. ఈ స్కీమ్‌ పేరు గ్రామ సురక్ష యోజన. ఈ స్కీమ్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ప్రోగ్రామ్‌లో భాగం. ఈ బీమా పాలసీ దేశంలోని గ్రామీణ ప్రజల కోసం 1995 సంవత్సరంలో ప్రారంభించారు. 19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న వారు గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ పథకంలో రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెలవారీగా లేదా త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన ప్రీమియం చెల్లించవచ్చు. ఈ స్కీమ్‌లో ప్రతి నెల రూ.1,515 అంటే కేవలం రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే.. రూ.35 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఉదాహరణకు మీరు 19 ఏళ్ల వయస్సులో గ్రామ సురక్ష పథకంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే.. మీకు 55 సంవత్సరాలు వచ్చే వరకు రూ.1,515 ప్రీమియం చెల్లించాలి. అదే 58 సంవత్సరాల వయస్సు వరకు ఈ పథకాన్ని తీసుకుంటే.. ప్రతి నెలా రూ. 1463 చెల్లించాలి. 60 ఏళ్లకు తీసుకుంటే.. ప్రతి నెలా రూ.1411 చెల్లించాల్సి ఉంటుంది.

మీరు ప్రీమియం చెల్లించడం మిస్ అయితే.. 30 రోజుల్లోగా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో 55 ఏళ్ల ఇన్వెస్ట్‌మెంట్‌పై రూ.31.60 లక్షలు, 58 ఏళ్ల పెట్టుబడిపై రూ.33.40 లక్షలు, 60 ఏళ్ల పెట్టుబడిపై రూ.34.60 లక్షల మెచ్యూరిటీ ప్రయోజనం పొందొచ్చు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి 80 ఏళ్లు నిండిన తర్వాత ఈ మొత్తాన్ని అందజేస్తారు. ఒక వేళ వ్యక్తి మరణించినట్లయితే.. ఈ మొత్తం ఆ వ్యక్తి చట్టపరమైన వారసునికి చెందుతుంది. గ్రామ సురక్ష పథకంలో ఇన్వెస్ట్ చేసిన తరువాత వద్దనుకుంటే.. 3 సంవత్సరాల తర్వాత దానిని సరెండర్ చేయవచ్చు. అయితే అప్పుడు ఆ స్కీమ్‌లో ఉన్న ప్రయోజనాలు లభించవు. ఈ స్కీమ్‌లో అందరికీ నచ్చే విషయం ఏంటంటే.. ఇండియా పోస్ట్ అందించే బోనస్. ఈ స్కీమ్‌లో చివరగా ప్రతి రూ.1,000కి సంవత్సరానికి 60 రూపాయల బోనస్‌ను ప్రకటించింది. అంటే మీరు మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌పై బోనస్ అమౌంట్ అదనంగా యాడ్ అవుతుంది.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...