- 0
Telangana Congress BRS: దొంగలు పోయి.. గజదొంగలు వచ్చారు
-
Similar Content
-
- 0 answers
- 10 views
-
- 0 answers
- 14 views
-
- 0 answers
- 31 views
-
- 0 answers
- 15 views
-
- 4 answers
- 34 views
-
- 0 answers
- 17 views
-
- 0 answers
- 16 views
-
Soaring Rents in Hyderabad: సామాన్యుడు హైదరాబాద్‌లో బతకగలడా..? డబుల్ బెడ్రూమ్ రెంట్ ఎంతో తెల్సా..?
By Sanjiv,
- 0 answers
- 25 views
-
- 2 answers
- 241 views
-
- 3 answers
- 106 views
-
-
Now Playing
-
Twisters
-
Boneyard
-
My Spy The Eternal City
-
Beverly Hills Cop: Axel F
-
Les Infaillibles
-
Goyo
-
Le Dernier Jaguar
-
The Inheritance
-
A Quiet Place: Day One
-
Despicable Me 4
-
Deadpool & Wolverine
-
Bad Boys: Ride or Die
-
The Exorcism
-
The Garfield Movie
-
Trigger Warning
-
Inside Out 2
-
Monkey Man
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
Question
TELUGU
కేసీఆర్ కుటుంబం వారి స్వార్థం కోసం తెలంగాణను వాడుకుందని, అలాంటి దొంగలు పోయి గజదొంగలు వచ్చినట్లుగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నుంచి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని.. బిల్డర్లు, కాంట్రాక్టర్లు సహా ఎవరినీ వదలడం
ప్రజలు, బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి ఆర్ ట్యాక్స్
ఖజానాలో నిధుల్లేవు.. హామీలపై కార్యాచరణ లేదు
6 గ్యారంటీలపై ప్రజలకు రాహుల్ వెన్నుపోటు
బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒకటే: కిషన్‌రెడ్డి
కేసీఆర్ కుటుంబం వారి స్వార్థం కోసం తెలంగాణను వాడుకుందని, అలాంటి దొంగలు పోయి గజదొంగలు వచ్చినట్లుగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నుంచి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని.. బిల్డర్లు, కాంట్రాక్టర్లు సహా ఎవరినీ వదలడం లేదని దుయ్యబట్టారు. దీంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని పేర్కొన్నారు. రూ.2 లక్షల రుణ మాఫీ హామీకి దిక్కు లేదని, రైతు కూలీలు, కౌలు రైతులకు సీఎం రేవంత్ ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా తుక్కుగూడలో రాహుల్ కొత్త హామీలు ఇచ్చి వెళ్లారని విమర్శించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పండరి సహా నల్లగొండ, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ 6 గ్యారంటీలపై రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనూ మోసం చేసేందుకు సిద్ధమయ్యారని.. ప్రజలు చైతన్యవంతులని, కాంగ్రె్‌సను నమ్మరని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం దగ్గర నిధుల్లేవని, హామీల అమలుకు కార్యాచరణ కూడా లేదని విమర్శించారు. కాంగ్రెస్ నెహ్రూ కుటుంబానికి, బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబానికి కొమ్ముకాస్తున్నాయని ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒకటేనని.. గతంలో పొత్తు కూడా పెట్టుకున్నాయని గుర్తుచేశారు. ప్రధానిగా మోదీ జూన్‌లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల తర్వాత రాహుల్ ఇటలీకి వెళ్లిపోతారని జోస్యం చెప్పారు.
కుట్రదారులు ఎవరో రేవంత్ చెప్పాలి: ఎన్.వి.సుభా్‌ష
ప్రభుత్వాన్ని దింపేందుకు కుట్ర జరుగుతోందంటూ ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ కుట్రదారులెవరో బయటపెట్టాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభా్‌ష డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంను పదవీచ్యుతుడిని చేయడానికి బయటివారు అవసరం లేదు.. రేవంత్‌కు వ్యతిరేకంగా పనిచేసేవాళ్లు ఆ పార్టీలోనే ఉన్నారని పేర్కొన్నారు. రేవంత్‌కు ధైర్యం ఉంటే ఇలాంటివారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బుధవారం దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించగానే ప్రభుత్వం స్పందించిందన్నారు. ఇది బీజేపీ విజయమేనని అభివర్ణించారు. రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ సిరిసిల్ల చేనేత కార్మికులకు రూ.300 కోట్లు బకాయిలు విడుదల చేసే పరిస్థితి లేదా? అని నిలదీశారు. మీరు కొడంగల్‌కే ముఖ్యమంత్రా? సిరిసిల్ల కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దొంగ హామీలు ఇవ్వడం కాదు.. వాటి అమలుకు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ సిరిసిల్ల చేనేత కార్మికులను మోసం చేశారని మండిపడ్డారు.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.