Jump to content
  • 2

Election news


TELUGU

Question

MISINFORMATION ALERT FROM ELECTORAL OFFICER!

This morning false information in the form of video message from a leader of the Jana Sena Party has been spread in WhatsApp claiming that functionaries from another political party were giving out money and marking voters with indelible ink to prevent them from voting at the polling station on 13th May.

The Joint Collector and Returning Officer of Pithapuram AC has clarified in his video message that the allegations are not factually correct and reiterated that only the officials appointed by Election Commission of India has the authority to use indelible ink, and anyone caught trying to use a different ink will face serious consequences. So, it is requested you not believe everything you read on WhatsApp - always fact check before sharing such misleading information!

Don't fall for this latest misinformation! Remember, misinformation can be harmful and misleading.

Verify before you share! Check your sources and ensure the information you're spreading is accurate and reliable.

Let's keep our timelines filled with truth! #VerifyBeforeYouAmplify #CombatMisinformation

 

Link to comment
Share on other sites

16 answers to this question

Recommended Posts

  • 0

General Elections 2024: How to vote? పోలింగ్‌ బూత్‌ లోకి వెళ్లాక ఓటు ఎలా వేయాలంటే..

12-05-2024 Sun 11:55 | Both States

ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు గమనించాల్సిన అంశాలెన్నో

ఏపీలో 25 లోక్ సభ స్థానాలతోపాటు 175 అసెంబ్లీ సీట్లకు రేపు పోలింగ్

తెలంగాణలో 17 ఎంపీ సీట్లు, ఒక అసెంబ్లీ స్థానానికి కూడా..

cr-20240512tn664060db3ce8b.jpg

‌‌సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సిద్ధమయ్యాయి. ఏపీలో 25 లోక్ సభ స్థానాలతోపాటు 175 అసెంబ్లీ సీట్లకు సోమవారం పోలింగ్ జరగనుంది. అలాగే తెలంగాణలో 17 ఎంపీ సీట్లు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియపై ఓటర్ల అవగాహన కోసం ఈ కింది సూచనలు.

  • పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లగానే మీ దగ్గరున్న ఓటర్ ఐడీ కార్డు, పోలింగ్‌ స్లిప్ ను చూపించాలి.
  • మొదటి సీట్లో కూర్చొనే పోలింగ్ అధికారి మీ ఓటర్ ఐడీ కార్డు సీరియల్‌ నెంబర్‌, పార్ట్ నెంబర్ ను తన వద్ద ఉండే జాబితాలోని వివరాలతో సరిపోలాయో లేదో చూసుకుంటారు.
  • వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయ్యాక మరో పోలింగ్‌ అధికారి మీ ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు వేస్తారు. మీ వివరాలను (ఓటరు ఐడీ నెంబరు) ఫారం 17Aలో నమోదు చేస్తారు. ఓటరు జాబితాలో బొటనవేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు. పోలింగ్ వివరాల స్లిప్ ను ఇస్తారు.
  • మూడో ఎన్నికల అధికారి ఆ స్లిప్ ను పరిశీలించి మీరు ఓటు వేయడానికి వీలుగా తన వద్ద ఉన్న ఓటింగ్ కంట్రోల్ యూనిట్ బటన్ నొక్కి మీ ఓటు నమోదయ్యేందుకు దాన్ని సిద్ధం చేస్తారు. అలాగే ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌ లోకి వెళ్లడానికి అనుమతిస్తారు.
  • ఓటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన కంపార్ట్ మెంట్ లో ఓటేసే ఈవీఎం మెషీన్‌, దాని పక్కనే వీవీ ప్యాట్ యంత్రం ఉంటాయి. మీరు ఎవరికి ఓటేశారో కాగితంపై ముద్రించి చూపించే యంత్రమే వీవీ ప్యాట్.
  • ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు ఒకవైపు, వారికి కేటాయించిన గుర్తులు మరోవైపు... వాటి పక్కనే నీలి రంగు బటన్‌ ఉంటాయి.
  • మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కన్నే ఉన్న నీలి రంగు బటన్‌ను నొక్కగానే రెడ్ లైట్ వెలుగుతుంది. బీప్ అనే శబ్దం వస్తుంది.
  • ఆ వెంటనే వీవీ ప్యాట్ యంత్రంపై పచ్చటి లైట్‌ వెలుగుతుంది.
  • వీవీ ప్యాట్ పై ఉండే స్క్రీన్‌పై మీరు ఓటేసిన అభ్యర్థి తాలూకూ గుర్తు, ఈవీఎంపై కేటాయించిన క్రమసంఖ్య, పేరు ముద్రించిన కాగితపు స్లిప్‌ ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది. ఆ తరువాత ఈ స్లిప్‌ బాక్స్‌లోకి పడిపోతుంది. ఆ తర్వాత మళ్లీ బీప్ శబ్దం వస్తుంది. ఇలా జరిగితేనే మీ ఓటు నమోదైనట్లు అర్థం.
  • ఈ ప్రక్రియలో ఏది జరగలేదని మీకు అనుమానం వచ్చినా పోలింగ్ కేంద్రంలో ఉండే ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలి.
  • ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు రెండూ జరుగుతున్నాయి కాబట్టి.. పోలింగ్‌ బూత్‌లో రెండు ఈవీఎంలు, రెండు వీవీ పాట్‌లు ఉంటాయి. ఓటర్లు రెండుసార్లు ఓటు హక్కు వినియోగించుకోవాలి.


ఓటర్ ఐడీలో తప్పులు దొర్లాయా? అయినా కంగారు అక్కర్లేదు
కొందరి ఓటరు కార్డుల్లో స్వల్ప తేడాలు (అడ్రస్‌ మార్పు, ఫోటో పాతది ఉండడం లేదా పేరు అక్షరాల్లో మార్పులు) ఉండొచ్చు. కానీ అంతమాత్రాన ఓటర్లు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరంలేదు. ఎపిక్‌ వివరాల్లో స్వల్ప తేడాలున్నా ఓటరు గుర్తింపు నిర్ధారణ అయితే అధికారులు ఓటు హక్కు కల్పిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుంది.

ఈసీ గుర్తించే 12 ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాలు ఇవే..

  1. ఆధార్‌కార్డు 
  2. ఉపాధి హామీ కార్డు
  3. జాబ్‌ కార్డు 
  4. బ్యాంకు/తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్‌ 
  5. కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు 
  6. డ్రైవింగ్‌ లైసెన్స్‌
  7. పాన్‌కార్డు 
  8. రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ).. నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్ట్రార్‌(ఎన్పిఆర్‌) కింద జారీ చేసిన స్మార్ట్‌ కార్డు  
  9. భారతీయ పాస్‌పోర్టు 
  10. ఫొటోతో ఉన్న పెన్షన్‌ పత్రాలు
  11. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/ పబ్లిక్‌ లిమిటెడ్‌  కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు 
  12. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్‌ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ)

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

CEO urges people to vote voluntarily, without fear

He urges every eligible voter to become an active part of the “festival of democracy” that comes once every five years and to contribute to strengthening the democratic system

10745_12_5_2024_20_14_27_1_IMG_20240512_

Chief Electoral Officer Mukesh Kumar Meena. | Photo Credit: SPECIAL ARRANGEMENT

Chief Electoral Officer (CEO) Mukesh Kumar Meena said on Sunday, May 12, that people should exercise their right to vote voluntarily and without any fear.

In a statement released on the eve of polling, Mr. Meena urged every eligible voter to become an active part of the “festival of democracy” that comes once every five years and to contribute to strengthening the democratic system. He said of the total 4,14,01887 voters who would exercise their franchise across the State on Monday, 2,03,39,851 were men, 1,10,58,615 were women and 3,421 transgender persons.

Out of the total 46,389 polling centres, 12,438 had been identified as problematic centres and elaborate security arrangements have been put in place there. As many as 454 candidates were in the election fray from 25 Parliament constituencies, and 2,387 candidates were contesting from 175 Assembly segments in the State.

He said with an aim to conduct the polling with zero violence, as many as 31,385 (75%) polling centres would constantly be monitored through webcasting in the Command and Control Centre set up at the State level.

Mr. Meena said 1. 6 lakh new EVMs would be used in the general elections being held in 46,389 polling centres in the State. Although 1.45 lakh EVMs would be sufficient, an additional 15,000 EVMs were being kept ready for use in 224 auxiliary polling centres planned to be operated, he said..

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

4.14 Crore Voters Involved in AP Polling Today

The Election Commission has made elaborate arrangements for the polling from 7 am to 6 pm in 169 assembly segments and from 7 am to 5 pm in three segments.

voters-pti-photo.jpg

Vijayawada: Nearly 4.14 crore voters would decide the political fate of 2,841 candidates across 175 assembly and 25 Lok Sabha constituencies in Andhra Pradesh on Monday. The results will be known after the counting of votes on June 4.

The Election Commission has made elaborate arrangements for the polling from 7 am to 6 pm in 169 assembly segments and from 7 am to 5 pm in three segments--Palakonda (SC), Kurupam (SC), and Salur (ST) -- and from 7 am to 4 pm in Araku Valley (ST), Paderu (ST) and Rampachodavaram (ST).

Polling for all the seats in AP is being held in the fourth phase of the nationwide general elections.

As many as 46,389 polling stations have been set up, including auxiliary polling stations. Of these, 12,438 are critical polling stations while 31,385 sensitive stations will have the webcasting facility.

Out of the total 4.14 cr voters, nearly 2.03 crore are male and 2.10 crore female while 3,421 voters are transgenders.

YSR Congress president and chief minister YS Jagan Mohan Reddy is contesting from Pulivendula, Telugu Desam chief Nara Chandrababu Naidu from Kuppam, Jana Sena chief Pawan Kalyan from Pithapuram, state BJP chief D Purandeswari from Rajahmundry LS and state Congress chief YS Sharmila Reddy from Kadapa LS. Political parties have made a series of promises during the weeks-long campaign to woo the voters.

Chief electoral officer Mukesh Kumar Meena called upon the voters to cast their vote in a free and fair manner and ensure peaceful polling.

The EC is using 1.60 lakh EVMs across 46,389 polling stations and keeping nearly 20 per cent of the EVMs on standby to meet any machine snag or exigency. It aims at 83 per cent polling in the state against the 79.84 per cent in 2019 polls.

The election authorities are providing drinking water, wheelchairs and ramps, first-aid centres, separate queue lines for male and female voters, and wheelchairs for the aged and special-needs persons.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Lok Sabha elections 2024: Did you know you can cast vote without voter ID card? Here's how

Lok Sabha elections 2024: Here’s a list of alternate ID proofs or documents which can be used in place of voter ID card at the time of voting.

ANI-20240426248-0_1715519664513_17155196

Women voters show their ink-marked fingers after casting their votes during the Lok Sabha polls, at a polling station in Idukki. (ANI)

Lok Sabha elections 2024: Did you know an elector can cast a vote even if he/she does not have the voter ID card, also known as the electors photo identity card (EPIC)?

ALSO READ: Elections 2024: Full list of 96 Lok Sabha constituencies, over 300 Andhra, Odisha Assembly seats voting in Phase 4

According to the guidelines of the Election Commission of India (ECI), one can cast a vote even if they do not have a physical copy of their voter ID card at the time of voting at the polling booth.

ALSO READ: Lok Sabha elections 2024 Phase 4: Not living in your hometown? Here's how to vote

But it is first advisable for all the voters to first ensure that their names are enlisted in the Election Commission’s voter list. And if not, they should first get their names registered ither online or offline in the voter list.

Don't have Voter ID card? Here's a list of ID proofs which can be used

If your name is in the voter list but do not have a voter ID card, certain alternate ID proofs or documents can be used to cast a vote.

Any one of these listed alternate ID proofs or documents can be used in place of voter ID card at the time of voting –

  1. PAN (permanent account number) card
  2. Aadhaar card
  3. Driving licence
  4. Passport
  5. Passbook issued by a bank or a post office, entailing the photograph
  6. Pension document for retired personnel
  7. Service ID card issued by a state government, central government, PSU (public sector undertaking), including the MGNREGA (Mahatma Gandhi National Rural Employment Guarantee Act) job card
  8. A health insurance smart card issued by the Ministry of Labour and Employment
  9. Authenticated Photo Voter Slip
  10. Student identity cards issued by recognised educational institutions
  11. Property documents such as pattas, registered deeds, etc. in the name of the voter
  12. Ration card
  13. SC, ST, OBC certificates issued by competent authority
  14. Freedom fighter identity card
  15. Arms licence
  16. Certificate of physical disability by the competent authority
  17. Ex-servicemen CSD Canteen Card
  18. Smart cards issued by the Registrar General of India under the scheme of National Population Register

...

Complete article

Follow these simple steps,from verifying your name in the Electoral roll to casting your vote at polling stations. Watch this step-by-step video guide.

#LokSabhaElections2024 #ECI #Elections2024

 

Link to comment
Share on other sites

  • 0

Elections 2024: చూపు కనబడని వ్యక్తుల ఓటు బంధువులు వేయ్యొచ్చా.. రూల్స్ ఏం చెబుతున్నాయి..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 175 శాసనసభ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఓటు వేసేందుకు ఇప్పటికే ఓటరు స్లిప్, ఐడి కార్డు అందరూ రెడీ చేసుకుని ఉంటారు. ఉదయం 7వ గంట కొట్టగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తూ ఉంటారు. ఎన్నికలు అంటేనే ఎన్నో అనుమానాలు. ఈ క్రమంలో సాధారణ ఓటర్లు అయితే పోలింగ్ బూత్‌కి వెళ్లి ఈవీఎంలో బటన్ నొక్కి ఓటు వేసి వస్తారు.

094c51d9_f946_48c1_9e31_38292245685e_c80

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 175 శాసనసభ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఓటు వేసేందుకు ఇప్పటికే ఓటరు స్లిప్, ఐడి కార్డు అందరూ రెడీ చేసుకుని ఉంటారు. ఉదయం 7వ గంట కొట్టగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తూ ఉంటారు. ఎన్నికలు అంటేనే ఎన్నో అనుమానాలు. ఈ క్రమంలో సాధారణ ఓటర్లు అయితే పోలింగ్ బూత్‌కి వెళ్లి ఈవీఎంలో బటన్ నొక్కి ఓటు వేసి వస్తారు. ఈవీఎంలో అభ్యర్థుల సింబల్స్ ఉంటాయి. ఓటరు తమకు నచ్చిన అభ్యర్థి గుర్తుపై ఓటు వేస్తారు. అదే సమయంలో విభిన్న ప్రతిభావంతులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. కానీ కొంతమంది వృద్ధులకు చూపు సరిగ్గా కనిపించదు. దీంతో గుర్తులు ఎక్కడున్నాయి. ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించదు. దీంతో చూపు సరిగ్గాలేని ఓటర్లు తమ ఓటును సక్రమంగా వినియోగించుకునే అవకాశాలు తక్కువ. మరి చూపు సరిగ్గా కనిపించకపోయినా.. చూపులేని వాళ్ల తరపున బంధువులు ఓటు వేయ్యొచ్చా అనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. ఇటువంటివాళ్ల కోసం పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రిసైడింగ్ అధికారికి లేదా రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. సాధారణంగా ఇటువంటి చిన్న సమస్యలను ప్రిసైడింగ్ అధికారి పరిష్కరిస్తారు. ఏదైనా వివాదం తలెత్తితే రిటర్నంగ్ అధికారిని సంప్రదిస్తారు.

చూపుకనబడని వారి విషయంలో..

ఓటర్ల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు ఉంటుంది. వారికి ఏదైనా శారీరక వైకల్యం ఉన్నా.. కంటి చూపు సరిగ్గా లేకపోయినా ఓటు వేసేందుకు నిరాకరించడానికి వీలులేదు. కానీ చూపుసరిగ్గా కనబడని వ్యక్తులను పోలింగ్ బూత్‌లోకి వాళ్ల కుటుంబ సభ్యులు లేదా ఎవరైనా సహాయకులు తీసుకువస్తుంటారు. అటువంటి వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఓటర్ వెరిఫికేషన్ చేస్తారు. అతడే ఓటరు అని నిర్థారించుకున్న తర్వాత ఓటరు లేదా అతడి సహయకుడు పోలింగ్ బూత్‌లో ఎన్నికల సిబ్బందికి విషయాన్ని తెలియజేయాలి. అప్పుడు ఓటరుతో వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యుడా లేదా ఏదైనా పార్టీకి చెందిన వ్యక్తినా లేక ఇతరులు ఎవరైనా అనే విషయాన్ని తెలుసుకుంటారు. పార్టీ ప్రతినిధి అయితే సాధారణంగా ప్రత్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం చెబుతారు. కుటుంబ సభ్యుల విషయంలో పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ కుటుంబ సభ్యుడు కాకుండా వేరే వ్యక్తి అయితే పోలింగ్ ఏజెంట్లు ఎవరైనా అభ్యంతరం చెబితే సహయకుడిని ఓటు వేసేందుకు అనుమతించరు. ఏజెంట్లు అంతా అంగీకారం తెలిపితే ఓటరును అడిగి దేనికి వేయమంటే దానికి ఓటు వేయ్యొచ్చు.

ఒకవేళ చూపు కనిపించని ఓటరుతో ఓటు వేసేందుకు సహయకుడిని అనుమతించకపోతే మాత్రం చూపు సరిగ్గా కనిపించని వ్యక్తి తరపున ప్రిసైడింగ్ అధికారి లేదా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారుల్లో సీనియర్ అధికారి ఆ ఓటరు అభిప్రాయాన్ని అడిగి ఎవరికి ఓటు వేయమంటే వారికి వేస్తారు. ఎన్నికల అధికారిపై కూడా ఏజెంట్లకు ఏదైనా అభ్యంతరాలుంటే ఏజెంట్ సమక్షంలోనే ఎన్నికల అధికారి ఓటరు ఓటును వేస్తుంటారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. వాస్తవానికి ఒక ఓటరు ఓటు మరొవ్యక్తి వేయడానికి వీలులేనప్పటికీ.. ఓటరు ఓటు సక్రమంగా వినియోగించుకునేందుకు వీలుగా ఇలా చేస్తుంటారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

AP Assembly Poll statistics by district: ఏపీలో అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్.. జిల్లాల వారీగా జాబితా ఇదే

14-05-2024 Tue 07:47 | Andhra

కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కొనసాగిన పోలింగ్

డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్

63.19 శాతంతో అట్టడుగున నిలిచిన అల్లూరి సీతారామరాజు జిల్లా

అధికారిక గణాంకాలను వెల్లడించిన ఈసీ

cr-20240514tn6642cb8d4fe70.jpg

చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అన్ని చోట్లా పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36 శాతంగా నమోదయింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19 శాతం నమోదయింది. ఈ మేరకు అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన డేటాను అధికారిక యాప్‌లో ఎన్నికల సంఘం అప్‌డేట్ చేసింది.

జిల్లాలవారీగా ఓటింగ్ శాతాలు ఇలా ఉన్నాయి..
అల్లూరి సీతారామరాజు        - 63.19 శాతం
అనకాపల్లి                        - 81.63 శాతం
అనంతపురం                    - 79.25 శాతం
అన్నమయ్య                       - 76.12 శాతం
బాపట్ల                             - 82.33 శాతం
చిత్తూరు                          - 82.65 శాతం
అంబేద్కర్ కోనసీమ             - 83.19 శాతం
తూర్పు గోదావరి               - 79.31 శాతం
ఏలూరు                          - 83.04 శాతం
గుంటూరు                       - 75.74 శాతం
కాకినాడ                        - 76.37 శాతం
కృష్ణా                             - 82.20 శాతం
కర్నూలు                         - 75.83 శాతం
నంద్యాల                        - 80.92 శాతం
ఎన్టీఆర్                           - 78.76 శాతం
పల్నాడు                         -78.70 శాతం
పార్వతీపురం మన్యం          - 75.24 శాతం
ప్రకాశం                           - 82.40 శాతం
పొట్టిశ్రీరాములు నెల్లూరు      - 78.10 శాతం
శ్రీ సత్యసాయి                   - 82.77 శాతం
శ్రీకాకుళం                       - 75.41 శాతం
తిరుపతి                          - 76.83 శాతం
విశాఖపట్నం                    - 65.50 శాతం
పశ్చిమ గోదావరి                -81.12 శాతం
వైఎస్సార్                        - 78.12 శాతం

...

Complete article

 

Andhra Pradesh's voters show us the power of democracy in action and record the highest voter turnout among the 4 Phases of polling concluded until now in the 2024 General Elections at 81.86%

 

Link to comment
Share on other sites

  • 0

Poll percentage in Andhra Pradesh may go up to 81, says CEO Mukesh Kumar Meena

Pulivendula, the home turf of Chief Minister Y.S. Jagan Mohan Reddy, records 81.06% voter turnout, while 85.87% voters exercise their franchise in Kuppam, the native constituency of TDP chief N. Chandrababu Naidu

10215_8_5_2024_18_46_37_1_DSC_1069.JPG

Voters exercised their franchise until 2 a.m. on the intervening nights of May 13 and May 14, says Chief Electoral Officer Mukesh Kumar Meena. | Photo Credit: Special Arrangement

The total voter turnout during the simultaneous elections to 175 Assembly and 25 Lok Sabha seats in Andhra Pradesh may touch 81% as the voters exercised their franchise until 2 a.m. on the intervening nights of May 13 and May 14, Chief Electoral Officer Mukesh Kumar Meena has said.

Though the voting was scheduled to conclude at 6 p.m. on May 13 (Monday) the voters who were waiting in the queue lines at polling booths by that time were allowed to exercise their franchise.

As per the data available by 7.30 p.m. on May 14, the total polling percentage was estimated to be 79.4% including 1.2% voter turnout recorded during the voting through postal ballot. The poll percentage may go up to 81 after all the data gathered from across the State are included,” Mr. Meena said on May 14 (Tuesday).

The 2019 elections witnessed a voter turnout of 79.8% including the 0.6% voters exercised their franchise through postal ballot.

As per the latest reports, Amalapuram recorded the highest voter turnout of 83.19% among the Lok Sabha constituencies in the State, while Visakhapatnam saw the lowest of 68%. Among the other Lok Sabha constituencies are Anakapalle (78.47%), Anantapur (78.50%), Araku (69.26%, Bapatla (82.90%), Chittoor (82.36%), Eluru (83.04%), Guntur (75.74%), Hindupur (81.38%), Kadapa (78.72%), Kurnool (76.17%), Machilipatnam (82.20%), Nandyal (79.60%), Narsapuram (82.20%), Narasaraopet (78.70%), Nellore (77.38%), Ongole (81.87%), Rajahmundry (79.31%), Rajampet (76.71%), Srikakulam (73.67%), Tirupati (75.72%), Vijayawada (78.76%) and Vizianagaram (80.06%).

Among the key Assembly constituencies, Pulivendla, the home turf of Chief Minister and YSRCP president Y.S. Jagan Mohan Reddy, saw a voter turnout of 81.06%. Kuppam, the native constituency of TDP national president N. Chandrababu Naidu, saw a voter turnout of 85.87%.

Pithapuram Assembly constituency from where Jana Sena Party president Pawan Kalyan was contesting recorded a poll percentage of 86.87%. Mangalagiri from where TDP national general secretary N. Lokesh was in the fray witnessed a voter turnout of 79.20%. Tadikonda Assembly constituency under the limit of which the capital city of Amaravati falls recorded 84.39% voter turnout.

...

Complete article

 

Andhra Pradesh's voters show us the power of democracy in action and record the highest voter turnout among the 4 Phases of polling concluded until now in the 2024 General Elections at 81.86%

 

Link to comment
Share on other sites

  • 0

తెలంగాణలో 65.67 శాతం పోలింగ్: భువనగిరిలో అత్యధికం, హైదరాబాద్‌లో అత్యల్పం

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో 65.67 శాతం ఓటింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల తుది పోలింగ్ శాతం వివరాలను మంగళవారం వెల్లడించారు.ప్రజలు చైతన్యవంతంగా కదిలి ముందుకు రావడంతో గత(2019) లోక్‌సభ ఎన్నికల కంటే 3 శాతం ఎక్కువగా నమోదయిందని సీఈవో వికాస్రాజ్తెలిపారు.

polling-telangana-9442-1715706732.jpg

అత్యధికంగా భువనగిరిలో 76.78 శాతం పోలింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48 శాతం పోలింగ్ నమోదయింది. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంటులో అత్యధికంగా 84.25 శాతం నమోదయిందని వికాస్ రాజ్ తెలిపారు. మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో అతి తక్కువగా 42.76 శాతం నమోదైందని వెల్లడించారు. జూన్ 4న 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

TSRTC revenue during elections: లోక్ సభ ఎన్నికలకు ప్రత్యేక బస్సులు... టీఎస్ఆర్టీసీకి భారీగా ఆదాయం

17-05-2024 Fri 14:30 | Telangana

పోలింగ్ రోజున టీఎస్ఆర్టీసీలో 54 లక్షలమంది ప్రయాణం

టీఎస్ఆర్టీసీకి రూ.24.22 కోట్ల ఆదాయం

టిక్కెట్ కొనుగోలు చేసినవారి ద్వారా రూ.15 కోట్ల ఆదాయం

cr-20240517tn66471cc606c51.jpg

లోక్ సభ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఎన్నికల సమయంలో టీఎస్ఆర్టీసీ 3,500 పైచిలుకు బస్సులను ప్రత్యేకంగా నడిపింది. ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్, ఎంజీబీఎస్, కూకట్‌పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు నడిపింది. దీంతో ఆ ఒక్కరోజు టీఎస్ఆర్టీసీకి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది. ఈ నెల 13న తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ జరిగింది. ఆ రోజు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో 54 లక్షల మంది ప్రయాణించారు.

దీంతో సంస్థకు రూ.24.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఎన్నికల మరుసటిరోజున 54 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. టిక్కెట్ కొనుగోలు చేసినవారి ద్వారా రూ.15 కోట్ల ఆదాయం సమకూరింది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో రూ.9 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం... టీఎస్ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

AP polling percentage 81.86%

ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు ముగిసిన 4 దశల పోలింగ్లో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని తెలిపిన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్ పెరిగిందన్న సీఈఓ.

Poll Statistics

https://www.instagram.com/p/C6_TsH4p7Up/

 

Link to comment
Share on other sites

  • 0

Ban imposed on flying drones over strongrooms in Andhra Pradesh

Three-tier security is in place at all 350 strongrooms set up at 33 locations across the State, says Chief Electoral Officer Mukesh Kumar Meena  

VSP17_STRONG_ROOM%203.JPG

Barbed wire fencing and barricades erected as special security forces guarding the strongroom set up on the Andhra University campus in Visakhapatnam. | Photo Credit: V. RAJU

Andhra Pradesh Chief Electoral Officer (CEO) Mukesh Kumar Meena has said that a ban has been imposed on individuals and private persons to fly drones over the strongrooms set up to store the EVMS and VVPAT equipment, apart from the three-tier security that is in place.  

In total 350 strongrooms have been set up at 33 locations in 26 districts across the State.   

Referring to the three-layer security at the strongrooms, Mr. Meena said night vision CCTVs were installed and Central Paramilitary Forces (CPMF) or State Armed Police forces were guarding the area round the clock.

“As part of the ECI guidelines, one representative of every candidate is allowed to monitor the security at the strongrooms round the clock. The CPMF personnel are entering the details of the visitors to the area in their log books,” said Mr. Meena.  

The State Armed Police personnel are guarding the second circle of the strongroom, while the local police are providing security at the outer most layer, he said.  

Meanwhile, Guntur District Election Officer Matli Venu Gopal Reddy told The Hindu over phone that flying drones above the strongrooms had been banned.

“The ban will remain in force at the strongrooms set up at Acharya Nagarjuna University, Namburu, Pedakakani mandal until the completion of the counting process and movement of the EVMs to the district strongroom-cum-warehouse at the Collectorate, he said, adding that any violation of this order would attract punitive action under the relevant laws.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Election Counting: అందరి దృష్టి కౌంటింగ్ పైనే.. అసలు ఈ ఓట్లను ఎలా లెక్కిస్తారు.. రౌండ్‌లను ఎలా నిర్ణయిస్తారు..?

ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. చీమచిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ కొనసాగుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల లోపల, బయట సీసీ కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు.

votes-counting-arrangements.jpg?w=1280

ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. చీమచిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ కొనసాగుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల లోపల, బయట సీసీ కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు. స్ట్రాంగ్ రూంలోకి వెళ్లేందుకు ఓకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండేలా ఏర్పాట్లు చేయడంతోపాటు స్ట్రాంగ్ రూంకు డబుల్ లాక్ సిస్టమ్ పెట్టారు. అంతేకాదు, కౌంటింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు ఓట్ల లెక్కింపులో ప్రతీ అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ అవుతుంది. కానీ దీనికోసం ముందు నుంచే కసరత్తు జరుగుతుంది. లెక్కింపునకు 4 గంటలకు ముందు అధికారులు తమ పనుల్లో నిమగ్నమవుతారు. సిబ్బంది తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు ఉదయం 4 గంటలకు వెళ్లాలి. 5 గంటలకు వారికి లెక్కింపు చేయాల్సిన టేబుల్స్ చూపిస్తారు. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం కూడా చేయిస్తారు. లెక్కింపులో గోప్యత పాటిస్తామని వారు చెబుతారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మెుదలవుతుంది. గం. 8.30ల వరకూ ఇది కంటిన్యూ అవుతుంది. పోస్టల్ ఓట్లు ఎక్కువ ఉండి సమయం పడితే ఆ లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా చేస్తారు. ఒక నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్‌లు లెక్కిస్తారని అంచనాగా ఉంది.

రౌండ్లను ఎలా నిర్ణయిస్తారు..?

నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను, వాటి పరిధిలో పోలైన ఓట్లు ప్రాతిపాదికన ఎన్ని రౌండ్‌లు కావాలో నిర్ణయం తీసుకుంటారు. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం వరకూ పడుతుంది. 14 – 15 టేబుళ్లపై లెక్కింపు చేస్తారు. ఒకసారి మొత్తం టేబుళ్లపై ఉన్న EVMల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్టుగా నిర్ధారిస్తారు.

వి వి ప్యాట్ స్లిప్పుల లెక్కింపు ఎలా?

ఓటింగ్ పట్ల విశ్వాసాన్ని మెరుగుపరచడానికి 2013లో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ (VVPAT) సిస్టమ్‌ని EVMలకు జోడించారు. VVPAT సిస్టమ్ అభ్యర్థి పేరు, ఎన్నికల చిహ్నాన్ని కలిగి ఉన్న ప్రింటెడ్ పేపర్ స్లిప్‌ను రూపొందిస్తుంది. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన అనంతరం వీవీప్యాట్‌ల స్లిప్పుల లెక్కిస్తారు. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల నెంబర్స్‌ను చీటీలపై రాసి లాటరీ తీస్తారు. ఏయే వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలో లాటరీ ద్వారా నిర్ణయం తీసుకుంటారు.

ఈవీఎంల లెక్కింపులో వచ్చిన ఒట్లు VVPATల స్లిప్‌ల ఓట్లను చూస్తారు. ఏదైనా వ్యత్యాసం ఉంటే మళ్లీ స్లిప్పులను రెండోసారి లెక్కపెడతారు. ఇలా మూడు సార్లు చేస్తారు. అప్పటికీ తేడా వస్తే స్లిప్పుల‌లోని లెక్కనే పరిగణనలోకి వెళ్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ఈవీఎంల లెక్కింపుతో అనధికారికంగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో అర్థమవుతుంది. కానీ వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు పూర్తయ్యే దాకా అధికారికంగా ప్రకటించడం అనేది ఉండదు.

ఎన్నికల్లో ఒక రౌండ్ ఫలితాలు ఈసీ అధికారికంగా ప్రకటించాలంటే 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. రౌండ్ పూర్తి అయిన తర్వాత అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి. మైక్రో అబ్జార్వర్, కేంద్ర ఎన్నికల పరిశీలకుల సంతకాలు చేయాలి. ఆ తర్వాత ఏవైనా ఈవీఎంలలోని ఓట్లను ఎన్నికల పరిశీలకుడు ఫలితాల రికార్డులతో పరిశీలిస్తారు. ఈవీఎంలలో వచ్చిన ఓట్లు, వీవీ ప్యాట్లలో వచ్చిన ఓట్లు సరిపోవాలి. ఆ తర్వాత ఏజెంట్లు ఎవరికి అభ్యంతరం లేదని చెప్పిన తర్వాత ఆర్వో రౌండ్ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో ఏదైనా అభ్యంతరం ఉంటే ఓట్ల లెక్కింపు చాలా ఆలస్యం అవుతుంది.

ఓట్ల లెక్కింపు ఇలా…

  • ఒకో ఈవీఎంలో వెయ్యి నుంచి 1200 ఓటు ఉంటాయి.
  • రౌండ్ కి 14టేబుల్స్ మీద.. అంటే 14,000 నుంచి 15,000 ఓట్లు తెలుస్తాయి.
  • లక్ష ఓటర్లు ఉంటే 8 నుంచి 10 రౌండ్లలో ఫలితం వస్తుంది.
  • రెండు లక్షలు ఉంటే 16లేదా 20 రౌండ్లలో ఫలితం వెలువడుతుంది.
  • భీమిలి, గాజువాక లాంటి మూడు లక్షల ఓట్లు ఓటర్లు ఉన్న చోట 24 రౌండ్లు ఉండచ్చు.

ఓట్ల లెక్కింపు బాధ్యత ఎవరిది?

ఒక నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారి బాధ్యత వహిస్తారు. ఇందులో ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. రిటర్నింగ్ అధికారి ప్రభుత్వ అధికారి లేదా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రతి నియోజకవర్గానికి భారత ఎన్నికల సంఘం చేత నామినేట్ చేయబడిన స్థానిక అధికారి అయి ఉంటారు.

కౌంటింగ్ ఎక్కడ జరుగుతుంది?

పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్లను లెక్కించే స్థలాన్ని రిటర్నింగ్ అధికారి నిర్ణయిస్తారు. కౌంటింగ్ తేదీ, సమయం కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. ఆదర్శవంతంగా ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపును ఒకే చోట చేయాలి. ప్రాధాన్యంగా ఆ నియోజకవర్గంలోని రిటర్నింగ్ అధికారి ప్రధాన కార్యాలయంలో చేయాలి. ఇది రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించాల్సి ఉంటుందిల. అయితే, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో సరాసరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఈ పరిస్థితిలో రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వివిధ అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఒకే చోట కానీ, వేర్వేరు స్థానాల్లో కానీ లెక్కింపు జరుగుతుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

AP Election Final Results by 9 PM on June 4: జూన్ 4 రాత్రి 8-9 గంటలకల్లా తుది ఫలితాలు: ఏపీ సీఈఓ ముఖేశ్ కుమార్ మీనా

30-05-2024 Thu 08:13 | National

ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్న ఏపీ సీఈఓ 

పోలీంగ్ రోజున 144 సెక్షన్ విధింపు

మధ్యాహ్నం 2 గంటలకల్లా సగానికిపైగా నియోజకవర్గాల ఫలితాల వెల్లడి

cr-20240530tn6657e7bb8ec2f.jpg

ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు పూర్తవుతుందని చెప్పారు. 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల్లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఒట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు. 

ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ సమస్యాత్మక జిల్లాల్లోని లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేసి, సీనియర్ పోలీసు అధికారులను నియమిస్తామని అన్నారు. పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ప్రత్యేకదృష్టి పెడతామని తెలిపారు. పల్నాడు జిల్లాలో రాష్ట్ర డీజీపీతో కలిసి పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించామని, అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. ఇక 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల కౌంటింగ్ నిర్వహిస్తారు. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో 25 పైగా రౌండ్లు ఉంటాయి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Election Results 2024: ఓట్ల కౌంటింగ్‌కు.. కౌంట్‌డౌన్‌ షురూ.. ఎన్నికల ఫలితాలు వెలువడే తీరు ఇదే..!

ఏపీలో కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ షురూ చేసింది ఎన్నికల సంఘం. ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకున్న నేపథ్యంలో ఏమాత్రం అలజడి, ఆందోళనకి తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. జూన్ 4న ఏపీ ఫలితాలపై ఎన్నింటికి క్లారిటీ రానుంది. ఫస్ట్ ఫలితం వచ్చేదెప్పుడు.?

votes-counting-1.jpg?w=1280

ఏపీలో కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ షురూ చేసింది ఎన్నికల సంఘం. ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకున్న నేపథ్యంలో ఏమాత్రం అలజడి, ఆందోళనకి తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. జూన్ 4న ఏపీ ఫలితాలపై ఎన్నింటికి క్లారిటీ రానుంది. ఫస్ట్ ఫలితం వచ్చేదెప్పుడు.?. ఏ పార్టీ పవర్‌లోకి వస్తుందనేది ఎప్పుడు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏ నలుగురు కలిసినా ఇదే డిస్కషన్. ఇంతకీ ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు. తుది ఫలితాలు ఎప్పుడొస్తాయనే చర్చ మొదలైంది.

ఏపీలో జూన్ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వివరించారు. మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో 111చోట్ల 20 రౌండ్ల లోపు కౌంటింగ్ ఉంటుందని చెప్పారు. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, మిగితా మూడు చోట్ల 25 రౌండ్లకుపైగా కౌంటింగ్ కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2గంటల లోపు, 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4లోపు, మరో 3 నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరింటిలోపు ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది.

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకై టేబుళ్లను సంఖ్య పెంచబోతున్నట్టు ఈసీ తెలిపింది. రాత్రి 8–9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళిక ప్రిపేర్ చేసినట్టు సీఈవో మీనా స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీలను అలర్ట్ చేసినట్టు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ శంకబ్రత బాగ్చి వివరించారు.

ఓట్ల లెక్కింపు జూన్‌ 4న ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. తొలుత సైనికదళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలట్‌ సిస్టమ్‌ (ఈటీపీబీఎస్‌)లో వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్‌ బ్యాలట్‌ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. ఈ లెక్కింపునకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే, మరో వైపు వాటితోపాటు ఉదయం 8.30గం.లకు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 10 నుంచి11 గంటల వరకు ఫలితాలపై కొంత స్పష్టత కానుంది. మధ్యాహ్నం 2 – 3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే అవకాశముంది. అయితే వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలను ప్రకటించకూడదని ఈసీ నిర్ణయించింది. మొత్తం లెక్కింపు ప్రక్రియ నాలుగు దశల్లో సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తిచేసింది.

మరోవైపు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటించాలన్నారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే పీసీ, ఏసీ ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం-21 సి , 21ఇ లను అదే రోజు ఫ్లైట్ లో ECI కి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్‌లలో కూలీల సేవలను వినియోగించుకునే అంశంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

కౌంటింగ్ ప్రక్రియ ఇదే..!

  • ఓట్ల లెక్కింపు విధులకు హాజరయ్యే సిబ్బంది ఉదయం 4 గంటల కల్లా కౌటింగ్ కేంద్రాలకు చేరుకుంటారు.
  • కౌటింగ్ సిబ్బంది ఏ టేబుల్‌ వద్ద విధులు నిర్వహించాలో ఉదయం 5 గంటలకు అధికారులు నిర్ణయిస్తారు.
  • తమకు కేటాయించిన టేబుల్‌ వద్ద కౌంటింగ్ సిబ్బంతి చేత అయా నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి కౌంటింగ్‌ గోప్యతపై ప్రమాణం చేయిస్తారు.
  • నిర్దేశిత సమయానికి లెక్కింపు ప్రారంభించి, ర్యాండమైజేషన్‌ ద్వారా మూడు దశల్లో కౌంటింగ్ చేపడతారు.
  • ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలను తెరుస్తారు. అనంతరం ఈవీఎంలను కౌంటింగ్ టేబుళ్లపైకి చేరుస్తారు.
  • తొలు ఈటీపీబీఎస్‌లో వచ్చిన సర్వీసు ఓట్లను, పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. ప్రతి 25 పోస్టల్‌ బ్యాలట్‌ పత్రాలను ఒక కట్టగా కడతారు.
  • ఒక్కో కౌంటింగ్‌ టేబుల్‌కు ఒక రౌండ్‌కు గరిష్ఠంగా 20 కట్టలు కేటాయిస్తారు.
  • పోస్టల్‌ బ్యాలట్ల లెక్కింపు పూర్తికాకుండా… కంట్రోల్‌ యూనిట్ల లెక్కింపులోని అన్ని రౌండ్ల ఫలితాలను ప్రకటించడానికి వీలులేదు.
  • ప్రతి టేబుల్‌ వద్ద అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు.

లెక్కింపు సాగేది ఇలా..

  • ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 చొప్పున కౌంటింగ్‌ టేబుళ్ల ఏర్పాటు.
  • పోలింగ్‌ కేంద్రాల సీరియల్‌ నంబర్‌ ఆధారంగా ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. వాటన్నింటి లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్‌ పూర్తి.
  • పోలింగ్‌ కేంద్రం సీరియల్‌ సంఖ్యకు అనుబంధంగా ఏ, బీ, సీ వంటి బై నెంబర్లు ఉంటే.. వాటిని విడిగా కౌంటింగ్‌ చేస్తారు.
  • ఓట్ల లెక్కింపు సందర్భంలో ఏదైనా ఈవీఎం బ్యాటరీ పనిచేయకపోయినా, మొరాయించినా, తెరిచేందుకు అవకాశం లేకపోయినా వాటిని పక్కనపెట్టి మరో ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు.
  • ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొత్తం పూర్తయ్యాక.. మొరాయించిన ఈవీఎంల వీవీప్యాట్‌ చీటీలను లెక్కిస్తారు.
  • ఈవీఎంలలో నమోదైన ఓట్ల తుది రౌండ్‌ లెక్కింపు మొత్తం పూర్తై, వాటిని సరిచూసుకుని నిర్ధారించుకున్న తర్వాత వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు.
  • నియోజకవర్గం పరిధిలో ఎన్ని పోలింగ్‌ కేంద్రాలుంటే అన్ని సంఖ్యలను కాగితంపై రాసి.. లాటరీ విధానంలో అయిదు కార్డులు తీస్తారు.
  • మొరాయించిన ఈవీఎంల పోలింగ్‌ కేంద్రాలను, మాక్‌ పోల్‌ వీవీ ప్యాట్‌ చీటీలను తొలగించని పోలింగ్‌ కేంద్రాలను లాటరీ నుంచి మినహాయిస్తారు.
  • లాటరీ విధానంలో ఎంపికచేసిన ఐదు కేంద్రాల వీవీ ప్యాట్‌లను బయటకు తీస్తారు.
  • ఈవీఎంలలో అభ్యర్థులకు నమోదైన ఓట్లకు, వీవీ ప్యాట్‌ చీటీల్లో వచ్చిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉంటే రెండోసారి, మూడోసారి లెక్కిస్తారు.
  • అప్పటికీ తేడా వస్తే వీవీ ప్యాట్‌ చీటీల్లోని ఓట్లనే పరిగణనలోకి తీసుకుని తుది ఫలితాలు ప్రకటిస్తారు.
  • వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపును రిటర్నింగ్‌ అధికారి లేదా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సొంతంగా నిర్వహిస్తారు.
  • వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాకే అధికారికంగా ఫలితాలు వెల్లడిస్తారు.

అలాగే, అపరిచితులను ఎవ్వరినీ అందుకు వినియోగించొద్దని సూచించారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి, అనుమతించనున్నారు. ఎన్నికల అనంతర హింస జరిగిన నేపథ్యంలో కౌంటింగ్‌ రోజు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. కౌంటింగ్ డే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కౌంటింగ్ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలుతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Process of Votes Counting | ఎన్నికల కౌంటింగ్ ఎలా ఉంటుంది..? | @BhavaniMedia

 

Link to comment
Share on other sites

  • 0

YSRCP petition on Postal Ballot in Supreme Court: సీఈసీ, హైకోర్టు ఆదేశాలపై వైసీపీ కీలక నిర్ణయం.. పోస్టల్ బ్యాలెట్లపై మరో పిటిషన్..

పోస్టల్‌ బ్యాలెట్లపై ఎక్కడా తగ్గేదేలే అంటూ సుప్రీంకోర్టుకు వెళ్లింది వైసీపీ. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఎస్ఎల్‌పీ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోస్టల్‌ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టులో వైసీపీ న్యాయ పోరాటానికి దిగింది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు మరికొద్ది గంటల సమయం ఉండటంతో పోస్టల్ బ్యాలెట్లపై చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్లపై అధికారిక సీల్‌, హోదా లేకుండా స్పెసిమెన్‌ సిగ్నేచర్‌తో ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను వైసీపీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.

ysrcp.jpg?w=1280

పోస్టల్‌ బ్యాలెట్లపై ఎక్కడా తగ్గేదేలే అంటూ సుప్రీంకోర్టుకు వెళ్లింది వైసీపీ. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఎస్ఎల్‌పీ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోస్టల్‌ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టులో వైసీపీ న్యాయ పోరాటానికి దిగింది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు మరికొద్ది గంటల సమయం ఉండటంతో పోస్టల్ బ్యాలెట్లపై చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్లపై అధికారిక సీల్‌, హోదా లేకుండా స్పెసిమెన్‌ సిగ్నేచర్‌తో ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను వైసీపీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలన్న వైసీపీ.. పోస్టల్‌ బ్యాలెట్‌పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌ వేసింది. కేవలం ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులను ఇవ్వడంపై అధికార వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది.

పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫారమ్‌-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధంగా ప్రకటించి వాటిని రద్దు చేయాలని అభ్యర్థిస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఓ అనుబంధ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్‌ కిరణ్మయి ధర్మాసనం.. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కూడా ఎన్నికల ఫలితాల కిందకే వస్తుందని, ఫలితాలపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోవాలే కానీ హైకోర్టును ఆశ్రయించరాదన్న వాదనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది.

ఏపీ వ్యాప్తంగా ఉన్న మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాలను సవాల్‌ చేస్తూ ఎన్నికల పిటిషన్లు దాఖలు చేయడం ఆచరణ సాధ్యం కాదన్న వైసీపీ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తించేలా ఈ ఆదేశాలు ఇచ్చిందన్న వాదనను సైతం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఏపీలో సుమారు 5.5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. గెలుపోటములను నిర్ణయించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వెళ్లింది వైసీపీ. అక్కడ రేపు ఎలాంటి వాదలను జరగనున్నయన్న ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...