Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

Massive voter turnout in Andhra Pradesh: ఏపీలో భారీ ఓటింగ్


TELUGU

Question

Botsa Satyanarayana on massive voter turnout in AP: ఏపీలో అందుకే భారీ ఓటింగ్ జరిగింది: మంత్రి బొత్స

ఏపీలో పోలింగ్ 80 శాతం దాటుతుందన్న అంచనాలు

ఎవరికి వారు తమదే హవా అంటున్న టీడీపీ, వైసీపీ నేతలు

టీడీపీ కుట్రలకు తెరలేపిందన్న మంత్రి బొత్స

అందుకే సీఎం జగన్ ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఓటర్లు పోటెత్తారని వివరణ

cr-20240514tn664367ca52d87.jpg

ఏపీలో నిన్న భారీ ఎత్తున పోలింగ్ జరగ్గా, ఓటింగ్ 80 శాతం దాటుతుందన్న అంచనాల నేపథ్యంలో... టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి అనుకూలంగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. 

తాజాగా, పోలింగ్ తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఎన్నికల్లో టీడీపీ కుట్రలకు తెరలేపిందని, జగన్ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న కారణంతోనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారని వెల్లడించారు. కానీ, ఓటమి అర్థంకావడంతో టీడీపీ శ్రేణులు అసహనంతో దాడులకు పాల్పడుతున్నాయని, వైసీపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని బొత్స పిలుపునిచ్చారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, మరో రెండు మూడ్రోజుల్లో సీఎం జగన్ పదవీప్రమాణస్వీకారోత్సవం తేదీ, వేదికను కూడా ప్రకటిస్తామని అన్నారు. సీఎం జగన్ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే కార్యక్రమాన్ని ఓ వేడుకగా జరుపుతామని తెలిపారు. 

రాష్ట్రంలో ఫ్యాన్ గాలి గట్టిగా వీచిందని, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను 99 శాతం నెరవేర్చిన సీఎం జగన్ వెంటే ఏపీ ప్రజలు నిలిచారని చెప్పుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మలేదని, కూటమి ఇచ్చిన హామీలు కూడా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోయాయని బొత్స వ్యాఖ్యానించారు.

...

Complete article

Link to comment
Share on other sites

3 answers to this question

Recommended Posts

  • 0

Ambati Rambabu: సీఎం జగన్ కోసం తాపత్రయపడి ఓటు వేశారు... అందుకే పోలింగ్ శాతం పెరిగింది: అంబటి రాంబాబు

14-05-2024 Tue 16:14 | Andhra

ఏపీలో పోలింగ్ శాతం పెరిగిందన్న ఎన్నికల సంఘం

జగన్ ఐదేళ్ల పాలన చూసి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారన్న అంబటి

జగన్ కు ఓటేసేందుకు ప్రజల తపన నిన్న స్పష్టంగా కనిపించిందని వెల్లడి

cr-20240514tn6643408456bb8.jpg

ఏపీలో గత ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని ఎన్నికల సంఘం చెబుతున్న నేపథ్యంలో, ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నిన్న పోలింగ్ జరగ్గా, ఓటర్లు వెల్లువలా పోలింగ్ కేంద్రాలకు తరలిరావడాన్ని ఆయన పాజటివ్ ఓటుగా అభివర్ణించారు. వారంతా సీఎం జగన్ కోసం తాపత్రయపడి ఓటు వేశారని వెల్లడించారు. 

గతంలో, ఓట్ల శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని భావించేవాళ్లమని, కానీ ఈసారి సీఎం జగన్ ను మళ్లీ గెలిపించేందుకు మహిళలే భారీగా ముందుకొచ్చారని, 70 శాతం మంది మహిళలు ఫ్యాన్ గుర్తుకే ఓటేశారని వివరించారు. 

సీఎం జగన్ ఐదేళ్ల పాలన తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో వీటిని తాము ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, జగన్ పాలనను చూసిన వారు ఓటు వేయడానికి భారీగా తరలిరావడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. 

ఉదయం 6 గంటల  నుంచి అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని... మహిళలు, వృద్ధులు ఉదయం నుంచే పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారని మంత్రి అంబటి వివరించారు. జగన్ కు ఓటేయడానికి పడిన తపన ప్రజల్లో నిన్న స్పష్టంగా కనిపించిందని అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Gorantla Butchaiah Chowdary: అర్థరాత్రి వరకు క్యూలో నిలబడి ఓట్లు వేసింది జగన్ ను సాగనంపడానికే: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

14-05-2024 Tue 20:54 | Andhra

ఏపీలో అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాది ప్రజలు తరలివచ్చారన్న గోరంట్ల

ప్రజాతీర్పు జగన్ కు వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్య 

వైసీపీ ముఖ్య నేతలకు డిపాజిట్లు కూడా రావన్న బుచ్చయ్య

cr-20240514tn66438247b6ad2.jpg

ఏపీలో అరాచక, ఆటవిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాది ప్రజలు తరలి వచ్చి తమ తీర్పును వెలువరించారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఐదేళ్లు భరించి, ఓపిక నశించి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మార్గం అని భావించిన ప్రజలు ఉదయం 5 నుండి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి ఓట్లు వేయడం వెనుక ప్రజలు కోరుకుంటున్న మార్పు స్పష్టమవుతోందని అన్నారు. 

ఈ ఐదేళ్లలో ప్రతి రంగాన్ని కూల్చారు, ప్రతి వర్గాన్ని అధోగతిపాలు చేశారు, ఉద్యోగులను, దళితవర్గాలను, బలహీన వర్గాలను అణగదొక్కారని మండిపడ్డారు. 

"వైసీపీ సామ్రాజ్యంలో ఇష్టారీతిన చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నియంత పోకడ పోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు అన్ని ప్రాంతాల నుండి ఒక ఉద్యమంలా పోరుబాట పట్టినట్లు ఓటు బాట పట్టారు. ఈ ఉద్యమంలో ఎన్డీయే కూటమి గెలవబోతుంది.

ఈ ఎన్నిక జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులా ముందుకు సాగింది. తాము చేసిన మోసాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రం కొంతమంది జాగీరులా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు నిన్న జరిగిన పోలింగ్ విధానం తెలియజేసింది. జగన్మోహన్ రెడ్డికి అంతిమ తీర్పును ఇచ్చారు. 

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును 80 శాతం పైబడి వినియోగించుకోవడం శుభపరిణామం. జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కోలుకోలేని చావు దెబ్బ తగలబోతుంది. 

హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం, దాన్ని సమర్థించడం, గోబెల్స్ ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని తిట్టించడం చేసే జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికలు శాపంగా మారబోతున్నాయి. 2019లో ప్రజలు 151 సీట్లు ఇస్తే ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల రాష్ట్రం నాశనమైంది. రూ.13 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారు. 

జగన్మోహన్ రెడ్డి రంగులు, పేర్ల పిచ్చి వల్ల ప్రభుత్వ పథకాలను అడ్డు పెట్టుకుని పిల్లలు అడుకునే ఆట వస్తువులపై, పిల్లలు వేసుకునే లంగోటాలపై, కోడిగుడ్లపై కూడా బొమ్మలు వేసుకునే దరిద్రపు ఆలోచన ఏ ముఖ్యమంత్రికీ రాకూడదని మేం కోరుకుంటున్నాం. 

టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి విజయం తధ్యం. చంద్రబాబు నిర్విరామ కృషికి ఈ విజయం నిదర్శనంగా నిలవబోతుంది. అగ్నికి, వాయువు తోడైనట్లు పవన్ కళ్యాణ్ సహకారం మరువలేనిది. వీళ్ల కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మోడీ ఏపీకి సహకరిస్తారనే ఉద్దేశంతో పోలింగ్ ఈ స్థాయిలో జరిగింది. 

వైసీపీ సీనియర్ నాయకులకు డిపాజిట్లు గల్లంతై, అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి రాబోతుంది. ఈ ప్రజా తిరుగుబాటు వైసీపీకి గుణపాఠం కాబోతుంది...ఎన్డీయే కూటమి విజయం సాధించబోతుంది... చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది" అంటూ గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Sajjala Ramakrishna Reddy: ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తారు.. ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తింది: సజ్జల

13-05-2024 Mon 21:12 | Andhra

ఏపీలో నేడు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు

గతంలో ఈ ట్రెండ్ ఎప్పుడూ లేదన్న సజ్జల  

ఇది సీఎం జగన్ పేదల కోసం చేసిన కృషి ఫలితమేనని వ్యాఖ్య

cr-20240513tn664234ec85f7d.jpg

ఏపీలో ఇవాళ జరిగిన పోలింగ్ కు ప్రజల నుంచి భారీ స్పందన లభించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. టీడీపీ నేతలు పోలింగ్ సరళిపై సంతోషం వ్యక్తం చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ అంశంపై మాట్లాడారు. 

ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తారని, గతంలో ఈ ట్రెండ్ ఎప్పుడూ లేదని తెలిపారు. సీఎం జగన్ పేదల కోసం చేసిన కృషి ఫలితమే, ఇవాళ ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తిందని అభివర్ణించారు. 

ఓటింగ్ పై ప్రజలు ముందుగానే నిర్ణయించుకున్నారని, ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారని సజ్జల వివరించారు. టీడీపీ నేతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేసిన ప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మలేదని అన్నారు. పేద ప్రజల అభివృద్ధే తమ అజెండా అని, పేదల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధి అని స్పష్టం చేశారు.

కాగా, ఇవాళ పోలింగ్ సందర్భంగా టీడీపీ నేతలు ఉదయం నుంచి అరాచకాలకు తెరలేపారని, చిత్తూరు జిల్లాలో కత్తిపోట్లకు దిగారని... పీలేరు, సత్తెనపల్లి, అద్దంకిలో టీడీపీ కార్యకర్తలు, గూండాలు విచ్చలవిడిగా దాడులు చేశారని సజ్జల ఆరోపించారు. 

టీడీపీ వర్గీయులు రిగ్గింగ్ చేయడమే కాకుండా, ఈవీఎంలు కూడా ధ్వంసం చేశారని... అయితే, వైసీపీ శ్రేణులు ఎక్కడా నియంత్రణ కోల్పోలేదని, వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించారని వెల్లడించారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...