Jump to content
  • 2

Chandrababu's master plan to reinstate TDP in Telangana!


TELUGU

Question

తెలంగాణలో టీడీపీ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించిన చంద్రబాబు

ఏపీ ఎన్నికల్లో చరిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగుదేశం-జనసేన-బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకు 21, బీజేపీకి 3 సీట్లు రాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు దక్కాయి. లోక్ సభ ఫలితాల్లో టీడీపీకి 16, జనసేనకు 2, బీజేపీకి 3, వైసీపీకి 4 వచ్చాయి. ఏపీకి ముఖ్యమంత్రిగా ఈనెల 12వ తేదీన మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు తన దృష్టిని తెలంగాణపై సారించారు. ఆ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి మాస్టర్ ప్లాన్ ను అమలు చేయబోతున్నారు.

టీడీపీకి పూర్వ వైభంపై దృష్టి

తెలంగాణలో పార్టీని పునర్నించాలనే నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు తెలంగాణకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంపై దృష్టిపెడతానని హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెరో 8 స్థానాలను దక్కించుకోగా హైదరాబాద్ నుంచి ఎంఐఎం విజయం సాధించింది. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ ఆధ్వర్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రాంతీయ వాదంతోపాటు సెంటిమెంట్ రాజకీయాలు ప్రస్తుతం నడవకపోవడం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీ పేరు మార్చడం కూడా బీఆర్ఎస్ కు కలిసిరావడంలేదు. ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు.

chandrababu-telangana-942-1717682945.jpg

బీఆర్ఎస్ స్థానం భర్తీ చేసేలా..

బీఆర్ఎస్ స్థానాన్ని తెలుగుదేశం భర్తీ చేసేలా చంద్రబాబు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ పార్టీని నేతలు వీడిపోయారుకానీ కార్యకర్తలు వీడలేదు. వారంతా అలాగే ఉన్నారు. ఈ సమయంలో పార్టీ ఎదుగుదలపై దృష్టిపెట్టడం సరైన నిర్ణయమని ఆయన భావిస్తున్నారు. కేంద్రంలో కూడా తెలుగుదేశం మద్దతు కీలకం కావడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లిన టీడీపీ నేతలంతా భవిష్యత్తు కోసం ఆలోచించి తిరిగి టీడీపీలోకి వస్తారనే అంచనాలున్నాయి. దీనిపై త్వరలోనే తెలంగాణ పార్టీ నేతలతో మరోసారి చంద్రబాబు సమగ్ర ప్రణాళికా వ్యూహంతో భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి స్థానం ఖాళీగా ఉంది. అధ్యక్షుడిని నియమించడంతోపాటు పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు దిశానిర్దేశం చేయనున్నారు. అవసరమైతే తనతో నిరంతరం టచ్ లో ఉండాలని, పార్టీ వ్యవహారాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ఓ ఇన్ ఛార్జిని కూడా నియమిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

...

Complete article

Link to comment
Share on other sites

5 answers to this question

Recommended Posts

  • 0

people in telangana are very simple and easy-going which is why there is so much growth!

OA lu, caste pichi pappu lu tg lo udakavu which is why they got eliminated

  • Haha 1
Link to comment
Share on other sites

  • 0
16 hours ago, Sanjiv said:

people in telangana are very simple and easy-going which is why there is so much growth!

OA lu, caste pichi pappu lu tg lo udakavu which is why they got eliminated

Unless of course they resort to large-scale EVM tampering and rigging state-wide like they did in AP 🤣

 

Link to comment
Share on other sites

  • 0

తెలంగాణ గడ్డపైన పుట్టిన పార్టీ టీడీపీని మళ్ళీ నిర్మిస్తాం యువరక్తాన్ని ఎక్కిస్తా పార్టీకి.. తెలంగాణలో త్వరలోనే పార్టీ నిర్మాణం చేస్తాం - చంద్రబాబు నాయుడు

 

Link to comment
Share on other sites

  • 0
On 7/7/2024 at 4:40 PM, TELUGU said:

తెలంగాణ గడ్డపైన పుట్టిన పార్టీ టీడీపీని మళ్ళీ నిర్మిస్తాం యువరక్తాన్ని ఎక్కిస్తా పార్టీకి.. తెలంగాణలో త్వరలోనే పార్టీ నిర్మాణం చేస్తాం - చంద్రబాబు నాయుడు

Revanth (who stated he wants to be the CM of TG for the next 10 years) must be losing his sleep over this breaking announcement by CBN because Babu would rinse-n-repeat his fake EVM success in TG too with BJP's help like he did in AP LOL 🤣

Nice plan by Babu (after winning in TG) to siphon TG funds to build AP and claim it as his accomplishments!

Link to comment
Share on other sites

  • 0

KTR: అభ్యర్థులను మార్చినా జగన్ ఓడిపోలేదా?.. టీడీపీని చంద్రబాబు తెలంగాణలో బలోపేతం చేయడంలో తప్పులేదు: కేటీఆర్

cr-20240710tn668e22fd3afd8.jpg

ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్

అహంకారం వల్లే ఓడిపోయామన్న ప్రచారం నిజం కాదన్న కేటీఆర్

నిత్యం ప్రజల్లో ఉన్నా తన మిత్రుడు కేతిరెడ్డి ఓడిపోయారని వ్యాఖ్య

గెలుపునకు ప్రత్యేక సూత్రం ఏదీ ఉండదన్న బీఆర్ఎస్ అగ్రనేత

పనైపోయిందన్న చంద్రబాబు పోస్టర్లే ఢిల్లీ నిండా ఉన్నాయన్న సిరిసిల్ల ఎమ్మెల్యే

అహంకారం వల్లే తాము ఓడిపోయామన్న వాదనలో నిజం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. తామంటే పడనివాళ్లు అలా దుష్ప్రచారం చేశారు తప్పితే అందులో  వాస్తవం లేదని తేల్చి చెప్పారు. నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆయన నిన్న మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఎవరికీ లొంగని వ్యక్తి కాబట్టి ఆయనను తొక్కేందుకు తొత్తుల్ని పైన కూర్చోబెట్టి అలా ఎత్తులు వేశారని అన్నారు. తాము అహంకారం చూపించి ఉంటే యూట్యూబ్‌లో తమపై దుష్ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టి ఉండేవారమా? అని ప్రశ్నించారు. హైదరాబాద్, తెలంగాణ బాగుండాలని కోరుకోవడం అహంకారం ఎలా అవుతుందని ప్రశ్నించారు. అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవారా? అన్న ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ. ఏపీలో చాలామంది అభ్యర్థులను మార్చినా జగన్ ఓడిపోయారని గుర్తుచేశారు. 

గెలుపునకు ఒక్క సూత్రమంటూ ఉండదు
ఎన్నికల్లో గెలుపునకు ఒక్క సూత్రం అంటూ ఉండదని వివరించారు. తాము చిన్నచిన్న తప్పులు చేసిన మాట వాస్తవమేనని, తమకు ఓటేయకపోవడం ప్రజల తప్పు అని ఎవరైనా అంటే అది సరికాదని పేర్కొన్నారు. కొన్ని విషయాల్లో తమ వైఖరి మార్చుకుని ఉండాల్సిందన్న మాట మాత్రం వందశాతం నిజమని పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేకపోయామన్న కేటీఆర్.. 2014లో తన యాటిట్యూట్ (ధోరణి) ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందని స్పష్టం చేశారు. 

జగన్‌ గెలుస్తాడని అందుకే చెప్పాం
తెలంగాణలో కేసీఆర్ ఇప్పటికీ పెద్ద నాయకుడేనని చెప్పారు. రాజ్యసభలో కేంద్రానికి అంశాలవారీగా మద్దతిస్తామని పేర్కొన్నారు. ఏపీ ఎన్నికలపై తమకున్న రిపోర్టును బట్టే జగన్ గెలుస్తారని చెప్పామని వివరించారు. ఎమ్మెల్యేలు జనాల్లో లేరు కాబట్టే ఓడిపోయారని చెప్పడానికి లేదని, తన మిత్రుడు కేతిరెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉన్నా ఓటమి పాలయ్యారని గుర్తుచేశారు.

ఢిల్లీలో ఎక్కడ చూసినా బాబు పోస్టర్లే
ఐదేళ్ల క్రితం చంద్రబాబు పనైపోయిందని ప్రచారం చేశారని, ఇప్పుడు ఢిల్లీలో ఎక్కడ చూసినా చంద్రబాబు పోస్టర్లే కనిపిస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. చంద్రబాబు, రేవంత్ మధ్య జరిగిన సమావేశం ముఖ్యమంత్రుల మధ్య జరిగినట్టుగానే భావించాలని పేర్కొన్నారు. ఎన్డీయేలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తేవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తాము ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌ను పెట్టామని, కాబట్టి తెలంగాణలో ఆయన టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పడంలో తప్పులేదని అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...