Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

One-year-old child mauled to death by stray dogs in Hyderabad


TELUGU

Question

Around 1 am on Wednesday night, the boy was asleep in the hut when a pack of stray dogs reportedly entered into the hut and pulled out the boy without his father Surya Kumar and other family members noticing it

street-dogs_V_jpg--816x480-4g.webp?sw=17

Hyderabad: A one-year-old child was mauled to death by a pack of stray dogs at Shamshabad on Wednesday night.

The child Nagaraju lived along with his parents at a hut in Soma Enclave in Shamshabad. Around 1 am on Wednesday night, the boy was asleep in the hut when a pack of stray dogs reportedly entered into the hut and pulled out the boy without his father Surya Kumar and other family members noticing it.

“Half an hour later, Surya Kumar woke up to the cries of his son and found the boy outside the hut getting badly mangled by the pack of dogs. He chased away the dogs and rushed the child to hospital where doctors pronounced the child as brought dead,” said RGI Airport police.

...

Read full article

Link to comment
Share on other sites

1 answer to this question

Recommended Posts

  • 0

Stray Dogs | కనిపిస్తే కరిచేస్తున్నాయ్‌.. గ్రేటర్‌లో వీరంగం సృష్టిస్తున్న వీధి కుక్కలు

గ్రేటర్‌లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మొన్న అంబర్‌పేట...నిన్న షేక్‌పేట, రాజేంద్రనగర్‌, నేడు అద్రాస్‌పల్లి.. ఇలా వరుసగా వీధి కుక్కల దాడి సంఘటనలతో చిన్నారుల తల్లిదండ్రులు హడలిపోతున్నారు.

15-10_V_jpg--816x480-4g.webp?sw=1728&dsz

గుంపుగుంపులుగా స్వైరవిహారం

పిల్లల నుంచి వృద్ధుల వరకు బాధితులే… పిక్కలు లాగేస్తున్నా.. ప్రాణాలు పోతున్న పట్టని బల్దియా..రోజురోజుకూ సమస్య తీవ్రరూపం

వీధి కుక్కల నియంత్రణలో చేతులెత్తేసిన అధికారులు

మేయర్‌ ఆదేశించినా క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యం

Stray Dogs | సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్‌లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మొన్న అంబర్‌పేట…నిన్న షేక్‌పేట, రాజేంద్రనగర్‌, నేడు అద్రాస్‌పల్లి.. ఇలా వరుసగా వీధి కుక్కల దాడి సంఘటనలతో చిన్నారుల తల్లిదండ్రులు హడలిపోతున్నారు. పిల్లలు మొదలుకొని మహిళలు, వృద్ధుల వరకు ఇలా వీధి కుక్కలు ఎవరినీ వదలడం లేదు. మనిషి కనిపిస్తే చాలు కరిచి పడేస్తున్నాయి. పగబట్టినట్లే ప్రవరిస్తూ కండలు పీకేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట జనాలు కుక్క కాటుకు బలవుతున్న పరిస్థితి. నారాయణగూడలోని ఐపీఎం (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌)కు కుక్క కాట్లతో సుమారు 200 మంది బాధితులు క్యూ కడుతున్నారంటే.. కుక్కల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా..జీహెచ్‌ఎంసీ వీధి కుక్కల నియంత్రణను గాలికి వదిలేసింది. తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నది. ప్రధానంగా వీధి కుక్కలకు ఏబీసీ (యాంటీ బర్త్‌ కంట్రోల్‌ ఆపరేషన్స్‌) ఆపరేషనే కాకుండా రేబిస్‌ నివారణ టీకాలను వేయడంలో బల్దియా నిర్లక్ష్యం చేస్తున్నది. ఏబీసీ ఆపరేషన్లు పెంచేందుకు మూడు జోన్లలో జంతు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు విషయంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నది.

70 శాతం శునకాలకు ఏబీసీ..
జీహెచ్‌ఎంసీ పరిధిలో 70 శాతం కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన కుక్కలకు శస్త్రచికిత్స జరగాల్సి ఉందన్నారు. ఈ లెక్కలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన హైలెవల్‌ కమిటీ సమావేశంలోనూ వీధి కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులు చెప్పలేకపోయారు. దీంతో మేయర్‌తో పాటు అన్ని పార్టీల కార్పొరేటర్లతో ఏర్పాటైన హైలెవల్‌ కమిటీ సభ్యులు తీవ్ర స్థాయిలో అధికారుల నిర్లక్ష్యాన్ని తూర్పారా పట్టారు. అయినా సంబంధిత వెటర్నరీ విభాగంలో చలనం లేదు. దీంతో రోజురోజుకూ వీధి కుక్కల బెడద తీవ్రరూపం దాల్చుతున్నది. ఒంటరిగా కనిపిస్తే చాలు గుంపులుగా వెంటపడి కరుస్తున్నాయి. వీధుల వెంబడి గుంపులు గుంపులుగా తిరుగుతూ దడ పుట్టిస్తున్నాయి. రాత్రి సమయాల్లో వాహనదారులను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలే ఒక వైపు ఎండవేడి, మరోవైపు చెత్త వ్యర్థాల డంపింగ్‌ వద్ద నిల్వ ఉన్న ఆహారపదార్థాలను తినడం వల్ల కుక్కల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. కనిపించిన వారిపై పిచ్చికోపంతో దాడులకు తెగబడుతున్నాయి. సహజంగా ఎండాకాలంలో తాగునీటి వసతి తక్కువగా ఉండటంతో వేడి తీవ్రతతో వీధికుక్కల్లో ప్రకోపనం (ఇరిటేషన్‌) అధికంగా ఉంటుంది. వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, రేబిస్‌ వ్యాక్సిన్లు వేశామని చెబుతున్నారు.. కానీ రోజురోజుకూ కుక్కల సంతతి పెరుగుతుండడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది.

18 నెలల పాపపై వీధి కుక్కల దాడి
వీధి కుక్కల దాడిలో 18 నెలల పాప తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మూడుచింతలపల్లి మండలం ఆద్రాస్‌పల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కరుణాకర్‌ కూతురు రుష్మిత ఆడుకుంటుండగా వీధి కుక్కలు చుట్టు ముట్టి దాడి చేశాయి. గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు కుక్కలను చెదరగొట్టి పాపను తొలుత నీలోఫర్‌ ఆస్పత్రికి అనంతరం మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మొత్తం వీధికుక్కలు స్టెరిలైజేషన్‌ స్టెరిలైజేషన్‌ చేయని కుక్కల సంఖ్య

ఎల్బీనగర్‌ ; 67242 ,42857 ,24385

చార్మినార్‌; 109771 ,72105 ,37666

ఖైరతాబాద్‌ ; 438103 ,5632 ,8178

శేరిలింగంపల్లి ; 33181 ,31368 ,1813

కూకట్‌పల్లి ; 48114 ,41213 ,6901

సికింద్రాబాద్‌ ; 77038 ,58952 ,18086

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...