Jump to content
  • 0

Women's health


TELUGU

Question

Weight gain: అలర్ట్! మహిళలూ.. వయసు 40 దాటిందా? అయితే..

వయసు 40 దాటి అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు పాటించాల్సిన కొన్ని పరిష్కారాలు

1_fd7e437d77_V_jpg--799x414-4g.webp

ఇంటర్నెట్ డెస్క్: వయసు 40 దాటిందంటే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. జీవక్రియలు నెమ్మదించడం, హార్మోన్ల మార్పులు వంటివి మొదలవుతాయి. ఫలితంగా, మహిళల్లో కొందరు బరువు కూడా పెరుగుతారు. ఇది ఒక్కోసారి అదుపు తప్పినట్టు కూడా అనిపిస్తుంది. పరిస్థితిని అలాగే వదిలేస్తే దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి పడే ప్రమాదం ఉంది. అయితే, జీవనశైలిలో కొన్ని ముఖ్య మార్పులు చేస్తే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపొచ్చని వైద్యులు చెబుతున్నారు.

వెయిట్ ట్రెయినింగ్..

మహిళల్లో వయసు పెరిగే కొద్దీ మసిల్ మాస్ అంటే కండరాల్లో క్షీణత వస్తుంది. ఫలితంగా జీవక్రియలు నెమ్మదిస్తాయి. అయితే, కసరత్తులు చేసేటప్పుడు వెయిట్ ట్రెయినింగ్‌పై దృష్టి పెడితే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. బరువులు ఎత్తడం, రెసిస్టెన్స్ బ్యాండ్స్ వంటి వాటితో ఎక్సర్‌సైజులు చేస్తే కండరాల పటుత్వం పెరుగుతుంది. ఫలితంగా, జీవక్రియలు వేగవంతమై, ఎముకల సాంద్రత కూడా పెరుగుతుంది. దేహదారుఢ్యం ఇనుమడిస్తుంది.

హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రెయినింగ్

మజిల్ మాస్ పెంచేందుకు హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ కూడా అనువైన విధానమని వైద్యులు చెబుతున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపు తీవ్ర స్థాయిలో కసరత్తు చేసి ఆ తరువాత కాసేపు విరామం తీసుకోవాలి. మళ్లీ ఇదే విధంగా కసరత్తు కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల కెలొరీలు వేగంగా ఖర్చవుతాయి. కసరత్తులు పూర్తయ్యాక కూడా కెలొరీల వినియోగం కొనసాగి బరువు నియంత్రణలోకి వస్తుంది.

శరీరానికి తగినంత నిద్ర..

శరీరానికి కావాల్సినంత నిద్ర ఉంటేనే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. కానీ నిద్ర విషయంలో చాలా మంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. రోజుకు 7 నుంచి 9 గంటల పాటు ఆటంకాలు లేని నిద్ర బరువు నియంత్రణకు కీలకమని నిపుణులు చెబుతున్నారు.

ఆహారపు అవాట్లలో మార్పులు..

వయసు పెరిగే కొద్దీ జీవక్రియలు నెమ్మదిస్తాయి కాబట్టి తిండి విషయంలో నియంత్రణ అవసరం. పరిమితంగా తినడంపై దృష్టిపెట్టడంతో పాటూ తినేటప్పుడు హడావుడి లేకుండా జాగ్రత్తగా ఆస్వాదిస్తూ తినడం కూడా బరువు నియంత్రణకు అవసరం

...

Read full article

Link to comment
Share on other sites

1 answer to this question

Recommended Posts

  • 0

Hormonal Imbalance: మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లక్షణాలు, కారణాలు..!

Hormonal Imbalance In Women: ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా కొంది మంది మహిళ్లలో హార్మోన్ ఇమ్‌బ్యాలెన్స్  సమస్యలు తలెత్తతున్నాయి. దీనిని అనేర రకాల కారణాలు ఉన్నాయి. అలాగే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

311572-untitled-design-17.jpg?itok=55-lm

Hormonal Imbalance In Women: మహిళల్లో హార్మోన్ల  ఇమ్‌బ్యాలెన్స్ చాలా సాధారణ సమస్య. ఇది వివిధ రకాల లక్షణాలకు దారితీస్తుంది. ఈ లక్షణాలు స్త్రీ వయస్సు, ఆరోగ్య పరిస్థితులు వల్ల ఈ హార్మోన్ల  ఇమ్‌బ్యాలెన్స్ కు  కారణమైన హార్మోన్లను బట్టి మారుతూ ఉంటాయి. నేటికాలంలో మారిన ఆహార అలవాట్ల కారణాంగా, తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యల వల్ల ప్రతి పది మంది మహిళలలో ఈ సమస్య ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆరోగ్య నిపుణులు ప్రకారం, మన శరీరంలో యాభై కన్నా ఎక్కువ హార్మోన్లు ఉంటాయి. ఈ హార్మోన్‌ల లెవల్స్‌ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు ఈ హార్మోన్‌ ఇమ్‌బ్యాలెన్స్‌ లక్షణాలు కనిపిస్తాయి. అందులో కొన్ని లక్షణాలు.. రుతుస్రావం రాకపోవడం, అధికంగా రుతుస్రావం, తీవ్రమైన నొప్పితో కూడిన రుతుస్రావం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం, అంతేకాకుండా ఈ హార్మోన్‌లు  మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. దీని కారణంగా మూడ్ స్వింగ్స్, ఆందోళన, డిప్రెషన్ వంటి లక్షణాలు కలుగుతాయి. ముఖంపై మొటిమలు, పొడి చర్మం లేదా జిడ్డు చర్మం వంటి చర్మ సమస్యలకు హార్మోన్లు కారణమవుతాయి . ఈస్ట్రోజెన్ స్థాయిలలో మార్పుల వల్ల వేడి ఆవిర్లు లేదా రాత్రి చెమటలు రావచ్చు. హార్మోన్ల అసమతుల్యత లైంగిక కోరికలను ప్రభావితం చేస్తుంది.

హార్మోన్ల అసమతుల్యతకు కొన్ని కారణాలు:

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS): PCOS అనేది ఒక సాధారణ హార్మోన్ల అసమతుల్యత, ఇది అండాశయాలలో సిస్ట్‌ల ఏర్పాటుకు దారితీస్తుంది.

థైరాయిడ్ సమస్యలు: హైపోథైరాయిడిజం, హైపర్‌థైరాయిడిజం వంటి థైరాయిడ్ సమస్యలు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి.

మధుమేహం: మధుమేహం ఇన్సులిన్ హార్మోన్ స్థాయిలను ప్రభావిత అయినప్పుడు ఈ హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. 

హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌ను నివారించడానికి చిట్కాలు:

హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌ నుంచి ఉపశమనం పొందాలి అంటే ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్‌ ప్రోటీన్‌ ఇతర పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ప్రాసెస్‌ చేసిన ఆహారం, షుగర్‌ కలిగే పదార్థాలు, అధిక కొవ్వులు కలిగిన పదార్థాలు తీసుకోకుండా చూసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయండి. ప్రతి రాత్రి 7-8 గంటల నిద్రపోయేలా చూసుకోండి.యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాల వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను అభ్యసించండి. మీరు ఏవైనా మందులు తీసుకుంటుంటే అవి మీ హార్మోన్లను ఎలా ప్రభావితం చేస్తాయో మీ వైద్యుడితో మాట్లాడండి. మీకు ఏవైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లక్షణాలు ఉంటే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. మీరు ఈ చిట్కాలను అనుసరిస్తే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి  మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీరు సహాయపడవచ్చు. అలాగే సందేహాలు ఉండే వైద్యుడిని సంప్రదించండి.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...