Jump to content
  • 0

TS News: పాస్‌‌బుక్‌కు రూ.40 లక్షలు లంచం.. ఎన్ని ఎకరాల కోసమంటే


TELUGU

Question

Untitled_5_bfe22d8f58_V_jpg--799x414-4g.

పట్టాదార్‌ పాస్‌బుక్‌ ఇవ్వడానికి రూ.30 లక్షలు లంచం బొక్కి.. అదీచాలక మరో రూ.10 లక్షలు డిమాండ్‌ చేసిన శామీర్‌పేట తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు ప్రాంతానికి చెందిన రైతు మువ్వ రామశేషగిరిరావు.. మేడ్చల్‌ జల్లా శామీర్‌పేట మండలం, లాల్‌గడి మలక్‌పేట గ్రామ పరిధిలో 2006లో 29 ఎకరాల భూమిని పలువురు రైతుల నుంచి కొనుగోలు చేశారు. అయితే, ఈ పట్టా భూమిపై కోర్టులో కేసులు ఉన్నాయి. భూమి కొన్న రామశేషగిరిరావుకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని కోర్టులు ఆదేశాలు జారీ చేయడంతో.. శేషగిరిరావు తహసీల్దార్‌ సత్యానారాయణను కలిశారు. ఏడాది పాటు ఆయన కార్యాలయం చుట్టూ తిరగ్గా.. రూ.30 లక్షలు లంచం ఇస్తేనే ఆ భూమిని ధరణిలో ఆయన పేరిట నమోదు చేస్తామని, పట్టాదార్‌ పాస్‌బుక్‌ ఇస్తామని తహసీల్దార్‌ తేల్చిచెప్పారు. ఇందుకు ఒప్పుకొన్న శేషగిరిరావు.. నెలరోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో రూ.10 లక్షలు తహసీల్దార్‌కు ఇచ్చారు. తర్వాత మరో రూ.20 లక్షల చెక్కును తహసీల్దార్‌కు ఇచ్చారు. ఇంకా రూ.10 లక్షలు ఇవ్వాలంటూ సత్యనారాయణ సదరు రైతును సతాయిస్తుండడంతో.. రామశేషగిరిరావు విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సత్యనారాయణ అవినీతిపై గతంలోనే పలు ఆరోపణలు రావడంతో ఆయన్ను పట్టుకోవడానికి ఏసీబీ అధికారులు మూడుసార్లు ప్రయత్నించినా తప్పించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో రామశేషగిరిరావు నుంచి ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు ఈసారి పక్కా వ్యూహం పన్నారు.

వారి సూచనల మేరకు రామశేషగిరిరావు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో శామీర్‌పేట తహసీల్దార్‌ కార్యాలయానికి రూ.10 లక్షల తీసుకెళ్లారు. తహసీల్దార్‌ సత్యనారాయణను కలిసి డబ్బును తెచ్చినట్టు చెప్పగా.. ఆ సొమ్మును కార్యాలయ ఆవరణలో ఉన్న తన డ్రైవర్‌కు ఇవ్వాలని చెప్పారాయన. ఆ డబ్బును రామశేషగిరిరావు తహసీల్దార్‌ డ్రైవర్‌కు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

0 answers to this question

Recommended Posts

There have been no answers to this question yet

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...