Jump to content
  • 0

K Kavitha: Arrest


TELUGU

Question

K Kavitha: మలుపు తిరిగిన లిక్కర్ కేసు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా మార్చిన సీబీఐ.. విచారణకు రావాలని సమన్లు

nf0uoav4_k-kavitha_625x300_15_November_2

 

New Delhi: 

The respite to BRS leader K Kavitha from appearance before the Enforcement Directorate (ED) for questioning in the Delhi excise policy case will continue as the Supreme Court on Monday adjourned her petition challenging the agency's summons to February 16.

A bench of Justices Bela M Trivedi and Pankaj Mithal deferred the matter after senior advocate Kapil Sibal, appearing for Kavitha, said the matter may be listed for final hearing.

Additional Solicitor General S V Raju, appearing for the ED, told the court that Kavitha is avoiding summons and not appearing before the agency.

Mr Sibal then said that the ASG had assured the bench in September last year that the agency will not call Kavitha, a Lok Sabha MP, for questioning till the court hears her plea challenging the summons.

Mr Raju said that was only till the next hearing.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

ఇప్పటి వరకు కేసులో సాక్షిగా ఉన్న కవిత

ఇప్పుడు కవితను నిందితురాలిగా మార్చిన సీబీఐ

26న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ

cr-20240223tn65d87d7b03e3d.jpg

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ ఈ కేసులో నిందితురాలిగా చేర్చింది. ఈనెల 26న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకావాలని 41ఏ కింద సమన్లు జారీ చేసింది. వాస్తవానికి 26న విచారణకు రావాలని సీబీఐ ఇంతకు ముందే నోటీసులు ఇచ్చింది. అయితే గత నోటీసుల్లో ఆమెను సాక్షిగా పేర్కొన్న సీబీఐ... దాన్ని సవరిస్తూ ఇప్పుడు నిందితురాలిగా పేర్కొంది. ఈ పరిణామం బీఆర్ఎస్ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Kavitha writes to CBI asking to withdraw notice

She expressed her inability to appear before the investigation agency at the CBI headquarters in Delhi on Monday, due to pressing public engagements and the upcoming Parliamentary elections in Telangana.

kavitha-2_V_jpg--816x480-4g.webp?sw=1728

Hyderabad: BRS MLC K Kavitha on Sunday wrote to the Central Bureau of Investigation (CBI), urging the agency to withdraw the notice issued to her under Section 41-A of CrPC summoning her for questioning in connection with the Delhi excise policy case. She expressed her inability to appear before the investigation agency at the CBI headquarters in Delhi on Monday, due to pressing public engagements and the upcoming Parliamentary elections in Telangana.

The BRS legislator said the notice to appear at the probe agency’s headquarters should be put in abeyance in the light of her pressing engagements coupled with the necessity of her personal presence in the State while the parliamentary elections were approaching. She also requested the CBI to revoke or withdraw the subject notice under Section 41A CrPC, while not being aware or conscious of the earlier notice sent to her under Section 160 CrPC and was complied with.

A notice under Section 41A of CrPC is issued to a person against whom a “reasonable suspicion” exists that the person had committed a cognizable offence. Section 160 of the CrPC pertains to summoning a witness. Kavitha said the notice under Section 41A CrPC was in complete contrast to the earlier notice under Section 160 of CrPC issued to her on December 2, 2022.

In December 2022, the CBI had recorded her statement at her residence in Hyderabad. “There is absolutely no logic, reason or background forthcoming as to how, why and under what circumstances you have now resorted to Section 41A CrPC,” she said.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

BRS' K Kavitha Gets Immunity From Questioning Till March 13

The Central Bureau of Investigation had asked K Kavitha to appear for questioning, which she had skipped citing multiple "pressing" public engagements and the petition pending in the Supreme Court.

h614mbq8_k-kavitha-twitter-ani_625x300_3

New Delhi: 

Bharat Rashtra Samithi leader K Kavitha will have immunity from interrogation by Central investigative agency Enforcement Directorate till March 13. The Supreme Court, following a petition by her, extended relief. The 45-year-old, who is also the daughter of former Telangana Chief Minister K Chandrasekhar Rao, is wanted for questioning in connection with the alleged Delhi liquor scam.

In her petition to the top court,  Ms Kavitha had said that she should be interrogated at her home. Women have the right to privacy and cannot be called to the ED office, she had contended.

Last week, the Central Bureau of Investigation  had asked her to appear for questioning, which she had skipped citing multiple "pressing" public engagements and the petition pending in the Supreme Court.

It was the second time the BRS leader skipped summons for questioning. She was questioned last by the Central agency in December 2022.   

She went to the Supreme Court in March last year, seeking relief from questioning by the Enforcement Directorate. The court had granted her a temporary reprieve, which was extended today.

The Central agencies have alleged that Ms Kavitha is part of the "South Cartel" that benefited from kickbacks in the liquor policy of Delhi, in which Aam Aadmi Party leader Manish Sisodia has been arrested. The policy was withdrawn after a political storm.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

The ED move comes after Kavitha, the daughter of former Telangana Chief Minister K Chandrashekar Rao, failed to appear for at least two summonses issued by the investigative agency.

Polish_20240315_191513793.jpg

After searches at the Hyderabad house of Bharat Rashtra Samithi (BRS) MLC K Kavitha on Friday in connection with an alleged money laundering case linked to the Delhi liquor policy case, the Enforcement Directorate (ED) has arrested her and will bring her to Delhi for questioning.

 

Kavitha's brother and MLA KTR opposed Kavitha's arrest, claiming that the ED had not produced transit warrant for her arrest. The visuals of his argument with ED officials surfaced on social.

 

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Protest | ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులు.. బీఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసన.. ఖబడ్దార్‌ మోదీ అంటూ నినాదాలు.. Video 

Protest | ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులకు నిరసనగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసనకు దిగాయి. భారత జాగృతి, బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కవిత ఇంటి దగ్గరకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. బీజేపీ డౌన్‌ డౌన్‌, ఖబడ్దార్‌ నరేంద్రమోదీ, బీజేపీ నాయకుల్లారా ఖబడ్ధార్‌ అంటూ నినాదాలు చేశారు.

Protest_V_jpg--816x480-4g.webp?sw=1728&d

Protest : ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులకు నిరసనగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసనకు దిగాయి. భారత జాగృతి, బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కవిత ఇంటి దగ్గరకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. బీజేపీ డౌన్‌ డౌన్‌, ఖబడ్దార్‌ నరేంద్రమోదీ, బీజేపీ నాయకుల్లారా ఖబడ్ధార్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.

Hyderabad, Telangana: BRS workers staged a protest against the ED raids conducted at the party MLC K Kavitha's residence.

 

Link to comment
Share on other sites

  • 0

When there is Election, ED comes before Modi ED gave notice to @RaoKavitha in Sept 2023 weeks before Telangana Assembly notification, Now ED,IT Raid just hours before LokSabha schedule BJP is running OTT WebSeries with ED,IT,CBI & we will face their harassment without Fear

 

Link to comment
Share on other sites

  • 0

KTR: కవిత అరెస్ట్ నేపథ్యంలో... బీజేపీని ఎండగడుతూ చంద్రబాబు చేసిన పాత ట్వీట్ ను తిరగదోడిన కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్

2019 ఎన్నికల నాటి చంద్రబాబు ట్వీట్ ను రీపోస్ట్ చేసిన కేటీఆర్

ఎన్నికల ముందు ఇలాంటి దాడులేంటని ఆ ట్వీట్ లో చంద్రబాబు ఆగ్రహం

cr-20240315tn65f475533af0b.jpg

టీడీపీ అధినేత చంద్రబాబుకు, బీజేపీకి మధ్య 2019 ఎన్నికల వేళ ఎంతటి మనస్పర్ధలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. కానీ అదే బీజేపీ ఇప్పుడు చంద్రబాబుకు మిత్రపక్షం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్... చంద్రబాబు గతంలో చేసిన ఓ పాత ట్వీట్ ను వెలికితీశారు. తన సోదరి కవితను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఆ ట్వీట్ ను రీపోస్ట్ చేశారు. 

ఇంతకీ ఆ ట్వీట్ లో చంద్రబాబు ఏమని పేర్కొన్నారంటే... "2019 సాధారణ ఎన్నికల ముందు సీబీఐ, ఈడీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తూ విపక్ష నేతలను, వారి కుటుంబ సభ్యులను వేధించడం తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తోంది. బీజేపీ ఏ విధంగా రాజకీయ ప్రతీకారానికి ఒడిగడుతోందో దీన్ని బట్టే అర్థమవుతోంది. ఈ దాడులు ఈ సమయంలోనే జరగడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు దాడులు చేస్తున్నారు?" అంటూ చంద్రబాబు ఆ ట్వీట్ లో ప్రశ్నించారు. 

చంద్రబాబు 2019 ఫిబ్రవరి 6న ఆ ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్ ను ఇవాళ కవిత అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ చక్కగా వాడుకున్నారు. "ఈ కింది ట్వీట్ లో చంద్రబాబు గారు భలే చెప్పారు... ఇంత కరెక్ట్ గా ఎవరూ చెప్పలేరేమో!" అంటూ తన రాజకీయ చతురత ఉపయోగించారు.

...

Complete article

 

Link to comment
Share on other sites

  • 0

K Kavitha: ఇదిగో... అంతా పథకం ప్రకారమే కవితను అరెస్ట్ చేశారు!: హరీశ్ రావు

అక్రమ అరెస్టును న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటామన్న హరీశ్ రావు

బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు పన్నుతున్నాయని ఆరోపణ

ఈడీ అధికారులు ముందే ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేశారన్న హరీశ్ రావు

రేపు ఈసీ నోటిఫికేషన్ వస్తుందనగా ఈ రోజు అరెస్ట్ చేశారని వెల్లడి

సుప్రీం కోర్టు తీర్పు రావడానికి మూడునాలుగు రోజుల ముందు అరెస్ట్ ఏమిటి? అని ప్రశ్న

కావాలనే శుక్రవారం వచ్చారని... అదీ మధ్యాహ్నం వచ్చారన్న హరీశ్ రావు

కోర్టు సమయం అయిపోయాక సాయంత్రం అరెస్ట్‌ను ప్రకటించారని ఆగ్రహం

cr-20240315tn65f46816684e2.jpg

తమ పార్టీ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు పథకం ప్రకారం అరెస్ట్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఈ అరెస్ట్‌పై హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ... అక్రమ అరెస్టును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు. అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి చట్టపరంగా పోరాడుతామని తెలిపారు. బీజేపీ తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. కవిత అరెస్ట్‌ను నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన చేపడతామన్నారు.

ఏడాదిన్నర క్రితం విట్‌నెస్ కింద నోటీసులు ఇచ్చామని చెప్పిన ఈడీ... ఈరోజు వచ్చి అక్యూస్డ్ కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం దారుణమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి తమ పార్టీపై కుట్రలు పన్నుతున్నాయన్నారు. కవిత అరెస్ట్ ద్వారా తమ పార్టీ ప్రతిష్టను, కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమది ఉద్యమాల పార్టీ అని... ఇవి తమకు కొత్త కాదన్నారు. ఇలాంటి కుట్రలు, అణచివేతలను, అక్రమ కేసులు ఎదుర్కోవడం ఉద్యమం నుంచి తెలిసిందే అన్నారు. ఈ కుట్రలను దాటుకొనే తెలంగాణను సాధించామన్నారు. 

పథకం ప్రకారమే చేశారు...

  కవిత అరెస్టుపై అంతా ముందే ప్లాన్ చేసుకొని వచ్చారని హరీశ్ మండిపడ్డారు. అంతా పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. ఈడీ అధికారులు ముందుగానే ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకున్నారని తెలిపారు. రేపు ఈసీ నోటిఫికేషన్ వస్తుందనగా ఈ రోజు అరెస్ట్ చేశారని విమర్శించారు. ఈ నెల 19న సుప్రీం కోర్టు తీర్పు రావడానికి మూడునాలుగు రోజుల ముందు అరెస్ట్ ఏమిటి? అని ప్రశ్నించారు. కావాలనే శుక్రవారం వచ్చారని... అదీ మధ్యాహ్నం వచ్చారని తెలిపారు. తద్వారా కోర్టుకు వెళ్లకుండా పథకం వేశారని ఆరోపించారు. కోర్టు సమయం అయిపోయాక సాయంత్రం ఐదున్నరకు అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారని మండిపడ్డారు. ఓ మహిళను ఇలా అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

కవిత అరెస్ట్‌ను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. సుప్రీంకోర్టులో అక్రమ అరెస్టుపై పిటిషన్ వేస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమను దెబ్బతీసేందుకే ఇలా చేశారని ప్రజలకు తెలుసునన్నారు. బీజేపీ కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామన్నారు. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని... దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

K Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త, పీఆర్వో రాజేశ్, మరో ముగ్గురికి ఈడీ నోటీసులు

సోమవారం తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ

కవిత ఇంట్లో సోదాల సమయంలో వీరి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్న ఈడీ

నిన్న మొత్తం పది ఫోన్లు సీజ్ చేసిన ఈడీ అధికారులు

cr-20240316tn65f5979dd8c57.jpg

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, పీఆర్వో రాజేశ్, మరో ముగ్గురు అసిస్టెంట్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ సూచించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టుకూ ఈడీ వెల్లడించింది. నిన్న కవిత ఇంట్లో సోదాలు చేసిన సమయంలో కవిత ఫోన్‌లతో పాటు భర్త అనిల్ ఫోన్, పీఆర్వో రాజేశ్‌కు చెందిన రెండు ఫోన్లు, మరో ముగ్గురు అసిస్టెంట్లకు చెందిన ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. మొత్తం పది ఫోన్లను స్వాధీనం చేసుకుంది. వీటిని తీసుకోవడానికి ఢిల్లీకి రావాలని వారికి తెలిపింది.

ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ నిన్న అరెస్ట్ చేసింది. ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. కోర్టు ఆమెకు వారం రోజుల ఈడీ కస్టడీ విధించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఆమెను ఈడీ అధికారులు విచారించనున్నారు. అంతలోనే ఇప్పుడు కవిత భర్తకు, మరో నలుగురికి ఈడీ నోటీసులు ఇవ్వడం గమనార్హం.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

K Kavitha: కవిత రిమాండ్... ఢిల్లీలో అడ్వోకేట్ టీమ్‌ను ఏర్పాటు చేయనున్న కేసీఆర్

సోమా భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్న కేసీఆర్

ఢిల్లీలోని ప్రముఖ లాయర్లతోనూ మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధిష్ఠానం

కవిత కేసు కొలిక్కి వచ్చే వరకు ఢిల్లీలోనే లాయర్స్ టీమ్

cr-20240316tn65f59b7a64dd0.jpg

తన కూతురు, ఎమ్మెల్సీ కవితను వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. కవిత కోసం ఢిల్లీ అడ్వోకేట్ టీమ్‌ను కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారు. సోమా భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. వీరితో పాటు ఢిల్లీలోని ప్రముఖ లాయర్లతోనూ మాట్లాడుతున్నారు. కవిత కేసు కొలిక్కి వచ్చే వరకు కొందరు కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

ఈడీ రేపటి నుంచి కవితను ఏడు రోజుల పాటు విచారించనుంది. ఈ నేపథ్యంలో సోమా భరత్ ఆధ్వర్యంలో అడ్వోకేట్ టీమ్ ఆమెకు అందుబాటులో ఉండనున్నారు. ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలు... ఆమె చెప్పే సమాధానాలపై వారు సూచనలు ఇవ్వనున్నారు. కవిత కస్టడీలో ఉన్నప్పుడు రోజూ గంటసేపు ములాఖత్ ఉంటుంది. ఈ ములాఖత్ సమయంలో అడ్వోకేట్ టీమ్ అందుబాటులో ఉండి సూచనలు చేస్తుంది. రిమాండ్ పూర్తయ్యే వరకు లేదా కేసు తేలే వరకు వారు అక్కడే ఆమెకు అందుబాటులో ఉంటారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Revanth Reddy: కవిత అరెస్ట్‌పై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కవిత అరెస్ట్ ఓ ఎన్నికల స్టంట్ అని విమర్శ

కూతురు అరెస్ట్‌ను కేసీఆర్ ఖండించలేదన్న రేవంత్ రెడ్డి

నిన్న ఈడీ, మోదీ ఒకేసారి వచ్చారన్న ముఖ్యమంత్రి

కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలుస్తోందని బీజేపీ, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం

cr-20240316tn65f561fdb9251.jpg

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇదో ఎన్నికల స్టంట్ అని విమర్శించారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... తన కూతురు అరెస్టును స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖండించలేదని గుర్తు చేశారు. ఆయన మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని ప్రశ్నించారు. ఈ అరెస్ట్‌పై కేసీఆర్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా మౌనంగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. వారి మౌనం వెనుక వ్యూహం ఉందన్నారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారని... నిన్న మాత్రం ఈడీ, మోదీ ఒకేసారి వచ్చారన్నారు.

బీజేపీ, కేసీఆర్ కుటుంబం కలిసి మద్యం కుంభకోణాన్ని సీరియల్‌లా నడిపించాయని మండిపడ్డారు. కవిత అరెస్ట్ కేవలం బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అన్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు ఒకరోజు ముందు ఈ పరిణామం జరిగిందని... ఎందుకో అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 12 లోక్ సభ స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు చెబుతున్న సమయంలో తమను దెబ్బతీసేందుకే ఆ రెండు పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ అరెస్ట్ కేవలం ఎన్నికల స్టంట్ అన్నారు. తెలంగాణకు ప్రధాని మోదీ చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ప్రధానిగా ఆయన చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. తెలంగాణను అవమానించిన మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

K Kavitha: రానున్న 10 రోజుల్లో కవితకు సమన్లు ఇవ్వం అని మాత్రమే సెప్టెంబర్ 15న చెప్పాం: కోర్టులో ఈడీ లాయర్

విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేశామని వెల్లడి

ఒక ఆర్డర్ తనకు అనుకూలంగా ఉన్నంత మాత్రాన నిరవధిక కాలానికి వర్తింప చేసుకోకూడదన్న ఈడీ

తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్న ఈడీ తరఫు లాయర్

cr-20240316tn65f55d3e1d4b8.jpg

రానున్న పది రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సమన్లు ఇవ్వమని మాత్రమే గత ఏడాది సెప్టెంబర్ 15న చెప్పామని, అదే సమయంలో విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేశామని ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుసేన్ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపారు. ఈడీ అధికారులు నిన్న కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ఆమెను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట శనివారం హాజరుపరిచారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా, ఈడీ తరఫున ఎన్.కే.మట్టా, జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు.

మీడియాలో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకోవద్దని ఈడీ న్యాయవాది కోర్టును కోరారు. రానున్న పది రోజుల్లో సమన్లు ఇవ్వం అని అప్పుడు చెప్పామన్నారు. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని చెప్పినట్లు వెల్లడించారు. ఒక ఆర్డర్ తనకు అనుకూలంగా ఉన్నంత మాత్రాన దానిని నిరవధిక కాలానికి వర్తింపచేసుకోవద్దన్నారు. అలాగే వేరేవారి ఉత్తర్వులను కూడా తమకు అన్వయించుకోవడం సరికాదన్నారు.

మధ్యంతర ఉత్తర్వులు మొత్తానికి వర్తించవన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకటన కోర్టు ఉల్లంఘన కిందకు రాదని, తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని కోర్టుకు తెలిపారు. కవిత వివిధ అంశాలపై సుప్రీంకోర్టుకు కేవలం విజ్ఞప్తి మాత్రమే చేశారని గుర్తు చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Excise 'scam': Delhi Court Sends BRS Leader Kavitha to ED Custody Till Mar 23

BRS leader K Kavitha, allegedly a key member of the 'South Group', which has been accused of paying the ruling AAP kickbacks of Rs 100 crore in return for a big share of liquor licenses in the national capital, was on Saturday remanded in ED custody till March 23 in a money laundering case linked to the Delhi excise policy "scam".

Kavitha, a member of the Telangana Legislative Council and daughter of former state chief minister K Chandrashekar Rao, was produced before Special Judge for ED cases M K Nagpal, who sent her to the custody of the federal anti-money laundering agency for a week.

The ED had sought her custody for 10 days. Kavitha, 46, was arrested from her Banjara Hills residence on Friday amid protests by Bharat Rashtra Samithi (BRS) supporters. While sending her to ED custody, the judge said the need for her custodial interrogation was felt to be there as it has been observed that investigation has come to a halt because of her alleged non-co­operation.

"The involvement of accused in commission of the alleged offence of money laundering and the crucial role played by her are duly reflected from records and the case file produced by IO before this court and the need for her custodial interrogation is also felt to be there as it has been observed that investigation has come to a halt because of non ­ joining thereof by the accused or her alleged non-co­operation therein and she is required to be interrogated to trace out the trail of a major portion of the proceeds of crime," the judge said.

On accused's arguments that ED violated Supreme Court's directions, the judge said that "effecting arrest of the accused amounts to contempt of any order or not is a question which has to be decided by the Supreme Court itself and not by this court."

"Keeping in view the nature of allegations leveled against accused and the role played by her in commission of the alleged offence, there is a need for remanding her to ED custody for the purposes of investigation. Hence, the accused is being remanded to the custody of ED till March 23, 2024 for the purposes of her detailed and sustained interrogation and she shall be produced before this court at 12 pm on that day," the judge said.

Though Kavitha has not been named as an accused in any charge sheet filed by the ED, the agency has claimed she was a key figure of the 'South Group' who made benami investments in beneficiary liquor companies.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Burning Topic : లిక్కర్ స్కామ్‌లో కవితకు సంబంధం ఏంటి..? | Delhi liquor scam | TV9

 

Link to comment
Share on other sites

  • 0

MLC Kavitha Remand : సోమవారం ఉదయం కవిత తో పాటు విచారణకు భర్త అనిల్ - TV9

 

Link to comment
Share on other sites

  • 0

Live : కవిత అరెస్టుపై హైదరాబాద్ పబ్లిక్ రియాక్షన్ | Hyderabad Public About Kavitha Arrest | Manamtv

 

Link to comment
Share on other sites

  • 0

K Kavitha: కవిత తొలి రోజు ఈడీ విచారణ పూర్తి.. ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ అధికారులు

విచారణను వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు

ఆప్ కు ఇచ్చిన రూ. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్న

కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్న కవిత

cr-20240317tn65f70dfe34196.jpg

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తొలిరోజు ఈడీ విచారణ ముగిసింది. తొలి రోజే ఆమెపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ ప్రక్రియను అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. ఆప్ కు ఇచ్చిన రూ. 100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎవరెవరు డబ్బులు సమకూర్చారనే ఆధారాలను కూడా చూపిస్తూ ఆమెను ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా సంపాదించిన రూ. 192 కోట్ల సంగతి ఏమిటని అడిగారు. డబ్బులు ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారని ప్రశ్నించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు చెప్పిన కవిత... మరి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు చెప్పిన కవిత... మరి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

అరెస్టు అక్రమం

ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి తన అరెస్టు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఏకపక్షంగా, నియంతృత్వంతో వ్యవహరించిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

fkjbh_ded1d07b18_V_jpg--799x414-4g.webp

ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి తన అరెస్టు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఏకపక్షంగా, నియంతృత్వంతో వ్యవహరించిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. సుప్రీంకోర్టులో తాను గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఈడీ అధికారులు నిబంధలను ఉల్లంఘిస్తూ తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక, నిస్సహాయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈ మేరకు కవిత మంగళవారం సుప్రీంకోర్టులో 537 పేజీలతో కూడిన రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో వందలకోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ఈడీ.. ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయిందని పిటిషన్‌లో కవిత గుర్తు చేశారు. తన అరెస్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న కారణాలన్నీ పూర్తి అసత్యాలేనన్నారు. ట్రయల్‌ కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ అప్లికేషన్‌ కూడా తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 141 ప్రకారం సుప్రీంకోర్టు జారీ చేసే ఉత్తర్వులను అధికారులంతా పాటించాల్సి ఉంటుందని, కానీ తన విషయంలో ఈడీ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. మనీలాండరింగ్‌ చట్టం- 2002లోని సెక్షన్‌ 19(1) ప్రకారం ఈడీ అధికారులు ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసే ముందు తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను లిఖిత పూర్వకంగా నమోదు చేయాల్సి ఉందని, కానీ, దీనిని ఈడీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. వ్యక్తి స్వేచ్ఛను కట్టడి చేస్తూ మనీలాండరింగ్‌ చట్టం 2002కి మనీ/ఫైనాన్స్‌ బిల్లు ద్వారా సవరణ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు.

మనీలాండరింగ్‌ చట్టం సెక్షన్‌ 19ని మహిళపై ప్రయోగించడాన్ని చట్ట విరుద్ధంగా పరిగణించాలని కోర్టుకు కవిత విజ్ఞప్తి చేశారు. ఈ నెల 15వ తేదీన ఈడీ తనను అరెస్టు చేసిన మరుసటి రోజే ప్రత్యేక కోర్టు తనను రిమాండ్‌కు పంపిందని, ఇదంతా పూర్తి యాంత్రికంగా జరిగిందని, ఇలా అనుచితంగా రిమాండ్‌కి పంపడం ఆర్టికల్‌ 21, 22(1)(2) కింద రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు దర్యాప్తు సంస్థల సమన్ల జారీపై గతంలో సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్‌పై విచారణ పెండింగులో ఉన్నందున.. విచారణ పూర్తయ్యేవరకూ సమన్లు ఇవ్వబోమని ఈడీ సుప్రీంకోర్టు ఎదుట హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీని ఉల్లంఘించిందని కవిత పేర్కొన్నారు. ఈ కారణాల నేపథ్యంలో తన విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోర్టుకు కవిత విజ్ఞప్తి చేశారు. కాగా, సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారని, కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి, దర్యాప్తు సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కవిత సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె వేసిన పిటిషన్‌ అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. నిబంధనల మేరకు పిటిషన్‌ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారిస్తామని స్పష్టం చేసింది. దీనితో కవిత తరఫున న్యాయవాదులు మంగళవారం మరోసారి పిటిషన్‌ దాఖలు చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

No interim relief from SC to KCR’s daughter Kavitha, asked to approach trial court for bail

The Supreme Court on Friday denied any interim relief to BRS leader K. Kavitha, who moved a plea challenging her arrest by the ED in the Delhi excise policy case.

NO-BAIL-KAVITHA.jpg

New Delhi: The Supreme Court on Friday denied any interim relief to BRS leader K. Kavitha, who moved a plea challenging her arrest by the ED in the Delhi excise policy case.

Observing that statutory procedure cannot be bypassed for a political person or someone who could directly afford to petition the apex court, a special bench, headed by Justice Sanjiv Khanna, asked senior advocate Kapil Sibal, appearing for Kavitha, to approach the trial court for the grant of bail.

However, the special Bench, also comprising Justices M.M. Sundresh and Bela M. Trivedi, issued notice to the Enforcement Directorate (ED) on her plea so far it impugned the vires of the provisions of the Prevention of Money Laundering Act (PMLA) and directed tagging of her petition with other pending pleas.

The top court on Tuesday allowed the withdrawal of the plea filed by Kavitha against the ED summons since the said petition became infructuous on her arrest by the federal investigating agency on March 15.

In interim relief for Kavitha, the Supreme Court in September last year had asked the ED not to insist on her appearance in the ongoing probe against the AAP-led Delhi government’s now scrapped liquor policy till the next date of listing. This interim protection from ED action was extended till March 13.

Kavitha, the daughter of BRS supremo and former Telangana Chief Minister K. Chandrasekhar Rao, was arrested from Hyderabad on March 15 and brought to Delhi. A court had sent her to ED custody.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

KCR | కేజ్రీవాల్ అరెస్ట్.. దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు : కేసీఆర్

KCR | ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు అని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది.

kcr_V_jpg--816x480-4g.webp?sw=1728&dsz=8

KCR | హైద‌రాబాద్ : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు అని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. మొన్న హేమంత్ సోరెన్, నిన్న క‌విత‌, నేడు కేజ్రీవాల్ ఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌నం అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ స‌హా ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్రం పావులుగా వాడుకుంటోంద‌ని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లిపెట్టుగా ప‌రిణ‌మిస్తున్న కేంద్రం చ‌ర్య‌ల‌ను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. కేజ్రీవాల్ అరెస్ట్ రాజ‌కీయ ప్రేరేపిత‌మైన అరెస్ట్. అక్ర‌మ కేసుల‌ను వెంట‌నే వెనక్కి తీసుకొని, అరెస్టు చేసిన వారిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేసీఆర్ డిమాండ్ చేశారు.

...

Complete article

 

Link to comment
Share on other sites

  • 0

Arvind Kejriwal: ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ 10 కుంభ‌కోణాలు చేశారు.. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ప్రారంభం మాత్ర‌మే: సుఖేష్‌ చంద్రశేఖ‌ర్

తీహార్ జైలు నుంచి సుఖేష్‌ చంద్రశేఖ‌ర్ లేఖ‌

తీహార్ క్ల‌బ్‌కు స్వాగ‌త‌మంటూ వ్యంగ్యాస్త్రాలు

కేజ్రీవాల్ అవినీతి మొత్తం బ‌హిర్గ‌తం అవుతుందున్న సుఖేష్‌

త్వ‌ర‌లోనే అప్రూవ‌ర్‌గా మారి నిజాల‌న్నీ బ‌య‌ట‌పెడ‌తానంటూ లేఖ‌లో వెల్ల‌డి

cr-20240323tn65fe66155c182.jpg

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో అరెస్ట‌యి తీహార్ జైలులో ఉన్న సుఖేష్‌ చంద్ర‌శేఖ‌ర్.. ఢిల్లీ సీఎం అర‌వింద్‌ కేజ్రీవాల్ అరెస్టుపై తాజాగా స్పందించాడు. ఈ సంద‌ర్భంగా సుఖేష్ శ‌నివారం ఓ లేఖ రాశాడు. "ఆల‌స్య‌మైనా చివ‌ర‌కు నిజ‌మే గెలుస్తుంది. స‌రికొత్త భార‌త్‌కు ఉన్న శ‌క్తికి ఇదొక క్లాసిక్ ఉదాహ‌ర‌ణ‌. తీహార్ క్ల‌బ్‌కు మీకు స్వాగ‌తం. ఖ‌ట్ట‌ర్ ఇమాన్దార్ అనే డ్రామాల‌కు తెర‌ప‌డింది. త్వ‌ర‌లోనే కేజ్రీవాల్ అవినీతి మొత్తం బ‌హిర్గ‌తం అవుతోంది. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ మొత్తం 10 కుంభ‌కోణాల‌కు పాల్ప‌డ్డారు. అందులో నాలుగింటికి నేనే సాక్షిగా ఉన్నాను. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ప్రారంభం మాత్ర‌మే. త్వ‌ర‌లోనే అప్రూవ‌ర్‌గా మారి నిజాల‌న్నీ బ‌య‌ట‌పెడ‌తా" అని సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ త‌న లేఖ‌లో రాసుకొచ్చాడు. 

కాగా, ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో గురువారం అరెస్ట‌యిన సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌స్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) క‌స్ట‌డీలో ఉన్నారు. శుక్ర‌వారం ఆయ‌న‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజ‌రుప‌రిచింది. దాంతో న్యాయ‌స్థానం ఆరు రోజుల ఈడీ క‌స్ట‌డీకి అనుమ‌తి ఇచ్చింది. ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు కేజ్రీవాల్‌ను ఈడీ విచారించ‌నుంది. మ‌రోవైపు కేజ్రీవాల్ అరెస్టుపై ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. అటు ప్ర‌తిప‌క్ష కూట‌మి ఇండియా నేత‌లు కూడా ఢిల్లీ సీఎం అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఎన్నిక‌ల వేళ కేజ్రీవాల్ అరెస్టు అప్ర‌జాస్వామికమ‌ని కూట‌మి పార్టీలు పేర్కొన్నాయి. దీనిపై ఎన్నిక‌ల సంఘానికి కూడా ఫిర్యాదు చేయ‌డానికి ఇండియా కూట‌మి సిద్ధ‌మైంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

K Kavitha: తీహార్ జైల్లో కవితకు వెసులుబాటు కల్పిస్తూ కోర్టు ఆదేశాలు

ఈ మేరకు తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు న్యాయస్థానం ఆదేశాలు 

కవితకు ఇంటి భోజనం తెచ్చుకోవడానికి కోర్టు అనుమతి

మంచం, పరుపు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలను స్వయంగా ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి

cr-20240326tn6602d39910241.jpg

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. కవిత విజ్ఞప్తి మేరకు ఈ వెసులుబాట్లు ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కవితకు ఇంటి భోజనం తెచ్చుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే జైల్లో పడుకోవడానికి మంచం, పరుపు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలను స్వయంగా ఏర్పాటు చేసుకోవడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. కవితకు న్యాయస్థానం ఈరోజు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

K Kavitha: నా కుమారుడికి పరీక్షలు ఉన్నాయి.. బెయిల్ ఇవ్వండి: కవిత పిటిషన్

రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టిన ఈడీ

బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత

తీర్పు రిజర్వ్ లో ఉంచిన కోర్టు

cr-20240326tn6602747fb6a4b.jpg

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ప్రవేశపెట్టింది. ఆమె కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. మరోవైపు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న కవిత పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని... తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో కవిత కోరారు. ఈ పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వ్ లో ఉంచింది. 

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి కేజ్రీవాల్ ను తప్పించాలన్న పిటిషన్ తిరస్కరణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ ఓ సామాజిక కార్యకర్త పిల్ దాఖలు

నేడు విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్

కేసులో అరెస్టయిన సీఎంను తొలగించాలని ఎక్కడుందని సూటిగా ప్రశ్నించిన న్యాయస్థానం

cr-20240328tn66052e7109184.jpg

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన సూర్జిత్ సింగ్ అనే సామాజిక కార్యకర్త ఈ పిల్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు నేడు తిరస్కరించింది. 

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటకు ఈ పిల్ నేడు విచారణకు వచ్చింది. అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అనర్హుడు అనేందుకు పిటిషనర్ తగిన ప్రామాణిక అంశాలను చూపించలేకపోయారని ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. 

"కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రిని తొలగించాలంటున్నారు... ఆ నిబంధన ఎక్కడుందో చూపించండి. మీరు చెబుతున్న న్యాయపరమైన కొలమానం మాకు చూపించండి" అంటూ పిటిషనర్ ను ధర్మాసనం కాస్త గట్టిగానే ప్రశ్నించింది. అంతేకాదు, కేసు దర్యాప్తు ఈ దశలో ఉన్నప్పుడు న్యాయస్థానాల జోక్యానికి అవకాశమే లేదని స్పష్టం చేసింది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

K Kavitha: కవిత బెయిల్ పిటిషన్ 4వ తేదీకి వాయిదా

సుదీర్ఘ వాదనలు వినిపించిన ఇరువైపుల న్యాయవాదులు

ఈడీ రిప్లై రిజాయిండర్‌కు సమయం కోరిన కవిత తరఫు న్యాయవాదులు

3వ తేదీ సాయంత్రానికి రిజాయిండర్ దాఖలు చేస్తామని వెల్లడి

cr-20240401tn660a8a753c9e7.jpg

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 4వ తేదీకి వాయిదా పడింది. కవిత బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు వాదనలు విని... తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈరోజు కవిత తరఫు లాయర్లు, ఈడీ తరఫు లాయర్లు సుదీర్ఘ వాదనలు వినిపించారు.

ఈడీ రిప్లై రిజాయిండర్‌కు కవిత తరఫు న్యాయవాదులు సమయం కోరారు. ఏప్రిల్ 3 సాయంత్రానికి రిజాయిండర్ దాఖలు చేస్తామని వెల్లడించారు. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. గురువారం రోజున మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ చేపట్టనుంది.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...