Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Food delivery services


Recommended Posts

Posted

Mumbai’s Incredibly Tough Dabbawalas

 

Posted

Mumbai Dabbawala Film | Nestlé #ShareYourGoodness

 

Posted

The World’s Best Delivery Service? Lunch in Mumbai

 

Posted

A Hard Day Life With Dabbawalas in Mumbai Delivering Food

 

Posted

Karimnagar Dabbawala : డబ్బావాలా అనగానే ముంబయి గుర్తొస్తుంది, కానీ ఇప్పుడు కరీంనగర్‌లోనూ వచ్చారు

 

Posted

Dabbadrop - Anand Mahindra: లండ‌న్‌కి చేరిన 'డ‌బ్బావాలా' విధానం.. ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ వైర‌ల్‌!

30-04-2024 Tue 08:58 | Offbeat

ముంబైలో ప్రసిద్ధి ‌చెందిన ఫుడ్ డెలివ‌రీ చేసే డ‌బ్బావాలా విధానం

లండ‌న్‌లోని ఓ స్టార్ట‌ప్ ఈ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్న వైనం

అక్క‌డి వారికి స్టీల్ డ‌బ్బాల్లో ఫుడ్ డెలివ‌రీ

ప‌న్నీర్ స‌బ్జీ, మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్ వంటి భార‌తీయ వంట‌కాల‌ను రుచి చూపిస్తున్న స్టార్ట‌ప్ కంపెనీ

cr-20240430tn6630654ce3935.jpg

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో డ‌బ్బావాలాలు ఎంత ఫేమ‌స్ అనే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇళ్ల నుంచి భోజ‌న డ‌బ్బాల‌ను పిక‌ప్ చేసుకుని ఆఫీసుల్లో ప‌నిచేసే వారికి వాటిని డెలివ‌రీ చేయ‌డం ఈ డ‌బ్బావాలాలు చేసే ప‌ని. ఇలా ముంబైలో ఫుడ్ డెలివ‌రీ చేసే డ‌బ్బావాలా విధానం ఇప్పుడు ప‌రాయి దేశానికి కూడా చేరింది. లండ‌న్‌లోని ఓ స్టార్ట‌ప్ ఈ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. 

అక్క‌డి వారికి స్టీల్ డ‌బ్బాల్లో ఫుడ్ డెలివ‌రీ చేస్తోంది. ప‌న్నీర్ స‌బ్జీ, మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్ వంటి భార‌తీయ వంట‌కాల‌ను రుచి చూపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా త‌న 'ఎక్స్' (ట్విట‌ర్‌) ఖాతా ద్వారా పంచుకున్నారు. 'రివ‌ర్స్ కాల‌నైజేష‌న్ అవుతుంద‌ని చెప్ప‌డానికి ఇంతకంటే బెట‌ర్ ఎవిడెన్స్ లేదు' అనే క్యాప్ష‌న్‌తో ఆయ‌న ఈ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.   

...

Complete article

https://dabbadrop.co.uk

 

 

  • 1 month later...
Posted

Zomato Delivery Partners Now Trained in First Aid and CPR: జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు! Guinness Record!

జొమాటో అరుదైన రికార్డ్‌ ను సొంతం చేసుకుంది. అత్యవసర సమయాల్లో ఉన్నవారికి వైద్య సాయం అందించేలా తమ డెలివరీ పార్ట్ నర్స్‌ను తీర్చిదిద్దింది. ఒకే వేదికపై 4,300 మంది డెలివరీ పార్ట్‌నర్స్‌కు సీపీఆర్‌ శిక్షణను అందించి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఫుడ్‌ డెలివరీ కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. ముంబయిలో నిర్వహించిన ఓ వేదికలో ఏకంగా 4,300 మంది డెలివరీ పార్టనర్స్‌కు...

first-aid.jpg

జొమాటో అరుదైన రికార్డ్‌ ను సొంతం చేసుకుంది. అత్యవసర సమయాల్లో ఉన్నవారికి వైద్య సాయం అందించేలా తమ డెలివరీ పార్ట్ నర్స్‌ను తీర్చిదిద్దింది. ఒకే వేదికపై 4,300 మంది డెలివరీ పార్ట్‌నర్స్‌కు సీపీఆర్‌ శిక్షణను అందించి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఫుడ్‌ డెలివరీ కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. ముంబయిలో నిర్వహించిన ఓ వేదికలో ఏకంగా 4,300 మంది డెలివరీ పార్టనర్స్‌కు ప్రథమచికిత్స ఎలా అందించాలో నేర్పించినట్లు గోయల్‌ ‘‘ఎక్స్‌’’ వేదికగా తెలిపారు. దీంతో గిన్నిస్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్నామనీ ప్రస్తుతం జొమాటోలో 30,000 కంటే ఎక్కువ డెలివరీ భాగస్వాములు వైద్యం అందించడానికి, రోడ్‌సైడ్‌ ఎమర్జెన్సీ సమయంలో సాయం అందించడానికి వృత్తి పరంగా శిక్షణ పొందారనీ రాసుకొచ్చారు. దేశంలోని ఎమర్జెన్సీ హీరోలకు సెల్యూట్ అంటూ ముంబయి ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు జత చేశారు.

తమ డెలివరీ భాగస్వాములు ఫస్ట్‌ ఎయిడ్‌, సీపీఆర్‌ అందించడానికి వృత్తిపరమైన శిక్షణ పొందినట్లు జొమాటో తన అధికారిక ‘‘ఎక్స్‌’’ ఖాతా ద్వారా పంచుకుంది. అంతేకాదు ఈ శిక్షణ తీసుకున్నవారి బ్యాగ్‌పై గ్రీన్‌ కలర్‌ ‘‘+’’ చిహ్నం ఉంటుందని తెలిపింది. జొమాటో చర్యపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘చాలా గొప్ప ప్రయత్నం’, ‘ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నందుకు అభినందనలు’, ‘డెలివరీ పార్ట్‌నర్స్‌కు మీరు ఇచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగంగా ఉంటుంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

  • 3 months later...
Posted

SOFTWARE vs ZOMATO || ఇది వింటే 🫢 ZOMATO BEST అనిపిస్తుంది😅 || #zomato #softwarejobs

 

  • 1 month later...
Posted

Komaki CAT 3.0 NXT EV 3 wheeler for delivery services: డెలివరీ బాయ్స్ కష్టాలు ఆ ఈవీతో దూరం.. నయా త్రీవీలర్ ఈవీ లాంచ్ చేసిన కొమాకీ

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగింది. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే వ్యక్తిగత అవసరాలకు ఈవీలు అందుబాటులో ఉన్నా రవాణా వాహనాల విషయంలో మాత్రం ఈవీలు అందుబాటులో ఉండడం లేదు. అయితే ఇటీవల కాలంలో డెలివరీ సేవలకు అనువుగా ఉండేలా ఓ కొత్త ఈవీ బైక్‌ను కొమాకీ అనే సంస్థ విడుదల చేసింది. ఆ ఈవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

 
Komaki CAT 3.0 NXT: డెలివరీ బాయ్స్ కష్టాలు ఆ ఈవీతో దూరం.. నయా త్రీవీలర్ ఈవీ లాంచ్ చేసిన కొమాకీ

కొమాకీ ఎలక్ట్రిక్ నాయ క్యాట్ 3.0 ఎన్ఎక్స్‌టీ డెలివరీ బైక్‌ను ఇటీవల విడుదల చేసింది. చిన్న, మధ్య తరహా వ్యాపారుల డెలివరీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ త్రీ వీలర్ పరిచయం చేశారు. క్యాట్ 3.0 ఎన్ఎక్స్‌టీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. గ్రాఫేన్, ఎల్ఐపీఓ4 వేరియంట్‌లలో అందుబాటులో ఉండే ఈవీ త్రీవీలర్స్ ధరలు రూ. 1.20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై రూ. 1.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. గ్రాఫేన్ 180 కిమీ పరిధిని అందిస్తుండగా, ఎల్ఐపీఓ 4 మాత్రం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిమీ కంటే ఎక్కువ ప్రయాణిస్తుందని కొమాకీ ప్రతినిధులు చెబుతున్నారు. క్యాట్ 3.0 ఎన్ఎక్స్‌టీ అనేది యాప్ ఆధారిత బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనమని పేర్కొంటున్నారు. 

కొమాకీ ఈ-ఫ్లీట్ మెటల్ బాడీ తయారు చేశారు. అలాగే ఈ త్రీవీలర్ కన్వర్టిబుల్ సీట్లతో వస్తుంది. ఈ ఈవీ వాహనం గరిష్టంగా 500 కిలోల సామర్థ్యంతో కూర్చోవడానికి, లోడ్ మోయడానికి తగినంత స్థలంతో వస్తుంది. క్యాట్ 3.0 ఎన్ఎక్స్‌టీ  కన్వర్టిబుల్ స్వభావం మల్టీ లోడ్ కాన్ఫిగరేషన్లను తీసుకువెళ్లడానికి అనుమతిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లో అనేక ఫీచర్లు ఉన్నాయని కొమాకీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ త్రీ వీలర్‌లో పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, ఇంక్లైన్ బ్రేక్ లాకింగ్, మూడు చక్రాలపై డిస్క్ బ్రేక్లు, స్పష్టమైన విండ్ షీల్డ్ ఉన్నాయి. 

క్యాట్ 3.0 ఎన్ఎక్స్‌టీ  మూడు గేర్ మోడ్లతో వస్తుంది. ఎకో, స్పోర్ట్, టర్బో మోడ్‌లతో వచ్చే ఈ ఈవీ త్రీ వీలర్ డెలివరీ బాయ్స్‌ను ఆకట్టుకుంటుందని కొమాకీ ఎలక్ట్రిక్ డివిజన్ సహ వ్యవస్థాపకుడు గుంజన్ మల్హోత్రా చెబుతున్నారు. దేశంలోని ప్రతి మూలలో తమ వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి చిన్న వ్యాపారాలను బలోపేతం చేయడం కోసం ఈ ఈవీ త్రీ వీలర్‌ను లాంచ్ చేశామని పేర్కొంటున్నారు.

  • 1 month later...
Posted

Swiggy delivery in 10 minutes in Warangal, Jagityal and Guntur: 10 నిమిషాల్లో స్విగ్గీ డెలవరీ.. ఇకపై వరంగల్‌, జగిత్యాల, గుంటూరుతో పాటు..

క్విక్‌ కామర్స్‌ రంగంలో స్విగ్గీ దూకుడు పెంచుతోంది. కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్‌ ఐటమ్స్‌ను డెలివరీ చేసేందుకు వీలుగా ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన బోల్ట్‌ సేవలను మరిన్ని నగరాలకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 400 నగరాలు, పట్టణాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు...

Swiggy: 10 నిమిషాల్లో స్విగ్గీ డెలవరీ.. ఇకపై వరంగల్‌, జగిత్యాల, గుంటూరుతో పాటు..

ప్రస్తుతం క్విక్‌ కామర్స్‌ రంగం ఓ రేంజ్‌లో విస్తరిస్తోంది. దాదాపు అన్ని ఈ కామర్స్‌ సంస్థలు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ డెలివరీ సంస్థ స్విగ్గీ సైతం ఫాస్ట్‌ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బోల్ట్‌ పేరుతో స్విగ్గీ ఫాస్ట్‌ డెలివరీ సేలను ప్రారంభించింది.

పూర్తిగా తయారీ అవసరం లేని లేదా తయారీకి తక్కువ సమయంలో తీసుకునే ఆహార పదార్థాలను బోల్ట్‌లో భాగంగా కస్టమర్లకు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సేవలను మరింత విస్తృతి చేసేందుకు స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, ఢిల్లీ, ముంబయి, పుణె వంటి నగరాకుల మాత్రమే పరిమితమైన సేవలను మరిన్ని నగరాలకు విస్తరిస్తూ నిర్ఱయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా ఏకంగా 400 నగరాలు, పట్టణాల్లో విస్తరిస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది స్విగ్గీ. జైపూర్‌, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌, ఇందౌర్‌, కోయంబత్తూర్‌ వంటి నగరాలకూ విస్తరించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే గుంటూరు, వరంగల్‌, జగిత్యాల వంటి టైర్‌2, టైర్‌ 3 పట్టణాలకు విస్తరించింది. వీటితోపాటు రూర్కీ, నాసిక్‌ వంటి పట్టణాల్లోనూ బోల్ట్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏపీ, తెలంగాణతో పాటు.. హరియాణా, తమిళనాడు, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఈ సేవలకు ఆదరణ లభిస్తోందని స్విగ్గీ తన ప్రకటనలో తెలిపింది.

బోల్ట్‌ సేవల్లో భాగంగా ఈ తరహా ఆర్డర్లకు ప్రాధాన్యం ఇచ్చేలా రెస్టారంట్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని స్విగ్గీ తెలిపింది. ప్రస్తుతానికి రెండు కిలోమీటర్ల వరకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండగా, రానున్న రోజుల్లో రేడియస్‌ను మరింత పెంచనున్నామని స్విగ్గీ తెలిపింది.

...

Complete article

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...