Jump to content
  • 3

CM Jagan Bus Yatra: వైసిపి మేమంత సిద్దం ఎన్నికల ప్రచారం


Vijay

Question

Recommended Posts

  • 0

Jagan: ఆ దెబ్బ కణతకు, కంటికి తగల్లేదు... నాకోసం దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడనిపిస్తోంది: సీఎం జగన్

కృష్ణా జిల్లా గుడివాడలో మేమంతా సిద్ధం సభ

చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సీఎం జగన్

జగన్ పై రాయి విసిరినంత మాత్రాన ఏమీ చేయలేరని స్పష్టీకరణ

ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లని వెల్లడి

cr-20240415tn661d270ff3857.jpg

ఏపీ సీఎం జగన్ ఇవాళ కృష్ణా జిల్లా గుడివాడలో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇవాళ గుడివాడలో మహా సముద్రం కనిపిస్తోందని, మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం పక్షాన నిలిచే జన సముద్రం ఇది అని అభివర్ణించారు. మీ బిడ్డ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. 

పేదల భవిష్యత్ కొరకు, పథకాలన్నీ కాపాడుకునేందుకు, పథకాలను కొనసాగించేందుకు సమరశంఖం పూరిద్దామా? పెత్తందార్లతో యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? అంటూ తనదైన శైలిలో ప్రసంగం ప్రారంభించారు. 

"ఇప్పటివరకు ప్రజా సంక్షేమం కోసం 130 సార్లు బటన్ నొక్కాం. మే 13న జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వం కోసం మీరు ఫ్యాన్ మీద రెండు బటన్లు నొక్కండి. మరో 100 మందికి చెప్పి నొక్కించండి. మీరంతా స్టార్ క్యాంపెయినర్లుగా ఉండడానికి మీరంతా సిద్ధమేనా? ఇక్కడున్నది మంచి చేశాను అని ధైర్యంగా చెప్పుకోగలిగిన ఒక్క జగన్ మాత్రమే. 

గతంలో ఏ మంచినీ చేయని, ఏ పేదను ఆదుకోని... మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అవతలి వైపు ఉన్నారు. ఒక్క మీ జగన్ మీద ఒక చంద్రబాబు, ఇక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్... ఇవన్నీ సరిపోవంటూ కుట్రలు, మోసాలు! కుటిల పద్మవ్యూహంలో బాణాలు సంధిస్తోంది ఒక్క జగన్ మీద... మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద. అయినా మీ బిడ్డ అదరడు... బెదరడు. 

ప్రజలు అనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి... అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు... జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, మన ప్రజల గెలుపును ఎవ్వరూ ఆపలేరు. 

ఇలాంటి దాడులతో నా సంకల్పం ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరదు. ఈస్థాయికి వాళ్లు అంతగా దిగజారారు అంటే విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, విజయానికి వారు అంత దూరంగా ఉన్నారని అర్థం. ఈ తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు, బెదరడు. ప్రజలకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఎంతమాత్రం తగ్గదు. 

నా నుదుటిపై వారు చేసిన గాయం కణతకు తగల్లేదు, కంటికి తగల్లేదు. అంటే... మీ బిడ్డ విషయంలో దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడని దానర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా మరో 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ... గతంలో చంద్రబాబు రైతులకు, అక్కచెల్లెమ్మలకు, నిరుద్యోగులకు, వివిధ సామాజిక వర్గాలకు చేసిన గాయాలను ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోరు. గాయపర్చడం, మోసాలు చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజం అయితే... మీ ఇంటింటికీ మంచి చేయడం మీ బిడ్డ నైజం. 

ఈ కూటమి నాయకుడు చంద్రబాబు 30 ఏళ్ల ఫిలాసఫీ ఒక్కసారి గమనిస్తే... పేదలకు ఏ మంచి చేయొద్దు అనేదే చంద్రబాబు ఫిలాసఫీ. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దన్నది ఎవరు? ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చని ఎవరు చెప్పారు?... ఈ బాబే. కిలో బియ్యం రూ.2కే ఇచ్చిన ఎన్టీఆర్ ను దించేసి కిలో బియ్యం రూ.5.25కి పెంచింది ఎవరు? అది కూడా ఈ బాబే. 

ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నది ఎవరు... ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం వద్దన్నది, ప్రభుత్వ బడులను పాడుపెట్టినది ఎవరు? అది కూడా ఈ బాబే. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే... కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా కోర్టులకు వెళ్లి కేసులు వేసింది ఎవరు? అది కూడా ఈ బాబే. 

తాను ముఖ్యమంత్రిగా ఉంటూ ఎస్సీలు, బీసీలను అవహేళన చేసిన వ్యక్తి ఎవరు? అది కూడా ఈ బాబే. విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు అన్నది ఎవరు? ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అన్నది ఎవరు? ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినది ఎవరు? అది కూడా ఈ చంద్రబాబే. 

అన్నీ ఓడిపోయి అతలాకుతలమైన చంద్రబాబును పార్టీలో చేరనిచ్చి, కూతుర్నిచ్చిన మామనే కుర్చీ కోసం ఆయననే వెన్నుపోటు పొడిచి, ఆయనపై చెప్పులు వేయించి, ఆయనపై కూడా రాళ్లు వేయించి, ఆయన చావుకు కారణమైంది ఎవరు? అది కూడా ఈ బాబే. అవసరమైనప్పుడల్లా రామారావు ఫొటో బయటికి తీసి ఆయనకు దండలేస్తాడు. ఇంత నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరు? అది కూడా ఈ బాబే. 

పేదలకు మంచి చేయకూడదన్నది మాత్రమే తెలిసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు తెలిసింది కుట్రలు చేయడం, దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. ఇలాంటి వాళ్లను నమ్మడం అంటే చేపల చెరువుకు కొంగలను కాపలా పెట్టడమే... దొంగకు తాళాలు ఇవ్వడమే... పులి నోట్లో తల పెట్టడమే! 

ఇక మీ బిడ్డ జగన్ ను చూడండి. ఈ 58 నెలల పాలనలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ను నాలుగు మాటల్లో వివరిస్తాను. ప్రతి గ్రామంలో 7 వ్యవస్థలను తీసుకువచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్/అర్బన్ హెల్త్ క్లినిక్ లు, నాడు-నేడుతో రూపురేఖలు మారిన ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం పాఠశాలలు, మహిళా పోలీసులు ప్రతి గ్రామంలో కనిపిస్తారు. ఇక ఏడోది... నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు... ఇది మీ బిడ్డ జగన్ మార్కు. 

ఈ 58 నెలల పాలనలో వైసీపీ మార్కు ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. మరి చంద్రబాబు మార్కు ఏమిటి... జన్మభూమి కమిటీలా, పచ్చపాముల అవినీతి కాట్లు, లంచాల గాట్లు!... ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి, నేరుగా మీ చేతుల్లోకి అందించే స్కీములు.... ఇదీ చంద్రబాబుకు మనకు తేడా!"

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Gudivada Amarnath: అంత ఖర్మ మాకు పట్టలేదు: గుడివాడ అమర్ నాథ్

సానుభూతి కోసం మాపై మేమే దాడులు చేయించుకోవాల్సిన అవసరం లేదన్న గుడివాడ

ఓటమి భయంతోనే జగన్ పై దాడి చేయించారని మండిపాటు

తాను బ్యాక్ డోర్ పొలిటీషన్ ను కాదని వ్యాఖ్య

cr-20240415tn661d15235d070.jpg

ముఖ్యమంత్రి జగన్ ఏం తప్పు చేశారని రాళ్లు విసురుతారని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రశ్నించారు. దాడి చేస్తే జగన్ ఇంట్లో కూర్చుంటారని అనుకోవడం పొరపాటే అవుతుందని ఆయన అన్నారు. సానుభూతి కోసం మాపై మేమే దాడులు చేయించుకోవాల్సిన ఖర్మ తమకు లేదని చెప్పారు. గాజువాక సభలో వైసీపీపై చంద్రబాబు చేసిన విమర్శలను ఖండిస్తున్నామని అన్నారు. గాజువాకలో చంద్రబాబు మీద వారి పార్టీ వాళ్లే రాళ్లు వేసి, వైసీపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు గెలవలేమనే భయం పట్టుకుందని... అందుకే జగన్ పై రాయితో దాడి చేయించారని దుయ్యబట్టారు. ఇలాంటి దాడులకు జగన్ భయపడరని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాలతో ప్రజల మనసుల్లో జగన్ నిలిచిపోయారని... వైసీపీ మరోసారి ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 

టీడీపీ హయాంలో కంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని అమర్ నాథ్ తెలిపారు. దావోస్ లో చలి ఉండటం వల్ల అక్కడ జరిగిన ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు వెళ్లలేదని తాను అనలేదని... దమ్ముంటే తాను అలా అన్నట్టు సాక్ష్యం చూపించాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకమేనని చెప్పారు. తాను బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదని... తన తాత, తండ్రి కూడా ప్రజాప్రతినిధులేనని తెలిపారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Sajjala Ramakrishna Reddy: దాడి జరిగింది సీఎం జగన్ మీద... మీకెందుకంత తాపత్రయం?: విపక్షాలపై సజ్జల ఫైర్

సీఎం జగన్ పై రాయి దాడి

డ్రామా అంటున్న విపక్షాలు

సీఎం జగన్ కు లభిస్తున్న ఆదరణ చూసి విపక్షాలు భయపడుతున్నాయన్న సజ్జల

cr-20240415tn661d070725ce8.jpg

సీఎం జగన్ పై రాయి దాడి ఘటన పట్ల విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నించారు. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసిన తర్వాత, తమకు పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలకు అర్థమైందని అన్నారు. అందుకే సీఎం జగన్ పై రాయి దాడి ఘటనను డ్రామా అంటున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరిగితే, విపక్షాలన్నీ ఒకే తీరున మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. 

"దాడి జరిగింది మీ మీద కాదు. చంద్రబాబు మీదో, పవన్ కల్యాణ్ మీదో... ఇతర విపక్ష నేతల మీదో కాదు. వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో మాజీ మంత్రి, శాసనసభ్యుడు వెల్లంపల్లికి కూడా గాయమైంది. 

ఈ ఘటనలో మేం బాధితులం. దీని గురించి మొదట మాట్లాడే హక్కు మాకు ఉంటుంది. దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. మరి విపక్షాలకు ఎందుకంత తాపత్రయమో అర్థం కావడంలేదు. ఇందులో ఏం వైఫల్యం ఉందో చెప్పడానికి మీరెవరు? నింద మీ మీదకు వస్తుందని తెలుగుదేశం పార్టీకి భయం. 

రాయి విసిరిన దానిపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే సహజంగానే అనుమానం టీడీపీకి పైకి మళ్లుతుంది... అదే మేం వ్యక్తీకరించాం. మేం దాడి చేయలేదు అని వివరణ ఇచ్చుకోండి... అంతే తప్ప ఇదంతా డ్రామా అనడం, సీబీఐ విచారించాలి అనడం చూస్తుంటే టీడీపీ భయపడుతున్నట్టు అర్థమవుతోంది" అని సజ్జల వ్యాఖ్యానించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jagan: God may have even a bigger script for me!

నాకోసం దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడనిపిస్తోంది: సీఎం జగన్

LIVE : AP CM YS Jagan Mass Speech | Memantha Siddham | Chandrababu @SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

  • 0

LIVE : AP CM YS Jagan Public Meeting at Gudivada | Memantha Siddham | Krishna District @SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

  • 0

Kodali Nani Warning to Chandrababu | Gudivada CM Jagan Public Meeting | Bus Yatra @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

YS Bharathi For CM YS Jagan, Memantha Siddham Bus Yatra | YSRCP | AP Elections 2024 | @SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

  • 0

PULKAS DO WATCH THIS...!! Why electricity was cut off you'll know it you dumbos

Kodali Nani Reacts On CM YS Jagan Stone Hit Incident | Memantha Siddham |@SakshiTVLIVE

 

How do you explain this pulkas? Video editing of old cbn clip to fool other pulkas only (because no jaffa will believe it)

https://www.instagram.com/reel/C5umZbWPWbX

Link to comment
Share on other sites

  • 0

Fans Adorable Love Towards CM YS Jagan | Memantha Siddham Bus Yatra | YSRCP | @SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

  • 0

YS Jagan Receives Grand Welcome in Ganapavaram During Memanta Siddham Bus Yatra

1439742-ys-jagan-mohan-reddy.webp

The locals of Ganapavaram in West Godavari district extended a heartwarming welcome to Chief Minister YS Jagan Mohan Reddy as he embarked on a bus journey through the region. The locals of Ganapavaram in West Godavari district extended a heartwarming welcome to Chief Minister YS Jagan Mohan Reddy as he embarked on a bus journey through the region. The atmosphere was filled with enthusiasm and excitement as the Chief Minister interacted with the people, making personal connections along the way. From Nidamarru to Sitaramapuram, CM YS Jagan was greeted with cheers and applause by the villagers who eagerly awaited his arrival. The Chief Minister took the time to personally greet and acknowledge the elders and grandmothers who had gathered to welcome him.

In a touching moment, a child presented a sketch to CM YS Jagan, who took the time to spell out the child's name and sign the sketch, much to the delight of the young artist. The gesture symbolized the warmth and connection between the Chief Minister and the people of Ganapavaram. The bus journey of CM YS Jagan through Ganapavaram was truly a memorable event, showcasing the unity and support of the local community towards their leader. The overwhelming reception is a testament to the strong bond between the Chief Minister and the people of West Godavari.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

AP Minister Peddireddyc on Jagan: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Andhra Pradesh Polls 2024: తన జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

8f62119461ce0dabced56f10496e5fbf17132674

మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Peddireddy Ramachandra Reddy- కదిరి: వైనాట్ 175, వైనాట్ 200 అని అధికార వైఎస్సార్ సీపీ నినదిస్తోంది. ప్రజలు తమ వైపే ఉన్నారని, సంక్షేమ ప్రభుత్వానికి మరో ఛాన్స్ ఇస్తారని చెబుతున్నారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ సీపీ (YSRCP) రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా మక్బూల్ ను, ఎంపీగా  శాంతమ్మ ను గెలిపించాలని ప్రజలను కోరారు. మంచి చేసి ఉంటేనే తనకు ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ అంటున్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో వైసిపి కి మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చారు. 

‘కరోనాతో రెండేళ్లు పోయినా ఇచ్చిన అన్ని ఎన్నికల హామీలు సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. జగన్ కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా పథకాలు అందించారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఒక గొప్ప ముఖ్యమంత్రిని చూడలేదు. చంద్రబాబు ఐదేళ్లు రాజదాని పేరుతో వృదా చేసి, లోపభూయిష్టంగా నాలుగు భవనాలు కట్టారు. తాత్కాలిక రాజధాని పేరుతో ప్రజాధనాన్ని, విలువైన ఐదేళ్ల సమయాన్ని వృథా చేశారు. మనకు 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. కానీ ఓటుకు కోట్లు కేసులో దొరికి చంద్రబాబు హైదరాబాద్ నుండి పారిపోయి ఏపీకి వచ్చారు. - మంత్రి పెద్దిరెడ్డి

006c88c311ba6441d44743e935ec3f0d17132674

గతంలో ఇచ్చిన హామీలు చంద్రబాబు అమలు చేయలేదు
2014 లో ఇచ్చిన ఎన్నికల హామీలు ఏమి చంద్రబాబు అమలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ పేరుతో అమలు చేయడం సాధ్యంకాని హామీలు ఇస్తున్నారు. జన్మభూమి కమిటీలు టిడిపి వారికి మాత్రమే పథకాలు అందించారు. సీఎం జగన్ హయాంలో గ్రామంలో ప్రభుత్వ పాలన సాగుతోంది. కేవలం పేదరికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుని అందరికీ పథకాలు ఇచ్చారు. - మంత్రి పెద్దిరెడ్డి

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో చదువు చెప్తున్నారు. విద్యార్థులకు షూస్ దగ్గర నుండి కావాల్సిన ప్రతి ఒక్కటి అందిస్తున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం తాము అందిస్తామన్నారు. సీఎంగా జగన్ మరోసారి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధితో పాటు సుపరిపాలన అందిస్తారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. నేడు గాండ్లపెంట, కదిరి రూరల్, తనకల్లు మండలాల్లో మంత్రి పెద్దిరెడ్డి పర్యటిస్తున్నారు. సీఎం జగన్‌కు ప్రజలందరూ అండగా నిలవాలని ఆయన కోరారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

YS Jagan on Pawan: అయ్యా దత్తపుత్రా... ఇలా భార్యలను మార్చేస్తే అక్కచెల్లెమ్మల బ్రతుకు ఏం కావాలి?: సీఎం జగన్

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మేమంతా సిద్ధం

ఉండి సెంటర్ లో సభకు హాజరైన సీఎం జగన్

చంద్రబాబుకు తనపై చాలా కోపం ఉందని వ్యాఖ్య 

అడగకూడని ప్రశ్న అడిగానన్న సీఎం జగన్

దత్తపుత్రుడు కార్లను మార్చినట్టు భార్యలను మార్చేస్తాడని వ్యంగ్యం

cr-20240416tn661e71f1cf342.jpg

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ సాయంత్రం నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు సీఎం జగన్ హాజరయ్యారు. ఇక్కడి ఉండి సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, విపక్ష నేత చంద్రబాబుపైనా, జనసేనాని పవన్ కల్యాణ్ పైనా ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తనపై చాలా కోపం ఉందని, తన గురించి మాట్లాడే సమయంలో ఆయనకు హైబీపీ వస్తుంటుందని అన్నారు. 

నాకు ఏదో అవ్వాలని శాపాలు పెడుతుంటాడని, రాళ్లు విసరాలని పిలుపునిస్తుంటాడని వెల్లడించారు. నీ పేరు చెబితే గుర్తుకు వచ్చే మంచి పథకం ఒక్కటైనా ఉందా అని చంద్రబాబును అడిగా... అందుకే నాపై ఆయనకు కోపం... చెరువులో కొంగ మాదిరిగా ఎందుకు జపం చేస్తావు అని అడగకూడని ప్రశ్న అడిగా... అందుకే ఆయనకు నాపై కోపం అని సీఎం జగన్ వివరించారు. చంద్రబాబు అంటే గుర్తుకువచ్చేవి వెన్నుపోటు, మోసం, దగా, కుట్రలు, అబద్ధాలు అని విమర్శించారు .

దత్తపుత్రుడికి బీపీ వస్తే తట్టుకోలేం!

దత్తపుత్రుడు కూడా అంతే. అతడిలోనూ బీపీ బాగా కనిపిస్తోంది. దత్తపుత్రా, దత్తపుత్రా... పెళ్లికి ముందు పవిత్ర హామీలు ఇచ్చి, పిల్లల్ని కని, నాలుగైదేళ్లకోసారి కార్లను మార్చినట్టు భార్యలను, భార్యలను మార్చినట్టు నియోజకవర్గాలను అలవోకగా మార్చేస్తున్నావు... ఏం మనిషివయ్యా నువ్వు? అని అడిగా. 

అయ్యా దత్తపుత్రా... ఒకసారి చేస్తే పొరపాటు అనుకోవచ్చు... పదే పదే చేస్తుంటే దాన్ని అలవాటు అంటారయ్యా... పవిత్ర సంప్రదాయాన్ని నడిరోడ్డు మీదకు తీసుకురావడం, ఆడవారి జీవితాలను చులకనగా చూపించడం తప్పుకాదా అని అడిగా. 

నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ చేస్తే, ఇలా భార్యలను మార్చేస్తే అక్క చెల్లెమ్మల బ్రతుకు ఏం కావాలి? అని అడిగా. అంతే... ఆ పెద్ద మనిషిలో బీపీ పెరిగిపోతోంది... చేతులు ఊపుతూ, కాళ్లు ఊపుతూ, తల ఊపుతూ మనిషంతా ఊగిపోతాడు... దత్తపుత్రుడికి బీపీ వస్తే తట్టుకోలేం... అంటూ సీఎం జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

దా*డి చేసింది జగన్ ని చంపడానికే..నిజం ఒప్పుకున్న నిందితులు..? #ysjagan #chandrababu #pawankalyan

 

Link to comment
Share on other sites

  • 0

Roja on CBN: రావణుడి ప్రతిరూపం అయిన చంద్రబాబు నోటి వెంట ఇలాంటి అబద్ధాలు కాక ఇంకేం వస్తాయి?: మంత్రి రోజా

జగన్ పాలనలో దేవాలయాలపై దాడులు జరిగాయన్న చంద్రబాబు

నువ్వు కూల్చిన ఎన్నో ఆలయాలను జగన్ పునర్ నిర్మించారన్న రోజా

నీలాంటి రాక్షసులు చెప్పేదే చరిత్ర కాదు అంటూ ఫైర్

రామరాజ్యాన్ని పోలిన జగనన్న పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని వెల్లడి

cr-20240417tn661fb1b79a199.jpg

వైసీపీ పాలనలో 'హిందూ భక్తుల మనోభావాలపై గొడ్డలి పోట్లు' అనదగ్గ సుమారు 160 ఘటనలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ట్వీట్ పై మంత్రి రోజా స్పందించారు. రావణుడి ప్రతిరూపం అయిన చంద్రబాబు నోటివెంట ఇలాంటి అబద్ధాలు కాకుండా ఇంకేం వస్తాయని విమర్శించారు. 

"విజయవాడలో అభివృద్ధి పేరిట నువ్వు కూల్చేసిన ఎన్నో ఆలయాలను పునర్ నిర్మించింది జగన్ ప్రభుత్వం. మా ప్రభుత్వం రామతీర్థానికి భారీగా నిధులు కేటాయించి దాన్ని మహాద్భుతంగా నిర్మిస్తోంది. నీలాంటి రాక్షసులు చెప్పేదే చరిత్ర కాదు... రామరాజ్యాన్ని పోలిన జగనన్న పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఈ ఎన్నికలతో మీ తెలుగుదేశం పార్టీ చరిత్ర సమాప్తం కానుంది. ప్రజకు ఇక నిత్య దీపావళి" అంటూ రోజా ట్వీట్ చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

జగన్‌ను కలవాలన్న ఆశ..కాళ్లు కాలుతున్నా.. | CM Jagan Bus Yatra - TV9

 

Link to comment
Share on other sites

  • 0

మానవత్వం చాటుకున్న సీఎం వైఎస్ జగన్.. | #cmysjagan #memanthasiddham #ysrcp #shorts @SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

  • 0

జగన్ మామయ్య CM YS Jagan Loveable With Kids #cmysjagan #memanthasiddham #sakshitvlive

 

Link to comment
Share on other sites

  • 0

జగన్‌‌ను చంపేందుకే దాడి...రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు LIVE | CM Jagan Attack Case Remand Report

 

Link to comment
Share on other sites

  • 0

LIVE: జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన రాజమండ్రి | DAY -18 | @prajachaithanyampolitical

 

Link to comment
Share on other sites

  • 0

AP News: జగన్‌పై రాయిదాడి కేసు రిమాండ్ రిపోర్ట్‌ వచ్చేసింది.. పోలీసులు ఏం తేల్చారంటే?

జగన్‌పై రాయిదాడి కేసు రిమాండ్ రిపోర్టు బయటకొచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ‘‘ మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హాని చేయాలనే ఉద్దేశ్యంతో రాయి విసిరారు అని వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. నేరం తీవ్రతను బట్టి హత్యాయత్నంగా కేసు నమోదు చేశాం. ప్రాంతాన్ని పరిశీలన చేసి.. 12 మంది సాక్షుల తగుసీ వాంగ్మూలాలను నమోదు చేశాం’’ అని పేర్కొన్నారు.

Untitled_3_699cf6847d_V_jpg--799x414-4g.

‘‘సీసీ ఫుటేజీలు, వీడియోగ్రాఫ్ సేకరించి పరిశీలించాం. ఏప్రిల్ 17న విశ్వసనీయ సమాచారం అందింది. విజయవాడ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్‌ను అరెస్టు చేశాం. మధ్యవర్తుల సమక్షంలో అతడి సెల్‌ఫోన్, బట్టలు స్వాధీనం చేసుకున్నాం. ఏ-1 (మైనర్)ను ఏ-2 వేముల దుర్గారావు ప్రేరేపించాడు. సీఎంను హతమార్చడానికి పదునైన కాంక్రీట్ రాయిని విసిరాడు. జనం మధ్యలోనే ఉండి రాయిని విసిరి.. నడుస్తూనే సత్తీశ్ వెళ్లిపోయాడు. కుట్రతో ముందస్తు ఒప్పందం ప్రకారం గురి పెట్టి మరీ జగన్ తలపైకి బలంగా రాయిని విసిరారు. అదృష్టవశాత్తూ సీఎం గాయంతో బయట పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా బలంగా దెబ్బ తగిలింది. అన్ని సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన తర్వాతే ఏ-1గా మైనర్, ఏ-2గా దుర్గారావు పేర్లను చేర్చాం’’ అని కోర్టుకు రిమాండ్ రిపోర్టు ద్వారా పోలీసులు వెల్లడించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Stone Attack On Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్

ఏప్రిల్ 13న సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి

ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

నేడు విజయవాడ కోర్టులో హాజరు

మే 2 వరకు రిమాండ్ విధించిన జూనియర్ సివిల్ జడ్జి

cr-20240418tn66212eff5630c.jpg

ఈ నెల 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితుడ్ని ఇవాళ విజయవాడ కోర్టులో హాజరుపర్చగా... న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. మే 2 వరకు అతడికి రిమాండ్ విధిస్తున్నట్టు విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పేర్కొన్నారు. 

కాగా, నిందితుడి పుట్టినతేదీపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఆధార్ కార్డు ప్రకారం అతడు మైనర్ అని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. అయితే, తాము మున్సిపల్ శాఖ ఇచ్చిన పుట్టినతేదీ ధృవపత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

!!! Big Expose Alert !!!

Pappu Pulakesh, also known as Nara Lokesh, and the @JaiTDP leaders hit a new low, attacking the voice of the poor by hurling stones at CM YS Jagan Mohan Reddy during the #MemanthaSiddham Yatra roadshow in Vijayawada.

Then, without an ounce of remorse, they took to social media to deny their involvement.

But they got caught red-handed! Bonda Uma, one of Pappu Pulakesh's goons, spilled the beans.

Hey @NaraLokesh, how about some sit-ups for fibbing to Andhra Pradesh? Let's see if you've got the guts!

#TDPExposed #PappuPulakesh #TDPCowards

 

Link to comment
Share on other sites

  • 0

ప్రొద్దుటూరులో @Naralokesh వీడి మీద కోడిగుడ్లు విసిరితే 2 గంటలు కార్ దిగలేదు.. ఇంక రాళ్లు, రప్పలు వేస్తే 2,3 ఒకేసారి ప్యాంటులో పోసుకొని కార్ డిక్కీ లో పడుకుంటాడు ఈ జోకర్ గాడు..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...