Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Recommended Posts

Posted

Kesineni Nani on his brother Kesineni Chinni: తమ్ముడు కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేసిన కేశినేని నాని

03-05-2024 Fri 19:04 | Andhra

విజయవాడ లోక్ సభ స్థానంలో అన్నదమ్ముల సవాల్

వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని

టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని (శివనాథ్)

ఓ క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చిందన్న కేశినేని నాని

ఆ వ్యక్తి తన తమ్ముడు కావడం దురదృష్టకరమని వ్యాఖ్యలు

cr-20240503tn6634e7fac2b37.jpg

విజయవాడ లోక్ సభ స్థానం వైసీపీ అభ్యర్థి కేశినేని నాని తన సోదరుడు, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని (శివనాథ్)పై సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని, కానీ క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తి (కేశినేని చిన్ని)కి టీడీపీ టికెట్ ఇచ్చిందని విమర్శించారు. అతడు విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టే అతడి విషయాలు వెల్లడించాల్సి వస్తోందని కేశినేని నాని అన్నారు. అతడు చార్లెస్ శోభరాజ్ ను మించిన ఘనుడు అంటూ వ్యాఖ్యానించారు. 

"కేశినేని చిన్ని, నేను పాతికేళ్ల కిందట విడిపోయాం. ఇప్పుడు అతను టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు... అతడి చరిత్ర ఎలాంటిదో అందరికీ తెలియాలి. చాలాసార్లు అప్పుల పాలయ్యాను అని చెప్పి మోసం చేశాడు. పిల్లల స్కూలు ఫీజులు కట్టలేకపోతున్నాను, బాడుగ కట్టలేకపోతున్నాను అంటే ఆదుకున్నాను. 

ఓసారి నూజివీడులో భూ కబ్జాకు ప్రయత్నించాడు. దాంతో అతడ్ని నా ఆఫీసుకు రావొద్దని చెప్పాను. నా పేరు చెడగొట్టే పనులు చేయవద్దని మందలించాను. 

2020 వరకు తనకేమీ ఆదాయం లేదని చిన్ని చెబుతున్నాడు... కానీ అతడి అఫిడవిట్ చూస్తే 2002 నుంచి ఇన్ కమ్ ట్యాక్స్ బకాయి ఉందని వెల్లడైంది. ప్రతి 6 నెలలకు ఓసారి ఇల్లు మార్చుతూ ఐటీ నోటీసులు తీసుకోవడంలేదు. అతడు చేసేవన్నీ చీటింగ్ లే. చిన్ని పెట్టిన కంపెనీలన్నీ సూట్ కేసు కంపెనీలనేనని కేంద్రం కూడా స్పష్టంగా చెప్పింది. 

కేశినేని డెవలపర్స్ సంస్థ కోసం 2016లో నా సంతకం ఫోర్జరీ చేశాడు. అభివృద్ధిలోకి వస్తాడని భావిస్తే కేశినేని డెవలపర్స్ పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. తెలంగాణలో 'రేరా' జరిమానా కూడా విధించింది. ఒక సంస్థతో కలిసి చిన్ని మోసాలకు పాల్పడగా, ఇప్పుడా సంస్థ యజమాని జైల్లో ఉన్నాడు.

హైదరాబాద్ ప్రగతి నగర్ లో 97 ఎకరాల భూమిని ఓ మాజీ మంత్రితో కలిసి కబ్జా చేశాడు. ఎక్సెల్లా ప్రాపర్టీస్ పేరిట ప్రీ లాంచ్ అంటూ ఆ స్థలాలను పేదలకు అమ్మేశాడు. ఈ వ్యవహారం కోర్టుకెక్కితే... ఈ సంస్థతో తమకు సంబంధం లేదని, ఆ సంస్థ నుంచి బయటికి వచ్చేశానని బుకాయిస్తున్నాడు. 

చిన్ని గతంలో తన వాహనాలకు 5555 నెంబర్లు వాడేవాడు... నేను 7777 నెంబర్లు వాడేవాడ్ని. నేను ఎంపీ అయ్యాక, నా పేరు వాడుకోవడానికి అతడు కూడా 7777 నెంబర్లు వాడడం మొదలుపెట్టాడు. తన కార్లకు ఎంపీ స్టిక్కర్లు వేసుకునేవాడు. తన రియల్ ఎస్టేట్ దందా కోసం నా పదవిని అడ్డంపెట్టుకున్నాడు. నా ఎంపీ స్టిక్టర్లు నకిలీవి తయారుచేస్తుంటే నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు అయితే ప్రజలు, సమాజం పరిస్థితి ఏంటి?" అంటూ కేశినేని నాని ధ్వజమెత్తారు. 

విజయవాడలో గతంలో పలువురు మచ్చలేని నాయకులు ఎంపీలుగా పనిచేస్తే, ఈసారి కేశినేని చిన్ని వంటి నేరచరితుడు టీడీపీ నుంచి పోటీచేస్తుండడం బాధాకరమని అన్నారు. ఆ వ్యక్తి తన తమ్ముడు కావడం దురదృష్టకరమని నాని అభివర్ణించారు.

...

Complete article

Posted

Mudragada Padmanabham: ముద్రగడకు షాకిచ్చిన కూతురు క్రాంతి.. జగన్ వాడుకుంటున్నాడంటూ సంచలన వీడియో విడుదల 

03-05-2024 Fri 10:49 | Andhra

పవన్ ను తన్ని తరిమేస్తానని తన తండ్రి అనడం కరెక్ట్ కాదన్న క్రాంతి

ఆయన ప్రకటన ఆయన అభిమానులకు కూడా నచ్చలేదని వ్యాఖ్య

ముద్రగడను జగన్ వాడుకుని వదిలేస్తారన్న క్రాంతి

cr-20240503tn663473fbd316a.jpg

కాపు నేతగా పేరుగాంచిన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ... ఆ మరుక్షణం నుంచే పక్కా వైసీపీ నేతగా మారిపోయారు. వైసీపీలోని ఇతర నేతల కంటే ఎక్కువగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆయన టార్గెట్ చేస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ ను తరిమేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటానని ఆయన సవాల్ విసిరారు. 

ఈ నేపథ్యంలో ముద్రగడకు ఆయన కూతురు క్రాంతి భారీ షాక్ ఇచ్చారు. తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదని ఆమె స్పష్టం చేశారు. తాను పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. 

"అందరికీ నమస్కారం. నేను క్రాంతి. ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో వపన్ కల్యాణ్ గారిని ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్ ను ఓడించి... పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరును ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానుకు కూడా నచ్చలేదు. 

వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు. కానీ పవన్ కల్యాణ్ గారిని, ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. కేవలం పవన్ కల్యాణ్ గారిని తిట్టడానికే మా నాన్నగారిని జగన్ వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత మా నాన్నను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. పవన్ కల్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి చేస్తా" అని వీడియో ద్వారా క్రాంతి వెల్లడించారు.

...

Complete article

ముద్రగడ పద్మనాభాన్ని వ్యతిరేకించిన ఆయన కూతురు శ్రీమతి క్రాంతి గారు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం తన వంతు కృషి తను చేస్తానని తెలిపారు..

 

Posted

Mudragada Padmanabham: కూతురు క్రాంతి భారతి విమర్శలపై స్పందించిన ముద్రగడ పద్మనాభం

03-05-2024 Fri 16:06 | Andhra

కూతురికి, నాకు మధ్య చిచ్చుపెట్టాలని చూశారన్న ముద్రగడ

పెళ్లి అవ్వడంతో నా కూతురు నా ప్రాపర్టీ కాదని వ్యాఖ్య

ఎవరి బెదిరింపులకూ భయపడనున్న వైసీపీ నేత

cr-20240503tn6634be1972c5c.jpg

పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని ఒకరు.. గెలిపించొద్దని మరొకరు.. కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కూతురు క్రాంతి భారతి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. పవన్ కల్యాణ్‌ని తిట్టడానికి మాత్రమే తన తండ్రి ముద్రగడని సీఎం జగన్ వాడుకుంటున్నారని, అందుకు భిన్నంగా తాను పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం కోసం కృషి చేస్తానంటూ క్రాంతి భారతి చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం స్పందించారు.

నా కూతురు నా ప్రాపర్టీ కాదు..

తనకు, తన కూతురికి మధ్య చిచ్చు పెట్టాలని చూశారని, కానీ తాను బెదిరిపోనని ముద్రగడ పద్మనాభం అన్నారు. ‘‘నా కూతురు నా ప్రాపర్టీ కాదు’’ అని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. ఆమెకి పెళ్లి అవ్వకముందు తన ప్రాపర్టీ అని, వివాహం అవడంతో ఆమె అత్తగారి ప్రాపర్టీ అని అన్నారు. తన కూతురి వ్యాఖ్యలకు భయపడనని ముద్రగడ అన్నారు. తన కూతురితో వీడియో రిలీజ్ చేయించారని, ఎవరు బెదిరించినా తాను బెదిరిపోనని ముద్రగడ పద్మనాభం అన్నారు. తాను ఎప్పటికీ జగన్‌కి సేవకుడిగానే ఉంటానని అన్నారు.

తండ్రిపై క్రాంతి భారతి విమర్శలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభం ప్రచారం చేస్తున్న వైఖరిని క్రాంతి భారతి తప్పుబట్టారు. కేవలం పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నారని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన పార్టీ శుక్రవారం ఎక్స్ వేదికగా విడుదల చేసింది. ‘‘ పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత విజయం కోసం నా తండ్రి పనిచేయవచ్చు. కష్ట పడవచ్చు. అందులో తప్పు లేదు. కానీ జగన్ మెప్పు కోసం పవన్ కల్యాణ్ మీద వాడుతున్న భాష సరికాదు. ముద్రగడ తీరు మార్చుకోవాలి. ఎన్నికల సమయంలో ముద్రగడను సీఎం జగన్ వాడుతున్నారు. ఈ విషయం ముద్రగడ తెలుసుకుంటే మంచిది. పవన్ కల్యాణ్ గెలుపు కోసం నా వంతుగా కృషి చేస్తా’’ అని క్రాంతి భారతి ఆ వీడియోలో పేర్కొన్నారు.

...

Complete article

Posted

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో అరుదైన ఘనత.. 50 కోట్ల రైడర్‌షిప్ దాటేసి సరికొత్త రికార్డు

03-05-2024 Fri 11:18 | Telangana

నిన్నటి వరకు మెట్రోలో ప్రయాణించిన 50 కోట్ల మంది

నవంబర్ 2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో

పండుగలు, క్రికెట్ మ్యాచ్‌లు, ప్రత్యేక సందర్భంగా సర్వీసుల పొడిగింపు

రోజుకు 5 లక్షల మంది రాకపోకలు

cr-20240503tn66347a9cee182.jpg

హైదరాబాద్ మెట్రో అరుదైన ఘనత సాధించింది. నిన్నటి వరకు మెట్రోలో 50 కోట్ల మంది ప్రయాణించారు. నవంబర్ 2017న ప్రారంభమైన మెట్రో రోజురోజుకు ఆదరణ చూరగొంటోంది. పండుగలు, ప్రత్యేక సందర్భాలు, ఐపీఎల్ మ్యాచ్‌‌లు వంటి సమయంలో అదనపు ట్రిప్పులు నడిపిస్తూ ప్రయాణికుల ఆదరాభిమానాలు చూరగొంటోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అలాగే, ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త పథకాలు ప్రకటిస్తోంది.  

గతరాత్రి ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా అర్ధరాత్రి దాటాక 12.15 గంటల వరకు మెట్రో తన సర్వీసులను పొడిగించింది. ఎన్జీఆర్ఐ, స్టేడియం, ఉప్పల్ స్టేషన్ల నుంచి ఈ రైళ్లు ప్రారంభమయ్యాయి. క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా రౌండ్ ట్రిప్ టికెట్లను కూడా మెట్రో అందుబాటులోకి తెచ్చింది.

...

Complete article

Posted

Chandrababu's manifesto realities | AP Elections: చంద్రబాబు ఎన్నికల హామీలు నీటి మూటలేనా.. సాధ్యసాధ్యాలపై ఆర్ధిక నిపుణుల లెక్కలు

Andhra Pradesh: చంద్రబాబు ఏపీ ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇస్తున్న హామీలు ఏమేరకు సాధ్యం అవుతాయి..? రాష్ట్ర ఆదాయం, ఆర్ధిక అంచనా వేయకుండా అలివిగాని హామీలు అమలు చేయాలంటే నిజంగా ఎంత డబ్బు కావాలి..? చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేక గతంలో అవలంభించిన విధానాన్నే మళ్లీ పాటిస్తారానే అని ఆలోచన చేస్తున్నారు వైసీపీ శ్రేణులు, ఆర్ధికనిపుణులు.

chandrababu-2023-12-4a6d2175b03d98b240f5

చంద్రబాబు మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదంటున్న బీజేపీ నేత? ఎందుకో తెలుసా ?

ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు రాజకీయ పార్టీలు వాగ్ధానాలు చేస్తాయి. ప్రజా సమస్యలు తీరుస్తామని హామీలు ఇస్తాయి. సంక్షేమ పాలనతో పాటు పలు ప్రజ ఉపయోగకరమైన పథకాలను ప్రవేశపెట్టి తద్వారా మేలు చేస్తామని మాటిస్తాయి. ఈ తరహా వాగ్ధానాలకు ఎన్నికల హమీలు అంటారు. ఏవైతే ప్రజలకు అందజేస్తామని మాటిస్తాయో వాటిని తమ ఎన్నికల మానిఫెస్టోగా ఎలక్షన్స్ సమయంలో ప్రకటిస్తాయి. అయితే మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే అక్కడి ప్రజలకు రాజకీయ పార్టీలు తమకు తోచిన విధంగా..అమలుకు సాధ్యమయ్యే విధంగా హామీలు ఇస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ(TDP)..ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ(BJP)తో పొత్తుపెట్టుకొని కూటమిగా పోటీ చేస్తూ ప్రజలకు అలివిగాని హామీలను ప్రకటిస్తోందని వైసీపీ శ్రేణులు, రాజకీయ, ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తన ప్రతీ ఎన్నికల ప్రచార సభలు, వేదికలపై ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు హామీల పేరుతో ఈ ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారనే వాదనలు అటు రాజకీయ వర్గాల్లో..ఇటు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా రాష్ట్ర ఆదాయం, ప్రభుత్వ రాబడి కంటే రెట్టింపు స్థాయిలో ప్రజలకు గ్యారెంటీల రూపంలో డబ్బు ఖర్చు చేస్తామని చెప్పడం చూసి ఆర్ధికవేత్తలు సైతం నోరు వెళ్లబెడుతున్నారు. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు చెప్పుకుంటే బీసీ మహిళలకు పెన్షన్ 50ఏళ్లకేఇస్తామని చెప్పారంటే రాష్ట్రంలో సుమారు 32-33లక్షల మందికి ఫించన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి నెలకు 4వేల రూపాయల చోప్పున 32లక్షల మందికి లెక్కేస్తే నెలకు 1400 కోట్లు కావాలి. వీటితో పాటు యువతకు నిరుద్యోగభృతి, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ లు, వాలంటీర్ల జీతాలు లెక్క చూస్తే చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన మాటలు నీటి మూటలే అంటున్నారు వైసీపీ శ్రేణులు, ఆర్ధిక నిపుణులు.

లెక్కలేసుకోకుండానే అలివిగాని హామీలు..

మాకు అధికారం అప్పగిస్తే మీకు మేలు చేస్తామని ప్రతీ రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పుకోవడం సర్వ సాధారణం. ప్రజాకర్షక పథకాలు, ఆర్ధిక తోడ్పాటునిచ్చే రుణమాఫీ వంటి స్కీంలు కూడా ప్రకటించడం కామన్ గా జరిగే ప్రక్రియే. కాని ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలకు అయ్యే ఖర్చు చూస్తే ..ఇది సాధ్యమయ్యే విషయమేనా అనే సందేహం ప్రతీ ఒక్కరిలో కలుగుతోంది. మరీ ముఖ్యంగా ఆర్ధిక వేత్తలు, వైసీపీ శ్రేణులు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒట్టి నీటి మూటలేనే అభిప్రాయాన్ని బాహాటంగా వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. బీసీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారంటే రాష్ట్రంలో సుమారు 32-33లక్షల మందికి ఫించన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి నెలకు 4వేల రూపాయల చోప్పున 32లక్షల మందికి లెక్కేస్తే నెలకు 1400 కోట్లు కావాలి. వీటితో పాటు నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3వేలు ఇవ్వాలంటే రాష్ట్రంలోని 20 లక్షలమందికీ రూ.600 కోట్లు కావాలి. అలాగే ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లతో కలిపి నెలకు రూ.4,800 కోట్లు, వాలంటీర్లు 2 లక్షల 65 వేల మంది ఉన్నారు, ఒక్కొక్కరికీ రూ.10 వేలు అంటే రూ.265 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది.

తడిసిమోపెడు కానున్న ఆర్ధిక భారం..

వీటితో పాటుగా 18 -50 ఏళ్ళ వరకు ఉన్న మహిళలకు రూ.1,500 చొప్పున ఇస్తామని మాటిచ్చారు చంద్రబాబు. ఈ వయసులో ఉన్న వాళ్ల లెక్క చూస్తే రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నారు. ఇది దాదాపు రూ.1,200 కోట్ల వరకు అవసరం అవుతుంది. అంతే మొత్తం దాదాపు రూ.13,200 కోట్లు ప్రతి నెలా ఒకటో తారీఖునే ఉదయానికల్లా రెడీగా ఉండాలి. గతంలో చంద్రబాబు నాయుడు ఐదేళ్లపాటు సృష్టించిన సంపద చూస్తే … అయన దిగి వెళ్లిపోయే నాడు ఖజానాలో ఉన్నది రూ.100 కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడున్న రాష్ట్ర ఆదాయంతోనే ఈ హామీలన్ని నెరవేర్చాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఆరోగ్యశ్రీ, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ పిల్లకు పెట్టె ఆహారం.. వసతిదీవెన, విద్యాదీవెన ప్రభుత్వ బడుల్లో నాడు-నేడు పనులు ఇవన్నీ కాకుండానే మామూలుగా పథకాలకు ప్రతి నెలా ఒకటో తారీఖు ప్రొద్దుటికే రూ.13,200 కోట్లు కావాల్సి ఉంటుంది.

బీజేపీకి నమ్మకం లేకనే..

టీడీపీ అధినేత ప్రకటించిన ఈ వాగ్దానాలు అన్నీ పక్కరాష్ట్రాల నుంచి కాపీకొట్టి తెచ్చినవేనని వాటిని అమలు చేయాలంటే బడ్జట్ కూడా పక్కరాష్ట్రంతో సమానంగా ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు ఆర్ధిక నిపుణులు. లేదంటే గతంలో చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను అధికారంలోకి రాగానే ఎగ్గొట్టినట్లుగా ఈసారి ఎగనామం పెడితే తప్ప అమలు చేయలేని పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పుడున్న రాష్ట్ర ఆదాయం, ఖర్చులు బేరీజు వేసుకోకుండా అధికారం కోసం అలివిగాని హామీలు ఇచ్చి ఎప్పటిలాగానే ప్రజల్ని ఆయన మరోసారి సూపర్ సిక్స్ పేరుతో సూపర్ గా మోసం చేయడానికి రెడీ అవుతున్నారని వైసీపీ శ్రేణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎన్డీఏలో టీడీపీ కలిసినప్పటికి …టీడీపీ మానిఫెస్టోపై నమ్మకం లేకపోవడం వల్లే ఆ మేనిఫెస్టోను సైతం టచ్ చేయకుండా పక్కకు జరిగిందనే విమర్శలు ఉన్నాయి.

...

Complete article

Posted

Anchor Shyamala Election Campaigning For YSRCP | AP Elections 2024 |@SakshiTVPolitical

 

Posted

Lok Sabha Election 2024 | Andhra Pradesh CM Jagan Mohan Reddy Exclusive | India Today News

 

Posted

manduloda ori mayaloda… ninnu nammam babu… cheppadante cheyyadanthe

kichidi kootami’s manifesto now has one more photo missing/removed!

kichidi kootami’s manifesto has one important haami (4000 pension) removed!! Mosalu started already even before elections.

antha mandi old people usuru oorike podura babu, kukka saavu sastav!

Garam Garam Varthalu Full Episode 03-05-2024 | CM YS Jagan | Chandrababu | Pawan Kalyan | @SakshiTV

 

Posted

Yellow TDP leaders stating they would develop and improve the economy to pay people welfare schemes. That's the catch to fool public! Even naive pulkas are believing this is true.

TDP leaders are going to pay people welfare AFTER improving the state! There is no way they can pay people promised welfare from day 1 unless the leaders want to pay from their Swiss bank accounts where they are hiding the scammed money. To improve the state in order to pay the promised welfare schemes, it takes 15-20 years. Where is the money going to come from in the meantime??

https://www.instagram.com/p/C6ct1MPpuaL

Posted

Notiki edi vaste adi vaageyyadam entra Pappu??

Your father lasted 75 years and showing symptoms of alzheimer's now but you don't have a chance even until 50 years before you become completely senile and suffer from dementia.

Oh, okay I see what you meant - you said to vote on March 13, 2029 because you will lose in 2024 🤣

మార్చి 13 న అందరు ఓటు వెయ్యండి - నారా లోకేష్త

లలు పట్టుకున్న టీడీపీ నేతలు

 

Posted
2 hours ago, Vijay said:

Notiki edi vaste adi vaageyyadam entra Pappu??

Your father lasted 75 years and showing symptoms of alzheimer's now but you don't have a chance even until 50 years before you become completely senile and suffer from dementia.

Oh, okay I see what you meant - you said to vote on March 13, 2029 because you will lose in 2024 🤣

మార్చి 13 న అందరు ఓటు వెయ్యండి - నారా లోకేష్త

లలు పట్టుకున్న టీడీపీ నేతలు

 

cancer ki radiation anta. veedi brain issue ki shock treatment ae perfect.

no wonder and it explains why tdp is keeping Mangalagiri maalokam Low Case away from politics, meetings, campaigns...

:emoji-lol:

 

Posted

inexperienced chandrababu and kootami still don't understand the very basic essentials in people's lives - education and healthcare - which Jagan realized ages ago and light years ahead in implementing them successfully leaving the opposition in the dust!

kootami ae kichidi anukunte, vaalla manifesto kuda kichidi ae which looks like a suicide note of cbn.

తెదేపా మేనిఫెస్టో- వైకాపా గెలుపుకి శుభలేఖ : TDP Janasena Manifesto Is Utter Flop | greatandhra.com

 

Posted

very soon, cbn will end up touching Jr.NTR's feet to save his party, political life and avoid retiring in prison.

Kodali Nani Mass Ragging On Chandrababu & Nara Lokesh | AP Elections 2024 | @SakshiTVLIVE

 

Posted

hyderabad nene katta...

computer nene kanipetta...

cell phone nene kanipetta...

I'm a visionary. naku anni telisipotay...

wfh for police and doctors..

making contradictory statements and making a fun out of himself... (Low Case is competing with his dad on this)

unrealistic amaravati to re-build infra in the middle of nowhere instead of using existing cities..

unrealistic/fake kichidi manifesto copied from all other states...

confirmed - chandrababu is suffering from alzheimer's

చంద్ర‌బాబు ఈ మాన‌సిక ప‌రిస్థితుల్లో సీఎం అభ్య‌ర్థిగానా! : Chandrababu Has Lost His Mental Balance

 

Posted

politics is not like uttering TRIVIKRAM DIALOGUES IN MOVIES 🤣

Anchor Shyamala Mass Counter To Janasena Pawan Kalyan | Pithapuram | Vanga Geetha @SakshiTVLIVE

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...