Jump to content
  • 3

Garam Garam Varthalu​ 🧨 Smoking Hot News​ 🔥


Vijay

Question

Recommended Posts

  • 0

అమరావతిలో టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించి, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించిన చంద్రబాబు గారు. అభ్యర్ధులు అందరికీ టిడిపి శ్రేణులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున శుభాకాంక్షలు.

 

Link to comment
Share on other sites

  • 0

Sajjala Ramakrishna Reddy: హత్యలు ఆపండి.. లేదంటే వైసీపీ నుంచి వచ్చే రియాక్షన్ తట్టుకోలేరు: సజ్జల

టీడీపీ హింసా రాజకీయాలకు పాల్పడుతోందన్న సజ్జల

మనుషుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదని విమర్శ

టీడీపీకి ఇవే ఆఖరి ఎన్నికలని వ్యాఖ్య

cr-20240420tn6623b4431d3dd.jpg

మనుషుల ప్రాణాలు తీసేందుకు కూడా టీడీపీ నేతలు వెనుకాడటం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు బైక్ తో ఢీకొట్టడం వల్లే వైసీపీ కార్యకర్త వెంకటరెడ్డి చనిపోయారని తెలిపారు. లోకేశ్ నామినేషన్ సమయంలో జరిగిన గొడవలో వెంకటరెడ్డి మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ హింసా రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. మనుషుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదని అన్నారు. 

తాము ఎంతో సంయమనాన్ని పాటిస్తున్నామని, నిగ్రహంతో ఉన్నామని చెప్పారు. ఇప్పటికైనా దాడులు, హత్యలు ఆపాలని... రెచ్చగొట్టడం మానాలని దండం పెట్టి అడుగుతున్నామని అన్నారు. లేకపోతే వైసీపీ నుంచి వచ్చే రియాక్షన్ ను తట్టుకోలేరని హెచ్చరించారు. దాడులు వాళ్లే చేసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి ఇవే ఆఖరి ఎన్నికలని చెప్పారు. వెంకటరెడ్డి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Big Question..? Big Debate on TDP Money Politics | Chandrababu,Pawan Kalyan, Komati Jayaram Chowdary
 

 

Link to comment
Share on other sites

  • 0

Political Analyst KS Prasad Seriously Fires on Komati Jayaram | Big Question..? @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

కూటమి కొంపముంచిన కోమటి! | TDP Komati Jayaram Conspiracy To Buy Votes | Journalist YNR

 

Link to comment
Share on other sites

  • 0

కుప్పంలో చంద్ర‌బాబు ఎదురీత‌! : Chandrababu's Pitiful Kuppam Story | AP Politics | greatandhra.com

 

Link to comment
Share on other sites

  • 0

Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!

Andhra Pradesh News: పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ తన ఆస్తుల వివరాలతో పాటు అప్పులు, విరాళాలను ప్రస్తావించారు.

b018d9f9fb6dbc19aa22c507370b0cd317138660

నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Assets - పిఠాపురం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఇదివరకే ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టీడీపీ ఇంచార్జి వ‌ర్మతో పాటు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు జనసేనాని తెలిపారు. గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ సంపాదన రూ.114.76,78,300 (నూట పద్నాలుగు కోట్ల 76 లక్షల 78 వేల 3 వందల రూపాయలు)గా ఉంది. తన సంపాదనకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47,07,32,875 (47 కోట్ల 7 లక్షల 32 వేల 8 వందల డెబ్భై ఐదు రూపాయాలు), జీఎస్టీ రూపంలో మరో రూ.28,84,70,000 (28 కోట్ల 84 లక్షల 70 వేల రూపాయలు) పవన్ కళ్యాణ్  చెల్లించారు. 

పవన్ కళ్యాణ్ అప్పులు
ఎన్నికల అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ తన అప్పుల గురించి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కు ఓవరాల్ గా అప్పులు రూ.64,26,84,453 (64 కోట్ల 26 లక్షల 84 వేల 4 వందల 53 రూపాయలు) ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453 (17 కోట్ల 56 లక్షల 84 వేల 4 వందల యాభై మూడు రూపాయలు) అప్పుగా తీసుకున్నారు. వ్యక్తుల నుంచి పవన్ కళ్యాణ్ తీసుకున్న అప్పులు రూ.46,70,000 (46 లక్షల 70 వేల రూపాయలు) ఉన్నాయి.

విరాళాలు రూ.20 కోట్లుపైనే
పవన్ కళ్యాణ్ వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు అందించారు. ఇందులో జనసేనకు రూ.17,15,00,000 ఉన్నాయి. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాలలో విరాళాలు ఇచ్చారు.

వివిధ సంస్థలకు రూ.3,32,11,717 (రూ.3 కోట్ల 32 లక్షలు) విరాళాలు అందచేశారు. ఆ వివరాలివి..

-   కేంద్రీయ సైనిక్ బోర్డు - రూ.1 కోటి 
-   పి.ఎం. సిటిజెన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్ – రూ.1 కోటి 
-   ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి – రూ.50 లక్షలు 
-   తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి – రూ.50 లక్షలు 
-   శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ – రూ.30,11,717
-   పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ – రూ.2 లక్షలు

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Andhra Pradesh polls: TDP Mangalagiri assembly candidate Nara Lokesh declares Rs 543 cr assets

Andhra Pradesh polls: TDP Mangalagiri assembly candidate Nara Lokesh declares Rs 543 cr assets Lokesh is in the assembly poll fray from Mangalagiri segment in Andhra Pradesh where he is set to take on YSR Congress candidate M Lavanya.

nara_lokesh_twitter_1165602_1669366852.j

Lokesh declared Rs 373.63 crore as his family assets in 2019 assembly polls.

The TDP leader holds over one crore shares of Heritage Foods Ltd floated by his family worth Rs 339.11 crore at Rs 337.85 apiece.

His wife Brhamani is currently Executive Director of Heritage Foods.

According to the affidavit, Lokesh holds Rs 314.68 crore worth movable and Rs 92.31 crore worth immovable assets while Brahmani has Rs 45.06 crore and Rs 35.59 crore assets respectively.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

PK oka fake gaadu anthe. no surprises!

1971 లో పుట్టిన పవన్ కళ్యాణ్…

1984 లో టెన్త్ పాస్ అయ్యాడట…

అంటే 13 yellaki టెన్త్ పాస్ అయినట్టు లెక్క …

ఏదైనా మీకే సాధ్యం రా స్వామి…

:emoji-lol:

 

Link to comment
Share on other sites

  • 0

Garam Garam Varthalu Full Episode 23-04-2024 | CM YS Jagan | Chandrababu | Pawan Kalyan |@SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0
5 hours ago, Sanjiv said:

PK oka fake gaadu anthe. no surprises!

1971 లో పుట్టిన పవన్ కళ్యాణ్…

1984 లో టెన్త్ పాస్ అయ్యాడట…

అంటే 13 yellaki టెన్త్ పాస్ అయినట్టు లెక్క …

ఏదైనా మీకే సాధ్యం రా స్వామి…

:emoji-lol:

 

Actually, PK is 10th FAILED but passed because of the 3 grace marks given by the then CM to all failed students. So he could not score even 35% marks to pass LOL 🤣

His cheap character can be seen in Vakil Saab movie being a lawyer and fighting like a street goon with other lawyers right in the courtroom (it's an insult to remake Amitabh's decent movie). So illiterate and disgusting!

English raadu, Hindi raadu, decency ledu so if he becomes CM, how is he going to speak to the PM, ministers in Delhi, collectors in AP...?

Link to comment
Share on other sites

  • 0

Garam Garam Varthalu Full Episode 24-04-2024 | CM YS Jagan | Chandrababu | Pawan Kalyan | @SakshiTV 🤣

 

Link to comment
Share on other sites

  • 0

చంద్రబాబు,పవన్ ఆస్తులు చిట్టా! Big Debate on Chandrababu Pawan Kalyan Affidavit's @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

FacebookEmailWhatsAppXTelegram

నేడు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం

 బుధవారం అసెంబ్లీకి 1,294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలు

nominations-1.jpg

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనున్న విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణకు డెడ్‌లైన్‌గా అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటివరకు అసెంబ్లీకి 3,644, లోక్‌సభకు 654 నామినేషన్లు దాఖలు అయ్యాయి.. బుధవారం ఒక్కరోజే అసెంబ్లీకి 1,294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలు కావడం విశేషం.. ఇక, ఇవాళ్టితో నామినేషన్ల స్వీకరణ ముగియనుండడంతో.. ఇవాళ పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉండటంతో.. అధికారులు దానికి తగ్గ ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నామినేషన్లు వేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు.. మరికొందరు కీలక అభ్యర్థులు సిద్ధమయ్యారు.

అలాగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటి వరకు మొత్తం 478 మంది అభ్యర్థులు, 554 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.. ఇక, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా జరుగుతోన్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆ స్థానంలో 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Pothina Mahesh | పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల అఫిడవిట్‌పై పోతిన మహేశ్‌ సెటైర్లు

Pothina Mahesh | పవన్‌ కల్యాణ్‌ ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌పై జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేశ్‌ మండిపడ్డారు. అఫిడవిట్‌లో పవన్‌ కల్యాన్‌ అన్నీ అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం ఓ అధికారిని పెట్టి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

pothina-mahesh_V_jpg--816x480-4g.webp?sw

Pothina Mahesh | పవన్‌ కల్యాణ్‌ ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌పై జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేశ్‌ మండిపడ్డారు. అఫిడవిట్‌లో పవన్‌ కల్యాన్‌ అన్నీ అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం ఓ అధికారిని పెట్టి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. పవన్‌ కల్యాణ్‌ చూపిన ఆస్తులు, లావాదేవీల్లో లాజిక్‌ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు జనసేన పార్టీని హోల్‌సేల్‌గా అమ్మేశారని ఆరోపించారు. రెండు చిత్రాలతో పవన్‌ కల్యాణ్‌ రూ.90 కోట్లు సంపాదించారని ప్రశ్నించారు. ఆ డబ్బులు సినిమా రెమ్యునరేషనా? లేక పొలిటికల్‌ ప్యాకేజీతో వచ్చాయా అని నిలదీశారు.

భూములు దోచుకోవాలని, లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని పోతిన మహేశ్‌ ఆరోపించారు. అందుకే సీఎం అభ్యర్థి నుంచి పార్టీకి కేవలం 21 సీట్లు ఇస్తే చాలన్న స్థాయికి పడిపోయారని విమర్శించారు. పవన్‌కు ప్రజల నుంచి చెప్పు దెబ్బలు తప్పవని అన్నారు. సినిమా డైలాగులు చెబితే ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్‌ చదవడం ఏంటని ప్రశ్నించారు.

ప్రజలను నమ్ముకున్న సీఎం జగన్‌ సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. జగన్‌ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఏపీలో ప్రజలు కూటమిని నమ్మడం లేదని.. మరో 25 ఏండ్లు సీఎంగా జగనే ఉంటారని స్పష్టం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Teenmaar Mallanna Announced as Congress Candidate for MLC

cr-20240425en6629d21ed9c8c.jpg

The Congress Party has announced Teenmaar Mallanna, also known as Chintapandu Naveen, as their candidate for the upcoming by-elections in the Nalgonda-Warangal-Khammam constituency. The declaration was made by KC Venugopal, the General Secretary of the party, on Wednesday.

Following the victory of Palla Rajeshwar Reddy as the MLA from Jangaon in last year’s assembly elections, he resigned from his MLC position, necessitating this by-election. The voters’ list has also been released, with a total of 461,000 eligible voters registered for these elections.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

YS Jagan Strengthens Ties with Pulivendula, Files Nomination

cr-20240425en662a26a420755.jpg

On Thursday, following the conclusion of the statewide bus tour on Wednesday, Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy visited Pulivendula. Subsequently, he filed his nomination as the party's candidate. Initially, CM participated in a public meeting organized at CSI Ground in Pulivendula, and from there, he directly went to the office of the Returning Officer where he submitted his nomination papers to the Pulivendula RO.

Previously, in a public meeting held in Pulivendula, CM Jagan spoke out. He commented on the murder of his uncle Vivekananda Reddy, stating that the culprits are known to the outside world and criticized those who sided with them. He defended Avinash by saying that he had not done anything wrong and thus was given the ticket again. He also claimed that there are people trying to ruin Avinash's life and accused the Chandrababu Naidu-led coalition of running a smear campaign against him.

Jagan stated that the public is aware of the coalition's conspiratorial politics and will soon teach the coalition leaders a lesson. He expressed deep connection with Pulivendula, claiming it has always supported him, and referred to it as his life. He also announced that the plans to establish a medical college in Pulivendula will be realized soon. Following the meeting, CM Jagan formally filed his nomination at the Returning Officer's office.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Garam Garam Varthalu Full Episode 25-04-2024 | CM YS Jagan | Chandrababu | Pawan Kalyan |@SakshiTV

Taking a bath while driving a lorry 🤣

Cooking omelettes on the street ground due to hot Sun 🔥☀️🌞

:emoji-lol:

 

Link to comment
Share on other sites

  • 0

Vellampalli Srinivasa Rao: సిగ్గూ శరం లేకుండా ఇంకా చంద్రబాబు కాళ్లు పట్టుకుని తిరుగుతున్నాడు: పవన్ పై వెల్లంపల్లి ఫైర్

జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్న వెల్లంపల్లి 

చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేనని విమర్శ

బీజేపీని పురందేశ్వరి తాకట్టు పెట్టారని వ్యాఖ్య

cr-20240426tn662b995cee721.jpg

పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అర్హుడికీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వర్ల రామయ్య, బుద్దా వెంకన్నకు కూడా సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు. గతంలో టీడీపీ జెండా పట్టుకున్న వారికే పథకాలు ఇచ్చేవారని విమర్శించారు. జగన్ అందిస్తున్న పథకాల గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదని చెప్పారు. 

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, శ్రీలంక అయిందని చంద్రబాబు అన్నారని... చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని వెల్లంపల్లి విమర్శించారు. నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం చంద్రబాబుకు ఉందని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 

సిగ్గూ శరం లేకుండా పవన్ కల్యాణ్ ఇంకా చంద్రబాబు కాళ్లు పట్టుకుని తిరుగుతున్నాడని వెల్లంపల్లి అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను శాశ్వతంగా సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారడానికి చంద్రబాబే కారణమని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని పురందేశ్వరి డైరెక్ట్ గా తాకట్టు పెట్టిందని విమర్శించారు. 

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Mudragada Padmanabham: డబ్బు కోసం సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చావా పవన్ కల్యాణ్?: ముద్రగడ పద్మనాభం

ఉండిలో వైసీపీ కాపు కార్యకర్తలతో సమావేశం

కాపు ఉద్యమాన్ని అణచిన చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారని విమర్శ

పవన్ కు ఏ స్థాయి ఉందని ఆయన వద్దకు వెళ్లాలని ప్రశ్న

cr-20240426tn662b933b1884c.jpg

వైసీపీలో చేరినప్పటి నుంచి జనసేన అధినేత వపన్ కల్యాణ్ పై కాపు నేత ముద్రగడ పద్మనాభం పదునైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ... డబ్బుల కోసం సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చావా పవన్? అని ప్రశ్నించారు. కాపు ఉద్యమ సమయంలో ఘోరమైన అవమానాలను చంద్రబాబు చేశారని... కాపు ఉద్యమాన్ని అణచి వేసిన చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారని విమర్శించారు. తనను, తన భార్య, కోడలు, పిల్లలను 14 రోజులు జైల్లో మాదిరి బంధించారని మండిపడ్డారు. తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, వాష్ బేసిన్ లోని నీళ్లనే తాగామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉండిలో వైసీపీ కాపు కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముద్రగడ, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి  పీవీఎల్ నర్సింహరాజు హాజరయ్యారు.
  
తమ కుటుంబాన్ని చంద్రబాబు హింసిస్తుంటే... ఆయనను పవన్ కల్యాణ్ ఒక్కరోజు కూడా ప్రశ్నించలేదని ముద్రగడ విమర్శించారు. జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరిన తనను నానా బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులను తాను ఎందుకు ఫాలో అవ్వాలని ప్రశ్నించారు. ఏ స్థాయిలో ఉన్నావని నీ దగ్గరకు నేను రావాలని పవన్ ను ఉద్దేశించి అడిగారు. మీకొక ఎమ్మెల్యే అయినా ఉన్నాడా? అని ఎద్దేవా చేశారు. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా అయినా పోటీ చేస్తున్నావా? అని అడిగారు. 

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Varun Tej: రేపు పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్

ఇప్పటికే పవన్ కోసం ప్రచారం చేస్తున్న టాలీవుడ్ ప్రముఖులు

ఏప్రిల్ 27న పిఠాపురం నియోజకవర్గంలో వరుణ్ తేజ్ పర్యటన

cr-20240426tn662b71acc5fe2.jpg

జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కోసం పిఠాపురంలో ఇప్పటికే నాగబాబు, జానీ మాస్టర్, హైపర్ ఆది, పృథ్వీ, గెటప్ శ్రీను తదితరులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రేపు (ఏప్రిల్ 27) పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరఫున మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ప్రచారానికి రానున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వరుణ్ తేజ్ బాబాయ్ కోసం ప్రచారం చేపట్టనున్నారు. వరుణ్ తేజ్ రోడ్ షోలో కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

...

Complete article

20240426fr662b953449b73.jpg

Link to comment
Share on other sites

  • 0

Nara Lokesh on resuming Amaravati: అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తాం: నారా లోకేశ్

మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం

నేడు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు

తాను ఓడినప్పటికీ నియోజకవర్గంలో అనేక పనులు చేశానని లోకేశ్ వెల్లడి

గెలిచినవాళ్లు  పది శాతం పనులు కూడా చేయలేదని విమర్శలు

cr-20240426tn662b6eab699b5.jpg

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇవాళ ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, మంగళగిరి నియోజకవర్గంలో తాను ఓడిపోయినప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని, తాను చేసిన సంక్షేమంలో 10 శాతమైనా గెలిచినవాళ్లు చేయగలిగారా? అని ప్రశ్నించారు. 

కూటమి అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 2019 నుంచి అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవని నారా లోకేశ్ పేర్కొన్నారు. 2014లో అమరావతికి జగన్ సంపూర్ణ మద్దతు తెలిపారని, కానీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. 

జగన్ ను ఒప్పిస్తానన్న స్థానిక ఎమ్మెల్యే ఆర్కే కూడా మూడు రాజధానులకు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో జగన్ అండ్ కో మాస్టర్స్ డిగ్రీ చేశారని వ్యంగ్యం ప్రదర్శించారు. దళిత రైతులపైనా అక్రమ కేసులు పెట్టారని లోకేశ్ విమర్శించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Kodali Nani: కొడాలి నాని నామినేషన్ ను తిరస్కరించాలని టీడీపీ ఫిర్యాదు

తాను ఏ ప్రభుత్వ భవనాన్ని వినియోగించలేదని అఫిడవిట్ లో తెలిపిన కొడాలి నాని

మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించారన్న టీడీపీ

అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు

cr-20240426tn662b5c12bb8a2.jpg

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ పై వివాదం ఏర్పడింది. అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారని రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని కొడాలి నాని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకి ఇచ్చినట్టు మున్సిపల్ అధికారులు పేర్కొన్న పత్రాలను ఫిర్యాదుకు జత చేశారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తాను వినియోగించలేదని అఫిడవిట్ లో నాని పేర్కొన్నారని చెప్పారు. అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చిన నాని నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు. ఈ నేపథ్యంలో నాని నామినేషన్ పై రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Harish Rao ready with Resignation letter: రాజీనామా పత్రంతో గన్ పార్క్ కు చేరుకున్న హరీశ్ రావు

హరీశ్ రావుకు మద్దతుగా వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్

భారీగా చేరుకుంటున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు

పెద్ద సంఖ్యలో పోలీసుల మోహరింపు

cr-20240426tn662b3957df63c.jpg

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తన రాజీనామా పత్రంతో శుక్రవారం ఉదయం హైదరాబాదులోని గన్ పార్క్ కు చేరుకున్నారు. రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీశ్ రావు సవాల్ చేసిన విషయం తెలిసిందే. రైతు రుణమాఫీపై నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఆగస్టు 15 లోగా రైతుల రుణాలు (రూ.2 లక్షల లోపు) మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై హరీశ్ రావు స్పందిస్తూ.. ఈ హామీ నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు.

ఈ ఛాలెంజ్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని తిరగాలంటూ హరీశ్ రావుకు సూచించారు. ఈ విషయంపై గన్ పార్కు వద్ద తేల్చుకుందాం, రాజీనామా లేఖతో రావాలని హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తన రాజీనామా పత్రంతో హరీశ్ రావు గన్ పార్క్ కు చేరుకున్నారు. ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. మాజీ మంత్రికి మద్దతుగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.

ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నమే..
గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు పూలతో నివాళులు అర్పించారు. అనంతరం తన రాజీనామా లేఖను స్థూపం ముందుంచారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో 144 సెక్షన్ అమలులో ఉందని, నిబంధనల ప్రకారమే తాము ఐదుగురమే ఇక్కడ ఉన్నామని హరీశ్ రావు చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించి రాజీనామా పత్రంతో గన్ పార్క్ వద్దకు వచ్చానని హరీశ్ రావు చెప్పారు. ఎన్నికల హామీలను అమలుచేసే విషయంలో రేవంత్ రెడ్డి ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా వాడుకుంటున్నారని, ప్రమాణం చేస్తున్నారని విమర్శించారు.

రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలు విషయంలో చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖతో గన్ పార్కుకు రావాలని హరీశ్ రావు ఛాలెంజ్ చేశారు. ఇద్దరి రాజీనామాలను ఇక్కడికి వచ్చిన మేధావులకు అందజేసి వెళదామని అన్నారు. ఆగస్టు 15 నాటికి హామీలు అమలు చేయకుంటే మీ రాజీనామాను గవర్నర్ కు, అమలుచేస్తే నా రాజీనామా లేఖను స్పీకర్ కు పంపిద్దామని హరీశ్ రావు చెప్పారు. అనంతరం తన రాజీనామా లేఖను అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు అందజేసి హరీశ్ రావు వెళ్లిపోయారు.

...

Complete article

బిగ్ బ్రేకింగ్ రాజీనామా పత్రంతో మరికాసేపట్లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు ఎమ్మెల్యే హరీష్ రావు ఆగస్టు 15వ తేదిలోపు రైతు రుణమాఫీ, ఆరు హామీల అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీ నేపథ్యంలో ప్రతి సవాల్ విసిరిన ఎమ్మెల్యే హరీష్ రావు.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...