Jump to content
  • 2

Chandrababu Praja Galam: టీడీపీ ప్రజాగళం ఎన్నికల ప్రచారం


TELUGU

Question

Chandrababu: నాలాగా జగన్ మండుటెండలో మూడు సభల్లో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా?: చంద్రబాబు సవాల్

సీఎం జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు రిప్లయ్

జగన్ ను పిల్లకాకితో పోల్చిన టీడీపీ అధినేత

జగన్ పనిదొంగ అంటూ విమర్శలు

cr-20240329tn6606b615205a5.jpg

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. జగన్ నా వయసు గురించి మాట్లాడతాడు... నా మాదిరిగా మండుటెండలో ఒక మూడు మీటింగుల్లో పాల్గొని, సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా ఈ జగన్? అని ఎద్దేవా చేశారు. 

"ప్రజలకు చంద్రబాబు ఏం చేశాడని అడుగుతాడు... తెలుగు రాష్ట్రాల్లో  పిల్లలను అడిగినా చెబుతారు నేను ఏం చేశానో. అతనికి తెలియకపోతే ఆ అజ్ఞానానికి ఎవరేం చేయగలం?" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

అంతేకాదు, బనగానపల్లెలో తాను జగన్ పై చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా చంద్రబాబు పంచుకున్నారు. జగన్ ను పిల్లకాకితో పోల్చారు. నాలాగా రెండ్రోజులు మధ్యాహ్నం ఒంటిగంటకు మంచి ఎండలో మీటింగ్ లు పెట్టగలవా? అని సవాల్ విసిరారు. పనిదొంగ, దోపిడీదారుడు ఈ జగన్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

Common Woman Shocking Comments On Chandrababu Naidu | YS Jagan | Memantha Siddham | Telugu Popular

 

Link to comment
Share on other sites

  • 0

orey babu, you have already proved yourself as a COPYCAT (just copying Jagan's schemes) and no need to prove it again and again out of desperation and embarrass yourself. you are talking like all that the voters have to do now is to make more and more babies and do abortions if it is going to be a boy! you are such a pathetic, pathological LIAR!!

you have not said what you would pay if they have 5 or 6 or more girls. maybe they have to pay YOU if they have more than 4 girls huh? no one would be surprised.

 

Link to comment
Share on other sites

  • 0

ilaanti oosaravelli ki support cheyyali, vote veyyali ani ela anipistadi? veedu 2 seats kuda win kaadu, deposits kuda lose avtadu ani telisi kooda support cheyyadam aa?

yellow pulkas maree antha naive muddha pappula?? even after he is charged with scams/crimes, you think he is God and whatever he says is true? EEEW!!

you dumbos think he is going to keep all these unrealistic and clearly false promises??

 

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: జగన్‌ను భూస్థాపితం చేస్తాం.. చీకటి పాలనను అంతం చేస్తాం: చంద్రబాబు

సీఎం జగన్(CM Jagan) పాలనలో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని, జగన్‌ని భూస్థాపితం చేసి.. రాష్ట్రంలో చీకట్లను పారదోలుతామని స్పష్టం చేశారు.

CBN_32ffe40483_V_jpg--799x414-4g.webp

తణుకు: సీఎం జగన్(CM Jagan) పాలనలో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని, జగన్‌ని భూస్థాపితం చేసి.. రాష్ట్రంలో చీకట్లను పారదోలుతామని స్పష్టం చేశారు. తణుకులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి బాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..

"నాకు అనుభవం ఉంది.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉంది. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది.రాష్ట్రానికి ఇక అన్నీ మంచి రోజులే. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు కలిశాయి. జెండాలు వేరైనా.. అజెండా ఒక్కటే. జగన్ ను భూస్థాపితం చేయడమే ప్రధాన లక్ష్యం. చీకటి పాలనను అంతం చేయడానికి ఓట్లు చీలకూడదని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్ కు పారిపోతాడు. జగన్ చేతిలో చిప్ఫ పట్టుకుని ఎక్కడికి పోతాడో అప్పుడే చెప్పను.. పవన్ కళ్యాణ్, నేను చేసి చూపిస్తాం. 2014 నుంచి 2019వరకు ఏం జరిగిందో అర్దం చేసుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఎన్నికల్లో గెలవడానికి జగన్ ముద్దులు పెట్టారు. హగ్గులిచ్చారు. ఇప్పుడు పిడి గుద్దులు కురిపిస్తున్నారు. ఏపీలోని ప్రతి పౌరుడిని అడుగుతున్నా. అభివృద్ధి కావాలా? సంక్షోభం కావాలా.. నిర్ణయించుకోండి.

దగా పథకాలు కావాలా, దోపిడి లేని పథకాలు కావాలో మహిళలు ఆలోచించాలి. ఇక్కడ ఉన్న పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రైతులకు కనీసం గోనెసంచులు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపై మొదటి సంతకం పెడతాం. పేదల ఆస్తులు దొంగిలించిన ఏకైక నాయకుడు జగన్. జగన్ అయిదేళ్ల పాలనలో అప్పులు పెరిగాయి. ఏ ఒక్కరూ బాగుపడలేదు.

జగన్ మాత్రం బాగుపడ్డారు. అధికారం అంటే దోచుకోవడమేనని జగన్ అనుకున్నారు. ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టే నేను, పవన్ కళ్యాణ్ స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం. అయిదేళ్ల పాలనలో మమ్మల్ని ఎన్ని ఇబ్భందులు పెట్టారో అందరికీ తెలుసు. వచ్చేనెల 13వ తేదీన మీరు ఇచ్చే తీర్పుతో తాడేపల్లిలో ఉన్న జగన్ కోట బద్ధలవ్వాలి. ఎన్నికల ముందు ఆయన ఎవరినైనా కలిశాడా. పరదాల చాటునే వెళ్ళారు. జగన్ వస్తున్నాడంటే పారిశ్రామిక వేత్తలు పారిపోతారు. నేను వస్తున్నానంటే, పారిశ్రామిక వేత్తలు తరలివస్తారు" అని బాబు అన్నారు.

వాలంటీర్లు కంగారు వద్దు..

వాలంటీర్లను ఉద్దేశించి తణుకు సభలో బాబు మాట్లాడారు. "వాలంటీర్లు కంగారు పడవద్దు.. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది. రాజీనామాలు చేయవద్దు. మీకు అండగా ఉంటాం.అవసరమయితే పది వేలు కాదు, లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా. కారుమూరి రూ.840 కోట్ల టీడీఆర్ బాండ్ల పేరుతో దోచుకున్నారు. తణుకులో జనసేన కార్యకర్తలపై దాడి చేశారు. అదే పవన్ కళ్యాణ్ కన్నెర్ర చేస్తే, ఆయన ఎక్కడ ఉంటారో తెలీదు. ధాన్యం తడిసిపోయిందని రైతులు అంటే వారిని బూతులు తిడతారు. అలాంటి మంత్రికి రైతులు బుద్ది చెప్పాలి. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది" అని అన్నారు.

...

Complete article

 

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: ప్రజలు కన్నెర్ర చేస్తే జగన్ లండన్ పారిపోతారు: తణుకులో చంద్రబాబు

తణుకులో ప్రజాగళం సభ

హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్

ప్రజాగళం ధాటికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న చంద్రబాబు

మరోసారి ముగ్గురం కలిశామని, ఇక తమకు ఎదురులేదని ధీమా

cr-20240410tn6616985c4e39d.jpg

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ప్రజాగళం ధాటికి ఏపీ నుంచి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ప్రజాగ్రహానికి వాయువు తోడైందంటూ పక్కనే ఉన్న పవన్ కల్యాణ్ ను చూపించారు. నేడు తణుకు సభ సాక్షిగా చెబుతున్నా సైకిల్ స్పీడుకు ఎదురులేదు, గ్లాసు జోరుకు తిరుగులేదు, కమల వికాసానికి అడ్డే లేదు అని అభివర్ణించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాయి... మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనని అన్నారు. 

పదేళ్ల కిందట రాష్ట్ర విభజన కష్టాలు పోగొట్టేందుకు మూడు పార్టీలు కలిశాయని తెలిపారు. మళ్లీ ఇప్పుడు జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మళ్లీ కలిశామని స్పష్టం చేశారు. కలిసింది మామూలు వ్యక్తులు కాదు... అనుభవం ఉన్న నేను, తపన ఉన్న పవన్ కల్యాణ్, దేశాన్ని నెంబర్ వన్ గా ప్రపంచపటంలో నిలపాలని కృషి చేసే నరేంద్ర మోదీ కలిశాం... ఇక మాకు తిరుగుంటుందా? అని ప్రశ్నించారు. 

పవన్ కల్యాణ్ ఒక సినిమా హీరో మాత్రమే కాదు, కోట్ల రూపాయల ఆదాయాన్ని, సుఖవంతమైన సినీ జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని చంద్రబాబు కొనియాడారు. పవన్ పై వైసీపీ నేతలు వ్యక్తిగత దాడులు చేశారు... అయినా అనేక అవమానాలను, దాడులను తట్టుకుని నిలబడిన పోరాట యోధుడు పవన్ కల్యాణ్ అని వివరించారు. 

నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కల్యాణ్... నేను గానీ, తెలుగుదేశం పార్టీ గానీ ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోం అని పేర్కొన్నారు. చీకటిపాలనను అంతం చేసే క్రమంలో ఓటు చీలనివ్వబోమని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు. మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం. అలాంటి సంకల్పానికి నరేంద్ర మోదీ నుంచి మద్దతు లభిస్తోంది అని చంద్రబాబు వెల్లడించారు. 

చేతిలో చిప్ప పట్టుకోవడం ఖాయం!

2014లో పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 సీట్లలో టీడీపీని గెలిపించారు... ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నాం... వైసీపీకి డిపాజిట్లు వస్తాయా? ఇవాళ  యువత పవర్ చూశాను. యువత గానీ కన్నెర్ర చేస్తే ఈ జగన్ లండన్ పారిపోతాడు. చేతిలో చిప్ప పట్టుకోవడం ఖాయం... ఎక్కడికి వెళతాడో నేను ఇప్పుడే చెప్పను... నేను, పవన్ కల్యాణ్ చేసి చూపిస్తాం. 2014-19 మధ్య ఎలాంటి పాలన జరిగిందో మీకు తెలుసు... మళ్లీ అలాంటి పాలన రావాలంటే కూటమి రావాలి, జాబు రావాలంటే కూటమి రావాలి... రాష్ట్ర ప్రయోజనాలే మాకు ప్రథమ ప్రాధాన్యత. 

నేను గానీ, పవన్ గానీ ఆలోచించేది దాని గురించే!

2019 నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకోండి... బాదుడే బాదుడు. గత ఎన్నికల ముందు ముద్దులు పెట్టాడు, తలపై చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు... ఇప్పుడు గుద్దుడే గుద్దులు... పిడిగుద్దులు గుద్దుతున్నాడు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది. కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఎన్డీయే ఆక్సిజన్ అందిస్తుంది. నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసమో, పవన్ కల్యాణ్ కు అధికారం కోసమో మేం ఆలోచించడంలేదు... రాష్ట్ర ప్రజల బాగు కోసమే మేం ఆలోచిస్తున్నాం. 

విధ్వంసక పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా... సంక్షేమ పాలన కావాలా, సంక్షోభ పాలన కావాలా... మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా, లేక గంజాయి, డ్రగ్స్ కావాలా... మీ ఆస్తులకు రక్షణ కావాలా, లేక భూ మాఫియా కావాలా... నడుములు విరిగే దారుణమైన రోడ్లు కావాలా, భద్రతనిచ్చే రోడ్లు కావాలా... రూ.10 ఇచ్చి రూ.100 దోచేసే దొంగలు కావాలా, మీ సంపద పెంచే కూటమి కావాలా... సచివాలయాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేవాళ్లు కావాలా, సంపద సృష్టించే వాళ్లు కావాలా... ధరల బాదుడు కావాలా, దోపిడీ లేని పథకాలు కావాలో అందరూ ఆలోచించుకోవాలి.  

వీళ్లు ఫేక్ ఫెలోస్, బోగస్ ఫెలోస్

ఈ రాష్ట్రంలో ఫేక్ ఫెలోస్ వచ్చారు, బోగస్ వ్యక్తులు వచ్చారు... వీళ్లను నమ్మితే నష్టపోతాం. యూట్యూబ్ లో కానీ, మీ ఫోన్లలో వచ్చేవి కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.. వాస్తవాలను తెలుసుకోండి... దొంగలు పెట్టే ఫేక్ న్యూస్ నమ్మొద్దు. జగన్ ఎన్నికల ముందు ఎన్నో చెప్పాడు... ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు,  మిమ్మల్ని ఎవరినైనా కలిశాడా? పరదాలు  కట్టుకుని తిరిగాడు. తాడేపల్లిలో అయినా ఎవరినైనా కలిశాడా? ఇప్పుడు మళ్లీ మీ వద్దకు వస్తున్నాడు.. మీపై ప్రేమ కాదు, మీ ఓట్ల కోసం వస్తున్నాడు... జగన్ ను నమ్మం అని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. 

సూపర్-6తో మీ ముందుకు వస్తున్నాం 

కూటమి తరఫున నిర్దిష్టమైన అజెండాతో మీ ముందుకు వస్తున్నాం. సూపర్-6తో మీ ముందుకు వస్తున్నాం. అందులో మొదటి కార్యక్రమం ఆడబిడ్డ నిధి. స్త్రీలకు నెలకు రూ.1500 ఇస్తాం, ఇద్దరుంటే రూ.3000, ముగ్గురుంటే రూ.4,500, నలుగురు ఉంటే రూ.6000... ప్రతి నెలా ఒకటో తారీఖున ఆడబిడ్డల అకౌంట్లలో వేస్తాం. 

రెండోది తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.15,000 చొప్పున ఇస్తాం. ఒక బిడ్డ ఉంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు, ఐదుగురు ఉంటే రూ.75 వేలు ఇస్తాం. 

మూడోది... ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. నాలుగోది... మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఐదు... అన్నదాతలకు ఏడాదికి రూ.20 వేల సాయం అందిస్తాం. ఆరు... యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. 

జగన్ వస్తున్నాడంటే పరిశ్రమలు పారిపోతాయి... మేం వస్తున్నామంటే పరిశ్రమలు అవే వస్తాయి.... మన యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తాం. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4 వేల పెన్షన్ అందిస్తాం. వృద్ధులకు, వితంతువులకు, పేదలకు ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తాం. ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం... రెండో నెలలో కూడా తీసుకోకపోతే మూడో నెలలో కూడా ఇచ్చే బాధ్యత మాది. వికలాంగులకు రూ.6 వేల చొప్పున పెన్షన్ ఇస్తాం. 

మళ్లీ చెబుతున్నా... వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం

వాలంటీర్లకు మరోసారి చెబుతున్నా. నిన్ననే మా కూటమి తరఫున ప్రకటన చేశాం. వాలంటీరు వ్యవస్థ ఉంటుంది... మీరు తప్పుడు పనులు చేయొద్దు... మీకిచ్చే జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలో దిక్కు తెలియడంలేదు. మంత్రి ధర్మాన అంటున్నాడు... రాష్ట్రంలో వాలంటీర్లే లేరట... వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారట. రాజీనామా చేసిన వాలంటీర్లు రెండు శాతమే. 

ఈ సందర్భంగా వాలంటీర్లకు చెబుతున్నా... వాళ్లు చెప్పినా మీరు రాజీనామా చేయొద్దు... మీకు అండగా మేముంటాం. మీరు మంచి పనులు చేస్తే మీకు మద్దతుగా నిలుస్తాం. మీతో తప్పుడు పనులు  చేయించి మీ జీవితాలు నాశనం చేయాలని దుర్మార్గుడు జగన్ ఆలోచిస్తున్నాడు... వాలంటీర్లు విజ్ఞతతో ఆలోచించాలి... రాష్ట్రాభివృద్ధికి దోహదపడండి.. అవసరమైతే రూ.10 వేలు కాదు... రూ.1 లక్ష సంపాదించుకునే మార్గం చూపిస్తాను.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: మేమిద్దరం కలిసొచ్చామంటే సూపర్ డూపర్ హిట్: చంద్రబాబు

అమలాపురంలో ప్రజాగళం-వారాహి విజయభేరి సభ

అడ్డు వస్తే సైకిల్ తో తొక్కుకుంటూ పోతామన్న చంద్రబాబు

గ్లాసును పగులగొట్టాలని చూస్తే పదునెక్కుతుందని వ్యాఖ్య 

cr-20240411tn6618139961d3c.jpg

అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ వద్ద నిర్వహించిన ప్రజాగళం-వారాహి విజయభేరి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఇవాళ తాము ప్రజల కోసం వచ్చామని వెల్లడించారు. 

అనుభవం ఉన్న నేను... ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉన్న వ్యక్తి, పవర్ స్టార్, నిజమైన నాయకుడు, మీరు నచ్చిన నాయకుడు, మీరు మెచ్చిన నాయకుడు ఇద్దరం కలిసి వచ్చామంటే ఇక చూడండి... సూపర్ డూపర్ హిట్... ఎవరైనా మాకు అడ్డంగా నిలబడగలరా? అడ్డం రావాలనుకుంటే సైకిల్ తో తొక్కుకుంటూ పోతాం... పగులగొట్టాలనుకుంటే గ్లాసు పదునెక్కుతుంది... పదునెక్కిన గ్లాసు ఏం చేస్తుందో నాకు కూడా తెలియదు... మరోవైపు కమలంతో ప్రధాని నరేంద్ర మోదీ కూడా మనతో కలిసి వస్తున్నారు అంటూ చంద్రబాబు వివరించారు. 

ఎంతో అందమైన కోనసీమకు మాఫియా నేతలు వచ్చారని, మరో పులివెందుల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడికొస్తే ఇద్దరు వ్యక్తులు గుర్తుకు వస్తారు. స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన జీఎంసీ బాలయోగి, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పార్టీలో చేరి చనిపోయేవరకు జెండా మోసిన మెట్ల సత్యనారాయణ. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. ఒక అహంకారి... అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. దాంతో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే, ఎప్పటికీ బాగు చేసుకోలేం. 

2014లో పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా మమ్మల్ని ఆశీర్వదించాడు, సహకరించాడు. ఆ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేశాం. ఇప్పుడు యువతలోనూ, ఆడబిడ్డల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మళ్లీ మంచి రోజులు వస్తాయని మాకు మంగళ హారతులు ఇచ్చారు. మీ ఆశలు నెరవేర్చే బాధ్యత మాది. 

గతంలో మేం కూటమిలో ఉన్నప్పుడు విభజన చట్టంలో ఉన్న అన్నీ తీసుకొచ్చాం. 11 విద్యాసంస్థలు తీసుకువచ్చాం... ఎయిమ్స్ తీసుకువచ్చాం. కేంద్రం అనుమతితో, నిధులతో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. పోలవరం పూర్తయి ఉంటే ఈ గోదావరి జిల్లాల్లో మూడు పంటలకు నీళ్లు వచ్చేవి. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి. నాడు వ్యవసాయంలో, ఆక్వాలో, పెట్టుబడుల్లో, ఉద్యోగ కల్పనలో, ఏపీ ఆరోగ్య సూచికలో, విద్యా ప్రమాణాల్లో, రోడ్ల నిర్వహణలో, పథకాల వినియోగంలో, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి అగ్రస్థానంలో ఉన్నాం.

ఇవాళ ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా? తిండిలేక అప్పుల పాలై రైతులు అవస్థలు పడుతున్నారు, యువతకు ఉద్యోగాలు లేవు, యువతకు జాబ్ రావాలంటే కూటమి రావాలి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చెప్పిన ఓ అంశాన్ని ప్రస్తావిస్తాను. "నా చిన్నప్పుడు మా అన్నయ్య చిరంజీవి నాకు నటనలో నైపుణ్యం నేర్పించాడు, సినిమా డైలాగులు ఎలా చెప్పాలో నేర్పించాడు... దాంతో నేను నటుడిగా ఎదిగి, ఇవాళ  రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల ముందుకు వచ్చాను" అని పవన్ చెప్పాడు.

ఆనాడు చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయంతో ఇవాళ కుటుంబం మొత్తం సినిమా యాక్టర్లు అయ్యారంటే సరైన సమయంలో స్కిల్ ఇవ్వడం వల్లే. అందుకే మేం యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తాం... మీకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. మీ ఇంట్లో కూర్చుని ప్రపంచ కంపెనీల్లో పనిచేసే అవకాశం కల్పిస్తాం. హైదరాబాదులో ఉన్నట్టు  ఒక హైటెక్ టవర్ కూడా ఇక్కడ కోనసీమలో నిర్మిస్తాం. పవన్ కల్యాణ్ చెప్పినట్టు ఒక ట్రైన్ కొబ్బరిచెట్ల మధ్యలో పోతుంటే పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది. 

ఖబడ్దార్ చెబుతున్నా... అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మాకు ఏ నిబంధనలు వర్తిస్తాయో, జగన్ కు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి. జగన్ ఏం చేయాలన్నా ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది. ఇప్పుడాయన కూడా మా మాదిరే హామీలు ఇచ్చి, ఎన్నికలు అయ్యాకే పనులు చేయాల్సి ఉంటుంది... ఇప్పుడేం చేయడానికి లేదు. చిల్లర పనులు చేసే వాళ్లు చరిత్రలో కొట్టుకుపోతారు. 

ఎవరికీ అంత అహంకారం పనికిరాదు. చిరంజీవికి, జగన్ కు పోలిక ఉందా? చిరంజీవి చిత్రసీమలో రారాజుగా వెలిగినటువంటి వ్యక్తి. ఆయన కళామతల్లికి చేసిన సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ ఇచ్చారు. అలాగే బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో రాజమౌళి దిగ్గజ దర్శకుడిగా ఎదిగారు. ఆయనకు కూడా పద్మ అవార్డు ఇచ్చారు. అలాంటి మహామహులను, హీరోలను పిలిపించి తన ఇంటి వద్ద అవమానించిన విషయాన్ని అందరూ గ్రహించాలి. 

నేను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఏ నటుడ్ని కూడా అవమానించలేదు. నటులను గౌరవించే సంస్కారం మాది. పవన్ కల్యాణ్ సినిమాలు రిలీజైతే టికెట్లకు రేట్లు కూడా ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్ మోహన్ రెడ్డి. మనమందరం ఆయనకు బానిసలం అనుకుంటున్నాడు... మనం ఆయనకు ఊడిగం చేస్తే అప్పుడు టికెట్లకు రేట్లిస్తాడు... ఈయన అబ్బ సొత్తు అనుకుంటున్నాడు. 

సంస్కారం ఉండాలి కానీ కుసంస్కారం ఉండకూడదు. అందుకే సుమతీ శతకంలో అంటారు... శునకాన్ని తీసుకెళ్లి సింహాసనంపై కూర్చోబెడితే దాని బుద్ధి మారదు... ఈ రాష్ట్రంలో అదే జరిగింది" అంటూ చంద్రబాబు వివరించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: ఈ ఐదేళ్లలో బాగుపడింది ఈ ఐదుగురే: రేపల్లెలో చంద్రబాబు

బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రజాగళం సభ

ఇప్పటికీ తాను కుర్రాళ్లలానే ఆలోచిస్తానన్న చంద్రబాబు

జగన్ శవాలతో వస్తున్నాడని, తాము నేతలతో కలిసి వస్తున్నామని వెల్లడి

సిగ్గులేకుండా అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్ట అని విమర్శలు

cr-20240412tn66195e859013f.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, 1995లో విజన్ 2020 తీసుకువచ్చానని, ఇప్పుడు తనకు 73 ఏళ్లయినా నవయువకులకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయో, తన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయని చెప్పారు. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచంలో ఎలాంటి మార్పులు ఉంటాయో, అవన్నీ తీసుకువచ్చి మన పిల్లలకు అందించాలన్నదే తన ఆలోచన అని వివరించారు. 

"జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య నేనొక్కడినే వస్తున్నాను... నేను ఒంటరిని అంటున్నాడు. ఆయన ఒంటరి కాదు... శవాలతో వస్తున్నాడు... నేను నాయకులతో వస్తున్నాను. ఆయన శవరాజకీయాలు చేస్తాడు... నేను ప్రజారాజకీయాలు, పేదల కోసం రాజకీయాలు చేస్తాను. 

ఈ జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుడ్ని చంపారు. ఈ ముఖ్యమంత్రి పరామర్శించాడా? అదే, టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అదే వాళ్లకు చివరి రోజు చేసిన పార్టీ మాది. అంత కఠినంగా వ్యవహరించాం. చంపినవాళ్లు ఊళ్లో తిరుగుతూ ఇంకా బాధితులను బెదిరిస్తూనే ఉన్నారు. 

పదవిని మేం బాధ్యతగా భావించాం... వాళ్లు పదవిని వ్యాపారంగా భావించారు. జగన్ వస్తే పోలవరం పూర్తి కాదని, టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఒక్క ఏడాదిలోనే పూర్తి చేస్తాం అని చెప్పాను... కానీ మీరు వినలేదు. ఇవాళ పోలవరం ఏమైందో చూడండి... పోలవరంను గోదావరిలో కలిపేశాడు. ఆ ప్రాజెక్టు పూర్తవుతుందో, లేదో తెలియదు. 

మరో విషయం కూడా చెప్పాను... ఇసుక దోపిడీ చేస్తారు, బకాసురులు వస్తారు, మీరు నష్టపోతారు అని చెప్పాను. ఇప్పుడు ఇసుక, భూగర్భ ఖనిజ సంపద ఏమైందో చూశారు. అమరావతిని చెడగొడతాడు అని కూడా అప్పుడు చెప్పాను. 

ఇవాళ చూడండి... అమరావతి పూర్తిగా విధ్వంసం అయింది. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి రాష్ట్రమంతటా దారుణంగా మార్చేశాడు. జగన్ అధికారంలోకి వచ్చాక తెలంగాణతో పోల్చితే ఏపీలోచ్చాక పేదవాళ్ల సంఖ్య పెరిగింది. 

నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను... కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది అంతంతమాత్రంగా చేశారు, కొంతమంది ఫర్వాలేదనిపించుకున్నారు. కానీ, దేశ చరిత్రలోనే ఓ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మొదటి ముఖ్యమంత్రి ఈ జగన్ మోహన్ రెడ్డి. ఒకటీ రెండు కాదు... అన్ని రంగాల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. అన్ని వర్గాల జీవితాలతో ఆడుకుని అందరినీ భ్రష్టుపట్టించాడు. ఇక్కడ తుపాను వస్తే నేను వచ్చి పరామర్శించాను... కనీసం ఈ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చాడా? 

రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో ఎవరైనా బాగుపడ్డారా? ఈ ఐదేళ్లలో బాగుపడింది ఐదుగురే. వాళ్లలో మొదటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. రెండో వ్యక్తి విజయసాయిరెడ్డి, మూడో వ్యక్తి సజ్జల, నాలుగో వ్యక్తి సుబ్బారెడ్డి, ఐదో వ్యక్తి పెద్దిరెడ్డి... వీళ్లుకాక ఇంకెవరైనా బాగుపడ్డారా? 

ఇప్పుడు కొత్తగా క్లాస్ వార్ అంటున్నాడు... నేను చెబుతున్నా ఇది క్యాష్ వార్. టీడీపీ హయాంలో కరెంటు చార్జీలు పెరిగాయా? అప్పుడు రూ.200 ఉన్న కరెంటు ఇప్పుడు రూ.2 వేలకు పెరిగింది. ఇప్పుడా బిల్లు చూపి ఈ దుర్మార్గులను ఎండగట్టండి. మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచాడు. ఐదు రూపాయలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మూసేశాడు. పొరుగు రాష్ట్రాల్లో అన్న క్యాంటీన్లు ఉంటే, మన రాష్ట్రంలో ఉంటే తప్పేంటి? 

ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ రూ.60... ఇప్పుడు క్వార్టర్ బాటిల్ రూ.200. పదే పదే అబద్ధాలు చెబుతున్నాడు... ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చాడట. నువ్వు నెరవేర్చింది గుండు సున్నా...! కరెంటు చార్జీలు పెంచనన్నావు, మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్నావు... ఇన్ని చెప్పావు. ఆ నాలుకకు ఏ మాత్రం మడతే లేదు... చెప్పిన అబద్ధం మళ్లీ చెప్పకుండా కొత్త అబద్ధాలు చెప్పడంలో ఈ ముఖ్యమంత్రి దిట్ట. 

ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక రూ.1000... ఇప్పుడు అది రూ.5000... ఈ డబ్బంతా జగన్ కు పోతోంది. నీతిమంతమైన పాలన ఇస్తున్నాడంట... నీతి! ఇలా చెప్పుకోవడానికి సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నాడు. ఈ నమ్మక ద్రోహానికి మీరు గుద్దే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్ బద్దలవ్వాలి" అని పిలుపునిచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: ఈ ముఖ్యమంత్రి పాము లాంటి వాడు: కొల్లూరులో చంద్రబాబు విమర్శలు

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ప్రజాగళం సభ

సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించిన చంద్రబాబు

వైసీపీలో రౌడీలున్నారు, మంచివాళ్లున్నారు అంటూ వ్యాఖ్యలు

తమకు రౌడీలు అక్కర్లేదని, మంచివాళ్లు టీడీపీలోకి రావొచ్చని ఆహ్వానం

cr-20240412tn66193d4ea5a3e.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఓటు వేసే వారిని కాటు వేసే రకం అతను అని విమర్శించారు. ఐదేళ్ల పాటు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడైనా బయటికి వచ్చాడా? ఎవరినైనా కలిశారా? అని ప్రశ్నించారు. పేద ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. 

వైసీపీలో రౌడీలు ఉన్నారు, మంచివాళ్లు ఉన్నారని.... రౌడీలు తమకు అక్కర్లేదని, మంచివాళ్లు టీడీపీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ ముఖ్యమంత్రి మీటింగులకు వస్తున్నాడంటే రోడ్లన్నీ తవ్వాలి, చెట్లన్నీ నరకాలి అని ఎద్దేవా చేశారు. సభకు రాకపోతే పింఛను కట్, రేషన్ కట్, అమ్మ ఒడి లేదు అని అన్నారు. కొందరు మాత్రం నువ్వేమీ ఇవ్వకపోయినా ఫర్వాలేదు... మళ్లీ బాబు వస్తాడు... అన్నీ ఇస్తాడు అని ఇటువైపుకు వచ్చేస్తున్నారు అని చంద్రబాబు వివరించారు. 

"మొన్న, నిన్న నేను, పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తే గోదావరి గర్జించింది, మేం ఉన్నాం మీకు అండగా అని జనం పోటెత్తారు. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి సభలు చూడలేదు, ఆడబిడ్డలు నీరాజనాలు పలికారు. ఈ ప్రాంతాన్ని గతంలో తుపానులు దెబ్బతీశాయి. కానీ తుపానుల కంటే ఈ అసమర్థ ముఖ్యమంత్రి నిర్వాకాలే ఎక్కువ దెబ్బతీశాయి. 

ఇవాళ పంట బీమాను కూడా రద్దు చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. కనీసం ధాన్యం కొనే పరిస్థితులు ఉన్నాయా? తుపాను వస్తే కనీసం ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాడా? కానీ నేను వచ్చాను. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి ఐదు సార్లయినా రైతులతో మాట్లాడాడా? ఏ పొలానికైనా వెళ్లాడా? ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కార్చుతున్నాడు. మొన్న వచ్చాడు... రెడ్ కార్పెట్ వేసి స్టేజ్ కట్టి తుపాను బాధితులను, వరదను చూస్తున్నాడు. 

ఒకప్పుడు ఓట్ల కోసం నెత్తిన చెయ్యి పెట్టాడు, ముద్దులు పెట్టాడు... ఆ తర్వాత పిడిగుద్దులే గుద్దులు. నిన్నటిదాకా పరదాల చాటున తిరిగాడు... ఇప్పుడు పరదాలు వదలిపెట్టి మళ్లీ నాటకాలు, మోసాలతో వస్తున్నాడు. నాడు నేను పట్టిసీమను కట్టాను. కానీ ఈ అహంకారి ప్రజావేదిక విధ్వంసంతో మొదలుపెట్టి, పట్టిసీమను కూడా ఉపయోగించుకోకుండా ముందుకువెళ్లాడు. 

పోలవరం పూర్తి చేసి, నదులు అనుసంధానం చేస్తే గుంటూరు జిల్లాలో రెండు పంటలు కాదు, మూడు పంటలకు నీళ్లిచ్చే అవకాశం ఉండేది. పోలవరం ప్రాజెక్టును మేం 72 శాతం పూర్తి చేశాం. కానీ ఒక ఉన్మాద ముఖ్యమంత్రి ఏం తెలియకపోయినా, తెలిసినట్టు నటించి పోలవరాన్ని ముంచేశాడు. 

అమరావతి మన రాజధాని. ఒకప్పుడు హైదరాబాద్ ను అభివృద్ధి చేశాను. ఆ నమ్మకంతో అమరావతిని అభివృద్ధి చేయాలనుకున్నాను. నేను ఇచ్చిన పిలుపుతో, నా మీద నమ్మకంతో 35 వేల ఎకరాల భూమిని 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు... ఇది ప్రపంచంలో  ఎక్కడా జరగలేదు... అదీ మన విశ్వసనీయత. కానీ ఈ దుర్మార్గుడు మొదట అమరావతి రాజధాని అంగీకరిస్తానన్నాడు... ఆ తర్వాత మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడాడు. రాష్ట్రాన్ని తల లేని మొండెంలా చేసిన అలాంటి వాళ్లకు ఓట్లు వేస్తారా? 

అమరావతి రాజధాని వచ్చుంటే... మన పిల్లలు హైదరాబాద్, చెన్నై వెళ్లనవసరం లేకుండా ఇక్కడే బ్రహ్మాండమైన యూనివర్సిటీలు వచ్చుండేవి. ఉదయం వెళ్లి చదువుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చేవాళ్లు. మీ పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చేది... ఎవరైనా పనులు చేసుకోవాలనుకున్నా ఇక్కడే చేసుకునే వీలుండేది. పాచిపనులు చేసుకోవాలనా, ఆటోలు నడుపుకోవాలన్నా మనం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లాల్సిన దౌర్భాగ్యం నెలకొంది. అందుకే ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష వేయాలో మే 13న మీరే నిర్ణయించాలి. 

ఈ ముఖ్యమంత్రిది ఒక విచిత్రమైన వ్యక్తిత్వం... నా ఎస్సీలు అంటాడు... భస్మాసురుడి మాదిరిగా వాళ్ల నెత్తిమీదే చేయి పెడతాడు. పాము తాను పెట్టిన గుడ్లను తానే మింగేస్తుంది. ఈయన కూడా అంతే... ఎవరైతే ఓటు వేస్తారో వారినే కాటేస్తాడు. 

ఈ ప్రభుత్వంలో ఎక్కువమంది బలైంది షెడ్యూల్డ్ కులాల వారు. నా ఎస్సీలు అంటూ సబ్ ప్లాన్ లేకుండా చేసిన దుర్మార్గుడు ఇతను. మాస్కు పెట్టుకోలేదని విక్రమ్ అనే దళితుడ్ని కొట్టి చంపేశారు. డ్రైవర్ ను చంపిన ఎమ్మెల్సీని పక్కనబెట్టుకుని తిరుగుతున్నాడు. మాస్కు అడిగిన డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిలా చేసి అతడి చావుకు కారణమయ్యారు! 

దళితుల కోసం మేం 27 పథకాలు తీసుకువస్తే అవన్నీ రద్దు చేశాడు. దళితులకు ఇన్నోవాలు ఇచ్చాను, అంబేద్కర్ విదేశీ విద్య తెచ్చాను... అంబేద్కర్ పేరు తీసేసి జగన్ తన పేరు పెట్టుకుని అంబేద్కర్ ను అవమానించాడు. దళితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు ఇప్పుడు లేవు. దళిత ద్రోహి ఈ ముఖ్యమంత్రి. దళితులు ఈ ముఖ్యమంత్రికి ఓటేస్తారా అని అడుగుతున్నా? 

మీకు విధ్వంసక పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా? సంక్షేమ పాలన కావాలా, లేక సంక్షోభ పాలన కావాలా? మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా, లేక గంజాయి కావాలా? డ్రగ్స్ కావాలో మీరే ఆలోచించుకోవాలి" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

like father and like son, mind dobbindi iddariki boothu puranam out of desperation to win!

ఏంట్రా ఆ భూతులు 🥲

 

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: నా అనుభవం అంత లేదు నీ వయసు... నువ్వా నా వయసు గురించి మాట్లాడేది?: చంద్రబాబు

ప్రత్తిపాడులో చంద్రబాబు ప్రజాగళం సభ

టీడీపీ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని ధీమా

ఈ ముఖ్యమంత్రి  ఫెయిల్ అంటూ వ్యాఖ్యలు

cr-20240413tn661a9ad4c98a0.jpg

ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ ప్రజాగళం సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికలు వన్ సైడ్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదని, ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొందని అన్నారు. ఈ అసంతృప్తి ఎన్నికల వేళ తుపానుగా మారి ఫ్యాన్ ను ముక్కలు ముక్కలు  చేసి చెత్తకుండీలో వేయాలని పిలుపునిచ్చారు. 

"నేనొక విజన్ ఉన్న నాయకుడ్ని, 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి ప్రణాళికలు తయారుచేసే వ్యక్తిని నేను. జగన్ నా వయసు గురించి మాట్లాడుతుంటాడు... అవును, నా అనుభవం అంత లేదు నీ వయసు. నేను అవసరమైతే రోజులో 20 గంటలు కూడా పనిచేయగలను... జగన్ ఏసీ బస్సు దిగుతున్నాడా, ఎప్పుడైనా ఒక గంట మీ కోసం పనిచేశాడా, ఎప్పుడైనా మిమ్మల్ని కలిశాడా? ప్రజావేదిక కూల్చినప్పుడే అతడి మెదడులో ఏదో తేడా ఉందని చెప్పాను. అతడు కక్ష తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి అయ్యాడు.

ఒక్క చాన్స్ అని అడిగాడా, లేదా... తండ్రి లేని బిడ్డను అని చెప్పాడా, లేదా... ముద్దులు పెట్టాడా, లేదా... బుగ్గలు నిమిరాడా, లేదా... తలమీద చెయ్యి పెట్టాడా, లేదా... ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడా, లేదా...? జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఐదేళ్లలో మీ జీవితాలు ఏమైనా మారాయా? 99 శాతం సమస్యలు పరిష్కారం చేశానని చెబుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఫెయిల్... ముఖ్యమంత్రిగా పనికిరాని మొద్దబ్బాయ్! ఈ ముఖ్యమంత్రికి వచ్చే మార్కులు సున్నా. 

కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తానని ఎన్నికల ముందు చెప్పాడా, లేదా? ఉద్యోగాలు  వచ్చాయా, పరిశ్రమలు  తెచ్చాడా... అమరావతిని కూడా సర్వనాశనం చేశాడు. మళ్లీ జాబు రావాలంటే బాబు రావాలి. తిక్కలోడు మూడు ముక్కలాట ఆడడంతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఇక్కడికి కారులో వస్తుంటే రోడ్డుపై ఉయ్యాల ఊగినట్టుంది. ఈ రోడ్లపై గుంతలకు తట్ట మట్టి వేయలేనివాడు మూడు రాజధానులు కడతాడంట. 

వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చాడు... చేశాడా? ఇదీ ఆయన విశ్వసనీయత. ఇవాళ గుంటూరులో మీటింగ్ పెట్టాడు... అట్టర్ ఫ్లాప్. రూ.20 కోట్లు ఖర్చు పెట్టాడు. బిర్యానీ, క్వార్టర్ మందు ఇచ్చారు... బాగా తిని మీటింగ్ కు డుమ్మా కొట్టారు. మా మీటింగులకు ప్రజలే స్వచ్ఛందంగా వస్తున్నారు. నేను, పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాలకు వెళితే ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. 

నిన్న గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ క్రిస్టీనా టీడీపీలో చేరారు. వైసీపీ నేతలకు పుట్టినగడ్డపై ప్రేమ ఉంటే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసి ఎన్డీయే అభ్యర్థులను గెలిపించండి... మీ భవిష్యత్తుకు మేం భరోసా ఇస్తాం. 

ఎన్నికల ముందు... ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, అమరావతే రాజధాని అని చెప్పాడా, లేదా? తాడేపల్లి కొంప కట్టాడా, లేదా? గృహప్రవేశం చేశాడా, లేదా? మిమ్మల్ని నమ్మించాడా, లేదా? ఇప్పుడు మూడు ముక్కలాట ఆడి మిమ్మల్ని మోసం చేశాడా, లేదా? 

దేశంలో ఐటీ ఉండాలని చెప్పిన మొట్టమొదటి నాయకుడ్ని నేనే. చెప్పి వదిలేయలేదు... కాలేజీలు పెట్టి, కంపెనీలు తీసుకువచ్చి, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. నేను హైదరాబాదులో హైటెక్ సిటీ ప్రారంభించాను. అప్పట్లో జూబ్లీహిల్స్ కు మూడ్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎకరా లక్ష రూపాయలు. హైటెక్ సిటీతో కంపెనీలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి... అప్పుడు ఎకరా లక్ష రూపాయలు ఉన్న భూమి ఇప్పుడు ఎకరా రూ.100 కోట్లు. అదీ... సంపద సృష్టించే విధానం. 

కానీ అమరావతి ప్రాంతంలో 2019లో ఉన్న భూమి విలువ ఎంత, ఇప్పుడు విలువ ఎంత? ఇప్పుడు విలువ తగ్గిపోయిందా, లేదా? కొనేవాడు ఉన్నాడా? అభివృద్ధి జరిగితేనే భూమి విలువ పెరుగుతుంది. ప్రజలకు ఒక నమ్మకం ఉంటే భూములు కొంటారు, అమ్ముతారు. ఈ ప్రభుత్వం వల్ల ఎవరికీ ఉపయోగం లేదని తేలిపోయింది. జగన్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
46 minutes ago, TELUGU said:

Chandrababu: నా అనుభవం అంత లేదు నీ వయసు... నువ్వా నా వయసు గురించి మాట్లాడేది?: చంద్రబాబు

ప్రత్తిపాడులో చంద్రబాబు ప్రజాగళం సభ

టీడీపీ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని ధీమా

ఈ ముఖ్యమంత్రి  ఫెయిల్ అంటూ వ్యాఖ్యలు

ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ ప్రజాగళం సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికలు వన్ సైడ్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదని, ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొందని అన్నారు. ఈ అసంతృప్తి ఎన్నికల వేళ తుపానుగా మారి ఫ్యాన్ ను ముక్కలు ముక్కలు  చేసి చెత్తకుండీలో వేయాలని పిలుపునిచ్చారు. 

"నేనొక విజన్ ఉన్న నాయకుడ్ని, 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి ప్రణాళికలు తయారుచేసే వ్యక్తిని నేను. జగన్ నా వయసు గురించి మాట్లాడుతుంటాడు... అవును, నా అనుభవం అంత లేదు నీ వయసు. నేను అవసరమైతే రోజులో 20 గంటలు కూడా పనిచేయగలను... జగన్ ఏసీ బస్సు దిగుతున్నాడా, ఎప్పుడైనా ఒక గంట మీ కోసం పనిచేశాడా, ఎప్పుడైనా మిమ్మల్ని కలిశాడా? ప్రజావేదిక కూల్చినప్పుడే అతడి మెదడులో ఏదో తేడా ఉందని చెప్పాను. అతడు కక్ష తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి అయ్యాడు.

ఒక్క చాన్స్ అని అడిగాడా, లేదా... తండ్రి లేని బిడ్డను అని చెప్పాడా, లేదా... ముద్దులు పెట్టాడా, లేదా... బుగ్గలు నిమిరాడా, లేదా... తలమీద చెయ్యి పెట్టాడా, లేదా... ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడా, లేదా...? జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఐదేళ్లలో మీ జీవితాలు ఏమైనా మారాయా? 99 శాతం సమస్యలు పరిష్కారం చేశానని చెబుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఫెయిల్... ముఖ్యమంత్రిగా పనికిరాని మొద్దబ్బాయ్! ఈ ముఖ్యమంత్రికి వచ్చే మార్కులు సున్నా. 

కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తానని ఎన్నికల ముందు చెప్పాడా, లేదా? ఉద్యోగాలు  వచ్చాయా, పరిశ్రమలు  తెచ్చాడా... అమరావతిని కూడా సర్వనాశనం చేశాడు. మళ్లీ జాబు రావాలంటే బాబు రావాలి. తిక్కలోడు మూడు ముక్కలాట ఆడడంతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఇక్కడికి కారులో వస్తుంటే రోడ్డుపై ఉయ్యాల ఊగినట్టుంది. ఈ రోడ్లపై గుంతలకు తట్ట మట్టి వేయలేనివాడు మూడు రాజధానులు కడతాడంట. 

వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చాడు... చేశాడా? ఇదీ ఆయన విశ్వసనీయత. ఇవాళ గుంటూరులో మీటింగ్ పెట్టాడు... అట్టర్ ఫ్లాప్. రూ.20 కోట్లు ఖర్చు పెట్టాడు. బిర్యానీ, క్వార్టర్ మందు ఇచ్చారు... బాగా తిని మీటింగ్ కు డుమ్మా కొట్టారు. మా మీటింగులకు ప్రజలే స్వచ్ఛందంగా వస్తున్నారు. నేను, పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాలకు వెళితే ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. 

నిన్న గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ క్రిస్టీనా టీడీపీలో చేరారు. వైసీపీ నేతలకు పుట్టినగడ్డపై ప్రేమ ఉంటే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసి ఎన్డీయే అభ్యర్థులను గెలిపించండి... మీ భవిష్యత్తుకు మేం భరోసా ఇస్తాం. 

ఎన్నికల ముందు... ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, అమరావతే రాజధాని అని చెప్పాడా, లేదా? తాడేపల్లి కొంప కట్టాడా, లేదా? గృహప్రవేశం చేశాడా, లేదా? మిమ్మల్ని నమ్మించాడా, లేదా? ఇప్పుడు మూడు ముక్కలాట ఆడి మిమ్మల్ని మోసం చేశాడా, లేదా? 

దేశంలో ఐటీ ఉండాలని చెప్పిన మొట్టమొదటి నాయకుడ్ని నేనే. చెప్పి వదిలేయలేదు... కాలేజీలు పెట్టి, కంపెనీలు తీసుకువచ్చి, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. నేను హైదరాబాదులో హైటెక్ సిటీ ప్రారంభించాను. అప్పట్లో జూబ్లీహిల్స్ కు మూడ్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎకరా లక్ష రూపాయలు. హైటెక్ సిటీతో కంపెనీలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి... అప్పుడు ఎకరా లక్ష రూపాయలు ఉన్న భూమి ఇప్పుడు ఎకరా రూ.100 కోట్లు. అదీ... సంపద సృష్టించే విధానం. 

కానీ అమరావతి ప్రాంతంలో 2019లో ఉన్న భూమి విలువ ఎంత, ఇప్పుడు విలువ ఎంత? ఇప్పుడు విలువ తగ్గిపోయిందా, లేదా? కొనేవాడు ఉన్నాడా? అభివృద్ధి జరిగితేనే భూమి విలువ పెరుగుతుంది. ప్రజలకు ఒక నమ్మకం ఉంటే భూములు కొంటారు, అమ్ముతారు. ఈ ప్రభుత్వం వల్ల ఎవరికీ ఉపయోగం లేదని తేలిపోయింది. జగన్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

...

Complete article

failure gurunchi just 23 seats win ayi ghoranga odopoyina ex-cm-forever ae cheppali mari 🤣 such a humiliating defeat!!

Jagan won 151 seats last time without doing anything. imagine how many Jagan would win this time after doing so much in the last 5 years!

money scam cheyyadaniki 20 hours em karma, rojuki 24 hours or even 48 hours per day kuda work chestadu mana fraudster cbn!!

IT full form kuda teliyani oorodu india lo IT gurunchi first matlandindi veede nanta lol 🤣

40 years experience ani boasting aa? see this answer lol 🤣

 

Link to comment
Share on other sites

  • 0

Naidu Wants People To Boycott Anti-Amaravati Capital Parties

1083956-gkctjwxiaapxlf.webp

Kakinada: Telugu Desam chief and former chief minister N. Chandrababu Naidu has called upon people to boycott political leaders and parties who do not commit themselves to Amaravati being the sole capital of Andhra Pradesh. “Don’t allow such people to your villages, unless they accept Amaravati as the lone capital,” he told voters of Tadikonda and Prathipadu constituencies during his Prajagalam yatra on Saturday.

The TD supremo maintained that the capital will not shift even an inch from Amaravati due to the power of its “Muhurat” and foundation laying ceremony involving soil from all temples and rivers, masjids and churches. He said capital Amaravati will not belong to one particular caste or community. “It belongs to all sections of the society,” he declared. Chandrababu Naidu told people that when he had been the chief minister of undivided Andhra Pradesh, he had built Cyberabad. When it had been in its early stages, many people had ridiculed his plans, especially with regard to the Outer Ring Road. But subsequently, people realised that Cyberabad is a great idea. Now, Secunderabad, Hyderabad and Cyberabad have become a Mega City.

The former CM said in a similar manner, he had drawn a blueprint with a great vision for the development of Amaravati. But the YSRC government has ruined those plans and made AP a “capital-less” state. “A crank has destroyed my dream of Amaravati with his stupid, borrowed notion of having three capitals for the state. It has resulted in total destruction. Therefore, YSRC should be given a drubbing by people in the coming elections,” he stated.

The TD chief underlined that the state government is struggling even to pay salaries to employees. He maintained that YSRC will not cross a single digit of seats in the forthcoming elections, as the people have already decided to create a great record in history on May 13 – the polling day by defeating YSRC. The former chief minister asked the people to give full mandate to Telugu Desam, Bharatiya Janata Party and Jana Sena in the coming elections. Significantly, Chandrababu Naidu promised that Visakhapatnam will be developed as the “economic capital” and Kurnool will become “horticulture and seed capital.” He declared that on June 4, he will step into the Assembly and provide peoples’ rule.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: గాజువాకలో చంద్రబాబు సభలో రాళ్లు విసిరిన ఆకతాయిలు

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) గాజువాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు చంద్రబాబుపై రాళ్లు విసిరారు.

CBN_131d4b56a1_V_jpg--799x414-4g.webp

విశాఖపట్నం: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గాజువాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు చంద్రబాబుపై రాళ్లు విసిరారు.

TDP: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: నారా భువనేశ్వరి

ఈ రాళ్లు సభలో ఎవరికి తగలలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాగా రాయి విసిరిన వ్యక్తి ఎవరు? ఈ దాడి వెనుక గల కారణాలేంటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏపీ సీఎం జగన్‌పై రాయితో దాడి జరిగిన మరుసటి రోజే చంద్రబాబుపై అలాంటి దాడే జరిగింది. అక్కడున్న తెలుగు తమ్ముళ్లు రాయి విసిరిన ఆకతాయిలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల వైఫల్యంతోనే ఈఘటన జరిగిందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Election 2024: సీఎంపై రాయి విసిరిన కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఏం కేసు పెట్టారంటే?

కాగా.. నిన్న విజయవాడలో సీఎం జగన్, ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై రాళ్లు విసరడంతో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే గాజువాకలో చంద్రబాబు ప్రసంగం కొనసాగుతునే ఉంది. నిన్న చీకటిలో గులక రాయి వేశారని .. ఇప్పుడు వెలుగులో తనపై రాళ్లు వేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాళ్ల దాడి చేస్తోంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

రాళ్లు వేసింది జే గ్యాంగ్ పనేనని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ సహకారంతోనే విశాఖ పోర్టుకు డ్రగ్స్ దిగుమతి అయ్యాయని మండిపడ్డారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాలో జగన్ ప్రభుత్వమే దోషి అని విరుచుకుపడ్డారు. డ్రగ్స్ నివారించమని అడిగితే టీడీపీ ఆఫీసుపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh News: ఏపీ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. శనివారం సీఎం జగన్ పై ఓ దుండగుడు రాయితో దాడి చేయగా, ఆదివారం తెనాలిలో పవన్ పై, గాజువాకలో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగింది.

9792738f8bf12d1d4960fdcefb601fd117131052

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై రాళ్లు విసిరిన దుండగులు

Stone pelted at TDP Chief chandrababu- గాజువాక: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి తృటిలో ప్రమాదం తప్పింది. గాజువాక సభలో గుర్తు తెలియని వ్యక్తులు చంద్రబాబుపై రాళ్లు రువ్వారు. టీడీపీ అధినేతకు సమీపంలో రాయి పడటంతో ప్రమాదం తప్పింది. ప్రజాగళం సభలో వెనుక నుంచి రాళ్లు విసిరారని టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబుపై రాయి విసరగానే పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు.

47eb1e50dac45ec1ed3a3f064fec985117131059

నిన్న సీఎం జగన్ సభలో చీకట్లో ఎవరో గులకరాయి వేస్తే, నేడు లైట్లు ఉండగానే తనపై కొందరు దుండగులు రాళ్లతో దాడికి పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. తెనాలిలోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సైతం రాళ్లు వేశారని, దీని వెనుక ఉన్నది ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. రాళ్లు విసిరి దుండగులు పరారయ్యారని, ఇకనుంచైనా డ్రామాలు ఆపేయాలని.. రానున్న రోజుల్లో వైసీపీ నేతలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

...

Complete article

 

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: బాంబులకే నేను భయపడలేదు...రాళ్లకు భయ పడతానా..?

బాంబులకే తాను భయపడలేదు...రాళ్లకు భయ పడతానా..? అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఆదివారం నాడు గాజువాకలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

CBN_2_4950649a8e_V_jpg--799x414-4g.webp

విశాఖపట్నం: బాంబులకే తాను భయపడలేదు...రాళ్లకు భయ పడతానా..? అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఆదివారం నాడు గాజువాకలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu: గాజువాకలో చంద్రబాబు సభలో రాళ్లు విసిరిన ఆకతాయిలు

ముఖ్యమంత్రిపై దాడికి ఎవరు బాధ్యులు...? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నది నువ్వా....నేనా..? అని నిలదీశారు. కరెంటు పోయిన సమయంలో రాళ్ల దాడి జరిగిందని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. తన మీద, తమ పార్టీ నేతలపై వైసీపీ నేతలు దాడులు చేసి... అక్రమ కేసులు పెట్టారని విరుచుకుపడ్డారు. తాను నేరాలు చేసేవాడిని కాదు... నేరగాళ్లను తుంగలో తొక్కేసే సామర్థ్యం ఉన్నవాడినని అన్నారు.

AP Election 2024: సీఎంపై రాయి విసిరిన కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఏం కేసు పెట్టారంటే?

నిన్న(శనివారం) ఎవరో జగన్‌పై గులక రాయి వేశారన్నారు. 24 గంటల అవుతోంది...చర్యలు ఏవీ? అని ప్రశ్నించారు. సీఎస్‌, డీజీపీకు బాధ్యత లేదా అని నిలదీశారు. తన మీద, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రాళ్లు వేస్తారా అని ప్రశ్నించారు. ఓటు వేసేటప్పుడు...ప్రజలు అన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

Elections 2024: కుంభకర్ణుడిలా ఎన్నికల సమయంలో నిద్ర లేచారు.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు..

నిన్న చీకటిలో జగన్‌పై గులక రాయి వేశారని .. ఇప్పుడు వెలుగులో తనపై రాళ్లు వేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాళ్ల దాడి చేస్తోంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాళ్లు వేసింది జే గ్యాంగ్ పనేనని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ సహకారంతోనే విశాఖ పోర్టుకు డ్రగ్స్ దిగుమతి అవ్వలేదా అని ప్రశ్నించారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాలో జగన్ ప్రభుత్వమే దోషి అని విరుచుకుపడ్డారు. డ్రగ్స్ నివారించమని అడిగితే టీడీపీ ఆఫీసుపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యాంగం మంచిదైనా అమలు చేసేవారు మంచివారు కాకపోతే ప్రయోజనం లేదన్నారు. జగన్ లాంటి వారి గురించి రాజ్యాంగంలో ఎప్పుడో చెప్పారన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీని భ్రష్టుపట్టిస్తారని మండిపడ్డారు. దళిత ద్రోహి జగన్ అని ధ్వజమెత్తారు. ఆయనది చెత్త పరిపాలన అని ఎద్దేవా చేశారు. తనకు తోడుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని.. తమకు ఇద్దరికీ తోడుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నారని తెలిపారు.

TDP: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: నారా భువనేశ్వరి

తాము ఏపీని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని మాటిచ్చారు. ఉత్తరాంధ్రకి సీఎం జగన్ ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. జగన్ విలాస పురుషుడు..భారీ భవంతి కట్టుకున్నారని సెటైర్లు గుప్పించారు. పేదలకు అగ్గిపెట్టె అంత ఇల్లు కట్టారని మండిపడ్డారు. ఈ దుర్మార్గుడు అన్ని కంపెనీలను తరిమేశాడన్నారు. విశాఖను గంజాయికు క్యాపిటల్‌గా మార్చారని.. ఇక్కడ భూములు దోచేశారని ఆరోపించారు. కరెంట్ చార్జీలు పెంచారని ఫైర్ అయ్యారు. విశాఖలో నాసిరకం మద్యం తెచ్చి, రేటు పెంచి పేదల రక్తం జలగలా తాగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

జగన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలి పెట్టమని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇచ్చి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కుంభకోణాలు చేసే వారిని ఉక్కుపాదంతో అణచి వేస్తానని మందలించారు. జగన్ రూ. 10 ఇచ్చి, రూ.100 కొట్టేస్తారని విమర్శించారు. తాను ఏపీ కోసం అప్పు తీసుకురానని. సంపద సృష్టిస్తా..మీకే పంచుతానని అన్నారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: వైసీపీ

నిన్న విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి

ఈసీ చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు

ఇవాళ గాజువాకలో చంద్రబాబుపై రాయి విసిరిన ఆగంతుకుడు

ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలన్న వైసీపీ

cr-20240414tn661c0397da7ad.jpg

ఏపీ సీఎం జగన్ పై నిన్న విజయవాడలో రాయితో దాడి జరగడం తెలిసిందే. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు... ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, ఇవాళ గాజువాకలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఆయనపై ఓ ఆగంతుకుడు రాయి విసిరాడు. ఈ ఘటనపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 

"చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలని, ఘటనకు కారకులను శిక్షించాలని కోరుతున్నాం" అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఈ మేరకు చంద్రబాబు వీడియోను కూడా వైసీపీ పంచుకుంది.

...

Complete article

 

Link to comment
Share on other sites

  • 0

ippudu emamtaru yellow pulkas? also the attack on pawala? aren't these STAGED??

of course, they are - to do damage control to tdp!

it was drugs, then volunteers/pensions that resulted in the deaths of 34 innocent people and now stone pelting attacks that damaged tdp's reputation further and backfired! just incompetent cbn who could not even think how important volunteer system is and took a U turn after making so many contradictory and threatening statements against them.

Link to comment
Share on other sites

  • 0

veedni bokka lo vesi bankrupt ayye varaku sue cheyyali for provoking public and insurrection like they did to trump. and then his old cell 6093 in the prison will be waiting for his retirement! pappu pulakesh will join cbn in the prison soon after

CBN provoking public - జనాన్ని రెచ్చగొట్టిన బాబు! #jagan #chandrababu

 

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: ఎక్కువ సార్లు రాళ్ల దాడులు జరిగింది చంద్రబాబు పైనే!

నిన్న చంద్రబాబు, పవన్ లపై రాళ్ల దాడులు

చంద్రబాబు వరకు చేరని రాయి

గతంలో నాలుగు సార్లు చంద్రబాబుపై రాళ్ల దాడి

cr-20240415tn661ca5e34a30d.jpg

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన రాళ్ల దాడి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పెద్ద రాజకీయ చర్చకు ఈ ఘటన తెరలేపింది. జగన్ పై టీడీపీ హత్యాయత్నం చేయించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా... మరో కోడికత్తి డ్రామాకు తెరతీశారని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై రాళ్ల దాడులు జరిగాయి. విశాఖ జిల్లా గాజువాకలో చంద్రబాబుపై, తెనాలిలో పవన్ కల్యాణ్ లపై దుండగులు రాళ్లు విసిరారు. 

గాజువాకలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపైకి రాళ్లు విసిరినప్పటికీ... అవి ఆయన వరకు చేరలేదు. ఈ దాడిని గుర్తించిన చంద్రబాబు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాడికి యత్నించిన వారిని పట్టుకునేందుకు యత్నించగా వాళ్లు పారిపోయారు. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అందరూ చూడండి.. తనపై రాళ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అరేయ్... మిమ్మల్ని ప్రజలు వదిలి పెట్టరు... తరిమితరిమి కొడతారు అని హెచ్చరించారు. వైసీపీ బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఇక్కడకు వచ్చిందని అన్నారు. 

మరోవైపు, ఇప్పటి వరకు చంద్రబాబుపైనే ఎక్కువ రాళ్లదాడులు జరిగాయి. గత ఏడాది ఆగస్ట్ లో తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో రాళ్లదాడి జరిగింది. ఆ దాడి సందర్భంగా అంగళ్లులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తనను చంపేందుకు కుట్ర జరిగిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ గొడవకు చంద్రబాబే కారణమని పోలీసులు కేసు పెట్టారు. 

2021 తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా బాబుపై దాడి జరిగింది. చంద్రబాబు ప్రసంగిస్తుండగా దుండగులు రాళ్లు విసిరారు. గత ఏడాది ఏప్రిల్ లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు వెళ్తున్న చంద్రబాబును మంత్రి ఆదిమూలపు సురేశ్ తన వర్గీయులతో కలిసి అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. 2022లో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా నందిగామలో చంద్రబాబు రోడ్ షో చేపట్టారు. ఆ సందర్భంగా ఒక దుండగుడు చంద్రబాబుపై రాయి విసిరాడు. అయితే అది చంద్రబాబుకు మిస్ అయి... ఆయన భద్రతాధికారికి తగిలింది. ఈ దాడిలో భద్రతాధికారి తీవ్రంగా గాయపడ్డారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

 

ఇది రా భయం అంటే, ఇదీ ప్రజా వ్యతిరేఖత అంటే...!!

Debbaku shields nethina pettukoni meetings peduthunnadu!

 

Link to comment
Share on other sites

  • 0

ఘటన జరిగి 5 నిమిషాలు అవ్వలేదు. పేటీయం కుక్కల్ని నా మీదకు వదిలాడు. 24 గంటలు అయ్యింది, ఏమి చేసింది నీ డిపార్టుమెంటు? ఏమి చేశారు నీ పోలీసులు? రాయి వేసిన వాడిని ఎందుకు పట్టుకోలేదు?

 

Link to comment
Share on other sites

  • 0

Pawan మక్కిలిరుగుతయ్ పవన్ కళ్యాణ్.. - పేర్ని మాస్ 🔥🔥 #PackageStarPK #PawanKalyan #Varahi #AndhraPolitiks

 

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: రాయో, వస్తువో తగిలినప్పుడు అది అక్కడ ఉండాలి కదా... తగిలి మాయం అయిందా?:  చంద్రబాబు

పలాసలో చంద్రబాబు ప్రజాగళం సభ

సర్దార్ గౌతు లచ్చన్న ప్రస్తావనతో ప్రసంగం ప్రారంభించిన చంద్రబాబు

మంచం మీద ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని వ్యాఖ్యలు

గాలోళ్లను తయారుచేశాడని విమర్శలు

కొవ్వు తగ్గిస్తాం అంటూ హెచ్చరికలు

cr-20240415tn661d3f43d6cd6.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. తన ప్రసంగాన్ని సర్దార్ గౌతు లచ్చన్న ప్రస్తావనతో ప్రారంభించారు. సర్దార్ గౌతు లచ్చన్న ఒక స్వాతంత్ర్య సమర యోధుడే కాకుండా, ప్రజల కోసం, రైతుల కోసం ఆ రోజుల్లోనే శ్రీకాకుళం నుంచి చెన్నైకి రైతు మార్చ్ నిర్వహించిన మహానాయకుడు అని కీర్తించారు. తాను 1978లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌతు లచ్చన్న కూడా ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆయన పట్టుదల తనను ఆకట్టుకునేదని వివరించారు. ఎప్పుడూ విశ్రమించకుండా, పేదల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి గౌతు లచ్చన్న అని స్పష్టం చేశారు. 

ఆయన కుమారుడిగా గౌతు శివాజీ ఈ నియోజకవర్గానికి ఎనలేని సేవలందించారని, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన గౌతు శిరీష ఎన్నో అవమానాలు ఎదుర్కొందని అన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయినవారికే అన్ని తోకలు వస్తే, మూడు తరాలుగా రాజకీయాలు చేస్తున్నవారికి ఎంత పవర్ ఉండాలి? అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ పవర్ ఉపయోగిస్తే వీళ్లు (వైసీపీ నేతలు) ఎంత? అది వీళ్ల తప్పు కాదు... పెద్ద సైకో చిన్న సైకోలను తయారుచేశాడని అన్నారు. 

ఇక, ఆనాడు కింజరాపు ఎర్రన్నాయుడికి కేంద్రమంత్రి పదవి ఇచ్చామని వెల్లడించారు. యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు తండ్రికి  తగిన బిడ్డ అని కొనియాడారు. రాష్ట్రంలో దొంగలుపడ్డారని, అందరం కలిసి కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ఐదేళ్ల పాటు ప్రజలు అనేక బాధలు పడ్డారని వివరించారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు జనసైనికులు కూడా సిద్ధమయ్యారని తెలిపారు. 

బటన్ నొక్కడం పెద్ద పని అనుకుంటున్నాడు

పడగొట్టి, చెడగొట్టి, భయపెట్టి, బాధపెట్టి, హింసించి ఆనందం పొందేవాడు ఈ జగన్ సైకో. తనకు తెలియదు... తెలిసినవాళ్లు చెబితే వినని మూర్ఖుడు. అఖండమైన మెజారిటీతో గెలిపిస్తే... తనను తాను నిరూపించుకోకుండా అభివృద్ధిని పట్టించుకోకుండా, తనను తాను నిరూపించుకోకుండా సమయాన్నంతా ప్రతిపక్షాన్ని అణచివేయడానికే ఉపయోగించుకున్నాడు. ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి అప్పులు చేసి బటన్ నొక్కుతున్నాడు. బటన్ నొక్కడం పెద్ద పని అనుకుంటున్నాడు... మంచం మీద ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది.

సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి... పెంచిన ఆదాయాన్ని పేదలకు పంచాలి, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి... అదీ పరిపాలన. అమరావతి కోసం 35 వేల ఎకరాలు సేకరించి, రూ.10 వేల కోట్లతో భవనాలు నిర్మిస్తే... ఎవరికో పేరు వస్తుందని పాడుబెట్టిన వాడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో ముఖ్యమంత్రి. నాకు పేరు వస్తుందని లక్షల టిడ్కోల ఇళ్లు పేదలకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు ఈ వ్యక్తి. 

అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించి అదొక హీరోయిజం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏ రోడ్డుకైనా మట్టి వేశాడా, వ్యవసాయ శాఖ పనిచేస్తోందా, సాగునీటి శాఖ పనిచేస్తోందా, ఒక్క ప్రాజెక్టు కట్టాడా, విద్యాశాఖ పనిచేస్తోందా, ఆరోగ్య శాఖ పనిచేస్తోందా, ఆసుపత్రుల్లో మందులు ఉన్నాయా? ఏం చేశాడు? ఒక్క పని మాత్రం చేశాడు... సమాజంలో గాలోళ్లను పెంచాడు... ఇక్కడ కూడా ఒక గాలోడ్ని పెంచాడు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు... అసలు గాలోడు ఇతనే. ఈ గాలోడ్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి గాలోళ్లను పెంచి లక్షల కోట్లు దుర్వినియోగం చేశాడు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: రాజాం సభలో తన అర్ధాంగి భువనేశ్వరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన చంద్రబాబు

విజయనగరం జిల్లా రాజాంలో ప్రజాగళం సభ

గతంలో తన భార్య ఎన్నడూ ఇల్లు దాటి బయటికి రాలేదన్న బాబు 

తాను జైల్లో ఉన్నప్పుడు 203 మంది ప్రాణత్యాగం చేశారని వివరణ

వారి కుటుంబాలను కలవడం భువనేశ్వరి ఒక బాధ్యతగా బావించిందని స్పష్టీకరణ

cr-20240415tn661d1b56cd2f1.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో ఈ సాయంత్రం ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ తన అర్ధాంగి నారా భువనేశ్వరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను జైల్లో ఉన్నప్పుడు నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రతో ప్రజల్లోకి వచ్చిన వైనాన్ని చంద్రబాబు కొనియాడారు. నాడు కష్టకాలంలో తన కోసం ప్రాణత్యాగం చేసినవారికి, తమ కుటుంబానికి అండగా నిలిచిన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. 

గతంలో నా భార్య ఇల్లు దాటి బయటికి రాలేదు

నేను జైల్లో ఉన్నప్పుడు మా కుటుంబం చాలా ఇబ్బంది పడింది. ఒక్కోసారి బాధ కలుగుతుంది... ఇక్కడే ప్రతిభా భారతి ఉన్నారు... ఆవిడ మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆవిడకు తెలుసు... నా భార్య ఎన్నడూ ఇల్లు దాటి బయటికి రాలేదు. ఎన్టీరామారావు బిడ్డగా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా  ఉన్నా, మళ్లీ మొన్న ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజూ ఆమె బయటికి రాలేదు. అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో ఇష్టానుసారం తిట్టారు. ఒక ఆడబిడ్డకు ఇచ్చే గౌరవం ఇదేనా? 

నేను ఎలాంటి పనులు చేశానో ఆమెకు తెలుసు. నన్ను అరెస్ట్ చేయగానో ఎంతో బాధపడింది. అందుకే ఈ రాష్ట్రంపై ఒక బాధ్యతతో సుమారు 6 నెలల పాటు నిజం గెలవాలి యాత్ర చేపట్టింది. ఆ రోజు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు 203 మంది మనస్తాపంతో ప్రాణాలు విడిచారు. దాదాపు 80 దేశాల్లో నాకోసం ర్యాలీలు చేపట్టారు. 

ఆ సమయంలో ఈవిడ (నారా భువనేశ్వరి) కూడా 203 కుటుంబాలకు ఆర్థికసాయం చేసింది. మీరు మా కుటుంబం కోసం త్యాగం చేశారు... మేం మీకు అండగా ఉంటామని వారికి భరోసానిచ్చింది. వారి పిల్లలు చదువుకుంటామంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటామని ధైర్యాన్నిచ్చింది. మా కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్క కుటుంబం మా సొంత కుటుంబమేనని రాష్ట్రమంతా తిరిగి చెప్పగలిగింది. 

ఎప్పుడూ బయటికి రాని వ్యక్తి... దగ్గరదగ్గర 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9,079 కిలోమీటర్లు తిరిగి నిజం గెలవాలి యాత్రను నిర్వహించింది. అన్యాయం జరిగిందన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని రోడ్డు మీదకు వచ్చిన వ్యక్తి నా భార్య.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Nara Lokesh on Jagan stone attack: ఇస్తానన్న రూ.350 ఇవ్వకపోతే మండదా అక్కా, మండదా చెల్లీ...!: నారా లోకేశ్ సెటైర్లు

సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి

ఓ అనుమానితుడి అరెస్ట్!

ఇది క్వార్టర్ మేటర్ అంటూ లోకేశ్ ట్వీట్

cr-20240416tn661e3bd1b3f0c.jpg

సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే, సతీశ్ అనే యువకుడు సీఎం జగన్ పై రాయి విసిరినట్టుగా మీడియాలో ప్రసారమవుతోంది. క్వార్టర్ బాటిల్, రూ.350 డబ్బులు ఇస్తామని వైసీపీ నేతలు తనను సీఎం సభకు తీసుకువచ్చారని, క్వార్టర్ బాటిల్ ఇచ్చి, డబ్బులు ఇవ్వలేదని ఆ యువకుడు పోలీసులకు చెప్పినట్టు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి.  

సీఎం జగన్ నిన్న గుడివాడ సభలో మండదా అక్కా, మండదా చెల్లీ, మండదా తమ్ముడూ, మండదా అన్నా అంటూ తన ట్రేడ్ మార్క్ ప్రసంగం చేశారు.

ఈ నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్ వేశారు. క్వార్టర్ మేటర్... ఇస్తానన్న రూ.350 ఇవ్వకపోతే మండదా అక్కా... మండదా చెల్లీ, మండదా తమ్ముడూ, మండదా అన్నా...! అంటూ ఎద్దేవా చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Duvvada Srinivas willing to turn into a human bomb for Jagan: జగన్ కోసం మానవబాంబును అవుతా.. దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరిక

జగన్‌కు వైసీపీ కార్యకర్తలంతా అండగా ఉన్నారన్న శ్రీనివాస్

జగన్ సూచనతోనే సంయమనం పాటిస్తున్నామన్న టెక్కలి అభ్యర్థి

తాము తలచుకుంటే చంద్రబాబు, పవన్ రోడ్డెక్కే పరిస్థితి ఉండదని హెచ్చరిక

cr-20240416tn661df4550f77d.jpg

టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలు రక్షించుకునేందుకు అవసరమైతే మానవ బాంబుగా మారుతానని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలమంతా జగన్‌కు రక్షణగా ఉంటామని చెప్పారు. తాము తలచుకుంటే చంద్రబాబు, పవన్ రోడ్డెక్కే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. జగన్ సూచనతోనే తాము సంయమనం పాటిస్తున్నట్టు పేర్కొన్నారు.

జగన్‌‌పై విసిరిన రాయి నుదిటిపై తగిలింది కాబట్టి సరిపోయిందని, అదే కొంచెం ఎడమ వైపో, కుడివైపో తగిలి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జగన్‌పై ఆధారపడిన కోటాను కోట్లమంది ప్రజల జీవితాలు ఏమయ్యేవని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్‌ను రక్షించుకోవడానికి తానే కాదని, తనలాంటి లక్షలాదిమంది ఆత్మాహుతి బాంబులం అవుతామని శ్రీనివాస్ హెచ్చరించారు.

...

Complete article

జగన్ ను చంపాలని చూస్తే ఆత్మాహుతి బాంబు గా మారడానికి సిద్ధం : Duvvada Srinivas - TV9

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...