Jump to content
  • 2

Chandrababu Praja Galam: టీడీపీ ప్రజాగళం ఎన్నికల ప్రచారం


TELUGU

Question

Chandrababu: నాలాగా జగన్ మండుటెండలో మూడు సభల్లో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా?: చంద్రబాబు సవాల్

సీఎం జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు రిప్లయ్

జగన్ ను పిల్లకాకితో పోల్చిన టీడీపీ అధినేత

జగన్ పనిదొంగ అంటూ విమర్శలు

cr-20240329tn6606b615205a5.jpg

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. జగన్ నా వయసు గురించి మాట్లాడతాడు... నా మాదిరిగా మండుటెండలో ఒక మూడు మీటింగుల్లో పాల్గొని, సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా ఈ జగన్? అని ఎద్దేవా చేశారు. 

"ప్రజలకు చంద్రబాబు ఏం చేశాడని అడుగుతాడు... తెలుగు రాష్ట్రాల్లో  పిల్లలను అడిగినా చెబుతారు నేను ఏం చేశానో. అతనికి తెలియకపోతే ఆ అజ్ఞానానికి ఎవరేం చేయగలం?" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

అంతేకాదు, బనగానపల్లెలో తాను జగన్ పై చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా చంద్రబాబు పంచుకున్నారు. జగన్ ను పిల్లకాకితో పోల్చారు. నాలాగా రెండ్రోజులు మధ్యాహ్నం ఒంటిగంటకు మంచి ఎండలో మీటింగ్ లు పెట్టగలవా? అని సవాల్ విసిరారు. పనిదొంగ, దోపిడీదారుడు ఈ జగన్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

Chandrababu: వెళ్లి పవన్ కల్యాణ్ తో సంసారం చెయ్... అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది: సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు

తిరుపతి జిల్లా సత్యవేడులో ప్రజాగళం సభ

పవన్ గురించి జగన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడన్న చంద్రబాబు

పవన్ పెళ్లాల గురించి నీకెందుకు అంటూ ఫైర్

నువ్వు పవన్ కాలిగోటికి కూడా సరిపోవంటూ విమర్శలు

రాజకీయాలు లేకపోతే జగన్ పైసాకి కూడా చెల్లడని వ్యంగ్యం

cr-20240420tn6623f07cdfd5d.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లా సత్యవేడులో ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... నీ తాత జాగీరు అని రాష్ట్రంలో దోపిడీ చేస్తున్నావా? నువ్వు దోచుకుంటే ప్రశ్నించకూడదా? అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే పరారవుతారు వీళ్లు... ఆ తిరుగుబాటు సత్యవేడు నుంచి ప్రారంభించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

"అసెంబ్లీ సాక్షిగా బూతులు తిడతారు. ఎవడైతే ఎక్కువ బూతులు తిడతాడో వాడికి మంత్రి పదవి! ఇంకా ఎక్కువ బూతులు తిడితే వాడికి ప్రమోషన్! నా మీద దాడి చేయించిన వాడికి ఒక మంత్రి పదవి! నా మిత్రుడు పవన్ కల్యాణ్ పై దాడి చూశారా? పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నీకెందుకంత కడుపుమంట? ఒక నీతి నిజాయతీతో రాష్ట్రం కోసం ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్. 

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, కూటమి ఏర్పడాలని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కల్యాణ్. అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? రాష్ట్రమంతా దోచేసిన నువ్వా ఆయనపై అవినీతి ఆరోపణలు చేసేది? నువ్వు ఆయన కాలి గోటికి కూడా సరిపోవు. 

ఇవాళ పవన్ ఒక సినిమాలో నటిస్తే డబ్బులు ఇస్తారు... సూపర్ స్టార్ ఆయన! రాజకీయాలు లేకపోతే ఈ జగన్ మోహన్ రెడ్డి ఒక్క నయా పైసాకు పనికొస్తాడా? ఏదైనా ఒక్క పని చేసే సత్తా ఉందా నీకు? 

నువ్వు ఆయన పెళ్లాల గురించి మాట్లాడతావా? అందుకే ఆయన అన్నాడు... ఓకే, నువ్వు కూడా రారా నీతో కూడా సంసారం చేస్తానన్నాడు. సిగ్గున్న వాడైతే జగన్ మోహన్ రెడ్డి మాట్లాడతాడా? అందుకే అంటున్నా... వెళ్లి పవన్ కల్యాణ్ తో సంసారం చెయ్... అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది" అంటూ చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఇవాళ పవన్ కల్యాణ్ రాజానగరం వారాహి విజయభేరి సభలో సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సీఎం జగన్ నిన్న కాకినాడ సభలో మాట్లాడుతూ, ప్యాకేజి స్టార్ కు పెళ్లిళ్లే కాదు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి అని వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఈ వ్యాఖ్యలకు పవన్ ఇవాళ బదులిచ్చారు. "పరదాల మహారాణీ... నిన్న నాతో చాలామంది చెప్పారు. సార్ నిన్న మీ నాలుగో పెళ్లానికి చాలా అవమానం జరిగిందని చెప్పారు. నువ్వు నా గురించి పెళ్లాం అని మరోసారి మాట్లాడితే, జగన్ నా నాలుగో పెళ్లాం అని జనాలు మాట్లాడతారు జాగ్రత్త!" అంటూ వార్నింగ్ ఇచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: కేజీఎఫ్-3ని చూడాలంటే సర్వేపల్లికి రావాలి: చంద్రబాబు

నెల్లూరు జిల్లా పొదలకూరులో ప్రజాగళం సభ

ఎండల బాదుడు కంటే వైసీపీ బాదుడే ఎక్కువగా ఉందన్న చంద్రబాబు

ప్రజాగ్నిలో మే 13న వైసీపీ మాడి మసైపోతుందని వ్యాఖ్యలు

cr-20240420tn6623a82588051.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.... ఈ ఎండల కారణంగా కలుగుతున్న మంట కంటే, ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న మంటే ఎక్కువగా ఉందని అన్నారు. 

ఎండల బాదుడు కంటే వైసీపీ ప్రభుత్వ బాదుడే ఎక్కువగా ఉందని ఈ సభను చూస్తే అర్థమవుతోందని, రాజకీయ వేడి ముందు వేసవి వేడి కొట్టుకుపోతుందని పేర్కొన్నారు. ఈ అగ్నిలో మే 13న వైసీపీ మసైపోతుందని వ్యాఖ్యానించారు. 

"ఈ ముఖ్యమంత్రికి ఒళ్లంతా అహంకారం. ఎక్కడికక్కడ దోచుకోవడం తప్ప ఇంకేమీ తెలియదు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలి. ఇందాక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొన్ని విషయాలు చెప్పారు. నేను ఎప్పుడో కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 అని విన్నాను. ఎందుకంటే, నా నియోజకవర్గం కుప్పం పక్కనే కేజీఎఫ్ ఉంటుంది. కుప్పంలో కూడా గోల్డ్ మైన్స్ ఉన్నాయి. 

కానీ కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 చూడాలంటే కోలార్ వెళ్లాలి... కేజీఎఫ్-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి. కేజీఎఫ్ అంటే కాకాణి గోవర్ధన్ ఫీల్డ్స్. కాకాణీ... కేజీఎఫ్ ను సృష్టించుకున్నావు... అందులోనే నిన్ను పాతిపెడతా!

అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకాలు, సిలికా తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలు... ఈ అవినీతి మంత్రి ఎంత లోతుకు కూరుకుపోయాడంటే... మళ్లీ పైకొచ్చే అవకాశమే లేదు... శాశ్వతంగా గోతిలోనే ఉంటాడు! నువ్వు తవ్విన గోతులే, నువ్వు కొట్టిన కొండలే, నువ్వు దోచిన ఈ సహజ వనరులే నీ రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతున్నాయి... ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. 

ఇది కాకాణి ఇలాకా... ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఆయనకు రైతుల కష్టాలు తెలుసా? రైతులకు ఆయన వల్ల మేలు జరిగిందా? ఇలాంటి మంత్రి ఉండడం సర్వేపల్లికి పట్టిన ఖర్మ! 

ఈయన అరాచకాలు, అక్రమ టోల్ గేట్ తో కృష్ణపట్నం నుంచి కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకు వెళ్లిపోయింది... తద్వారా 10 వేల మంది ఉపాధి కోల్పోయారు. మితిమీరిన జోక్యం, మితిమీరిన దోపిడీతో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. అలాంటి వ్యక్తిపై పోరాడి పోరాడి సోమిరెడ్డి బక్కచిక్కిపోయాడు... అతడు మాత్రం దోచుకుని దోచుకుని ఒళ్లు బలిసిపోయింది. 

ఈ గూడూరు ప్రాంతంలో ఒక్క సిలికా ద్వారానే రూ.4,500 కోట్లు దోపిడీ జరిగింది. లీజుదారులను తరిమేసి టన్నుకు రూ.1400 వసూలు చేస్తున్నారు. క్వార్ట్జ్ టన్ను రూ.3 వేలు ఉంటే, అక్రమంగా తవ్వేస్తూ రూ.50 వేలకు అమ్ముకుంటున్నారు. క్వార్ట్జ్ లోనూ దాదాపుగా రూ.4 వేల కోట్లు దోచేశారంటే వీళ్లను ఏమనాలి?" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: మే 13న వచ్చేది పెనుతుపాను: శృంగవరపుకోటలో చంద్రబాబు

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రజాగళం సభ

రాష్ట్రంలో ఎవరూ స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదన్న చంద్రబాబు

మే 13న వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోతుందని వ్యాఖ్యలు

cr-20240422tn6626815990a83.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. శృంగవరపుకోట సభను చూస్తుంటే యుద్ధానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోందని అన్నారు. తాను అనేక తుపానులు చూశానని, హుద్ హుద్ తుపాను చూశానని, దానిని మించిన పెనుతుపాను మే 13న ఏపీ రాజకీయాల్లో రాబోతుందని స్పష్టం చేశారు. ఈ దెబ్బకు వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరూ స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదని, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

"గుంటూరు జిల్లాకు చెందిన కోవూరు లక్ష్మి అనే అమ్మాయి ఆదర్శ మహిళా మండలి నడుపుతోంది. అక్కడ సమస్యలు పరిష్కారం చేసే క్రమంలో ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడింది. చిన్న పిల్లలకు గంజాయి అలవాటు చేసి నేరాలు చేయిస్తుంటే చూసి భరించలేక పోరాడింది. ఎక్కడికక్కడ ప్రైవేటు భూములను కూడా కబ్జా చేస్తుంటే గట్టిగా పోరాడింది. చివరికి ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దలను కలిసేందుకు ప్రయత్నించింది. ఇండియా గేట్ వద్ద నిరసన తెలుపుతూ తన చేతి బొటనవేలిని కోసేసుకుంది. ఇలాంటి అరాచకాలు చాలా జరిగాయి. 

కర్నూలులో అబ్దుల్ సలాం అనే వ్యక్తి బాధలు భరించలేక చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. తాను చనిపోతే తన పిల్లలను అనాథలైపోతారని, భార్యను అవమానిస్తారని భావించి భార్యతో కలిసి చనిపోవాలనుకున్నాడు. తామిద్దరం చనిపోతే పిల్లలు ఒంటరివాళ్లయిపోతారని... అందరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో రైల్వే ట్రాక్ మీదకు వెళ్లి పిల్లలను పట్టాలకు కట్టేసి, తాము కూడా పట్టాలపై పడుకుని రైలు కింద పడి చనిపోయారు. ఇవన్నీ చూస్తుంటే ఒక అరాచకశక్తి రాష్ట్రాన్ని ఏలుతున్నట్టు అనిపిస్తోంది. ఒక దుర్మార్గుడు చేతిలో మనం బలైపోవాల్సిందేనా? 

ఇతడు మామూలు అహంకారి కాదు. ఎవరైనా తనకు అన్యాయం జరిగిందంటే వాళ్లను వేధిస్తున్నారు... ఒక్కోసారి చంపేస్తున్నారు. ఇక్కడే గీతం యూనివర్సిటీ ఉంది. పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని ఎంవీఎస్ మూర్తి గారు గీతం యూనివర్సిటీని స్థాపించారు. నేను కూడా సహకరించాను. ఒక శుక్రవారం సాయంత్రం ప్రొక్లెయిన్ తీసుకువచ్చి వర్సిటీ భవనాలు కూల్చివేసే ప్రయత్నం చేస్తుంటే భరత్ ఎలాగోలా కాపాడుకున్నాడు. కానీ అప్పటికే కాంపౌండ్ వాల్ కూల్చేశారు. 

ప్రతి శుక్రవారం కేసులు పెట్టి లోపలేస్తారు, లేకపోతే, ప్రొక్లెయిన్ తీసుకువచ్చి ఆస్తులు ధ్వంసం చేస్తారు. రాష్ట్రంలో చట్టం లేదు, న్యాయం లేదు, నియంతృత్వం ఉంది. జగన్ మోహన్ రెడ్డి ఒక అహంకారి. ఆ అహంకారానికి సైకోతనం తోడైంది. రాష్ట్రమంతా గంజాయి, డ్రగ్స్, చీప్ లిక్కర్ మయం అయింది" అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: నా జోలికి రావాలంటే అందరూ భయపడతారు... కానీ ఇతడు సైకో కాబట్టి ఏమైనా చేయగలడు: చంద్రబాబు

కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగళం సభ

తన 40 ఏళ్ల ప్రస్థానంలో జగన్ వంటి నేతను చూడలేదన్న బాబు 

అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని విమర్శలు

పెరుగు, మీగడ మింగి ప్రజలకు మజ్జిగ నీళ్లు పోస్తున్నాడని ఆగ్రహం

cr-20240422tn662655d3184d6.jpg

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ వంటి నేతను ఎక్కడా చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తన జోలికి రావాలంటే అందరూ భయపడతారని, కానీ ఇతడు సైకో కాబట్టి భయమేమీ లేకుండా ఏమైనా చేస్తాడని వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో తాను కూడా బాధితుడినే అని చంద్రబాబు పేర్కొన్నారు. 

చంద్రబాబు ఇవాళ కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... జగన్ చేసేదంతా విధ్వంసమేనని విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి రాష్ట్రంలో ఏ వ్యవస్థను వదిలిపెట్టకుండా నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. 

వ్యవసాయ శాఖ, విద్యాశాఖ పనిచేయడంలేదని, ప్రజలకు ఆరోగ్యం అందడంలేదని అన్నారు. ఈ సైకో జగన్ వల్ల అమరావతి పోయింది, పోలవరం పోయింది, పరిశ్రమలు పోయాయి అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. 

"జడ్జిలను తిట్టేవాళ్లను, సీబీఐ కేసు ఉన్నవాళ్లను పక్కనబెట్టుకుని ఊరేగుతున్నాడు. ప్రజలు ఇతని ప్రవర్తనను గమనించాలి. రాష్ట్రాన్ని సర్వం దోచేశాడు... పెరుగు, మీగడ మొత్తం మింగేసి మీకు మజ్జిగ నీళ్లు పోస్తున్నాడు. ఇతడికి డబ్బుల పిచ్చి... డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అందుకే జే బ్రాండ్ పేరుతో నాసిరకం మద్యం తీసుకువచ్చాడు. 

నేను ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ రూ.60... ఇప్పుడు రూ.200! మీ డబ్బులు రూ.140 దొబ్బేస్తున్నాడు ఈ జలగ సైకో జగన్. ఏ మద్యం షాపులో అయినా ఆన్ లైన్ పేమెంట్లు ఉన్నాయా? అందులో రహస్యం ఏంటి? ఇవాళ టీకొట్లు, తోపుడు బళ్లలో కూడా ఆన్ లైన్ పేమెంట్లు ఉన్నాయి. కానీ మద్యం షాపుల్లో మాత్రం లేవు. ఇలా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దెబ్బతీశాడు. మద్యపాన నిషేధం అన్నాడు... చేశాడా? మద్యపాన నిషేధం తర్వాతే ఓటు అడుగుతా అని చెప్పిన నీకు ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఉందా? 

ప్రత్యేక హోదా తెచ్చాడా? సీపీఎస్ రద్దు చేస్తానన్నాడా లేదా? కరెంటు చార్జీలు తగ్గిస్తానన్నాడా లేదా? తగ్గించకపోగా, తొమ్మిదిసార్లు పెంచాడు. నా పాలనలో నేను కరెంటు చార్జీలు పెంచలేదు. సమర్థుడైన నాయకుడి పాలనలో చార్జీల పెంపు ఉండదు. 

జగన్ మోహన్ రెడ్డి ఒక మాట చెబుతున్నాడు... అందరూ ఏకమై వస్తున్నారంట... ఆయన ఒక్కడే వస్తున్నాడంట... ఆయన సింహం అంట! ఒక దొంగ... ఒక దోపిడీదారుడు... మీ ఇంటి మీదికి వస్తే మీరేం చేస్తారు? మనిషికి ఏం దొరికితే అది తీసుకుని రోడ్డు మీదికి వస్తారు, ఊరంతా ఏకమవుతారు, అందరూ కలిసి దొంగను తరుముతారు. రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో బందిపోటు దొంగొచ్చాడు... దోపిడీదారుడు వచ్చాడు... రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. 

ఇవాళ మేం సూపర్-6 తీసుకువచ్చాం. ఆడబిడ్డ నిధి కింద మహిళలు ఒక్కొక్కరికి రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం కింద ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే రూ.15 వేల చొప్పున ఇస్తాం. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. అన్నదాతను ఆదుకునే క్రమంలో రైతులకు ఏడాదికి రూ.20 వేలు సాయం అందిస్తాం. రైతును రాజుగా చేస్తాం. 

ఇవే కాకుండా... వృద్ధులందరికీ హామీ ఇస్తున్నా... నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తాం. ఏప్రిల్ నుంచే వర్తించేలా ఇంటి వద్దనే పెన్షన్ అందిస్తాం. ఒక నెల తీసుకోకపోయినా, రెండో నెల తీసుకోకపోయినా మూడో నెల కూడా పెన్షన్ ఇస్తాం. పెన్షన్ పథకం తీసుకువచ్చిందే తెలుగుదేశం పార్టీ. రూ.200 పెన్షన్ ను రూ.2 వేలు చేసింది తెలుగుదేశం పార్టీ. 

పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఏదో ఇళ్లు కట్టానని చెబుతున్నాడు... ఇళ్లు కట్టాడా, గూళ్లు కట్టాడా? ఆ ఇళ్లలో పడుకోవడానికైనా సరిపోతుందా? నేను బ్రహ్మాండమైన టిడ్కో ఇళ్లు కట్టాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా... పేదలందరికీ 2 సెంట్లు గానీ, 3 సెంట్లు గానీ స్థలం ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇళ్లు కట్టిస్తాం... టిడ్కో ఇళ్లు పూర్తిగా ఉచితంగా మీకే ఇస్తాం" అని చంద్రబాబు పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Lokesh comedy: బాబు & లోకేష్ ప్రచారం! #chandrababu #lokesh #pawankalyan #elections2024

:emoji-lol:

 

Link to comment
Share on other sites

  • 0

ఉచిత బస్సు పథకం గురించి స్ఫూర్తి నింపే షార్ట్ ఫిలిం.. ఓ బాలిక విజ‌య‌గాథ‌ #BabunuMalliRappidham

 

Link to comment
Share on other sites

  • 0
On 4/22/2024 at 12:33 AM, TELUGU said:

Nara Lokesh: ఏపీ సీఈవో నోటీసులకు నారా లోకేశ్ వివరణ

సైకో పోవాలి సైకిల్ రావాలి పాటపై సీఈవోకు ఫిర్యాదు చేసిన వైసీపీ

నారా లోకేశ్ కు నోటీసులు

చంద్రబాబు, పవన్ పై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సీఈవోకు ఫిర్యాదు

మేమంతా సిద్ధం సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై సీఎం జగన్  అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని లోకేశ్ ఈ సందర్భంగా సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. భీమవరం సభలో సీఎం జగన్ ఎన్నికల నియమావళి అతిక్రమించారని ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నాయని కూడా లోకేశ్ సీఈవోకు ఫిర్యాదు చేశారు.

Orey Pappu, stick to the topic and respond to the notice. Don't mention irrelevant stuff in the same response. Don't behave like an illiterate idiot and don't whine like a baby.

If you have issues with the other party, file a "separate" complaint. Didn't your father and all the dozens advisors and lawyers you have at your disposal teach you these very basic stuff?

Link to comment
Share on other sites

  • 0

Nara Lokesh warning to officials: తప్పుడు కేసులు పెట్టి వేధించిన అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తాం: నారా లోకేశ్‌

వైసీపీ పాలనలో వేలాది మంది యువతులు అదృశ్యమయ్యారన్న లోకేశ్

వారి ఆచూకీ కనుక్కుని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని హామీ

ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తామన్న లోకేశ్

cr-20240422tn66261a425eb00.jpg

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువతులు అదృశ్యమయ్యారని... తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిస్ అయిన యువతుల ఆచూకీ కనుక్కుని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని... తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై న్యాయ విచారణ జరిపిస్తామని, తప్పు చేసిన అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. 

తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు అందిస్తామని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలి పోకుండా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలను చట్టబద్ధం చేస్తామని అన్నారు. మంగళగిరి మండలం కాజాలోని ఏఆర్ అపార్ట్ మెంట్ వాసులతో లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
On 4/22/2024 at 5:49 PM, Sucker said:

ఉచిత బస్సు పథకం గురించి స్ఫూర్తి నింపే షార్ట్ ఫిలిం.. ఓ బాలిక విజ‌య‌గాథ‌ #BabunuMalliRappidham

 

CBN is just a copycat desperate to win the election one last time so he could scam as much money as possible before he retires.

Link to comment
Share on other sites

  • 0

CBN - Vizianagaram: ‘Looters, cheaters will be put behind bars’

Jana Sena president Pawan Kalyan addressing a meeting at Nellimarla in Vizianagaram district on Wednesday. TDP national president N Chandrababu Naidu and TDP Vizianagaaram MP candidate K Appalanaidu are also seen.

1441771-tdp-jsp.webp

TDP national president N Chandrababu Naidu and Jana Sena chief Pawan Kalyan have jointly taken part in a road show organised in Nellimarla Assembly constituency in Vizianagaram district on Wednesday. They both appealed to people to vote for Jana Sena MLA candidate Lokam Madhavi at Nellimarla and for Vizianagaram TDP MP candidate K Appalanaidu. They alleged that the YSRCP government has destroyed the entire system and looted the resources. Once the alliance government is formed in Andhra Pradesh, all the looters and cheaters would be put behind bars, they said.

The two leaders assured that jobs will be created and youth would get employment at their own native places. Later, Naidu and Pawan addressed a public meeting in Vizianagaram and vowed to guide Andhra Pradesh towards prosperity once the NDA forms the government in the State after the ensuing polls. “We will protect the interests of employees, students, women, farmers and all sections of people in the state,” they said. Alleging that Chief Minister Y S Jagan Mohan Reddy was harassing all sections of people, Naidu and Pawan said that time has come to unseat Jagan from power.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Sajjala Ramakrishna Reddy's Sharp Response to Chandrababu's Tweet on CM Jagan's Comments

cr-20240425en662a6e9963d4c.jpg

Today, it is known that TDP chief Chandrababu criticized the remarks made by CM Jagan in Pulivendula. Chandrababu tweeted, "Is a Chief Minister supposed to criticize even the birth of a younger sister and a daughter who is considered as Lakshmi of the house by her attire? How vile... Is this not a distorted mentality?"

In response to Chandrababu's comments, state government advisor Sajjala Ramakrishna Reddy reacted sharply. He accused Chandrababu of misrepresenting Jagan's political lineage discussion as a comment about his sister's birth, stating, "Looking at your twisted thoughts, it is clear how much you have degraded." Sajjala further commented on Chandrababu's tweet, "Even animals would disdain to the level you have stooped to with your tweet."

This exchange highlights the ongoing political tension and sharp exchanges between the leaders, reflecting deep-seated rivalries in the regional political landscape.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

వంద బాదాడు.. వెయ్యి నొక్కాడు!

బటన్‌ నొక్కాను.. బటన్‌ నొక్కాను అంటూ బటన్‌రెడ్డి పదేపదే చెబుతున్నాడు. క్లాస్‌ వార్‌ అంటున్నాడు.. ఏది క్లాస్‌ వార్‌..? ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చింది పది రూపాయలు.

rgfkbv_a9f4f3276c_V_jpg--799x414-4g.webp

జగన్‌ ఐదేళ్ల పాలన ఇదే: చంద్రబాబు

తాడేపల్లి ప్యాలె్‌సను బద్దలుకొడితే పేదల కడుపు నిండుతుంది

క్లాస్‌వార్‌ అంటే అదీ!.. సీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు

జాబ్‌ కేలెండర్‌ ఇచ్చాడా?.. ఉద్యోగులకు న్యాయం చేశాడా?

జే బ్రాండ్‌తో మహిళల మంగళసూత్రాలు తెంపేస్తున్నాడు

ఆ నవరత్నాలు నవ మోసాలు.. వైసీపీ మేనిఫెస్టో అబద్ధాలపుట్ట

మళ్లీ మోసపోతే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు.. మేం రాగానే పింఛన్‌ 4 వేలు

అంగన్‌వాడీ, హోంగార్డులు, పెన్షనర్లందరికీ అండగా ఉంటా

మెగా డీఎస్సీపైనే తొలి సంతకం.. ఏటా 4 లక్షల ఉద్యోగాలు

స్కిల్‌ పెంచేందుకు యువతకు శిక్షణ.. ఉద్యోగులకు న్యాయం

‘సీమ’ వలసల నివారణకు ప్రత్యేక ప్రణాళిక అమలు: బాబు

కర్నూలు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ‘బటన్‌ నొక్కాను.. బటన్‌ నొక్కాను అంటూ బటన్‌రెడ్డి పదేపదే చెబుతున్నాడు. క్లాస్‌ వార్‌ అంటున్నాడు.. ఏది క్లాస్‌ వార్‌..? ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చింది పది రూపాయలు. రూ.వంద బాదేశాడు.. రూ.వెయ్యి నొక్కేశాడు.. తాడేపల్లి ప్యాలె్‌సను బద్దలుకొడితే పేదల కడుపు నిండుతుంది.. క్లాస్‌ వార్‌ అంటే అదీ..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ నవరత్నాలు నవమోసాలని.. జగన్‌ ప్రకటించిన మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్టని ధ్వజమెత్తారు. 99.5 శాతం అమలు చేశామంటూ ప్రజలను మోసగిస్తున్నాడని.. మళ్లీ మోసపోతే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలనూ దగా చేసిన వైసీపీని మే 13న ఓటుతో భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపిచ్చారు.ప్రజాగళంలో భాగం గా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరులో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. జగన్‌ 99.5ు హామీలు అమలు చేశానని చెబుతున్నాడని.. మద్య నిషేధం చేశాడా? జాబ్‌ కేలెండర్‌ ఇచ్చాడా? ఒక్క డీఎస్సీ అయినా ఇచ్చాడా అని ప్రశ్నించా రు. చివరకు చెత్తపై కూడా పన్నులు వేసిన చెత్త ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. ఇంకా ఏమన్నారంటే..

..34 మందిని చంపేశావ్‌

జగన్‌..! నీ రాజకీయ పిచ్చి కోసం గత నెలలో వృద్ధుల ను మండుటెండల్లో రోడ్లపైకి తీసుకొచ్చి 34 మంది వృద్ధు లు చనిపోవడానికి కారణమయ్యావ్‌. పేదవారి జీవితాల తో ఆడుకోవద్దు. సీఎస్‌ ఒకటో తేదీనే ఇళ్ల వద్దకే పింఛన్‌ పంపించే ఏర్పాట్లు చేయాలి. పింఛన్‌ పథకం మొదలు పెట్టింది ఎన్టీఆర్‌.. ఆ పింఛన్‌ను. రూ.200 నుంచి ఐదు రెట్లు పెంచి రూ.2 వేలు చేసింది నేను. జూన్‌ 4న ఎన్నిక ల ఫలితాలు వస్తాయి. మన ప్రభుత్వం రాగానే పింఛన్‌ రూ.4 వేలు పెంచి ఏప్రిల్‌ నుంచే ఇస్తాం. మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది. ఆడబిడ్డలకు నెలనెలా రూ.1,500 చొప్పున ఐదేళ్లలో రూ.95 వేలిస్తాం. తల్లికి వందనం కింద బడిలో చదివే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తాం. ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే రూ.60 వేలు వస్తుంది. దీపం పథకంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. సైకో ఇచ్చిన ఇంటి స్థలాను రద్దు చేయను. పేదలందరికీ రెండు మూడు సెంట్ల స్థలాలు ఇస్తాను. అందరి కీ ఇళ్లు కట్టిస్తాను. రేషన్‌ పథకంలో మన ప్రభుత్వం 8 రకాల సరుకులు ఇస్తే.. ఈ జగన్‌ కేంద్రం ఉచితంగా ఇస్తు న్న ఐదు కేజీలు బియ్యం మాత్రమే ఇస్తూ తన స్టిక్కర్‌ వేసుకున్నాడు. పేదరికం లేని సమాజం చూడాలన్నదే నా సంకల్పం. ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. మారుమూల గ్రామం కౌతాళం, గూ డూరులో కూర్చొని అమెరికా కంపెనీలతో పని చేసే లా తీర్చిదిద్దుతాను. అదీ నా విజన్‌. నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి ఇస్తాను. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం.

ముస్లిం రిజర్వేషన్లపై దుష్ప్రచారం

ఎన్డీయే ప్రభుత్వం వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని జగన్‌ విష ప్రచారం చేస్తున్నారు. దీని ని నమ్మకండి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోటా తొలగించం. రాష్ట్ర అభివృద్ధి కోసమే జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నాం. 3 పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేశాయి. ఓడిపోతామనే భయంతో ముస్లింలలో విషబీజం నాటేందుకు జగన్‌ కుట్రలు చేస్తున్నాడు. ఆయన గారడీ మాటలు చెల్లవు. ఉద్యోగులకు జగన్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశాడు. మేం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాం.

రతనాల సీమగా రాళ్ల సీమ

రాయలసీమకు ముఖద్వారంగా ఉన్న కర్నూలు ప్రాంతానికి సాగునీరు ఇస్తే రైతులు మంచి పంటలు పండిస్తారు. పరిశ్రమలు వస్తాయి. రాళ్లసీమ రతనాలసీమగా మారుతుంది. వలసలు ఆగిపోతాయనే దూరదృష్టితో ఆలోచించి నా హయాంలో రూ.1,985 కోట్లతో ఆర్డీఎస్‌ కు డి కాలువ ప్రాజెక్టు, రూ.1,942 కోట్లు మంజూరు చేసి వేదవతి ప్రాజెక్టు చేపట్టాను. గుండ్రేవుల ప్రాజెక్టుకు డీపీఆర్‌ తయారు చేసి నిధులు కూడా ఇచ్చాను. 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇచ్చాను. ఈ జగన్‌ వచ్చి ఏం చేశాడు..? రాయలసీమలో 102 ప్రాజెక్టులను ఆపేసిన దుర్మార్గుడు. కౌతాళం ప్రాంతం నుంచి 80 వేల మంది వలస వెళ్తున్నా రు. వాటి నివారణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తాం. ఈ జలగన్న నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఎక్కడ చూసినా నాసిరకం మద్యమే. భూమ్‌..భూమ్‌.. స్పెషల్‌ స్టేటస్‌.. ప్రెసిడెంట్‌ మెడల్‌ వంటి కంపెనీల మద్యం ఎప్పడైనా చూశారా..? జే బ్రాండ్‌ మద్యంతో ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంపేస్తున్నాడు. క్వార్టర్‌ మద్యం ఇప్పడు రూ.200-250 ఉంది. ఆ డబ్బంతా తాడేపల్లి కొంపకు పోతోంది. కాగా, చంద్రబాబు ఆదివారం రాత్రి గూడూరులో బస చేశారు.

పాదయాత్రలో తలలు నిమిరాడు.. ముద్దులు పెట్టాడు.. మీరేమో ఐస్‌లా కరిగిపోయారు. ఆ తర్వాత ఐదేళ్లు బాదుడే బాదుడు. మీ సంపద పెంచాడా..? మీ జీవితాలను అంధకారంలోకి నెట్టేసిన ఈ దుర్మార్గుడికి మళ్లీ ఓటేస్తారా..?

జగన్‌ మాయమాటలు.. గారడీ మాటలకు మళ్లీ మోసపోతే ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. టీడీపీ కూటమిని గెలిపిస్తే పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావాలి. అదీ మన విజన్‌.

జూన్‌ 4 తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. సంపద సృష్టించి పేదల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ జగన్‌ను ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోండి.. అందుకు సిద్ధమా..?

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Pawan Kalyan: ప్రధాని దగ్గర నేను ధైర్యంగా మాట్లాగలను.... జగన్ మాట్లాడగలడా?: ఏలేశ్వరంలో పవన్ కల్యాణ్ 

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వారాహి విజయభేరి సభ

కేసుల గురించి మాట్లాడడానికే జగన్ ప్రధాని వద్దకు వెళతారన్న పవన్

మోదీ అలాంటి వారికి గౌరవం ఇవ్వరని వెల్లడి

జగన్ వంటి వ్యక్తులను ప్రధాని కచ్చితంగా శిక్షిస్తారని వ్యాఖ్యలు

cr-20240428tn662e6bf55f18c.jpg

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... జగన్ వంటి వ్యక్తులు వారిపై ఉన్న కేసుల గురించి మాట్లాడడానికి, అనంతబాబు వంటి హత్య చేసిన వ్యక్తుల గురించి మాట్లాడడానికే ప్రధాని మోదీ వద్దకు వెళతారని విమర్శించారు. 

కానీ మోదీ అలాంటి వారికి గౌరవం ఇవ్వరని, కానీ తాను వెళితే మోదీ ఎంతో గౌరవం ఇస్తారని పవన్ వెల్లడించారు. ప్రధాని మోదీ వద్ద తాను ధైర్యంగా మాట్లాడగలనని, మోదీ వద్ద మాట్లాడాలంటే జగన్ కు భయం అని ఎద్దేవా చేశారు. జగన్ వంటి వ్యక్తులను మోదీ కచ్చితంగా శిక్షిస్తారని పవన్ పేర్కొన్నారు. 

తనకు లంచాల సొమ్ము, అవినీతి సొమ్ము అవసరం లేదని, తాను ఒక సినిమా చేస్తే కోట్లు వస్తాయని అన్నారు. యువతకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే యువత జీవితాలు బాగుపడతాయని అన్నారు. 

14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు, మూడున్నరేళ్లు సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి మన కూటమిలో ఉన్నారు... దశాబ్దకాలంగా పోరాడుతున్న నేను ఉన్నాను... మాకు అండగా నిలబడండి... రాష్ట్రం కోసం పనిచేసే బాధ్యత తీసుకుంటాం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: ప్రజలందరూ బాగుంటే నేను ఓటు అడగను: కౌతాళం సభలో చంద్రబాబు

28-04-2024 Sun 18:41 | Andhra

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజాగళం సభ

హాజరైన చంద్రబాబు

కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలో సామాజిక న్యాయం పాటించామని వెల్లడి

ఓ ఎంపీటీసీకి ఎంపీ టికెట్ ఇచ్చామని స్పష్టీకరణ

cr-20240428tn662e4b0ac77d9.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, టికెట్ల కేటాయింపులో తాము సామాజిక న్యాయం పాటించామని వెల్లడించారు. ఆస్తిపాస్తులు లేకపోయినప్పటికీ కురుబ సామాజిక వర్గానికి చెందిన సాధారణ ఎంపీటీసీ నాగరాజుకు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చామని వెల్లడించారు. 

మరోవైపు, రాఘవేంద్రరెడ్డిని స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశామని వెల్లడించారు. కర్నూలు పార్లమెంటు స్థానంతో పాటు, ఆ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను తామే గెలుస్తున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 

"పక్కనే తుంగభద్ర ఉన్నా తాగడానికి నీళ్లున్నాయా మీకు? సాగునీరు వచ్చిందా? గురురాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తోందా? కానీ తుంగభద్రలోని ఇసుకకు మాత్రం ఇక్కడి ఎమ్మెల్యే పెద్ద లీడర్ అయిపోయాడు. ఇసుక మాఫియా ఉందా, లేదా? ఇసుక దొంగిలించే బాల నాగిరెడ్డి ఒక్క పని చేశాడా? ఒక ఊరికైనా రోడ్డు వేశాడా, ఒక ఊరికైనా మంచి నీరు ఇచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చాడా? బడుగుజీవుల రక్తం తాగే దుర్మార్గులు ఈ బాల నాగిరెడ్డి, సాయిప్రతాపరెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే! 

ఈసారి ఎన్నికల్లో గెలిచేది కూటమి అభ్యర్థులే. కూటమి వస్తేనే మంత్రాలయం మళ్లీ అభివృద్ధి చెందుతుంది. ఈ ముఖ్యమంత్రి ఒక సైకో. ఈ సైకోను నమ్ముకుని అందరూ మునిగిపోయారు. ప్రజలందరూ బాగుంటే నేను ఓటు అడగను... మీరందరూ బాగున్నారా? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల జీవితాల్లో ఎంతో కొంత మార్పు రావాలి కదా. వచ్చిందా మార్పు? 

రాయలసీమలో 52 సీట్లలో గెలిపించారు... పాదయాత్రలో మోసాలు చేశాడు, అబద్ధాలు చెప్పాడు... నెత్తిన చెయ్యి పెట్టాడు, బుగ్గలు  నిమిరాడు, ముద్దులు పెట్టాడు... మీరందరూ ఐస్ అయిపోయారు. ప్రజలది వెన్నలాంటి మనసు... అతడ కరడుగట్టిన ఉగ్రవాది. ఆ ఉగ్రవాది నాటకానికి నా ప్రజానీకం బలైపోయారు... అదే నా బాధ! 

ఇతడికి నీటి విలువ తెలుసా? రైతులకు నీటి విలువ తెలుసు, నాకు నీటి విలువ తెలుసు... నీరు జీవితాలను మార్చుతుంది. సాగునీరు, తాగునీరు ఎక్కడుంటే అక్కడ ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు. టెక్నాలజీ యుగంలో కూడా ఇక్కడ నీళ్లు లేవంటే గుండె తరుక్కుపోతోంది. 

40 ఏళ్లు మీరు నన్ను ఆదరించారు. నా జీవితాశయం ఒకటే. ఆంధ్రప్రదేశ్ లో పేదరికం లేని సమాజాన్ని చూడాలి... అందుకోసం నేను కృషి చేస్తాను. సంపద సృష్టిస్తా... ఆదాయం పెంచుతా... ఆ ఆదాయాన్ని మీకు పంచుతా... చేపలు ఇవ్వడమే కాదు, చేపలు పట్టే విధానం కూడా నేర్పించి ఆ ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తా. 

ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా... మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డలకు నాలుగు కార్యక్రమాలు ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500... ఏడాదికి రూ.18 వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు ఇస్తాం. తల్లికి వందనం కింద చదువుకునే పిల్లల కోసం ఎంతమంది ఉంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున అకౌంట్లలో వేస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. 

ఈ నాలుగే కాదు... డ్వాక్రా సంఘాల వారికి కూడా హామీ ఇస్తున్నా... రూ.10 లక్షలు వడ్డీలేని రుణాలు ఇస్తా" అని చంద్రబాబు వివరించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: అసలే డ్రైవింగ్ తెలియని వ్యక్తి... రివర్స్ గేర్ లో తీసుకెళుతున్నాడు: చంద్రబాబు

29-04-2024 Mon 21:00 | Andhra

నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రజాగళం సభ

ప్రతి ఒక్కరినీ నాశనం చేసిన వ్యక్తి జగన్ అంటూ చంద్రబాబు ధ్వజం

ఏమిటీ చెత్త పరిపాలన అంటూ విమర్శలు

డ్రైవింగ్ చేతకాని వ్యక్తికి డ్రైవింగ్ అప్పగించారని వ్యాఖ్యలు

cr-20240429tn662fbd1c8fcf9.jpg

నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క ఇంటిని, ప్రతి ఒక్క ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని ధ్వజమెత్తారు. యువత, రైతులు, బీసీలు, ముస్లింలు, మహిళలు... ఇలా ఏ వర్గం వారు కూడా ఆనందంగా లేరని అన్నారు. ఏమిటీ చెత్త పరిపాలన అంటూ విమర్శించారు. 

"సైకో జగన్ కు తెలిసిందల్లా రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, కేసులు... ఇవి కాకుండా ఒక్క మంచి పని చేశాడా? నేను నందికొట్కూరు నుంచి సవాల్ విసురుతున్నా. నేనేం చేశానో చెబుతున్నా. ఈ జిల్లాను తీసుకుంటే... తంగడంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు ముందుకెళ్లాను. అది వచ్చుంటే రైతులకు ఆదాయం పెరిగేది, మీరు పండించే పంట విత్తనాలుగా మారి ప్రపంచానికి వెళ్లుంటే మీ ఆదాయం పెరిగి పరిశ్రమలు వచ్చేవి. ఈ యువత ఎక్కడికీ వెళ్లే పనిలేకుండా మీ ఊర్లోనే ఉద్యోగాలు వచ్చేవి. 

అమెరికాలోనే బెస్ట్ విద్యాసంస్థ అయోవా యూనివర్సిటీ. ఆ సంస్థతో  ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం. కానీ ఈ దుర్మార్గుడు, దుష్టుడు ఆ ఎంఓయూ నేను చేశానన్న కారణంతో మీ పొట్టకొట్టాడు. 

రూ.365 కోట్లతో జైన్ ఇరిగేషన్ కు ఒక ప్రాజెక్టు ఇచ్చాం. ఆ ప్రాజెక్టుతో నర్సరీ మొత్తం తయారుచేసి, ఆదర్శప్రాయమైన మైక్రో ఇరిగేషన్ తో రాయలసీమను హార్టికల్చర్ గా మార్చి మీ ఆదాయాన్ని రెట్టింపు చేయాలని భావించాను. కానీ ఈ రోజు జైన్ ఇరిగేషన్ వచ్చిందా? ముచ్చుమరి ప్రాజెక్టు పూర్తి చేసింది ఎవరు? ఇలాంటి ప్రాజెక్టులు ఒకటీ రెండు కాదు. 

మరోవైపు ఓర్వకల్లు. నేనే ఒక్క సంవత్సరంలో ఎయిర్ పోర్టు కట్టించాను. ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా వెళ్లేందుకు ప్రణాళికలు రచించాను. సోలార్ పార్క్, విండ్ మిల్స్, పంప్డ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాను. ఇవాళ ఇవన్నీ వచ్చాయా? ఇవన్నీ గనుక వచ్చుంటే హైదరాబాద్ కు నందికొట్కూరు ఒక శాటిలైట్ టౌన్ షిప్ మాదిరిగా తయారయ్యేది. 

కానీ ఈ రాయలసీమ ద్రోహిని, నందికొట్కూరును నాశనం చేసిన వ్యక్తిని మీరు క్షమిస్తారా? ఈ జగన్ ఒక సైకో, ఒక అహంకారి, విధ్వంసకారుడు. ఊరికొక సైకోను తయారుచేశాడు. ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఉన్నాడు. 

ముఖ్యమంత్రిగా ఉండేందుకు జగన్ కు అర్హత ఉందా? పరిపాలన చేతకాని వ్యక్తి జగన్. డ్రైవింగ్ చేతకాని వ్యక్తికి మీరు డ్రైవింగ్ అప్పగించారు. అసలే డ్రైవింగ్ తెలియదు, రివర్స్ గేర్ లో తీసుకెళుతూ అందరి జీవితాలను నాశనం చేస్తున్నాడు" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu on pension distributions: ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ సాధ్యమే... చంద్రబాబు కీలక ప్రెస్ మీట్

29-04-2024 Mon 14:35 | Andhra

ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ ప్రహసనంలా మారిన వైనం

సచివాలయాల వద్ద పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం

పలువురు వృద్ధుల మృతి

మీరే కారణం అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న అధికార, విపక్షాలు

ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ పెద్ద కష్టమైన పనేం కాదంటూ వివరాలు తెలిపిన చంద్రబాబు

cr-20240429tn662f62f112f90.jpg

మే 1వ తేదీ వస్తుండడంతో మళ్లీ అందరి దృష్టి పెన్షన్ల పంపిణీపై పడింది. ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ ఒక ప్రహసనంలా మారడం తెలిసిందే.

ఇళ్ల వద్దకే పెన్షన్లు అందించాలని ఈసీ ఆదేశించినా ప్రభుత్వం సచివాలయాల వద్ద పెన్షన్లు ఇచ్చిందని విపక్షాలు భగ్గుమనడం, విపక్షాలు వాలంటీర్లపై ఫిర్యాదు చేయడం వల్లే సచివాలయాల వద్ద ఇవ్వాల్సి వచ్చిందని, అందుకే పలువురు వృద్ధులు ఎండవేడిమికి మరణించారని ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం అందరూ చూశారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ప్రెస్ మీట్ పెట్టి పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాల్సిందేనని, ఈసీ ఆదేశాలు పాటించాలని డిమాండ్ చేశారు. "పెన్షన్లు ఇంటివద్దే పంపిణీ చేయండి... ఇది సాధ్యం. మీకు అధికారులు ఉన్నారు... సచివాలయాలు ఉన్నాయి... యంత్రాంగం ఉంది... ఇది పెద్ద కష్టమైన పని కాదు... అని చాలా స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. 

ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, సీఎంవోలో ఉండే పెద్ద పైరవీకారుడు ధనంజయరెడ్డి, సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి వీళ్లు కలిసి మళ్లీ అదే కుట్రకు తెరలేపారు. పెన్షన్ల పంపిణీపై మేం (ఎన్డీయే కూటమి) చాలాసార్లు ఎన్నికల సంఘాన్ని కలిశాం.... గవర్నర్ ను కలిశాం... ఏం చేస్తే బాగుంటుందనేది సూచనల రూపంలో తెలియజేశాం. 

ఎన్నికల సంఘం కూడా... ఇదేమంత  కష్టం కాదు, ఎలాగైనా ఇళ్ల వద్దనే పెన్షన్లు అందించాలని స్పష్టం చేసింది. పోయినసారి జరిగిన సంఘటనలు పునరావృతం కారాదని కూడా ఆదేశాలు ఇచ్చింది. 

సచివాలయాల ద్వారా 1.26 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. 15 వేల మంది పంచాయతీ కార్యదర్శులు, 5 వేల మంది వెలుగు సిబ్బంది, 5 వేల మంది వ్యవసాయ శాఖ సిబ్బంది, 3 వేల మంది హార్టికల్చర్ సిబ్బంది ఉన్నారు. వీరందరూ గ్రామస్థాయిలో ఉన్నారు. వేలిముద్రలు, కనుపాపల నిర్ధారణ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. 

కానీ ప్రభుత్వం మొండికేస్తోంది. ఎన్నికల సంఘం చెప్పినా ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఆయా సిబ్బంది గ్రామ స్థాయిలోనే పనిచేస్తున్నా వారికి లబ్దిదారుల ఇళ్లు తెలియవట... ఊర్లో ఎవరుంటున్నారో కూడా తెలియకుండా వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారా? 

ఇప్పుడు మళ్లీ కొత్త కుట్రకు తెరలేపారు... పింఛన్లు బ్యాంకులో వేస్తారట! కిందటిసారి ప్రభుత్వం ఏం చెప్పింది... మా వద్ద లబ్దిదారుల బ్యాంకు ఖాతాల వివరాలు లేవని చెప్పింది. పోయిన నెలలో లేని బ్యాంకు ఖాతాలు ఇప్పుడెలా వచ్చాయి? మీరెలాంటి కుట్రలు  చేసినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. 

ప్రభుత్వం ఏంచెబుతోంది అంటే... ఆధార్ లింక్ అయినవాళ్లందరికీ బ్యాంకులో వేస్తామని, మిగిలిన వాళ్లందరికీ ఇంటికి వెళ్లి ఇస్తామని చెబుతోంది. రాష్ట్రంలో మొత్తం 65,49,000 మంది పింఛన్ లబ్దిదారులు ఉన్నారు. వీరిలో 48,92,000 మందికి అకౌంట్ వివరాలు లింక్ అయి ఉన్నాయట. అంటే దాదాపు 75 శాతం మందికి బ్యాంకు ఖాతాల్లో పింఛను జమచేస్తారట. మిగిలిన వారిలో ఎవరైతే అకౌంట్ వివరాలు లింకు లేని వాళ్లు, దివ్యాంగులు, నడవలేనివాళ్లు 16,57,000 మంది ఉన్నారంటున్నారు. 

ఎవరు నడవలేరు అనేది చెప్పేందుకు మీరేమైనా నిర్ధారణ చేశారా? చిరునామాలు ఉన్నాయా? రాత్రికి రాత్రే వెరిఫై చేశారా? మీ వద్ద ఎవరు వికలాంగులు, ఎవరు నడవలేరు అనే డేటా ఉంటే వాళ్ల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు ఇవ్వొచ్చు కదా? 

దీన్నిబట్టి అర్థమవుతోంది ఏంటంటే... వీళ్లు బోగస్ సమాచారంతో కాలయాపన చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇది సరైన పంథా కాదు. ప్రజలను మోసం చేయొద్దు. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతతో పనిచేయాలి" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: ఈ ముఖ్యమంత్రి ఒక రంగుల పిచ్చోడు: డోన్ లో చంద్రబాబు వ్యాఖ్యలు

29-04-2024 Mon 17:25 | Andhra

నంద్యాల జిల్లా డోన్ లో ప్రజాగళం సభ

రాష్ట్రంలో దొంగలు పడ్డారన్న చంద్రబాబు

ఆ దొంగలను పట్టే రోజు మే 13 అని వెల్లడి

మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టారని విమర్శలు

రుణభారాన్ని ప్రజల నెత్తిపై మోపిన దుర్మార్గుడు బుగ్గన అంటూ వ్యాఖ్యలు

cr-20240429tn662f8aa272a56.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల జిల్లా డోన్ లో ప్రజాగళం సభకు హాజరయ్యారు. డోన్ టీడీపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని, నంద్యాల లోక్ సభ స్థానం అభ్యర్థి బైరెడ్డి శబరిని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని, ఈ దొంగలను పట్టే రోజు మే 13 అని వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ధ్వజమెత్తారు. మద్యంపై వచ్చే ఆదాయం రూ.25 వేల కోట్లు తాకట్టు పెట్టారని, ఆ భారాన్ని ప్రజల నెత్తిపై మోపిన దుర్మార్గుడు ఈ బుగ్గన అని మండిపడ్డారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు హరికథలు చెబుతున్నారని విమర్శించారు. వీళ్లు రాయలసీమకు ఏమైనా చేశారా, ఒక్క ప్రాజెక్టు కట్టారా? ఒక రోడ్డు వేశారా, ఒక పరిశ్రమ తెచ్చారా? వీళ్లకు ఎందుకు ఓట్లేయాలి? అని ప్రశ్నించారు. 

"ఈ సైకో జగన్ మోహన్ రెడ్డి రంగుల పిచ్చోడు. రంగులు వేసుకోవడానికి రూ.3 వేల కోట్లు ఖర్చు చేశాడు. ప్రజలు ఈ సైకోకు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపించాలి. ఇతడు బడికి, గుడికి, ఆఖరికి చెట్లకు రంగులు వేశాడు. ఎప్పుడైనా ఇలాంటి వాడ్ని చూశారా? సలహాదారుల కింద 100 మందిని పెట్టుకుని వాళ్లకు రూ.700 కోట్లు అప్పజెప్పాడు. ఇంకోపక్క, సాక్షి పత్రికకు వాణిజ్య ప్రకటనల కింద రూ.1000 కోట్లు ఇచ్చాడు. 

ఇప్పుడు అడుగుతున్నా... రాయలసీమ సాగునీటికి ఖర్చు పెట్టారా? తాగు నీటికి ఖర్చు పెట్టారా? ప్రజలకు గుక్కెడు నీళ్లు ఇవ్వని వీళ్ల అవసరం మనకుందా? ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే, ఆరోగ్యశ్రీకి రూ.1500 కోట్లు బకాయిలు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టింది. 

ఐదేళ్లుగా రైతాంగాన్ని కుదేలు చేశారు. రైతులను తొక్కేశారు. నేను ఇక్కడ 90 శాతం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను... ఈ ప్రభుత్వం ఇస్తోందా? రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చి రైతు గౌరవంగా తిరిగే పరిస్థితి కల్పించిన పార్టీ టీడీపీ. కానీ ఈ ప్రభుత్వ పాలనలో పండ్ల తోటలు, కూరగాయల సాగు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతను ఆదుకుంటాం. ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థికసాయం అందిస్తాం" అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇక్కడే ఎమ్మార్పీఎస్ వాళ్లు కూడా ఉన్నారు... మాదిగ కాలనీలకు వెళ్లండి... ఇంటింటికీ చెప్పండి... ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ... మళ్లీ ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేయబోయేది ఎన్డీయే... మంద కృష్ణ మాదిగ కూడా రేపట్నించి వచ్చి ప్రచారం చేస్తాడు అని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

AP Elections 2024: డ్రైవింగ్‌రాని వ్యక్తి పాలనలో ఏపీ రివర్స్‌ గేర్‌లో వెళ్లింది: చంద్రబాబు

ఏపీని సీఎం జగన్ (CM Jagan) మాఫియాల రాజ్యాంగా తయారుచేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మైనింగ్‌, లిక్కర్‌, ల్యాండ్‌, శాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్‌ స్వభావమని ఆరోపించారు. చీరాలలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.

babu5_712d2ac695_V_jpg--799x414-4g.webp

Nara Chandrababu Naidu

చీరాల: ఏపీని సీఎం జగన్ (CM Jagan) మాఫియాల రాజ్యాంగా తయారుచేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మైనింగ్‌, లిక్కర్‌, ల్యాండ్‌, శాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్‌ స్వభావమని ఆరోపించారు. చీరాలలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ప్రజావేదికను కూల్చి పాలన ప్రారంభించారని ధ్వజమెత్తారు.

Janasena: గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు కొంత రిలీఫ్..

పోలీసు వ్యవస్థ ద్వారా ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. జగన్‌ ఏపీలో ల్యాండ్ గ్రాబింగ్‌ యాక్టు తీసుకువచ్చారని అన్నారు. ఈ సైకో(జగన్)ను ఇంటికి సాగనంపాలని అందరిలో కసి ఉందన్నారు.ప్రజల భూములపై జగన్‌ పెత్తనం ఏంటి? అని ప్రశ్నించారు. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం రద్దు ఫైల్‌పై రెండో సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ దుర్మార్గ పాలనను తుదముట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని మాటిచ్చారు. డ్రైవింగ్‌రాని వ్యక్తి పాలనలో ఏపీ రివర్స్‌ గేర్‌లో వెళ్లిందని విమర్శించారు. టీచర్లను మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టారని ధ్వజమెత్తారు.

ఏపీని రూ.13 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఫైర్ అయ్యారు. ఏపీకి కేంద్రం నుంచి అప్పులు వచ్చే పరిస్థితి లేదని.. ఆదాయం తగ్గిందని.. జీతాలు ఇవ్వలేరని అన్నారు. ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే పరిపాలన చేయాలన్నారు. ఇష్టానుసారం జేబ్రాండ్లు పెట్టి ఏపీని అతలాకుతలం చేశారని ఏకిపారేశారు. ఏపీలో 30వేల మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు పని దొరక్క ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ఏపీని జగన్ నియంతలా పాలించాలనుకున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu on Amaravati and schemes: అమరావతి లేకపోతే ఏంటి నష్టం అనుకుంటున్నారా?: చంద్రబాబు

01-05-2024 Wed 17:51 | Andhra

బాపట్ల జిల్లా చీరాలలో ప్రజాగళం సభ

అమరావతి విశిష్టతను వివరించిన చంద్రబాబు

రాజధాని పేరు చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆవేదన

జగన్ చేసిన వాటిలో మంచి పనులు ఉంటే కొనసాగిస్తామని స్పష్టీకరణ

cr-20240501tn663233ba62680.jpg

బాపట్ల జిల్లా చీరాలలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని అవసరాన్ని నొక్కి చెప్పారు. 

"అమరావతి లేకపోతే నష్టం ఏంటి అనుకుంటున్నారా? అమరావతి పూర్తయి ఉంటే ఒకటిన్నర గంటలో అమరావతి వెళ్లి పనిచూసుకుని సాయంత్రానికి తిరిగొచ్చే వీలుండేది. మన పిల్లల చదువు కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం అమరావతి ఒక కేంద్రంగా ఉండేది. సంపద సృష్టించడానికి ఒక కేంద్రంగా ఉండేది. సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన ఆదాయాన్ని పెంచే ఒక కేంద్రంగా ఉండేది. 

చీరాల, బాపట్లలో పని దొరక్కపోతే హైదరాబాద్ కో, చెన్నైకో, బెంగళూరుకో వెళ్లే ఖర్మ పట్టింది. ఇప్పటికే అదే పరిస్థితి కొనసాగుతోంది. ఎవరన్నా మీ రాజధాని ఏదంటే, రాజధాని పేరు చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో తెలుగుజాతి ఉంది. 

పట్టిసీమ ప్రాజెక్టు నేను ప్రారంభించానని, నేను నిర్మించానని, ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఉపయోగించుకోని దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి కొన్ని పనులు చేశాడు... వాటిలో కొన్ని చెడ్డపనులు ఉన్నాయి... వాటిని సరిదిద్దుతాం. అతడు చేసిన వాటిలో కొన్ని మంచి పనులు ఉంటే నేను అవి కూడా కొనసాగిస్తానే తప్ప, ఒక సైకో చేశాడని అతడి లాగా నేను విధ్వంసం చేయను. 

అందరూ మే 13వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజలంతా కూటమి అభ్యర్థుల గుర్తులపై ఓటు వేసి గెలిపించాలి. బాపట్ల ఎంపీ అభ్యర్థి టీడీపీ నాయకుడే... ఈ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలే పోటీ చేస్తున్నారు. పోయినసారి కూడా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారు... ఈసారి నాకు అనుమానమే లేదు... ఏడుకు ఏడు మనం గెలుస్తున్నాం... స్వేచ్ఛగా, ఆలోచించి, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి. 

నిన్న మేనిఫెస్టో విడుదల చేశాం. దేశంలోనే తొలిసారిగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారి పిల్లలకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించాం. మేం అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్ ఇస్తాం. పెంచిన పెన్షన్ ను ఏప్రిల్ నుంచే వర్తించేలా ఇస్తాం. అతడు (జగన్) కూడా పెన్షన్ పెంచుతానంటున్నాడు. 2028కి రూ.250 పెంచుతాడట, 2029కి మరో రూ.250 పెంచుతాడట. 

నేను అలా చెప్పడంలేదు... ఏప్రిల్ నుంచే పెంచుతాం... దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తాం. పూర్తిగా కాళ్లు, చేతులు లేని వారికి నెలకు రూ.15 వేలు ఇస్తాం. కొందరు కిడ్నీ, తలసేమియా బాధితులకు రూ.10 వేలు ఇస్తాం. మళ్లీ చంద్రన్న బీమా తీసుకువస్తాం... సహజంగా చనిపోతే రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు ఇచ్చే బాధ్యత మాది. 

ప్రతి ఒక్క కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తాం. డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తాం, మండల కేంద్రాల్లో జనరిక్ ఔషధాల దుకాణాలు తెరుస్తాం. బీపీ, షుగర్ బాధితులకు ఉచితంగా మందులు సరఫరా చేస్తాం" అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

does cbn have alzheimer's? this is not the first time he sounded like he is working for ycp. election win ayite, 5 years kastame.

cbn asking people to vote for ycp candidate

:emoji-nervous::emoji-lol:

 

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: నెల్లూరులో కూటమి రోడ్ షో... హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్

03-05-2024 Fri 20:24 | Andhra

ఏపీలో మే 13న ఎన్నికలు

ప్రచార వేగం పెంచిన కూటమి పార్టీలు

నేడు ఉమ్మడిగా నెల్లూరులో రోడ్ షో, సభ

cr-20240503tn6634fab1c4c49.jpg

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో, కూటమి నేతలు ప్రచారంలో ఊపు పెంచారు. వరుసబెట్టి సభలు నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ నెల్లూరు సిటీలో నిర్వహించిన భారీ రోడ్ షోకు హాజరయ్యారు. 

రోడ్ షోలో కూటమి పెద్దలు చంద్రబాబు, పవన్ పాల్గొనడంతో టీడీపీ, జనసేన శ్రేణులు పోటెత్తాయి. నెల్లూరు నగరం జనసంద్రాన్ని తలపించింది. బాణసంచా మోతలు, పార్టీల గీతాలతో నెల్లూరు రోడ్లు హోరెత్తాయి. పవన్ వీలైనంతవరకు అభిమానులతో చేయి కలుపుతూ ముందుకు సాగగా, చంద్రబాబు అభివాదం చేస్తూ కూటమి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu on 4000 pension: మేం వస్తూనే రూ.4 వేలు పెన్షన్ ఇస్తాం... జగన్ 2028 నాటికి రూ.250 పెంచుతాడంట!: చంద్రబాబు

03-05-2024 Fri 18:18 | Andhra

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభ

టీడీపీ ఎప్పుడూ పేదల పక్షమేనన్న చంద్రబాబు

తాము అధికారంలోకి రాగానే ఇంటివద్దనే పెన్షన్ ఇస్తామని హామీ

పెన్షన్ల కోసం వృద్ధులను బ్యాంకులకు తిప్పుతున్నారని ఆగ్రహం 

ప్రభుత్వానికి, సీఎస్ కు వృద్ధుల ఉసురు తగులుతుందని వ్యాఖ్యలు

cr-20240503tn6634dd18b2b19.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రజాగళం సభలో మేనిఫెస్టో హామీలను ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తూనే ఏప్రిల్ నెల నుంచి వర్తించేలా రూ.4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. కానీ జగన్ 2028 నాటికి రూ.250 పెంచుతాడంట అని వెల్లడించారు. ఇప్పుడు చెప్పండి... పేదల పెన్నిధి ఎవరు? అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదల పక్షమేనని అన్నారు. 

ఏపీలో సచివాలయాలు, పంచాయతీల్లో 1.50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, వారు ఒక్కొక్కరు 40 మందికి ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి వృద్ధులను చంపేసే పరిస్థితికి వచ్చాడని చంద్రబాబు మండిపడ్డారు. ఇంటి దగ్గర ఇవ్వకుండా, వృద్ధులను సచివాలయాలకు తిప్పి, అక్కడా ఇవ్వకుండా పండుటాకుల వంటి ముసలి వాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దుర్మార్గం ఇది, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. 

ఈ నెల పెన్షన్లపైనా తాము పోరాడామని, సిబ్బంది ద్వారా ఇప్పించాలని చెప్పామని, కానీ ఈ దుర్మార్గుడు ఇంటివద్ద ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో వేశాడు... బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా చేయడం ముసలివాళ్లకు తెలుసా? అని ఆగ్రహం వెలిబుచ్చారు. 

"ఐఏఎస్ చదువుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అడుగుతున్నా... ముసలివాళ్లు ఐదు కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు వెళ్లగలరా? బ్యాంకుకు వెళితే ఆధార్ కార్డు కావాలి, పాన్ నెంబరు కావాలి... పాపం ఆ ముసలివాళ్లు ఎక్కడికి వెళ్లాలో దిక్కుతెలియకుండా అవస్థ పడుతున్నారు. ఇప్పుడు చెబుతున్నా... మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా నేనుంటా. రూ.4 వేల పెన్షన్ ఇస్తా... 1వ తేదీనే మీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది. ప్రభుత్వాన్ని, సీఎస్ ను హెచ్చరిస్తున్నా... ప్రజలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. వృద్ధులు పడే క్షోభ నేను చూశాను... వారి ఉసురు మీకు తగులుతుంది" అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...