Jump to content

Ilaiyaraaja: వారి కంటే ఇళయరాజా గొప్పవారేం కాదు.. తేల్చి చెప్పిన మద్రాస్ హైకోర్టు


TELUGU

Recommended Posts

తన పాటలపై కాపీ హక్కులు కోరుతూ రికార్డింగ్ సంస్థలపై కోర్టుకెక్కిన ఇళయరాజా

ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పిన హైకోర్టు

కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఇళయరాజా మరో పిటిషన్

ఇళయరాజా గొప్పవారన్న ఆయన తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించని న్యాయస్థానం

cr-20240420tn66234f5fa8cd6.jpg

మ్యూజిక్ మాంత్రికుడు ఇళయరాజా అందరికంటే గొప్పవారనడానికి తాము అంగీకరించబోమని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా పేరుకెక్కిన ముత్తుస్వామి దీక్షితార్, త్యాగరాజన్, శ్యామశాస్త్రి అందరికంటే గొప్పవారని.. వారికంటే ఇళయరాజా గొప్పవారనడాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది.

ఇంతకీ కేసేంటంటే.. తన పాటలను వాడుకునే ఒప్పందం గడువు పూర్తయిందని పేర్కొంటూ ఎకో రికార్డింగ్ తదితర సంస్థలపై కాపీ హక్కులు కోరుతూ ఇళయరాజా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ సంస్థలు రిట్‌ పిటిషన్ దాఖలుచేశాయి.

కేసును విచారించిన న్యాయస్థానం ఇళయరాజా పాటలను వాడుకొనే హక్కు ఆయా సంస్థలకు ఉందని పేర్కొంది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఇళయరాజా మరో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా ఇళయరాజా తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఇళయరాజా అందరికంటే గొప్పవారని పేర్కొన్నారు. దీనికి స్పందించిన న్యాయస్థానం ఈ వాదనను అంగీకరించబోమని, ఆయన అందరికంటే గొప్పవారు కాదని స్పష్టం చేస్తూ కేసును ఈ నెల 24కు వాయిదా వేసింది.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...